Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రకాష్ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…

April 17, 2026 by M S R

.

తల్లి అంత్యక్రియల్ని క్రిస్టియన్ మతవిశ్వాసాల ప్రకారం నిర్వహించిన ప్రకాష్ రాజ్ ఎప్పుడూ హిందూ దేవుళ్లను, మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న తీరు అందరూ చూస్తున్నదే కదా… తాజాగా మళ్లీ… రామాయణంపై, రామలక్ష్మణులపై చిల్లర వ్యాఖ్యానాలకు దిగాడు… దీనిపై కేసు నమోదైంది… వార్తలోకి వెళ్దాం…

ఈ వివాదం కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (KLF) వేదిక నుంచి స్టార్టయింది…  అక్కడ మాట్లాడుతూ ‘‘ రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుండి దక్షిణానికి వలస వచ్చారు… వారు దక్షిణాదికి వచ్చినప్పుడు ఒక తోటను చూశారు… అది ఎవరిదో తెలియకపోయినా ఆకలితో ఉన్న లక్ష్మణుడు పండ్లు తినవచ్చా అని రాముడిని అడుగుతాడు… రాముడు “తిను, ఆకలితో ఉన్నప్పుడు తింటే అది దొంగతనం కాదు” అని చెప్పాడు…

Ads

  • ఆ తోట రావణుడిది… పండ్లు తింటున్నప్పుడు రావణుడు, శూర్పణఖ అక్కడికి వచ్చారు… రాముడు వారిని చూసి ‘ఆదివాసీలు’ అనుకున్నాడు… కానీ రావణుడు తానే ఆ తోట ‘యజమానిని’ అని చెప్పాడు… తిన్న పండ్లకు రాముడు డబ్బులు ఇస్తాననగా, శూర్పణఖ లెక్కగట్టి “2000 డాలర్లు + GST” అడిగింది… రాముడి దగ్గర డబ్బులు లేకపోవడంతో రావణుడు డిస్కౌంట్ ఇచ్చినా కుదరలేదు…

 

చివరకు రావణుడు “డబ్బులు లేకపోతే ఇక్కడే ఉండి, ఆ పండ్ల గింజలు నాటి, చెట్లు పెంచి వెళ్ళండి” అని అన్నాడు…’’ ఈ కథను చెబుతూనే తను ప్రస్తుత రాజకీయాలపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు, ఎప్పటిలాగే బీజేపీని ఉద్దేశించి…

  • ఉత్తర భారతం నుండి దక్షిణాదికి వచ్చే వారు ఇక్కడి వారిపై హిందీని బలవంతంగా రుద్దకూడదు… మీరు ఏదో బ్యాంకు మేనేజర్ అయి ఇక్కడికి వచ్చి, మమ్మల్ని బీఫ్ తినవద్దు అని చెప్పకండి.. అవసరమైతే మేం బీఫ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తాం… ఉత్తరాది వారు ఇక్కడికి వచ్చి, పని చేసుకుని వెళ్ళాలి కానీ, ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ వంటి అంశాల గురించి మాట్లాడకూడదు…

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రసారం కావడంతో ఢిల్లీలో ఓ లాయర్ అమిత సచదేవ ఫిర్యాదు చేసింది పోలీసులకు… ‘‘నా దేవుళ్లను, నేను పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరచడం అంటే నా మతవిశ్వాసాలు, మనోభావాలను అవమానించినట్టే… మా దేవుళ్లను “వలస కూలీలు”గా, “పండ్ల దొంగలు”గా చిత్రీకరించడం.. అలాగే డాలర్లు, GST వంటి పదాలతో హేళన చేయడం హిందూ ధర్మ అవమానమే…’’ అని ఫిర్యాదు చేసింది…

భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం ఈ కేసులు నమోదయ్యాయి…

    • సెక్షన్ 299: మతపరమైన విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం.

    • సెక్షన్ 302: మతపరమైన భావాలను కించపరిచే ఉద్దేశంతో మాట్లాడటం.

    • సెక్షన్ 196: వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం.

    • IT యాక్ట్: సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయినందుకు ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చారు.

తనపై వస్తున్న విమర్శలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ… తాను కేవలం ఒక కథగా, తనదైన శైలిలో విశ్లేషించానని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని సమర్థించుకున్నాడు… ఇప్పుడు ప్రకాష్ రాజ్ పైత్యంపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న డిమాండ్ ఏమిటంటే..?

‘‘మహేశ్ బాబు నటించే భారీ పాన్ వరల్డ్ సినిమా వారణాసిలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు… దాని నుంచి తీసేయడమే కాదు ప్రకాష్ రాజ్ సినిమాల్ని బహిష్కరించాలి, అప్పుడే బుద్ది వస్తుంది’’…. చరిత్రకు వక్రబాష్యాలు చెప్పే రాజమౌళి వింటాడా..? ప్రకాష్ రాజ్‌ పాత్రను మరింతగా పదును చెక్కుతాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రకాష్ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…
  • నో బొట్టు, నో మణికట్టు పట్టీలు, నో సిందూరం… లెన్స్‌కార్ట్ వివాదం ఏమిటంటే..?
  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions