డప్పు పత్రికలు నమస్తే, సాక్షి… ఇతర చిన్న పత్రికల్ని వదిలేస్తే…… ఈరోజుకూ కాస్త ప్రొఫెషనల్ టెంపర్మెంట్ చూపిస్తున్నది ఆంధ్రజ్యోతి మాత్రమే… సరే, అది పచ్చ అంగీ తొడుక్కున్న టీడీపీ పత్రిక అని అందులోని పొలిటికల్ చెత్తను కాసేపు వదిలేద్దాం… కానీ మిగతా అంశాల్లో మాత్రం బాగుంటుంది… కొన్ని ఇంట్రస్టింగు వార్తల్ని ఎక్కడో ఓచోట అకామిడేట్ చేస్తోంది… మిగతా పత్రికలు సిగ్గుపడాలా లేదానేది వాటికే వదిలేస్తే… మన తాజా వార్తాంశం… గుళ్లల్లో వీవీఐపీల చెత్తదనం… నిలువెల్లా వైసీపీదనం ఒంటపట్టించుకున్న […]
మన పత్రికాఫీసుల మీద రష్యన్ మిస్సయిళ్లు… ఇది మరింత గడ్డుకాలం…
అసలే నక్క రకరకాల నొప్పులతో మూలుగుతోంది… దానిమీద తాటిపండు పడింది… ఎండిన ఓ తాటికొమ్మ దభీమని నెత్తిమీద పడింది… తలదాచుకునే చోటు లేదు ఎక్కడా, ఈలోపు పెద్ద పెద్ద వడగళ్లు పడసాగాయి… ఎలా ఉంటుంది..? అచ్చం మన పత్రికల ప్రస్తుత దురవస్థలా ఉంటుంది… మొన్నమొన్నటిదాకా మీడియా హౌజులు శోకాలు పెట్టాయి… ఇప్పుడు ఏడిచే ఓపిక కూడా లేదు వాటికి… బ్యాడ్ నుంచి వర్స్ స్టేజీకి చేరిపోయాయి వాటి కష్టాలు… ప్రత్యేకించి ఉక్రెయిన్ మీద రష్యా వేస్తున్న బాంబులు, […]
ఆ రెండు చేజిక్కితే చాలు… రష్యా ఇక వెనక్కి..! పని పూర్తయినట్టే…!!
…. By….. పార్ధసారధి పోట్లూరి ….. రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతున్నది! పశ్చిమ దేశాల యుద్ధ వ్యూహకర్తలు మరియు యుద్ధ వ్యూహ నిపుణుల అంచనా ప్రకారం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనపడట్లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ [Kyive] ని రష్యన్ దళాలు చుట్టుముట్టి ఇప్పటికే రెండు వారాలు దాటింది, కానీ రష్యన్ దళాలు కీవ్ కి బయట 15 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. మరోవైపు ఉక్రెయిన్ […]
ఆమె మోహినియట్టం ప్రదర్శించిందట… ఎంత నేరం..? బ్యాన్ చేసి పారేస్తే సరి…!!
ఫాఫం… ఆమె చేసిన పాపం ఏమిటీ అంటే..? తనకు తెలిసిన కళ మోహినీ అట్టం కళను ప్రదర్శించడమే… ఆమె పేరు డాక్టర్ నీనాప్రసాద్… కేరళలో ఓ స్కూల్ ఆవరణలో నాట్యప్రదర్శన ఏర్పాటు చేస్తే వెళ్లింది, ప్రదర్శించసాగింది… ఆమె అల్లాటప్పా కళాకారిణి ఏమీకాదు… శాస్త్రీయ నృత్య రీతుల్ని అభ్యసించిన నాట్యగత్తె… ప్రదర్శన మధ్యలో పోలీసులు వచ్చారు, ఛల్, ఆపేయండి అన్నారు… ఎందుకు అన్నారు నిర్వాహకులు… ఆ స్కూల్ వెనుక వైపు ఓ జిల్లా జడ్జి, పేరు కలాం పాషా… […]
చివరకు ఈనాడు విలేఖరులకూ ‘సమాజోద్ధరణ’ తప్పడం లేదన్నమాట..!!
విలేఖరి అంటే ఎవరు..? అలా అడుగుతావేం..? వార్తలు రాయువాడిని విలేఖరి అంటారు కదా… అది ఒకప్పుడు… వార్తలు రాయకపోయినా సరే, రాయలేకపోయినా సరే, విలేఖరి నిర్వచనం మారిపోయింది… అదెలా..? ఫాఫం, వార్తలు రాయాలి కదా… పిచ్చివాడా… పేపర్ కాపీలు అమ్మాలి, జీవిత చందాలు కట్టించాలి, యాడ్స్ సేకరించాలి, పెద్దలు అడిగిన పనులు చేసిపెట్టాలి, డిజిటల్ ఎడిషన్‌ను వాట్సప్ గ్రూపుల్లో షేర్లు చేయాలి, అంతేతప్ప వార్తలు ఎవడికి కావాలి..? మరి వార్తలు..? ఏముంది..? వాట్సపుల్లో కనిపించేవి కాస్త అటూఇటూ […]
జగ్గారెడ్డిపై అపనిందలు, రేవంత్ ఓ నూతన్‌ప్రసాద్… రావుగోపాలరావు ఎవరు..?!
బాబ్బాబు, మీకు వోట్లేస్తాం, గెలిపిస్తాం అని ప్రజలు సిద్ధంగా ఉన్నా సరే, ఠాట్ వీల్లేదు, ఎవడ్రా మాకు వోట్లేస్తామనేది..? అంటారా ఎవరైనా..?! ఎందుకు ఉండరు… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదా ఏం..? నిజంగా ఆ పార్టీ దురవస్థ చూస్తే జాలేస్తుంది… కాదు, నవ్వొస్తుంది… జగ్గారెడ్డి ఎపిసోడ్ పక్కా తార్కాణం… రోజూ పత్రికల్లోకి వస్తూ, టీవీల్లో కనిపిస్తూ ఏదో హల్చల్ క్రియేట్ చేయడానికి నానా అవస్థలూ పడుతున్నాడు… పోత పోత అంటాడు, లేదు, లేదు, పోను, నేనెక్కడికి పోత […]
ది కశ్మీర్ న్యూ ఫైల్స్… అక్కడ అనూహ్యమైన కొత్త దృశ్యాలు కనిపిస్తున్నయ్…
ది కశ్మీర్ ఫైల్స్ రచ్చ ఇప్పట్లో ఆగదు… మనం ఇప్పుడు ఆ చర్చలోకి అడుగు పెట్టడం లేదు… అది సరేగానీ, ఒక వార్త సుబ్రహ్మణ్యస్వామి బాపతు సైటులో కనిపించింది… అస్సలు నమ్మబుల్ అనిపించలేదు మొదట్లో… ఆ వార్త ఏమిటంటే..? ‘‘జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం (లెఫ్టినెంట్ గవర్నర్) ఆర్టికల్ 370 ఎత్తేసిన తరువాత గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానించి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో పడింది… అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అత్యున్నత బిజినెస్ టీం ఒకటి పెట్టుబడుల అవకాశాల్ని పరిశీలించడానికి ఆల్రెడీ […]
ఓ రబ్బరు బొమ్మ… ఏ లగ్జరీ బంకర్లో దాగున్నదో… ఎక్కడుందో… పెద్ద మిస్టరీ..!!
అలీనా కబయెవా… ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్త మీడియాలో మళ్లీ ఒక్కసారిగా ప్రముఖంగా కనిపిస్తోంది… ఎవరీమె..? ఒక లవర్… వయస్సు 38 ఏళ్లు… రష్యా అధినేత పుతిన్ లవర్… కాదు, తను మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక ఈమే అన్నీ… ఒకప్పుడు రష్యా ఎంపీ, రష్యా అధికార పార్టీ డ్యూమా డిప్యూటీ… అసలు అదికాదు చెప్పాల్సింది… ఆమె ఎవరు..? తాష్కెంట్లో పుట్టింది… రిథమిక్ జిమ్నాస్ట్… అసలు ఆమె ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అన్నట్టుగా అద్భుతంగా కదిలే […]
ఇండియా మీద ఏదో చేయబోయింది… పాకిస్థాన్‌కు ఎక్కడో పేలిపోయింది…
పార్ధసారధి పోట్లూరి ……. పాకిస్థాన్ ఆయుధ డిపో పేలుడు చిక్కుముడి వీడింది ! నిన్న అంటే ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్ లోని సియాల్ కోట్ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. మొదట పెద్ద శబ్దంతో మంట వచ్చింది. వెంటనే వరసగా ఒక దాని తరువాత ఒకటి పెద్ద పెద్ద పేలుళ్లు జరిగాయి. మొదట్లో ప్రమాదవశాత్తూ పేలుళ్లు జరిగాయని భావించారు అందరూ. పాక్ లోని స్థానిక మీడియా మాత్రం ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ని రాజీనామా చేయమని సైన్యం […]
వడ్ల లొల్లి కాదు… ముందస్తు వైపు స్పీడ్ పెంచే రాజకీయ సంకేతాలే…
వడ్లను రైళ్లలో, వెయ్యి లారీల్లో తీసుకుపోయి ఇండియా గేట్ ముందు పారబోయాలి… నిన్నటి కేసీయార్ ఫామ్ హౌజులో అర్జెంటుగా సాగిన మంత్రుల భేటీలో ఈ నిర్ణయం మీద చర్చ జరిగిందట… ఢిల్లీని నెలల తరబడీ ముట్టడించి, చివరకు మోడీతో క్షమాపణలు చెప్పించుకున్న రైతులకు కూడా ఇలాంటి నిరసన ఆలోచన రాలేదు… అదీ మరి కేసీయార్ అంటే..? ఓ బృందంగా వెళ్లి అర్జెంటుగా మోడీని కలిసి, ఏయ్, యాసంగి వడ్లు కొంటవా కొనవా అని నిలదీయాలనేది మరో ఆలోచన… […]
అమెరికా పుండు మీద పాకిస్థానీ కారం… దానికీ తత్వం తెలిసి వస్తోంది…
పార్ధసారధి పోట్లూరి….. పూరి జగన్నాథ్ సినిమా డైలాగ్ ఒకటి ఉంది “ రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను “ అని. కానీ పాకిస్థాన్ డైలాగ్ వేరే గా ఉంది “ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను “ అని… తాజాగా అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా మసూద్ ఖాన్ ని నియమించింది. ఇది అమెరికాకి కాలే పుండు మీద ఉప్పు రాసినట్లుగా ఉంది. ఇంతకీ […]
ఫాఫం సాక్షి..! ఫాఫం జగన్..! నారా లోకేష్ స్పందిస్తే తప్ప నిద్రలేవలేదు…!!
ఫాఫం సాక్షి… ఫాఫం జగన్… వ్యర్థ కథనాలతో తెల్లారిలేస్తే బోలెడు జగన కీర్తనలు అచ్చేసే పత్రిక కొన్ని సందర్భాల్లో మాత్రం జగన్ వాయిస్‌లా మారలేక చతికిలపడుతోంది… జగన్ భజన తప్ప దానికి వేరే దిక్కులేదు, పత్రిక పెట్టుకున్నదే తన కోసం… దాని కేరక్టర్ అదే… దాగుడుమూతలు, పాత్రికేయ పాతివ్రత్యాలు కుదరవు… అదే ఆంధ్రజ్యోతి చూడండి, చంద్రబాబుకు ఓ కుడిభుజంగా పనిచేస్తోంది… పార్టీ నేతలకూ చేతకాని రీతిలో కష్టపడుతోంది… ఎటొచ్చీ సాక్షికే చేతకావడం లేదు… పెగాసస్… ఆమధ్య రచ్చ […]
కశ్మీరీ పండిట్ల ఇష్యూపై… కల్వకుంట్ల కవిత పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు, చైనా ఆక్రమణల మీద కేసీయార్ తాజాగా బీజేపీని ఏమని నిందిస్తున్నాడు, ఏం ప్రశ్నిస్తున్నాడు అనేది కాసేపు పక్కన పెడదాం… ఏయ్, కంటోన్మెంటుకు నీళ్లు, కరెంటు కట్ చేస్తాను బిడ్డా అని కేటీయార్ చేసిన బెదిరింపుల గురించీ కాసేపు విస్మరిద్దాం… యాంటీ బీజేపీ, యాంటీ నేషన్ ధోరణుల నడుమ తేడా గురించి చర్చ కూడా ఇక్కడ అక్కర్లేదు… కానీ ఇప్పుడు దేశమంతటా కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాపైన చర్చ సాగుతోంది… కశ్మీరీ పండిట్ల వ్యథ […]
రష్యా, చైనాలు కలిసి… అమెరికాను ఏం ఫిక్స్ చేస్తున్నారురా బాబూ…
పార్ధసారధి పోట్లూరి…….. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు! అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ దేశాలు రష్యాతో ఎలాంటి వ్యాపార, ఆర్ధిక లావాదేవీలు జరపవు మరియు డాలర్లని చెల్లింపుల రూపంలో చేయవు. అయితే రష్యా 2014 లో క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించింది. కాగా అప్పుటికే రష్యా దగ్గర దాదాపుగా 558 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. 2014 నుండి క్రమంగా […]
ప్రెస్‌క్లబ్ యవ్వారంలో ట్విస్ట్… కథ ముదురుతోంది… ఇప్పట్లో ఆగకపోవచ్చు…
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల యవ్వారం ఓ ఇంట్రస్టింగు మలుపు తిరిగింది… ఈ ఎన్నికల్లో అక్రమాలపై అభ్యంతరాలు వస్తున్నందున ఫలితాల్ని హోల్డ్‌లో పెడుతున్నామంటూ ఓ లిఖిత నోటీసును అతికించిన రిటర్నింగ్ అధికారి ఎం.హేమసుందర్రావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తాజాగా ఓ ఫిర్యాదు దాఖలు చేశాడు… అది పూర్తిగా అధ్యక్ష పదవికి పోటీపడి, రెండోస్థానంలో నిలిచిన సూరజ్ అనే అభ్యర్థి గురించి… మొత్తానికి ఈ వ్యవహారం పోలీసులు, కోర్టుల వరకే కాదు, ఇంకా ముదిరేట్టుంది… సదరు రిటర్నింగ్ అధికారి ఏమని […]
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు… పరువు తీసిన అక్రమాల దుర్గంధం…
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు ఓ చరిత్ర ఉంది… నిష్ణాతులైన హైదరాబాదీ పాత్రికేయులెందరికో అది సాయంకాలం ఆటవిడుపు అడ్డా… స్వల్ప రుసుముతో ప్రజాసంఘాలు, బాధితులు ప్రెస్మీట్లు పెట్టుకోగలిగిన వేదిక… తొలిసారి దాని ఇజ్జత్ పోయింది… తెల్లారిలేస్తే ఎన్నికల అక్రమాల మీద మాట్లాడి, అందరినీ ప్రశ్నించి, నిలదీసి, నీతులు చెప్పే పాత్రికేయులు ఇప్పుడు సిగ్గుతో తలదించుకునే దురవస్థ.,. ఎందుకు..? మునుపెన్నడూ లేనట్టుగా అక్రమాలు… స్వస్తిక్ గుర్తుకు తోడుగా ఇంకేవో గుర్తులు… ఇంటూ మార్కులు… ఐనా అన్నీ కౌంట్ చేశారు… అర్ధరాత్రి దాకా […]
కేసీయార్‌కు బండి సంజయ్ థాంక్స్ చెప్పాలి… ఖాళీగా ఉంచడం లేదు…
నిజానికి బండి సంజయ్ కేసీయార్‌కు, కేటీయార్‌కు, టీఆర్ఎస్కు థాంక్స్ చెప్పాలి… సంజయ్ చేతిలో అస్త్రాలు ఏమీ లేనప్పుడు, బాధపడకు, మేం ఇస్తాం కదా అస్త్రాలు అని ముందుకొస్తున్నారు కేసీయార్, కేటీయార్… పార్టీలోనే సంజయ్‌కు తలనొప్పులున్నయ్, తనను వీక్ చేసే ప్రయత్నాలూ ఉంటయ్… పైగా మాటిమాటికీ కేసీయార్‌ను జైలులో వేస్తాం అనే నిరర్థక మాటలు తప్ప సంజయ్ దగ్గర ప్రభుత్వంపై విరుచుకుపడే అస్త్రాలేమీ ఉండటం లేదు… తెరవెనుక బీజేపీ, టీఆర్ఎస్ నడుమ సత్సంబంధాలే ఉన్నాయనే సందేహాలు కూడా తెలంగాణ […]
బ్రహ్మోస్ మిస్ ఫైర్ కావడమా..? ఆశ్చర్యం… ఇంకేదో ఉంది… కుట్ర కాదు కదా…!!
పార్ధసారధి పోట్లూరి……….. సరిదిద్దుకో తగ్గది పొరపాటు ! సరిదిద్దికో లేనిది తప్పు ! భారత రక్షణ దళాలు తప్పు చేశాయి. బ్రహ్మోస్ మిసైల్ ని తప్పుగా ఫైర్ చేసాయి. రొటీన్ నిర్వహణలో భాగంగా మార్చి నెల 9 వ తేదీన బ్రహ్మోస్ మిసైల్ సిస్టంని సిద్ధం చేసే యత్నంలో ఫైర్ అయిపోయింది. అయితే ఇదేమీ చిన్న తప్పు కాదు. (పాకిస్థాన్ ఆల్రెడీ రచ్చ చేయడానికి ట్రై చేస్తోంది… సంయుక్త విచారణను డిమాండ్ చేస్తోంది…) పంజాబ్ లోని సిర్సా […]
మనకు కూడా కొరడా పట్టుకున్న ఓ యోగి ఉంటే ఎంత బాగుండు..?!
ఒక ఫోటో గుర్తుందా..? వనమా రాఘవ అనే కిరాతకుడి వేధింపులకు ఓ కుటుంబం నిలువునా నిప్పుకు ఆహుతైపోయిన విషాదం గుర్తుందా..? అన్ని పత్రికలు తన చరిత్ర రాశాయి… పోలీస్ కేసు, బెయిల్, బయటికి వచ్చేశాడు… ఇప్పుడు ఆయన గారి తండ్రి గారు శ్రీమాన్ వనమా వెంకటేశ్వరరావు ఏమంటున్నాడో తెలుసా..? అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ… ”2 నెలలు ఆరోగ్యం బాగాలేదు, నేను లేని సమయంలో కొందరు కుట్ర చేసి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావల్సిన నా […]
తెలుగు టీవీ మోడరేటర్లకు హైబీపీ… అదుపు తప్పి ఆవేశంతో ఊగిపోతున్నారు…
తెలుగు చానెళ్లు బాగా ఎదిగిపోతున్నయ్… పోతున్నయ్ ఏంటీ, పోయాయ్… ఇప్పుడున్నవన్నీ రంగులు పూసుకున్న చానెళ్లే కదా… అనగా ఏదో ఓ పార్టీకి డప్పు కొట్టేవే కదా… ప్రత్యర్థి పార్టీల మీద టన్నుల కొద్దీ బురదను చల్లేవే కదా… అఫ్కోర్స్, కాస్త ఎక్కువ కాస్త తక్కువ, అంతేతప్ప ఏ చానెలూ మినహాయింపు కాదు… వాటి ఓవరాక్షనే ఓవరాతి యాక్షన్ అయిపోతోందిరా దేవుడా అని ప్రేక్షకుడు తలపట్టుకుంటే… ఆ చానెళ్లలో మోడరేటర్లు, ప్రజెంటర్లు ఆ ఓవరాక్షన్ డోస్ మరింత పెంచుతున్నారు… […]
- « Previous Page
- 1
- …
- 73
- 74
- 75
- 76
- 77
- …
- 117
- Next Page »