బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై బెంగాల్లో రాళ్ల దాడి జరిగింది… వాటీజ్ దిస్ నాన్సెన్స్, ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని బీజేపీ నాయకులు దీర్ఘాలు తీసేసరికి… ఏయ్, చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా… మీ ప్రోగ్రాములకు జనం రావడం లేదని, మీరే రాళ్లు వేసుకుని, ప్రచారం కోసం డ్రామాలు ఆడుతున్నారా అని సీఎం మమత ఎకసక్కేలకు దిగింది… ఆమె అంతే… ఎవరి మీదనైనా దాడులు చేయించగలదు… ఏదో దాదా-దీదీ అనుబంధం కాబట్టి కాస్త […]
దటీజ్ మొసాద్..! ఏ మూల నక్కినా జాడతీస్తుంది… లాడెన్‌ను పట్టేసిందీ అదే…
మే 2, 2011… అఫ్ఘనిస్థాన్‌లోని ఓ సైనిక స్థావరం నుంచి హెలికాప్టర్లు పైకి లేచాయి… పాకిస్థాన్ సరిహద్దులు దాటేశాయి… ఓ పేద్ద ఇంటిపై గద్దల్లా వాలాయి… అందులో నుంచి మిడతల దండులా వెల్ ట్రెయిన్డ్ అమెరికన్ నేవీ సీల్స్ దిగారు… వేగంగా కొన్ని గదుల్లోకి దూసుకుపోయారు… అడ్డం వచ్చినవాళ్లను అక్కడికక్కడే షూట్ చేశారు… టార్గెట్ పర్సన్ కనిపించాడు… పట్టుకున్నారు… ఎక్కడికో సమాచారం వెళ్లింది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా… ఎక్కడి నుంచో ఈ ఆపరేషన్ ‘చూస్తున్న’ వాళ్లు గుర్తించారు… […]
‘ఏలూరు వ్యాధి’ వెనుక రాజకీయ కుట్ర..? జగన్ తవ్వుతున్నది అదేనా..?!
ఏదైనా విపత్తు సంభవిస్తే చాలు… డాక్టర్లు, సహాయక సిబ్బంది కూడా అడుగుపెట్టకముందే… నాయకులు వాలిపోతారు… పరామర్శలు, ప్లాస్టిక్ ప్రేమలు… మీడియాలో కవరేజీ… అంతే, మళ్లీ ఒక్కడూ కనిపించడు… మీడియా కూడా బోలెడు ఫోటోలు వేసి, ఆయా నేతల డొల్ల రాజకీయానికి డప్పు కొట్టీ కొట్టీ అలిసిపోయి, నాలుగు రోజులకు తనూ మరిచిపోతుంది… ఆఫ్టరాల్, మీడియా కూడా రాజకీయానికి ఓ ప్రచారవిభాగం… నిజం అంతేకదా… ఏలూరు వ్యాధులు కూడా అంతే… పార్టీల పరస్పర విమర్శలు, తిట్లు, పరామర్శలు, ప్రకటనలు […]
డొల్ల రాజకీయం…! షూటింగ్ స్పాట్ నుంచే బీఫారాలు పంపిస్తాడేమో..?
నేతిబీరకాయ నేతలు… లొట్టపీస్ పార్టీలు… పొద్దున్నే ఓ సినిమా వార్త చూసినప్పుడు చటుక్కున స్ఫురించిన రెండు మాటలు అవే… సినిమా వార్తకూ ఈ రాజకీయ వ్యాఖ్యకూ లింక్ ఏమిటా..? ఉంది..! అది ఓ పార్ట్ టైమ్ పొలిటిషియన్‌కు సంబంధించిన వార్త కాబట్టి…! ఇంతకీ ఆ వార్త ఏమిటయ్యా అంటే..? అప్పుడెప్పుడో 24 ఏళ్ల కింద కమల్‌హాసన్ సినిమా వచ్చింది… భారతీయుడు… ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నారు… మధ్యలో ఏదో ప్రమాదం జరగడం, తరువాత కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోవడం […]
తెలంగాణ సిలబస్‌లో సోనియా గాంధీ బయోగ్రఫీ… బీజేపీ ఎదురుదాడి…
రాజకీయంగా ఎత్తులు, జిత్తులు, ప్రయత్నాలు అన్ని పార్టీలూ చేస్తాయి… బీజేపీ కూడా చేస్తుంది… కానీ ఎటొచ్చీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే తమ లక్ష్యం దిశలో… సోనియా గాంధీ కుటుంబాన్ని వ్యక్తిగత నిందలకు టార్గెట్ చేయడం సంస్కారరాహిత్యమే… పదే పదే ఆమె విదేశీయతను, గాంధీ అనే సర్నేమ్ను, కుటుంబ వారసత్వాన్ని చర్చల్లోకి తీసుకొస్తూ ఉంటుంది… ఆ పార్టీకి ఆ కుటుంబమే కేంద్రకం కాబట్టి, ఆ కుటుంబం నుంచి పార్టీ జారిపోతే ఇక ఆ పార్టీని ఎవరూ రక్షించలేరు […]
అయోమయం… కాపాడాల్సిన వేక్సినే కాటేసే డేంజర్ ఉందట…
———————— పాశ్చాత్య బాణీలో సంగీతం నేర్పే దాసు:- “ఆపేయ్… ఆపేయ్.. అదే మీకూ నాకూ ఉన్న వ్యత్యాసం, పూర్వం ఎప్పుడో పడవల్లో పోయేప్పుడు పాడిన పాట, కట్టిన రాగమూను అది. ఇప్పుడు… బస్సులు, రైళ్ళు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయా! లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడు వచ్చిందో, అలాగే సంగీతంలో కూడా రావాలి… బ్రోచేవా రెవరురా నినువినా…. రఘువరా…. నన్ను బ్రోచేవా రెవరురా…. నినువినా…. టటటటా…. రఘువరా…..టటటటా…. నీ […]
ఈ మొహం గుర్తుంది కదా… ఈమె కన్ను ఇప్పుడు షిర్డీ మీద పడింది…
…….. ఈమెను గుర్తుపట్టగలరా…? పేరు తృప్తి దేశాయ్…. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని, కట్టుబాట్లను, ఆచారాలపై అసంతృప్తీ దేశాయ్… సంఘ్ భాషలో చెప్పాలంటే ఓ అర్బన్ నక్సల్… ఆమెకు వేరే మతాల సంస్థలపై విమర్శలు చేతకావు… చేతకావని కాదు, తన్ని తరిమేస్తారనీ, మరీ తిక్కలేస్తే చంపి పోగులేస్తారనీ భయం… హిందువులు కదా, పిరికి సమాజం.,. ఏమీ అనలుదే అనే ధైర్యం, ధీమా, అలుసు… అందుకే ఆమె హిందూ గుళ్లపై కాన్సంట్రేట్ చేస్తుంది… పేరుకు ఓ సామాజిక కార్యకర్త… మనకు […]
చైనా ఓ సూర్యుడిని కొత్తగా నిర్మించింది… నిజమా..? అబద్ధమా..?
‘‘15 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్…’’ ఒక్కసారి ఊహించండి… చైనా నిర్మించిన కొత్త సూర్యుడు వెలువరించే ఉష్ణోగ్రత ఇది… ఇది ఒరిజినల్ సూర్యుడి మధ్యభాగంలో ఉన్న వేడికన్నా పది రెట్లు ఎక్కువ……. ఆగండాగండి… ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదా… కాస్త సరళంగా చెప్పుకుందాం… చైనా ఏదైనా చేయగలదు… కృత్రిమ ద్వీపాలు సృష్టించగలదు… చంద్రుడి మీద మట్టి తీసుకురాగలదు… ఆమధ్య కృత్రిమ చంద్రుడిని బిగించే పని మొదలుపెట్టింది… అంటే అంతరిక్షంలోని ఓ భారీ ఉపగ్రహాన్ని పంపించేసి, దానికి […]
ఉపగ్రహం సాయంతో… పర్ఫెక్ట్ మర్డర్… విశ్వప్రముఖుల్లో వణుకు…
ముందుగా ఒక సీన్ ఊహించండి… అత్యంత భద్రత కలిగిన ఓ వ్యక్తి కాన్వాయ్ వెళ్తోంది… ఓ నిర్ణీత ప్రాంతం రాగానే కాస్త స్లో అయ్యింది… ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ వాహనం విసురుగా కాన్వాయ్‌లోని ఆ వ్యక్తి వాహనం వైపు వచ్చింది… దానికి ఫిట్ చేసి ఉన్న మెషిన్ గన్ కాల్పులు ఆరంభించింది… వెంటనే అలర్ట్ అయిన ఆయన గన్‌మెన్ ఇతర వాహనాల నుంచి దిగారు… ఎవరు కాలుస్తున్నారో, తాము ఎవరిని కాల్చాలో అర్థం […]
ఓ ఇంట్రస్టింగు కథ… ఎమర్జెన్సీ చీకటి నీడల విషాదం బాపతు కేసు…!!
….. సుప్రీంకోర్టు ఎదుటకు ఓ ఇంట్రస్టింగ్ కేసు వచ్చింది… 94 సంవత్సరాల ఓ వితంతువు సుప్రీంకోర్టులో కేసు వేసింది… అదేమిటంటే..? నాటి ఇందిరాగాంధీ మార్క్ ఎమర్జెన్సీ విధింపు రాజ్యాంగవిరుద్ధం అని ప్రకటించి, తనకు 25 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని..! అప్పుడెప్పుడో 1975లో ఇందిర విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు ఎందుకు విచారణ అంటారా..? అదే కేసులోని ఆసక్తికరమైన అంశం… పిటిషనర్ పేరు వీరా సరీన్… మొరాదాబాద్‌లో పుట్టింది… తొమ్మిది మంతి సంతానంలో ఒకరు… తండ్రి ఓ మెషినరీ స్కూల్లో […]
ఢిల్లీలో రైతుల పోరాటం క్రమేపీ ఎటువైపు టర్న్ తీసుకుంటోంది..?
అక్షరాలా నిజం… ఈ దేశంలో అన్నదాత ప్రాణాలకు విలువ లేదు, తన కష్టానికి గిట్టుబాటు లేదు… తన బతుకంటే ఎవడికీ గుర్తింపు లేదు… పోరాడాల్సిందే… కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం నిజంగా మొన్నటి చట్టాలపైనేనా..? లేక స్థూలంగా రైతు సమస్యలపైనా..? అలాగైతే సమాజంలోని అన్ని సెక్సన్లూ మద్దతు పలకాల్సిందే… కానీ నాణేనికి మరోవైపు చూడలేకపోతున్నామా..? అవును, కేవలం రైతు సమస్యల మీద కాదు… అది రాజకీయాలు మిళితమై సాగుతున్నట్టుగా ఉంది ఆందోళన… తన పంటను రైతు ఎక్కడైనా […]
బాలీవుడ్‌నే పట్టుకుపోతాడట యోగి… ఠాక్రే సర్కారు ఉలికిపాటు…
బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది… అసలే బాలీవుడ్ మాఫియా మీద కంగనా విరుచుకుపడుతోంది కదా… రిపబ్లిక్ టీవీ తన దాడిని ఆపడం లేదు కదా… తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి రంగంలోకి దిగాడు… ఇలా కాదు గానీ… అసలు బాలీవుడ్‌నే యూపీకి తరలించుకుపోతాను అంటున్నాడు… అదుగో అప్పుడు ఉలిక్కిపడింది బాలీవుడ్… ఈ వుడ్డే కాదు, మహారాష్ట్ర అధికార పక్షాలు కూడా ఉలిక్కిపడ్డయ్… చివరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సైతం గొంతు సవరించుకోవాల్సి వచ్చింది… ఇంట్రస్టింగుగా అసలు ఏం జరుగుతున్నదంటే..? […]
సంస్కృతం మీద కూడా బీజేపీకే రైట్స్ ఉన్నాయా స్టాలినూ..?
బీజేపీకి అసలు బలం… హిందుత్వ కాదు, సంస్థాగత బలం కాదు… దాన్ని ద్వేషించే శక్తులే దాని అసలు బలం… లేని కిరీటాలు పెట్టి, బీజేపీకి బోలెడన్ని మహత్తులు, హక్కుల్ని ఆపాదిస్తూ… కట్టబెడుతూ… దాన్ని బలోపేతం చేస్తుంటాయి అవి…! మొన్నటికి మొన్న చూశాం కదా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిపోయే ప్రమాదముందహో అంటూ సెక్యులర్ టీఆర్ఎస్ను, వీర సెక్యులర్ మజ్లిస్‌ను గెలిపించడానికి కంకణాలు కట్టుకుని, ప్రచారాలు చేసి, వ్యాసాలు రాసి తరించిపోయిన అతి లౌకిక మేధావులను చూశాం కదా… […]
ఆ గొప్ప ఆమ్టే అడుగుల్లో తడబడి… ఆదర్శాలే పొట్టనబెట్టుకుని…
బాబా ఆమ్టే… ఈ పేరు విన్నారా..? తనను మోడరన్ గాంధీ అనేవాళ్లు… ఈ గడ్డ మీద జన్మించిన గొప్ప సంఘసేవకుడు… రామన్ మెగసెసే అవార్డు విజేత… పద్మవిభూషణ్… గాంధీ శాంతి బహుమతి గ్రహీత… మానవహక్కుల ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పురస్కారం… లక్షల మంది లెప్రసీ బాధితులను సమాజం వదిలించుకుంటే, తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి, చికిత్స ఇప్పించాడు… తన ఆశ్రమం పేరు ఆనందవన్… దాన్ని నడిపేది మహారోగి సేవాసమితి అనే స్వచ్చంద సంస్థ… ఆ ఊరు వరోడా… చంద్రాపూర్ […]
ఉద్దెర రేపు..! రజినీ రాజకీయ రంగప్రవేశం త్వరలో…! రెండూ సేమ్ సేమ్…!!
మీరు ఏ ఊరిలోని ఏ చిన్న కిరాణా కొట్టుకైనా వెళ్లండి… ఉద్దెర రేపు అని రాసి ఉంటుంది… రోజూ రేపే… ఈ వాక్యాన్ని కాయిన్ చేసినవాడెవడో గానీ అద్భుతం… మన సినిమా నటుల పార్టీల యవ్వారమూ అంతే… ప్రత్యేకించి రజినీకాంత్… నా పార్టీ ప్రకటన రేపు అంటాడు… మీరు ఎప్పుడు అడిగానా ఆ డైలాగులో మాత్రం తేడా రాదు… సారు గారి వయస్సు 70 ఏళ్లు… ఇప్పటికీ స్టెప్పులు వేస్తూనే ఉంటాడు… సినిమాలు తీస్తూనే ఉంటాడు… ఇదుగో […]
పాత భయాలు…! కేసీయార్‌కు అనూహ్యంగా సెక్యులరిస్టుల మద్దతు..?
……. కొందరు మిత్రుల్ని అడిగితే… హిందుత్వ వేరు, హిందూ వేరు అని స్పష్టంగానే చెబుతున్నారు… నిజానికి వాళ్లంతా కేసీయార్ పాలన విధానాలను, వ్యక్తిగత వ్యవహార పోకడలను ద్వేషించేవాళ్లే… లెఫ్ట్, న్యూట్రల్, సెక్యులర్ భావాలున్నవాళ్లే… అదేమిటీ అనడిగితే… బీజేపీ ప్రవచించే హిందూత్వ వేరు… కేసీయార్ చెప్పుకునే నంబర్ వన్ హిందువును అనే తత్వం వేరు అంటూ విభజన రేఖ గీచి చూపించారు… మత దురభిమానం వేరు, స్వీయ మత అనుసరణ- పరమతసహనం వేరు… బీజేపీది మత దురభిమానం, కేసీయార్ది […]
ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..?!
ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..? అబద్దాలో, నిజాలో జానేదేవ్… మాట్లాడుతుంటే ప్రత్యర్థులపై గండ్రగొడ్డలి పట్టుకుని భీకరంగా దాడిచేసే పరుశురాముడిలా కనిపించే ఆ కేసీయార్ ఏమయ్యాడు..? ఎందుకింత డిఫెన్స్‌లో పడిపోయాడు..?…… ఇదీ ఎల్బీ స్టేడియంలో కేసీయార్ స్పీచ్ విన్న తరువాత ఓ కేసీయార్ అభిమాని అభిప్రాయం… స్పీచ్ అయిపోగానే బీజేపీ స్పందించింది… అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఓ ప్రకటనలో… ‘‘గ్రేటర్ పీఠం చేజారుతున్నదనే భయం కేసీయార్ స్పీచులో కనిపించింది…’’ అని వ్యాఖ్యానించాడు… కేసీయార్ స్పీచ్ […]
పవన్ కల్యాణ్ సార్… ఆస్తుల అమ్మకం తప్పే… ఏం చేయమంటావో చెప్పు…
నిజానికి ఇదొక చిక్కుముడి… ఏమిటీ అంటారా..? ‘‘మంత్రాలయం మఠం భూములు అమ్ముతారా..? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా..? దాతలు ఇచ్చిన ఆస్తులను నడిబజారులో వేలం వేస్తారా..? అమ్ముకోవడం కోసమా మీకు ఆస్తులు ధారబోసింది..? దాతలు ఇచ్చే ఆస్తులకు మీరు ధర్మకర్తలే గానీ యజమానులు కారు, ప్రజలు వ్యతిరేకించారని తిరుమల ఆస్తుల అమ్మకం ఆపేశారు… మరి మంత్రాలయం ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు ఎందుకు..?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు… మంచి ప్రశ్నే… ఈ జగన్ ప్రభుత్వమే ఆమధ్య హిందుత్వవాదుల విమర్శలతో వెనక్కి […]
కంగనా వ్యవహారంలో శివసేన సర్కారుకు బాంబే హైకోర్టు చురకలు…
సంజయ్ రౌత్ తెలుసు కదా… మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వ్యూహకర్త, శివసేన అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎంపీ… మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు దిశలో తను ఎంత కీలకమో… ఆ ప్రభుత్వానికీ సినీనటి కంగనా రనౌత్కూ నడుమ అగాధాన్ని పెంచింది కూడా తనే… ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశాడు… చివరకు ముంబై హైకోర్టు కూడా తనను తప్పుపట్టింది… ఒక పార్లమెంటేరియన్‌కు ఇలాంటివి తగవు అని చెప్పింది తాజా ఆర్డర్లో… అంతేకాదు, తను […]
ఉద్యోగులూ హోల్డాన్… జెర ఠైరో… తొందరపడితే బుక్కయిపోతారు…
ఉద్యోగులు రాజకీయ ప్రచారం చేయవచ్చా…!? ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కొందరు ఇటీవల కాలంలో అవగాహనా రాహిత్యంతోనో లేక అత్యుత్సాహంతోనో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్ధతు ప్రకటనలు చేస్తూ… మితి మీరి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము ప్రభుత్వ ఉద్యోగులమని… నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్న సోయే వారిలో లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాహాటంగా రాజకీయ పార్టీలకు మద్ధతు పలుకుతూ లేదా విమర్శిస్తూ పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మనకేం అవుతుంది? […]