డెల్యూషన్స్ an idiosyncratic belief or impression maintained despite being contradicted by reality or rational argument, typically as a symptom of mental disorder… డెల్యూషన్ అని టైప్ చేస్తే గూగుల్ లో వచ్చిన సమాచారం ఇది.. మానసిక శాస్త్రంలో ఇదొక తీవ్రమైన మానసిక వ్యాధి..ఈ వ్యాధి గ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.. అదే నిజమనే భ్రమలో బతికేస్తుంటారు…ఒక కొత్త లోకాన్ని ఊహించుకుని ఊహల్లో జీవిస్తుంటారు.. ………………………………………….. ఇప్పుడు […]
రోజులన్నీ ఒకేలా ఉండవ్ ద్వివేదీ… నిమ్మగడ్డకూ టైమొచ్చింది చూడు…
డెస్టినీ… పదే పదే ఈమధ్య ప్రస్తావనకు వస్తోంది అనివార్యంగా… అందుకని ఆ పదంతోనే మొదలుపెడదాం… డెస్టినీ అంటే ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది అనబడే ఉన్నతాధికారికి సరిగ్గా అర్థమై ఉంటుంది… కెరీర్‌లో ఎప్పుడూ మన పాత్ర ప్రస్తానం ఊర్ద్వముఖంగా సాగిపోదు ద్వివేదీ… ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే……. ఈయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రస్తుతం… మొన్న శుక్రవారం రాత్రివేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి, అక్కడ నిమ్మగడ్డ లేడని తెలిసీ ఆ వేళకే కావాలని వచ్చి, అక్కడ […]
అభీ బహుత్ పిక్చర్ బాకీ హై సర్కార్..! అసలు కథ ఇప్పుడే ఉంది…
ఇంకేముంది..? అంతా అయిపోయింది..? జగన్ రాజీపడ్డాడు… నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తాం అని చెప్పాడు… సుప్రీంకోర్టు తలంటిది కదా, ఇక తప్పలేదు… అన్ని దారులూ మూసుకుపోయాయి… కొద్దిరోజులుగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో జగన్ ఇక వెనక్కి తగ్గక తప్పలేదు… ఇక ఎన్నికలు జరగడమే తరువాయి… ఇక ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే… ఈ ఎన్నికలైపోయాక ఆయన రిటైర్ అయిపోతాడు, కథ కంచికి, మనం ఇంటికి………….. ఇలా రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు… సారీ, అసలు కథ ఇప్పుడే […]
ఈ ఫోటోల్ని ఓసారి చూడండి… అసలు హంతకులు ఎవరో మీరే తేల్చండి…
కాదు… కాదు… మీడియాలో వస్తున్న కారణాలు కాకపోవచ్చు… ఇంకేదో ఉంది… మదనపల్లెలో మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల correspondents చేసిన ఘాతుకం వెనుక అసలు కారణాలు బయటపడాల్సి ఉంది… వాళ్లిద్దరూ బాగా చదువుకున్నవాళ్లే… పదిమందికీ ఉన్నత విద్యాబద్దులు నేర్పించేవాళ్లే… మరి వాళ్ల బుద్దులే పెడదోవ పట్టి, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడపిల్లలకు బలి ఇవ్వడం ఏమిటి..? మళ్లీ బతికివస్తారని చెప్పడం ఏమిటి..? బలి నిజమే… ఘోరం నిజమే… కానీ అసలు కారణాలు, కారకులూ వేరు… అసలు హంతకులు వేరు… పోలీసులు […]
మోడీ వెరీ లక్కీ బాసూ..! రాహుల్ వంటి వింత ప్రత్యర్థి ఎవరికీ దొరకరు..!!
రాహుల్ గాంధీ చిత్రమైన వ్యక్తి…. నాయకుడు వంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరమేమీ లేదు… ఎంత చిత్రమైన వ్యక్తి అంటే…. ‘‘ఛిఛీ, ఈ మోడీ పాలన బాగాలేదు, పేదల్ని ప్రేమించలేడు, హృదయంతో పాలించలేడు, అసలు బీజేపీకి ఓ బలమైన ప్రత్యామ్నాయం అవసరం, ఈ కాంగ్రెస్ కాస్త బాగుపడితే బాగుండు, ఈ రాహుల్ బుర్ర వికసిస్తే బాగుండు’’ అని మనం పొరపాటును అనుకుంటామో లేదో… వెంటనే రంగంలోకి వస్తాడు… నో, నో… అలా ఆశలు పెంచుకోవడానికి మీరెవరు..? నాన్సెన్స్, […]
పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను చేత్తో పట్టుకుంటేనే నేరమా..? అదెలా..?!
ఒక న్యాయస్థానం తీర్పుపై అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు, నేరం కాదు… అలాగే న్యాయస్థానాలు చట్టాల అసలు స్పూర్తిని పరిగణనలోకి తీసుకోవాలే తప్ప, దాన్ని నీరుకార్చకూడదు….. ఒక పన్నెండేళ్ల బాలికపై ఓ నడివయసు పురుషుడు చేసిన అకృత్యం, దానిపై ముంబై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మీద తెలుగు సమాజంలో జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… బహుశా కోర్టు తీర్పు కదా అని తమాయించుకుంటున్నారేమో… కానీ ఒక కోర్టు చెప్పిన తీర్పు అల్టిమేట్ ఏమీ […]
తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?
నాగేశ్వర్ అభిప్రాయాలతో ఏకీభవించాలని ఏమీ లేదు… వ్యతిరేకించకూడదని కూడా ఏమీ లేదు… జీవితాంతం సీపీఎం భావజాలాన్నే అంటిపెట్టుకున్నాడు కాబట్టి తన మాటలు, తన అడుగులు, తన ఆలోచనలు ఆ రంగు, ఆ రుచి, ఆ వాసనే కలిగి ఉంటయ్… బాగా అధ్యయనం చేస్తాడు, అన్ని విషయాలపై జ్ఞానం పెంచుకుంటాడు… సంస్కారం విడిచి మాట్లాడడు… వ్యక్తిగా నాగేశ్వర్ డబుల్ వోకే కేరక్టర్… కాకపోతే ఎర్ర వోట్లే గాకుండా తటస్థుల వోట్లు కావాలనే భావనతో తటస్థుడిగానే రేప్పొద్దున ఎమ్మెల్సీ బరిలో […]
కేసీయార్ దిద్దుకోవాల్సిన పోలీస్ పాలసీ… లేకపోతే మరింత లాస్..!!
ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల బాగా వ్యతిరేకత పెరుగుతోంది… బయటికి అంగీకరించకపోయినా సరే, ఆ పార్టీ నాయకులే ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు… కేసీయార్ కూడా దిద్దుబాటలో పడ్డాడు… ఏయే అంశాల్లో తప్పులు జరుగుతున్నాయో స్వీయవిమర్శ చేసుకుంటూ, కొన్ని అడుగులు సరైన వైపు వేయడం స్టార్టయింది… కాకపోతే ఈరోజుకూ ఆయన ఫీల్డ్‌లో ఏం జరుగుతున్నదో సరిగ్గా తెలుసుకోవడం లేదు… దాంతో తను తీసుకునే కొత్త నిర్ణయాలూ పెద్ద ఫాయిదా ఇచ్చేట్టుగా లేదు… ఉదాహరణకు ధరణి… ఒక్క సబ్ రిజిస్ట్రార్‌ను అడిగినా ధరణి […]
క్షుద్ర పూజలు కాదు..! కేసీయార్ ప్రత్యేక పూజల కథ ఇదీ…!
యాగాలు, హోమాలు కేసీయార్‌కు కొత్తేమీ కాదు… తను చేసినన్ని పూజలు సమకాలీన నాయకుల్లో ఎవరూ చేసి ఉండలేదు, అంత సంకల్పం, ఆచరణ కూడా ఉన్నవాళ్లు లేరు… అంత భక్తివిశ్వాసాలు ఉన్నవాడు కాబట్టే అయుత చండీయాగం చేశాడు… తన యాగాల్లో ప్రధాన సంకల్పం శత్రువుపై విజయం..! మరి ఇప్పుడు చేస్తున్న పూజలేమిటి..? ‘‘పూజాసామగ్రిని గోదావరిలో కలపడానికే కేసీయార్ కాళేశ్వరం పోయాడు, అంతేతప్ప ఇప్పుడు అక్కడ ఆయన చూసే పనీ, చేసే పనీ ఏమీలేదు, కేటీయార్‌ను సీఎంను చేయడానికే ఈ […]
పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…
పాకిస్థాన్‌కు వాచిపోయింది… పాకిస్థాన్ పరువు పోయింది… పాకిస్థాన్‌ను చూసి అంతర్జాతీయ సమాజం పడీ పడీ నవ్వుతోంది… అది చైనా జేబులో దేశం……… ఇలాంటివి చదివీ చదివీ అది సిగ్గుపడటం కూడా మానేసింది… అది ఉన్న సిట్యుయేషన్ అది… దివాలాకన్నా దిగువన ఉంది… మరీ నవ్వులపాలైన సంఘటన తాజాగా ఏం జరిగిందంటే..? అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటయ్ ఇలాంటివి… పాకిస్థానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లెన్స్ (పీఐఏ)కు చెందిన ఓ బోయింగ్ విమానాన్ని మలేషియా అధికారులు కౌలాలంపూర్‌లో జప్తు చేసేశారు… ఆల్‌రెడీ […]
చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…
‘‘పగటిపూట భేటీ అయితే, మీరు తొడపాశం పెడితే, చింతబరిగెలతో నాలుగు పీకితే, వాతలు పెడితే అందరికీ తెలిసిపోతుంది అని జగన్ ప్రాథేయపడటంతో…. సర్లె అనుకుని అమిత్ షా రాత్రి పదిగంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు… రాజ్యాంగ వ్యవస్థల జోలికి పోవద్దు అంటే విన్నావా..? ఏదో చెప్పావు కదా అని ఆయన్ని ఈశాన్యానికి పంపించేశాం, అయినా తృప్తి లేదా..? చెప్పు, నిమ్మగడ్డ జోలికి వెళ్తావా..? అంటూ చెడామడా తిట్టేశాడు… సార్, సార్, ఈసారికి తప్పుకాయండి ప్లీజ్ అని జగన్ బతిమిలాడాడు… […]
బెడిసిన మోడీ ప్లాన్స్… శశికళను తొక్కేసి, తనూ మునిగాడు… లక్కీ స్టాలిన్…
తమిళనాట బీజేపీ ఆట పూర్తిగా బెడిసికొట్టింది… తమిళ రాజకీయం బీజేపీకి ఏమాత్రం అంతుచిక్కదని మరోసారి తేటతెల్లం అయిపోతోంది… జయలలిత మరణించాక, అన్నాడీఎంకేను డిస్టర్బ్ చేసి, పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుని, అందులోకి జొరబడాలని ఆలోచించింది కానీ అడ్డంగా ఫెయిలైంది… ఇప్పటికిప్పుడు తను చేయగలిగేది కూడా ఏమీలేదు… ఏబీపీ-సీవోటర్ సర్వే చెబుతున్న నిజమిదే… ఇదేకాదు, ఈ సర్వే ఇంకొన్ని చేదు నిజాల్ని కూడా చెబుతోంది… కాస్త వివరంగా చెప్పుకుందాం… ఈ ఒపీనియన్ పోల్ నిజంగానే క్షేత్ర వాస్తవాన్ని చెబుతున్నదీ అనుకుందాం […]
చంద్రబాబుకు ఈనాడు హితబోధ..! ఆ నీతిబోధకు కొత్త విన్యాసాలు..!!
నిన్ననే అయిపోయింది కదా ఎన్టీయార్‌ను స్మరించుకోవడం..! ఆయన మరణానికి ఆంధ్రులంతా ఏడ్చారు, ఆయనకు ద్రోహం చేసినవాళ్లు మరింత బాగా ఏడ్చారు… నిన్న కూడా..! అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఆయనకు జరిగిన ద్రోహం, ఆయన చరిత్ర, ఆయన ప్రస్థానం, తోపు, శతఘ్ని, ఆత్మగౌరవం, తెలుగు జెండా ఎట్సెట్రా అంశాల గురించి కాదు… ఈనాడులో నిన్న ఒక నాలుగు కాలాల వార్త కనిపించింది… నిజానికి అది వార్త కాదు… ప్రత్యేక కథనం అంతకన్నా కాదు… ప్రకటన అసలే కాదు… […]
వాట్సప్ పట్టిచ్చింది..! టీవీ రేటింగుల దందాలో ఆర్ణబ్ మునిగినట్టే..!!
నేషన్ వాంట్స్ టు నో అబౌట్ “బార్కింగ్” ———————- NDTV ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ మిగతా ఛానెల్స్ తో పోలిస్తే ఇప్పటికీ భిన్నమే. ఎంత సీరియస్ విషయాన్నయినా ఒక పరిమితికి లోబడే చర్చిస్తుంది. కొన్ని విలువలు, సంప్రదాయాలను పాటిస్తుంది. యాజమాన్యం రాజకీయ బంధాలు, ఛానెల్లో చైనా పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు, ఛానెల్ ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించిన కేసులున్నా- ఇప్పటికీ NDTV ముద్ర చెదిరిపోలేదు. రోజూ రాత్రి ఎనిమిదిన్నరకు అరగంటపాటు రియాలిటీ చెక్ పేరిట ఒక బర్నింగ్ ఇష్యు […]
ఢిల్లీయే సుప్రీం..! రాష్ట్రాల అధికారాలకు అంటకత్తెర… తాజాగా మరో బిల్లు..!!
బలమైన కేంద్రం… బలహీనమైన రాష్ట్రాలు……. ఈ ఫెడరల్ స్పూర్తి అనేది దేశాన్ని బలహీనపరిచేదే తప్ప మన అవసరాల్ని, సవాళ్లను పరిష్కరించేది కాదు.., ఇంకా రాబోయే రోజుల్లో మనకు థ్రెట్స్ పెరగనున్నాయి… ఈ స్థితిలో కీలకమైన రంగాల్ని మరింతగా కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవడం… మన ప్రజాస్వామిక వాతావరణాన్ని, అధికారాలను మరింత కేంద్రీకృతం చేయడం…. అవును, బీజేపీ ప్రభుత్వం ఆ దిశలోనే వేగంగా అడుగులు వేస్తోంది… ఇంకా చాలా బిల్లులపై కసరత్తు సాగుతోంది… తాజాగా తెరపైకి వచ్చిన బిల్లు ‘‘ఇండియన్ […]
2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
మూడునాలుగు రోజులుగా ఈ విషయం గురించి రాయని సైటు లేదు, ఊదరగొట్టని టీవీ చానెల్ లేదు… ఇక యూట్యూబ్ చానెళ్లదయితే అరాచకం… ఒకరిని చూసి మరొకరు… తామేదో వెనకబడిపోతున్నట్టుగా… ఓ వేలంవెర్రిగా రాసేస్తున్నారు… ఏమిటయ్యా అంటే..? ‘‘2020 కరోనాతో దెబ్బతిన్నాం కదా… 2021 మరింత దరిద్రం… కాదు, కాదు, మహాప్రళయమే… అయిపోయింది, ఈ భూగోళం మీద మనిషి ఉనికి ఖతం… సౌర తుఫాన్లు ముంచెత్తబోతున్నయ్… ఆకాశం ఎర్రబారే ఓ మహావినాశనం తప్పదు… ఒక్కడూ మిగలడు… ఒక తోకచుక్క […]
KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
హహహ… పొద్దున లేవగానే వెలుగు అనే కాషాయ దినపత్రిక అలియాస్ బీజేపీ లీడర్ వివేక్ కరపత్రికలో ఓ వార్త… వరస్ట్ సీఎంలలో కేసీయార్‌కు కేసీయార్ 4వ ప్లేస్ అనే వార్త కనిపించింది… ఔనా..? ఓ సర్వే సంస్థ వరస్ట్ సీఎంలు అనే కేటగిరీలో ప్రశ్నలు అడిగి సర్వే చేసిందా అనే డౌటనుమానం రావడం సహజం కదా… ఎవడు బాబూ ఈ సర్వే చేసింది అని చూస్తే ఏబీపీ-సీవోటర్ అనే సంస్థ అట… ఓహో, అదా..? దాని కథేమిటో […]
సిరా గుర్తులు దేనికి బాబయ్యా… మళ్లీ మళ్లీ వస్తారా టీకాలకు కూడా..?!
ఏదో న్యూస్ సైటులో కనిపించింది… బహుశా దిన్యూస్‌మినట్ కావచ్చు… నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ వారియర్స్‌కు కరోనా వేక్సిన్లు వేసే ప్రక్రియ ఆరంభం కాబోతోంది కదా… డ్రైరన్ కూడా అయిపోయింది కదా… ఈ దశ తరువాత యాభై ఏళ్లు దాటిన వాళ్లకూ వేక్సినేషన్ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది కదా… వేక్సిన్ మీద ఎవరికీ ఏ అపోహలూ, భయాలూ అవసరం లేదనీ, నేనే తొలి టీకా వేసుకుంటాననీ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించాడు… […]
నో, నో, రైతులు గెలవలేదు… ఢిల్లీ దిగిరాలేదు… ఎక్కడున్న ట్రాక్టర్ అక్కడే…
ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… ఢిల్లీని ముట్టడించిన రైతుల్లో ఏదో డౌట్… అందుకే సుప్రీం చెప్పిన పరిష్కారాన్ని ఒప్పుకోం, ఆ వ్యవసాయ కొత్త చట్టాల్ని రద్దు చేయాల్సిందే అని భీష్మించారు… నిజంగానే చాలామంది డౌట్లు… ఎందుకంటే..? ఆ చట్టాల్ని సుప్రీంకోర్టు రద్దు చేయలేదు… అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది… మన దేశానికి సంబంధించి పార్లమెంటే సుప్రీం… అది చేసిన చట్టాల్ని (మరీ అనూహ్య, అసాధారణ పరిస్థితుల్లో, అంశాల తీవ్రతను బట్టి తప్ప… మరీ రాజ్యాంగ స్పూర్తికి […]
ఉండవల్లీ..! జగన్ నిన్ను రానివ్వడు…! ఇంకెక్కడికీ నువ్వు పోలేవు..!!
ఏపీ రాజకీయాల్లో కొందరు ఉంటారు… కొందరు కేఏపాల్ వంటి విదూషకులుగా నవ్విస్తుంటారు… సబ్బం హరి వంటి ఆస్థాన విద్వాంసులుగా ఇంకా బాగా నవ్విస్తారు… కానీ ఉండవల్లి వంటి నేతలు కూడా ఇప్పుడు కాస్త నవ్విస్తున్నారు… తను ఏ పార్టీయో తెలియదు, తను పెట్టే ప్రెస్‌మీట్ల పరమార్థం, ప్రయోజనం ఏమిటో తెలియదు… అప్పుడే ‘‘ఏమోయ్ జగనూ, ఫో, వెళ్లి మోడీని నిలదియ్, పోలవరం సంగతేమిటో అడుగు, ఏం, చేతకాదా..? కేసుల భయంతో వదిలేస్తవా… ఆయ్ఁ…’’ అని డిమాండ్ చేస్తాడు… […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 9
- Next Page »