………. By…. Taadi Prakash………. బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! MOHAN’S TRIBUTE TO BALAGOPAL ——————————————————- ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ నేను ‘సాక్షి’ ఆఫీస్ కి వచ్చాము. రావడం రావడమే మోహన్ ఒక […]
డెస్టినీ..! ఆ మరణశిక్ష రద్దు, ప్రాణం నిలిచింది..! నమ్మలేని ఓ ఔదార్యం కథ…!!
ధనికుడు అనగానే… వ్యాపారి అనగానే… మరీ ప్రత్యేకించి ఏదైనా మెగా కంపెనీ ఓనర్ అనగానే… ఓ ఫీలింగ్… ఎంతమందిని ముంచి, దోచి సంపాదించాడో అని… సమాజంలో జనరల్‌గా ఉండే ఫీలింగ్… వాళ్లు చేసే మంచి పనులేమైనా ఉంటే మనం ఓపట్టాన గుర్తించడానికి ఇష్టపడం… పైగా వాడి ఔదార్యం వెనుక ఇంకేదో కథ ఉండే ఉంటుందని బలంగా నమ్ముతుంటాం… ఎంత మల్టీ మెగా బిలియనీర్ అయినా సరే స్వార్థ కారణం లేకుండా ఎవరికీ ఏమీ సాయం చేయడు కదా […]
ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…
క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా అనిపించుకునే […]
భేష్ ముఖేష్..! తొలిసారి రిలయెన్స్ మానవీయ ముఖం… అభినందనీయం..!
ఈ కరోనా మహావిపత్తు వేళ అనేక చిన్న కంపెనీలు కుదేలైపోయాయి… లక్షలాది కొలువులు ఊడిపోయినయ్… పెద్ద కంపెనీలు సైతం కొలువుల్లో, జీతాల్లో కోతలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నయ్… ఇక రోజువారీ కూలీలకు, చిన్న చిన్న వృత్తుల వారికి ఇదొక మహా సంక్షోభం… ఈ స్థితిలో ఎవరు కొంత ఔదార్యాన్ని కనబర్చినా ప్రశంసించకతప్పదు… పలు కంపెనీలు కరోనా సాయానికి సిద్దపడుతున్నయ్… ఆక్సిజన్ పడకల హాస్పిటల్స్ ఏర్పాటు దగ్గర్నుంచి అనేక రకాలుగా ‘సామాజిక బాధ్యత’ను మీద వేసుకుంటున్నయ్… అయితే అంతా […]
ప్రైవేటు కంపెనీలూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సొసైటీకి ‘‘తిరిగి ఇచ్చేది’’….
మెచ్చుకోదగిన ఔదార్యం ఇది… చాలామంది చాలారకాలుగా కరోనా పోరాటంలో సాయం చేస్తున్నారు కదా అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి అవసరమున్నప్పుడు తను నష్టపోతున్నా సరే, తిరిగి ఇవ్వాలి… ఈ నీతిని పాటించే కార్పొరేటు కంపెనీలు కొన్ని మాత్రమే… ఆ కొన్నింట్లో ఆర్జాస్ స్టీల్… దీనికి ప్రమోటర్లు ఏడీవీ పార్టనర్స్… తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్ ఉంది… (గతంలో Gerdau Steel) ఈ కరోనా కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయగలం..? ఏం […]
భేష్ స్టాలిన్..! సీఎం తొలి అడుగుల్లో రాజకీయ పరిణతి… పగలు, ప్రతీకారాలకు స్వస్తి..?!
అవి జయలలిత పేరిట అప్పుడెప్పుడో వెలిసిన అమ్మ క్యాంటీన్లు… తక్కువ ధరలతో పేదల కడుపులు నింపే ధర్మసత్రాలు… స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని పీకేయలేదు… అవి తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీకి మైలేజీ తీసుకొచ్చేవి అని కన్నెర్ర చేయలేదు… ఈ లాక్ డౌన్ల కాలంలో అవే పది మందికి తిండి పెడతాయి, వాటిని అలాగే నడిపిస్తాను అని ప్రకటించాడు… ఓహో, స్టాలిన్‌లో మనకు తెలియని ఏదో రాజకీయ పరిణత కోణం ఉన్నట్టుంది అనుకున్నారు అందరూ… ఓచోట అమ్మ […]
ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!
ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ ఏమిటో […]
తన ఇంటినే కరోనా కేర్ సెంటర్ చేశాడు… మంచి పని హోం మంత్రి గారూ…
తమ తమ అధికార హోదాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకుకోట్లు కుమ్మేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎందరు ఈ మహావిపత్తువేళ ప్రజలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు..? ఒక్కసారి ఆలోచించండి… వేలు, లక్షల కోట్ల సంపాదన మరిగినా నిజంగా సమాజం మొత్తం కకావికలం అవుతున్న ఈ సంక్షోభకాలంలో ఒక్కరైనా ముందుకొచ్చిన మంచి ఉదాహరణ చెప్పండి… ఆఫ్టరాల్ సినిమా తారల్ని కాసేపు వదిలేద్దాం… మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు..? ఠక్కున ఒక్క పేరు కూడా గుర్తుకురావడం […]
చదవాల్సిన కథ..! ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన ఓ దళిత శరణార్థి కథ..!!
సరిగ్గా రాస్తే నాలుగైదు పెద్ద పుస్తకాలు అవుతుంది ఈ బెంగాలీ కొత్త ఎమ్మెల్యే బతుకు కథ… ఎక్కడ మొదలైంది, ఏ మలుపులు తిరిగింది, ఇప్పుడు ఎక్కడికొచ్చింది…. చదువుతుంటేనే ఓ అబ్బురం… మనం పదే పదే చెప్పుకున్నట్టు జీవితాన్ని మించిన కల్పన, డ్రామా ఇంకేముంటయ్..? ఎస్, డెస్టినీ మనిషిని ఎటు తీసుకుపోతుందో ఊహించలేం, ఊహిస్తే మనుషులం ఎలా అవుతామ్…? ఈయన పేరు మనోరంజన్ బ్యాపారి… ప్రస్తుతం టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు… అదీ బీజేపీ బలమైన స్థానం నుంచి… […]
పిల్లాడు… ఐతేనేం… పెద్ద మనస్సు… స్టాలిన్ కూడా కదిలిపోయాడు…
తమిళనాడు… మధురైలో హరీశ్ వర్మన్ అనే ఒక బాలుడు… తనకు ఓ సైకిల్ కొనుక్కోవాలని చిరకాల కోరిక… పైసా పైసా పొదుపు చేసుకుంటున్నాడు… సరిపడా సొమ్ము సమకూరాక సైకిల్ కొనుక్కుని, దానిపై బడికి వెళ్లాలని ఆశ… పొదుపు డబ్బుల్ని రెండేళ్లుగా దాచుకుంటున్నాడు… తండ్రి ఓ చిన్న ఎలక్ట్రీషియన్… నేరుగా సైకిల్ కొనిచ్చే స్థోమత లేదు… అయితేనేం..? కరోనా నేపథ్యంలో ఈ రోగ వార్తలు వినీ, ఈ చావు వార్తలు చూసి, ఆ పిల్లవాడి మనస్సు చలించిపోయింది… తను […]
మారిముత్తు..! మట్టిలో ఓ మాణిక్యం..! తనను గెలుపు వరించింది సరే గానీ..!!
మొన్నటి నుంచి ఓ పాజిటివ్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… కొన్ని తమిళ పత్రికల్లో, టీవీల్లో కూడా… తమిళనాడులోని తిరుత్తురైపూండీ అనే నియోజకవర్గం నుంచి ఓ కోటీశ్వరుడైనా అన్నాడీఎంకే అభ్యర్థి సురేష్కుమార్పై మారిముత్తు అనే నిరుపేద సీపీఐ అభ్యర్థి సాధించిన విజయం గురించిన పోస్టు అది… ఒక గుడిసె, ఆ గుడిసె ముందు మారిముత్తు ఫోటో… బాగా వైరల్ అవుతోంది… బెంగాల్లో ఓ పనిమనిషి గెలుపు మీద కూడా ఇలాగే చెప్పుకున్నాం కదా… ఈ […]
వెక్కిరింతే ఆయుధం- వ్యంగ్యం దివ్యౌషధం… మరొక శ్రీశ్రీ ఇక రాడు…
Taadi Prakash…………….. ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు satire, sarcasm… Sharp weapons of Sri Sri —————————————————————— శ్రీశ్రీ ఆయువుపట్టు హాస్యంలో, వ్యంగ్యంలో వుంది… మాంత్రికుడి ప్రాణం ఎక్కడో మర్రిచెట్టు తొర్రలోని చిలకలో వున్నట్టు! వెక్కిరింత శ్రీశ్రీ వెపన్. అవతలివాడు కవి, రచయిత, రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు వ్యతిరేకి, పండితుడు… ఇలా ఎవరైనా సరే తిట్టాలనుకుంటే వాళ్ళని అయిదారు లైన్ల చిట్టి కవితతోనే పడగొట్టేవాడు. ఆనాడూ ఈనాడూ హాస్యానికి విలువ కద్దు సాహిత్య సభాంగణాన వ్యంగానిది మొదటి […]
బస్తర్ గురు..! పెద్దయ్య..! జవాన్‌ను వాపస్ తీసుకొచ్చిన ఈ వృద్ధుడెవరో తెలుసా..?!
దట్టమైన అడవులు… గుట్టలు… వందల మంది మావోయిస్టులు, సాయుధ బలగాల మధ్య కాల్పులు… యుద్ధం… దండకారణ్యానికి ఈ సమరం కొత్తేమీ కాదు… రాజ్యానికీ, తిరుగుబాటుకూ నడుమ నిత్యసమరమే అక్కడ… మొన్న కూడా యుద్ధం జరిగింది… 23 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు… 31 మందికి గాయాలు… నలుగురైదుగురు నక్సలైట్లు కూడా మరణించారు… ఎందరికి గాయాలయ్యాయో తెలియదు… కానీ రాకేశ్వర్ సింగ్ అనే ఒక జవానును బందీగా తీసుకెళ్లారు మావోయిస్టులు… అంతటి ఉద్రిక్త సమరప్రాంతంలో దొరికిన ‘వర్గశత్రువు’ను మావోయిస్టులు […]
idli amma..! ఈ అమ్మ గుర్తుందా..? ఆనంద మహేంద్రుడు కూడా మరిచిపోలేదు…
డబ్బు, డబ్బు, డబ్బు… కొందరు వ్యాపారులు కూడా డబ్బు సంపాదిస్తారు… కానీ అదేలోకంలో బతకరు… వర్తమాన ప్రాపంచిక విషయాలకు స్పందిస్తుంటారు… తమ భిన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు… అలాంటి వాళ్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఉంటాడు… సోషల్ మీడియాలో కనిపించే ఆసక్తికరమైన అంశాలకు రియాక్ట్ అవుతాడు… సరైన రీతిలో, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాడు… ఈ విషయంలోనూ అంతే… తమిళనాడు, కోయంబత్తూరు, వడివేలంపలయంలో ఓ ఎనభై అయిదేళ్ల ముసలామె కథను 2019 సెప్టెంబరులో చూశాడు తను… అప్పట్లో ఆ ముసలామె ఇడ్లీలు […]
భేష్ ప్రణితా సుభాష్..! స్టార్డం వస్తుంది, పోతుంది… నీ సాయం గుర్తుంటుంది…
సమాజానికి మంచి చేయాలంటే మంచి హృదయం ఉండాలి, మంచి సంకల్పం ఉండాలి… సమాజం ఆదరించడం వల్ల వందల కోట్లు సంపాదించినా సరే, సమాజానికి నిజంగా అవసరమున్నప్పుడు పైసా కూడా ఖర్చు చేయని మన ఇండస్ట్రీ బడా బాబులతో పోలిస్తే… చాలామంది చిన్న చిన్న నటులే చాలా చాలా నయం అనిపిస్తుంది… అందరూ సోనూసూద్‌లే కానక్కర్లేదు, అక్షయకుమార్లు, రాఘవ లారెన్స్లే కానక్కర్లేదు… తమ స్థోమతను బట్టి స్పందించడమే అసలైన ఔదార్యం, దాతృత్వం… అందులో హీరోయిన్ ప్రణిత సుభాష్ (@pranithasubhash) […]
ఈ దేశానికి ప్రధాని కావల్సినోడు… విధి ముందుగానే మింగేసింది…
ట్రాఫిక్ సిగ్నల్ పడింది… వేగంగా ఓ కారు వచ్చి ఆగింది… దానికన్నా ముందు ఓ స్కూటరుంది… కారులో కూర్చున్న వ్యక్తి అదేపనిగా హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు… ఆ స్కూటరిస్టు సైలెంట్ గా రెడ్ సిగ్నల్ చూపించాడు… నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీసాఫీసర్ కొడుకుని అన్నాడు కారతను… అవునా, నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటరిస్టు చిన్నగా నవ్వుతూ…. ఆ స్కూటరిస్టు పేరు పారీకర్… పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారీకర్… ఇలాంటి […]
ప్రేమ బంధమంటేనే లాజిక్కుల్లో ఇమడదు కదా… ఇదీ అలాంటి కథే…
పెళ్లి అంటే..? పడక సుఖం, పిల్లలు, సంసారం, బాధ్యతలు… ఇంతేనా..? అంతకుమించి ఏమీ లేదా..? ఏ మార్మిక ఉద్వేగాలు ఒక జంటను కలిసి ఉంచుతాయి..? ఒకరికోసంఒకరు అనే భావన ఎలా పెరుగుతుంది..? అనిర్వచనీయమైన ప్రేమ లాజిక్కులకు అతీతంగా మనుషులను ఎలా ముంచెత్తుతుంది..? ఎప్పుడూ ప్రశ్నలే… ఎవరి బాష్యాలు వాళ్లవి… ఈ కథ ఇంకాస్త ముందుకెళ్లి చదువుకోవాలి… ఎందుకంటే… కొన్నిసార్లు కొన్ని కథలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతయ్… ఇదీ అలాంటిదే… సరిగ్గా పదేళ్ల క్రితం… అది జపాన్‌లోని ఒనగావా… […]
చూస్తే చిన్న వార్తే… కానీ ఎందరు ఎమ్మెల్యేలు ఇలా వెళ్లగలరు..?
సీతక్క ఇక్కడ! —————- బాంబేలో పొద్దున ఇంట్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం దుబాయ్ లో మీటింగ్ లోనే భోంచేసి, రాత్రి భోజనం మళ్లీ బాంబే ఇంటి బాల్కనీలో ఎగసిపడే అరేబియా అలలను చూస్తూ తినగలిగే సంపన్నులున్న దేశంలోనే- ఇల్లు కాలితే కష్టం చెప్పుకోవడానికి అయిదు కిలోమీటర్లు నడిచినా నరమానవుడు కనపడని నిరుపేద నివాసాలూ ఉంటాయి. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో బతుకు ప్రతి క్షణం పోరాటమే. ఆధునిక రవాణా సౌకర్యాలు, సమాచార సాంకేతికతకు దూరంగా ఉన్న గిరిజన తండాలు […]
వుమెన్స్ డే..? ఓ నిజ స్ఫూర్తి కథనం ఇదుగో… ‘‘అంతిమ మిత్రురాలు..!!
లక్ష వ్యాసాలు… కోటి కథనాలు… ముక్కోటి స్పూర్తి పోస్టులు…….. ఈ ఒక్క వార్త ముందు దిగదుడుపే…. స్మశానాల్లో శవాల్ని తగలేసే ఈ మహిళామూర్తి ముందు అన్నీ బలాదూర్… దమ్ముండాలి… గుండెలో ధైర్యముండాలి… మెచ్చుకోవడానికి కూడా…! జస్ట్, స్తంభాల్ని ఎక్కే పోల్ వుమెన్‌ను ఆహాఓహో అనడం కాదు… అంతరిక్షయాత్రకు వెళ్లే వుమెన్‌ను అభినందించడం కాదు… అంతిమయాత్రల అసిస్టెంట్ గురించి చప్పట్లు కొట్టడానికి ఆత్మ ఉండాలి… అదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ చేయాల్సింది… ఛట్, మహిళలు అన్నీ చేస్తారు, […]
కరోనా బెడ్..! అదొక కన్ఫెషన్ బాక్స్… ప్రాయశ్చిత్తాలు, పశ్చాత్తాపాలు…!!
డాక్టర్ల ముందు కన్ఫెషన్; గుండెలు బరువెక్కే పశ్చాత్తాపాలు ——————– “మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్” వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రావణుడి మరణం తరువాత శ్రీరాముడన్న మాట ఇది. చావుతో శత్రుత్వం కూడా చచ్చిపోవాలి. చనిపోయాక శత్రుత్వం కొనసాగించడంలో అర్థం లేదు. ప్రయోజనం లేదు. దుర్మార్గుడయిన రావణుడి అంత్యక్రియలు నేను చేయను- అని విభీషణుడు అన్న సందర్భంలో- దాదాపుగా మందలింపుగా రాముడన్న మాట ఇది. ——————– కరోనాకు తొలి ఏడు పూర్తయింది. రెండో ఏడులోకి అడుగు పెట్టింది. ఈ […]