ఇదే వందే భారత్ రైలు… ఒకవేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే… అది కేంద్రంతో సఖ్యంగా ఉండి ఉంటే… ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిల్లో పాజిటివ్ వార్తలు మోతమోగిపోయేవి… ప్చ్, ఆ సీన్ లేదు కదా… వందే భారత్ రేట్లు ఆకాశంలో ఉంటాయి… విమానం రేట్లతో సమానంగా ఉంటాయి… అదీ ఒక్కరోజు ముచ్చటే అయిపోతుంది… ఈ వార్తలాగే… దరిద్రంగా… ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించవచ్చుగాక… కానీ నిజమే కదా… వందే భారత్ ఇక నడవదా..? ఒకేరోజు […]
10 లక్షల మిర్చి బజ్జీలు… ఆరేడు లక్షల బొబ్బట్లు… లక్షల యాత్రికులు…
కొప్పల్… కర్నాటక నడిబొడ్డున ఉంటుంది… అక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు… ఓ జాతర కోలాహలం మిన్నంటుతుంది… పదిహేను రోజులపాటు జరిగే ఈ జాతర యూనిక్… గవి సిద్ధేశ్వర మఠ్ జాతర అంటారు దీన్ని… ఈ జాతర పుట్టుక, స్థలపురాణం జోలికి పోవడం లేదు ఇక్కడ… అక్కడి స్థానికుల ఆనందంగా దీన్ని మరో పూరి ఉత్సవంగా చెప్పుకుంటారు… దాన్ని మించిన రథోత్సవం అనీ చెబుతారు… కానీ దేని విశిష్టత దానిదే… 3 రోజుల్లో కోటి మంది భక్తులు ఒక్కచోట […]
ప్రకృతి మాత్రం ఎంతని భరించగలదు… కుంగదీయదా..? కూలదోయదా..?
Nature gets Anger: ఉత్తరాఖండ్ జోషీ మఠ్ కుంగుబాటు మీద హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటిస్తోంది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ ఇప్పుడు జోషీ మఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు […]
‘‘మోడీ తాశిలి చేయి… అలా జెండా ఊపాడు… ఇలా గంగలో చిక్కుకుంది…’’
గంగా విలాస్ క్రూయిజ్… పలు నదీప్రవాహాల్లో 51 రోజులపాటు తిరుగుతూ, మార్గమధ్యంలో వచ్చే టూరిస్ట్ సైట్లను సందర్శించడం ఒక ప్యాకేజీ… తక్కువేమీ కాదు, ఒక్కొక్కరికీ దాదాపు పది లక్షల వరకూ ఖర్చు ఉంటుంది… ఇండియాలోనే గాకుండా బంగ్లాదేశ్ కూడా కవరవుతుంది… దీన్ని గత వారం ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించాడు… అది అకస్మాత్తుగా బీహార్ సమీపంలో గంగలో డోరీగంజ్ ఏరియాలో చిక్కుపడిపోయిందనేది వార్త… బీహార్‌లోని ఛప్రా వద్ద గంగలో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఈ క్రూయిజ్ […]
కోహ్లి బ్యాట్‌కు పదును తగ్గలేదు… ప్రపంచ రికార్డు గెలుపు తెచ్చిపెట్టింది…
అదేదో తెలుగు సినిమాలో హీరో ప్రభాస్ డైలాగ్ ఒకటి ఉంది… ‘‘కత్తి వాడటం మొదలుపెడితే నాకన్నా బాగా ఎవడూ వాడలేడు’’… నిజమే, ఇది విరాట్ కోహ్లికి సరిగ్గా వర్తిస్తుంది… కోహ్లి క్రీజులో కుదురుకుంటే ఇక ఆ బ్యాట్‌కు తిరుగులేదు… కొన్నాళ్లుగా తను సరిగ్గా ఆడటం లేదు… ఇక కోహ్లి పని అయిపోయింది, రిటైర్మెంట్ లేదా తొలగింపే మంచిది, అనవసరంగా జట్టుకు వేలాడుతున్నాడు అనే విమర్శలు, విశ్లేషణలు బోలెడు… ప్రతి క్రికెటర్ జీవితంలోనూ ఫామ్ కోల్పోయే ఒక దశ […]
కులం కోసమే పుట్టిన కులపత్రికలో కులం గురించి భలే రాశారు..!!
బ్రిటిష్ కాలంలో బ్రిటిష్‌వాడి అభిప్రాయం ప్రకారం తెలంగాణ వ్యక్తికి తుపాకీ ఇస్తే పిట్టలు కొట్టి కాల్చుకుని తిని సంతృప్తి పడతాడు. రాయలసీమ వ్యక్తి తన ప్రత్యర్థులను కాల్చి చంపి జైలుకు వెళతాడు. కోస్తాంధ్ర వ్యక్తి ఆ తుపాకీని అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ విశ్లేషణకు కాలం చెల్లింది. తెలంగాణవాళ్లు ప్రగతికాముకులుగా ముందుకు సాగుతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర వాళ్లు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా కుల, ప్రాంతీయతత్వంతో కొట్టుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా కుల […]
రాజ్యం పోయి, ఆస్తులు కరిగిపోయి… అంతటి నిజాం వారసుడు చివరకు…
Konda Srinivas…… రాజుల సొమ్ము రాళ్ల పాలు..! 2007 ఆ ప్రాంతమనుకుంటా.మక్కా మసీదులో ఓ వ్యక్తి ప్రార్ధనలు చేసి బయటకు వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఇద్దరు మామూలు మనుషులు సహాయం చేసి ఓ ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న టాటా కారులో కూర్చోబెట్టారు. ఓ నలుగురైదుగురు తప్ప ఆయన వెంట ఎక్కువ మంది లేరు. ఈ సంఘటన చూసి నేను ఆశ్యర్యపోయాను. ఎందుకంటే ఈ మనిషిని నేను బాగా ఎరుగుదును. ప్రత్యక్షంగా చూడకపోయినా […]
కమ్మ వర్సెస్ కాపు… వీరయ్య వర్సెస్ వీరసింహ… వైసీపీ మంటపెట్టడం నిజమేనా..?!
ఏమో మరి… బహుశా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే బాగా కనిపించిందేమో… వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ఆధారంగా కమ్మ, కాపు కులాల మధ్య విద్వేషం రగిలించడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా శ్రమపడిందనేది ఆర్కే వారి ఉవాచ… వీరయ్య సినిమా మీద కాపు, వీరసింహారెడ్డి సినిమా మీద కమ్మ సెక్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక పోస్టులు పెట్టాయనీ, అవన్నీ వైసీపీ ప్రేరేపితమనీ ఆర్కే విశ్లేషణ… నిజానికి అంత సీన్ ఏమీ కనిపించలేదు… గతంలో ఇలా […]
ఆలూ లేదు, చూలూ లేదు… అప్పుడే హైపర్ ఆదికి అసెంబ్లీ టికెట్టు కన్ఫరమ్…
మొత్తానికి సోషల్ మీడియా హైపర్ ఆదికి జనసేన నుంచి అసెంబ్లీ టికెట్టు కన్ఫరమ్ చేసేశాయి… ఒంగోలు లేదా దర్శి నుంచి పోటీ చేయబోతున్నాడట… హిందీ రాదు కాబట్టి లోకసభ టికెట్టు సందేహం, కానీ ఎన్నికల్లోపు హిందీ నేర్చేసుకుంటే ఎంపీ సీటు కూడా ఆలోచించే అవకాశం ఉంది… అంతెందుకు..? రేప్పొద్దున చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల పొత్తు చర్చల్లో కూర్చుంటే… మా హైపర్ ఆది సీటు సంగతి తేలాకే, మిగతా సీట్ల సంఖ్య గురించి చర్చిద్దాం అంటాడేమో పవన్ […]
కూల్ డ్రింక్స్ కావు… కూల్‌గా కబళించే డ్రింక్స్… సీరియస్ స్టోరీ, చదవండి…
కూల్ డ్రింక్స్ మంచివి కావు… ఎందుకు..? వాటిల్లో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటాయి కాబట్టి…! నిజానికి ఆ డ్రింక్స్ తయారీకి వాడే నీటిలోనే ఆ అవశేషాలు ఉంటాయి… మరీ అంత డేంజర్ కాదు… అలాంటి అవశేషాల్ని మనం కూరగాయలు, పంటల నుంచి కూడా స్వీకరిస్తున్నాం… తప్పనిసరై… కానీ కూల్ డ్రింక్స్‌లో ఉన్నది మరో విషం… కెఫిన్… నిజమే… మనం తాగే కాఫీలో ఉండే కెఫీనే… మీరెప్పుడైనా థమ్సప్ వంటి డ్రింక్స్ ప్రకటనల కింద వివరణల వంటి డిస్క్లెయిమర్స్ […]
పుతిన్ హత్యకు డర్టీ బాంబ్..! పాకిస్థాన్ నుంచే యురేనియం సరఫరా..!
పార్ధసారధి పోట్లూరి ……… 11 జనవరి, 2023 లండన్ లోని ‘హిత్రూ ‘ ఎయిర్ పోర్ట్ లో శుద్ధి చేయని యురేనియం పాకెట్ ని కనుక్కున్నారు అధికారులు! యురేనియం ఉన్న పాకెట్ పాకిస్థాన్ నుండి లండన్ వచ్చింది ! పాకిస్థాన్ నుండి స్క్రాప్ [తుక్కు] గా పేర్కొన్న పాకెట్ ఒకటి ఒమన్ దేశం మీదుగా లండన్ లోని హిత్రూ విమానాశ్రయానికి వచ్చింది ! ఈ పాకెట్ లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్న ఇరాన్ జాతీయుల అడ్రస్ […]
తెలంగాణ బీజేపీ గుండెల్లో దడ… టీడీపీతో పొత్తు ఆలోచనల్లో ఉందట…
మొత్తానికి ‘వైసీపీ వ్యతిరేక వోటు చీలనివ్వను’ అని పవన్ కల్యాణ్ పదే పదే చేస్తున్న ప్రకటన ఫలిస్తున్నట్టే ఉంది… తెలంగాణలో బలాన్ని చూపించి, ఏపీలో పొత్తుకు దారులు తెరవాలనే చంద్రబాబు వ్యూహం ఫలిస్తున్నట్టే ఉంది… మళ్లీ ఈ గుదిబండ మెడకు పడుతుందేమో అనే తెలంగాణ బీజేపీ భయసందేహాలు నిజమవుతున్నట్టే ఉంది… దేశంలో అందరికన్నా మోడీని అధికంగా తిట్టిన అదే చంద్రబాబు అదే మోడీని అలుముకునే రోజు వస్తున్నట్టే ఉంది… ఠాట్, టీడీపీతో పొత్తేమిటి, ఆ ఆలోచనే లేదు, […]
ఆస్ట్రేలియాలోనూ ఖలిస్థానీ నీడలు… హిందూ ఆలయగోడలపై విద్వేషరాతలు…
ప్రపంచవ్యాప్తంగా యాక్టివేటైన ఖలిస్థానీ శక్తులు హిందుత్వంపై విషం చిమ్ముతున్నాయి… రైతుల్ని ముందుపెట్టి ఢిల్లీలో సాగించిన అరాచకాన్ని మనం కళ్లారా చూశాం కదా… గత ఏడాది సెప్టెంబరులో, కెనడాలో కూడా ఒక హిందూ ఆలయం మీద దాడి చేసి, ఆ గోడల మీద ఖలిస్థానీ నినాదాల్ని, హిందూ వ్యతిరేక వ్యాఖ్యన్ని రాశారు… తాజాగా ఆస్ట్రేలియా, మెల్బోర్న్లో స్వామినారాయణ మందిర్ మీద దాడి చేసి సేమ్ అవే నినాదాన్ని రాశారు… (కెనడాలో దాడికి గురైంది కూడా స్వామి నారాయణ మందిరమే…) […]
భేష్ సీఎం సాబ్… హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యం… తెలుగోడి కృషీ ఉందండోయ్…
ఆశ్చర్యం ఏమిటంటే… హాకీ వరల్డ్ కప్ మన దేశంలోనే సాగుతున్నా ఎక్కడా ఒక్క వార్త లేకపోవడం… ప్రచారం లేకపోవడం… నిజంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్థానంలో చంద్రబాబు వంటి లీడర్ ఉంటే ఇప్పటికే హంగామా పీక్స్‌కు వెళ్లిపోయేది… నభూతో అన్నంతగా మీడియా కీర్తించేది… మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఈరోజు ప్రారంభమై 29 వరకూ భువనేశ్వర్‌లోని కళింగ, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాల్లో సాగుతుంది… ఏదీ ప్రారంభోత్సవం బాపతు అట్టహాసం..? ఆఫ్టరాల్ ఒక […]
మేం ఇండియాలో కలుస్తాం… కార్గిల్ రోడ్ తెరవండి… పీఓకేలో భారీ ర్యాలీలు…
పార్ధసారధి పోట్లూరి ………. మధ్యాహ్నం 2.30,జనవరి 10,2023. గిల్గిట్ & బాల్టిస్థాన్ లోని ప్రజలు పాకిస్థాన్ కి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన ! మేము భారత్ తో కలిసిపోతాము ! దశాబ్దాలుగా పాకిస్థాన్ మమ్మల్ని ఘోరంగా మోసం చేస్తూ వచ్చింది. ఇక భరించలేము. మేము భారతదేశంలోని భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అయిన లాడాక్ లో కలిసిపోతాము. లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు గిల్గిట్ & […]
వీళ్లకు సపరేట్ పాస్‌పోర్టులు… చిల్లరగా వ్యవహరిస్తే ఇండియాకు డిపోర్టేషన్…
కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ శాఖ ఉంటుంది… ఈ పాస్‌పోర్టులు, వీసాల వ్యవహారం చూసేది వాళ్లే… ఇకపై పాస్‌పోర్టుల వ్యవహారంలో చాలా మార్పులు అవసరం… కేంద్రం దీనికి తగిన సర్క్యులర్ తక్షణం జారీ చేయాలి… పాస్‌పోర్టులు ఇచ్చేటప్పుడే ఎవడు ఏ హీరోకు అభిమానో ఇంటలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకోవాలి… కటౌట్లు పెట్టేవాళ్లు, అభిషేకాలు చేసేవాళ్లను గుర్తించాలి… సోషల్ ఖాతాల్లో వాళ్ల పోస్టులను విశ్లేషించాలి… అభిమానసంఘాల్లో యాక్టివ్ రోల్ ఎంతో మదింపు వేయాలి… వీళ్లకు ఈస్ట్‌మన్ కలర్ ట్యాగ్‌తో పాస్‌పోర్టులు […]
డియర్ మిస్టర్ స్టాలిన్… గవర్నర్ తప్పున్నా సరే, మీ స్పందన తీరు తప్పు…
నామ- సర్వనామాల రాజ్యాంగ పంచాయతీ… రాజ్యాంగం రాసేప్పుడు అప్పటికి ప్రపంచంలో ఉన్న మెరుగయిన ప్రజాస్వామిక సంవిధానాలన్నిటినీ అధ్యయనం చేశారు. భారత దేశాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు. కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. మౌలికమయిన రాజ్యాంగ విలువల పరిరక్షణకు బలంగా కట్లు బిగించారు. పాలనా విభాగం, చట్టసభలు, న్యాయవ్యవస్థల పరిమితులను నిర్వచించారు. అదే సమయంలో దేనికి దాని స్వయం ప్రతిపత్తికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ ఒక కంట కనిపెట్టుకునేలా […]
చివరకు సీఎస్ పోస్టు సైతం పొలిటికల్ నామినేటెడ్ పోస్ట్ అయిపోయిందా..?!
తెలంగాణ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి… ఆమె కాపు కాబట్టి, ఇప్పుడు ఏపీలో కేసీయార్ పార్టీకి కాపు వోట్లు కావాలి కాబట్టి, తెలంగాణలో మీ కాపు మహిళకు మంచి పోస్టు ఇచ్చాను, మీ వోట్లన్నీ నాకే అని కేసీయార్ చెప్పుకోవాలి కాబట్టి… ఆమెకు ఆ పదవి దక్కిందట..! ఎక్కడ మనల్ని నిరాశ చుట్టుముట్టేస్తుందీ అంటే… చిల్లర చిల్లర నామినేటెడ్ పదవుల లెక్కల్లోకి చివరకు చీఫ్ సెక్రెటరీ పదవిని కూడా చేర్చారా..? ఆమె చదువు, ఆమె అడ్మినిస్ట్రేటివ్ […]
తెలంగాణ ఎన్నికలు ఆమె హయాంలోనే… సీఎం ఆఫీసు వద్దనుకుంది, సీఎస్ అయ్యింది…
అసలు తెలుగు తెలిసిన, తెలుగు ప్రధాన కార్యదర్శే కావాలని సీఎం అనుకుంటే కదా… నిన్నటిదాకా సోమేష్‌కుమార్ ఎందుకున్నాడు తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా..? అందుకని అర్వింద్ కుమారా..? రామకృష్ణారావా..? వీరిలో తెలుగువాడు కాబట్టి రామకృష్ణారావుకే ఎక్కువ చాయిస్ అనే విశ్లేషణలూ వేస్ట్… నిజానికి రామకృష్ణారావు మంచి చాయిసే కానీ అర్వింద్ కుమార్ కూడా గులాబీ శిబిరానికి సన్నిహితుడే… తెలంగాణను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టకుండా, తన సామర్థ్యంతో నెట్టుకొస్తున్నాడు రామకృష్ణారావు… కేసీయార్ బ్యాచ్‌కు కూడా తను బాగా కావల్సినవాడే… కానీ […]
బీజేపీకి బేఫికర్..! రాహుల్ ప్రత్యర్థిత్వమే మోడీ శిబిరానికి శ్రీరామరక్ష..!!
‘‘ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఎప్పుడూ హర్ హర్ మహాదేవ్ అని జపించరు… ఎందుకంటే శివుడు తపస్వి… ఈ వ్యక్తులు (ఆర్ఎస్ఎస్) దేశంలోని తపస్విలపై దాడి చేస్తున్నారు… వారు జైసియారామ్ నుంచి సీతాదేవిని కూడా తొలగించారు… ఈ వ్యక్తులు దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు…’’ ఈ వాక్యాలు ఘనత వహించిన ప్రముఖ నాయకుడు, నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్ నోటి వెంట వచ్చినవే… ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… తన ఆలోచనల్లాగే, తన అడుగుల్లాగే… కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులాగే… ఆర్ఎస్ఎస్ […]
- « Previous Page
- 1
- …
- 74
- 75
- 76
- 77
- 78
- …
- 146
- Next Page »