నిజానికి కాంగ్రెస్ ముక్తభారత్ అనే టార్గెట్ దిశలో మోడీ, అమిత్ షా చేస్తున్నదెంత..? పిసరంత..! కానీ బీజేపీ లక్ష్యసాధన దిశలో కాంగ్రెసే ఎక్కువ కష్టపడుతోంది… ఒక్కముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ హరాకిరీ చేసుకుంటోంది… రాజస్థాన్ రాజకీయాలు కాంగ్రెస్ దురవస్థను స్పష్టంగా కళ్లముందు ఉంచుతున్నయ్… సిద్ధూను పైకి లేపీ లేపీ… పంజాబ్‌లో కాంగ్రెస్ తనే తిరిగి ఇప్పట్లో లేవనంతగా కూరుకుపోయింది… సిద్ధూ జైలుపాలు, ఆ మాజీ సీఎం బీజేపీ పాలు… పంజాబ్ ఖలిస్థానీ శక్తులపాలు… బుజ్జగింపులు, కొనుగోళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు, […]
రాచహోదాల్ని తన్నేసి వెళ్లిపోయింది… మళ్లీ ఆ ‘గౌరవ బందిఖానా’ తప్పదా..?
ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ గురించి అందరికీ తెలిసిందే కదా.., మన బ్రహ్మంగారిలాగే కాలజ్ఞానం రాసిన ప్రముఖ జ్యోతిష్కుడు… చాలామందికి ఆయన జోస్యాలు నిజమవుతాయనీ, అవుతున్నాయనీ, అవుతాయనీ విశ్వాసం… కాకపోతే జోస్యాలు అన్నీ మార్మికంగా ఉంటయ్… దాంతో చాలామంది వాళ్ల అవగాహన మేరకు, వాళ్లకు అర్థమైన మేరకు ఎవరికితోచిన బాష్యాలు వాళ్లు చెప్పారు, చెబుతూనే ఉన్నారు… నోటికొచ్చింది రాసి, కమర్షియల్‌గా బుక్స్ అమ్ముకున్నవాళ్లూ ఉన్నారు… ‘నోస్ట్రాడామస్… ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్’ పేరిట మా రియో […]
ఏమయ్యా రాధాకృష్ణా… నీమాట మీద నువ్వే నిలబడకపోతే ఎట్లా..?!
మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా… ఇది కరెక్టు కాదు… నీ మాట మీద నువ్వు నిలబడి ఉండాలె కదా… గిట్ల చేస్తవేంది..? మొన్న ఏదో వార్త మీద నిలదీయడానికి నీ ఆఫీసుకు వచ్చిన కవితను కూర్చోబెట్టి ఏమంటివి..? నమస్తే తెలంగాణ అదొక పేపరా..? అసలు దాన్ని కేసీయారే చదవడు అన్నావు… మేం మస్తు పోటీ ఇస్తున్నాం, మస్తు సర్క్యులేషన్ పెరిగింది అని ఆమె ఏదో చెప్పుకుంది… అది వేరే సంగతి… మరి అది అసలు పేపరే కాదంటివి నువ్వు… […]
రష్యా మిలిటరీ సామర్థ్యం ఉత్త డొల్లేనా..? ఉక్రెయిన్ యుద్ధం తేల్చింది అదేనా..?
పార్ధసారధి పోట్లూరి …….. సహనం కోల్పోయి పుతిన్ తానంత తానుగా వ్యూహాత్మక అణు ఆయుధాలని [Strategic Nuclear Weapons] ఉపయోగించేలా చేసి, దరిమిలా రష్యా మీద పూర్తి స్థాయి ఆంక్షలు విధించేలా చేసి చివరికి ప్రజలే తిరుగుబాటు చేసి అధ్యక్ష పీఠం నుండి దిగిపోయేలా చేయడానికి కావాల్సిన ప్లాన్ ని చాలా పకడ్బందీగా అమలుచేయడంలో నాటో కూటమి విజయవంతం అయ్యింది. పుతిన్ తాజాగా తాను ఆటమిక్ వేపన్స్ ని ప్రయోగించడానికి వెనుకాడను అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు… గత […]
లెంపలేసుకున్న యార్లగడ్డ… ఆ ధిక్కార స్వరంలో ఏదో వణుకు…
కొంచెం నవ్వొచ్చింది… కాస్త జాలేసింది… అందరూ నిమ్మగడ్డలు కాలేరు… యార్లగడ్డలు స్థిరంగా నిలబడలేరు అనిపించింది… ఈరోజు పత్రికల్లో వచ్చిన అనేకానేక వార్తల్లో ఈ ఒక్క వార్తే విశేషంగా ఆకర్షించింది… అసలు విషయం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచనల్లో పడేసింది… ఇంతకీ ఆ విషయం ఏమిటంటే… జగన్ బాగా ఆలోచించీ చించీ, అత్యవసరంగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల సౌభాగ్యం కోసం, అత్యున్నత ప్రజాస్వామిక విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి… ఫాఫం, ఆ హెల్త్ […]
ఆపరేషన్ మిడ్నైట్..! క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్‌లా ఓ న్యూస్ ప్రజెంటేషన్…!!
ఈ కథనాన్ని మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం… ఇదంతా నిజమేననీ నేనేమీ చెప్పడం లేదు… ఒక వర్తమాన వార్తాంశం మీద ఎవరు రాశారో గానీ… ఓ క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్ కథనంలాగా ఉంది… ఆ ప్రజెంటేషన్ విభిన్నంగా, సంప్రదాయిక కథనశైలులకు విరుద్ధంగా ఓ పాపులర్ సస్పెన్స్ నవలలాగా రాయబడింది… అదే ఇక్కడ చెప్పదలిచింది… ఈ కథనంలో పేర్కొన్న పీఎఫ్ఐ ఆర్గనైజేషన్, అరెస్టులు నిజమైన వార్తలే… అయితే ఈ ఆపరేషన్ ఇలాగే సాగిందా అనేది తెలియదు… […]
ఆ చైనా ఇనుప గోడల వెనుక ఏదో కుట్ర..! ఎవరికి స్పాట్ పెట్టారు..?!
పార్ధసారధి పోట్లూరి ………… కమ్యూనిజం అంటే ఎదురుతిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపడమే ! మావో, స్టాలిన్ లు అదే చేశారు. ఇప్పుడు జింగ్పింగ్ కూడా అదే చేస్తున్నాడు. మీకు గుర్తుందా ఒక పాత యాడ్… అమ్మమ్మ తో మనవరాలు పాప ఏడుస్తున్నదని అంటుంది… యితే గ్రైప్ వాటర్ పట్టు, మీ అమ్మకి నేను అదే పట్టాను. మీ అమ్మ కూడా నీకు గ్రైప్ వాటరే పట్టింది అంటుంది అమ్మమ్మ… జింగ్పింగ్ శాశ్వత అధ్యక్షుడుగా మరోసారి ఎన్నిక జరగాల్సింది […]
యుగపురుష్… మూలపురుష్… జాతిపురుష్… వీళ్లతోనే ఆంధ్రాశకం ఆరంభం…
ఎన్టీయార్ అన్నది పేరు కాదు, ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక… ఇది ఎన్టీయార్ కొడుకు బాలయ్య ఉవాచ… హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు తీసేస్తే, ఆ పెద్ద మనిషిని అవమానిస్తే అది కోట్ల మందిని అవమానించినట్టే…. ఇది జగన్ చెల్లె షర్మిల ఉవాచ… ప్రపంచం ఆరాధించే పేరు ఎన్టీయార్… ఇది ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు ఉవాచ… నిజంగా జగన్ నిర్ణయం తిక్కతిక్కగా ఉందని చీదరించుకున్న తటస్థులు కూడా ఇదుగో, ఈ ఎన్టీయార్ అత్యాంతి తీవ్ర […]
పర్సులో యాలకులు, దిండు కింద లవంగాలు..! ఏది సైన్స్, ఏది సెన్స్…?!
( ……. ఆకుల అమరయ్య ……… ) బీకాంలో ఫిజిక్స్.. జంతుశాస్త్రంలో బోటనీ.. ఆకాశం నుంచి రుదిరం.. టెంపులంటే కణతనే మరో అర్థముందనే తెలియక ఆలయమేనని బలంగా బల్లగుద్ది మరీ చెప్పే నడమంత్రపు కాలమిది. అటువంటి కాలంలో ఉసిళ్లు (వర్షాకాలంలో వచ్చే రెక్కల పురుగులు), పుట్టకొక్కులు (ముష్రూం), ఖగోళ శాస్త్రం (స్పేస్ సైన్స్), బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide), విషావరణం (పొల్యూషన్), శ్వాసించే గృహం (ఎయిర్ కండిషన్డ్ హౌస్), తొవ్వోడు (డ్రెడ్జర్) అంటే ఎవరికి తెలుస్తుంది, చెప్పండి.. […]
మైండ్ ఖరాబ్… ఆ స్టేడియంలో మ్యాచ్ చూస్తే మజా ఏముందిరా ..?
హమ్మయ్య… కాస్త సద్దుమణిగింది… హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల తొక్కిసలాట, పోలీసుల లాఠీ ఆట, నిర్వాహకుల డబ్బుల ఆట… మీడియా కన్నులపంట… గంటల తరబడీ చూపించే చూపి, వాగిందే వాగి, పెంటపెంట చేశారు… ఆమె ఎవరో తన బిడ్డ ఈ దేశం కోసం గాయాలపాలైనట్టు విలపిస్తోంది… ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టీవీ చానెళ్లలో ఎండగడుతోంది… ఈరోజు కాస్త హడావుడి తగ్గింది… మనకు ఎలాగూ పీఎఫ్ఐ ముప్పులు, ఖలిస్థానీ ముప్పులు పనికిరావు, కనిపించవు కదా… మళ్లీ ఎన్టీయార్, […]
సచిన్ పైలట్… బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే మరో ఏకనాథ్ షిండే…
ప్రజలు ఏం తీర్పు చెప్పారు అనేది బీజేపీకి అవసరం లేదు… ఏం చేస్తే గద్దెనెక్కగలం..? స్ట్రెయిట్‌గా గెలిస్తే వోకే, లేదంటే ఏం చేద్దాం..? ఇదొక్కటే ఫోకస్… యుద్ధంలో, శృంగారంలో ఏదీ తప్పు కాదు, సేమ్, రాజకీయాల్లో కూడా..! ఇదేమీ వాజపేయినాటి కాలం కాదు, ఇది మోడీషా జమానా… కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కూలదోసిన తమకు రాజస్థాన్ మింగుడుపడకపోవడం బీజేపీకి నచ్చడం లేదు… జీర్ణం కావడం లేదు… మహారాష్ట్రలో కూడా బలమైన దెబ్బ తీయగలిగింది ప్రత్యర్థుల […]
PK Team :: హైదరాబాద్ టెంట్ ‘పీకే’శారు… ఈ ఇద్దరి దోస్తీ కటీఫ్…
‘‘తూచ్, ఈ దసరాకు కేసీయార్ జాతీయ రాజకీయాల ఎంట్రీ, కొత్త పార్టీ ఏర్పాటు ఉండకపోవచ్చు… బహుశా మరో రెండు నెలలు జాప్యం తప్పదు… ఢిల్లీ మద్యం స్కాం తలనొప్పి, ఈడీ-సీబీఐ యాక్టివ్ కదలికలతో పార్టీలో ఓరకమైన ఆందోళన కనిపిస్తోంది’’…. ఇది ఒక వార్త… ‘‘పీకే మీద కేసీయార్‌కు వైరాగ్యం వచ్చేసింది, లైట్ తీసుకున్నాడు, దాంతో ఆ పీకే టీం హైదరాబాద్ దుకాణం మూసేసింది, ఏపీకి తరలిపోయింది’’…. ఇది ఇంకో వార్త… ఈ రెండు వార్తల్ని ఓసారి కేసీయార్ […]
Congress Chiranjeevi :: ఔననడు, కాదనడు… దూరం కాదు, దగ్గరగా లేడు…
ఆ ఐడీ కార్డు కలకలం రేపుతోంది… అది నిజమైందో కాదో తెలియదు కాబట్టి ఆ కార్డు బొమ్మ ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు… విషయం ఏమిటంటే… చిరంజీవికి పీసీసీ డెలిగేట్ అని కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది అనేది వార్త… రెండుమూడు రకాల కార్డులు వార్తల్లో కనిపిస్తూ ఉండేసరికి డౌటొచ్చింది… పైగా ఇటు చిరంజీవి క్యాంపు గానీ, అటు ఏపీ కాంగ్రెస్ గానీ దీనిపై ఏమీ వ్యాఖ్యానించడం లేదు… కానీ ఈ […]
ఎప్పటిలాగే… ఎన్టీయార్ కుటుంబం సైలెంట్… కన్నోళ్లు, కట్టుకున్నోళ్లు..
