ముందుగా ఒక నేరకథ చదవండి… సంక్షిప్తంగానే… 2009, ఆగస్టు… కేరళ, అలప్పుజా… పాల్ జార్జి… యంగ్… ఓ రెస్టారెంట్లో చిల్ అయ్యాడు… కారులో వేరే రెస్టారెంట్ వైపు బయల్దేరాడు… వందల కోట్ల అధిపతి వారసుడు… ది గ్రేట్ ముత్తూట్ ఫైనాన్స్ ఓనర్ జార్జి రెండో కొడుకు… అడుగు తీసి అడుగేస్తే విలాసం… మార్గమధ్యంలో ఏం జరిగిందో గానీ టూవీలర్ పైన వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారు ఆపారు… తిట్టేసుకున్నారు… అందులో కరి సతీష్ అనే వాడు కత్తి […]
దంచు దంచు… నీ దంచుడు దక్కిన నాదెంత భాగ్యమో… (పార్ట్-2)…
“కానీ చెంప దెబ్బలు తిన్నవాడు ఆ దైవాంశ సంభూతుడి చేతి స్పర్శ వలన తమకంతో ఉబ్బితబ్బిపోయానంటున్నాడు… ప్రజల (అ)జ్ఞానం రోజు రోజుకూ ఘటోత్కచులవారు చెప్పినట్లు ద్విగుణం బహుళం అవుతోంది. ఇంత దిగజారుడు సంస్కారాన్ని కూడా జీర్ణించుకొని, దానికొక ఆత్మీయ స్థాయి కల్పిస్తున్న ప్రజల దౌర్భాగ్యాన్ని తలుచుకొంటే ఎంతమంది పప్పూరి రామాచార్యులు, విద్వాన్ విశ్వంలు, తరిమెల నాగిరెడ్లు, సింగమనేని నారాయణలు ఆ గడ్డ మీద పుడితే ఏం లాభం?”………. దంచు దంచు.. ఇంకా దంచు అన్న శీర్షికతో ’ముచ్చట‘లో […]
‘‘అన్యాయమైపోయాడు’’… పరిహారం ఏమిటి..? పరిష్కారం ఏమిటి..?
మన సమస్య ఏమిటంటే..? లోపభూయిష్టమైన మన న్యాయవ్యవస్థను గాడిలో పెట్టే ఆలోచనలు చేయాల్సిన పెద్ద జడ్జిలు, అదేదో ఓ ఇండివిడ్యుయల్ కేసులో రేప్ కేసు నిందితుడిని, ఆ పిల్లను పెళ్లి చేసుకుంటావా అనడుగుతారు… అసలు కీలకమైన స్థానాల్లో కూర్చునే పెద్దలు జాతీయ స్థాయిలో రాజ్యాంగరక్షణ, తీవ్రత ఉన్న పెద్ద పెద్ద కేసుల గురించే కాదు… లక్షల కేసుల డిస్పోజల్స్ గురించి, జైళ్లలో మగ్గుతున్న నిరపరాధుల గురించి, ధ్వంసం అవుతున్న కేసుల గురించి సీరియస్ ఎఫర్ట్ పెడితే ఎంత […]
మోడీ కుట్ర..! హైదరాబాద్‌కు 24వ ర్యాంకా..? రాజకీయం, కుట్ర, అక్కసు, ఈర్ష్య…!!
ఒక గద్దర్, ఒక నారాయణ, ఒక గోరటి, ఒక సుద్దాల……. చెప్పే నీతులు వేరు… ఓ సమయం వస్తే, తమ ధోరణులకు భిన్నంగా రాజ్యం ఎదుట, పాలకుడి ఎదుట సాగిలబడటం వేరు… చాలామందిని ఈ కాలప్రవాహం చూసింది, జాలిపడింది, నవ్వుకుంది, వదిలేసింది… వీళ్లు కొత్తా కాదు, ఇలాంటోళ్లు ఇక రారనీ కాదు… అంతటి శ్రీశ్రీయే ఎమర్జెన్సీకి అనుకూలంగా రాసిన పదాలూ చూశాం, వీళ్లెంత..? హైదరాబాద్ రోడ్లపై నూనె ఒలికితే ఎత్తుకునేంత నునుపుదనం చూశాడు గోరటి… సుద్దాల, గోరటి […]
గల్ఫ్ నుంచి ఘర్ వాపస్..! వలస సమస్యలపై ఈనాడులో ఓ గుడ్ స్టోరీ..!
నిజానికి ఈనాడు ఎప్పుడైతే చప్పిడి పథ్యం వార్తలకు పరిమితం అయిపోయిందో… ఆ పత్రిక చదవబుద్ధి కావడం లేదు… పైగా అనేక ప్రొఫెషనల్ తప్పులు కూడా సాధారణమైపోయాయి… కానీ ఆ చీకట్ల నడుమ కూడా కొన్ని మెరుపులు… చుక్క తెగి రాలిపడ్డట్టు… అభినందించాలి… సోది, సొల్లు వార్తల నడుమ ఓ కొత్త యాంగిల్, ఓ కొత్త స్టోరీ కనిపించినప్పుడు తప్పకుండా అభినందించాలి… ఇది అలాంటి వార్తే… నిజానికి నమస్తే తెలంగాణకు ఈ వార్త దొరికితే… ‘‘తెలంగాణ వస్తే ఏమొస్తది […]
అస్త్రసన్యాసం కాదు..! ఆయుధాలన్నీ విరగ్గొట్టి తరిమేయబడింది ఆమె..!!
‘‘శశికళ అస్త్రసన్యాసం’’……. దాదాపు అన్ని పత్రికలు, టీవీలు ఇదే హెడింగుతో వార్తలు రాసుకున్నయ్… జైలుకు వెళ్లేముందు తన సహచరి సమాధి మీద అరచేత్తో చరుస్తూ… ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేసిన శశికళ కీలకమైన ఎన్నికల సమయంలో అస్త్రసన్యాసం చేయడం ఏమిటి..? చేయించబడింది… !! ఆమె చేతిలోని విల్లును, బాణాల్ని స్వాధీనం చేసుకుని విరిచిపారేశారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమెను యుద్ధరంగం నుంచి తరిమేశారు… ఎవరు..? ఇంకెవరు బీజేపీ…! నిజానికి తమిళనాడుకు సంబంధించి బీజేపీ వ్యూహాలు, ఆలోచనలన్నీ […]
అమ్మాయిలూ జాగ్రత్త… దిస్ ఈజ్ అన్ ఫెయిర్ అండ్ అగ్లీ..!
కొండ నాలుకకు మందు వేస్తే సాధారణంగా అసలు నాలుక ఊడిపోవాలి. ఎలుకతోలు తెచ్చి ఏడాదికి ఒక్కరోజు తక్కువకాకుండా ఉతికినా నలుపు నలుపుగానే ఉంటుంది కానీ- తెలుపు కాదు. కొయ్యబొమ్మను తెచ్చి ఎంతగా కొట్టినా పలకదు. ఇవన్నీ లోకంలో స్థిరమయిన అభిప్రాయాలు. ఎలుకతోలు ఏడాదిలో తెలుపుగాకపోయినా పెద్ద ఫరక్ పడదు. మనిషి తోలు నాలుగు వారాలు ఉతికితే నలుపు తెలుపవుతుందని ఒక కాస్మొటిక్ లేజర్ సర్జరీ కేంద్రం ఘనంగా, పబ్లిగ్గా ప్రకటనలు ఇచ్చుకుంది. తెలా వెలా పోయేంత తళతళలాడే […]
కలెక్టర్లు, పోలీసులు చదవాల్సిన వార్త… డిజిటల్ మీడియాపై దూకుడొద్దు…
నిజానికి ప్రింట్, టీవీ మీడియాకు సంబంధించి కొత్త ఆంక్షల మార్గదర్శకాలు గనుక జారీ అయితే ఇప్పటికే గాయి గాయి గత్తర టైపు రచ్చ జరిగి ఉండేది… జర్నలిస్టు సంఘాలు, హక్కుల సంఘాలు, పార్టీలు, ప్రతిపక్షాలు, మేధావుల సంఘాలు గట్రా భావవ్యక్తీకరణ నాశనమైపోయిందని గోల గోల చేసేవి… కానీ మొన్నామధ్య మోడీ ప్రభుత్వం డిజిటల్ మీడియాకు ఆంక్షలు, పరిమితులు, సర్కారు చర్యలు నిర్దేశిస్తూ కొన్ని కొత్త కఠిన మార్గదర్శకాల్ని (the Information Technology (Intermediary guidelines and Digital […]
ఫేస్బుక్ ఫోటో డౌన్లోడ్… ఆమెకే బర్త్‌డే విషెస్… కేసుపాలై కటకటాల వెనక్కి…
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ప్రపంచం కదా… ఎవరికైనా బర్త్‌డే, మ్యారేజ్‌డే గట్రా విషెస్ చెప్పాలంటే…. వాళ్లు ఏయే వాట్సప్ గ్రూపుల్లో ఉన్నారో వాటిల్లో శుభాకాంక్షలు పోస్ట్ చేస్తుంటారు… ఫేస్ బుక్‌లో పోస్ట్ పెడతారు… మామూలుగా విషెస్ చెబితే ఏం బాగుంటుంది…? అందుకని ఇమోజీలు, జిఫ్‌లు, చిన్న వీడియోలు, గ్రాఫిక్స్ వెతికి మరీ యాడ్ చేస్తుంటారు… వాళ్ల ఫోటోలు పెడతారు… ఫోటోలు సమయానికి దొరక్కపోతే వాట్సప్ నుంచో, ఫేస్ బుక్ నుంచో డౌన్ లోడ్ చేసి మరీ పోస్టులకు […]
దటీజ్ కేసీయార్… తన సొంత పీఆర్వోనే నిర్దాక్షిణ్యంగా ఉరితీసేశాడు…
దటీజ్ కేసీయార్… ఒక చక్రవర్తి… తనకు ప్రేమ కుదిరితే… తనను ఎవరైనా బాగా భజిస్తే, తన మీద పుస్తకాలు రాస్తే… పెద్ద కిరీటం పెట్టి, చంకకెక్కించుకుంటాడు… వైరాగ్యం కుదిరితే విసిరి, పాతవన్నీ మరిచి నిర్దాక్షిణ్యంగా రెక్కలు కత్తిరించి, ఓ పాడుబడిన బావిలో పడేస్తాడు… మహా నిష్కర్షగా ఉంటాడు… ఆలె నరేంద్ర, విజయశాంతి, డి.శ్రీనివాస్… ఎన్నో ఉదాహరణలు… నువ్వు ఏం సంపాదించుకుంటున్నవ్, ఏం వేషాలు వేస్తున్నావ్ అనేది ఒక దశ వరకూ ఆయన పట్టించుకోడు… కానీ తనకు కోపం […]
సైనా నెహ్వాల్..? సానియా నెహ్వాల్..? బయోపిక్ తప్పుపై నెటిజనం కబడ్డీ..!!
దర్శకుడు ఏది చూపిస్తే అది కళ్లప్పగించి చూస్తూ, విజిళ్లు వేసే తరం కాదు ఇది… ప్రతిదీ నిశితంగా పరిశీలించి, తప్పుల్ని సోషల్ బజారున నిలబెట్టి ఉతికేసు కాలం ఇది… అందుకే నిర్మాతలు, దర్శకులు కథ ఎంపిక, పోస్టర్ రిలీజ్, ట్రెయిలర్ రిలీజ్ దగ్గర్నుంచి సినిమా రిలీజయ్యేదాకా ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి… అవసరమైతే రీషూట్ కూడా చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నయ్… ప్రత్యేకించి బయోపిక్స్ తీసేవాళ్లు ఒకటికి వందసార్లు చెక్ చేసుకోవాలి… ఎందుకంటే, ప్రేక్షకుడు ఒరిజినల్‌గా […]
ఆన్‘లైన్’ తప్పిన చదువులు… చక్కబడే ‘సిగ్నల్సే’ కనిపించవు…
సిగ్నల్ లేని ఆన్ లైన్ చదువులు! —————— పాడు కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. నెలలు దాటి, సంవత్సరం దాటినా కరోనా బాధ తప్పింది అని చెప్పడానికి లేదు. వ్యాక్సిన్ లు వచ్చినా ఏవో అనుమానాలు అలాగే ఉన్నాయి. మాస్కులు తొలగలేదు. కేసులు వస్తూనే ఉన్నాయి. కొత్త స్ట్రెయిన్ ఉత్పరివర్తనల వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా దెబ్బలు అందరికీ తగిలాయి. అన్ని రంగాలకు తగిలాయి. విద్యారంగానికి కరోనా కొట్టిన దెబ్బ చిన్నది కాదు. ఆన్ […]
చివరకు పీకే కూడా..! రూపాయి జీతం అంటేనే ప్రపంచంలోకెల్లా బిగ్గెస్ట్ జోక్…
అది అసలే కాంగ్రెస్ ప్రభుత్వం… ఏదయినా చేయగలదు… కానీ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తే మటుకు ఆయన నైతికంగా ఓ వంద మెట్లు దిగిపోయినట్టే..! విషయం ఏమిటయ్యా అంటే… గత ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం కోసం పీకే టీం పనిచేసింది కాబట్టి, పార్టీ గెలిచింది కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కూడా పీకే టీంతో ‘‘ఎన్నికల పని’’కి ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం అమరీందర్‌సింగ్ నిర్ణయం తీసుకున్నారట… ఏకంగా కేబినెట్ హోదా […]
టార్గెట్ అంబానీ…! కేవలం మనీ కోసమేనా..? అంతటి మొసాద్‌కూ చిక్కని క్లూ..!!
మన దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు బోలెడు… కానీ ఈ కొత్త గ్రూపు ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు… చివరకు ప్రపంచంలోకెల్లా నొటోరియస్ స్పై ఏజెన్సీగా ముద్రపడిన ఇజ్రాయిలీ మొసాద్ సైతం ఇప్పటికీ ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది… ఈ కొత్త గ్రూపు పేరు జైష్-ఉల్-హింద్… మొన్న రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం ఆంటీలియా ఎదుట ఓ వాహనం దొరికింది… అందులో డిటనేటర్లున్నయ్… అంబానీ, ఆయన భార్య పేరిట ఓ బెదిరింపు లెటర్ […]
కాక పెరుగుతోంది..! కానీ ఎవరు గెలిస్తే ఎవరికేం ఫాయిదా..?!
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ప్రచారంతో రాజకీయాలు కాస్త హీటెక్కాయి… మొత్తం వోటర్ల సంఖ్యే పది లక్షలు… కానీ రాజధాని సహా ఆరు జిల్లాల్లో పాలిటిక్స్ కాక పెరుగుతోంది… మీడియాలో, సోషల్ మీడియాలో వాగ్వాదాలు, అభియోగాలు, ఆరోపణలు, దాడులు, ఎదురుదాడులు జోరుగా సాగుతున్నాయి… మరో రెండు వారాలు ఇదే పోకడ తప్పదు… ‘‘పట్టభద్రుల సమస్యలు తీర్చాలంటే మాకే మీ వోటు… ఉద్యోగుల కష్టాలను గట్టెక్కించాలంటే మా అభ్యర్థే గెలవాలి… పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఇక్కట్లపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే […]
పాకిస్థాన్‌కు మోడీ రహస్య సందేశం… ఒకేమాట… అంతే, అభినందన్ వచ్చేశాడు…
అభినందన్… సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ ఓ నేషనల్ హీరో… శత్రుదేశం బేషరతుగా తమకు చిక్కిన ఓ గగన సైనికుడిని భద్రంగా మనకు అప్పగించిన క్షణం… ఆ మెలితిరిగిన మీసాలు మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తించిన సందర్భం… అందరికీ ఇప్పటికీ ఓ మిస్టరీయే… సాధారణంగా దేశాల నడుమ యుద్ధంలో సైనికులు పట్టుబడటం, వాళ్లను జైళ్లలో వేసి చిత్రహింసలు పెట్టడం పరిపాటే… ఇండియా సాగించిన బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ ఓ యుద్ధమే… […]
సెక్యులర్ వాద్రా..! అయోధ్య చందాలపై వింత వ్యాఖ్యలు, విడ్డూరపు బాష్యాలు…
పదేళ్లపాటు ఈ దేశ అల్టిమేట్ రాజకీయాధికారాన్ని శాసించిన మహిళకు అల్లుడు… కాబోయే ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులతో భావించబడే ఓ నాయకుడికి స్వయానా బావ… అవసరమైతే మరో ఇందిరాగాంధీ కాగలదని కీర్తించబడే ఓ యువతికి భర్త…. మరి అంతటి విశిష్ట వ్యక్తి ఆలోచనలు, అడుగులు కాస్త పరిపక్వంగా ఉంటాయని అనుకుంటాం కదా… కానీ రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ఓ వార్త చదివితే… ఓహ్, ఈయన కూడా రాహుల్ గాంధీకి సరైన బావ అనిపించాడు… నిజానికి ఈ వార్త చాలా […]
మామాఅల్లుళ్లకు అవమానమే..! ఐతేనేం, తమ్ముళ్లకు నమ్మకం పోతోంది మరి..!!
ఆంధ్రజ్యోతి న్యూస్ సైటులో ఒక వార్త… కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును కార్యకర్తలు ఓ కోరిక కోరారు… కాదు, డిమాండ్ చేశారు… ఏమనీ అంటే..? ప్రచారానికి జూనియర్ ఎన్టీయార్‌ను తీసుకురావాలి అని..! ఇలాంటి డిమాండ్తు అప్పుడప్పుడూ తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నయే కాబట్టి ఇందులో పెద్దగా కొత్త వార్తావిశేషం ఏమీ లేదు అనుకోవాలి… కాన చంద్రబాబు మౌనంగా తలూపాడు అని ఆ వార్తలో ఉన్న వాక్యమే కాస్త నవ్వు పుట్టించింది… ఎందుకంటే..? చంద్రబాబు ఆదేశించగానే జూనియర్ ఎన్టీయార్ […]
హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
జులై 2018… ఫిన్లాండ్… పరుగుకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి పోటీ… అనూహ్యంగా ఓ ఇండియన్ అథ్లెట్… పేరు హిమాదాస్… ఒక విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టింది… బహుమతి ప్రదానం వేళ, జనగణమన గీతం వినిపిస్తుంటే, గెలిచిన ఆనందాన్ని, ఎమోషన్‌ను ఆపుకోలేక కన్నీరు కార్చేసింది… అది నటన కాదు… గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఉద్వేగం… ఒక విశ్వవేదిక మీద స్వర్ణం గెలిచిన హిమదాస్‌ను, ఆమె కన్నీళ్లను చూసి జాతితోపాటు జాతి కూడా కదిలిపోయింది, గర్వించింది… మనసారా చప్పట్లు కొట్టి […]
లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
సాధారణంగా లెఫ్ట్, బీజేపీ అంటేనే ఉప్పూనిప్పూ టైపు కదా… సహజంగానే ఒకటి కుడి, ఒకటి ఎడమ… అనేకానేక రాజకీయ అంశాల్లో ఒకటి తూర్పు, ఒకటి పడమర… ఎరుపుకూ కాషాయానికీ ఎప్పుడూ పడదు… ఇలా చెప్పుకుంటూ పోతే ఒడవదు, తెగదు… అంత వైరుధ్యం… రాజకీయ ప్రత్యర్థి అనే స్థాయిని కూడా దాటేసిన వైరం… కేరళలో కసకసా నరుక్కోవడమే… బెంగాల్లో కూడా గతంలో అలాగే ఉండేది … కానీ ఇప్పుడు విశేషం ఏమిటంటే..? ఆ రెండూ కలిసి పనిచేస్తున్నాయి… లెఫ్ట్, […]
- « Previous Page
- 1
- …
- 135
- 136
- 137
- 138
- 139
- …
- 146
- Next Page »