పార్ధసారధి పోట్లూరి ………. సంక్షోభంలో ఉన్న శ్రీలంకని వదిలి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే బతుకుజీవుడా అంటూ పారిపోయాడు ! సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలని వాళ్ళ కష్టానికి వాళ్ళని వదిలేసి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే పారిపోయాడు… గత వారం రోజులుగా ప్రజలు శ్రీలంక అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని కార్యాలయం మీద దాడి చేసి అక్కడే ఉండి పోయారు. అప్పటికే రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసి వెళ్ళిపోవడం, మరోవైపు గోటబయ అధ్యక్ష భవనం హడావిడిగా ఖాళీ […]
స్వామి మహా ఘటికుడు… రామసేతు రక్షణకు భలే పాయింట్ పట్టేశాడు…
సుబ్రహ్మణ్యస్వామి… మనిషి అంతుచిక్కడు… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద బుర్ర… మనసులో ఏదైనా పెట్టుకుంటే ఇక వదలడు, వెంటపడతాడు… చాలా ఉదాహరణలుంటయ్… వాజపేయి మీద కోపం పెట్టుకుని, జయలలితను ఉసిగొల్పి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన వైనం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లను ఈడీ కేసు దాకా పట్టుకొచ్చిన వైనం దాకా… స్వామి ఎప్పుడు ఏ ఇష్యూలో వేలు పెడతాడో, వాటిల్లో స్వప్రయోజనాలు ఉంటాయో, ప్రజాప్రయోజనాలు ఉంటాయో కూడా అంత వేగంగా తేల్చిచెప్పలేం… రామసేతు అలియాస్ […]
ఆమె ఓ స్వేచ్ఛా ప్రణయిని..! ఆ అందం అర్థం కాదు, ఎవరికీ కట్టుబడదు..!!
నిజానికి 56 ఏళ్ల లలిత్ మోడీ, 46 ఏళ్ల సుస్మిత సేన్ డేటింగ్ అనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తోనే కొన్నేళ్లు కలిసి బతికింది… మోడీ ఎంత..? ఆమెకు జాతి, కుల, మత, వయోభేదాలేమీ ఉండవు… తన జీవితంలోకి కొందరు వస్తుంటారు… పోతుంటారు… ఆమెకు ఎవరితోనూ అతకదు, ఏ బంధానికీ కట్టుబడి బతకదు… ఆమె స్వేచ్ఛాజీవి… ఆమె గతం ఫాలో అయ్యేవారికి ఇట్టే అర్థమయ్యే విషయం ఒకటే… ప్రణయబంధాల వరకూ […]
ఏమై ఉంటుందబ్బా… మోడీతో మమత రహస్య అవగాహన..!?
బెంగాలీ జర్నలిస్టులు, ఢిల్లీ జర్నలిస్టులు జుత్తు పీక్కుంటున్నారు… బెంగాల్లో ఏం జరుగుతోందో అంచనాలు వేయలేక, సోర్స్ దొరక్క, చెప్పేవాడు లేక, విషయం అంతుపట్టక విశ్లేషణరహితులై పోయారు… అన్ని మీడియా హౌజులకు అందింది ఒకే ఫోటో… అందులో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, మమత బెనర్జీ, అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ కనిపిస్తున్నారు… ఇది కోల్‌కత్తాలో కాదు, డార్జిలింగ్‌లో జరిగిన భేటీ… నలభై నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ గురించి మమత జర్నలిస్టులతో మాట్లాడుతూ… ‘‘పెద్ద రాజకీయ ప్రాధాన్యం […]
బుడ్డ గోచీ సర్దుకునే పనిలో ఠాక్రే… ఆ సెక్యులర్ సంసారం ఇక పెటాకులే…
విధి నడ్డి మీద నాలుగు తంతేగానీ తత్వం బోధపడదు అని ఓ ముతక మోడరన్ సామెత… శివసేన పరిస్థితి అదే… 40 మంది ఎమ్మెల్యేలు తిరగబడి, వెళ్లిపోయారు… కుర్చీ దక్కించుకున్నారు… ఆఫ్టరాల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత..? మా వారసత్వానికి సలాములు కొట్టే గులాములే కదా అనుకున్న ఆ శివసేన బాస్ పరిస్థితి హఠాత్తుగా అరేబియా సముద్రంలో పడ్డట్టయింది… చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఠాక్రే… అందులో ముఖ్యమైంది మళ్లీ హిందుత్వ పాట అందుకోవడం… ఇన్నాళ్లూ […]
ఇల్లలకగానే పండుగ కాదు… బీజేపీ బలం పెరిగింది నిజమే… కానీ…?
నిజానికి పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు…. తెలంగాణ ప్రజల మూడ్ మీద ఆరా మస్తాన్‌రావు సర్వే నివేదిక వివరాలు చదువుతుంటే అది వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు కూడా అనిపించలేదు… అంకెల సంగతి తరువాత, ప్రజల మూడ్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు తెలుసు… తెలుసు కాబట్టే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.., కాంగ్రెస్‌ను ఒక్క మాటా అనకుండా, ప్రజల వర్తమాన సమస్యల గురించి పట్టకుండా మోడీని కేసీయార్ రెండున్నర గంటలపాటు వాషింగ్ పౌడర్ నిర్మా సర్ఫ్‌తో కడిగినప్పుడే […]
… వీళ్లు మళ్లీ అదే క్యాంపెయిన్ మొదలుపెట్టార్రా దేవుడోయ్…
సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కలిసి… ‘‘మై డియర్ రాధా, దయచేసి నన్ను వదిలెయ్, రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వనప్పుడే నా మనస్సు విరిగిపోయింది… మళ్లీ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ నాకెందుకు చెప్పు..? ఏదో ఆ స్వర్ణభారతి ట్రస్టు పనులు చూసుకుంటూ, చేసుకుంటూ శేషజీవితం గడిపేస్తా… కాస్త ఈ క్యాంపెయిన్ ఆపుతావా..?’’ అని కోరినా సరే… నో, నో, ఒక తెలుగు వెలుగు సంతకానికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా సార్..? మీరు వద్దన్నా సరే, మా పోరాటం […]
అశోకుడి ధర్మచక్రం, నాలుగు సింహాల ప్రతిమల వెనుక అసలు నిజాలు ఇవీ..!!
పార్లమెంటు భవనం మీద కొలువు తీరిన నాలుగు గర్జించే సింహాల వివాదం తాలూకు రాజకీయ కువిమర్శలు, అర్ధజ్ఞానాలు, శుష్క పాండిత్యాలు, వితండవాదాలను కాసేపు పక్కన పెడదాం… కొన్ని నిజాల్ని మాట్లాడుకుందాం… అంగీకరించేవాడు అంగీకరించనీ… లేదంటే పోనీ… ఎలాగూ జాతీయ మీడియా వివాదంలో ఇంకాస్త పెట్రోల్ పోస్తుందే తప్ప, అసలు వాస్తవాలు ఇవీ అని చెప్పదు… మన పార్టీలు సరేసరి… మన లీడర్ల విజ్ఞత ఎప్పుడూ మత్తళ్లు దూకుతూ ఉంటుంది కదా… సోషల్ భూతాలు సరేసరి… సరే, విషయానికి […]
ఇందిర మరో వికృతకోణం… ప్రపంచ అందగత్తె గాయత్రిదేవికి నరకం…
ఇందిరాగాంధీ నియంతే… కొత్తగా చెప్పుకోనక్కర్లేదు… నియంతల్లోని వికృత కోణాలకు పెత్తనాలు, సంపాదన, విలాసాలు, అధికారాలు, వైభోగాలు మాత్రమే కాదు… కొన్నిసార్లు మనసులో కొందరిపట్ల అసూయ కూడా కారణం అవుతుంది… గాయత్రీదేవి పట్ల ఇందిర కోపం, ప్రతాపం ఇలాంటిదే… గాయత్రీదేవి కూచ్ బెహర్ రాజకుటుంబంలో పుట్టింది… అల్లారుముద్దుగా, వైభోగంతో పెరిగింది… ఇందిరాగాంధీకి, గాయత్రీదేవికి పరిచయం ఎక్కడంటే… శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పథ భవన స్కూల్లో పరిచయం… గాయత్రీదేవి మంచి అందగత్తె… అప్పట్లో వోగ్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచస్థాయి […]
చైనా పరిస్థితి కూడా సవ్యంగా ఏమీలేదు… ఆ బ్యాంకుల్లో నగదు నిల్వల్లేవు…
పార్ధసారధి పోట్లూరి ………. సెంట్రల్ చైనా నగరం అయిన Zhengzhou లో ప్రజలు భారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. చైనాలోని నాలుగు గ్రామీణ బాంకులలో భారీగా అవకతవకలు జరగడంతో ప్రజలు తమ సేవింగ్స్ అక్కౌంట్స్ మరియు డిపాజిట్స్ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా, వాటిని ఇవ్వడానికి సదరు బాంకులు తిరస్కరించాయి… నిధుల లభ్యత లేని కారణంగా డబ్బు డ్రా చేయకుండా ఫ్రీజ్ చేయబడడం వలన కావొచ్చు ! సమస్యకి బీజం 2011 లోనే పడ్డది! 2011 […]
ఓహో… మనవి శాంతి సింహాలా..? రౌద్రంగా గర్జించకూడదా..?!
చాలామందికి ఈరోజుకు పనిదొరికింది… కడుపు నిండింది… ఒకటే ఇష్యూలో మోడీని తిట్టొచ్చు, తమ యాంటీ-హిందూ పోకడను బయటపెట్టొచ్చు… ఇంకేముంది..? తమ నాలుకలకు పదునుపెట్టారు… విషయం ఏమిటీ అంటే..? నిన్న కొత్త పార్లమెంటు భవనం మీద మోడీ నాలుగు సింహాల ప్రతిమను, అదేనండీ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించాడు కదా… ఇక మొదలైంది… మొదటిది… ఆ సింహాలు గర్జిస్తున్నాయి… ఇలా ఓ జాతీయ చిహ్నాన్ని ఇష్టారాజ్యంగా మార్చవచ్చా..? ఇదీ విమర్శ… ఇందులో పసలేదు… నిజమే అవి గర్జిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి… కానీ […]
ముందస్తుకు రెడీ అన్నారుగా… మళ్లీ ఇవేం కిరికిరి మాటలు రాహుల్..?!
ముందుగా నువ్వు ఇది చెప్పు రాహుల్… కేసీయార్ ఏమన్నాడు..? ముందస్తుకు నేను రెడీ అన్నాడు… డేట్ విపక్షాలనే చెప్పమన్నాడు… నువ్వు ఇనీషియేటివ్ తీసుకుని మీడియేట్ చేయి రాహుల్ అని నీకు కూడా చెప్పాడు… విపక్షాలు డేట్ చెబితే వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తానన్నాడు… ఇదంతా ప్రెస్మీట్లో, లక్షల మంది ప్రజలు చూస్తుండగా, లైవ్‌లో చెప్పాడు కదా… మళ్లీ ఇదే కిరికిరి రాహుల్… తొండి, బభ్రాజమానం, భజగోవిందం… ఉంటాదివయా, గిట్లుంటాదివయా… కేసీయార్ సవాల్ విసరగానే బండి సంజయ్ సై […]
శత్రుదేశపు హైకమిషనర్‌తో అర్ధరాత్రిళ్లలో అద్వానీ రహస్య భేటీలు..!!
ఢిల్లీ… పందార రోడ్డు… ఉపప్రధాని అద్వానీ నివాసం… అందరూ నిద్రపోతున్న ఓ రాత్రివేళ… ఒక గుర్తుతెలియని ప్రైవేటు కారు అక్కడికి వచ్చింది… అద్వానీ మేల్కొనే ఉన్నాడు… ఎదురు చూస్తున్నాడు… అందులో వచ్చింది ఎవరో తెలుసా..? పాకిస్థాన్ హైకమిషనర్ అష్రాఫ్ క్వాజీ… తనను తీసుకువచ్చిన వ్యక్తి ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్… కాసేపటికి కారు వెళ్లిపోయింది… అంతా గప్‌చుప్… ఒక్కసారి కాదు… 18 నెలల్లో కనీసం ఇరవై ముప్ఫయ్ సార్లు ఈ రహస్య భేటీలు జరిగాయి… నమ్మేట్టు లేదు […]
మరి చైనా అంటేనే అదీ… వివో మొబైల్ కంపెనీ భారీ ఫ్రాడ్ కథ ఇదీ…
పార్ధసారధి పోట్లూరి ……….. చైనాకి చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘వివో’ [VIVO] పన్నుల ఎగవేత కేసులో ఇరుక్కుంది ! ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ [ED] వివో ఇండియాకి చెందిన 117 బ్యాంక్ అకౌంట్లలో ఉన్న465 కోట్ల రూపాయాలని స్థంభింప చేసింది. దేశవ్యాప్తంగా 48 నగరాలలో ED వివోకి చెందిన పలు సంస్థల మీద దాడి చేసిన సందర్భంలో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. వివో మొత్తం 62,476 కోట్ల రూపాయలని చైనాకి తరలించింది. ఇది కేవలం […]
విడాకులు 50% పెరిగాయ్… సంసారాలపైనా కరోనా కనిపించని దెబ్బ…
లీల, మోహన్ బెంగుళూరులో ఉంటారు… కరోనా పీరియడ్‌లో ఢిల్లీలో అనారోగ్యంతో ఉన్న అమ్మ వద్దకు వెళ్లింది లీల… లాక్ డౌన్లు, కరోనా ఆంక్షలు ఎత్తేసినా సరే, అమ్మ ఆరోగ్యం చక్కబడక అక్కడే ఉండిపోయింది ఆమె… బెంగుళూరులో భర్త… ఇద్దరి నడుమ దూరం పెరిగిపోయింది… బాధ్యతలు, వర్క్ ప్రెజర్ వెరసి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు… పదిహేనేళ్ల బంధం తెగిపోతోంది… ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు… కుటుంబవ్యవస్థకు, సర్దుబాట్లకు పేరొందిన భారతీయ సమాజంలో ప్రస్తుతం విడాకుల రేటు విపరీతంగా పెరిగిపోతోంది… గత […]
టీకప్పు మీద కూడా ట్రోలింగ్… ఇదెక్కడి సోషల్ పైత్యంరా బాబూ…
మన మీడియాకు కొన్ని పరిమితులు ఉన్నాయేమో…. సోషల్ మీడియాకు పరిమితులేమున్నయ్…? ఎవడికిష్టం వచ్చింది వాడు రాసేసుకోవడం, నచ్చకపోతే తెలుగు కొత్త బూతు భాషలో ఒరే పువ్వా, నీ గువ్వా అని ట్రోలింగ్ చేసే ఎదవలు… మోడీ, జిన్‌పింగ్, బైడెన్… ఎవడైతేనేం..? నోటికొచ్చినట్టు తిట్టడమే… అసలు ప్రపంచానికి అతిపెద్ద శాపం సోషల్ మీడియా… ఇండియాకు కూడా… కాకపోతే మోడీకి ఇంకా అర్థం కావడం లేదు… బహుశా తన వాట్సప్ యూనివర్శిటీకి కూడా అదే పంథా నిర్దేశించాడు కాబట్టేమో… విషయం […]
మన మీడియా ‘అగ్నిపథం’… మమత పత్రిక వార్తలా మనకు ఆదర్శం..!!
మోకాలికీ బట్టతలకూ లింక్ పెట్టడం మన రాజకీయ నాయకులకు, పార్టీలకు నీళ్లు తాగినంత ఈజీ… కాదు, వాళ్ల అలవాటే అది… మన మీడియా ఈ ధోరణికి భిన్నమేమీ కాదు, నాలుగు ఆకులు ఎక్కువే… ఎవడో వాషింగ్టన్ పోస్ట్ వాడు ఏదో పిచ్చి రాతలు రాస్తాడు… మనవాళ్లు కళ్లకద్దుకుని ఆ ఎడ్డి కూతల్ని అచ్చేసుకుని, వాషింగ్టన్ పోస్ట్ ఇలా రాసింది తెలుసా అని రాసేస్తాడు… ఆ వాషింగ్టన్ పోస్ట్ కూడా మనలాంటి పత్రికే అనే సోయి ఉండదు… కొన్నిసార్లు […]
ఒక తప్పుడు ఇంజక్షన్ దగ్గర ఈ ఇద్దరి ప్రేమకథ ప్రారంభమైంది..!!
ఆమె పేరు మూర్తిదేవి… తరచూ అస్వస్థతగా ఉండేది… ఓసారి లక్నో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఓ సీనియర్ నర్స్ ఆమెకు ఓ తప్పు ఇంజక్షన్ ఇవ్వబోయింది… అక్కడే ఉన్న ఓ ట్రెయినీ నర్స్ వెంటనే అడ్డుపడింది… ఆ ఇంజక్షన్ ఇస్తు ఉపద్రవం జరిగిపోయేది… ఇది గమనిస్తున్న ఆ మూర్తిదేవి కొడుకు ఆ ట్రెయినీ నర్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు… అక్కడ కళ్లు కలిశాయి… తరువాత మనసులు కలిశాయి… ఆ తరువాత బతుకులు కూడా… ఆ కొడుకు పేరు ములాయం సింగ్… […]
లవ్ బ్రేకప్ అయితే… పెళ్లి దాకా వెళ్లకపోతే… ఇక అది అత్యాచారమేనా..?!
ఇద్దరు… ఒక ఆడ, ఒక మగ… పెళ్లి చేసుకుందాం అనుకున్నారు… ప్రేమించుకుంటున్నారు… మనసులు కలిశాయి, ఎలాగూ పెళ్లిచేసుకుంటాం కదా అనుకుని స్వేచ్ఛగా శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా… ఆ సంబంధం పెళ్లి దాకా పోలేదు… ఎక్కడో ఏవో మనస్పర్థలు వచ్చాయి… అతను మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు… మొదటి మహిళతో దూరం జరిగాడు… కేరళ, కొల్లంకు చెందిన ఆమెకు పట్టరాని కోపం వచ్చింది… శృతి కుదరకపోతే, ప్రేమ పెళ్లి […]
ముదురుతున్న కాళి వివాదం..! అండగా నిలవని టీఎంసీకి మహువా గుడ్‌బై..?!
ఆమెకు అలవాటే… వివాదాలు ఏమీ కొత్తకావు… ఏదైనా అనడానికి జంకు, బెరుకు ఏమీ ఉండవ్… బడబడా అనేస్తుంది… ఎవరి మీదనైనా వ్యాఖ్య చేయడానికి రెడీ… పైగా వెనక్కి తగ్గదు… సారీలు, ఐడోన్ట్ రిపీట్లు ఏమీ ఉండవు… పార్లమెంటులో అంతే, బయటా అంతే… అవును, ఇవన్నీ ఆమె గురించే… తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గురించే… కాళి మద్యం తాగుతుంది, మాంసం తింటుంది అని వ్యాఖ్యలు చేసి… ఎవరో మనకు పెద్దగా తెలియని దర్శకురాలు మణిమేగలై వైపు […]
- « Previous Page
- 1
- …
- 94
- 95
- 96
- 97
- 98
- …
- 146
- Next Page »