ముందుగానే ఓ పెద్ద డిస్క్లయిమర్…. ఇది ఈ కథనం రాస్తున్న సమయం బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న పరిస్థితి…. ఎన్టీయార్ పేరును పీకిపారేసి, వైఎస్ పేరు పెట్టాడు కదా జగన్ హెల్త్ యూనివర్శిటీకి… తెలుగుదేశం గాయిగాయి గత్తర రేపుతున్నది… దానికి అది అవసరం… జగన్ ఎక్కడ దొరికితే అక్కడ బదనాం చేయడం దాని రాజకీయ అవసరం… పైగా ఇది జగన్ పట్ల వ్యతిరేకతను పెంచుతోంది… తెలుగుదేశంతో సంబంధం లేని తటస్థులు కూడా జగన్ నిర్ణయాన్ని […]
YSR :: సాక్షాత్తూ షర్మిలే కుట్రగా ఆరోపిస్తున్నా… ఎక్కడా చడీచప్పుడు లేదు…
ఇంతకీ వైఎస్‌ను ఎవరు హతమార్చారు..? ఎందుకు..? వాళ్లే ఆయన బిడ్డ షర్మిల మీద కూడా ఎందుకు కక్షగట్టారు..? జగన్‌కు కూడా లేని పట్టింపు షర్మిలకు ఎందుకు కలుగుతోంది..? ఏపీ రాష్ట్రం మొత్తాన్ని వైఎస్ నామమయం చేస్తున్న జగన్ ఆయన మరణకారకుల్ని వదిలేశాడా..? ఎవరో తనకు తెలుసా..? క్షమించాడా..? ఇవన్నీ పక్కన పెడితే… సాక్షాత్తూ వైఎస్ బిడ్డ స్వయంగా మా నాన్న మరణం వెనుక కుట్ర అని చెబితే, తనకూ ముప్పు ఉందని చెబుతుంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లో […]
ఈ-శ్రాద్ధం పెడితే రేటు 21,500… పిండప్రదానంపైనా 5 శాతం జీఎస్టీ…
పితృకర్మల్ని వారసులు గాకుండా… ఎవరు పడితే వారు నిర్వర్తించవచ్చా..? తద్వారా పితృ ఆత్మలకు శాంతి లభిస్తుందా..? సంతృప్తి పొందుతాయా..? అసలు ప్రభుత్వాలే ఈ పితృకర్మల్ని ఓ బిజినెస్‌గా మార్చేయవచ్చా..? పోనీ, ఆన్లైన్ పెళ్లిళ్లలాగే ఆన్లైన్ పిండప్రదానాలు చేయవచ్చా..? వారసుడి తరఫున పంతుల్లే మమ అనిపించేసి, ఓ వీడియోను పెన్‌డ్రైవ్‌లో పంపించేస్తే, పంతులుకు సంభావన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందా..? ఇవన్నీ ఆమోదయోగ్యమేనా..? ఎప్పుడైనా ఈ ప్రశ్నలు మీలో మెదిలాయా..? పితృకర్మలు హిందూ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఓ భాగం… […]
జీవిత ఖైదీలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించవచ్చా..?!
నిజంగా సీరియస్‌గా ఆలోచించాల్సిన కేసే ఇది… ఒక హత్య కేసు… బోలెడు కోర్టు సమయం, పోలీసుల ప్రయాస, సాక్ష్యాధారాల సేకరణ, తరువాత కోర్టు జీవితఖైదు విధిస్తే… సింపుల్‌గా ఒక రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, ఆ నేరస్థుల్ని వదిలేయవచ్చా..? మరిక ఇంత లీగల్ ప్రొసీజర్‌కు, కోర్టు తీర్పుకు అర్థమేమిటి..? అసలు ఖైదీల విడుదలలో ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలేమిటి..? పరిమితులేమిటి..? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తున్నాయీ అంటే… ఏపీ హైకోర్టులో ఒక మహిళ పిటిషన్ […]
ఎన్టీయార్ బదులు వైఎస్ఆర్… రేప్పొద్దున మరో కులనేత సీఎం అయితే..?!
తుంటను ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టుంది… అని ఓ సామెత… అంటే చిన్న దుంగను కింద పారేసి, పెద్ద చెట్టు మొద్దును ఎత్తుకుని భరిస్తున్నట్టు..! వరుసగా జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఓ మేధావిని అభిప్రాయం అడిగితే, తను వ్యక్తం చేసిన సింపుల్ వాక్యం అదీ..! హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీయార్ పేరు తొలగించి, వైఎస్ఆర్ పేరు పెట్టాలనే నిర్ణయం కూడా అలాంటి అనేక నిర్ణయాల కోవలోనిదే… జగన్ రాజనీతిజ్ఞుడు కాదు, భవిష్యత్తులో అవుతాడే లేదో తెలియదు… కానీ […]
సీన్ ఫుల్ రివర్స్…! నాకేమిటని విర్రవీగిన సంజయుడికి తత్వం తెలుస్తోంది..!!
పార్ధసారధి పోట్లూరి …………… దీపావళి పండుగ జైల్లో చేసుకోవాల్సిందే ! 2020 లో రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ తరువాత శివసేన MP చేసిన వ్యాఖ్య ఇది! (కంగనా రనౌత్ మీద మరీ నీచమైన వ్యాఖ్యలు చేశాడు…) సరిగ్గా రెండేళ్ల తరువాత దృశ్యం తిరగబడింది. గత 40 రోజులుగా జైల్లో కాలం గడుపుతున్న సంజయ్ రౌత్ కి తాజాగా మరో 14 రోజుల ED కస్టడీ ని పొడిగిస్తూ ప్రత్యేక కోర్ట్ […]
అదేమిటమ్మా… ఆఫ్టరాల్ 75 ఏళ్లకే రాజకీయాలకు సెలవా…? హవ్వ..!!
మన సినిమా హీరోలు నడుములు వంగిపోయినా, వీపులకు బద్దలు కట్టుకుని స్టెప్పులు వేస్తుంటారు… వెండితెరకు వేలాడుతూ ఉంటారు… మన నాయకులు మరీ ఘోరం… ఆయుష్షు ఉన్నంత కాలం “సేవ” చేస్తుంటారు… మధ్యలో రిటైర్డ్ అని చెప్పుకున్నా సరే… ఇక నా బతుకంతా సినిమా స్టెప్పులకే అంకితం అన్నట్టుగా వ్యవహరిస్తున్నా సరే… తాజాగా ‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం దూరం కాలేదు’’ అంటూ మార్మిక సంభాషణల్ని తాజా సినిమాల్లో జొప్పించి, మళ్లీ వచ్చేస్తాను సుమా […]
- « Previous Page
- 1
- …
- 60
- 61
- 62
- 63
- 64
- …
- 119
- Next Page »