రాజకీయాలు అంటే ఏమిటి..? విలువలు కాదు, లెక్కలు… అధికారం కోసం మనిషి కానీ, పార్టీ కానీ వేసుకునే లెక్కలు… ‘‘అది రమ్మంటే రాదురా సెలియా, దాని పేరే సారంగదరియా’’ అన్నట్టుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నా సరే, తిరుపతిలో జనసేన మద్దతు కోసం ఇంతటి జాతీయ పార్టీ అర్రులు చాస్తున్నదంటే దానికి ఆ లెక్కలే కారణం… ప్రేమలు, అభిమానాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, నిబద్ధతలు, మన్నూమశానం, తొక్కాతోలూ ఏమీ ఉండవ్… బాబ్బాబూ అంటూ ఒక్క ఏడెనిమిదేళ్లయినా ఒక్క సీటుకూ కొరగాని […]
బీజేపీ లెక్కను మార్చింది..! లంబాడాల కోపాన్ని చల్లార్చడమే ఇక తొలి పరీక్ష..!!
సాగర్ ఉపఎన్నిక రక్తికడుతోంది… అనూహ్యంగా బీజేపీ ఓ బంజారా వైద్యుడిని తమ అభ్యర్థిగా తెర మీదకు తీసుకురావడమే కారణం… నిజానికి తెలంగాణ రాజకీయాల్లో కులం మరీ ఏపీ రాజకీయాల స్థాయిలో ప్రధానపాత్ర పోషించదు… కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఆసక్తికరమైన కుల సమీకరణాలకు తెరతీసింది… ముందుగా బీజేపీ సంగతి చెప్పుకుని, మిగతా విషయాల్లోకి వెళ్దాం… గతంలో పోటీచేసిన నివేదిత మళ్లీ నామినేషన్ వేసింది… తనకు రాష్ట్ర పార్టీలో ఓ సెక్షన్ బలమైన మద్దతు ఉంది… ఇక బీఫాం సబ్మిట్ […]
సాగర్ ఉపఎన్నిక… KCR ఎంపికలో ఎత్తుగడ… BJP ఓ స్ట్రాటజీ తప్పింది…
సేమ్, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో పీవీ బిడ్డ వాణిదేవి ఎంపికలాగే… నాగార్జునసాగర్ ఉపఎన్నిక విషయంలోనూ కేసీయార్ తెలివైన ఎత్తుగడ వేశాడు… నోముల నరసింహయ్య కొడుకు భగత్ ఎంపిక కేసీయార్ కోణం నుంచి కరెక్టు… 1) మరీ దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యకు పెద్దగా చదువు లేదు, మాట్లాడలేదు, ఆమెను పక్కన నిలబెట్టుకుని, హరీష్‌రావు తనే పార్టీ అభ్యర్థి తనే తరహాలో కష్టపడాల్సి వచ్చింది… కానీ సాగర్‌లో భగత్ B.E., M.B.A., L.L.B, L.L.M… ఆల్రెడీ రాజకీయ వ్యవహారాలు, ఎన్నికల […]
జై గోమాత..! ఆవు పేడతో అన్నదాతకు ఓ కొత్త ఆర్గానిక్ దశ, అనువైన దిశ..!
గోపంచకం తాగితే సకల అరిష్టాలు, పాపాల నుంచి విముక్తి…. గోమూత్రం నుంచి బంగారం లభించును… గోమలం నుంచి కరోనా మందు తయారు చేయవచ్చును… గోవు మెడలు నిమిరితే బీపీ, స్ట్రెస్ నుంచి మోక్షం………….. ఇలా గోమాత గురించి గోప్రేమికులు నానా వ్యాఖ్యలూ చేస్తుంటే చాలామందిమి నవ్వుకున్నాం, ఇంకా ఏ లోకంలో ఉన్నారురా భయ్ మీరు అని వెక్కిరించాం… గతంలో గోమాంసం తినేవాళ్లట యోగులు, రుషులు గట్రా అంటే కుపితులమయ్యాం… చివరకు గోవులు కూడా బీజేపీ పార్టీయే అని […]
బీజేపీని తిట్టిపోసే సెక్యులర్ పార్టీలు… ఆ పాతివ్రత్యానికి కట్టుబడి ఉన్నాయా..?!
కొన్ని నిజాలు ఇలాగే నిష్ఠురంగానే ఉంటయ్… ఈ బీజేపీ మతతత్వ పార్టీ, అది అంటరాని పార్టీ అని కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇతర భావసారూప్య పార్టీలు తెగ ముద్రలు వేసేస్తుంటయ్ కదా… ఒంటి మీద బొచ్చెడు సెక్యులర్ బట్టలున్నట్టు కనిపిస్తుంటయ్ కదా… వోకే, బీజేపీ మతఛాందస పార్టీయే… ఈ పార్టీలన్నీ దానికి దూరంగా ఉండి, ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలని కంకణాలు కట్టుకున్నయ్… గుడ్… కానీ మరి ఈ నీతులు చెప్పే పార్టీలు మతఛాందస పార్టీలన్నింటితోనూ ఇదే వైఖరి […]
సత్తెనాశ్… ఇక పోతుకణాల్లేవ్, అంగస్థంభనల్లేవ్, పిండస్థాపనల్లేవ్, ‘ఆ పనే’ లేదుపో…
అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? మగాళ్ల మర్మాంగాలు మరో పాతికేళ్లలో జీరో సైజుకు కుంచించుకుపోతయ్… మనిషి వీర్యంలోని పోతుకణాలు కూడా అంతరించిపోతయ్… మగాళ్లకు అంగస్తంభనలుండవ్, లైంగిక కోర్కెలుండవ్… అసలు మగాడి మగతనమే కాలగర్భంలో కలిసిపోయి, ఉత్త విగ్రహపుష్టి ఆకారాలు మాత్రమే మిగులుతయ్… అంతేకాదండోయ్, ఆడాళ్లకూ అండగ్రహణాలు… పిండదరిద్రాలు… ఆళ్లకూ కోర్కెలుండవ్… మరిక ఆ సంభోగ యాగాలు ఎట్లా..? పిల్లాజెల్లా పుట్టుడెట్లా..? అసలు తిండి, బట్ట, నిద్ర, కొంప… తరువాత మనిషి ధ్యాస, యావ, రంది, ఆశ మొత్తం […]
ఎడిటర్ గెలిచింది… భావప్రకటన స్వేచ్ఛ నిలిచింది… మరో ఇంట్రస్టింగ్ కేస్..!
క్రిమినల్ కేసులు పెడుతూ… భావప్రకటన స్వేచ్ఛను హరించకండిరా బాబూ అంటూ సుప్రీంకోర్టు ఓ మహిళా జర్నలిస్టుపై పెట్టిన కేసుల్ని శుక్రవారం కొట్టిపారేసింది… భావవ్యక్తీకరణ హక్కు దిశలో మరో ఇంట్రస్టింగ్ కేసు ఇది… ఎందుకంటే..? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జర్నలిస్టుపై పెట్టిన కేసును హైకోర్టు సమర్థించగా, సుప్రీం మాత్రం ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేసింది… నిజానికి ఆమెపై పెట్టిన కేసు జర్నలిజానికి సంబంధం లేదు… సోషల్ మీడియా పోస్టు… అంటే ఈ కేసును సోషల్ మీడియా ప్లస్ జర్నలిజం […]
తెలుగు పత్రికల సంపాదకులు కొమ్ములతో పొడుచుకుంటున్నారు..!!
నిన్న చెప్పుకున్నాం కదా… తెలుగు మీడియా వార్ చివరకు సంపాదకీయాలు, సంపాదక పేజీ వ్యాసాల దాాకా విస్తరించిందని..! సంపాదకులకు రంగులు పూసేదాకా వెళ్లిపోయింది పరిస్థితి… తెలంగాణ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ పట్టభద్రులకు కొమ్ములు ఉంటాయా అని రాసుకొచ్చాడు… దానికి నమస్తే తెలంగాణలో పట్టభద్రులకు కొమ్ములుంటయ్ అని కౌంటర్ రాయించారు… ఈ కౌంటర్ల పంచాయితీ ఏమిటో, తెలుగు మీడియాలో ఈ వార్ నేపథ్యమేమిటో ‘ముచ్చట’ నిన్నటి కథనంలో చెప్పింది… ఈ పంచాయితీలోకి మరో […]
జ్యోతి Vs నమస్తే… ఒక్క అక్షరం కూడా పైనపడటానికి వీల్లేదు… కడిగేస్తాం, అంతే…
మామూలుగా కార్పొరేట్ కంపెనీల మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది..? చౌక ఉత్పత్తి వ్యయం, ఎక్కువ ఉత్పత్తి, మంచి మార్కెటింగ్, బెటర్ లాభాల మీద ఉంటుంది కదా… మరి అచ్చం కార్పొరేట్ కంపెనీల్లాగే నడిచే మీడియా వ్యాపారంలో ఎలాంటి పోటీ ఉంటుంది..? సేమ్.., బెటర్ సర్క్యులేషన్, మంచి వార్తలు, గుడ్ ప్రజెంటేషన్ వంటి అంశాల్లో పోటీ పడతాయా..? హహహ… కాదు, అసలే కాదు… మీరు తప్పులో కాలేశారు… పత్రికలు… ప్రత్యేకించి తెలుగు పత్రికల నడుమ పోటీ అలా ఉండదు… […]
పర్ సపోజ్… నిర్మలమ్మ ఆ జీఎస్టీ రద్దు చేసిందనే అనుకుందాం… మరి..?!
ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే… ఎవరు కుర్చీల మీద కూర్చుని సమాజాన్ని ఉద్దరిస్తున్నా సరే….. తిరుమల శ్రీవారికి చేసేదేమీ ఉండదు, పైగా దేవుడి ఆదాయాన్ని రకరకాలుగా దోచుకుని తినడం తప్ప..! వాటికన్ సిటీ… అక్కడి దాకా ఎందుకు..? స్వర్ణదేవాలయం వెళ్లి, ఈ సోకాల్డ్ తిరుమల ఉద్ధారకులు రెండు రోజులు పరిశీలించి వస్తే చాలు… తిరుమల ఏడు కొండలనూ, తిరుమల దేవాలయాన్ని ఎంత అద్భుతమైన హిందూ క్షేత్రంగా చేయవచ్చో అర్థమవుతుంది… కానీ ఎవరూ చేయరు… చేస్తే పొలిటిషియన్స్ […]
కత్తి రత్నప్రభ తిరుపతి అభ్యర్థిత్వంపై కత్తి మహేష్ ఏమంటాడంటే..?!
……By…. Mahesh Kathi……………… కత్తి రత్నప్రభ గారు నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిణిగా రాణించారు. దళితజాతికి ఎంతో సేవచేసిన కత్తి చంద్రయ్యగారి వారసురాలు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దిగడం వ్యక్తిగతంగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం. కాకపోతే దీని వెనకాల ఉన్న స్ట్రాటజీని కొంత గమనించాల్సిన అవసరం ఉంది. జగన్ పైన పెట్టిన కేసుల్లో,రత్నప్రభ గారికి కూడా కోర్టు నోటీసులో జారీచెయ్యడం. తరువాత కేసు కొట్టివేయ్యడం జరిగింది. కాబట్టి రత్నప్రభ గారికి జగన్ […]
‘‘షేపులు మారిపోయి… మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా బలిసిపోతున్నారు…’’
ఒకరు… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీజేపీ… రిప్డ్ జీన్స్ మీద నోరు పారేసుకుంటాడు… మరొకరు… బెంగాల్లో ప్రముఖ లీడర్, బీజేపీ… పొట్టి నిక్కర్లు వేసుకో అని ముఖ్యమంత్రి మమతను వెక్కిరిస్తాడు… ఆగండాగండి… బీజేపీయే కాదు, స్త్రీల మీద వెకిలి కామెంట్లు చేసే రోగం అన్ని పార్టీల్లోనూ ఉన్నదే… తాజా ఉదాహరణ కావాలా..? ఇది మరీ బీజేపీ లీడర్ల వాచాలత్వాన్ని మించిన చిల్లరతనం… డీఎంకే లీడర్ ఆయన… పార్టీ ప్రచార కార్యదర్శి కూడా… పేరు దిండిగల్ లియోనీ… కోయంబత్తూరులో […]
ఐపోయిందా..? జగన్ మళ్లీ జైలుకేనా..? బీజేపీతో దోస్తీ చెడిపోయినట్టేనా..?!
ఒక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రమణ మీద… తన సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, అదీ కులరాజకీయాల్లో కంపుకొడుతున్న ఒక రాష్ట్రం నుంచి… తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు సన్నిహితుడు అని ఆరోపణల్ని వ్యాప్తి చేస్తున్న స్థితిలో………. అదే జడ్జిని భావి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించే స్థితి వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఖచ్చితంగా ఓ డిబేటబుల్ సబ్జెక్టు…. కానీ ఎప్పుడైతే సుప్రీం అంతర్గత విచారణలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చి, సదరు […]
తమిళనాట మూలిగే బీజేపీపై కొత్తగా శ్రీలంక దెబ్బ… కుయ్యో మొర్రో…
మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే…! అసలే తమిళ రాజకీయాల సంక్లిష్టత అర్థం చేసుకోలేక… చిత్రవిచిత్ర సమీకరణాలతో ఆడుకుని, తీరా తను ఆశించిన ఏ సానుకూలతా ఇప్పుడు కనిపించక మూలుగుతున్న బీజేపీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ అంశంతో మరింత దిక్కుతోచని స్థితి ఏర్పడింది… నిజానికి ఇదొక ఇంట్రస్టింగు డిబేట్… జయలలిత మరణించాక, శశికళను జైలుకు పంపించేశాక, ఇప్పటికీ ఆమెను రాజకీయ చట్రం నుంచి బయటికి తరిమేశాక, రజినీకాంత్‌ను దూరం కొట్టేశాక… ఇప్పుడు బీజేపీకి కనిపించే పరిస్థితి […]
సుప్రీం సీజేగా త్వరలో జస్టిస్ రమణ..? జగన్‌కు షాకేనా..? ఆ ఫిర్యాదు బుట్టదాఖలేనా..?
మండలి రద్దు, పార్లమెంటు వోకే చెప్పాలి……… నో, చెప్పలేం, చెప్పబోం స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డకు షాక్ ఇవ్వాలి…. నో, ఇవ్వలేం, ఇవ్వబోం ప్రత్యేక హోదాపై ఓ క్లారిటీ ఇవ్వాలి… నో, హోదా ప్రసక్తే లేదు. ఇవ్వలేం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు… నో, అమ్మేసి తీరతాం, రాజీ పడబోం …… కనీసం ఆ జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీం చీఫ్ జస్టిస్ కానివ్వొద్దు, తన ప్రభావం మా హైకోర్టు మీద విపరీతంగా ఉంది, భూముల స్కాములు మన్నూమశానం చాలా […]
దండాలు సామీ..! ఖజానా ఊడ్చేసి, జీతాలిచ్చినా సరిపోదంటారేమో…!!
సాధారణంగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు… ఎందుకంటే వాళ్లతో కంటు కావడం ఇష్టం లేక… వాళ్లతో పెట్టుకుంటే నష్టం అనే భావన బలంగా ఉంటుంది గనుక..! నిజానికి కేసీయార్ పైకి ఎన్ని చెప్పినా తను కూడా అంతే కదా… 30 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు నిర్ణయాలపై అనేకచోట్ల ఉద్యోగసంఘాలు కేసీయార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు కొనసాగిస్తున్నాయి… కానీ నిజానికి పీఆర్సీ మీద వేసిన కమిటీ ఏం […]
మోడీ బంగ్లాదేశ పర్యటన..! అక్కడి నుంచి ఇక్కడి బెంగాలీ వోట్లపై వల..!!
