‘‘అవసరమైతే’’…. ఈ పదం రాజకీయాల్లో దుర్మార్గమైనది… ఆ అవసరాన్ని ఎవరు నిర్దేశించాలి..? తప్పించుకోవడానికి అత్యంత అనువైన పదం ఇది… ఎటంటే అటు మార్చుకోగల ఫ్లెక్సిబులిటీ ఉన్న పదం… అమెరికా దాకా వెళ్లిన రేవంతుడు ఏమన్నాడు..? ‘అవసరమైతే’ సీతక్కను సీఎం చేస్తాం అన్నాడు… అంటే సీఎం అభ్యర్థిగా సీతక్కను చెప్పడం లేదు తను… (సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ, సీతక్క అనేది నక్సల్స్ దళంలో ఉన్నప్పుడు పెట్టిన విప్లవనామం… ఉనికి బయటపడకుండా ఉండేందుకు నక్సలైట్లు అసలు పేర్లకన్నా […]
బ్రాహ్మణులపై సాక్షికీ చులకనే… ఎడిట్ పేజీలో ఏదేదో రాసిపడేశారు…
ఈరోజు ఎక్కడో తెలంగాణ బ్రాహ్మణ సంఘం సమావేశం జరుగుతున్నట్టు వాట్సప్‌లో వార్త కనిపించింది… వీళ్ల మీటింగులో ఇలాంటి ప్రస్తావనలు వస్తాయో రావో తెలియదు గానీ… మరోవైపు బ్రాహ్మణుల మీద విద్వేషాన్ని చిమ్ముతూ సాక్షి దినపత్రికలో ఓ వ్యాసం కనిపించింది… ఇది రాసింది డా.దేవరాజు మహారాజు… ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్లస్ జీవశాస్త్రవేత్త అని సదరు వ్యాస రచయితకు పరిచయం రాశారు వ్యాసం చివరలో… ఈమధ్య ఎవరో కాపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ […]
సిపిఆర్ తో పర్యాటకునికి ప్రాణం పోసిన డాక్టర్ యనమదల
పాండిచేరి, 9 జూలై 2023 :: గుండె మరణాలు పెరగడం, హఠాత్తుగా గుండె ఆగిపోవడం ఈ మధ్య తరచుగా జరుగుతున్నది. పశ్చిమబెంగాల్ భవానిపూర్ కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అనిరుధ్ దాస్ (71) తన కుటుంబ సభ్యులతో పాండిచ్చేరిలోని ఆరోవెల్లిలో ప్రఖ్యాత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో, వాహనం ముందు సీట్లో కూర్చుని ముందుకు వాలిపోయారు. కుటుంబ సభ్యులు బాధ, ఆందోళనతో సహాయం చేయాల్సిందిగా కేకలు వేశారు. కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల […]
బిగ్ బి… ఏమిటీ పని..? ఇదెక్కడి తెలుగు..? జనం నవ్వుకోరా చెప్పండి..?
అమితాబ్… దేశం గర్వించతగిన నటుడు… కోట్ల మంది తనను అభిమానిస్తారు… వెరీ ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా… తన మాట, తన అడుగు, తన భాష, తన ఆలోచనలకు ప్రాధాన్యం ఉంటుంది… లక్షల మంది అనుసరిస్తారు… ఇలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, జనం నవ్వుకునే విధంగా ఉండకూడదు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… తను ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం ప్రాజెక్టు కె లో నటిస్తున్నాడు… కమల్ హాసన్ కూడా దీనిలో భాగస్వామి (నటనపరంగా) అవుతున్నాడు… ఇప్పటివరకూ […]
కేంద్రంలో ముందస్తు ఎన్నికలు..? బీజేపీ హడావుడి చెబుతున్నది అదేనా..?!
Siva Racharla……. ముందస్తు ఎన్నికలు వస్తాయా?. ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదిక ఉండాలి. ముందస్తు ఎన్నికలలాంటి అతిపెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతి పెద్ద కారణం ఉండాలి. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా? గత కొంతకాలంగా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధానకారణం కర్ణాటకలో బీజేపీ ఓటమి. కర్ణాటకలో ముఖ్యమంత్రి బొమ్మై ,రాష్ట్ర బీజేపీ నేతల కన్నా మోడీ, అమిత్ షాలే […]
దేశంలోనే నెంబర్ వన్ పత్రిక… మద్రాస్ హైకోర్టులో ముక్కచీవాట్లు…
దైనిక్ భాస్కర్… సర్క్యులేషన్లో దేశంలోనే నెంబర్ వన్ డెయిలీ పేపర్… సో, ప్రతి అక్షరాన్ని ఆచితూచి పబ్లిష్ చేయాలి కదా… కానీ అదీ యూట్యూబ్ గొట్టాల్లాగే వ్యవహరిస్తోంది… అందుకని అది ప్రచురించిన ఓ నిర్లక్ష్యపు వార్తపై మద్రాస్ హైకోర్టు ముక్కచీవాట్లు, అనగా కుక్కతిట్లు పెట్టింది… ఏదిపడితే అది రాసేస్తాం, మమ్మల్ని అనడానికి ఎవరికెంత ధైర్యం అనే పిచ్చి భరోసాలో గనుక బతుకుతున్నట్టయితే తెలుగు పత్రికలకూ ఇలాంటి వాతలు తప్పవేమో… విషయంలోకి వస్తే… దైనిక్ భాస్కర్ ఈమధ్య ఓ […]
పవన్ కల్యాణ్ కాపు కాదట… ఈ వివాద రాజకీయాల్లోకి ఆ తల్లినీ లాగుతున్నారు…
అయిదేళ్ల క్రితం… అంటే 2018లో … పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశాడు… ‘‘నాది ఇకపై రెల్లి కులం, ఆ కులాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా, రాజకీయాల్లో చెత్తను ఊడ్చేయడానికే వచ్చాను, కాబట్టి ఆ పారిశుధ్య వృత్తిలో ఉండే వాళ్ల కులమే నా కులం…’’ అనేది ఆ ప్రకటన సారాంశం… ఆ ప్రకటన చాలామందికి నచ్చింది… సహజంగానే యాంటీ జనసేన గ్రూపులకు నచ్చలేదు… అది వేరే సంగతి… వైసీపీలో ముత్యాల చక్రవర్తి అని ఓ మోస్తరు లీడర్ ఉంటాడు… […]
సచ్చింది గొర్రె… కేజ్రీవాల్‌కు మరో షాక్… మీడియా సంస్థలకూ తలపోటు…
పార్ధసారధి పోట్లూరి …… ఢిల్లీ – మీరట్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (Delhi-Meerut Regional Rapid Transit System (RRTS) project)పేరుతో ఢిల్లీని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ,మీరట్ లని కలుపుతూ రైలు మార్గం నిర్మిస్తున్నాము అంటూ కేజ్రీవాల్ అట్టహాసంగా ప్రకటించాడు మూడేళ్ళ క్రితం. ఇక ప్రకటనలతో హోరెత్తించాడు. అట్టహాసంగా ప్రకటించాడు కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి అంటే వేల ఎకరాలు భూమిని ప్రజల దగ్గర నుండి సేకరించాలి. దీనికోసం హీనపక్షం లక్ష కోట్లు […]
మన సొసైటీకి మరో జాఢ్యం… కుప్పలుతెప్పలుగా యూట్యూబర్ల గొట్టాలు…
ఒక వార్త ఆశ్చర్యపరిచింది… దాని సారాంశం ఏమిటంటే..? మొన్న తెలంగాణ అభిమానించిన ఉద్యమగాయకుడు సాయిచంద్ హఠాత్తుగా మరణించాడు కదా… పాపం, భర్తను కోల్పోయిన బాధలో ఆయన భార్య రజని తల్లడిల్లిపోయింది… ఎడతెరిపి లేకుండా ఏడుస్తోంది… ఆ ఇంట్లో విషాదం ఆవరించింది… ఎవరినైనా కోల్పోయినప్పుడు ఏ ఇంట్లోనైనా ఈ పరిస్థితి సహజమే… ఒకవైపు భర్త పోయిన బాధలో ఉంటే… మరోవైపు రజని దగ్గరికి యూట్యూబర్లు వచ్చి ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తూ సతాయిస్తున్నారు… ఆమె ఉన్న విషాద స్థితిలో […]
హమ్మయ్య… సంజయ్‌ను బండి దింపేశారు… కానీ ఎవరి సంతృప్తి కోసం..?!
