పార్ధసారధి పోట్లూరి …… డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం! సోషల్ మీడియాలో మరియు న్యూస్ ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలో డాలర్ తో రూపాయి విలువ పతనం మీద చేస్తున్న విమర్శలు, విశ్లేషణలు అర్ధవంతంగా ఉండడం లేదు. ఎవరికి తోచిన లేదా వాళ్ళ రాజకీయ అజెండాతో విశ్లేషణలు చేస్తున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎవరూ చెప్పట్లేదు. 1. మనకి స్వాతంత్ర్యం వచ్చిన 1947 లో ఒక రూపాయికి ఒక డాలర్ విలువగా ఉండేది. 2. […]
మీ బొంద జర్నలిజం… సిగ్గూశరం లేదా… అగ్గిమండిన లేడీ సింగర్…
ఎంకి పెళ్లి, సుబ్బి చావు…. అన్నట్టు ఎక్కడో ఏదో జరుగుతుంది… మన గాశారం బాగాలేకపోతే అది మనకు తగుల్కుని మన ఇజ్జత్ తీస్తది… ఇదీ అంతే… బెంగాల్లో ఈడీ పార్థ ఛటర్జీ అనే ఓ మంత్రి గారిపై కన్నేసి దాడులు చేసింది కదా… సారు గారి జాన్ జిగ్రీ దోస్త్, నటి, మోడల్ అర్పిత ముఖర్జీ ఇంట్లో 21 కోట్ల నగదు దొరికింది కదా… దాదాపు నెంబర్ టూ అనిపించుకున్న మంత్రి అరెస్టయితే పార్టీ సైలెంటుగా ఉండటం, […]
కాస్త నోటి దూల… తెలుగు మూలాలున్న ఈ ‘‘ఓవర్ స్పీకర్’’ కథ ఇదీ…
Nancharaiah Merugumala…………. నెహ్రూ– ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు………… ఇవీ కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్ కుమార్ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! గురువారం రమేశ్ అన్న మాటలు సహజంగానే పాలకపక్షమైన బీజేపీకి ఆయుధాలుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేత, హోం మంత్రి అరగా జ్ఞానేంద్ర […]
హయ్యారే… ఏం సేయుట..? సభ రద్దు చేయుటయా..? వేచి ఉండుటయా..?
కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్‌ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్‌గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు… కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… […]
తెలియదు… ఏమో, గుర్తులేదు… సోనియా ఈడీ విచారణ సాగిన విధంబెట్టిదనిన…
పార్ధసారధి పోట్లూరి ………… ED-సోనియా విచారణ ! సోనియా ED ఆఫీస్ కి బయలుదేరే ముందు అన్ని రాష్ట్రాల నుండి ఛోటా మోటా నాయకులు ఢిల్లీ చేరుకొని ED ఆఫీసు ముందు ఆందోళనకి దిగారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేశారు. ED ఆఫీసుకి వెళ్ళే ముందే సోనియా అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నది… తనతో పాటు తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతించాలి అంటూ..! అంతే కాదు, తనకి వ్యక్తిగత సహాయుకుడు కూడా […]
వామ్మో జర్నలిస్టు..! గొట్టాలు చూస్తేనే జనంలో దడ… ఇవి ‘పెన్ గ్యాంగ్స్…
జనం మీద పడే తోడేళ్లలా ప్రభుత్వ అధికారులు కనిపించేవాళ్లు గతంలో… రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కులసంఘాలు, సామాజిక సంస్థలు నిర్బంధ చందాల దందాలు జతకలిశాయి… తరువాత పట్టణాలు, నగరాలయితే హిజ్డాలు ఓ ఆర్గనైజ్డ్ ముఠాలుగా జనంపై పడసాగారు… వీళ్లందరినీ మించి సమాజానికి ఇప్పుడు పెద్ద జాఢ్యం జర్నలిజం… ఈ హైనాల బెడద గతంలో లేదని కాదు, కాకపోతే అప్పట్లో పత్రికల సంఖ్య తక్కువ… తరువాత టీవీ గొట్టాలు చేరాయి… ఇక కొన్నేళ్లుగా యూట్యూబ్ చానెళ్ల పేరిట, […]
ఎవరా ఇద్దరు లేడీస్..? ఏమా కథ..? పార్థ మంత్రి గారు ఘటికులే సుమీ…!!
నిన్న ఈడీ దాడుల్లో బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ దొరికిపోయాడు కదా… అరెస్టు కూడా చేశారు… అక్కడక్కడా రణగొణ ధ్వనులు మినహా టీఎంసీ క్యాంపు కిమ్మనడం లేదు… దొరికిన సారు గారు చిన్న నాయకుడేమీ కాదు… ఘటికుడు… మమతకు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు… అంతెందుకు..? ఒక దశలో అసెంబ్లీలో అతనే ప్రతిపక్ష నేత… టీఎంసీ తరఫున… ఆల్రెడీ తనపై సీబీఐ కేసు ఉంది… దానికి కొనసాగింపే ఈడీ దర్యాప్తు… పక్కాగా సమాచారం తీసుకుని, […]
ఫాఫం… మమతకు బీజేపీ నమ్మకద్రోహం… ఫెడరల్ స్పూర్తికీ గండి…
ఎస్.., ఈ మతవాద, ఈ మనువాద, ఈ ఛాందసవాద బీజేపీని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు… విశ్వాసఘాతక పార్టీ అది… మొత్తం ద్రోహచింతనే… వీసమెత్తు స్నేహనిబద్దత లేదు… ఆడినమాటకు కట్టుబడే నైజమే కాదు… కాకపోతే ఏమిటండీ… మొన్నమొన్ననే కదా డార్జిలింగులో భేటీ వేయించింది… అప్పటి గవర్నర్ ధనకర్ను అప్పటికే అక్కడికి పంపించి, అక్కడికే అస్సోం సీఎం హిమంత విశ్వనూ రప్పించి, ఆ సమయానికి మమతను పిలిపించి కూర్చోబెట్టారు కదా… చాయ్ తాగారు, బిస్కెట్లు తిన్నారు… మంచీచెడూ మాట్లాడుకున్నారు… మంతనాలు […]
దూల తీరింది…! ద్రౌపది మీద నోటికొచ్చిన రాతలు… కొలువు గోవిందా..!!
కొన్ని దేశాల్లో ఉన్న మనవాళ్లు నోటికొచ్చినట్టు సోషల్ మీడియా పోస్టుల్ని పెట్టి కేసులు, అవస్థల పాలైన ఉదాహరణలు చూశాం… మన దేశంలో కూడా కొన్ని సంస్థల్లో పనిచేసేవాళ్లకు దూల ఎక్కువ… రాబోయే పరిణామాల్ని, నష్టాల్ని అంచనా వేసుకోకుండా ఇష్టారీతిన పోస్టులు పెడుతుంటారు… కొందరు తెలివిగా ఇది నా వ్యక్తిగతం అంటూ డిస్క్లెయిమర్స్ కూడా రాస్తుంటారు… కానీ టైమ్ ఎదురుతన్నినప్పుడు ఇవేమీ కాపాడవు… గిలెటిన్… అనగా తల తెగిపడటమే… అంతే… వ్యక్తిగతంగా పలు అంశాలపై ఎలాంటి అభిప్రాయాలున్నా సరే… […]
దక్షిణ తెలంగాణపై బీజేపీ కన్ను… బలమైన వలసవాదులు కావలెను…
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో అమిత్‌షా ముప్పావు గంట భేటీ వేశాడట… అబ్బే, కలిసిన మాట నిజమే గానీ, జస్ట్, ఓ మర్యాదపూర్వక కలయిక అంటున్నాడు రెడ్డి గారు… హహహ… ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో ముప్పావుగంట అమిత్ షా భేటీ వేయడమా..? అదీ మర్యాదపూర్వంగా..!! జనం చెవుల్లో చాలా మర్యాదపూలు పెడుతున్నారు రెడ్డి గారు… అమిత్ షా మర్యాదస్తుడే గానీ… ఇప్పుడున్న స్థితిలో అమిత్ షా ప్రతి పలకరింపు వెనుక, ప్రతి షేక్ హ్యాండ్ వెనుక చాలా మర్మాలుంటాయని […]
బాబా, శాస్త్రి హత్యలు వోకే…. మరి దిగ్రేట్ అజిత్ దోవల్ వర్గ కసి ఏమైనట్టు..?!
వర్గ కసి… ఈ పదం చాలామందికి అర్థం కాదు… నక్సలైట్ల నిర్మూలనకు ఫేక్ ఎన్కౌంటర్లను మొదలుపెట్టి, దూకుడుగా కొనసాగించిన జలగం వెంగళరావు మామూలు మరణానికి గురైనప్పుడు పీపుల్స్‌వార్ బాగా బాధపడింది… అదీ వర్గ కసి లక్షణం… ఏ జాతికైనా, ఏ దేశానికైనా, ఎవరికైనా వర్తించేది వర్గ కసి అనే పదం… అది ఫీలయ్యేవాడికే అర్థమవుతుంది ఆ పదం అసలు అర్థమేమిటో… సేమ్… ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మోసాద్ గురించి చెప్పాలి… తమ దేశానికి, తమ జాతికి నష్టం […]
కాదు.., ఆమె ఓ రబ్బర్ స్టాంప్ కాదు… పక్కా ఉదాహరణలు కావాలా…?
ద్రౌపది ముర్ము… ఆమె రాష్ట్రపతి అభ్యర్థి కాగానే రకరకాల పెదవివిరుపులు… ఏకైక కారణం ఆమె బీజేపీ నాయకురాలు కావడం… యాంటీ- బీజేపీ పార్టీలు, నాయకులందరూ పనిగట్టుకుని ఓ రబ్బరు స్టాంపు, ఆమెకు ఏం తెలుసు, ఓ విగ్రహం మాత్రమే వంటి విమర్శలకు దిగారు… ఆమె బీజేపీ కాబట్టి వ్యతిరేకించాలి… అంతే… అదొక్కటే సూత్రం… అలాంటివాళ్లు సపోర్ట్ చేసిన యశ్వంత్ సిన్హా తన జీవితకాలం మొత్తం బీజేపీ నాయకుడిగానే ఉన్నాడని మరిచిపోయారు… నిజానికి ఆమె రబ్బరు స్టాంపా..? ఏమీ […]
ఎస్… ఈ ద్రౌపది హస్తిన సామ్రాజ్ఙి… ఆదివాసీ ఆత్మగౌరవ పతాక…
ఆమె బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థి… సో వాట్..? ఆమె కాబోయే ఓ రబ్బర్ స్టాంప్… సో వాట్..? ఆమెతో గిరిజనానికి ఏ లబ్ఢీ లేదు… సో వాట్..? ఆమె సొంతూరికే కరెంటు రాలేదు… సో వాట్..? అన్ని విపక్షాలూ మద్దతునిచ్చాయి… సో వాట్..? . ఇన్ని సోవాట్ల నడుమ ‘ముచ్చట’ పలుసార్లు ఓ ప్రశ్న వేసింది…? ఒక ఆదివాసీ, ఒక మహిళ ఈ దేశ అత్యున్నత పదవికి ఎందుకు అర్హురాలు కాదు..? వైనాట్ ద్రౌపది…? చదువుకుంది… కొలువు […]
ఇదే రాజకీయం అంటే… మమత, బీజేపీ రహస్య అవగాహన…
ఒక్కటే సూత్రం…. రాజకీయాల్లో ఇలా జరగాలని ఏదీ ఉండదు… ఇలా జరగొద్దని అసలే ఉండదు… సబ్ చల్తా… బయటికి కనిపించే సీన్లు వేరు… తెర వెనుక జరిగేవి వేరు… తెల్లారిలేస్తే మోడీ, మమత డిష్యూం డిష్యూం… రెండు పార్టీలు తన్నుకుంటాయి… కార్యకర్తలు ఒకరినొకరు నరికేసుకుంటారు… వందల మంది కార్యకర్తలు కుటుంబాలతో సహా అస్సోం పారిపోతారు… కానీ ఏ సందర్భం వస్తే… మోడీ భాయ్, మమత బెహన్… అంతే… మొన్నామధ్య అస్సోం సీఎం సమక్షంలో మమత తన గవర్నర్‌తో […]
కేరళ మంత్రి గారు… ఒక డర్టీ డార్క్ బ్లూ అండర్వేర్ నేరగాథ…
దృశ్యం-2 సినిమా కావచ్చు… ఒకడిని నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ పునాదుల్లోనే పూడ్చేస్తాడు… తరువాత ఎప్పటికైనా బయటపడే ప్రమాదముందని గ్రహించి, ఓ స్మశానంలో అలాంటి ఒడ్డూపొడవు ఉన్న శవం ఎముకల్ని సేకరించి భద్రపరుస్తాడు… నిజంగానే తదుపరి దర్యాప్తులో ఒరిజినల్ శవం తాలూకు ఎముకలు తవ్వకాల్లో బయటపడతాయి… డీఎన్ఏ పరీక్షల కోసం ఓ మెడికల్ కాలేజీ మార్చురీకి వస్తాయి… అక్కడ సెక్యూరిటీని తన మనిషిగా చేసుకున్న హీరో ఓ రాత్రి వాడికి తప్పతాగించి, ఆ ఎముకల శాంపిల్‌ను తారుమారు […]
మోడీని తిట్టిపోశాడు కదా… అదే ఆదానీ దందాపై కేసీయార్‌కు ఓ చిక్కుప్రశ్న…
మొన్నామధ్య కేసీయార్ ఏమన్నాడు..? ‘‘దేశంలో టన్ను బొగ్గు 4 వేలకే దొరుకుతుంది… కానీ 25 నుంచి 30 వేల ధరతో బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోడీ చెబుతున్నాడు… ఎందుకంటే మోడీకి ఓ షావుకారు దోస్త్ ఉన్నాడు… అతడే ఈ బొగ్గును దిగుమతి చేస్తుంటాడు… సో, మోడీ ప్రధానిగా కాదు, తన దోస్త్‌కు సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు… అందుకే మోడీని దోషి అంటున్నాం…’’ ఎస్, అయితే అంబానీ, లేదంటే ఆదానీ… కాదంటే మేఘా కృష్ణారెడ్డి… ఎవరు తక్కువ..? ఆదానీ అంటే […]
ఆ భద్రాచలం రాముడినే ‘‘ముంచేసే’’ తెలుగు మళ్లింపు రాజకీయాలు..
టీఆర్ఎస్ వాదనలో తప్పేమీ లేదు… అయిదు ఊళ్లు అడగడంలో అనౌచిత్యం కూడా ఏమీలేదు… ఒరే నాయనా… గోదావరి వరద అదుపు తప్పితే భద్రాచలాన్ని కాపాడటానికి కరకట్టలు కడతాం, ఆ అయిదు ఊళ్లు ఇవ్వండిరా బాబూ అని అడగడంలో ఫాల్ట్ లేదు… కాకపోతే… ఆ అడిగే డిమాండ్ బాధ్యతను మంత్రి అజయ్‌కు అప్పగించడమే తప్పు,.. తనకేమీ తెలియదు… ఒక పాయింట్‌కు కమిట్ కావడంలో మెళకువ తెలియదు… ఏదో పైనుంచి ఏదో అసైన్మెంట్ ఇచ్చారు… ఈయన పాటించాడు… అంతకుమించి ఫాఫం […]
ఇంగ్లండులో డర్టీ గ్యాంగులు…! రిషి సునక్ భలే పట్టుకున్నాడు ఇష్యూని…!!
Nancharaiah Merugumala…………. నేటి బ్రిటన్ గ్రేట్ సమస్యలు–డౌన్ బ్లౌజింగ్, గ్రూమింగ్ గ్యాంగ్స్! మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుం బిగిస్తున్న’ రిషీ సునక్…. పాత పాత్రికేయ బాణీలో చెప్పాలంటే– భారత/పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ నేత, దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్ (42) ప్రధానమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలూ పద్ధతిగానే చేస్తున్నాడు. సునక్ కు మంచి చదువు, సంపద, మిలియనీర్ భార్య (ఇన్ఫోసిస్ ఎన్ ఆర్ నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు అక్షత) మాత్రమే […]
ఓహ్… ఈ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలూ మేఘాను గట్టెక్కించేందుకేనా..?
కేసీయార్ తెలివైనోడు… ఏదో ఎత్తుగడ లేనిదే ఏమీ మాట్లాడడు… గోదావరకి భారీ వరదలు అనేవి విదేశీకుట్ర, క్లౌడ్ బరస్ట్ అని చెబుతున్నాడు… స్టడీ చేస్తున్నామన్నాడు… గతంలో లేహ్, లడఖ్ ప్రాంతాల్లో ఈ ఉదాహరణలు ఉన్నాయన్నాడు… అంటే ఏమిటి..? ఏమీలేదు… ప్రఖ్యాత సాగునీటి ఇంజనీర్ కదా, తను వార్ ఎక్స్పర్ట్ కూడా… పైగా వెదర్ వార్ మీద, బయలాజికల్ వార్ఫేర్ మీద కూడా మంచి నాలెడ్జి ఉన్నవాడు… సో, అన్నీ తెలిసే ఉంటాయి… ఇదే అనుకుంటున్నారు మీరు కూడా… […]
మరో ప్రాణాంతక వైరస్ తప్పదా..? ఈసారి రష్యా నుంచేనా ఆ జీవాయుధం..?!
కరోనా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విషాదం అందరికీ తెలిసిందే… చైనా వాడి నిర్వాకానికి ప్రపంచం మొత్తం అన్నిరకాలుగా వేధించబడింది… ఇప్పటికీ కనుమరుగు కాలేదు… భస్మాసురుడిలా చైనా కూడా బాధపడుతోంది… అది వేరే సంగతి… ఇక అలాంటిదే మరో వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికించడానికి, మరింత విలయం సృష్టించడానికి ఈ సంవత్సరమే పుట్టుకురానుందట… కాకపోతే ఈసారి రష్యా వంతు అట… ఓహ్, ఈ కమ్యూనిస్టు కాకపోతే ఆ కమ్యూనిస్టు అన్నమాట… ఎహె, నాన్సెన్స్… అసలు ఆ వైరస్ మా చైనాలో […]
- « Previous Page
- 1
- …
- 96
- 97
- 98
- 99
- 100
- …
- 149
- Next Page »