కొన్నిసార్లు ప్రభుత్వ నిర్ణయాలు, వాటి వేషాలకంటే… వాటికి డప్పుకొట్టే వార్తలు, వాటిని పబ్లిష్ చేసే పత్రికలు, వాటి ఓనర్ల మీద జాలి ఎక్కువగా కలుగుతుంది… ఈనాడు వంటి మెగా పత్రికలు సైతం తాము ఏం రాస్తున్నామో, పాఠకులకు ఏం చెబుతున్నామో కూడా వదిలేసి, పాలకుల సొంత పత్రికలను మించి బాకాలు ఊదుతున్న తీరు జాలి గొలిపేలా ఉంటుంది… పాఠకులకు ద్రోహం చేస్తున్నామనే చింత కూడా రామోజీరావు వంటి మహా మెగా సూపర్ ప్రఖ్యాత ప్రసిద్ధ ప్రముఖ పాత్రికేయుడికి […]
చంద్రబాబే కుట్రదారుడు..! జగన్ ప్రభుత్వ తాజా అఫిడవిట్ చెప్పేది ఇదే…
అమరావతి భూకుంభకోణం లేదా ఇన్సైడర్ ట్రేడింగ్…. ఎక్కడ రాజధాని రాబోతున్నదో ముందే లీక్ చేసి, తన వారితో అడ్డగోలు తక్కువ రేట్లకు కొనుగోలు చేయించాడనేది చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం ఆరోపణ… హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో ఏం జరిగిందో పక్కన పెడితే… అమరావతి రాజధాని అనేది ఓ పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది జగన్ విమర్శ… మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడా..? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాడు అనేది కూడా కాసేపు పక్కన పెడదాం… తాజాగా […]
దటీజ్ దాస్…! కొత్త చీఫ్ సెక్రెటరీ గురించి ఎవరికీ తెలియని చిన్న కథ..!!
చాలా ఏళ్ల క్రితం… అసలే మేఘాల్లో ఉండే చలిప్రదేశం… ఓ సాయం చలికి ఊరంతా దుప్పట్లోకి దూరిపోయింది… అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఓ ఇంటిని చుట్టుముట్టారు… చేతుల్లో తుపాకులు… మాట్లాడితే అవి గర్జించడమే… వాటికి ఎదురు ప్రశ్నలు, ఎదురు జవాబులు అసలే నచ్చవు… అక్కడ వాళ్లు చెప్పిందే శాసనం… అది షిల్లాంగ్… మేఘాలయ రాష్ట్రం… ఆ ఇంట్లోని ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టారు… నిర్బంధంగా ఓచోటికి తీసుకుపోయారు… ఆయన ఓ ఐఏఎస్ అధికారి… పేరు ఆదిత్యనాథ్ దాస్… ఆ […]
జగన్‌ను జైల్లో పారేస్తానని కేసీయార్ ఎందుకు, ఏం చూపి బెదిరించాడు..?!
