Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జూనియర్… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది, ఇదేం కక్కుర్తి..?!

October 18, 2025 by M S R

jr ntr

. ముందుగా ఓ విషయం చెప్పుకుని మిగతా స్టోరీలోకి వెళ్దాం… అదేమిటంటే..? బిగ్ బీ… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్… తన టీమ్ తన కళ్లు గప్పి ఓ యాడ్ చేయించారు… అది ఓ గుట్కా యాడ్… సరోగేట్ యాడ్… అంటే సదరు గుట్కా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే దుర్మార్గపు యాడ్… అమితాబ్‌కు నిజం తెలిసింది… తను గడ్డి తినే రకం కాదు… పెంట మీద కాసులను ఏరుకునే రకం కాదు… అన్నింటికీ మించి ఉచ్ఛం నీచం […]

KCR పాలనలో లక్ష మంది బోగస్ ఉద్యోగులు… వేల కోట్ల ప్రజాధనం గోవిందా…

October 18, 2025 by M S R

bogus

. కేసీఆర్ అరాచక పాలనలోని మరో ఘోర వైఫల్యం, దాదాపు 18 వేల కోట్ల ప్రజాధన దుర్వినియోగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది… పరిపాలనలో అడుగడుగునా సాగిన అడ్డదిడ్డపు యవ్వారం ఇది… ఒకసారి ఓ మాట గుర్తు చేసుకుందాం… కంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే దశలో… ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు ఉద్యోగి గానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గానీ కనిపించడని కేసీయార్ గంభీర ప్రకటన చేశాడు గతంలో… ఉత్తదే… అదెంత డొల్ల యవ్వారమో, కంట్రాక్టు ఉద్యోగులు కొనసాగడమే కాదు, […]

తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!

October 18, 2025 by M S R

naxals

. సూరజ్ వి. భరద్వాజ్….  విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం! #LeftismMarkNeoExploitation మావోయిస్టు పార్టీలో అప్రకటిత మేధో, శ్రామిక వర్గాల నడుమ సంఘర్షణ కొనసాగుతోంది. కార్మికుల కోసం మేడేల పేరిట లిబరల్ తాటాకు చప్పుళ్లు ఎన్ని వినిపించినా తాడిత పీడిత జనం పక్షాన నిలబడే మిషలో దశాబ్దాల క్రితమే ఈ నయా వర్గ విభజనకు నాంది పడిందన్నది నిర్వివాదాంశం! ప్రాణాలకు సైతం తెగించి చెట్టు పుట్టా తిరుగుతూ విపరీతంగా శ్రమిస్తూ అణగారినవర్గాల [#OppressedClass] పక్షాన నిలబడి […]

బంద్‌కు అందరూ సై… కానీ బీఆర్ఎస్ మద్దతులో నిజాయితీ ఎంత..?

October 17, 2025 by M S R

reservations

. మొదట బీసీలకు స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యానికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన ఓ ద్రోహ విషయం చెప్పుకోవాలి… తరువాతే మిగతాది… 2018 డిసెంబర్‌లో, కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఎన్నికల కోసం 50 శాతం గరిష్ట పరిమితిని దృష్టిలో పెట్టుకునే కొన్ని సవరణలు చేశాడు… దీని ద్వారా షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) కోటాలు పోగా… ఇక వెనుకబడిన తరగతుల (BC)కు దక్కినవి 22 శాతం కూడా లేవు… నిజానికి సరైన లెక్కలు తీస్తే […]

రెనిగేడ్, చెద… ముద్రలు సరే గానీ..! లోతైన పోరాటసమీక్ష అవసరం లేదా..?!

October 17, 2025 by M S R

vv

. Kandukuri Ramesh Babu ……. #వివి #సందర్భం…. చరిత్రలో ఒక ద్రోహ కాల్‌ : చర్చ జరగాలి…. గతంలో వరవరరావు గారు ‘ఫెలో ట్రావెలర్’ అన్న కలం పేరుతో వ్యాసాలు రాసినట్టు గుర్తు. దాన్ని బట్టి ఇది మల్లోజుల గారిపై వివి గారి నిశితమైన విమర్శ అనే భావించాలి. దీన్ని వారి వ్యక్తిగత అభిప్రాయం అనే అనుకోనక్కరలేదు, చాలామంది ఇది పార్టీ అభిప్రాయమని భావించే అవకాశాన్ని కాదనలేం. “రెనగేడ్‌ వేణుగోపాల్‌ విద్రోహాన్ని అమాయకమైన కోడి ఈకతో […]

పీకేకు తత్వం బోధపడింది… ప్రజాక్షేత్రం అంటే తెర వెనుక జిత్తులు కాదు…

October 16, 2025 by M S R

ipac

. నేను చాణుక్యుడిని… ఈ దేశంలో ఎవరినైనా గెలిపించగలను, ఎవరినైనా ఓడించగలను అనే తలబిరుసు భావనల్లో, భ్రమల్లో ఉండే ప్రశాంత్ కిషోర్ నేలకు దిగివచ్చాడు… తత్వం బోధపడింది… మాటలు వేరు… చేతులు వేరు… ప్రజాక్షేత్రంలో మార్కెటింగ్ వ్యూహాలు మాత్రమే గెలిపించలేవనీ, సోషల్ మీడియా ప్రచారాలే గద్దెనెక్కించలేవనీ అర్థమైంది… నా వారసుడివి నువ్వేరా, నా తరువాత బీహార్ పీఠం నీదేరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు నితిశ్ ఓ దశలో… కొన్నాళ్లు తనతో ఉండి, వదిలేశాడు, ఆఫ్టరాల్ ఈ […]

కొండా ఫ్యామిలీ మారదు… ఫాఫం కాంగ్రెస్… అనుభవించు రాజా…

October 16, 2025 by M S R

konda

. ఎప్పటిలాగే నడుస్తుంది అనుకున్నట్టున్నారు… ముందుగా ఓఎస్డీని తొలగించారు… తరువాత ఇంటికి పోలీసులు వచ్చారు… వరంగల్ ఇంటి ముందు పోలీస్ కాపలా మాయం… ఏం జరుగుతోంది..? రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పొంగులేటి… అందరూ బీసీ బిడ్డ కాబట్టి సురేఖ మీద కక్ష సాధిస్తున్నారట… విపరీత పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని బిడ్డ హెచ్చరిక… మోస్ట్ కంట్రవర్సీ ఉద్యోగి తమ ఫ్యామిలీ మెంబరట… అసలు తనను తమ శాఖ పరిధిలోని కాలుష్య నివారణ మండలిలో ఓ కంట్రాక్టు ఉద్యోగిగా […]

ఫాఫం మల్లోజుల… లొంగిపోయిన తుపాకీ అంటే అందరికీ అలుసే…

October 16, 2025 by M S R

lloyd

. ఈరోజు పత్రికల్లో వచ్చిన అన్ని వార్తల్లోకెల్లా… ఒక చిన్న సింగిల్ కాలమ్ వార్త… అదీ అనేక వార్తల నడుమ దాక్కుని, కనిపించనా వద్దా అన్నట్టుగా ఉంది… అది నచ్చిందని కాదు, అక్కడ కాసేపు ఆలోచనలు స్తంభించాయి… ఆ వార్త నేపథ్యం ఓసారి గుర్తుచేసుకుందాం… మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మరో 60 మంది పోరాట సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయాడు కదా… ఇక సాయుధ పోరాట విరమణ […]

విశాఖలో గూగుల్ డేటా సెంటర్… ప్రపంచం నేర్పిన పాఠాలు…

October 16, 2025 by M S R

vizaG

. డిజిటల్ ప్రపంచం నడుస్తోంది డేటా సెంటర్లపై… ప్రతి మెసేజ్, వీడియో, సర్వర్‌కి వెనుక ఉన్న శక్తి అదే… అయితే ఈ డిజిటల్ గుండె కొట్టుకోవాలంటే — విద్యుత్, నీరు, భూమి అనే మూడు ప్రధాన వనరులు కావాలి…ఇవి ఎక్కడినుండి వస్తాయనే దానిపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ… విశాఖలో లక్షన్నర కోట్ల భారీ డేటా సెంటర్… లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ఉపాధి… అనేక ఇతర కంపెనీలకూ తోడ్పాటు…. వంటి ప్రచారాలు ఊదరగొడుతున్నారు… అంతగా ఉపాధికి […]

నాకు నువ్వు- నీకు నేను…!! బీజేపీ- బీఆర్ఎస్ రహస్య స్నేహం..?!

October 16, 2025 by M S R

jubilee hills

. బీజేపీ కావాలనే జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు సానుకూలంగా వ్యవహరిస్తోందా..? వ్యూహాత్మక స్తబ్దత మర్మం అదేనా..? చెప్పు, కిషన్ రెడ్డీ, ఎన్ని వోట్లతో ఓడిపోతున్నారు మీరు, అసలు పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఏది..? అని రాజాసింగ్ వెటకారపు వ్యాఖ్యలు దట్టిస్తున్నాడు కదా… కానీ చాలామంది బీజేపీ సానుభూతిపరుల్లోనే ఆ సందేహాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి… కిషన్ రెడ్డి ఎందుకిలా చేస్తున్నాడు అని..! ఎందుకంటే కాస్త వివరంగా చెప్పుకోవాలి..! జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక నిజానికి బీజేపీకే ప్రతిష్ఠాత్మకం… కిషన్ […]

లొంగుబాటలో తుపాకీ..! మల్లోజుల బాటలోనే ఆశన్న… మరో దెబ్బ..!!

October 15, 2025 by M S R

surrender

. మావోయిస్టుల సాయుధ పోరాట విరమణ విస్తరిస్తోంది… వచ్చే మార్చికి ఒక్క నక్సలైట్ కూడా ఉండడు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే ఉరుముతున్నాడు కదా… మరోవైపు మావోయిస్టు పార్టీలోనే అంతర్గతంగా ఆత్మమథనం సాగుతోంది… పార్టీ ప్రస్థానం, భవిష్యత్తు, సాయుధ పోరాట ఫలితాల మీద నమ్మకం కోల్పోయిన అగ్రనేతలే రిట్రీట్ జపం పఠిస్తున్నారు… ఇంకా ఇంకా మిలిటెంట్లను కోల్పోకముందే కళ్లు తెరుద్దామని మల్లోజుల తదితరులు బహిరంగ చర్చనే పెట్టారు కదా.., ఆ భావన […]

ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…

October 15, 2025 by M S R

aj

. ఉంటాయి ఉంటాయి… ఎందుకు ఉండవు..? ప్రధాన ఆదాయ ప్రభుత్వ శాఖలకు అభిమాన పత్రికలు కూడా ఉంటాయి… సందర్భం వచ్చినప్పుడు వాణిజ్య ప్రకటనలు ఇచ్చి, అడిగినంత టారిఫ్ చెల్లించి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటాయి… అవును, ఇదేమిటిలా అని నొసలు విరవనక్కర్లేదు… ఆంధ్రప్రదేశ్‌లో అదంతే… ఎవరో ఆదేశిస్తారు, ఎవరో ఏదో ప్రభుత్వ శాఖ నుంచి యాడ్ వస్తుంది… పబ్లిష్ చేస్తారు… అంతా మాయ… అసలు ఒక ప్రభుత్వ శాఖ ‘అభిమాన పత్రిక’గా ప్రస్తావిస్తూ యాడ్ ఇవ్వడం అనైతికమే […]

మనువాద లొంగుబాట్లు Vs బహుజన లొంగుబాట్లు… ఏమిటీ లెక్కలు..!?

October 15, 2025 by M S R

sonu

. రాద్దామా, వద్దా అనే డైలమా… ఎందుకంటే… కాల్చివేతలకు, కాపాడటానికీ, చివరకు లొంగుబాట్లకూ లెక్కలుంటాయ్ గనుక… సాయుధ పోరాట విరమణను మావోయిస్టు పార్టీలో చర్చకు పెట్టి, రచ్చ రచ్చ చేసి, నేనయితే లొంగిపోతున్నాను, జనజీవనస్రవంతిలోకి వెళ్లిపోతున్నాను అని తన లేఖల ద్వారా పరోక్షంగా వెల్లడించి మరీ లొంగిపోయిన మల్లోజుల అలియాస్ సోను లొంగుబాటు వెనుక కూడా చాలా లెక్కలున్నాయా..? మరీ ప్రత్యేకించి చత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులను పక్కనబెట్టి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడానికీ మనువాద లెక్కలు ఉపకరించాయా..? […]

మల్లోజుల లొంగుబాటు ఓ సంచలనమే… మావోయిస్టు చరిత్రలో మలుపు..?!

October 14, 2025 by M S R

mallojula

. ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణగోపాల్ రావు బృందం… ఇదీ వార్త… బహుశా ఇక మావోయిస్టు నక్సలైట్ల ప్రస్థాన చరిత్రలో పెద్ద మలుపు కావచ్చు ఇది… హిస్టారికల్ ట్విస్ట్ అనుకుంటాను… ఇది సంచలనమే… కొంతకాలంగా ఆయన సాయుద పోరాట విరమణ, జనజీవన స్రవంతిలోకి వెళ్లామని ప్రతిపాదించడమే ఓ సంచలనం… పార్టీ అడుగులను నిశితంగా విశ్లేషిస్తూనే, ఇక రిట్రీట్ కావల్సిన సమయం వచ్చేసిందని ముక్తాయించాడు… సింపుల్‌గా బయటికి రాలేదు తను… మావోయిస్టు సర్కిళ్లు, సానుభూతిపరులు, పొలిటికల్ సర్కిళ్లలోనూ ఓ […]

*ఫ్రీ మిక్సర్లు, గ్రైండర్ల, మేకలు, ఆవులు… అంతేకాదు, ప్రతివాడికీ ఫ్రీ భార్య..!!

October 14, 2025 by M S R

shanmugam

. ప్రజెంట్ పొలిటిషయన్స్‌లో అందరూ అందరే… నీచ వ్యాఖ్యలు, బజారు భాష, అబద్ధపు ప్రచారాలు, కించపరిచే వ్యాఖ్యానాలు, చిల్లర విమర్శలు ఇలా… వివాదం తలెత్తగానే, అబ్బే, నా వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించింది అని మళ్లీ అబద్ధాలు, దాటవేతలు, ఆత్మవంచనలు, దిగజారుడు సమర్థనలు… ఇప్పుడు టీవీల్లో రికార్డయినా సరే, తిక్క సమర్థనలకు మీడియాను నిందించడం కూడా సాగుతూనే ఉంది… ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఏమీ లేదు… అసలు రాజకీయ నాయకుడంటేనే జనం ఏవగించుకునే సిట్యుయేషన్… […]

ఎములాడ రాజన్న గుడి అభివృద్ధిపై ఓ దిక్కుమాలిన కార్యాచరణ..!!

October 14, 2025 by M S R

vemulawada

. కేసీయార్ దాదాపు 1600 కోట్ల ఖర్చుతో యాదగిరిగుట్ట గుడిని పునర్నిర్మించాడు… ఆధునిక సెక్యులర్ భారతదేశంలో ఆ నిర్ణయం సాహసమే… అంతేకాదు, ఓ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి, తనకే రిపోర్ట్ చేసేలా ఆదేశించి, ఇంకెవ్వరినీ వేలుపెట్టకుండా చూశాడు… గుట్టపైని చిరువ్యాపారులను తరిమేశాడు, గుట్ట కిందే పుష్కరిణి, కల్యాణకట్ట… వీవీఐపీ విల్లాలు, కాటేజీలు ఎట్సెట్రా… శిలానిర్మాణాలు… ఇదంతా నాణేనికి ఒక కోణం… మరోవైపు… 1) స్థంభాలపై తన బొమ్మలు, తన పథకాలకు ప్రచారయావ… 2) గుట్ట మీద […]

తప్పుడు కేసులో 43 ఏళ్ల జైలు… ఎట్టకేలకు నిర్దోషి… కానీ మరో అన్యాయం..?

October 14, 2025 by M S R

subu vedam

  . మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ లోపభూయిష్టమైన న్యాయవ్యవస్థకు బోలెడు ఉదాహరణలు… లేట్ న్యాయం కూడా అన్యాయమే అని చెప్పడానికి, ప్రాసిక్యూషన్ అంధత్వానికి, ప్రభుత్వం అమానవీయ వైఖరికి ఓ బలమైన ఉదాహరణ ఇది… భారత సంతతికి చెందిన సుబ్రమణ్యం వేదం (సుబు) (64) ఉదంతం కేసు ఏమిటంటే… 1980లో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ హత్య కేసులో ఆయనకు అన్యాయంగా శిక్ష పడింది… తొమ్మిది నెలల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చిన సుబు […]

ఈ దర్శనం అమూల్యం… ఇది కళ్లకు తెలియని ఓ భక్తి పారవశ్యం…

October 14, 2025 by M S R

true darshan of Tirumala balaji

. నాదబ్రహ్మ త్యాగయ్య తిరుమల వెళ్ళిన సమయానికి స్వామి కనిపించకుండా తెర ఉంది. (కొన్ని సేవలకు తెర వేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది) మనమైతే తెరతీసేవరకు ఒకరిమీద ఒకరు పడి తొక్కుకుంటూ… విసుక్కుంటూ ఉంటాం. “తెర తీయగరాదా తిరుపతి వేంకటరమణా!” అని త్యాగయ్య కీర్తన పాడడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తెర తనకు తానే తొలగిపోయింది. అక్కడున్న అర్చకులు, భక్తులు త్యాగయ్య భక్తికి పొంగిపోయారు. ఆ కీర్తన ఈ కథకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికీ ప్రచారంలో ఉంది. విమానం […]

సానుభూతి వేరు… వోట్లేసే లెక్క వేరు… పాత ప్యాటర్న్ చెప్పేది ఇదే…

October 14, 2025 by M S R

jublee hills

. ఇప్పుడు జుబ్లీహిల్స్ ఉపఎన్నిక మీదే తెలంగాణ  రాజకీయం కేంద్రీకృతమైంది… ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమే పోటీ అన్నట్టుగా కనిపిస్తోంది… రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే… అందుకే తమవైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి… నిజానికి తెలంగాణ రాజకీయాల్లో ఉపఎన్నికలు అంటే… స్థానిక నాయకుడి మరణం, సానుభూతి, కుటుంబ వారసత్వం చుట్టూ తిరిగే భావోద్వేగాల పోరుగా భావిస్తారు… అయితే, 2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈ సాధారణ అభిప్రాయానికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించాయి… తెలంగాణ ఓటరు స్పష్టంగా […]

మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!

October 13, 2025 by M S R

wines

. మంత్రి పదవి దక్కని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదోరకంగా ప్రభుత్వాన్ని, పార్టీని గోకడానికే ప్రయత్నిస్తున్నాడు… తన నియోజకవర్గం తెలంగాణలో భాగమేననీ, అక్కడ కూడా ప్రభుత్వ పాలసీలు వర్తిస్తాయనీ, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మునుగోడుకు తాను సీఎం కాననీ మరిచిపోతున్నాడు… తనేం అంటున్నాడంటే..? మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ (Wine Shops ) టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు […]

  • « Previous Page
  • 1
  • …
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • …
  • 116
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • దుశ్శల..! మహాభారతంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన ఓ కీలకపాత్ర..!!
  • రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విరమణ త్వరలో..! ఏం జరుగుతున్నదంటే..?!
  • మానసవీణా మధుగీతం… నిజంగా ఆపాత మధురం… ఈ స్వర మాధుర్యం…
  • నితిశ్ తరువాత బీహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి…! ఇంతకీ ఎవరీయన..!?
  • పగలైతే దొరవేరా… ఓ పదీపదిహేను లలిత పదాలతో… ఆకాశమంత అనురాగం…
  • మైథిలి ఠాకూర్..! ఈ స్వరం భాస్వరమై మండింది కదా… అప్పుడే ట్రోలింగు..!!
  • చంద్రబాబు గారండోయ్… క్షమించండి మా అజ్ఞానానికి… శపించకండి ప్లీజ్…
  • ‘ఫ్యూచర్ సిటీ’ వైపు బాటలు చూపే గ్లోబల్ సమ్మిట్… రైజింగ్ తెలంగాణ..!!
  • పవర్‌ఫుల్ చట్టం IFA-2025 … అక్రమ వలసదారులు పరుగో పరుగు…
  • ఓ సాత్విక పెద్ద భార్య… ఓ గయ్యాళి చిన్న భార్య… ఓ జీవన జ్యోతి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions