హమ్మయ్య… కాస్త సద్దుమణిగింది… హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల తొక్కిసలాట, పోలీసుల లాఠీ ఆట, నిర్వాహకుల డబ్బుల ఆట… మీడియా కన్నులపంట… గంటల తరబడీ చూపించే చూపి, వాగిందే వాగి, పెంటపెంట చేశారు… ఆమె ఎవరో తన బిడ్డ ఈ దేశం కోసం గాయాలపాలైనట్టు విలపిస్తోంది… ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టీవీ చానెళ్లలో ఎండగడుతోంది… ఈరోజు కాస్త హడావుడి తగ్గింది… మనకు ఎలాగూ పీఎఫ్ఐ ముప్పులు, ఖలిస్థానీ ముప్పులు పనికిరావు, కనిపించవు కదా… మళ్లీ ఎన్టీయార్, […]
సచిన్ పైలట్… బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే మరో ఏకనాథ్ షిండే…
ప్రజలు ఏం తీర్పు చెప్పారు అనేది బీజేపీకి అవసరం లేదు… ఏం చేస్తే గద్దెనెక్కగలం..? స్ట్రెయిట్‌గా గెలిస్తే వోకే, లేదంటే ఏం చేద్దాం..? ఇదొక్కటే ఫోకస్… యుద్ధంలో, శృంగారంలో ఏదీ తప్పు కాదు, సేమ్, రాజకీయాల్లో కూడా..! ఇదేమీ వాజపేయినాటి కాలం కాదు, ఇది మోడీషా జమానా… కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కూలదోసిన తమకు రాజస్థాన్ మింగుడుపడకపోవడం బీజేపీకి నచ్చడం లేదు… జీర్ణం కావడం లేదు… మహారాష్ట్రలో కూడా బలమైన దెబ్బ తీయగలిగింది ప్రత్యర్థుల […]
PK Team :: హైదరాబాద్ టెంట్ ‘పీకే’శారు… ఈ ఇద్దరి దోస్తీ కటీఫ్…
‘‘తూచ్, ఈ దసరాకు కేసీయార్ జాతీయ రాజకీయాల ఎంట్రీ, కొత్త పార్టీ ఏర్పాటు ఉండకపోవచ్చు… బహుశా మరో రెండు నెలలు జాప్యం తప్పదు… ఢిల్లీ మద్యం స్కాం తలనొప్పి, ఈడీ-సీబీఐ యాక్టివ్ కదలికలతో పార్టీలో ఓరకమైన ఆందోళన కనిపిస్తోంది’’…. ఇది ఒక వార్త… ‘‘పీకే మీద కేసీయార్‌కు వైరాగ్యం వచ్చేసింది, లైట్ తీసుకున్నాడు, దాంతో ఆ పీకే టీం హైదరాబాద్ దుకాణం మూసేసింది, ఏపీకి తరలిపోయింది’’…. ఇది ఇంకో వార్త… ఈ రెండు వార్తల్ని ఓసారి కేసీయార్ […]
Congress Chiranjeevi :: ఔననడు, కాదనడు… దూరం కాదు, దగ్గరగా లేడు…
ఆ ఐడీ కార్డు కలకలం రేపుతోంది… అది నిజమైందో కాదో తెలియదు కాబట్టి ఆ కార్డు బొమ్మ ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు… విషయం ఏమిటంటే… చిరంజీవికి పీసీసీ డెలిగేట్ అని కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది అనేది వార్త… రెండుమూడు రకాల కార్డులు వార్తల్లో కనిపిస్తూ ఉండేసరికి డౌటొచ్చింది… పైగా ఇటు చిరంజీవి క్యాంపు గానీ, అటు ఏపీ కాంగ్రెస్ గానీ దీనిపై ఏమీ వ్యాఖ్యానించడం లేదు… కానీ ఈ […]
ఎప్పటిలాగే… ఎన్టీయార్ కుటుంబం సైలెంట్… కన్నోళ్లు, కట్టుకున్నోళ్లు..
ముందుగానే ఓ పెద్ద డిస్క్లయిమర్…. ఇది ఈ కథనం రాస్తున్న సమయం బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న పరిస్థితి…. ఎన్టీయార్ పేరును పీకిపారేసి, వైఎస్ పేరు పెట్టాడు కదా జగన్ హెల్త్ యూనివర్శిటీకి… తెలుగుదేశం గాయిగాయి గత్తర రేపుతున్నది… దానికి అది అవసరం… జగన్ ఎక్కడ దొరికితే అక్కడ బదనాం చేయడం దాని రాజకీయ అవసరం… పైగా ఇది జగన్ పట్ల వ్యతిరేకతను పెంచుతోంది… తెలుగుదేశంతో సంబంధం లేని తటస్థులు కూడా జగన్ నిర్ణయాన్ని […]
YSR :: సాక్షాత్తూ షర్మిలే కుట్రగా ఆరోపిస్తున్నా… ఎక్కడా చడీచప్పుడు లేదు…
ఇంతకీ వైఎస్‌ను ఎవరు హతమార్చారు..? ఎందుకు..? వాళ్లే ఆయన బిడ్డ షర్మిల మీద కూడా ఎందుకు కక్షగట్టారు..? జగన్‌కు కూడా లేని పట్టింపు షర్మిలకు ఎందుకు కలుగుతోంది..? ఏపీ రాష్ట్రం మొత్తాన్ని వైఎస్ నామమయం చేస్తున్న జగన్ ఆయన మరణకారకుల్ని వదిలేశాడా..? ఎవరో తనకు తెలుసా..? క్షమించాడా..? ఇవన్నీ పక్కన పెడితే… సాక్షాత్తూ వైఎస్ బిడ్డ స్వయంగా మా నాన్న మరణం వెనుక కుట్ర అని చెబితే, తనకూ ముప్పు ఉందని చెబుతుంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లో […]
ఈ-శ్రాద్ధం పెడితే రేటు 21,500… పిండప్రదానంపైనా 5 శాతం జీఎస్టీ…
పితృకర్మల్ని వారసులు గాకుండా… ఎవరు పడితే వారు నిర్వర్తించవచ్చా..? తద్వారా పితృ ఆత్మలకు శాంతి లభిస్తుందా..? సంతృప్తి పొందుతాయా..? అసలు ప్రభుత్వాలే ఈ పితృకర్మల్ని ఓ బిజినెస్‌గా మార్చేయవచ్చా..? పోనీ, ఆన్లైన్ పెళ్లిళ్లలాగే ఆన్లైన్ పిండప్రదానాలు చేయవచ్చా..? వారసుడి తరఫున పంతుల్లే మమ అనిపించేసి, ఓ వీడియోను పెన్‌డ్రైవ్‌లో పంపించేస్తే, పంతులుకు సంభావన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందా..? ఇవన్నీ ఆమోదయోగ్యమేనా..? ఎప్పుడైనా ఈ ప్రశ్నలు మీలో మెదిలాయా..? పితృకర్మలు హిందూ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఓ భాగం… […]
జీవిత ఖైదీలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించవచ్చా..?!
నిజంగా సీరియస్‌గా ఆలోచించాల్సిన కేసే ఇది… ఒక హత్య కేసు… బోలెడు కోర్టు సమయం, పోలీసుల ప్రయాస, సాక్ష్యాధారాల సేకరణ, తరువాత కోర్టు జీవితఖైదు విధిస్తే… సింపుల్‌గా ఒక రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, ఆ నేరస్థుల్ని వదిలేయవచ్చా..? మరిక ఇంత లీగల్ ప్రొసీజర్‌కు, కోర్టు తీర్పుకు అర్థమేమిటి..? అసలు ఖైదీల విడుదలలో ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలేమిటి..? పరిమితులేమిటి..? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తున్నాయీ అంటే… ఏపీ హైకోర్టులో ఒక మహిళ పిటిషన్ […]
ఎన్టీయార్ బదులు వైఎస్ఆర్… రేప్పొద్దున మరో కులనేత సీఎం అయితే..?!
తుంటను ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టుంది… అని ఓ సామెత… అంటే చిన్న దుంగను కింద పారేసి, పెద్ద చెట్టు మొద్దును ఎత్తుకుని భరిస్తున్నట్టు..! వరుసగా జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఓ మేధావిని అభిప్రాయం అడిగితే, తను వ్యక్తం చేసిన సింపుల్ వాక్యం అదీ..! హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీయార్ పేరు తొలగించి, వైఎస్ఆర్ పేరు పెట్టాలనే నిర్ణయం కూడా అలాంటి అనేక నిర్ణయాల కోవలోనిదే… జగన్ రాజనీతిజ్ఞుడు కాదు, భవిష్యత్తులో అవుతాడే లేదో తెలియదు… కానీ […]
సీన్ ఫుల్ రివర్స్…! నాకేమిటని విర్రవీగిన సంజయుడికి తత్వం తెలుస్తోంది..!!
పార్ధసారధి పోట్లూరి …………… దీపావళి పండుగ జైల్లో చేసుకోవాల్సిందే ! 2020 లో రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ తరువాత శివసేన MP చేసిన వ్యాఖ్య ఇది! (కంగనా రనౌత్ మీద మరీ నీచమైన వ్యాఖ్యలు చేశాడు…) సరిగ్గా రెండేళ్ల తరువాత దృశ్యం తిరగబడింది. గత 40 రోజులుగా జైల్లో కాలం గడుపుతున్న సంజయ్ రౌత్ కి తాజాగా మరో 14 రోజుల ED కస్టడీ ని పొడిగిస్తూ ప్రత్యేక కోర్ట్ […]
అదేమిటమ్మా… ఆఫ్టరాల్ 75 ఏళ్లకే రాజకీయాలకు సెలవా…? హవ్వ..!!
మన సినిమా హీరోలు నడుములు వంగిపోయినా, వీపులకు బద్దలు కట్టుకుని స్టెప్పులు వేస్తుంటారు… వెండితెరకు వేలాడుతూ ఉంటారు… మన నాయకులు మరీ ఘోరం… ఆయుష్షు ఉన్నంత కాలం “సేవ” చేస్తుంటారు… మధ్యలో రిటైర్డ్ అని చెప్పుకున్నా సరే… ఇక నా బతుకంతా సినిమా స్టెప్పులకే అంకితం అన్నట్టుగా వ్యవహరిస్తున్నా సరే… తాజాగా ‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం దూరం కాలేదు’’ అంటూ మార్మిక సంభాషణల్ని తాజా సినిమాల్లో జొప్పించి, మళ్లీ వచ్చేస్తాను సుమా […]
‘‘నిరాహార దీక్ష వేళ గుట్టుగా చాక్లెట్లు నమిలేది, శాండ్విచ్లు లాగించేది…’’
పాదయాత్ర అంటే… పూర్తిగా నడకే అక్కర్లేదోయ్… కాసేపు నడువ్… తరువాత క్యారవానో, కంటెయినరో ఎక్కేసి, కాస్త ఊపిరి పీల్చుకో, మళ్లీ నడువ్, మళ్లీ కాసేపు రిలీఫ్… ఎవరు వచ్చి, ఎక్కడ కలవాలో, ఏం ఫోటోలు దిగానో, ఏది మీడియాకు ఇవ్వాలో అంతా వెల్ ప్లాన్డ్… కలిసే జనం, కలిసి నడిచే జనం కూడా ఫేక్… ఎవరి అవసరాలు వాళ్లవి… నిరాహారదీక్ష అంటే మరీ వీజీ… ఇప్పుడు నిరవధిక దీక్షలు లేవు కదా… ఎవరూ పొట్టి శ్రీరాములు కాదుగా… […]
ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే సొసైటీకి ఏం ఫాయిదా ప్రొఫెసర్ సాబ్..?
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టులో కేసు అంటే… దాని వెనుక సమర్థనీయమైన సంకల్పం, ఉద్దేశం, స్పూర్తి ఉండాలి… ఎట్లీస్ట్ ఉండాలని కోరుకుంటాం… పైగా ఏళ్ల తరబడీ సొసైటీకి పనికొచ్చేలా పర్యావరణ, సామాజిక రంగాల్లో అలుపెరగని వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి వంటి మేధావులు, నిపుణులు ఒక కేసు వేశారంటే దానికి ఓ బలమైన జస్టిషికేషన్ ఉండాలి… ఉండాలని కోరుకుంటాం… కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకు అసెంబ్లీ సీట్లను పెంచడం లేదంటూ ఆయన వేసిన కేసు స్పూర్తికి […]
ఉడ్తా పంజాబ్ సీఎం…! సో వాట్..? విమానం నుంచి దింపేశారు…!!
పార్ధసారధి పోట్లూరి ………… పంజాబ్ ముఖ్యమంత్రి ని విమానం నుండి దింపేశారా ? పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. సెప్టెంబర్ 11 నుండి 18 వరకు జర్మనీ పర్యటన కోసం ముందుగానే షెడ్యూల్ ఖరారు అయ్యింది. అయితే ఈ నెల 11 న ఢిల్లీ నుండి బయలుదేరి జర్మనీ వెళ్ళాడు మాన్. ఈ పర్యటన ఉద్దేశ్యం పంజాబ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి. అయితే 18/9/2022 ఆదివారం రాత్రి […]
ఆ జంట టవర్లలాగే… 54 విల్లాల రిసార్ట్ కూల్చివేత షురూ… ఆ కథ ఇదీ…
నొయిడాలో అక్రమంగా నిర్మించిన జంట టవర్లను పేలుడు పదార్థాలు పెట్టి మరీ పేల్చేశారు మొన్న… చూశాం కదా… నిజానికి దేశంలో కొన్ని లక్షల అక్రమ నిర్మాణాలు… ప్రభుత్వమే క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది… ప్రభుత్వ అధికారులే లంచాలకు మరిగి అనుమతులు ఇస్తుంటారు… కానీ అప్పుడప్పుడూ కోర్టు కొరడా పట్టుకుంటుంది… అప్పుడిక ఏ వ్యవస్థా రక్షించలేదు… ఆ టవర్ల కూల్చివేతే దానికి సాక్ష్యం… అచ్చం అలాంటిదే… కాదు, అంతకుమించి ఓ కూల్చివేత ప్రారంభమైంది… అదీ మన తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సారథ్యంలో… […]
ఈ తోక పటాకులతో కేసీయార్ జాతీయ గోదావరిని ఈదుతాడట..!!
మనం ఇంతకుముందు చెప్పుకున్నదే… ఒక ప్రకాష్‌రాజ్ స్థాయి ఏమిటి రాజకీయాల్లో…? తను అసలు రాజకీయ నాయకుడేనా..? కేసీయార్ తనను వెంటేసుకుని తిరుగుతాడు కొన్నాళ్లు…! తరువాత గాయబ్… మరికొన్నాళ్లు ప్రశాంత్ కిశోర్‌తో గంటలకొద్దీ భేటీలు వేస్తాడు… నా ఫ్రెండ్ అంటాడు… తరువాత మాయం..! రైతుసంఘాలే దూరం పెడుతున్న రాకేష్ టికాయిట్ను ఇంకొన్నాళ్లు వాడుకున్నాడు కేసీయార్… ఇప్పుడు అదీ అయిపోయింది… ఢిల్లీలో ఇదే టికాయిట్ను నమ్ముకుని రైతుదీక్ష పెడితే, ఒక్కడంటే ఒక్కడూ మద్దతుకు సిద్ధపడలేదు… అంతెందుకు..? తెలంగాణ జనం సొమ్మును […]
కేంద్రం వేరట… రాష్ట్రం వేరట…! ఆహా.., ఏం సమైక్యతా స్పూర్తి..?!
ఎందుకు లేవు..? ఎన్నో విశేషాలు… సర్దార్ పటేల్ సారథ్యంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పాలకుడు నిజాంను వంగదీసి, లొంగదీసి, హైదరాబాద్‌ను యూనియన్‌లో కలిపేసుకున్న రోజు సెప్టెంబరు 17… మొత్తానికి 74 ఏళ్ల తరువాతనైనా ఈ ప్రాంతం ఆ మరుపురాని రోజును అధికారికంగా కేంద్రప్రభుత్వ సారథ్యంలో స్మరించుకుంటోంది… విలీనమా, విద్రోహమా, విమోచనమా పేరు ఏదయితేనేం..? హైదరాబాద్ ఓ దక్షిణ పాకిస్థాన్ గాకుండా ఈ దేశంలో ఓ భాగమైపోయింది… అదంతా చరిత్ర… కానీ… ఒక చరిత్రాత్మక సందర్భాన్ని కేంద్ర […]
‘‘ఆపరేషన్ సల్మాన్’’… ఆ నొటోరియస్ గ్యాంగుకు టార్గెట్ ఎందుకయ్యాడు..?!
ఎస్… సల్మాన్‌ఖాన్‌ను ఖతం చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నం చేసింది… ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని అనుకుంది… సల్మాన్‌ను తన పన్వెల్ ఫామ్హౌజుకు వెళ్తుండగా చంపేయాలనేది ప్లాన్… 3 నెలలుగా రెక్కీ నిర్వహించింది… తను వచ్చే దారిలో ఏ గుంత లోతు ఎంత..? ఎక్కడ కారు స్లో అవుతుందో కూడా లెక్కలు వేసి పెట్టుకున్నారు… కారు స్లో అయినప్పుడే టార్గెట్ కొట్టేయాలని అనుకున్నారు… ఫామ్‌హౌజ్ సెక్యూరిటీ గార్డులను ఫ్యాన్స్ పేరిట మచ్చిక […]
అన్ని భాషల్లోకీ విస్తరణ… రెండేళ్లు టార్గెట్… ఆర్నబ్ గోస్వామి తాజా శపథం…
ఎన్డీటీవీలో ఆల్రెడీ అడుగుపెట్టిన ఆదానీ… క్రమేపీ దాన్ని కబళించడం ఖాయం..! దానితోనే ఆగిపోతాడా..? నెవ్వర్… అలా ఆగిపోవడానికి కాదుకదా ఎన్డీటీవీని మింగేస్తున్నది… ఇంకా చాలా విస్తరణ ప్రణాళికలు ఉంటయ్… అవి మెల్లిమెల్లిగా ఆచరణలోకి వచ్చేస్తయ్… వయాకామ్, నెట్వర్క్18 ద్వారా అంబానీ ఎక్కడికో వెళ్లిపోతున్నాడు… అనేక భాషల్లో డిజిటల్ న్యూస్, టీవీ న్యూస్, ఎంటర్టెయిన్మెంట్, బ్రాడ్‌కాస్టింగ్… ఇంకా విస్తరిస్తాడు… ఆదానీ ఎందుకు ఊరుకుంటాడు..? ఊరుకోడు… సరే, ఆదానీ మీడియా విస్తరణ ఖచ్చితంగా బీజేపీ ప్రయోజనాల కోసమే అని ఆరో […]
ఫాఫం సాక్షి… ఆమె ఇప్పుడు వైసీపీ కాదు, బీజేపీ మనిషి జగనన్నా…
ఎక్కడో ఓ చిన్న ఆశ… ఇంకా ఈ దేశంలో న్యాయవ్యవస్థ పనిచేస్తోందనీ… అక్రమార్కులకు శిక్షలు పడతాయనీ… ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఈ దేశంలో శిక్షింపబడతారనీ… కొద్దిగా వెలుతురును ప్రసరింపజేసింది ఆ తీర్పు… రకరకాల విచారణలు, అప్పీళ్ల దశలు దాటి, ఇంకా ఎన్నాళ్లో సాగీ సాగీ చివరకు ఏం అవుతుందో తెలియదు గానీ… ఈరోజుకైతే అది ప్రధాన వార్తే… కానీ..? మన టీవీలు, మన పత్రికలు, మన సైట్లు, మన యూట్యూబర్లు, మన సోషల్ మీడియా… దాన్నసలు పట్టించుకోలేదు… […]
- « Previous Page
- 1
- …
- 82
- 83
- 84
- 85
- 86
- …
- 141
- Next Page »