……. హేమిటీ, ఇదంతా నటనా..? కేసీయార్ ఆత్మీయ ఆలింగనం వెనుక ‘‘బిడ్డా, జైలులో పారేస్తా ఏమనుకుంటున్నావో, రా, వచ్చి, నా కౌగిట్లో ఇమిడిపో, చెప్పింది విను, చరిత్ర అడక్కు, కాదంటే కష్టాలపాలవుతవ్’’ అనే బెదిరింపు ఉందా..? ‘‘కేసీయార్, నాకు దేవుడిచ్చిన అన్న, మొన్నటి ఎన్నికల్లో నాకు మస్తు సాయం చేసిండు, కలిసి ప్రాజెక్టులు కట్టుకుందాం, కుమ్మేద్దాం బ్రదర్ అన్నాడు, మై బిగ్ బ్రదర్’’ అన్నట్టుగా కేసీయార్‌ను కౌగిలించుకున్న జగన్ లోలోపల మస్తు భయపడిపోతున్నడా..? హహహ… ఉండవల్లి అరుణ్‌కుమార్ […]
మోడీ భయ్యా అని వేడుకుంది ఆనాడు… శవమై తేలింది ఈనాడు…
https://twitter.com/ANI/status/766515213315170304 …… పైన ట్వీటు 2016 ఆగస్టులో కరిమా పోస్ట్ చేసింది.,. ప్రధాని మోడీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెబుతూ ‘‘అన్నయ్యా, బెలూచిస్థాన్లో పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మాట్లాడండి… ప్రతి బెలూచ్ పౌరుడూ నిన్ను సోదరుడిగా భావిస్తున్నారు… మాకు అండగా నిలబడండి అన్నయ్యా…’’ అని వేడుకొంది… కారణాలనేకం, ప్రధాని మోడీ నోటి నుంచి బెలూచిస్థాన్ అనుకూల వ్యాఖ్య ఒక్కటీ రాలేదు ఇన్నేళ్లూ… పరోక్షంగా బెలూచిస్థాన్ పోరాటవీరులకు భారతప్రభుత్వం అండగా నిలబడవచ్చుగాక… కానీ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా, రాజకీయంగా […]
హెలో కేసీయార్ సార్… డ్రమ్ సీడర్ల తాతలున్నారు మీ చుట్టుపక్కలే…
గుడ్… కేసీయార్ ఓ ఆంధ్రా రైతుకు ఫోన్ చేశాడు… ఆదర్శరైతు ఆయన… ఓ రెండురోజులు మా ఫారమ్ హౌస్కొచ్చి, మా వ్యవసాయం చూసి, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకొండి, కారు పంపిస్తా, భోజనం పెడతా అన్నాడు… వెరీ గుడ్… శనివారం ఫోన్ చేస్తే, ఈనాడులో వార్త వచ్చేవరకు కేసీయార్ బజానా బ్యాచ్ నిద్రపోయిందేమో… ఈనాడులో వార్త వచ్చాక మిగతా పత్రికలు కూడా తాపీగా… మరుసటిరోజున ఆ వార్త రాసుకుని బాగా సంబరపడిపోయాయి… ఈయన ఫోన్ చేసి […]
ఆర్కే అక్షరసాహసి… ఆఫ్టరాల్ సుప్రీంకోర్టు అంటాడేమో కొంపదీసి…
రాష్ట్రంలో పేరుమోసిన సంపాదకులున్నారు… నిజం నిష్ఠురంగానే ఉంటుంది… ఏ కలానికీ సూటిగా, పాఠకుడి బుర్రలోకి ఎక్కేలా రాయడం రాదు… నాలుగు పడికట్టు పదాల్నే వాడుతూ, భజిస్తూ, స్తుతిస్తూ… తామేదో మర్మగర్భంగా గొప్ప భావాల్ని చెబుతున్నట్టు బిల్డప్… వాళ్లతో పోలిస్తే రాధాకృష్ణ చాలా బెటర్… మనం నచ్చినా నచ్చకపోయినా తను అనుకున్నది మాత్రం సూటిగా, అర్థమయ్యేలా చెబుతాడు… ధైర్యంగా రాస్తాడు… జర్నలిస్టులు పెద్దగా వ్యాఖ్యానాలు చేయడానికి ఇష్టపడని న్యాయమూర్తులు, తీర్పులు, రాజకీయ ప్రభావాల గురించి కూడా రాస్తాడు… తన […]
మమతక్క బండి అదుపు తప్పింది సరే… ఎర్రనేతలు కూడా జంపర్లేనా..?
మార్పు… మార్పు… సహజం… చంచలమైన రాజకీయాల్లో విధేయతల్లో మార్పులు కూడా సహజం… పెద్ద ఆశ్యర్యం ఏమీ లేదు… కాకపోతే గతంలో పూర్తి రైటిస్టు బీజేపీ నుంచి గానీ… లెఫ్టిస్టు పార్టీల నుంచి గానీ ఈ జంపింగులు కనిపించేవి కావు… మరీ అరుదు… రైటో, లెఫ్టో… ఏదో బుర్రలోకి ఎక్కితే ఇక జీవితాంతం ఆ అభిమానాన్ని పదిలంగా కాపాడుకునేవాళ్లు… మధ్యేవాద, అవకాశవాద, ఫ్యూడల్ పార్టీల నాయకులు ఎప్పుడూ గోడ మీదే కూర్చుని ఉండివాళ్లు… చాలామంది ఆయారాం, గయారాాం బాపతే… […]
రాయపాటి రేంజ్ అదీ మరి..! 7926 కోట్లు అబ్రకదబ్ర… గాయబ్…!!
‘నీరవ్ మోడీ ఎన్ని కోట్ల బ్యాంకు రుణాలకు ఎసరు పెట్టాడు… 6 వేల కోట్లు… ఆయన గారి అంకుల్ గారు మోహుల్ చోస్కీ ఎసరు విలువ ఎంత..? 7080 కోట్లు… మన డెక్కన్ వెంకట్రామయ్య, కన్నడ విజయ మల్లయ్య ఎట్సెట్రా ఈ రేంజ్‌కు ఎదగలేదు… వాళ్లను మించిపోయాడు మన రాయపాటి వారు… మరేమనుకున్నారు..? ఆయన రేంజ్ అదీ… సీబీఐ ప్రాథమిక అంచనా మేరకు అయ్యగారు 7926 కోట్ల మేరకు ఫసాక్ అనిపించేశాడట… సీబీఐ ఆయన కంపెనీ ట్రాన్స్ట్రాయ్ […]
ఆదాని భార్యకు మోడీ వంగి వంగి దండాలు..! నింద ఏంటి..? నిజమేంటి..?
చూశారా ఈ ఫోటో… అంతటి ప్రధాని ఆదానీ భార్యకు ఎలా వంగి దండం పెడుతున్నాడో… ఎలా సాగిలబడిపోయాడో… ఆమె కూడా ఎంత కమాండింగుగా ప్రతినమస్కారం చేస్తున్నదో… అంత అలుసు ఎలా వచ్చింది ఆమెకు..? ఓ పారిశ్రామికవేత్తకు, ఓ కార్పొరేట్ బాసుకు, ఓ ధని వ్యాపారికి ఒక ప్రధాని ఇలా సాగిలబడటం, అదీ ఆయన భార్య ఎదుట కూడా ఇంత విధేయత చూపించడం చీపుగా లేదా..? ……. ఇదుగో ఇలాంటి మెసేజులు ఈమధ్య వాట్సప్ గ్రూపుల్లో బాగా కనిపిస్తున్నాయి… […]
‘‘దీదీ చాప్టర్ క్లోజ్… ఈ దాదా కథ స్టార్ట్… కాబోయే బెంగాల్ సీఎం…’’
వాట్సప్ యూనివర్శిటీకి దూకుడు ఎక్కువ… బుర్ర తక్కువ…! వేరే వాళ్లు నిరూపించనక్కర్లేదు… దానికదే ఆవిష్కరించుకుంటూ ఉంటుంది… అకస్మాత్తుగా కొన్ని ప్రచారాలను తెర మీదకు తీసుకొస్తూ ఉంటుంది… దానివల్ల నష్టం జరుగుతుంది బాబూ అని చెప్పినా సరే వినదు… దాని పోకడ దానిదే… హఠాత్తుగా ఈ చర్చ, ఈ ప్రస్తావన ఏమిటీ అంటారా..? ఒకసారి ఈ ఫోటో చూడండి… ఈయన పేరు స్వామి కృపాకరానంద మహారాజ్… అసలు పేరు, అనగా తను సన్యాసం స్వీకరించక ముందు పేరు దేవతోష్ […]
బీజేపీ పుట్టిన తొలిరోజుల్లో… నిఖార్సయిన గెలుపు కేవలం ఒక్క సీటులోనే…
‘‘వీళ్లిద్దరితోనే భారతీయ జనతా పార్టీ యాత్ర మొదలయ్యింది…!! ఒకరు చందుపట్ల జంగారెడ్డి గారు,? మరొకరు డాక్టర్ AK పటేల్ గారు, జంగారెడ్డి గారు హన్మకొండలో పీవీ గారి మీద ఎంపీగా గెలిచారు. AK పటేల్ గారు? గుజరాత్ రాష్ట్ర మెహసానా నుండి ఎంపీగా గెలిచారు. 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర నేడు 303 సీట్లకు చేరి?అప్రహతిహాతంగా? కొనసాగుతున్నది….!!’’ ………. ఈ మెసేజ్ వాట్సప్ గ్రూపుల్లో తెగ షికారు చేస్తోంది… దీని ప్రయోజనం ఏమిటో ఆ […]
మేఘా కాకపోతే మరొకడు..! పనిమంతుడిని వదిలేసి పనివాడిని తిడితే ఎలా..?!
బాస్ బీజేపీ కాబట్టి కాషాయం పులుముకుంది ఆ పత్రిక… తప్పులేదు, బాసును మించిన ధర్మం ఏముంటుంది..? పైగా ప్రతి పత్రికకూ ఓ పొలిటికల్ లైన్ ఉంటుంది… బాసు నడిచే లైనే పత్రిక లైన్… అదంతే… ప్రస్తుతం వివేక్ బీజేపీలో ఉన్నందున తన వీ6, వెలుగు కూడా అర్జెంటుగా కాషాయం అంగీలు తొడుక్కున్నయ్… టీఆర్ఎస్, కేసీయార్, కేటీయార్, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజానికే శత్రువుల్లా కనిపిస్తున్నారు… అదీ సహజమే… సో, ప్రతి ప్రత్యేక కథనమూ ఆ కలర్లోనే వెలిగిపోతుంది… […]
జయహో ప్రజాశక్తి…! ఈ బ్యానర్ స్టోరీ కొట్టినవాళ్లకూ శౌర్యచక్ర ఇవ్వాలి…!!
ఫాఫం ప్రజాశక్తి దినపత్రిక… హఠాత్తుగా ఏమైంది దీనికి..? ఈమధ్య ప్రభుత్వ ప్రకటనలు బాగా కొట్టీ కొట్టీ… బుర్రలు ఖాళీ అవుతున్నాయా..? లేకపోతే ఫస్ట్ పేజీ లీడ్ స్టోరీ ఈరకంగానా..? కిసాన్‌కు జైకొట్టిన జవాన్… ఇదీ శీర్షిక… 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు, కేజ్రీవాలుడు దీక్ష చేస్తున్నాడు, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు లేఖలు రాస్తున్నారు అని ఏవేవో రాసుకుంటూ పోయారు… వోకే, సీపీఎం పార్టీ తాజా కేంద్ర వ్యవసాయ […]
టోలు నిత్యం! టోలు సత్యం! తోలు వలుచుట తథ్యం!
టోల్ అన్న మాట ఇంగ్లీషులో ఎలా పుట్టింది అని చర్చించడానికి ఇది ఇంగ్లీషు భాషోత్పత్తి శాస్త్ర పాఠం కాదు. noun:- 1. a charge payable to use a bridge or road. 2. the number of deaths or casualties arising from a natural disaster, conflict, accident, etc. verb:- charge a toll for the use of (a bridge or road). నామవాచకంగా అయితే టోల్ […]
చేర్యాల శీలపరీక్షలో జ్యోతి ఫస్ట్ క్లాస్… సాక్షి పాస్, ఈనాడు ఫెయిల్…
ఒక ఎమ్మెల్యే… అత్యంత విలువైన అర ఎకరం భూమిని ఆక్రమించాడు… చాలా ఏళ్లుగా నలుగుతున్న సమస్య… ఆ ఆక్రమణ ఊరివాళ్లకు కూడా సమస్యల్ని తీసుకొస్తోంది… పైగా అది చెరువు భూమి… ప్రహారీ కట్టాడు… ప్రతిపక్షమంతా ఏకమైంది… బంద్ నిర్వహించారు… మందలుగా వెళ్లి ఆ ప్రహారీ కూల్చేశారు… పోలీసులు కేసులు పెట్టారు… కొన్ని గంటలపాటు ఉద్రిక్తత… సమస్య ఇప్పటికీ అలాగే ఉంది……… ఇదీ వార్త… ఇప్పుడున్న స్థితిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇతర పార్టీలన్నీ ఏకమై తిరగబడటం, […]
రాళ్లే కాదు… బాంబులేసినా మమతపై నో యాక్షన్… దట్సాల్…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై బెంగాల్లో రాళ్ల దాడి జరిగింది… వాటీజ్ దిస్ నాన్సెన్స్, ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని బీజేపీ నాయకులు దీర్ఘాలు తీసేసరికి… ఏయ్, చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా… మీ ప్రోగ్రాములకు జనం రావడం లేదని, మీరే రాళ్లు వేసుకుని, ప్రచారం కోసం డ్రామాలు ఆడుతున్నారా అని సీఎం మమత ఎకసక్కేలకు దిగింది… ఆమె అంతే… ఎవరి మీదనైనా దాడులు చేయించగలదు… ఏదో దాదా-దీదీ అనుబంధం కాబట్టి కాస్త […]
దటీజ్ మొసాద్..! ఏ మూల నక్కినా జాడతీస్తుంది… లాడెన్‌ను పట్టేసిందీ అదే…
మే 2, 2011… అఫ్ఘనిస్థాన్‌లోని ఓ సైనిక స్థావరం నుంచి హెలికాప్టర్లు పైకి లేచాయి… పాకిస్థాన్ సరిహద్దులు దాటేశాయి… ఓ పేద్ద ఇంటిపై గద్దల్లా వాలాయి… అందులో నుంచి మిడతల దండులా వెల్ ట్రెయిన్డ్ అమెరికన్ నేవీ సీల్స్ దిగారు… వేగంగా కొన్ని గదుల్లోకి దూసుకుపోయారు… అడ్డం వచ్చినవాళ్లను అక్కడికక్కడే షూట్ చేశారు… టార్గెట్ పర్సన్ కనిపించాడు… పట్టుకున్నారు… ఎక్కడికో సమాచారం వెళ్లింది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా… ఎక్కడి నుంచో ఈ ఆపరేషన్ ‘చూస్తున్న’ వాళ్లు గుర్తించారు… […]
‘ఏలూరు వ్యాధి’ వెనుక రాజకీయ కుట్ర..? జగన్ తవ్వుతున్నది అదేనా..?!
ఏదైనా విపత్తు సంభవిస్తే చాలు… డాక్టర్లు, సహాయక సిబ్బంది కూడా అడుగుపెట్టకముందే… నాయకులు వాలిపోతారు… పరామర్శలు, ప్లాస్టిక్ ప్రేమలు… మీడియాలో కవరేజీ… అంతే, మళ్లీ ఒక్కడూ కనిపించడు… మీడియా కూడా బోలెడు ఫోటోలు వేసి, ఆయా నేతల డొల్ల రాజకీయానికి డప్పు కొట్టీ కొట్టీ అలిసిపోయి, నాలుగు రోజులకు తనూ మరిచిపోతుంది… ఆఫ్టరాల్, మీడియా కూడా రాజకీయానికి ఓ ప్రచారవిభాగం… నిజం అంతేకదా… ఏలూరు వ్యాధులు కూడా అంతే… పార్టీల పరస్పర విమర్శలు, తిట్లు, పరామర్శలు, ప్రకటనలు […]
డొల్ల రాజకీయం…! షూటింగ్ స్పాట్ నుంచే బీఫారాలు పంపిస్తాడేమో..?
నేతిబీరకాయ నేతలు… లొట్టపీస్ పార్టీలు… పొద్దున్నే ఓ సినిమా వార్త చూసినప్పుడు చటుక్కున స్ఫురించిన రెండు మాటలు అవే… సినిమా వార్తకూ ఈ రాజకీయ వ్యాఖ్యకూ లింక్ ఏమిటా..? ఉంది..! అది ఓ పార్ట్ టైమ్ పొలిటిషియన్‌కు సంబంధించిన వార్త కాబట్టి…! ఇంతకీ ఆ వార్త ఏమిటయ్యా అంటే..? అప్పుడెప్పుడో 24 ఏళ్ల కింద కమల్‌హాసన్ సినిమా వచ్చింది… భారతీయుడు… ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నారు… మధ్యలో ఏదో ప్రమాదం జరగడం, తరువాత కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోవడం […]