Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన పేరే ప్రేమ్..! పేరుకు తగ్గట్టే ఆకాశమంత మానవప్రేమ… హేట్సాఫ్…!

June 21, 2021 by M S R

covid

డ్రగ్ మాఫియాలు, వేక్సిన్ మాఫియాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు… వాటికి డప్పు కొట్టే పాలసీలు, బ్యూరోక్రాట్లు… ఆర్టీపీసీఆర్ పరీక్ష దగ్గర్నుంచి చితిపై పేర్చేదాకా… మనుషుల ప్రాణాలతో సాగుతున్న దందా మొత్తం మానవత్వం మీదే విశ్వాసాన్ని చంపేస్తున్న వేళ… ఈ దుర్మార్గపు, దుర్గంధపు వాతావరణంలోనూ… కొందరు నిశ్శబ్దంగా కారుణ్యానికీ, ఔదార్యానికీ కొత్త ఎత్తులు చూపిస్తున్నారు… ఈ కరోనా విపత్తులో తమ హృదయాలు సంపూర్ణంగా తెరిచి ఆకాశమంత ప్రేమను పంచుతున్నారు… వినమ్రంగా ప్రణమిల్లడం తప్ప మనం ఇంకేం చేయగలం..? అది ఒక […]

కంగ్రాట్స్ బిడ్డా..! ఇంతేనా నాన్నా..! ట్విట్టర్‌లో ‘లేడీ పులిట్జర్’పై ఓ లవ్లీ డిబేట్..!!

June 13, 2021 by M S R

asian parents

తమ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న విజయాల్ని సైతం తల్లులు ఆనందంగా ఓన్ చేసుకుంటారు… అందరితో వెంటనే షేర్ చేసుకుంటారు… సంబరపడతారు… ఇండియన్ అమ్మలయితే వీలయితే వెంటనే దిష్టి కూడా తీస్తారు… ఆనందం వెంట అరిష్టం రావొద్దని..! అమ్మలు అంతే…! కానీ నాన్నలు..? అంత త్వరగా బయటపడరు… కడుపులో ఆనందం ఉండదని కాదు… తల్లులకన్నా ఎక్కువే ఉంటుంది, కానీ బహిరంగంగా ఉద్వేగపడరు, వ్యక్తీకరించరు… ఇండియన్ ఫాదర్స్, లేదా ఆసియన్ ఫాదర్స్ అందరూ అంతే… వాళ్లు అమెరికాలో కాదు, […]

ఎడ్డిమాలోకం కాదు… అద్భుతమైన రాక్‌గార్డెన్ నిర్మాత… పద్మశ్రీ చాంద్ సైనీ…

June 13, 2021 by M S R

rock garden

బాహ్యప్రపంచం కంటపడకుండా నిజాన్ని దాస్తూ తాననుకున్న రాక్ గార్డెన్ ను నిర్మించాలనుకున్న పిచ్చిమాలోకం నెక్ చాంద్ సైనీ. కానీ దాస్తే దాగేదా నిజం..? అంతేగా… ? ప్రభుత్వం ఒక దశలో ఏకంగా ఆ గార్డెన్ నే ధ్వంసం చేయాలని నిర్ణయించింది. కానీ సైనీ ఎంత ఎర్రిమాలోకమైనా… చూపరులను కట్టిపడేసేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఉద్యానవన ఇంజనీరింగ్ నిర్మాణశైలి… మెజార్టీ ప్రజాభిప్రాయం మేరకు ఇవాళ దేశంలోనే అద్భుతమైన రాక్ గార్డెన్ గా అవతరించింది. ఏకంగా ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నందించేంత గొప్పమాలోకంగా […]

బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! ఈతరం చదవాల్సిన మనిషి…!!

June 10, 2021 by M S R

balagopal

………. By…. Taadi Prakash……….  బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! MOHAN’S TRIBUTE TO BALAGOPAL ——————————————————- ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ నేను ‘సాక్షి’ ఆఫీస్ కి వచ్చాము. రావడం రావడమే మోహన్ ఒక […]

డెస్టినీ..! ఆ మరణశిక్ష రద్దు, ప్రాణం నిలిచింది..! నమ్మలేని ఓ ఔదార్యం కథ…!!

June 10, 2021 by M S R

lulu

ధనికుడు అనగానే… వ్యాపారి అనగానే… మరీ ప్రత్యేకించి ఏదైనా మెగా కంపెనీ ఓనర్ అనగానే… ఓ ఫీలింగ్… ఎంతమందిని ముంచి, దోచి సంపాదించాడో అని… సమాజంలో జనరల్‌గా ఉండే ఫీలింగ్… వాళ్లు చేసే మంచి పనులేమైనా ఉంటే మనం ఓపట్టాన గుర్తించడానికి ఇష్టపడం… పైగా వాడి ఔదార్యం వెనుక ఇంకేదో కథ ఉండే ఉంటుందని బలంగా నమ్ముతుంటాం… ఎంత మల్టీ మెగా బిలియనీర్ అయినా సరే స్వార్థ కారణం లేకుండా ఎవరికీ ఏమీ సాయం చేయడు కదా […]

ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…

June 8, 2021 by M S R

leelanaidu1

క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా అనిపించుకునే […]

భేష్ ముఖేష్..! తొలిసారి రిలయెన్స్‌ మానవీయ ముఖం… అభినందనీయం..!

June 4, 2021 by M S R

ril

ఈ కరోనా మహావిపత్తు వేళ అనేక చిన్న కంపెనీలు కుదేలైపోయాయి… లక్షలాది కొలువులు ఊడిపోయినయ్… పెద్ద కంపెనీలు సైతం కొలువుల్లో, జీతాల్లో కోతలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నయ్… ఇక రోజువారీ కూలీలకు, చిన్న చిన్న వృత్తుల వారికి ఇదొక మహా సంక్షోభం… ఈ స్థితిలో ఎవరు కొంత ఔదార్యాన్ని కనబర్చినా ప్రశంసించకతప్పదు… పలు కంపెనీలు కరోనా సాయానికి సిద్దపడుతున్నయ్… ఆక్సిజన్ పడకల హాస్పిటల్స్ ఏర్పాటు దగ్గర్నుంచి అనేక రకాలుగా ‘సామాజిక బాధ్యత’ను మీద వేసుకుంటున్నయ్… అయితే అంతా […]

ప్రైవేటు కంపెనీలూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సొసైటీకి ‘‘తిరిగి ఇచ్చేది’’….

June 2, 2021 by M S R

oxygen

మెచ్చుకోదగిన ఔదార్యం ఇది… చాలామంది చాలారకాలుగా కరోనా పోరాటంలో సాయం చేస్తున్నారు కదా అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి అవసరమున్నప్పుడు తను నష్టపోతున్నా సరే, తిరిగి ఇవ్వాలి… ఈ నీతిని పాటించే కార్పొరేటు కంపెనీలు కొన్ని మాత్రమే… ఆ కొన్నింట్లో ఆర్జాస్ స్టీల్… దీనికి ప్రమోటర్లు ఏడీవీ పార్టనర్స్… తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్ ఉంది… (గతంలో Gerdau Steel) ఈ కరోనా కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయగలం..? ఏం […]

  • « Previous Page
  • 1
  • …
  • 10
  • 11
  • 12

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions