ముందుగా ఒక వార్త చెప్పుకుందాం… బెంగుళూరులోని జేపీనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం (67) ఓ వ్యాపారి… తన ఇంట్లో పనిచేసే మహిళతో (35) తనకు వివాహేతర సంబంధం ఉంది… నవంబరు 16… సాయంత్రం అయిదు గంటలకు మనమడిని బ్యాడ్మింటన్ క్లాసుకు వదిలిపెట్టేందుకు బయటికి వచ్చాడు… అక్కడి నుంచి పనిమనిషి ఇంట్లోకి చేరుకున్నాడు… కాస్త లేటుగా వస్తానంటూ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్ చేసి చెప్పాడు… ఇంకేం..? ఆమెతో ‘ఆ సంబంధం’లో మునిగిపోయాడు… అర్ధరాత్రయినా సరే, ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులకు డౌటొచ్చింది… […]
అసందర్భపు కూతే… కానీ అమృత ఫడ్నవీస్‌కు మాత్రం అరుదైన ప్రశంస…
బాబా రామ్‌దేవ్ వివాదంలో లేకపోతేనే వార్త… పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో తను మాట్లాడుతూ మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని, తన కళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని పిచ్చి కూత ఏదో కూశాడు… నిస్సందేహంగా చిల్లర వ్యాఖ్య… యోగాకు వస్తున్న మహిళలకు దుస్తుల విషయంలో ఏర్పడుతున్న సమస్యలపై ఏదో కాంటెక్స్ట్లో తను ఆ మాట అన్నట్టున్నాడు… […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ… జస్ట్, ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం…
సూపర్ స్టార్ కృష్ణ… ఎంత గొప్పగా బతికి పోయాడు… కానీ తన అంత్యక్రియలు, ఊరేగింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో మరణానంతరం అభిమానుల్ని కలుక్కుమనిపించే సీన్లు… అవన్నీ మళ్లీ లంబా చోడా ఇక్కడ చెప్పుకోలేం కానీ… ఫాలో కానివాళ్లు ఉంటే కాస్త దిగువన ఇచ్చిన ‘ముచ్చట’ లింక్ చదవండి… అసలు విషయం మొత్తం అర్థం అయిపోతుంది… ఇక ఇప్పటి సంగతి చెప్పుకుందాం… ఈమధ్యకాలంలో మనం ఇద్దరి కర్మకాండ, ఏర్పాట్లు, ఘనమైన వీడ్కోళ్లు చూశాం… ఒకటి కృష్ణం రాజు […]
జర్నలిస్టుల వార్త శుద్ధ తప్పు… జైలు శిక్షల్లేవు, జరిమానాల్లేవు… నిజమేంటంటే..?!
*జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా 50వేల జరిమానా. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు* న్యూఢిల్లీ:: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళనలకు […]
ఈ కొత్త ఆర్మీ చీఫ్… ఖతర్నాక్ ఇండియన్ ఎనిమీ… పాకిస్థాన్‌కు మరో అజిత్ ధోవల్…
పోస్టుల పేర్లు వేరు… చేసిన కొలువుల హోదాలు వేర్వేరు… వర్తమాన హోదాలు వేర్వేరు… కానీ పాకిస్థానీ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిం మునీర్ ఆ దేశానికి ఓ అజిత్ ధోవల్… రెండు దేశాల సైనిక, రక్షణ విధానాలకు సంబంధించి వాళ్లిద్దరి గ్రిప్ తిరుగులేనిది… 29న పదవీ విరమణ చేయబోతున్న ఆర్మీ చీఫ్ బజ్వా ఒకందుకు కొంత సాఫ్ట్… ఆర్మీని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి విషయాల్లోనూ పెద్దగా కంట్రవర్సీల్లోకి పోలేదు… ఇండియా పట్ల విపరీతమైన […]
రా రా అంటే… అదొక అద్భుతమైన కాక్టెయిల్… ఓ డిఫరెంట్ కిక్కు…
Taadi Prakash…… రారా.. ఒక ఉత్తేజం…. నవంబర్ 24 , కడపలో రా.రా. శతజయంతి సభ జరుగుతున్న సందర్భంగా … ‘రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే’ అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్‌ల అవ్యాజ ప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల […]
సిధ్ శ్రీరాంకు గంగాధరుడి స్ట్రాంగ్ జవాబు… అనంత శ్రీరాముడు ఏమంటాడో…!?
ఉల్టె, కళ్టి, నిల్టా, మళ్ట… ఏమిటిదంతా అనుకుంటున్నారా..? తెలుగు పాటను, భాషను ఖూనీ చేస్తున్న సిధ్ శ్రీరాం అనే గాయకుడు, స్వరజ్ఞానం ఏమీ లేకపోయినా వెనకేసుకొచ్చే అనంత శ్రీరాంపైన సీనియర్ జర్నలిస్టు ధాత్రి మధు పెట్టిన వీడియో ఆమధ్య వైరల్ అయ్యింది తెలుసు కదా… అందులో విషయం ఏమిటంటే… అంటే బదులు అల్టే, ఉంటే బదులు ఉల్టే, కంటి బదులు కళ్టి, మంట బదులు మళ్ట అని ఉచ్చరిస్తాడు… కర్ణకఠోరం… ఇనుపగుగ్గిళ్లు… పాట హైపిచ్‌లో ఉన్నప్పుడు ఉంటే […]
మళ్లీ ఆ శేషన్ దిగివచ్చినా… ఆ టెంపర్ చూపించలేడు… ఎందుకో తెలుసా..?
అప్పట్లో మన ఎన్నికల వ్యవస్థను పరుగులు పెట్టించి, ఎన్నికల నిర్వహణకు కొత్త దిశను నిర్దేశించిన TN శేషన్ మీద సుప్రీంకోర్టు కూడా నిన్న ఓ కేసు విచారణలో ప్రశంసలు కురిపించింది… అలా ‘జీహుజూర్’ అనకుండా ఉండే ‘నిజమైన స్వయంప్రతిపత్తి’ కలిగిన ప్రధాన ఎన్నికల అధికారుల్ని నియమించుకోలేమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది… అవసరమైతే ప్రధాని మీద కూడా చర్యలు తీసుకునే వ్యవస్థ అవసరమనీ అభిప్రాయపడింది… తమకు ఇష్టమైన రిటైర్డ్ బ్యూరోక్రాట్లను ప్రభుత్వం నియమించుకోవడం గాకుండా, జుడిషియరీలోని కొలీజియం సిస్టం […]
కృష్ణ ‘కర్మకాండ’ అయిపోలేదు… అందరి కన్నూ ఇప్పుడు పెద్దకర్మ జరిపే తీరుపై..!!
ఇద్దరు సీఎంలు వచ్చి నివాళి అర్పించారు… తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది… కృష్ణను ఘనంగా, తన రేంజుకు తగినట్టు సాగనంపారు… కరెక్టేనా..? కాదు..! మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఇండస్ట్రీలో విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి… సొంత భూములు, పద్మాలయా స్టూడియో ఉండగా… సాదాసీదాగా మహాప్రస్థానం స్మశానంలో దహనక్రియలు జరపాలనే నిర్ణయం పట్ల అక్కడికి వచ్చిన పొలిటికల్ సెలబ్రిటీలే ఆశ్చర్యపోయారట… కుటుంబసభ్యుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందట… ఆ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు..? మహేశ్ […]
మోడీయే మెగా విలక్షణ నటుడు… చిరంజీవిపై ప్రేమను భలే నటిస్తున్నాడు…
ఐనా మోడీ ముందు చిరంజీవి ఏపాటి నటుడు..?! అది జగమెరిగిన మెగాస్టార్…! చిరంజీవికి ఇఫి ద్వారా ‘ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు ఇస్తున్నాడు… కేంద్ర మంత్రితో ప్రకటన జారీచేయించాడు… వెంటనే విలక్షణనటుడు అని అభినందిస్తూ ఓ ట్వీట్ కొట్టాడు తెలుగులో… మోడీ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది కదా… మరి ఇందులో ఏముంది..? ఎస్, చిరంజీవికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఓ పేజీ ఉంది… పద్మభూషణే ఇచ్చారు, ఈ ఇఫి అవార్డుదేముంది..? […]
సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
ఒక చిన్న దళిత రైతు… నిజానికి తనకు లక్షలు దక్కాలి… కానీ ఓ యూనివర్శిటీ తనను మోసగించింది… పరిశోధనలు చేతకాని శాస్త్రవేత్తలు ఈ రైతు డెవలప్ చేసిన ఓ వరి రకాన్ని హైజాక్ చేశారు… పేటెంట్ రైట్స్ పొందారు… ఎంత దారుణం అంటే… చివరకు ఆ రైతు తన అనారోగ్యానికి సరైన చికిత్స చేయించుకోలేక గడ్చిరోలిలో ఓ ఆదర్శ డాక్టర్ల జంట నడిపే హాస్పిటల్లో చేరి, అక్కడే చనిపోయాడు… ఇదీ సంక్షిప్తంగా కథ… చెప్పుకున్నాం కదా… మన […]
ఏది నాగవల్లీ… నీ కళ్ల నుంచి మళ్లీ ఆ రుధిర వర్షం కురియలేదేమి దేవీ..?!
‘‘అయ్యారే, ఆ నాగవల్లి బుసలు కొట్టదేమి..? రుధిర వర్షాన్ని కురిపించదేమి..? ఏమైంది ఆ టెంపర్మెంట్..? అకస్మాత్తుగా చల్లబడిపోయిందా దేవి..?’’ ఇలాంటి డైలాగులు నాలుగు గుర్తొచ్చాయి ఈ టీజర్ చేస్తే…! ఏం టీజర్ అంటారా..? అదే గిట్టనివాళ్లు పాగల్సేన్ అంటుంటారు కదా… ఆ విష్వక్ సేన్ తనే మెగాఫోన్ పట్టుకుని, చకచకా ఓ సినిమా తీసిపారేశాడు కదా… ధమ్కీ పేరిట… మన భోళా బాలయ్య వెళ్లి పోస్టర్ కూడా ఆవిష్కరించాడు కదా… సదరు విష్వక్సేనుడు ఆ సినిమాలో టీవీ9 […]
వినోద చానెళ్లకు ప్రమాద సంకేతాలు… అచ్చం దినపత్రికల రంగంలాగే…
న్యూస్ చానెళ్లను కాసేపు వదిలేయండి… ఆ దిక్కుమాలిన కవరేజీల తీరు, జుగుప్స రేకెత్తించే డిబేట్లు… భ్రష్టుపట్టించేశాయి పాత్రికేయాన్ని… ఐనా ఒకటీరెండు పెద్ద చానెళ్లకు తప్ప వేరే వాటికి పెద్ద రెవిన్యూ ఏమీ ఉండదు… నాయకుల కాళ్ల దగ్గర పాకడం, జోకడం… డప్పు కొట్టడం… కొందరైతే పైరవీలు, బ్లాక్‌మెయిళ్లు… అయితే మరి వినోద చానెళ్ల స్థితిగతులు ఎలా ఉన్నయ్…? మొన్నమొన్నటిదాకా బాగానే ఉండేది… మస్తు రెవిన్యూ… అన్ని భాషల చానెళ్లూ దండుకున్నయ్… ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పొల్యూషన్ ఏమిటంటే… […]
ఏపీలో పిల్లలు తగ్గిపోవడానికి… జగన్ పిచ్చి పాలన నిర్ణయాలే కారణమా..?
పిల్లలు పుట్టకపోవడం, పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ముసలోళ్లే అధికమైపోవడం, జనాభాలో యువత శాతం కుంచించుకుపోవడం… ఇత్యాది లక్షణాలకు అసలు కారణం ఏమై ఉంటుంది..? మన సగటు జ్ఞానపరిధి మేరకు ఆలోచిద్దాం… మీరూ ఆలోచించండి… కుటుంబ నియంత్రణ మీద ప్రజల్లో అవగాహన పెరిగిపోవడం, ఒకరికన్నా ఎక్కువ మందిని ‘అఫర్డ్’ చేయలేమనే రియాలిటీ అర్థం కావడం… అంటే పిల్లలు ఎక్కువగా ఉంటే చదువు, ఆరోగ్యంతోపాటు ప్రేమనూ అందరికీ సరిపోయేలా, సరిగ్గా ఇవ్వలేమనే భావన… పెరిగిన జీవనవ్యయం, చంచలమైన కొలువులు, ఒక […]
కొన్ని అంశాల్లో కృష్ణకు పూర్తి భిన్నం మహేశ్ బాబు… ప్రత్యేకించి యాడ్స్…
ముందుగా యలమంచిలి శివాజీ ఆంధ్రజ్యోతిలో రాసిన ఓ వ్యాసంలోని కొన్ని భాగాలను చెప్పుకుందాం… కృష్ణ జైఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, తెలంగాణ వ్యతిరేకి, అప్పట్లో జైఆంధ్ర ఉద్యమకారులు మద్రాసు వెళ్లి, పెద్ద పెద్ద సినిమా నటుల్ని, దర్శకుల్ని కలిస్తే… ఎవరూ ముందుకు రాలేదు, కృష్ణ ఒక్కడే సమర్థించాడు… ఇవన్నీ వోకే… ఇప్పుడు కొత్తగా చెప్పుకోనక్కర్లేదు… తనపై ఇప్పుడు ముద్రలు కూడా అవసరం లేదు… అప్పట్లో తనకు నచ్చింది చేశాడు… ఒక ఏడాది సంపాదన ఉద్యమానికి ఇద్దామని కృష్ణ […]
జోష్ లేదు… టీఆర్ఎస్ ప్రధాన కేడర్‌లో ఎందుకో అనూహ్యంగా స్తబ్దత…
తాడో పేడో… బీజేపీ అంతగా కాన్సంట్రేట్ చేస్తోంది తెలంగాణ మీద… కేసీయార్ మీద… ఇంకా చేయబోతోంది… తప్పనిసరై కేసీయార్ కూడా బలంగా ప్రతిఘటిస్తున్నాడు… అయితే తనదైన శైలిలో, ముందస్తు దాడి వ్యూహంతో…! మొన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు పథకాలు, ఆ వీడియోల విడుదల అందులో భాగమే… కాకపోతే స్కెచ్ ఎక్కడో తన తాజా అదృష్టంలాగే గాడితప్పి తుస్సుమంది… వీసమెత్తు ఇంపాక్ట్ లేదు… పైగా చివరకు హైకోర్టుకు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది… బీజేపీని బజారుకు లాగి, ఇరుకునపెట్టడానికి ఇంకేదో ఆలోచిస్తూనే […]
మహారాష్ట్రలోనే కాదు… కేరళలోనూ కాంగ్రెస్ కూటమి ఇచ్చుకపోతోంది…
పార్ధసారధి పోట్లూరి ……. కేరళ కాంగ్రెస్ పార్టీలో అభద్రతా భావం ! రాహుల్ ఎక్కువ రోజులు పర్యటించింది కేరళలో, కానీ అదే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం సంతోషంగా లేరు రాహుల్ పర్యటన వలన… పోయిన బుధవారం రోజున కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ కన్ననూర్ లో చేసిన ప్రకటన అక్కడ రాజకీయ అభద్రతా భావాన్ని సూచిస్తున్నది. కన్ననూర్ లోని ఒక సభలో కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం తాను […]
దహనం చేయబడిన వ్యక్తికి సమాధి ఎలా కడతారు మాస్టారూ..?!
అజ్ఞానంతో… నిజంగానే అజ్ఞానంతో వేస్తున్న ప్రశ్న… అయ్యా, ఆదిశేషగిరిరావు గారూ… మరణించిన మీ సోదరుడికి ప్రజాస్మశానంలో (మహాప్రస్థానం) దహనక్రియలు నిర్వహించారు కదా… మరి సమాధి ఎక్కడ కడతారు..? ఇంకెక్కడో కడితే దాన్ని సమాధి అనాలా..? స్మారకం అనాలా..? అసలు కృష్ణ అంత్యక్రియలకు సంబంధించి వింత నిర్ణయాలతో ఇప్పటికే బోలెడన్ని విమర్శలు మూటకట్టుకున్నారు… మళ్లీ కొత్తగా ఇదేమిటి..? మరీ అత్యున్నత యోగసాధన పరిభాషలో సమాధి స్థితి అంతే వేరు… అటువైపు వెళ్లడం లేదు… మామూలుగా హిందువుల్లో అంత్యక్రియలు రెండు […]
ఉండవల్లి కరణం గారి పగ… మార్గదర్శిని కడదాకా వదిలేట్టు లేదు…
కరణం గారి పగ, కాటికి చేరినా పోదు… అని ఓ సామెత… ఉండవల్లి అరుణ్‌కుమార్ బ్రాహ్మల్లో ఏ విభాగమో తెలియదు గానీ… వీరముదురు కరణం… పట్టువదలని విక్రమార్కుడు టైపులో పగవీడని అరుణార్కుడు… రామోజీరావును అప్పుడెప్పుడో వైఎస్ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం టార్గెట్ చేశాడు ఉండవల్లి… సరైన పాయింట్లు పట్టుకుని, వెంటపడతాడు కాబట్టి ఉండవల్లే కరెక్టని ఆయనకు అప్పగించాడు వైఎస్… వైఎస్ మరణించాక, జగన్‌తో ఉండవల్లికి పెద్దగా సత్సంబంధాలు లేక, కేసీయార్‌కు రామోజీని సాధించడం ఇష్టం లేక, […]
షాకింగ్… స్మిత సభర్వాల్ అంత పనిచేసిందా..? ఔనా… నిజమేనా..?
‘‘ఫలానా హోటల్ మూసేస్తారట కదా… అరెరె… అందులో బటన్ ఇడ్లీ బాగుండేది… మసాలా చాయ్ అదిరిపోయేది… శుభ్రంగా ఉండేవి పరిసరాలు… ధరలు కూడా రీజనబుల్… ప్చ్, ఆ హోటల్‌కు బైబై చెప్పాల్సిందేనా..?’’ అని ఎవరైనా ట్వీట్ చేస్తే ఏమిటి అర్థం..? ఛిఛీ, ఇదేం హోటల్ర భయ్, గుడ్‌బై అని చెప్పినట్టు కాదు కదా… అసలే కాదు… పైగా సదరు హోటల్‌తో అనుబంధాన్ని చెప్పుకున్నట్టు…! ఉదయమే కొన్ని వార్తలు చదవగానే ఇదే స్ఫరించింది… ముందుగా ఆ వార్తల సారాంశం […]
- « Previous Page
- 1
- …
- 80
- 81
- 82
- 83
- 84
- …
- 146
- Next Page »