ఖచ్చితంగా మీడియా సర్కిళ్లకు సంబంధించి అది పెద్ద వార్తే… ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్, కాలమిస్టు, న్యూస్ యాంకర్, సీనియర్ జర్నలిస్టును సదరు ఇండియాటుడే సంస్థ హఠాత్తుగా రెండు వారాల సస్పెన్షన్, ఓ నెల జీతం కోత గట్రా సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం అనూహ్యం… సరే, ఆయన తరువాత వాళ్లతో కలిసి పనిచేస్తాడా, లేదా… ఆల్రెడీ, నీ కొలువుకో దండంరా బాబూ అని చెప్పేశాడా అనేది వేరే సంగతి… తనతోపాటు మరికొందరు జర్నలిస్టులపై పోలీసులు సీరియస్ కేసులు కూడా […]
ఆరోజు ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన యువకుడు ఎవరో తెలుసా..?
మొన్నటి ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ అనంతరం… రైతుల పేరిట సాగుతున్న ఉద్యమం అనేక మలుపులు తిరుగుతోంది కదా… ఆ ర్యాలీ సందర్భంగా మరణించిన ఆ యువకుడు ఎవరు..? అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెప్పే వివరాల ప్రకారం… ఒక యువకుడు ర్యాష్‌గా ట్రాక్టర్ నడిపిస్తూ బారికేడ్లను బ్రేక్ చేయడానికి ప్రయత్నించాడు… అది అదుపు తప్పింది… బోల్తా కొట్టింది… తనపైనే పడింది… అక్కడికక్కడే తను మరణించాడు… ఇక ఇలాంటి ఒక సంఘటన జరగాలని కాచుక్కూచున్న సెక్షన్ వెంటనే రంగంలోకి […]
మనోభావాలు..! ఆ ‘మంత్రం’ వేస్తే చాలు… వర్కవుటయ్యే మాంచి దందా…
ఒక మహిళ వక్షోజం బొమ్మను గనుక చూపిస్తే…. ఒక పిల్లాడికి అమ్మ స్తన్యం గుర్తురావొచ్చు… ఒక యువకుడిని శృంగార భావనలు చుట్టుముట్టవచ్చు… ఓ డాక్టర్‌కు బ్రెస్ట్ కేన్సర్, ఒక బట్టల వ్యాపారికి ఆమె బ్రా సైజు, ఓ ప్లాస్టిక్ సర్జన్‌కు ఆ షేపులో సరిచేయాల్సిన అంశాలు…. రకరకాలు… చూసే వ్యక్తుల భావనాస్థితిని బట్టి…! మన చూపుల్ని బట్టి కాదు, బుర్రలో ఉన్న ఆలోచనల్ని బట్టి ఒకే చిత్రం వేర్వేరుగా కనిపించవచ్చు… పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా […]
రాజదీప్ సర్దేశాయ్పై ఇండియాటుడే ఫైర్… ఇదొక ఇంట్రస్టింగ్ లెసన్…
నిజానికి ఇది చాలా కోణాల్లో ఇంట్రస్టింగు వార్త… ఓ పెద్ద సీనియర్ జర్నలిస్టు, చాలాచాలా కీలకమైన పొజిషన్లలో పనిచేసి… ఓ తప్పుడు ట్వీట్ వదిలినందుకు, నిర్ధారించుకోకుండా జనంలోకి ఓ తప్పుడు వార్తను పంపించినందుకు ఓ అవమానకరమైన శిక్షకు గురికావడం..! విషయం ఏమిటంటే..? (ది వైర్ వెబ్సైట్ ట్వీట్ ప్రకారం)… రాజ్‌దీప్ సర్దేశాయ్ తెలుసు కదా… దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో తనూ ఒకడు… కాస్త దూకుడు ఎక్కువ… యాంటీ బీజేపీ జర్నలిస్టు… ఆయన భార్య సాగరిక ఘోష్ అయితే […]
స్కిన్‌టుస్కిన్..! సేమ్ కోర్ట్… సేమ్ పోక్సో… సేమ్ జడ్జి… సేమ్ తీర్పు…
‘‘స్కిన్‌టుస్కిన్’’ అనే బాంబే హైకోర్టు తీర్పు మీద దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది తెలుసు కదా… నేరుగా దేహాన్ని తాకకుండా ఆడపిల్లల లైంగిక సంబంధ శరీరభాగాలను పట్టుకున్నా, ఏం చేసినా అది పోక్సో పరిధిలోకి రాదు అనే అర్థమొచ్చేలా ఆ తీర్పు ఉంది… ఈ తీర్పు మొత్తం పోక్సో చట్టం స్పూర్తికే విరుద్ధంగా ఉందనీ, ఇదొక తప్పు ఆనవాయితీకి దారితీస్తుందనీ చెప్పిన అటార్నీ జనరల్ అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే ఇచ్చింది… ఆ మహిళా జడ్జే […]
ఆహా మోడీజీ… సూపర్… ఏమైనా విజయోత్సవాలు ప్లాన్ చేద్దామా సార్..?
