ఎండ… చెమట… ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి… అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు… పలకరించాడు… వంగి, కాళ్లు మొక్కాడు… మాస్టారూ, బాగున్నారా..? ‘సర్, నన్ను గుర్తుపట్టలేదా..?‘ ‘ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడం లేదు… గుర్తుపట్టలేకపోతున్నాను’ ‘సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ను…’ ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తు రావడంలేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..? అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?’ ‘నేను టీచర్ను అయ్యాను మాస్టారూ…’ ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే […]
అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
. Akula Amaraiah హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి! Apoorva Charan’s journey inspires us to dream beyond geographies.. లాస్ ఏంజిల్స్… 2025 జూన్ 5.. AT&T and Tribeca Festival.. ఒకటా, రెండా.. 320 టీమ్స్.. ఫైనల్ లో 5 మిగిలాయి. మిలియన్ డాలర్ల అవార్డు, 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్.. నరాల తెగే ఉత్కంఠ. వందలాది మంది సీట్లకు అతుక్కుపోయారు. జ్యూరీలోని […]
నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
. కరోనా దేశాన్ని అతలాకుతలం చేసిన తొలి వేవ్లో… లక్షల మంది నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు తరలిపోయారు… చావో బతుకో ఇక అక్కడే అనుకున్నారు… ఏదో ఓ పని చేసుకుని బతకొచ్చులే అన్నారు… బస్సులు, రైళ్లు లేకపోతే కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఊళ్లకు వెళ్లిపోయారు… తరువాత ఏమైంది..? పల్లెలు మళ్లీ జనంతో కళకళలాడాయా..? లేదు… పల్లెల్లో పనుల్లేవు, ప్రభుత్వానికి పట్టింపులేదు, ఉపాధి పథకాల్లేవు… దాంతో కాస్త కరోనా భయం తొలగేకొద్దీ మళ్లీ నగరాలు, పట్టణాల బాటపట్టారు… […]
మన నిర్మల్ అబ్బాయే… అక్షరాలా చెట్లకు డబ్బులు కాయిస్తున్నాడు…
. చిన్నప్పుడు అదేపనిగా ఏవైనా కొనివ్వమని తల్లిదండ్రుల్ని పిల్లలు మారాం చేస్తుంటే… ఒకింత ఆవేశంగా… పైసలేం చెట్లగ్గాస్తున్నాయనుకుంటున్నావా… అనే మాట వినిపించేది పెద్దల నుంచి. ఆ మాటలే మన తెలంగాణైట్ రాహూల్ కొప్పులను ఇన్స్పైర్ చేశాయి. అందుకే ఇప్పుడేకంగా ఆ మాటనే నిజం చేసేశాడు రాహూల్. అవునూ పెద్దల తిట్లకు భిన్నంగా… రాహూల్ తల్చినట్టుగానే ఇప్పుడు డబ్బు చెట్లకు కాస్తోంది. హాశ్చర్యపోతున్నారా…? అయితే వినండీ కథ! ఒకనాటి ఆదిలాబాద్ జిల్లా… ఇప్పుడు జిల్లా కేంద్రమైన నిర్మల్ రాహూల్ […]
నిజమైన ప్రజావైద్యుడు … నీలాంటోళ్లే కదా నిజమైన దేవుళ్లు స్వామీ…
. మన దేశంలో అత్యంత పెద్ద వ్యాపారం తెలుసు కదా… వైద్యం..! ఈరోజు వైద్యంలో ప్రతి అడుగూ వ్యాపారమే… ఎప్పుడైతే ప్రభుత్వ రంగంలో వైద్యం పడకేసిందో, కార్పొరేట్ ప్రపంచం ఓ మాఫియాలా పడగెత్తింది… అందరికీ తెలిసిందే కదా, ఇంకా దాని గురించి పదే పదే రాయలేం… కన్సల్టేషన్ దశ నుంచి డిశ్చార్జి వరకు… వ్యాధి నిర్ధారణ నుంచి వేక్సిన్ల వరకు… అంబులెన్సుల నుంచి మెడిసిన్స్ కౌంటర్ వరకు… డబ్బు డబ్బు డబ్బు… ఈ నేపథ్యంలో ఒక డాక్టర్ […]
వాడెవడో అవమానించాడు… కానీ తనలో ఓ గెలుపు కసిని రగుల్కొలిపాడు…
. ( రమణ కొంటికర్ల )… తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తోంది షాలినీ. ఆ సమయంలో ఎవడో ఓ వ్యక్తి తన కాస్త అసహ్యంగా బిహేవ్ చేశాడు. తను, తన తల్లి శుభలతా అగ్నిహోత్రి ఓ సీటులో కూర్చుంటే.. ఓ అపరిచిత వ్యక్తి వాళ్ల తల దగ్గరే చేయి పెట్టి డిస్టర్బ్డ్ గా వ్యవహరిస్తున్నాడు. చేయి అక్కడి నుంచి తీసేయాలని.. ఆ తల్లీ, కూతుళ్లిద్దరూ పలుమార్లు చెప్పినా వినకపోగా.. ఆ నువ్వేమైనా డిప్యూటీ కలెక్టరా నీ మాట వినేందుకంటూ […]
చినాబ్ వంతెన… ఆమె కృషిని మనం ఎందుకు అభినందించాలంటే..?
. రవి వానరసి… దూరం నుంచి చూస్తే, అది హిమాలయాల అంచుల్లోంచి ఉద్భవించిన ఓ అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. వేల అడుగుల లోతైన లోయపై, సన్నని పట్టు దారంలా సాగిపోతున్న ఆ ఉక్కు నిర్మాణం, కేవలం ఒక వంతెన కాదు. అది మనిషి సంకల్పానికి, అత్యాధునిక ఇంజినీరింగ్కి, ప్రకృతి సవాళ్లను అధిగమించే ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆ అద్భుతమే చీనాబ్ రైల్ వంతెన! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ వంతెనగా చరిత్రలో నిలిచిపోయే ఈ నిర్మాణం వెనుక, […]
గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్ వీరగాథ… వీరుడా, నీకు జోహార్లు…
. Taadi Prakash……. గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్ వీరగాథ… . ఫిబ్రవరి 18, 2018… హైదరాబాద్, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ… ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ ముందూ జనం…జనం… గూగీ వాథియాంగో అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన వేదికమీద కూర్చొని ఉన్నాడు. బలంగా, దృఢంగా, వినయంగా, నల్లటి నలుపుతో […]
టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
. ( రమణ కొంటికర్ల ) ….. అక్కడ బావిని తవ్వడం అసాధ్యమన్నారంతా. కానీ, ఆ రాక్ స్టార్… ఆ రాక్ నే తొలగించి తన కమ్యూనిటీకి నీరందించాడు. ఇది గోవాలోని లోలియం నివాసైన 76 ఏళ్ల బాలకృష్ణ అయ్య కథ. మద్ది తొలోప్ అంటే కొంకణిలో రాతిప్రాంతమని అర్థం. ఆ ప్రాంతమందా నీరు లేక దుర్భిక్షంగా మారిపోయిన ఒక కరవు పరిస్థితినెదుర్కొంది. ఎందరో నిపుణులు వచ్చి అక్కడి భూభాగంలో నీరు రాదని తేల్చేశారు. ఎందుకంటే, పైనంతా రాతి […]
అంత పెద్ద స్టార్… అకస్మాత్తుగా మాయం… నిశ్శబ్దంగా స్వీయ అజ్ఞాతంలోకి…
. సినిమా స్టార్లు భజనలు వినీ వినీ… తామే దైవాంశ సంభూతులమని ఫీలయిపోయి… రాజకీయ అధికారం ఈ ప్రజాదరణతో ఇట్టే సాధించవచ్చునని రాజకీయాల్లోకి రావడం పరిపాటే కదా… మరీ సౌత్ ఇండియాలో ఫ్యానిజం ఎక్కువ, స్టార్లు మేఘాల్లో విహరించడమూ ఎక్కువే, తెలుసు కదా… అప్పట్లో తమిళనాట ఎంజీఆర్… ఆంధ్రలో ఎన్టీయార్… కన్నడంలో రాజకుమార్… సూపర్ స్టార్లు… తిరుగులేని ప్రజాదరణ… ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు… సీఎం అయ్యాడు… ఎన్టీయార్ కూడా ఆ బాటలోనే… సీఎం అయ్యాడు… హిందీ సూపర్ […]
ఎంత గొప్ప బతుకు..! మనలో ఎందరికి ఆయన చరిత్ర తెలుసు..?!
. రాజకీయ నాయకులంటేనే ప్రజలు ఏవగించుకుంటున్న ఈ రోజుల్లో… జనం ఈసడించుకునే స్థాయిలో రాజకీయ నాయకుడు పతనమైన స్థితిలో… కొందరి గురించి చెప్పుకోవాలి, ఎప్పుడైనా ఓసారి స్మరించాలి… అది జాతి కనీసధర్మం, ఇప్పటి ప్రతి నాయకుడు సిగ్గుపడాలి… అలాంటి నాయకుల్లో బిజూ పట్నాయక్ ఒకరు… ఇప్పుడన్నీ యుద్ధవార్తలే కదా… ఓసారి గుర్తుచేసుకుందాం ఈయన్ని కూడా… అవును, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి… అసలు కొడుకే ఆదర్శ నాయకుడు అంటే, తండ్రి అంతకుమించిన లెజెండ్… (వ్యక్తిత్వం, […]
బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, నమ్మలేని వైవిధ్య ప్రతిభ..!!
. కొందరు స్త్రీలు బహుముఖ ప్రజ్ఞాశాలులు… భిన్నరంగాల్లో వాళ్ల శ్రమ, అభినివేశం, ఆసక్తి, విజయాలు కొంత ఆశ్చర్యం అనిపించినా అభినందించకుండా ఉండలేం కదా… జన్మతః సంక్రమించే జ్ఞానం, గ్రాస్పింగ్ స్టామినాకు తోడు వాళ్ల శ్రమ, వాళ్ల ఆసక్తి కూడా భిన్నరంగాల్లో ప్రజ్ఞ ప్రదర్శనకు కారణాలు… కర్నాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ గురించి ఆమధ్య చెప్పుకున్నాం కదా… బహుముఖ ప్రజ్ఙ ఆమెది… సేమ్, మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ ప్రతిభ గురించీ చెప్పుకున్నాం […]
ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
. ఒక వార్త, ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది ఆమధ్య… సంక్షిప్తంగా సదరు వార్త ఏం చెబుతున్నదంటే… (మనం మన దేశీయ వైద్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పే కథ…) ‘‘ఈ ఫోటోలో పెద్దాయన్ని గమనించండి, వేదాలు చదివిన పండితుడిలా, వృద్ధ బ్రాహ్మడిలా కనిపిస్తున్నాడు కదా… ఆయన ఓ పేరుమోసిన డాక్టర్, కేన్సర్ కేసుల్ని ట్రీట్ చేసే అంకాలజిస్టు… కేరళలోనే మొట్టమొదటి అంకాలజిస్టు… కొట్టాయం మెడికల్ కాలేజీలో అంకాలజీ ప్రొఫెసర్, తరువాత ఆ […]
ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
. ప్రస్తుతం రోజూ వార్తల్లో ఉంటున్న వ్యక్తి… పేరు ఎస్.జైశంకర్… తిట్టే నోళ్లు, మెచ్చుకోలు చప్పట్లు నిర్వికారంగా స్వీకరిస్తూ తన పని తాను చేసుకుపోతుంటాడు… అవును, మన విదేశాంగ మంత్రి తను… నాన్- పొలిటికల్ మంత్రి… నిశ్చయంగా మోడీది మంచి ఎంపిక… ఆ ప్రొఫైల్ పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాలి… కాదు, అందరూ చదవాలి… మనం ఇంకా గోత్రాలు, జాతకచక్రాలు, కులాలు, శాఖల గిరులు గీసుకుని… వాటిని దాటడానికి గడగడా వణికిపోతున్నాం కదా… కొందరు విశ్వమానవులుగా […]
ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…
. క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా […]
నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
. ‘ముచ్చట’లోనే కొంతకాలం క్రితం రాసినట్టు గుర్తు… పదే పదే చదువుకోవాల్సిన స్పూర్తిమంతుడి కథ ఇది… అలాంటోళ్లు కోటికొకరు పుడతారు… నిజానికి పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చదివించాల్సిన కథలు ఇవే… కానీ మన విద్యావ్యవస్థ దరిద్రం తెలుసు కదా… చెత్త చెత్త నియంతల చరిత్రలు చదివిస్తాం… పనికిరాని చెత్తను పిల్లల మెదళ్లలో నింపుతాం… సరే, ఫేస్బుక్లో మిత్రుడు Gopireddy Jagadeeswara Reddy వాల్ మీద కనిపించింది ఈ కథ మళ్లీ… ఓసారి నెమరేసుకుందాం… చింపిరి జుట్టూ, గుబురుగా పెరిగిన గడ్డం, ఎండిపోయిన […]
ఎర్నాకులం డ్రాపవుట్ నుంచి వర్జీనియా వర్శిటీ డైరెక్టర్ దాకా…
. మనం ఎన్ని అనుకున్నా సరే… జీవితం మన చేతుల్లో ఏమీ లేదు… ఆల్రెడీ ఏదో రాసి ఉంటుంది… అటువైపు ప్రవాహంలో మనం కొట్టుకుపోవడమే… తెలివి, చదువు, ఆస్తి, సర్కిళ్లు మన్నూమశానం ఏవీ పనికిరావు ఓ టైమ్ వస్తే… కరోనా సమయంలో పెద్ద పెద్ద తోపులో ఎగిరిపోయారు… ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఆమె వయస్సు 82 ఏళ్లు… ఎక్కడో పుట్టి, ఎక్కడో ఏదో కెరీర్లో అడుగుపెట్టి, ఎటెటో తిరిగింది… అంతే, విధి ఎటు తోస్తే అటు […]
ఆ ఇండిగో వాడికి ఈ వాస్తవ కథను ఎవరైనా చెబితే బాగుండు..!!
. ఒక రాజు చాణుక్యుడిని అవమానించాడు… ప్రతిగా చాణుక్యుడు పంతంతో వాళ్లను అంతమొందించి, తను కోరుకున్నవాడిని కుర్చీ ఎక్కిస్తాడు… అవును, కొన్నిసార్లు చిన్న చిన్న అంశాలు సునామీలై నిండా ముంచేస్తాయి… సర్ రిచర్డ్ బ్రాన్సన్… 1979లో తను ప్రయాణించాల్సిన ఓ విమానాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ హఠాత్తుగా రద్దు చేసింది… బ్రాన్సన్ దాన్ని సీరియస్గా తీసుకున్నాడు… చాలా సీరియస్గా… అసలే తెలివైనవాడు… ఆరోజు తను వర్జిన్ ఐలాండ్స్కు వెళ్లాల్సి ఉంది ఫ్లయిట్లో… కానీ ఆ చివరి ఫ్లయిట్ రద్దు కారణంగా […]
వెక్కిరింతే ఆయుధం- వ్యంగ్యం దివ్యౌషధం… మరొక శ్రీశ్రీ ఇక రాడు…
. ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు satire, sarcasm… Sharp weapons of Sri Sri —————————————————————— శ్రీశ్రీ ఆయువుపట్టు హాస్యంలో, వ్యంగ్యంలో వుంది… మాంత్రికుడి ప్రాణం ఎక్కడో మర్రిచెట్టు తొర్రలోని చిలకలో వున్నట్టు! వెక్కిరింత శ్రీశ్రీ వెపన్. అవతలివాడు కవి, రచయిత, రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు వ్యతిరేకి, పండితుడు… ఇలా ఎవరైనా సరే తిట్టాలనుకుంటే వాళ్ళని అయిదారు లైన్ల చిట్టి కవితతోనే పడగొట్టేవాడు. ఆనాడూ ఈనాడూ హాస్యానికి విలువ కద్దు సాహిత్య సభాంగణాన వ్యంగానిది మొదటి […]
పాత గోడల ఆమె రీడింగ్ రూమ్… ఓ సివిల్స్ స్పూర్తి గాథకు వేదిక…
. శంకర్రావు శెంకేసి (7989876088) …….. ‘BIG DREAMS.. TAKE TIME, DEDICATION, BLOOD, SWEAT, TEARS AND YEARS’- సివిల్స్లో ఆలిండియా 11వ ర్యాంకు సాధించిన ఇట్టబోయిన సాయిశివాని తన గదిలో గోడపైన రాసుకున్న కొటేషన్ ఇది. సకల సౌకర్యాలు, వనరులు ఉంటేనే అత్యున్నతమైన లక్ష్యాన్ని ఛేదించగలమనే సాకును, అపోహల్ని సాయిశివాని తుడిచిపారేసింది. లక్ష్య ఛేదనకు కావాల్సింది పట్టుదల, శ్రమ మాత్రమేనని ఆమె నిరూపించింది. సాయిశివాని అద్భుత విజయం ముచ్చట గొలిపింది. సివిల్స్ బాటలో పయనిస్తున్న లక్షలాదిమందికి […]
- 1
- 2
- 3
- …
- 9
- Next Page »