ఓ మిత్రుడి వ్యాఖ్య… ‘‘మొన్న రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ఓ మాటన్నాడు… కేసీయార్ పార్టీ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ… అది బీజేపీకి బీటీమ్… కేసీయార్‌ను ఆడించే రిమోట్ మోడీ చేతిలో ఉంది అన్నాడు… నిజానికి టీబీజేపీ వ్యవహారాలకు సంబంధించి కేసీయార్ చేతిలోనే రిమోట్ ఉన్నట్టుంది… తనకు బండి సంజయ్ అనే తలనొప్పిని తగ్గించేందుకేనా మోడీ ఇప్పుడు తనను తీసేసి, కిషన్‌రెడ్డిని టీబీజేపీ అధ్యక్షుడిగా చేశాడు…’’ తన విశ్లేషణ, కాదు, తన ప్రశ్న ఏమిటంటే..? ‘‘కిషన్‌రెడ్డి […]
పెళ్లి కాకపోతే పెన్షన్లు ఇస్తాడట… ఇంకా ఈ స్కీములు ఏ స్థాయికి వెళ్తాయో…
పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టండి… అసలు ఉచితాలంటే, సబ్సిడీలంటే విముఖంగా ఉండే మోడీ ఫాలోయరేనా ఈ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ‘కట్టర్’… పెళ్లికానివాళ్లకు పెన్షన్ల పథకం ప్రకటించాడు… నిజానికి సామాజిక పెన్షన్లు ఎందుకు..? ఎవరికైతే సామాజిక మద్దతు అవసరమో వాళ్లను ఆదుకోవడానికి ఈ పెన్షన్లు వర్తించాలి… అనాథలకు, ఆదాయం సరిపోని వారికి, ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నవారికి అవి భరోసాగా నిలవాలి… కానీ ఈ దిక్కుమాలిన పార్టీలు, నాయకుల పుణ్యమాని… ఈ పెన్షన్ల […]
రాహుల్ భాయ్… రేప్పొద్దున ఈ బీజేపీ బీటీమ్ సహకారం తీసుకోరా..?
సభలో వందన సమర్పణ కూడా అయిపోలేదు… జనం తిరుగుముఖం కూడా పట్టలేదు… లక్షల మంది సభికుల్లో సభ సక్సెస్ తాలూకు జోష్ అలాగే కనిపిస్తోంది…. హరీష్, కేటీయార్ ట్వీట్లు దిష్టితీసినట్టుగా అనిపించాయి… రాహుల్, కాంగ్రెస్‌లను విమర్శిస్తూ… రాహుల్ ప్రస్తావనలకు యమర్జెంటు ఖండనలు… తెల్లవారే పత్రికల్లో రాహుల్ వార్తతోపాటు తమ ఖండనలూ పబ్లిషయి, బ్యాలెన్స్ అయిపోవాలని..! టీవీల్లో లైవ్ వస్తుంటే దిగువన తమ వ్యాఖ్యలు స్క్రోల్ కావాలని…! కేసీయార్ ప్రభుత్వ వైఖరి ఏమాత్రం హుందాగా, సంస్కారయుతంగా లేదు… రాజకీయాల్లో […]
కిచిడీ సర్కార్… శరద్‌పవారే ఆద్యుడు… చివరకు ఆ పాలిటిక్స్‌కే బలి…
Siva Racharla…….. కాలం మారింది.. ఎంత కాలం ప్రభుత్వాలను కూల్చటం? ఏకంగా పార్టీలను చీల్చి తమతో కలుపుకుంటే సరి! హోల్ సేల్ డీల్… రాష్ట్రపతి పాలన విధించడంలాంటివి ప్రాసంగితను కోల్పోయాయి. మంత్రి పదవి ,వేల కోట్ల కాంట్రాక్ట్ లు ఇస్తామంటే బంధాలు, జంధ్యాలు (మత కోణం కాదు) తెంచుకొని వెళ్ళటానికి ఎక్కువ మంది నాయకులు సిద్ధం, ఏ రాష్ట్రం అయినా ఏ పార్టీ అయినా. ఇప్పుడు అధికారమే పరమావధి, భవిష్యత్తు మీద చింత కాదు కదా కనీసం […]
నిప్పులు చిమ్ముతూ ఎగిరీ ఎగిరీ… నెత్తురు కక్కుతూ నేలరాలుతూ నేడు…
బెల్లంకొండ ప్రసేన్… వన్డే ప్రపంచ కప్ కు వెస్టిండీస్ క్వాలిఫై కాలేదన్నది వార్త కాదు.. అదొక విషాదం… అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా! వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది.. నిజానికి వన్ డే క్రికెట్ వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా.. అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా.. సముద్రపు ఒడ్డున అలల అంచున […]
బియ్యం లేక… ఇవ్వలేక… హామీ తీర్చలేక… కర్నాటక సర్కారు ఆపసోపాలు…
వోటర్లను ప్రలోభపెట్టడానికి రకరకాల ఉచిత పథకాలు పెట్టేసి, తోచిన ప్రతి అంశాన్ని సాధ్యాసాధ్యాల అధ్యయనం లేకుండానే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేసి… తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లూ పడటం లేదంటే కోతలు పెట్టడం, నామమాత్రంగా అమలు చేయడం ప్రతి పార్టీకి అలవాటైంది… అసలు ప్రతి పార్టీ ప్రాథమిక ఎజెండాయే ప్రజల్ని మోసగించడం కదా… ఇప్పుడు తమ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం కిందామీదా పడుతోంది… బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం అమలు […]
రామోజీ సర్… ఇలాంటివి మీ కంటబడుతున్నాయా..? లేక పూర్తిగా వదిలేశారా..?
రాజకీయ లక్ష్యాలతో వండి వార్చే అభూత కథనాలు, అక్షరాలతో దాడులు ఈనాడు పాత్రికేయానికి ఆది నుంచీ ఉన్న అవలక్షణమే… ఆ దరిద్రాన్ని పక్కన పెడితే తెలుగు మీడియాలో ఈనాడే నంబర్ వన్… మిగతా మీడియా ఈనాడును చూసి వాతలు పెట్టుకోవడమే తప్ప సొంత దారుల్లేవు, సొంత క్రియేటివ్ ఐడియాల్లేవు… గతంలో ఈనాడు వార్తారచన, ప్రజెంటేషన్‌కు సంబంధించి కొన్ని ప్రమాణాలు పాటించేది… వర్తమానంలో ఈనాడు ఏం పబ్లిష్ చేస్తున్నది..? ఇది ఎవరికీ అంతుపట్టని ప్రశ్న… చివరకు రామోజీరావుకు కూడా […]
శుష్క వాదాలు… శూన్య జ్ఞానాలు… చివరకు రాష్ట్రపతినీ వదలడం లేదు…
Priyadarshini Krishna…. ఒక బ్యాచ్ ఉంటుంది దేశంలో… ఎక్కడేం జరిగినా దాన్ని పట్టుకొచ్చి మోడీ మెడలో వేసే బ్యాచ్… లేదంటే బీజేపీకి చుట్టడం… బీజేపీ, మోడీ విమర్శలకు అతీతమని కాదు… కానీ అవసరమైన, వాస్తవమైన విషయాల్లో తిడితే ఓ విలువ… కానీ ప్రతి సంఘటనకూ వక్రబాష్యాలు చెబుతూ, అబద్దాలు వ్యాప్తి చేయడం వల్ల ఒరిగేదేముంది..? ఒకవైపు వాట్సప్ యూనివర్శిటీ అని వెక్కిరిస్తూనే ఉంటారు కాషాయం బ్యాచ్‌ను… మరి యాంటీ వాట్సప్ యూనివర్శిటీ చేసేది ఏమిటి..? అదే పని […]
కుటుంబ సంపాదన… భార్యాభర్తల ఉమ్మడి సంపాదన… ఇంట్రస్టింగ్ తీర్పు…
ఇంట్రస్టింగ్… తమిళనాడులో ఒకాయన ఉద్యోగం కోసం అరబ్ కంట్రీస్ వెళ్లాడు… తినీతినకుండా, పొదుపు చేసుకుంటూ తన జీతం నుంచి ఎప్పటికప్పుడు ఇంటికి డబ్బు పంపించేవాడు… భార్య ఆ డబ్బుతో కొన్ని ఆస్తులు కొన్నది… ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ… ఇక్కడి వరకూ కథ సజావుగానే సాగింది… తను ఇండియాకు తిరిగి వచ్చాడు… ఆమెతో సంబంధాలు దెబ్బతిన్నాయి… ఆ ఆస్తుల్లో నా వాటా నాకు కావాలంటుంది ఆమె… నో, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది, తన డబ్బులతో సుఖజీవనం గడిపింది, […]
రాధాకృష్ణ రాతల్లో నిజం లేదు… పత్రికలు ఏదో రాసేస్తే చరిత్ర మారదు…
Siva Racharla…… YSR the CM… ఆదివారం వీక్ ఎండ్ కామెంట్, దానికి పలువురు మిత్రుల కౌంటర్ , ప్రతి వారం జరిగేదే. అయితే చరిత్రను టచ్ చేసినప్పుడు చదివి ఇట్టే నిరాసక్తంగా దాటుకొని పోలేము. 2004 అంటే సంగతులు మరీ ఒకళ్ళు చెప్తే కానీ తెలుసుకోలేనంత పాత చరిత్రేమీ కాదు. మరో రకంగా జగన్ రూపంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు లైవ్ లో ఉంది. రాధాకృష్ణ గారు ఏమంటారంటే , 2004 నాటికి రాజశేఖర్ […]
ఔట్ సోర్సింగ్ యుద్ధాలు… రష్యా తిరుగుబాటు చెప్పే సైనిక పాఠాలెన్నో…
పార్ధసారధి పోట్లూరి …….. నువ్వు ఎంత ధనవతుడివి అయినా, నువ్వు ఎంత బలవంతుడువి అయినా, నువ్వు ఎంత తెలివి గల వాడివి అయినా, కాలమనే సర్పానికి చిక్కి నశించ వలసిందే! రష్యా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. అయితే అది బయటి శక్తుల ప్రోద్బలంతో రష్యా అంతర్గత శక్తుల వల్ల జరుగుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఇదే దుస్థితి లో ఉన్నాడు! పుతిన్ ఉక్రెయిన్ లో నియమించిన వాగ్నేర్ గ్రూపు పుతిన్ కి ఎదురు తిరిగింది! ఉక్రెయిన్ […]
- « Previous Page
 - 1
 - …
 - 98
 - 99
 - 100
 - 101
 - 102
 - …
 - 116
 - Next Page »
 


