అప్పట్లో కేసీయార్ అనేవాడు… ఈ మోడీకి ప్రజలతో కనెక్ట్ కావడం తెలియదు అని..! ఆఁ చెప్పొచ్చాడులే, తను జనంతో పెద్ద కనెక్ట్ అయినట్టు, తనూ తన మాటలు అని ఆక్షేపించకండి… మోడీకి జనాన్ని ప్రేమించడం తెలియదు… సగటు పేద, మధ్యతరగతి మీద భారం తగ్గించడానికి ఏం చేయాలి అనే కోణంలో ఏమీ ఆలోచించడు… అవసరమైతే మళ్లీ నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఆర్థికవ్యవస్థను ఒక్క పోటు పొడిచేయగలడు… నాది తప్పయితే నన్ను ఉరితీయండి అంటూనే జనం జేబులు […]
ఇక ప్రతి గొర్రెకూ డైపర్ కట్టాల్సిందేనా సార్..? మరేం చావమంటారు..?!
Srinivas Sarla………………. నిన్న ఒక సెక్రటరీ ఆవేదన విన్న తరువాత నౌకరి చేయాలంటేనే భయంగా ఉంది.. ప్రతి నెల స్టేట్ నుండి స్పెషల్ ఆఫీసర్లు విలేజ్ లు పర్యటించి శానిటేషన్ పనులు చూసి మార్కులు వేస్తారు.. అందులో భాగంగా నిన్న ఒక ఊరికి స్పెషల్ స్క్వాడ్ వచ్చింది… పాపం, అక్కడ సెక్రటరీ సిబ్బందికి చెప్పి, పొద్దున 7 గంటలకు ఆ రోజు ఆన్ లైన్ లో వచ్చిన ఆ ఊరి ఇంటర్నల్ రోడ్డు సార్టింగ్ పాయింట్ ఎండింగ్ […]
ఈ మేనిఫెస్టో చదివితే… బాబుపై మళ్లీ మళ్లీ జాలేస్తోంది నిజంగానే..!
పేరుకు పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినా… పార్టీపరంగానే జరుగుతయ్, జరుగుతున్నయ్…! మనం బతికే హిపోక్రటిక్ సొసైటీలో, సిస్టంలో మరో భ్రమాత్మక నిజం ఇది… నిజంగా పార్టీ రహిత ఎన్నికలు అని ఎవరైనా భ్రమపడితే, ఎవడైనా ప్రకటిస్తే అది వాడికే వదిలేద్దాం… పార్టీపరంగా సాగే ఎన్నికలే కాబట్టి ఒక పార్టీగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… ఒక రాజకీయ పార్టీగా అది తనిష్టం… చిన్న చిన్న విషయాలకే పెద్ద హంగామా, హైపూ క్రియేట్ చేసే అలవాటున్న […]
వీడొక చార్లెస్ శోభరాజ్ సరే… మన వ్యవస్థల నలుపు మాటేమిటి మరి..!!
జర్నలిస్టులే కాదు, నాన్-జర్నలిస్టులకూ ఇది ఓ మంచి వార్తే… ఎందుకంటే, భార్య తనను వదిలేసిందనే ఫ్రస్ట్రేషన్లో ఒక భర్త ఉన్మాదిగా మారి, ఒంటరిగా కనిపించిన మహిళలను ఆకర్షించి, ఎక్కడికో తీసుకుపోయి, హతమార్చే సైకో బాపతు వార్త ఇది… సాధారణంగా సైకో దర్శకులు తీసే థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి కేరక్టర్లు కనిపిస్తాయి… నిజజీవితంలో కొందరు ఇలా తారసపడతారు… గుడ్, పోలీసులు పట్టుకున్నారు, మీడియా మీట్ పెట్టారు, ఐడెంటిఫికేషన్ ఇష్యూస్ రాకుండా ఓ ముసుగు కప్పేసి విలేకరుల ఎదుట ప్రజెంట్ […]
‘తమ్ముడి’ వెంట ‘అన్నయ్య’..!! జైజై లక్ష్మణా అని శ్రీరాముడి నినాదాలు..!!
ఔనా..? పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టుకున్నాక ఎప్పుడూ చిరంజీవితో అవసరం పడలేదు… ఆ పాత ప్రజారాజ్యం ఫార్మాట్‌నే ఇష్టపడలేదు… నాడు తన అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకోవడమే తనకు ఇష్టం లేదు… అందుకని తన పంథాలో తను వెళ్తున్నాడు… మరి హఠాత్తుగా పవన్ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీస్సులు, నైతిక మద్దతు ఎందుకు కావల్సి వచ్చినయ్…? అన్నగారి అండ ఎందుకు అవసరపడింది..? ఇది ప్రశ్న… పెద్ద ప్రశ్నే… లెఫ్ట్, టీడీపీ, బీఎస్పీ వగైరా అన్నీ […]
‘ఉపా’ద్రవం..! ఈ ఆదివాసీ పోరాట మహిళను ఆ చట్టమే మింగేసిందా..?
చంద్రాపూర్ జిల్లా… ఆమె పేరు కంచన్ నాన్నావరె… 2014లో పోలీసులు అరెస్టు చేశారు… మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణ… వయస్సు 38 ఏళ్లు… ఆదివాసీ… ఉపా చట్టాన్ని ప్రయోగించారు… ఎరవాడ సెంట్రల్ జైలులో పడేశారు… టాడాలు, పోటాలను మించిన నల్లటి చట్టం కదా ఉపా అంటే… అసలు మన జైళ్ల సంగతి తెలుసు కదా… ఆమెకు పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధి ఏదో ఉంది… దీనికితోడు జైలు వాతావరణం… ఆ వ్యాధి పెరిగి మెదడు దాకా ప్రభావితమైంది… ఈ […]
డెల్యూషన్స్..! ఇలాంటి వార్తలు కవర్ చేసే రోజు మళ్లీ రావొద్దు దేవుడా..!
డెల్యూషన్స్ an idiosyncratic belief or impression maintained despite being contradicted by reality or rational argument, typically as a symptom of mental disorder… డెల్యూషన్ అని టైప్ చేస్తే గూగుల్ లో వచ్చిన సమాచారం ఇది.. మానసిక శాస్త్రంలో ఇదొక తీవ్రమైన మానసిక వ్యాధి..ఈ వ్యాధి గ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.. అదే నిజమనే భ్రమలో బతికేస్తుంటారు…ఒక కొత్త లోకాన్ని ఊహించుకుని ఊహల్లో జీవిస్తుంటారు.. ………………………………………….. ఇప్పుడు […]
రోజులన్నీ ఒకేలా ఉండవ్ ద్వివేదీ… నిమ్మగడ్డకూ టైమొచ్చింది చూడు…
డెస్టినీ… పదే పదే ఈమధ్య ప్రస్తావనకు వస్తోంది అనివార్యంగా… అందుకని ఆ పదంతోనే మొదలుపెడదాం… డెస్టినీ అంటే ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది అనబడే ఉన్నతాధికారికి సరిగ్గా అర్థమై ఉంటుంది… కెరీర్లో ఎప్పుడూ మన పాత్ర ప్రస్తానం ఊర్ద్వముఖంగా సాగిపోదు ద్వివేదీ… ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే……. ఈయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రస్తుతం… మొన్న శుక్రవారం రాత్రివేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి, అక్కడ నిమ్మగడ్డ లేడని తెలిసీ ఆ వేళకే కావాలని వచ్చి, అక్కడ […]
అభీ బహుత్ పిక్చర్ బాకీ హై సర్కార్..! అసలు కథ ఇప్పుడే ఉంది…
ఇంకేముంది..? అంతా అయిపోయింది..? జగన్ రాజీపడ్డాడు… నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తాం అని చెప్పాడు… సుప్రీంకోర్టు తలంటిది కదా, ఇక తప్పలేదు… అన్ని దారులూ మూసుకుపోయాయి… కొద్దిరోజులుగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో జగన్ ఇక వెనక్కి తగ్గక తప్పలేదు… ఇక ఎన్నికలు జరగడమే తరువాయి… ఇక ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే… ఈ ఎన్నికలైపోయాక ఆయన రిటైర్ అయిపోతాడు, కథ కంచికి, మనం ఇంటికి………….. ఇలా రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు… సారీ, అసలు కథ ఇప్పుడే […]
ఈ ఫోటోల్ని ఓసారి చూడండి… అసలు హంతకులు ఎవరో మీరే తేల్చండి…
కాదు… కాదు… మీడియాలో వస్తున్న కారణాలు కాకపోవచ్చు… ఇంకేదో ఉంది… మదనపల్లెలో మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల correspondents చేసిన ఘాతుకం వెనుక అసలు కారణాలు బయటపడాల్సి ఉంది… వాళ్లిద్దరూ బాగా చదువుకున్నవాళ్లే… పదిమందికీ ఉన్నత విద్యాబద్దులు నేర్పించేవాళ్లే… మరి వాళ్ల బుద్దులే పెడదోవ పట్టి, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడపిల్లలకు బలి ఇవ్వడం ఏమిటి..? మళ్లీ బతికివస్తారని చెప్పడం ఏమిటి..? బలి నిజమే… ఘోరం నిజమే… కానీ అసలు కారణాలు, కారకులూ వేరు… అసలు హంతకులు వేరు… పోలీసులు […]
మోడీ వెరీ లక్కీ బాసూ..! రాహుల్ వంటి వింత ప్రత్యర్థి ఎవరికీ దొరకరు..!!
రాహుల్ గాంధీ చిత్రమైన వ్యక్తి…. నాయకుడు వంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరమేమీ లేదు… ఎంత చిత్రమైన వ్యక్తి అంటే…. ‘‘ఛిఛీ, ఈ మోడీ పాలన బాగాలేదు, పేదల్ని ప్రేమించలేడు, హృదయంతో పాలించలేడు, అసలు బీజేపీకి ఓ బలమైన ప్రత్యామ్నాయం అవసరం, ఈ కాంగ్రెస్ కాస్త బాగుపడితే బాగుండు, ఈ రాహుల్ బుర్ర వికసిస్తే బాగుండు’’ అని మనం పొరపాటును అనుకుంటామో లేదో… వెంటనే రంగంలోకి వస్తాడు… నో, నో… అలా ఆశలు పెంచుకోవడానికి మీరెవరు..? నాన్సెన్స్, […]
పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను చేత్తో పట్టుకుంటేనే నేరమా..? అదెలా..?!
ఒక న్యాయస్థానం తీర్పుపై అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు, నేరం కాదు… అలాగే న్యాయస్థానాలు చట్టాల అసలు స్పూర్తిని పరిగణనలోకి తీసుకోవాలే తప్ప, దాన్ని నీరుకార్చకూడదు….. ఒక పన్నెండేళ్ల బాలికపై ఓ నడివయసు పురుషుడు చేసిన అకృత్యం, దానిపై ముంబై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మీద తెలుగు సమాజంలో జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… బహుశా కోర్టు తీర్పు కదా అని తమాయించుకుంటున్నారేమో… కానీ ఒక కోర్టు చెప్పిన తీర్పు అల్టిమేట్ ఏమీ […]
తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?
నాగేశ్వర్ అభిప్రాయాలతో ఏకీభవించాలని ఏమీ లేదు… వ్యతిరేకించకూడదని కూడా ఏమీ లేదు… జీవితాంతం సీపీఎం భావజాలాన్నే అంటిపెట్టుకున్నాడు కాబట్టి తన మాటలు, తన అడుగులు, తన ఆలోచనలు ఆ రంగు, ఆ రుచి, ఆ వాసనే కలిగి ఉంటయ్… బాగా అధ్యయనం చేస్తాడు, అన్ని విషయాలపై జ్ఞానం పెంచుకుంటాడు… సంస్కారం విడిచి మాట్లాడడు… వ్యక్తిగా నాగేశ్వర్ డబుల్ వోకే కేరక్టర్… కాకపోతే ఎర్ర వోట్లే గాకుండా తటస్థుల వోట్లు కావాలనే భావనతో తటస్థుడిగానే రేప్పొద్దున ఎమ్మెల్సీ బరిలో […]
కేసీయార్ దిద్దుకోవాల్సిన పోలీస్ పాలసీ… లేకపోతే మరింత లాస్..!!
ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల బాగా వ్యతిరేకత పెరుగుతోంది… బయటికి అంగీకరించకపోయినా సరే, ఆ పార్టీ నాయకులే ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు… కేసీయార్ కూడా దిద్దుబాటలో పడ్డాడు… ఏయే అంశాల్లో తప్పులు జరుగుతున్నాయో స్వీయవిమర్శ చేసుకుంటూ, కొన్ని అడుగులు సరైన వైపు వేయడం స్టార్టయింది… కాకపోతే ఈరోజుకూ ఆయన ఫీల్డ్‌లో ఏం జరుగుతున్నదో సరిగ్గా తెలుసుకోవడం లేదు… దాంతో తను తీసుకునే కొత్త నిర్ణయాలూ పెద్ద ఫాయిదా ఇచ్చేట్టుగా లేదు… ఉదాహరణకు ధరణి… ఒక్క సబ్ రిజిస్ట్రార్‌ను అడిగినా ధరణి […]
క్షుద్ర పూజలు కాదు..! కేసీయార్ ప్రత్యేక పూజల కథ ఇదీ…!
యాగాలు, హోమాలు కేసీయార్‌కు కొత్తేమీ కాదు… తను చేసినన్ని పూజలు సమకాలీన నాయకుల్లో ఎవరూ చేసి ఉండలేదు, అంత సంకల్పం, ఆచరణ కూడా ఉన్నవాళ్లు లేరు… అంత భక్తివిశ్వాసాలు ఉన్నవాడు కాబట్టే అయుత చండీయాగం చేశాడు… తన యాగాల్లో ప్రధాన సంకల్పం శత్రువుపై విజయం..! మరి ఇప్పుడు చేస్తున్న పూజలేమిటి..? ‘‘పూజాసామగ్రిని గోదావరిలో కలపడానికే కేసీయార్ కాళేశ్వరం పోయాడు, అంతేతప్ప ఇప్పుడు అక్కడ ఆయన చూసే పనీ, చేసే పనీ ఏమీలేదు, కేటీయార్‌ను సీఎంను చేయడానికే ఈ […]
- « Previous Page
- 1
- …
- 138
- 139
- 140
- 141
- 142
- …
- 146
- Next Page »