కొన్ని పత్రికల్లో, కొన్ని సైట్లలో, కొన్ని ట్యూబ్ చానెళ్లలో, కొన్ని టీవీల్లో కనిపించింది వార్త… ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది, అందుకని స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించబోతున్నారు అని ఆ వార్త సారాంశం… వోకే, ఇన్నేళ్లుగా అసలు పార్టీ నిర్మాణం, స్వరూప స్వభావాలు ఏమీ లేకుండా పార్టీని కొనసాగించడం ఎంత విశేషమో… అన్నిచోట్లా అభ్యర్థులున్నారా అసలు అనే ప్రశ్నల నుంచి 100 శాతం […]
బీజేపీ అర్థరహిత విమర్శలు… కేరళ లెఫ్ట్ ప్రభుత్వ నిర్ణయం సమంజసమే…
ఈమె పేరే కే వాసుకి… కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… పినరై విజయన్ ప్రభుత్వం తాజాగా ఈమెకు విదేశాంగ బాధ్యతలు అప్పగించింది… ప్రస్తుతం ఉన్న స్కిల్, లేబర్ విభాగాల కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న ఆమెకు విదేశాంగ కార్యదర్శిగా ఈ అదనపు బాధ్యత అప్పగించారు… ప్రతిపక్షం అంటే ఆలోచనరహితంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అన్నట్టుగా ఉంది కదా వర్తమాన రాజకీయం… కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా… ఇంకేముంది..? కేరళ బీజేపీ లెఫ్ట్ నిర్ణయంపై మండిపడింది… ‘‘ అసలు ఈ […]
మేటిగడ్డా… మేడిపండుగడ్డా… మహాద్భుతం అయితే చుక్కనీరూ నిల్వదేం..?!
ఉన్నది లేనట్టుగా…. లేనిది ఉన్నట్టుగా… ప్రచారంతో గాయిగత్తర లేపడం కేసీయార్ క్యాంపుకి ఆది నుంచీ అలవాటే… ఈ ధోరణికి మంచి తెలుగు పేరు లేనట్టుంది… ఈ ప్రచార ధోరణి కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి జనం ఎన్నికల్లో ఛీత్కరించినా సరే ఆ అలవాటు నుంచి ఆ క్యాంప్ బయటపడలేకపోతున్నది… ఫాఫం, కాంగ్రెస్కు కౌంటర్ ఎటాక్ చేతకావడం లేదు, ఎప్పటిలాగే..! నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో ఒకటే ఊదర… నిండుకుండలా మేడిగడ్డ అని ఫోటోలు… కాళేశ్వరం ఓ మహాద్భుతం అన్నట్టుగా […]
తెలుగోడు ఓ వ్యాపార సామ్రాజ్యం నిర్మిస్తాడు… కానీ కాపాడుకోలేడు..!
దివాలా తీసిన జీవీకే పవర్ == కర్ణాటకకు చెందిన విజయ్ మాల్య, గుజరాత్ కి చెందిన నీరవ్ మోది లాంటి వాళ్లు వ్యాపారాల కోసం బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఆ తదనంతరం వాటిని చెల్లించలేకపోవడం వలన డిఫాల్ట్ అవడమే కాకుండా దేశం విడిచి లండన్ లో తలదాచుకున్నారు. ఇప్పుడు అదేకోవలో ఒక తెలుగువాడు చేరే అవకాశాలు ఉన్నాయా? తెలుగువాడైన గుణపాటి వెంకట కృష్ణా రెడ్డి (జీవీకే) గ్రూపు సంస్థలలో ఒకటైన జీవీకే పవర్ […]
ప్రపంచ టాప్ వంటకాల జాబితాలో నంబర్ వన్ స్థానం… బీఫ్…!!
బీఫ్..! మన దేశంలో మతభావాలు, మనోభావాలు, రాజకీయాలు, వివాదాలు బోలెడు దీని చుట్టూ తిరుగుతుంటాయి తెలుసు కదా… హింస కూడా..! ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అనేక దేశాల్లో అదొక కామన్ నాన్-వెజ్ డిష్… టేస్ట్ అట్లాస్ అనే ఫేమస్ వరల్డ్ ఫుడ్ సైట్ పలు కేటగిరీల్లో ఏటా ఫుడ్ రెసిపీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది కదా… తాజాగా వరల్డ్ టాప్ 100 డిషెస్ జాబితాను రిలీజ్ చేసింది… అందులో నంబర్ వన్ ర్యాంకు బ్రెజిలియన్ బీఫ్ కట్… 4.75 గ్రేడ్ […]
ఫేక్ ఐడీలను రిమూవ్ చేయలేడట… వీడూ వీడి బొంద ఆల్గరిథమ్…
== మెషిన్ vs మనిషి == ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యుగం నడుస్తుంది కదా! అయితే ఈ మెషిన్లను మనుషులను వేరు చేసేది ఇంగిత జ్ఞానమే. అర్థం కాలేదా? శంకర్ తీసిన రోబో సినిమాలో కాళ్ళు, చేతులు, తెలివితేటలు ఇలా ఒక మనిషికున్నవన్ని నాకున్నాయి అని రోబో రజినీకాంత్ అంటే అసలైనది ఇంకొకటి లేదని కమెడియన్లు రోబోను ఏడిపిస్తారు. కమెడియన్ల ఉద్దేశం వేరే అయినప్పటికీ సినిమాలో మనిషికున్న ఏమోషన్స్ రోబోకి లేవని అంటే ఆ […]
రవిప్రకాష్లోని ఆనాటి పాత జర్నలిస్టు మళ్లీ బయటికొచ్చాడు..!!
ముందుగా ఓ వార్త… యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఆర్టీవీ ప్రముఖ జర్నలిస్టు రవిప్రకాష్ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని లీగల్ నోటీసు పంపించింది… ఇదే ఆ వార్త స్థూల సారాంశం… రవిప్రకాష్ గురించి ఎవరికీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిచయం అక్కర్లేదు కదా… ఈమధ్య తను స్వయంగా ఓ స్టోరీ ప్రజెంట్ చేశాడు… అందులో మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి (MEIL) సదరు బ్యాంకు ఎడాపెడా ఫేక్ గ్యారంటీలను ఇస్తోందనేది పాయింట్… కొన్ని వేల […]
రైల్వే పార్కింగులో కారు పెడుతున్నారా..? ఇక మీ పని ఖతం…!!
ముందుగా ఓ పోస్ట్ చదవండి… లలిత అని ఓ వీఐపీ గీతరచయిత సతీమణి… అమ్మా, ఆమ్రపాలి, దీన్ని ఏమైనా పట్టించుకుంటే నువ్వు తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాదు జనానికి ఎనలేని మేలు చేకూర్చినదానివే అవుతావు… నాకెందుకు తీట అనకు… నువ్వు ఐదారు నగర పోస్టులకు అధికారిణివి మరి…! నగరంలో పార్కింగ్ అనేది ఓ పెద్ద దందా… చివరకు పబ్లిక్ ప్లేసుల్లో అఫిషియల్ పార్కింగ్ ఏజెన్సీలది మరింత పెద్ద దందా.,.. కాదు, దోపిడీ… యాదగిరిగుట్ట మీద 500, శంషాబాద్ ఎయిర్పోర్టులో […]
కర్నాటకలో ‘స్థానిక’ కలకలం… అదే జరిగితే బెంగుళూరు సగం ఖాళీ…
ఆడవాళ్ల పీరియడ్స్ సెలవుల విషయంలో మొన్నామధ్య సుప్రీంకోర్టు ఓ కామెంట్ చేసింది… ఈ సెలవులు మహిళల ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే ప్రమాదముంది అని..! అవును, మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకుంటే సెలవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని కంపెనీలు భావిస్తే నిజంగానే మహిళల అవకాశాలకు అది దెబ్బ… ఇప్పుడు కర్నాటకలో దాదాపు అలాంటిదే రచ్చ… దుమారం రేగుతోంది… అసలే కొంతకాలంగా కర్నాటకలో యాంటీ హిందీ ఆందోళనలున్నాయి… నార్తరన్ స్టేట్స్ నుంచి యువత పెద్ద ఎత్తున వలస వచ్చి, ఇక్కడి […]
మోడీ 228 కిలోల బంగారం దోచేశాడట… ఢిల్లీలో గుడి కడతాడట…
దేశంలో లెక్కకుమిక్కిలి మఠాలు… ఎవరు ఏ సంప్రదాయమో, ఏ పరంపరో ఓ పట్టాన అర్థం కాదు… అసలు ధర్మప్రచారంలో గానీ, ఆధ్యాత్మిక వ్యాప్తిలో గానీ, మతోద్ధరణ కృషిలో గానీ నయాపైసా శ్రమ, ప్రయాస కనిపించవు… పైగా అడ్డమైన రాజకీయాల బురద పూసుకోవడానికి మఠాధిపతులు ఎప్పుడూ రెడీగా ఉంటారు… అప్పట్లో అయోధ్య మీద రాద్ధాంతం చేశారు నలుగురు శంకరాచార్యులు… ఆ పేరు పలకడానికే చాలామంది ఇష్టపడటం లేదు… అయోధ్య పునర్నిర్మాణానికి, ఆ పోరాటానికి నయాపైసా భాగస్వామ్యం లేదు వాళ్లకు… […]
సాయిరెడ్డి భాష బాగాలేదు సరే… నిజమే, మీడియా తక్కువేమీ కాదుగా…
నిజానికి విజయసాయిరెడ్డి ప్రైవేటుగా ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు… కానీ నిన్నటి ప్రెస్మీట్లో ఆయన మాట్లాడిన విధానం, వాడిన భాష తన స్థాయికి తగినట్టు లేదు… కడుపులో రగిలిపోతున్నట్టుంది, అదుపు తప్పాడు… పదే పదే కమ్మ కులాన్ని ప్రస్తావించడం, మీడియా మొత్తాన్ని తిట్టిపోయడం బాగాలేదు… ఎవరో ఓ ఎండోమెంట్ అధికారిణి… పేరు ఏదైతేనేం, కులం ఏదైతేనేం… ఆమెకూ సాయిరెడ్డికీ రంకు అంటగట్టి ఓ సెక్షన్ మీడియా ఎడాపెడా రాసేస్తోంది, ఏదేదో చెప్పేస్తోంది… ఐతే అవన్నీ మీడియా సొంత […]
బీఆర్ఎస్ ఎంపీలను చేర్చుకోవడం నిజంగా బీజేపీకి అత్యవసరమా..?
మొత్తం మీడియాలోనూ వచ్చింది వార్త… ఏమిటంటే..? రాజ్యసభలో బీజేపీ బలం మరీ 86కు పడిపోయింది… ఎన్డీయే బలం లెక్కించినా 101కు పడిపోయింది… ఇదీ వార్త… నలుగురు నామినేట్ సభ్యుల పదవీకాలం పూర్తయినందున ఈ మార్పు తలెత్తింది… ఇక ఎవరికి తోచిన బాష్యాలు వాళ్లు రాసేసుకున్నారు… ఇక రాజ్యసభలో బిల్లులు పాస్ చేయించుకోవడం బీజేపీకి కష్టమే అన్నట్టుగా కొందరు తేల్చేశారు… పిచ్చి లెక్కలు, పిచ్చి విశ్లేషణలు… ఎందుకంటే..? నిజానికి మొత్తం సభ్యుల సంఖ్య 245… 20 ఖాళీలు… అంటే […]
ఆరేళ్లపాటు ఐసీయూలో మర్రి మహాతల్లి… కోలుకుంది, పిలుస్తోంది…
“ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ పములతో లంఘించెఁ బక్షివిభుఁడు నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు” -అనంతామాత్యుడి భోజరాజీయం. […]
అప్పట్లో రేవంత్ తీవ్ర ఆరోపణలు… నిజంగానే రకుల్ బ్రదర్ చిక్కాడు…
‘‘BRS అధికారం కోల్పోగానే డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. రకుల్ ప్రీత్ సింగ్ (Heroine Rakul Preet Singh) సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో సినీరంగానికి […]
ఎవరు విలన్లు..? ఎవరు హీరోలు..? కేరళలో కౌరవులందరికీ గుళ్లు..!!
చిన్న స్పష్టీకరణ…. పురాణాలు, ఇతిహాసాల్లో పాత్రలు ప్రతినాయకులా, నాయకులా అనేది చిన్నప్పటి నుంచీ మన కుటుంబం, మన సమాజం, మన పుస్తకాలు, మన కళాప్రదర్శనలను బట్టి, మనం అర్థం చేసుకునే తీరును బట్టి ఉంటుంది… ఉదాహరణకు రాముడు ఆర్యుడు, ద్రవిడదేశంపై దాడికి వచ్చాడు, రావణుడిని హతమార్చాడు అని కోట్ల మంది నమ్ముతారు దక్షిణ భారతంలో.,. రావణుడిని పూజిస్తారు… ఈరోజుకూ రాముడు, కృష్ణులను ఆర్య రాజులుగానే చూస్తుంది ద్రవిడ సమాజం… ఇప్పుడు కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనే […]
ఆ పెళ్లి ఖర్చుపై పిచ్చి లెక్కలు… ఫూలిష్ పోస్టులు… నవ్వులాటలు…
కొందరుంటారు సోషల్ మీడియాలో… తమకు తామే మేధావులం, మాకన్నీ తెలుసు అనుకుని, జనం నవ్వుతారు అనే సోయి లేకుండా పోస్టులు పెట్టేస్తారు… ఇదీ అలాంటిదే… (అనేక వార్తలు… నగల మీద, ప్రివెడ్డింగ్ ఖర్చుల మీద, పెళ్లి ఏర్పాట్ల మీద, ప్రత్యేక ఫ్లయిట్ల మీద, వంటకాల మీద, హాజరైన సెలబ్రిటీల మీద… చివరకు ఆషాఢంలో పెళ్లి ఏమిటనే చర్చ దాకా…) ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి 5000 కోట్లు ఖర్చు పెట్టాడు అనే అంశం మీద రకరకాల […]
వైఎస్ రోజూ జనాన్ని కలిసేవాడు… రేవంత్ రెడ్డి కూడా ‘ప్లాన్’ చేయాల్సిందే…
అసలు ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని నేరుగా కలవాల్సిన అవసరం ఏముంటుంది..? ఇదీ ఓసారి కేటీయార్ వేసిన ప్రశ్న మొన్నటి ఎన్నికల ముందు… సరే, వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవాల్సినవి ఏముంటాయి..? ఉండొద్దు కదానేది తన భావన… లెక్కప్రకారం కరెక్టే… కానీ..? మన సిస్టమ్ పైనుంచి కింద దాకా సగటు మనిషిని సతాయించేదే తప్ప సానుకూలంగా వ్యవహరించేది కాదు… పైగా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలుస్తుంటే నిజంగా జనం నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యల తీవ్రత […]
ఎవరో గానీ ఆ లేడీ కమెండో… భలే కవర్ చేసింది, విజయశాంతికి తాతమ్మే…
ఇందాక టీవీ వార్తల్లో అమెరికాలో ట్రంప్ మీద దుండగుడి కాల్పుల సంఘటన చూసినప్పుడు నాకు మళ్ళీ కర్తవ్యం విజయశాంతి గుర్తొచ్చింది అదెలా అంటే , . అమెరికా పెన్సిల్వేనియా లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదిక మీద మహోద్రేకంగా ప్రసంగిస్తున్నారు . ప్రపంచంలోనే మెరికల్లాంటి మేటి సెక్యూరిటీ వింగ్ అమెరికాలో ఉందని ఇప్పటిదాకా పేరు కదా , సరే, ఆ పేరు సంగతి అలా ఉంచితే , ఓ దుండగుడు ట్రంప్ ను యేసెయ్యాలని ప్లాన్ […]
గేమ్ ఛేంజర్ ఫోటో..! అసలే బైడెన్ ఎదురీత… ఈలోపు ట్రంప్పై కాల్పులు…
చాన్నాళ్లు యాదికుంటది ఈ ఫోటో… తన ప్రాణాలు తీయడానికే ఓ షూటర్ కాల్పులు జరిపినప్పుడు తృటిలో తప్పించుకున్నాడు ట్రంప్… చెవికి గాయం కాగానే, దాన్ని చేత్తో తడిమి, చేతికంటిన రక్తాన్ని చూసి, వెంటనే ప్రమాదాన్ని గ్రహించి అసంకల్పితంగానే కిందకు వంగిపోయాడు… ఈలోపు సెక్యూరిటీ గార్డులు వచ్చి తనను చుట్టుముట్టారు… దాంతో షూటర్ లక్ష్యం నెరవేరలేదు… తనను ఓ టెర్రేస్పై భద్రతాబలగాలు కాల్చిచంపేశాయి… షూట్ చేయడానికి ముందు నిందితుడు వాళ్లతో వాదిస్తున్నట్టుగా ఓ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది… […]
ఇదుగో ఇలాంటి విషయాల్లోనే రేవంత్ సర్కారు బదనాం అయ్యేది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవరాక్షన్ చేసే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తమకే రాజకీయంగా నష్టం వాటిల్లజేస్తోంది… ఇంకా దీన్ని సమీక్షించుకున్నట్టు లేదు… అసలే బీఆర్ఎస్, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉంది… ఉన్నవీ లేనివీ రచ్చ చేసి, గాయిగత్తర లేపడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు… కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు… మొన్న కేటీయార్ ఒక ట్వీట్ చేశాడు… పక్షపాతంతో బాధపడే ఓ 80 ఏళ్ల ముసలామె పెన్షన్ను రికవరీకి ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని […]
- « Previous Page
- 1
- …
- 61
- 62
- 63
- 64
- 65
- …
- 114
- Next Page »



















