సెకెండ్ వేవ్ లో… కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు ——————– శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు. తరువాత ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగంలోకి వెళ్లారు. మంచి రచయిత. రాసినవి చాలా తక్కువే అయినా- రాసినవన్నీ మంచి రచనలే. 1996 ప్రాంతంలో “శుభం” అని ఒక కథ రాశారు. ఆ కథ ప్రారంభంలో జర్నలిస్టుల జీవితానికి అద్దం పట్టే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు. “లోకం నిద్రపోయేవేళ- లోకాన్ని నిద్రలేపడానికి వారు మేల్కొని ఉంటారు. లోకం మేల్కొన్నవేళ వారు నిద్రపోతారు” ఆయన […]
టీకా ధరల దందా..! అలుసు దొరికిందిగా… అడ్డంగా కుమ్మేయండి బ్రదర్…
ఎస్… ఖచ్చితంగా ఒక టీకా తయారీ ఖర్చు చాలా చాలా తక్కువ… అందుకే భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ తనే స్వయంగా ఒక మాటన్నాడు… కేటీయార్ సమక్షంలోనే… ఇది మన హైదరాబాదీ కంపెనీ… ఒక మంచినీళ్ల సీసాకన్నా తక్కువ ధరకు నాణ్యమైన వేక్సిన్ అందిస్తాను అన్నాడు ఆయన… వేక్సిన్ల తయారీలో ఏళ్ల అనుభవం ఉంది, కరోనాకు ఓ స్వదేశీ వేక్సిన్ వస్తుంది కదాని అందరూ ఆనందపడ్డారు… తీరా ఏమైంది..? వాటర్ బాటిల్ ధర కాదు, ఫుల్ […]
ధైర్యమే అసలు వేక్సిన్..! మన వరల్డ్ ఫేమస్ వైరాలజిస్ట్ ఇంకా ఏమంటాడంటే..?
ఆర్నెల్ల క్రితం వరకూ వణికించీ… హమ్మయ్య ఇగైపోయిందనుకున్న సమయంలో… దూసుకొచ్చిన కరోనా సెకండ్ వేవ్.. ఒకవైపు పెరుగుతున్న కేసుల సంఖ్య.. అంతకుమించి కలవరపెడుతున్న మరణాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న దహనవాటికలు.. శ్మశాన వాటికల్లో నిరీక్షణలు.. అంతలోనే మూడో మ్యూటెంటంటూ వార్తలు.. ఇంకోవైపు, జనసామాన్యమంతా తినితొంగునే సమయాన ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ.. పట్టపగలేమో హోటళ్లు, స్టాల్స్, మాల్స్ తో హా కరోనా మనల్నేం చేస్తుంది లే అన్నట్లుగా.. ప్రభుత్వ ఆదాయం కోసమో, ప్రజల అవసరాల కోసమో తెలియందికాదుగానీ.. […]
ఇంకెలా చప్పట్లు కొట్టగలం నీకు సోనూ… ఇంకా ఎత్తుకు ఎదిగిపోయావ్…
సోనూ సూద్… నిజంగా తను చేపడుతున్న సేవా కార్యక్రమాలు వార్తలు చదివేకొద్దీ…. అవన్నీ నిజమేనా అన్నంతగా ఆశ్చర్యపరుస్తయ్ మనల్ని… ఏడాది కాలంగా ఎన్ని వేల మందికి దేవుడయ్యాడో చూశాం… చివరకు ఇప్పుడు తనే కరోనా బారిన పడి, హోం ఐసొలేషన్‌లో ఉన్నా సరే, తన యాక్టివిటీ ఏమాత్రం ఆగడం లేదు సరికదా… నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాడు… క్షుద్రమైన ఫ్యాన్స్, తాము దేవుడి పుత్రులం అనే మూర్ఖభావనల్లో పడి కొట్టుకుంటూ… ఏతులు తప్ప చేతలకు కొరగాని, కోట్లకుకోట్లు మూలుగుతున్నా […]
భేష్ జగన్..! ఏతుల మనిషి కాదు- చేతల మనిషి… అందరికీ ఫ్రీ వేక్సిన్…
మోడీ దుర్మార్గుడు… మోడీ దుష్టుడు అని తిడుతూ కూర్చోవడం కాదు….. మీడియా ముందు కోతలు కోసి, తరువాత నిజంగా అవసరమున్నప్పుడు మొహాలు చాటేయడం కాదు…. తక్షణం తామేం చేయాలో నిర్ణయం తీసుకోవాలి, తమ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై నిజమైన సమీక్షలు జరపాలి… జనానికి భరోసాగా నిలవాలి… విపత్తు వేళ పాలకుడు ఎలా ఉండాలో నిరూపించుకోవాలి… ఇప్పుడు కాకపోతే ఇక ప్రభుత్వాలు దేనికట..? తిట్టొచ్చు, మోడీని తిట్టడమే రాజకీయం అనుకుంటే తిట్టడానికి చాలా రీజన్స్ దొరుకుతయ్, బోలెడు టైముంది… […]
అండ సమస్య..! ఆ కోళ్లన్నీ హఠాత్తుగా గుడ్లు పెట్టడం మానేశాయి… వై..?!
పూణెలో ఓ కోళ్ల రైతు… అకస్మాత్తుగా ఓ కష్టమొచ్చి పడింది… తన ఫామ్‌లో ఉన్న కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి… ఇదేందయ్యో, నేనెప్పుడూ చూళ్లే… జోరున వానలు పడుతున్నా, ఎండలు దంచికొడుతున్నా, చలి వణికించేస్తున్నా కోళ్లు గుడ్లయితే పెడతాయి కదా… కాకపోతే కొన్ని నాగా పెడతాయి, అంతే తప్ప గుడ్లు పెట్టడమే మానేస్తే ఎలా..? అదీ అన్నీ కూడబలుక్కున్నట్టు ఒకేసారి గుడ్లు పెట్టకపోతే ఎలా..? పైగా కరోనా కాలం… ఇమ్యూనిటీ పేరుతో చాలామంది ఎగబడి తింటున్నారు ఈమధ్య… […]
Air Bombing..! తిరుగుబాట్లపై కేంద్రబలగాల వైమానికదాడి కొత్తేమీ కాదు..!!
ఔనా..? నిజంగానే మన ప్రభుత్వం నక్సలైట్ల నిర్మూలనకు డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తోందా..? ఆదివాసీ ప్రాంతాలపై కార్పెట్ బాంబింగు చేయాలనే ప్రణాళికల్లో ఉందా..? అసలు ఇది నైతికమేనా..? ఏ రాజ్యమైనా తన సొంత ప్రజలపై వైమానిక దాడులు చేస్తుందా..? చట్టం అంగీకరిస్తుందా..? ప్రజలు సహిస్తారా..? అమాయకుల ప్రాణాలకు రక్షణ ఏది మరి..? ఒక వార్త చదివాక అందరిలో తలెత్తే ప్రశ్నలు, సందేహాలు, ఆందోళనలు ఇవి… ఇప్పటికే సాయుధ బలగాలు, మావోయిస్టుల నడుమ ఆదివాసీల బతుకు బర్బాద్ అయిపోతోంది… […]
మిషన్ వేక్సిన్..! చేతకాదా..? చేసే సంకల్పం లేదా..? ‘‘వేరే రీజన్లు’’ ఉన్నాయా..?!
సోషల్ మీడియా, మీడియా, టీవీలు, పత్రికలతోపాటు ప్రతిచోటా టాం టాం వేస్తున్నారు… ఊరూరా అలజడి… ప్రతి స్థాయి ఉద్యోగీ ఎన్నికల విధులకు హాజరైనట్టుగా తప్పకుండా ఈ పనికి హాజరు కావాలని ఆదేశించారు… బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు హాస్పిటళ్లు… పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డ్యూటీ అందరికీ… ఇద్దరు నర్సులు, ఓ డాక్టర్… ఆధార్ కార్డులు పరిశీలించడం, వివరాలు ట్యాబుల్లోకి ఎక్కించడానికి ఇద్దరు టీచర్లు… ఒక […]
గుడ్ న్యూస్… అక్కడ 18 ఏళ్లు దాటితే అందరికీ ఫ్రీ వేక్సిన్… మోడీకి ఈ పని చేతకాదా..?!
మంచి వార్త… అస్సాం నుంచి… ఎలాగూ 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వేక్సినేషన్ ఖర్చును కేంద్రం భరిస్తోంది కదా… 18 నుంచి 45 ఏళ్ల నడుమ వయస్సున్న ప్రజలందరికీ ఉచితంగా వేక్సినేషన్ చేయించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… కోటి డోసుల్ని సప్లయ్ చేయాల్సిందిగా హైదరాబాద్, భారత్ బయోటెక్ కంపెనీకి ఆర్డర్ కూడా పెట్టింది… చెల్లింపు సామర్థ్యం ఉన్న వాళ్లకు ఎలాగూ ప్రైవేటు రంగంలో అందుబాటులో ఉంచుతున్నారు… కోవిషీల్డ్ ఆల్రెడీ తన ధరల్ని కూడా ప్రకటించింది… […]
ఆఫ్టరాల్ కోటి రూపాయలు… అలా వెళ్లి ఇలా టీకా వేయించుకుంటున్నారు…
ఇదిగో తలుపేసుకో! విమానమేసుకుని దుబాయ్ వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని మధ్యాహ్నం భోజనానికి వస్తా! ——————– ఎవరి సమస్యలు వారివి. పీత కష్టాలు పీతవి. సీత కష్టాలు సీతవి. సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే వేళకు లాక్ డౌన్ నిర్బంధాల్లో దేశమంతా వలస కార్మికులు కనీసం అయిదు కోట్ల మంది కత్తి అంచు మీద నెత్తురు చిట్లుతున్నా నడిచి సొంత ఊళ్లకు వెళ్లారు. “ఇంటికాడ పిల్ల జెల్ల ఎట్ల ఉన్నరో?” అని ఆ సందర్భానికి వైవిధ్యమయిన తెలంగాణ కవి […]
‘‘కరోనా తాటతీసిన తొలిదేశం… మాస్కుల్లేవ్, కర్ఫ్యూలు లేవ్, లాక్ డౌన్లు లేవ్…’’ నిజమెంత..?!
హుర్రే…. ప్రపంచంలో కరోనాను జయించిన తొలి దేశం ఇజ్రాయిల్… దాని తాట తీసేసింది… దాని ముళ్లు విరిచేసింది… ప్రజలు మాస్కులు పీకేశారు, పారేశారు… స్వేచ్ఛగా గాలులు పీలుస్తున్నారు… మనసారా దగ్గుతున్నారు, నిర్భయంగా తుమ్ముతున్నారు… శ్రీలంకలో మూడోవంతు కూడా ఉండని ఆ చిన్న దేశం కరోనా పీచమణిచింది… అసలు ఒక జాతి అంటే అదీ… ఎంత క్రమశిక్షణ… తమ వేక్సిన్ తామే తయారు చేసుకున్నారు… మొత్తం టీకా సూదులు పొడిపించుకున్నారు… మొత్తం ఉచితమే… యుద్ధప్రాతిపదికన గత డిసెంబరులో స్టార్ట్ […]
రోజులు అస్సలు బాగాలేవు… కరోనాపై ప్రతి చెత్తా రాత చదివి బేజారైపోవద్దు కూడా…
Jagannadh Goud………………. రెండవ భాగం: కరోనా గురించి ప్రశ్నలు – సమాధానాలు 31. కోవిడ్ వచ్చి పోయింది, ఇప్పుడు వ్యాక్సిన్ వేపించుకోవచ్చా ? సమాధానం: యస్, వేపించుకోవచ్చు. బూస్టర్ డోస్ లా పనిచేస్తుంది. 32. మొదటి డోస్ వేపించుకున్నాక కొన్ని రోజులకి కోవిడ్ వచ్చి ఇప్పుడు తగ్గింది. సెకండ్ డోస్ వేపించుకోవచ్చా..? సమాధానం: యస్, ఖచ్చితంగా వేపించుకోవచ్చు. 33. టీకా మాత్రమే 100% రక్షణ ఇస్తుంది అని కొందరు డాక్టర్స్ మాట్లాడుతున్నారు, ఇంకొందరు టీకా వలన ఉపయోగం […]
ప్రశాంత్ కిషోర్ మమతను ముంచేశాడా..? పిచ్చిది… శల్యసారథ్యం వహించాడా..?
మమతా బెనర్జీ ఫాఫం… తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని నమ్ముకోకుండా…. మధ్యలో వచ్చిన ఆ ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకుని మునిగిపోబోతోందా..? ప్రశాంత్ కిషోర్ బయటికి కనిపించేది వేరు… లోలోపల బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడా..? ఇప్పుడు మమతను పాతాళానికి దిగజార్చి ఇక పంజాబ్ వైపు వెళ్లిపోయాడా..? దేశం మొత్తమ్మీద బీజేపీకి మింగుడపడని పంజాబ్‌ను బీజేపీ ఈ ప్రశాంత్ కిషోర్ సాయంతోనే, శల్యసారథ్యం మీద నమ్మకంతోనే గెలవబోతోందా..? అర్బన్ నక్సల్ తరహా మేధావులంతా ఎడాపెడా సుదీర్ఘ వ్యాసాలు రాసేస్తున్నారు… మమత […]
Remdesivir..! అత్యంత కరుణతో తమ నిలువుదోపిడీ తగ్గించిన ఫార్మా మాఫియా…!!
ఒక వార్త… కరోనా పేషెంట్లకు వాడే రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల ధరలకు అత్యంత దయతో ఫార్మా కంపెనీలు గణనీయంగా తగ్గించాయి… గుడ్ న్యూస్… ఆహా ఓహో… ఇలా మోడీ అడిగాడు… వెంటనే ఫార్మా కంపెనీలు ధరలు తగ్గించేశాయి… అద్భుతమైన వార్త……. ఇలా బోలెడు సైట్లలో, టీవీల్లో కనిపించిన వార్తల సారాంశం ఇదే… ఈ మోడీ ప్రభుత్వం ఏ పని సరైన దిశలో చేస్తుందో, ఏ పని అపసవ్యంగా చేస్తుందో తెలియని అయోమయం కదా… అందుకని ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాలా..? […]
ఉల్టా కేసులతో ఉస్కో ఉస్కో… మమత చూపిన బాటలో కేరళ సీఎం అడుగులు… కానీ..?
రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే చాలు… ఇక మేం చెప్పిందే శాసనం, మా జోలికి ఎవడూ రావద్దు, ఇవి మా సామ్రాజ్యాలు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొందరు ముఖ్యమంత్రులు… ఫ్యూడల్ బాపతు పాత లక్షణాలేవో పనిచేస్తుంటాయి… అవి ఎంతవరకూ వెళ్తాయంటే కేంద్రం మిథ్య, మా జోలికొస్తే తాటతీస్తాం అన్నంతగా…! ఏవో కుటుంబ పార్టీలు, డబ్బు తప్ప వేరే లోకం లేని పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు అలా వ్యవహరిస్తున్నారంటే, సరే, వాళ్ల లెవల్ అదేనని అనుకుంటాం… కానీ సీపీఎం వంటి […]
చైనాలో అంతే..! నోరిప్పితే చాలు, మూసేస్తారు… అలీబాబా అయినాసరే…!!
జాక్ మా కు చుక్కలు చూపిస్తున్న చైనా! ——————– చైనాలో అంతే! కాకపోతే చైనాలో అంతే అనే విషయం ప్రపంచ కుబేరుల్లో ఒకడు, చైనాలో అత్యంత సంపన్నుడు అయిన జాక్ మాకు ఆలస్యంగా తెలిసివచ్చింది. స్టాన్ఫోర్డ్ లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ ఆంతర్జాతీయ అత్యున్నత కాలేజి అరుగుల మీద జాక్ వ్యాపారం మెళకువలు చెబుతుంటే ప్రపంచమంతా చెవి ఒగ్గి, ఆరాధనగా, తాదాత్మ్యంతో విన్నది. ఆయన అలీబాబా ఆన్ లైన్ మార్కెటింగ్ విద్య ఏదో ఒకనాడు పద్నాలుగు భువన భాండాలు […]
‘‘అర డజను సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశాను… నాదొక ఫెయిల్యూర్ స్టోరీ…’’
((……..Kandukuri Ramesh Babu………………)). #Failure_Story #Tribute………… పద్మశ్రీ డా. కాకర్ల సుబ్బారావు ~ గొప్ప మ్యాథమెటీషియన్ కావానుకుని రేడియాలజిస్ట్ అయిన ఒక వైద్యుడి ఫెయిల్యూర్ స్టోరీ ఇది…. నిత్యం రోగుతో కిటకిటలాడుతున్న నిమ్స్ వైద్య నిలయంలో తెల్లని బట్టల్లో, ఆరోగ్యంగా తిరుగుతూ కనిపించే ఆజానుబాహువు కాకర్ల సుబ్బారావు. ఆయన మెడలో స్టెతస్కోప్ లేదు గానీ నిమ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసలను పై ఫ్లోర్‌లోంచి ఆయన ఏకాగ్రతతో వింటున్నట్టే ఉన్నారు. మీ జీవితంలోని అపజయాలను పంచుకునేందుకు వచ్చానని చెప్పినప్పుడు […]
నంబిని నట్టేట ముంచిన ‘ఆ శక్తి’ ఎవరు..? ఆ కుట్రను ఎవరు ఛేదించాలి..?!
పోలీసులు ఏదో తప్పుడు కేసు పెట్టారు… మీరు ఏళ్ల తరబడీ సతాయింపబడ్డారు… మీ జీవితం బర్బాద్ అయిపోయింది… ఇజ్జత్ పోయింది… చివరకు ఏ కోర్టో కొట్టేసింది… కానీ ఆ తప్పుడు కేసు వల్ల మీకు జరిగిన నష్టానికి పరిహారం ఏమిటి..? కోల్పోయిన కొలువు, పరువు, ఆనంద క్షణాలు, సాధించాల్సిన విజయాలు అన్నీ మట్టిగొట్టుకుపోయాయ్… మరి నిష్కృతి ఏమిటి..? ఆ తప్పుడు కేసు పెట్టిన వాడిని ఎందుకు శిక్షించలేం..? నేను కేసు పెట్టేశాను, నీ చావు నువ్వు చావు […]
వేక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు… కానీ అదెందుకూ అంటే…!!
………….. Jagannadh Goud……………… కరోనా: కొన్ని ప్రశ్నలు – సమాధానాలు 1. వ్యాక్సిన్ కరోనా వైరస్ ని ఖతం చేస్తుంది అన్నారు, నిజమేనా? సమాధానం: వ్యాక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు, పీకదు. 2. మరి వ్యాక్సిన్ వలన ఉపయోగం ఏమిటి? సమాధానం: వ్యాక్సిన్ అనేది మన శరీరంలో ఉన్న మన రక్షణ కణాలు (యాంటీ బాడీస్) ని నిద్ర లేపుతుంది. 3. వ్యాక్సిన్ ని ఎలా తయారు చేస్తారు..? సమాధానం: బతికి ఉన్న కరోనా […]
బీబీసీ..! మరీ తెలుగు మీడియా టైపు అంత ఏడుపు వద్దులేరా నాయనా…!!
ఏడవకు ఏడవకు బిబిసి! ఏడిస్తే నీ కళ్లు ఎరుపెక్కుతాయి!! ——————- జర్నలిజం ప్రపంచంలో బిబిసి ఒక అందుకోదగ్గ ప్రమాణం. చూసి నేర్చుకోవాల్సిన పాఠం. బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ కంపెనీ- బిబిసి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ. దాదాపు వందేళ్ల చరిత్ర దానిది. ప్రపంచవ్యాప్తంగా బి బి సి రేడియో, వివిధ భాషల్లో టీ వీ, డిజిటల్ అన్నీ కలిపి పాతికవేల మంది పని చేస్తుంటారు. అలాంటి బి బి సి కూడా విమర్శలకు అతీతమేమీ కాదు. అయితే చాలాసార్లు […]
- « Previous Page
- 1
- …
- 134
- 135
- 136
- 137
- 138
- …
- 149
- Next Page »