Kiss-Chaos: రాజ్యాంగ రచనలో అణువణువునా ప్రజాస్వామ్యమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకుని…ఎదిగి… శాఖోపశాఖలై విస్తరించి…పూచి…కాయ కాచి…పంట ప్రజల చేతికి అందడమే పరమ ప్రయోజనం. ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్ట సభలు దేవాలయాల్లాంటివి. అక్కడ చర్చలు; చర్చోపచర్చలు; ప్రశ్నలు- సమాధానాలు; పార్టీల బాలాబలాలు…అన్నీ ప్రజలకు సంబంధించినవే అయి ఉంటాయి. ఇంతకంటే లోతుగా వెళితే అది ఎన్నికల ప్రక్రియ, చట్టసభల కూర్పు, స్వరూప, స్వభావాలు; విధి విధానాల మీద పోటీ పరీక్షల పాఠం అవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. ప్రజాస్వామ్యంలో ముద్దు ముచ్చట గురించి విడిగా ఎక్కడా […]
చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ..? తమ్ముడి కోసం నేరుగా రంగంలోకి అన్న…!!
ఒకటి గుర్తుందా..? చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ దంపతులను కలిశాడు… జగన్ సాదరంగా ఆహ్వానించి, చిరంజీవి చెప్పిన టికెట్ రేట్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటాను అన్నాడు… తమ్ముడు పవన్ కల్యాణ్ మీద జగన్‌కు ఎంత కోపం ఉన్నా సరే, అన్న చిరంజీవి పట్ల సుహృద్భావంతోనే వ్యవహరించాడు… ఒక దశలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను చీల్చడానికి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తాడనీ ఊహాగానాలు వినవచ్చాయి… తరువాత చిరంజీవి ఏం చేశాడు..? ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, నాగార్జున […]
విరోధాభాసం… అబ్బో, తూటా పేల్చిన ఆ తుపాకీయే బాగా కలతపడిందట…
రాజ్యానికి వ్యతిరేకంగా, శ్రామికజనం గొంతుకగా ఏళ్ల తరబడీ పనిచేసిన గద్దర్‌కు అదే రాజ్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మీద చర్చ సాగుతూనే ఉంది… బుల్లెట్నే నమ్మి, బ్యాలెట్‌ను ధిక్కరించిన గళం చివరకు తనే ఓ సొంత పార్టీ పెట్టిన తీరు మీద చాన్నాళ్లుగా చర్చ సాగుతోంది… గద్దర్ మీద విమర్శలు బోలెడు… అఫ్కోర్స్, తను విమర్శలకు అతీతుడు ఏమీ కాదు… వాళ్లో వీళ్లో దేనికి..? ఏ నక్సలైట్ల కోసం తను అవిశ్రాంతంగా, ప్రాణాలకు తెగించి పనిచేశాడో… […]
నిండూ అమాస నాడూ… ఆడపిల్ల పుట్టినాదీ…. గద్దర్ పాట వెనక కథ…
Taadi Prakash…….. 22 సంవత్సరాల క్రితం… ’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్. ‘జనహర్ష’, ‘విజయవిహారం’ పనులన్నీ చూసే మిత్రుడుదుర్గారెడ్డి గారిని అడిగితే, పాత పేపర్ కటింగ్ పంపించారు. అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక కథ చదవండి. […]
ఫాఫం ఈనాడు… కొడిగట్టిన పాత్రికేయ స్పూర్తి… చివరకు నమస్తే నయం…
చాలా చాలా గద్దర్ ఫోటోలు, జ్ఞాపకాల నడుమ… జనంపాటగా తను వేసిన అడుగుల నడుమ… అన్నంలో మెరిగెల్లాంటి కొన్ని ఫోటోలు, జ్ఞాపకాలు పంటి కింద కలుక్కుమంటయ్… ఉన్నయ్, గద్దర్ కొన్నేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, పోకడలు, వేసే అడుగులపై చాలామందికి చాలా అభ్యంతరాలున్నయ్… ఉంటయ్, ఉండటంలో తప్పులేదు… గుడి పూజారి ఎదుట ‘శెల్ల’ పట్టుకుని, ఆశీస్సుల కోసం కూర్చున్న ఫోటో తను చివరకు ఎలా మారిపోయాడో తెలుపుతుంది… ఆ ఫోటో చూసినప్పుడు ఎలాంటి గద్దర్ ఇలా ఎంతగా మారిపోయాడు […]
కేసీయార్ బడ్జెట్ గొప్పల బట్టలిప్పిన కాగ్… పేరుకే లెక్కల భారీతనం…
‘‘వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాదు కదా, మరెందుకు ఇప్పుడు కేసీయార్ నేల విడిచి సాముకు సిద్ధపడ్డాడు..? తెలియదు…! పేరుకు 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్… అందులో 50 వేల కోట్ల కొత్త అప్పులు… 45 వేల కోట్ల ఆదాయ లోటు… మరెందుకీ అధిక అంచనాలు..? అంకెల గొప్పలు..? పోనీ, సంకల్పానికి దరిద్రం ఎందుకు ఉండాలీ అనుకుందాం… ఐనా మరీ ఇంతటి అధివాస్తవిక బడ్జెట్‌లా అవసరమా..? ఒకవైపు కరోనాతో లక్ష కోట్ల మేరకు నష్టపోయామని […]
భర్తను కోల్పోతే ఆ స్త్రీ గుడికెళ్లే అర్హత కోల్పోతుందా..? దేవుడు వద్దంటాడా..?!
రుతుమహిళల్ని శబరిమల గుడిలోకి అనుమతించడం మీద పెద్ద రచ్చే జరిగింది… ఇది కుల, మత వివక్ష కాదు, లింగవివక్షే అని కోర్టు చెప్పేసరికి, హిందుత్వం మీద దాడికి భలే చాన్స్ దొరికింది అనుకున్న కేరళ సీపీఎం ప్రభుత్వం సింబాలిక్‌గా ఇద్దరు మహిళల్ని తనే పోలీస్ బందోబస్తుతో మరీ ప్రవేశపెట్టింది… ఒక్కో గుడిలో ఒక్కో ఆచారం, పద్దతి ఉంటాయి… కోర్టులు ఏమైనా ఆగమశాస్త్రాల ప్రకారం తీర్పులు చెబుతున్నాయా..? వాళ్లకు ఏం తెలుసు..? ఒక గుడి ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే […]
ఇది ఓ కక్షిదారు అవస్థ కథ కాదు… భారతీయ న్యాయవ్యవస్థ కథ…
ఇది ఎవరి కథ..? సోపన్ నర్సింగ గైక్వాడ్ అనే సుదీర్ఘ కక్షిదారు అవస్థ కథా..? లేక భారతీయ న్యాయ వ్యవస్థ కథా..? ఒక్కసారి ఈ వ్యాజ్యం పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం… 1968… సోపన్, వయస్సు 55 ఏళ్లు, మళ్లీ చదవండి, అప్పుడు ఆయన వయస్సు 55 ఏళ్లు… తనది మహారాష్ట్ర… ఒక రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఒక ప్లాట్ కొన్నాడు… కానీ కొన్నాళ్లకే తెలిసింది, దాన్ని తనకు అమ్మిన ఒరిజినల్ ఓనర్ ఏదో బ్యాంకులో తాకట్టు […]
‘మూడో పెళ్లాం’పై… ‘మళ్లీ పెళ్లి’పై నరేష్ లీగల్ గెలుపు… ఐనాసరే ‘నాలుగో పెళ్లి’కి చిక్కులే…
కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు… ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా […]
గాంధీ హిందువు కాడట… సాయిబాబా దేవుడే కాదట… ఎవరీ శంభాజీ భిడే…
శంభాజీ భిడే… ఎవరీయన..? ఈ ప్రశ్న మళ్లీ సెర్చింగులోకి వచ్చింది… గతంలో ఆయన నిర్వహించిన ఓ సభకు ప్రధాని మోడీ హాజరయ్యాడు, అప్పుడూ ఇదే సెర్చింగు… ఇప్పుడు వివాదాల్లోకి నెట్టబడిన సుధామూర్తి ఓసారి ఈయనకు మొక్కింది… అప్పుడూ ఇదే సెర్చింగు… మరి ఇప్పుడు ఎందుకు..? వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదు… మహాత్మాగాంధీపై వివాదాస్పద, అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు… 2. కోట్ల మంది పూజించే సాయిబాబా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు… గాంధీ మీద చేసిన […]
అబ్బా… ఇదేమి వెబ్సైటు..? నామా మీద ఏదో రాయబోయి ఇంకేదో గీకిపడేసి…
మరీ దిక్కుమాలిన వార్త అనలేం… మంచి కోణమే… కానీ రాయడంలో ఫ్లాప్… ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానెల్ గురించి కాదు… ఆంధ్రజ్యోతి సైటులో వచ్చే కొన్ని వార్తలు పాత్రికేయ ప్రమాణాలకు దూరంగా ఉంటాయి ఎందుకో మరి… ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ టీం దాన్నలా గాలికి వదిలేసినట్టుంది… ఉదాహరణకు ఈరోజు రాసిన నామా నాగేశ్వరరావు వార్త… ముందుగా ఆ వార్త సారాంశం చెప్పుకుందాం… అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం నామా నాగేశ్వరరావు పార్లమెంటులో ప్రశ్న వేస్తూ ‘‘కేసీయార్ 750 మంది పంజాబ్, […]
సాకె భారతికి సర్కారీ సాయం… ఆంధ్రప్రభలో ఓ వార్త ఇష్టారాజ్యం…
ముందుగా ఓ వార్త చదవండి… ‘‘సాకే భారతిని యువత రోల్ మోడల్ గా తీసుకోవాలి… అనంతపురం జిల్లా కలెక్టర్ యం.గౌతమి… ప్రభుత్వం తరపున రెండెకరాల పొలం పట్టా అందజేత… కూలి పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ యం.గౌతమి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సింగనమల మండలం నాగలగుడ్డం గ్రామానికి చెందిన సాకే భారతి […]
సారీ డాటర్… నిన్ను ప్రాణాలతో నీ తల్లిదండ్రులకు అప్పగించలేకపోయాం…
అసలు నమ్మబుద్ధి కాలేదు… మన దేశ పోలీసులేనా వీళ్లు..? అసలు ఇది జరిగిందా..? మన పోలీస్ వ్యవస్థలో దీన్ని ఊహించొచ్చా..? తప్పుడు కేసులు, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్ అనే ఆరోపణలున్న మన పోలీసులు సారీ చెప్పారా..? అందుకే ఒకటికి రెండుసార్లు వార్త చదివి, అదీ సరిపోక కేరళ పోలీసుల ట్విట్టర్ ఖాతా చూస్తే తప్ప నమ్మకం కుదరలేదు… ఐనా ఇంకా ఆశ్చర్యమే… విషయం ఏమిటంటే..? కేరళలో ఓ ఐదేళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం నుంచీ కనిపించకుండా […]
ఆ నారాయణ అంత క్రూరుడా..? సొంత మరదలిపైనా శాడిజం నిజమేనా..?
ముందుగా ఓ తాజా వార్త చదవండి… మాజీమంత్రి టీడీపీ నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన పొంగూరు కృష్ణప్రియ…. టీడీపీ మాజీ మంత్రి నారాయణ వేధింపులపర్వం… పోలీసులను ఆశ్రయించిన ప్రియ… మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే… తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రియ గళమెత్తింది… ఈ క్రమంలోనే తనకు న్యాయం […]
జగన్ వైఎస్ కాదు… ఈనాడు ఆర్థికమూలం మార్గదర్శినే పెకిలిస్తున్నాడు…
సహజంగానే ‘మార్గదర్శి’పై చిట్స్ రిజిష్ట్రార్ ప్రకటన కూడా ఈనాడులో వచ్చిందని అనుకున్నారు చాలామంది… కానీ రాలేదు… బహుశా ఈనాడే ఆ యాడ్‌ను యాక్సెప్ట్ చేసి ఉండదు… తన చిట్స్ చందాదారుల గ్రూపులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడాన్ని తన పత్రికలోనే ఫుల్ పేజీ ప్రకటనగా పబ్లిష్ చేయడానికి మనసొప్పి ఉండదు… సర్కారీ నిర్ణయానికి తాము ఆమోద ముద్ర వేయడం దేనికని భావించి ఉంటుంది… ఎలాగూ ఏపీప్రభుత్వం ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇవ్వదు, సో ఆ పత్రికలోనూ కనిపించలేదు… అత్యంత సహజంగా […]
ఎవడూ ఏమీ అడగడు… పెళ్లి వేడుకల్లో యథేచ్ఛగా పాడుకొండి, గెంతండి…
No Courtesy:పోనీలే. ఆలస్యమయినా…కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. ఇకపై పెళ్లిళ్లలాంటి శుభ కార్యాల్లో సినిమా పాటలు వాడుకుంటే కాపీరైట్ చట్టం వర్తించకుండా చట్టాన్ని సవరించారు. అలాగే అధికారిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక, సాహిత్య, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో సినిమా పాటలు వాడుకున్నా కాపీ రైట్ గొడవలు లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఈరోజుల్లో పెళ్లిలో మంగళసూత్రం కట్టడం మరచిపోయినా పెద్ద సమస్య కాదు. పెళ్లికి ముందు సంగీత్ లో సినిమా పాటలకు నడకరాని పిల్లల నుండి ఎనభై ఏళ్ల పండు ముసలి వరకు […]
ఉదయభాను గొంతు నొక్కాల్సినంత అవసరం ఎవరికి ఉంది..?!
‘‘నేను ఏ పార్టీ తరఫున రాలేదు… బీసీ గళమెత్తడానికి వచ్చాను’’ అంటూ అలనాటి యాంకర్ ఉదయభాను చంద్రబాబు కొడుకు లోకేష్ పాదయాత్రల మీటింగులకు అనుబంధంగా ఆర్గనైజ్ చేయబడిన ఓ మీటింగులో చెప్పింది… సరే, ఆ కార్యక్రమం గురించిన చర్చ ఇక్కడ అవసరం లేదు గానీ ఉదయభాను కూడా ఈ మీటింగులో ప్రసంగం చేసింది… ఆమె ఏపీ కాదు… తెలంగాణలోని సుల్తానాబాద్ ఆమె స్వస్థలం… అదీ అప్రస్తుతం అనుకుందాం… నేను అయిదేళ్లుగా టీవీల్లో కనిపించడం లేదు… కుట్ర పన్నారు… […]
బడి వార్తలు రాస్తే బహుపరాక్… జగన్, కేసీయార్ ఇద్దరూ అదే ‘బడిబాట’…
పొద్దున్నే కనిపించిన ఓ వార్త… ఇదీ… మీడియా బాధ్యులపై క్రిమినల్ కేసులు… విస్సన్నపేట జడ్పీ హైస్కూల్ లో పాత రేకుల షెడ్స్ లో విద్యార్థులకు గొడుగులు ఇచ్చి కూర్చోబెట్టి, పాఠశాలలో వసతులు లేవని, తరగతి గదుల్లో వర్షం కురుస్తుందని వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన పత్రికలు, చానళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు డీఈఓ రేణుక ఆదేశాలు. విలేకరులపై కేసులు నమోదు చేయాలని విస్సన్నపేట ఎంఈఓకు ఆదేశాలు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలన తీరు ఇలాగే ఉంది… ప్రత్యేకించి విద్యావ్యవస్థలు… అవస్థలు… […]
హైకోర్టు జడ్జికి షాక్ ఇచ్చిన మోడీ సర్కారు… ఢిల్లీ నుంచి కలకత్తాకు బదిలీ…
తీర్పుల మెరిట్ గురించి కాసేపు వదిలేయండి… ఏం రాస్తే ఎవరితో ఏం తంటా ముంచుకొస్తుందో తెలియదని మెయిన్ స్ట్రీమ్ అస్సలు రాయడం లేదు… జడ్జిలు తిరుమలకు వస్తే ఫోటోలు వేసి, వార్తలు రాసి, మర్యాదగా చేతులు దులుపుకుంటే సరి అనుకుంటోంది మెయిన్ స్ట్రీమ్… ఎవరి అవసరం, ఎవరి ముందుజాగ్రత్త వారిది… ఏది రాయవచ్చో, ఏది రాయకూడదో తెలిసిన న్యాయమేధావులు సైతం నోళ్లు కట్టేసుకుంటున్నారు… ఎప్పుడేం అవసరం వస్తుందో అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ కనబరుస్తున్న వింత ధోరణి చివరకు […]
మిస్టర్ రేవంతుడూ… వెలమలు పాయింట్ ఫైవ్ కాదు… 10 పర్సెంట్…
పాయింట్ ఫైవ్ కాదు… 10 పర్సెంట్… కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. 2018 ఎన్నికల్లో అక్కడ రెండో స్థానంలో నిలిచిందిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతానని వనమా వెంకేటేశ్వర్ రావు చెప్పారు. పదవీకాలం ఇంకో మూడున్నర నెలలు ఉన్నది. ఈ కాలం అక్కడ ఎవరు ఎమ్మెల్యే అనేది కోర్టు నిర్ణయించనున్నది. ఇప్పటికైతే హైకోర్టు తీర్పు అంతిమం. ఈ తీర్పుతో తెలంగాణ శాసనసభలో లెక్కలు ఛేంజ్ […]
- « Previous Page
- 1
- …
- 59
- 60
- 61
- 62
- 63
- …
- 149
- Next Page »