మోడీకి స్వదేశంలో కాలు నిలవదు… గిరగిరా దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు…. ఇది కరోనాకు ముందు మాట… కరోనా ధాటికి సారు గారి విదేశీ పర్యటనలు కూడా ప్రభావితమయ్యాయి ఫాఫం… ఇప్పుడొక దేశం వెళ్లకతప్పడం లేదు… అబ్బే, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచార బిజీలో ఉన్నాడు, అటూ ఇటూ ఏం తిరుగుతాడులే అని తేలికగా తీసేస్తే ఎలా..? ఆ విదేశీ పర్యటనలోనూ తన బెంగాలీ ఎన్నికల లబ్ధి చూసుకుంటున్నాడు… అర్థం కాలేదా..? ఓ విదేశీ గడ్డ మీదకు […]
రాజు సుందరం..! జాతీయ అవార్డుకు కొత్తేమీ కాదు, అనర్హుడు కాదు… కానీ..?
ప్రభుత్వం ఇచ్చే అవార్డుల వెనుక చాలా పైరవీలు, సిఫారసులు, కొన్నిసార్లు ప్రభుత్వ పొలిటికల్ ఈక్వేషన్లు, మన్నూమశానం ఉంటయనే అపప్రథ ఉన్నదే కదా… పద్మపురస్కారాలూ అంతే… అయితే ఈసారి (2019) జాతీయ సినిమా అవార్డుల్లో కంగనా రనౌత్‌కు మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఉత్తమ నటి అవార్డు వరించడం పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు… ఆమె బీజేపీ మనిషే కదా… పైగా మహారాష్ట్రలో సినిమా మాఫియా, శివసేన సర్కారుతోనూ ఫైటింగ్ చేస్తోంది… అయితే… జాతీయ ఉత్తమనటి అవార్డును పొందే స్థాయిలో […]
KCR కత్తెర నిజం… ఈటల అసంతృప్తి నిజం… ఎక్కాలు తప్పిన లెక్కలు…
ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయి… నాటి ఉద్యమ వ్యతిరేకులను చేర్చుకుని, అందలాలు ఎక్కించి… దేశంలోని అనేకానేక ప్రాంతీయ పార్టీల్లాగే తన నడతను, తన నడకను ప్రజాబాహుళ్యం నిజ ఆకాంక్షలకు భిన్నంగా మార్చేసుకున్న పార్టీ టీఆర్ఎస్… ఈమాట వాళ్లో వీళ్లో కాదు, పార్టీలో ఉన్నవారే చెబుతుంటారు… అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు… ఇప్పుడు విషయం ఏమిటంటే ఈటల మళ్లీ తిరుగుబాటు స్వరం వినిపించాడు… ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ కనిపించింది… ఎప్పుడంటే..? కేసీయార్ తనను దూరం పెట్టిన […]
ఇంకా నయం… నిమ్మగడ్డ వారు ఇంటర్ పోల్ దర్యాప్తు అడగలేదు…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వారి వార్త ఒకటి చదివితే నవ్వొచ్చింది, తరువాత జాలేసింది… అవలక్షణ రాజకీయ వాతావరణం అందరినీ ప్రభావితం చేస్తుంది సహజంగానే… పైగా ప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని తెలుగు రాజకీయాలు కదా మరి… ఉద్యోగధర్మంగానే కావచ్చుగాక, తెల్లారిలేస్తే రాజకీయ నాయకులతో తిరిగీ తిరిగీ బ్యూరోక్రాట్లు కూడా అలాగే తయారవుతున్నట్టున్నారు… ఈమధ్య ప్రతి చిన్న విషయానికీ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేయడం ఓ అలవాటుగా మారిపోయింది రాజకీయ నాయకులకు… అక్కడికి సీబీఐ అంటే ఆకాశం నుంచి […]
- « Previous Page
- 1
- …
- 136
- 137
- 138
- 139
- 140
- …
- 149
- Next Page »