Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు- రాముడి వారసులు మాత్రం సైలెంట్ !!

November 18, 2026 by M S R

.

ఇప్పుడంతా రామాయణం సినిమా ముచ్చట్లే నడుస్తున్నాయి కదా… తిట్టేవాళ్లు, చప్పట్లు కొట్టేవాళ్లు… పాపం, మోదీ దగ్గరకు సరిగ్గా రూట్ దొరకనట్టుంది, లేకపోతే పెద్ద సారు ప్రత్యేకంగా పార్లమెంటు ఆవరణలోని థియేటర్‌లోనే ఈ సినిమా చూస్తే, మంచి ప్రచారం దక్కి ఉండేది… అఫ్‌కోర్స్, వెంటనే నెగెటివ్ ప్రాపగాండా కూడా నడిచేది, అదీ సినిమాకు ఉపయోగపడేది…

కథాకథనాల నుంచి తారాగణం ఎంపిక దాకా బోలెడు చర్చ జరుగుతోంది, ఎవరెవరో స్పందిస్తున్నారు గానీ… ఒక ప్రశ్న… రాముడికి వారసులం అని గతంలో క్లెయిమ్ చేసుకున్న ప్రముఖులు దీనిపై స్పందించారా..? నాకైతే కనిపించలేదు… రెండున్నరేళ్లు, అంతకుముందు కనిపించిన ఈ వారస కథనాలు గుర్తు తెచ్చుకుందాం ఓసారి…

Ads

2024 జనవరిలో ఓ ఫోటో వైరల్ అయిపోయింది… అది రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, జైపూర్ రాణి దియాకుమారి కొడుకు మహారాజా పద్మనాభసింగ్ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న ఫోటో … బ్యాక్‌గ్రౌండ్‌లో అయోధ్య గుడి… theroyalfamilyofjaipur పేరిట ఉన్న ప్రొఫైల్‌లోనీ ఈ పోస్ట్ ఏం చెబుతున్నదంటే…

‘మేం సూర్యవంశ రాజపుత్రులం… అంటే శ్రీరాముని వారసత్వ పరంపర మాది… మా నాన్న శ్రీరాముడి తరువాత 309వ తరం…’ అని పేర్కొంటూ… మా వారసత్వాన్ని నిరూపించే ఆధారాలున్నాయి, 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జైసింగ్-2 ఒక సాధువు నుంచి మా వారసత్వ పరంపరను రాసి ఉన్న వస్త్ర పత్రాలను కొనుగోలు చేశాడు… ఇవి అనేక తరాలుగా మా కుటుంబం భద్రపరుస్తోందని వివరించాడు…

dynasty


నిజానికి ఈ కుటుంబం ఇప్పుడేమీ హఠాత్తుగా అయోధ్యతో తమ వారసత్వ లంకెలను, రాముడి వారసత్వాన్ని చెప్పడం లేదు… అయోధ్య పునర్నిర్మాణం జరిగాక చాలామంది ఏవో కథలు చెబుతూ రాముడి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు… కానీ రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియాకుమారి 2019లోనే ఓ ప్రకటన చేసింది… అప్పుడు ఆమె బీజేపీ ఎంపీ…

diya kumari

అప్పట్లో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కేసులో కక్షిదారుగా ఉన్న ‘రామ్‌లల్లా విరాజ్‌మాన్‌’ (బాలరాముడు), రామజన్మస్థలి ఎదుట, అంటే తన తరఫు న్యాయవాది పరాశరన్ ఎదుట ఓ ప్రశ్న ఉంచింది… ‘అసలు అయోధ్య రాముడి వంశానికి చెందిన వారసులు ఎవరైనా ఇంకా అయోధ్యలో ఉన్నారా..?’ అనేది ఆ ప్రశ్న… పరాశరన్ విచారణ పక్కదోవ పట్టకుండా వెంటనే ‘నాకు సమాచారం లేదు, కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను’ అని బదులిచ్చాడు…

.

తరువాత ఎంపీ దియాకుమారి తెరమీదకు వచ్చింది… రాముడి వారసులం మేమున్నాం… రాముడి కొడుకు కుశుడికి సంబంధించిన కుశ్వ, కచ్చవ వారసత్వ పరంపర మాది, మాది 309వ తరం… సుప్రీంకోర్టు గనుక కావాలనుకుంటే నా దగ్గర ఆధారాలున్నాయి, సమర్పిస్తానని ప్రకటించింది… సరే, ఆమె ఆధారాలను ఎవరూ అడగలేదు, ఆమె క్లెయిమ్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు…

దియా

పైన పబ్లిష్ చేసినవే ఆమె కుటుంబం చెబుతున్న కొన్ని ఆధారాలు… అవి దియాకుమారి కొడుకు ఏకంగా ‘వంశావళి’ పేరిట సోషల్ మీడియాలోనే పెట్టేశాడు… సహజంగానే రకరకాల కామెంట్స్, వ్యాఖ్యానాలు, అభినందనలు, విమర్శలు గట్రా వస్తాయి కదా… కొందరు నెటిజనులు మాత్రం ఆ 18వ శతాబ్దం తరువాత నుంచి ఇప్పటివరకు వివరాల్ని కూడా అప్‌డేట్ చేసి భద్రపరచండి… ఆ రాముడి వారసత్వం అంటే మీరు ధన్యజీవులు అని సూచించారు…

దియాకుమారి తమకు వారసత్వంగా వచ్చిన ట్రస్టులు, రాజభవనాలు, ఆస్తులు, స్కూళ్లను నిర్వహిస్తోంది… నాలుగు హోటళ్లు కూడా… రాజకీయాల్లో ప్రవేశించాక గత టరమ్ ఎంపీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం… ఒక దశలో రాణి వసుంధరరాజే‌ ధిక్కార పోకడలకు విరుగుడుగా ఈ రాణిని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ హైకమాండ్ భావించింది కూడా…

కొడుకు పద్మనాభసింగ్ వయస్సు 28 ఏళ్లు… ఇంటర్నేషనల్ పోలో ప్లేయర్… ఇదీ కథ… అన్నట్టు ఇందిరాగాంధీ బాగా కుళ్లుకున్న ఓ ప్రపంచ అందగత్తె గాయత్రిదేవి కథ తెలుసా… ఆమె ఈ దియాకుమారికి సవతి తల్లి… ఆ కథ ఇంకెప్పుడైనా చెప్పుకుందాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా అంటే మోదీ కాదు- తెలంగాణ అంటే కేసీయార్ కాదు…
  • కపిల్, సచిన్, ధోనీ, కోహ్లీ కాదు- నాటి ట్రూహీరో బయోపిక్‌లో ఆమీర్ ఖాన్ !!
  • జై చిరంజీవా జగదేకవీరా – ఈ పాట రాగానికీ ఓ కథ ఉంది… విలువ ఉంది!!
  • మస్క్ అంతరిక్షంలో… అంబానీ అంగట్లో! బిజినెస్ దిగ్గజాల రెండు భిన్న ప్రపంచాలు!!
  • అంబానీ క్యాంపాకు కోకాకోలా కౌంటర్ – 26 ఏళ్ల తరువాత గోల్డ్‌స్పాట్ !!
  • అది 30 వేల కోట్ల ‘నీటి దందా’… అందుకే అంబానీ ఏదీ వదలడు
  • ఒక్కసారి ఊహించుకొండి – శంకరాభరణం శంకరశాస్త్రిగా మంగళంపల్లి !!
  • ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే..! కేసీయార్ భారీ జలద్రోహం కథ ఇదుగో!!
  • ఆ ‘కాంతాదాసుడికి ట్రంప్- మస్క్ మద్దతు … మళ్లీ Nvidia సంచలనం !!
  • చిరంజీవి ప్రతి సినిమా కథనూ మొదట ఆయనకు చెబుతాడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions