Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిటీ బ్యాంక్ కొట్టిన సున్నాలు! చివరికి మిగిలిన సున్నాలు!

February 21, 2021 by M S R

citibank

సంస్కృతంలో విశాఖదత్తుడి “ముద్రా రాక్షసం” బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన కావ్యం. దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి రచన. అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. కొన్ని వాస్తవిక ఘటనలు, కొంత కల్పనతో అల్లిన కావ్యమది. తెలుగు పలచపడి, సంస్కృతం అంటరానిది అయ్యింది కాబట్టి ఆ కావ్యంలో గొప్పదనం మనకనవసరం. ముద్రా రాక్షసం అంటే అచ్చు తప్పులు, పొరపాట్లు ఎంత అనర్థమో అన్న విషయానికే పరిమితమవుదాం. పుస్తకాలు ముద్రిస్తే, జనం వేలకు వేల ప్రతులు […]

పుట్టుకతోనే జైలుశిక్ష ఆ పిల్లాడికి… ఇప్పుడు అమ్మకు ఉరిశిక్ష… తరువాత..?!

February 19, 2021 by M S R

shabnam

ఆమె జైలుకు వెళ్లినప్పుడు ఏడు నెలల గర్భిణి… అక్కడే కాన్పు జరిగింది… కొడుకు పుట్టాడు… పేరు తాజ్… ఆరేళ్లు వచ్చేవరకూ అక్కడే ఉన్నాడు… తల్లి చేసిన నేరానికి, ఆ తల్లి కడుపులో పడిన పాపానికి ఆ అబ్బాయి అనుభవించిన తొలి కారాగార శిక్ష అది… తరువాత ఓ కేర్‌టేకర్‌కు అప్పగించారు… బాధ్యత తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు… ఉన్నవాళ్లందరినీ ఆ తల్లే నరికి చంపేసింది… సో, కేర్ టేకర్… తన పర్యవేక్షణలో ఆ పిల్లాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, […]

మంథని మాఫియా..! ఆ డొంక తవ్వకపోతే ‘దర్యాప్తు’లకు అర్థమే లేదు..!

February 18, 2021 by M S R

murdered lawyers

‘‘ఆ నిందితులు ఎంతటి వారైనా సరే, ఎంత ఒత్తిడి వచ్చినా సరే… ఒక్క లాయర్ కూడా వాళ్ల బెయిల్ కోసం గానీ, వాళ్ల తరఫున గానీ వాదించకూడదు… ఒకవేళ వాదిస్తే ఆయా బార్ అసోసియేషన్లు వారిని బహిష్కరించాలి… ఈ సవాల్‌కు లాయర్ల సంఘాలు సిద్ధమేనా..?’’ ఈ వాక్యం ఎక్కడో కనిపించింది… సూటి ప్రశ్న… అది సరైన డిమాండేనా, కాదా అనే చర్చను వదిలేస్తే…! అసలు లాయర్ల వృత్తి ఏమిటి..? నిందితుడైనా సరే, నిర్దోషులైనా సరే వాళ్ల తరఫున […]

ఆ అరుదైన వ్యాధి హైదరాబాదులో కూడా..! ఈ పిల్లాడికి ఆయుష్షు ఎలా..?!

February 18, 2021 by M S R

sma

మొన్నామధ్య మనం దాదాపు ప్రతి పత్రికలోనూ, ప్రతి టీవీలోనూ ఓ వార్త చదివాం, చూశాం… మహారాష్ట్రలో తీరా కామత్ అనే ఓ అయిదేళ్ల బాలిక అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోందనీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చొరవ తీసుకోవడంతో… ప్రధాని మోడీ స్పందించి, ఆ వ్యాధి నివారణకు విదేశాల నుంచి తెప్పించే 16 కోట్ల విలువైన మందులపై 6 కోట్ల జీఎస్టీ, ఇంపోర్ట్ డ్యూటీ రద్దు చేశాడనేది ఆ వార్త సారాంశం… ఆ వ్యాధి పేరు Spinal […]

యండమూరిపై సోషల్ మీడియా కుతకుత..! బుక్కయిపోయాడు..!!

February 18, 2021 by M S R

yandamuri

ప్రఖ్యాత రచయిత యండమూరి ఓ సోషల్ వివాదంలో చిక్కుకున్నాడు..! ఇటు ఆయన్ని ఖండించేవాళ్లు, అటు సపోర్ట్ చేసేవాళ్లతో తెలుగు సోషల్ మీడియా కాస్తా ఉడికిపోతోంది… నిజానికి ఢిల్లీలో ఆందోళనలు, వాటి వెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు, రైతు బిల్లులు, టూల్ కిట్స్, గ్రెటా థన్‌బర్గ్, దిశ రవి అరెస్టు, దేశద్రోహం కేసుల మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… సోషల్ మీడియా కూడా రెండుగా చీలిపోయింది… రైట్ వింగ్ సోషల్ యాక్టివిస్టులు, ఆ ఆందోళనల సమర్థకుల నడుమ హాట్ హాట్ […]

…. మునుపు బోలెడన్ని సర్కారీ బ్యాంకులు కూడా ఉండేవట తెలుసా..?

February 18, 2021 by M S R

banks

బ్యాంకుల విజాతీయం! ——————– బ్యాంక్ అనే ఇంగ్లీషు మాటకు సమానమయిన తెలుగు పదం లేనే లేదు. కొన్ని అంతే. ఇప్పుడు దిగులు పడి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే ఆ మాటను యథాతథంగా డు ము వు లు ప్రథమావిభక్తి సూత్రం కలిపి బ్యాంకు అంటున్నాం. చివర ఉ కలిసి బ్యాంకు, కారు, సోపు, పెన్ను అనడం సిగ్గుచేటు కాబట్టి- ఆ ఉన్న ఉ కు కూడా మంగళం పాడి- అసలు సిసలు ఇంగ్లీషు […]

అయ్యారే…! మా కుప్పం ప్రజలూ మా మొహం చూడనొల్లడం లేదా..?!

February 18, 2021 by M S R

kuppam

ఎన్నికలన్నాక ఓసారి గెలవొచ్చు, మరోసారి ఓడిపోనూ వచ్చు… వరుసగా గెలుస్తూ వస్తున్న సీటులో కూడా ఒక్కోసారి పల్టీ కొట్టొచ్చు… చాలా కామన్… అయితే అనుకోని విజయాలు ఎలా వార్తల్లోకి ప్రధానంగా వచ్చేస్తాయో… కొన్ని అపజయాలు కూడా అలాగే చర్చకు వస్తాయి… ఎస్, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఓడిపోతే అది పెద్ద వార్తే… ఒక సిద్దిపేటలో హరీష్‌రావు ఓడిపోతే అది పెద్ద వార్తే… హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఒవైసీ ఓడిపోతే కూడా పెద్ద వార్తే అవుతుంది… అలాగే కుప్పంలో […]

స్పేస్‌లోకి నేమ్స్…! ఉత్త స్పేస్ వేస్ట్ టాస్క్..! ప్యూర్ ఫాయిదా లెస్ పని..!!

February 17, 2021 by M S R

nano satellite

నానో శాటిలైట్… అంటే మరీ సూక్ష్మ ఉపగ్రహం… వచ్చే 28న ఇస్రో ప్రయోగించబోయే ఓ రాకెట్‌‌ ద్వారా పలు ఉపగ్రహాలతోపాటు అది కూడా కక్ష్యలోకి వెళ్లబోతోంది… సో వాట్ అంటారా..? ఉంది..! దీని పేరు సతీష్ ధావన్ నానో శాటిలైట్… గుడ్, భారతీయ స్పేస్ రీసెర్చ్ విషయంలో గొప్ప పేరు, ఆ పేరు పెట్టుకోవడంలో తప్పులేదు… ఇది స్పేస్ కిడ్స్ అనే సంస్థ ప్రయోగించబోయే రెండో ఉపగ్రహం… గతంలో కూడా కలాంశాట్ పేరిట ఓ నానో శాటిలైట్‌ను […]

సోకాల్డ్ ది గ్రేట్ కన్నయ్యలనూ కాపాడుకోలేని కమ్యూనిస్టుల దురవస్థ…!!

February 16, 2021 by M S R

kanhiah

బహుశా ఒకటీరెండేళ్ల క్రితం… ఢిల్లీ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అంటే ఓ సంచలనం… అసలు ఆ యూనివర్శిటీయే పెద్ద యాంటీ నేషనల్ పోకడలకు కేంద్రం అనేది బీజేపీ ఆరోపణ… ఆ యూనివర్శిటీలోని పెడ పోకడల్ని చెప్పాలంటే ఇక్కడ స్పేస్ సరిపోదు గానీ… వాళ్లకు హీరో ఈ సారు… ఈ సారు బీహార్‌లో అప్పటికే పీజీ చేశాడు, కానీ పార్టీ అవసరాల కోసం జేఎన్‌యూలో చేరాడు… ఏదో పనికిమాలిన సబ్జెక్టు మీద పీహెచ్‌డీ… […]

‘ముడి’ చమురు ఘాటెక్కువ కదా..! జస్ట్, కాసిన్ని నీళ్లు కలుపుతున్నారు…!!

February 16, 2021 by M S R

petrol

పెట్రోల్ గంగా జలం! ——————– అరవై ఏళ్ల కిందటి తెలుపు నలుపు చిత్రం గుండమ్మ కథ. తెలుగు సినిమాకు శాశ్వత పరిమళ గంధాన్ని అద్దిన చిత్రం. విలువల వలువలు కట్టిన చిత్రం. ప్రతి పాటలో సంగీత సాహిత్యాలు తెలుగు తేనెలు చిలికిన చిత్రం. అందులో హాస్య నటుడు రమణా రెడ్డి చేత మాటల రచయిత డి వి నరసరాజు చెప్పించిన మాట- “పాలల్లో నీళ్లు కాక, పెట్రోల్ కలుపుతారా? చిక్కటి పాలు తాగితే అరగక కడుపు మందంతో […]

ఐశ్వర్యమస్తు..! ఈ పెళ్లికి ఈ దీవెనే కరెక్టు… ఎందుకో చదవండి…!!

February 14, 2021 by M S R

ccd2

ఒక ఫోటో నచ్చింది ఈరోజు… వార్తల్లోకెక్కిన ఫోటోయే… కర్నాటకలో జరిగిన ఓ పెళ్లి ఫోటో… వరుడు ఎవరంటే..? 2019 జూలైలో సూసైడ్ చేసుకున్న కాఫీ కేఫ్ డే సిద్ధార్థ హెగ్గే కొడుకు అమర్త్య హెగ్డే… తను మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ బిడ్డ కొడుకు… వధువు ఎవరంటే..? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏమాత్రం అదృష్టం వరించినా సిద్ధరామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు… ఇప్పటికీ కర్నాటకలో పవర్ ఫుల్ లీడర్ డీకే […]

ఏబీఎన్ రాధాకృష్ణకు వీజీగా నాలుగైదు పులిట్జర్లు ఒకేసారి ఇచ్చేయొచ్చు..!!

February 14, 2021 by M S R

sharmila11

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రధాని, రాష్ట్రపతి… అవసరమైతే పుతిన్, జిన్‌పింగ్, జో బైడెన్ ఇళ్లల్లోనూ తన సొంత స్పై ఇయర్ బగ్స్, కెమెరాలు పెట్టేయగలడు… తను చెప్పినట్టు కంటికి కనిపించనివీ, చెవికి వినిపించనివీ బోలెడు వార్తలు పట్టుకోగలడు… అవసరమైతే క్రియేట్ చేయగలడు… అదే జర్నలిజం అనీ మైకు గుద్ది వాదించగలడు… కానీ తనకు తెలియకుండానే జర్నలిజాన్ని అంతకుమించి ముందుకు తీసుకెళ్లి, కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్న తీరు మాత్రం అద్భుతం… ఈ ప్రక్రియ, ఈ ప్రయోగాలకు నాలుగైదు పులిట్జర్లు ఈజీగా […]

భేష్ తెలంగాణ పోలీస్..! టెక్నాలజీ సాయంతో భలే తేల్చేశారు కేసును..!!

February 13, 2021 by M S R

illegal

‘‘కాలు జారింది, నోరు జారింది, పట్టుబడిపోయింది’’ అని….. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి, నోరుజారి, బయటపడిపోయి, జైలుపాలైన ఓ మమత కేసు చదివాం కదా ఇంతకుముందు…. ఇది అంతకన్నా క్లాసిక్ కేసు… కాదు, ఇది పోలీసులు అండర్ ఎస్టిమేట్ చేసి, వాళ్లనే ఫూల్స్‌ను చేయాలని ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయిన కేసు… ఈ కేసులో మనం మెచ్చుకోవాల్సింది తెలంగాణ పోలీసుల్ని, వాళ్లు ఉయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని..! కేసు ఏమిటంటే..? ఓ ఫార్మసీ విద్యార్థిని విచ్చలవిడి జీవితానికి […]

అయోధ్య చందా..! ఇంతకీ తెలంగాణ సమాజం రాముడికి ఇచ్చిందెంత..?!

February 13, 2021 by M S R

ayodhya

అయోధ్య రాముడి గుడి స్థలం కోసమే కాదు… గుడి చందాల సేకరణ కూడా ఉద్రిక్తతల్ని, హింసను తీసుకొస్తోంది… విరాళాల సేకరణలో ఉన్న రింకూ శర్మ అనే కార్యకర్త ఢిల్లీ దారుణ హత్యకు గురయ్యాడు… అది రాజకీయ ప్రకంపనల్ని కూడా సృష్టిస్తోంది… తెలంగాణలోనూ టీఆర్ఎస్ కొంత రచ్చ చేయడానికి ప్రయత్నించింది… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… బీజేపీని వ్యతిరేకించడం పేరిట నానా యాగీకి దిగి, అయోధ్య రాముడికి వ్యతిరేకమని ముద్రలు వేయించుకుని, ఇదేదో పార్టీకి కౌంటర్ ప్రొడక్టుగా మారుతోందని తెలిసి, […]

ప్రశాంత్ కిషోర్ అయితే ఏంటట..? పది నిమిషాల్లో కూల్చేసి పోయారు..!!

February 13, 2021 by M S R

pk1

‘‘బీహార్, బక్సర్‌లో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టుకున్న ఇంటిని అధికారులు శుక్రవారం సాయంత్రం కూల్చేశారు…’’ ఇదీ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్త… ముందు ఆశ్చర్యమేసింది, తన వర్క్‌తో చాలామందికి టార్గెట్ అవుతాడు కదా, అందుకని ఈ ఆక్రమణలు గట్రా అవలక్షణాలు లేకుండా క్లీన్‌గా ఉండాలి కదా, అంతెందుకు..? ఒక దశలో తన వారసుడిగా చిత్రించిన బీహార్ ముఖ్యమంత్రితోనే తనకు పడటం లేదు… చాన్స్ దొరికితే తనే టార్గెట్ చేస్తాడు కదా […]

ఖమ్మం, వరంగల్ కోసం… ఎక్స్ అఫిషియో వోట్లను దాచిన కేసీయార్..!?

February 12, 2021 by M S R

owaisi kct

టీఆర్ఎస్ మజ్లిస్ దోస్తీ… ముస్లిం వోట్ల కోసం కేసీయార్ ఎత్తులు… క్రమేపీ హిందూ వోట్లు సంఘటితం కావడానికి ఉపయోగపడుతున్నయ్… పైగా బీజేపీ మీద కోపంతో కేసీయార్ స్థూలంగా హిందువులనే కించపరిచేట్టుగా చేసిన వ్యాఖ్యలు కూడా తనకు నష్టం చేకూర్చాయి… ఇది గమనించే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ తమకు పొత్తుల్లేవనీ, దోస్తీ లేదని ఎంతగా చెప్పుకున్నా సరే, ఎక్కడికక్కడ బీజేపీ ఆ రెండు పార్టీలను ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నించింది… ఆ ఫాయిదా కూడా దక్కించుకుంది కొంతమేరకు..! మజ్లిస్‌తో […]

అదే మజ్లిస్, అదే టీఆర్ఎస్…! అదే గ్రేటర్ సయామీ పాలిటిక్స్..!!

February 11, 2021 by M S R

ghmc

అబ్బే, మజ్లిస్‌తో పొత్తు లేదు మాకు అని టీఆర్ఎస్…. నో, నో, టీఆర్ఎస్‌తో మాకేం సోపతి, చాన్సే లేదు అంటూ మజ్లిస్… మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో మస్తు చిలకపలుకులు పలికినయ్… మజ్లిస్‌తో అంటకాగుతున్నందుకు జనం కోపగిస్తారనేది టీఆర్ఎస్ భయం… హిందూ వోటు సంఘటితమై బీజేపికి మద్దతునిస్తారనే సందేహం… అందుకే ఆ అబద్ధాలు… సరే, ఎన్నికలన్నాక ఇలాంటి కథలెన్నో పడతాయి పార్టీలు, వోటర్లను మాయ చేయడమే కదా ఎన్నికలంటే…!! పోలింగ్ ముగియగానే మళ్లీ అలుముకున్నారు… అసలు తెలంగాణ రాజకీయాల్లో […]

న్యూస్‌క్లిక్‌పై ఈడీ దాడులు…! వెబ్ మీడియా గొంతు నొక్కేందుకేనా..?!

February 11, 2021 by M S R

newsclick

అధికారంలో ఉన్నవాడు ప్రశ్నను సహించలేడు… విమర్శను తట్టుకోలేడు… ఆ నోళ్లు మూయించడానికే ప్రయత్నిస్తాడు… దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు… ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ విషయంలో దూకుడు మరీ ఎక్కువ..! కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, వేధింపులు గట్రా..! మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న పత్రికలు, టీవీలే కాదు, ఇండిపెండెంట్ మీడియాగా పేరొందిన వెబ్ జర్నలిజాన్ని కూడా టార్గెట్ చేస్తోంది… అయితే దీనికి మరో పార్శ్వమూ ఉంది… అది కూడా చెప్పుకోవాలి… […]

ఫేస్‌బుక్ మహిళలూ… మోహాలు వద్దు… నిండా మోసాలే… ఈ వార్త చదవండి…

February 10, 2021 by M S R

ravi krishna

అసలు చాలా పత్రికలకు ఆ వార్తే తెలియదు… సహజంగానే టీవీలకు అక్కర్లేదు… నిజానికి ఆసక్తికరమైన వార్తే… ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని కనీకనిపించనట్టుగా వేశారు… అనేకానేక క్షుద్ర రాజకీయ వార్తలు, భజనల నడుమ ఇలాంటి వార్తలకు ఈమాత్రం స్పేస్ దొరకడమే ఎక్కువ… ఏదైనా సంఘటన జరిగినప్పుడు సెన్సేషన్ కోసం ప్రయత్నించే టీవీలు తరువాత ఫాలో అప్, లాజికల్ ఎండ్ పట్టించుకోవు… ఈ వార్త ఏమిటంటే..? విశాఖపట్టణానికి చెందిన జంబాడ లక్ష్మివరప్రసాద్… తను తెలుగు టీవీ సీరియళ్లలో నటించే రవికృష్ణ […]

రాజకీయ పరిణతి..! మోడీ, ఆజాద్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు..?!

February 9, 2021 by M S R

gulam

మెచ్చుకోవాలి… ఆ ఇద్దరూ ప్రదర్శించిన పరిణతి బాగుంది… ఎంతసేపూ బూతులు, వ్యక్తిగత దూషణలతో, కక్ష ప్రదర్శనతో మకిలి పట్టిన మన రాజకీయాల్లో కింద వరకూ ఆ పరిణతి ఇంకాలి… అందుకే వాళ్లిద్దరినీ మెచ్చుకోవాలి… చప్పట్లు కొట్టాలి… ఎంతసేపూ విద్వేషాన్ని, విషాన్ని వ్యాప్తి చేసే వార్తలేనా..? అసలు ఇవి కదా ప్రయారిటీ దక్కాల్సిన వార్తలు… విషయం ఏమిటంటే..? రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ వారాంతంలో రిటైర్ అవుతున్నాడు… ఈ సందర్భంగా వీడ్కోలు […]

  • « Previous Page
  • 1
  • …
  • 65
  • 66
  • 67
  • 68
  • 69
  • …
  • 74
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions