పూరీ జగన్నాథ్… తనకు ప్రేక్షకులంటే మహా అలుసు… లాజిక్కుల్లేవు, మ్యాజికుల్లేవు… ఓ అల్లరి చిల్లర ఆవారా హీరో… వాడికో ప్రేమకథ… డిష్యూం డిష్యూం ఫైట్లు, మోతాదు మించిన రొమాన్స్… పిచ్చి పాటలు, తిక్క గెంతులు… సగటు తెలుగు హీరోకు ఉండే సూపర్ హీరో లక్షణాలన్నీ సరేసరి… నాలుగు పదునైన డైలాగులు, అక్కడక్కడా చిన్న మెరుపులు… అంతే కథ చుట్టేస్తాడు… చూసేవాడి ఖర్మ ఇక..! తన హీరో పాత్రలన్నీ ఉత్త ఇడియాటిక్ కేరక్టరైజేషనే… అవును, ఇడియట్ అంటే గుర్తొచ్చింది… […]
కన్నడ ప్రేక్షకుల పవర్‌స్టార్ పునీత్ రాజకుమార్ హఠాన్మరణం..!
పునీత్ రాజకుమార్… వయస్సు నలభై ఆరేళ్లే… కన్నడ ఆరాధ్యనటుడు రాజకుమార్ కొడుకు… వారసత్వంతో తెరమీదకు వచ్చినా తన సొంత మెరిట్‌తో నిలబడ్డాడు… మెప్పిచాడు… కన్నడ ప్రేక్షకులు ప్రేమగా అప్పు, పవర్ స్టార్ అని పిలుచుకునే ఈ పాపులర్ హీరో కన్నడంలో హైలీ పెయిడ్ స్టార్… గుండెపోటుతో మరణించడం కన్నడ చిత్రసీమను, కన్నడ ప్రేక్షకలోకాన్ని విషాదంలో ముంచెత్తింది… ఇతర హీరోల్లాగా ఇతర భాషల చిత్రాలపై గానీ, పాన్ ఇండియా తరహా బహుభాషా చిత్రాలపై గానీ ఆసక్తి చూపకుండా కేవలం […]
దటీజ్ రజినీ..! దోస్తీ అంటే అదీ..! ఈ పెద్దన్న వెనుక మరో పెద్దన్న..!
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు… ఇండస్ట్రీలో ఇన్నేళ్ల మనుగడకు ఓ అపురూపమైన పురస్కారం… ఎవరికి అంకితం ఇవ్వాలి..? ఫ్యాన్స్..? నిర్మాతలు..? దర్శకులు..? నా ఫ్యామిలీ మెంబర్స్..? దేవుడు..? ప్రేక్షకులు..? అరె, ఇవన్నింటినీ మించిన నా గుండెను విప్పి కృతజ్ఞత చెప్పాల్సిన వాడు ఒకడున్నాడు కదా… ఎలా మరిచిపోగలను..? ఈ స్టార్డమ్, ఈ వేల కోట్ల సంపద, ఈ ఫ్యాన్స్, ఈ కెరీర్ అంతా వాడి పుణ్యమే కదా… నిజమే, వాడికి అంకితం ఇవ్వడమే కరెక్టు… మనిషిగా నా […]
Manoj Bajpayee…! ఈ సక్సెస్ వెనుక… నిద్రపట్టని ఆకలిరాత్రులెన్నో..!
కొడుకు డాక్టర్ కావాలన్నది తండ్రి కల.. యాక్టర్ కావాలన్నది కొడుకు సంకల్పం. అందుకే ఆ రైతు కొడుకు ఇప్పుడు మనందరికీ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాయ్ గా సుపరిచితుడైనాడు. ఏడేళ్లకే చదువుల పేరిట హాస్టల్ బాట పట్టిన మనోజ్.. తాను చిన్ననాట సీనియర్ల ర్యాగింగ్ కీ.. ర్యాగింగ్ పేరిట వేధింపులకీ గురైనవాడే. ఒక మ్యాగజీన్ లో నసీరుద్దీన్ షా ఇంటర్వ్యూ పరోక్షంగా మనోజ్ బాజ్ పాయ్ లోని నటుణ్ని తట్టిలేపింది. ఆ కాంక్షే బలపడి నేషనల్ స్కూల్ […]
ఆ జ్యూరీలో కోడిమెదళ్లు..! బ్రిటిషోడు ఫీలవుతాడేమోనని వీళ్లు ఫీలైపోయారు..!!
అప్పుడెప్పుడో 1947లోనే మన దేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందింది… కానీ మనవాళ్లకు ఇంకా ఆ బ్రిటిష్ వాళ్లకు దాస్యం చేసే బుద్ధులు పోలేదు… అంత త్వరగా పోవు… మన కలల్ని, మన కళల్ని, మన జీవితాల్ని, మన ప్రస్థానాన్ని ఇంకా ఆ కళ్లతోనే చూస్తున్నాం… తాజా ఉదాహరణ ఏమిటంటే..? సర్దార్ ఉధంసింగ్ సినిమాను ఆస్కార్ అవార్డుల పోటీ నుంచి తప్పించడం..! మొత్తం 14 సినిమాల్ని ప్రాథమికంగా ఎంపిక చేసింది జ్యూరీ… అందులో 15 మంది […]
రాజువయ్యా… కృష్ణంరాజువయ్యా…! బాగా నచ్చిన వార్త… కారణమేంటంటే..?
చిన్న వార్త… చదవడానికి చాలా చిన్న వార్త… పత్రికలకు, టీవీలకు అది అసలు వార్తలాగే కనిపించలేదు… అంత చిన్న వార్త… కానీ నచ్చాల్సిన వార్త, మెచ్చాల్సిన వార్త… వాడు మీసం తగ్గించాడు, వీడు గడ్డం పెంచాడు, వాడు కిలోంబావు బరువు పెరిగాడు, వీడి వెంట్రుకల్లో ఒకటి తెల్లగా కనిపించింది వంటివి కూడా మనోళ్లకు వార్తలే… ఖర్మ… కానీ నిజంగా అభినందించాల్సిన వార్త ఇది… విషయం ఏమిటంటే..? ఒకప్పటి హీరో, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు కుటుంబం తమ ఇంట్లో […]
వావ్… సర్దార్ ఉధం… బడియా ఏక్‌ధమ్… సినిమా సూపర్ తీశావు భాయ్…
ఈ సినిమా మీకు అస్సలు నచ్చదు… ఇందులో హీరో ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ హీరోయిన్ పాదాల దగ్గర పాకుతూ, దేకుతూ, పొర్లిగింతలు పెట్టడు… డిష్యూం అనే సౌండ్ కూడా రాకముందే పది మంది రౌడీలు అర్జెంటుగా అంతరిక్షంలోకి ఎగిరిపోరు… ప్చ్, మీకు హిందీలో వచ్చిన తాజా సినిమా ‘సర్దార్ ఉధం’ నచ్చనేనచ్చదు… వెకిలి పంచ్ డైలాగుల్లేవు, అసహజమైన డ్యూయెట్లు లేవు… అన్నింటికీ మించి డాన్స్ పేరిట కోతిగెంతుల్లేవు… రేకుడబ్బాలో రాళ్లు […]
రాజు గారమ్మాయి..! గుడ్ టేస్ట్, ప్రజెంటేషన్ పూర్… సినిమా లక్షణాలే వేరమ్మా..!!
రాంకో గ్రూప్ ఆడపడుచు… సత్యం గ్రూపు కోడలు… తను స్వతహాగా ఓ స్పిన్నింగ్ మిల్ ఎండీ… కాల్ హెల్త్ సర్వీసెస్ కొత్త ఆలోచనకు ప్రేరణ… అడుగు తీసి అడుగేస్తే విలాసం, సంపద, వైభోగం… కానీ ఆమె అభిరుచి వేరు… సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్… శాస్త్రీయ నృత్యకారిణి… నాట్యం అంటే ఆమెకు పిచ్చి… నిశృంఖల అనే ఓ డాన్స్ స్కూల్ పెట్టింది… డాన్స్ మీద ఏదో మలయాళీ సినిమాలో నటించింది… నాట్యం పేరిట ఏదో షార్ట్ ఫిలిమ్ కూడా […]
ఇదీ ‘మా’ రేంజ్..! ఈ లెటర్ ‘హెడ్లు’ చూస్తేనే అర్థమైపోతుందిగా…!!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… అలియాస్ మా… పట్టుమని వేయి వోట్లు లేని ఈ అసోసియేషన్ ఎన్నికలు కులరొచ్చును కెలికీ కెలికీ కంపు కంపు చేశాయి… ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి రాయబడుతూనే ఉంది… మొన్న ఏపీ రాజకీయాల్లో కులసమీకరణాలకు, భావి పరిణామాలకు ఇవే సంకేతాలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొస్తే, నిన్న కన్నడ-తెలుగు చారిత్రక బంధాలకు ఎలా గండిపడ్డాయో ఏబీకే రాసుకొచ్చాడు… అంటే పెద్ద పెద్ద కలాలు సైతం స్పందించి ఆ ఎన్నికలకు ఓ విశేష ప్రాధాన్యాన్ని […]
నో నో… ఆ పాత్ర నాగార్జునకు అస్సలు సూట్ కాదు…!
ఒక వార్త చక్కర్లు కొడుతోంది… నాగార్జున మలయాళంలో తీసిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడనేది ఆ వార్త… నిజమే కావచ్చు, కాకపోవచ్చు.., కానీ ఆశ్చర్యమే…! నిజమే అయితే అది సరైన నిర్ణయం కాదని చెప్పొచ్చు… నిజానికి ఆ సినిమా నాగార్జునకు ఏమాత్రం సూట్ కాదు… కారణాలున్నయ్… కాస్త వివరంగా చెప్పాలంటే… నాగార్జున పెద్దగా రీమేకుల్ని ఇష్టపడడు… తనవి స్ట్రెయిట్ సినిమాలే… ముందుగా ఆ సినిమా గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి… చదువుకుని, […]
పెళ్లిసందD…! జేబుకు బొక్క… ఎందుకు తీస్తర్ర భయ్ గిట్వంటి సైన్మలు..?!
ఒక పాత్ర అరవయ్యేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ చెబుతుంటుంది… కానీ ఆ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా డ్రెస్సులు, ట్రెండ్లు అన్నీ తాజావే… అదెలా..? ఈ ఒక్క మెతుకు చాలు కదా పెళ్లిసందD అనబడే తాజా సినిమా గురించి చెప్పడానికి..! నిజానికి ఈ సినిమాకు ఓ రివ్యూ కూడా వేస్ట్… కానీ దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు అని ఉండటం, హీరో రోషన్ శ్రీకాంత్, ఊహ కొడుకు కావడం, అప్పట్లో పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ కావడం కారణాలతో ఈ […]
Most Eligible Bachelor…. స్పీచులు దంచిన సీన్లు- దర్శకుడిలో కన్ఫ్యూజన్…
సినిమా అంటేనే దృశ్య ప్రధానం… కథను సీన్లు చెప్పాలి, పెద్ద పెద్ద స్పీచులు కాదు… డైలాగులు కాదు… వోకే, సినిమాకు మంచి డైలాగులు బలం, కానీ డైలాగులే ఏ సినిమాకూ బలం కాదు..! బొమ్మరిల్లు అని అప్పట్లో ఓ హిట్ సినిమా తీసిన భాస్కర్‌కు ఈ విషయం తెలియక కాదు, కానీ ఆయన నమ్ముకున్న పంథా అదే..! మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనే ఓ డైలాగ్… తామరాకు మీద రసం… అవును, ఈ దర్శకుడు ఏదో చెప్పాలనుకుని […]
సిద్ధార్థ్ రీఎంట్రీ తుస్సు..! హైప్ ఎక్కువ- హోప్ తక్కువ..! మహాసముద్రమేమీ కాదు..!!
ఇద్దరూ హీరో రేంజే… సో, తెర మీద రెండు బలమైన వ్యక్తిత్వాల ఘర్షణ కనిపించాలి… సరిగ్గా తీయాలే గానీ ప్రేక్షకుడిని మస్తు కనెక్ట్ చేయగలిగే సబ్జెక్టు… దానికి తగ్గట్టు కథ, కథనం, ట్రీట్మెంట్ ఉంటే మాత్రమే..! కానీ అప్పట్లో ఆర్ఎక్స్ 100 అనే ఓ సబ్‌స్టాండర్డ్ సెమీ బూతు సినిమా తీసిన దర్శకుడు ‘ఇద్దరు మిత్రుల’ సబ్జెక్టునయితే ఎన్నుకున్నాడు గానీ, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక చేతులెత్తేశాడు… జస్ట్, శర్వానంద్ కేరక్టరైజేషన్ మినహా మిగతా పాత్రలేవీ […]
కోర్టుకు అనసూయ..? ‘మా’ అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..?
కోర్టుకు అనసూయ..? మా అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..? ఈ హెడ్డింగులు చూడగానే….. ఏమిటిది యూట్యూబ్ చానెల్ ఏదో ఇలా పిచ్చి థంబ్ నెయిల్స్ వదిలిందా అనే డౌటొచ్చిందా..? మా ఎన్నికలు, దాని తదనంతర పరిణామాలు, ప్రత్యక్ష ప్రసారాలు, చానెళ్ల వికారాలు ఇదుగో ఇలాంటి శీర్షికలే బెటర్ అనిపించేలా ఉన్నయ్… అందుకే ఈ వ్యంగ్య శీర్షిక… విషయానికి వస్తే… MAA అసోసియేషన్ ఎన్నికల్లో దారుణంగా భంగపడి, సలసలమండిపోతున్న సెక్షన్… ఇక ATMA అనే పేరుతో మరో […]
అంతటి అమితాబే తప్పుతెలుసుకున్నాడు..! మరి మన మహేశ్‌బాబు ఏం చేస్తాడో..!?
గుర్తుందా మీకు..? ఈమధ్య మనం ఓ స్టోరీ చెప్పుకున్నాం… మహేశ్‌బాబును తప్పుపట్టాం… సాయిపల్లవి వంటి వర్థమాన నటి కూడా సమాజానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడానికి అంగీకరించక, ఆ డబ్బును ఎడమకాలితో తోసేస్తుంటే… మహేశ్‌బాబు కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా యాడ్స్‌లో నటించడం ఏమిటనేది మన ప్రశ్న..! ఇప్పుడు మళ్లీ ఓసారి చెప్పుకోవాల్సి వస్తోంది… ‘‘మేం కాకపోతే మరో స్టార్ నటిస్తారు, ఆ ఉత్పత్తుల లాభనష్టాలతో మాకేం పని..? డబ్బు తీసుకుంటాం, నటిస్తాం’ అని వాదిస్తే అది సమర్థన […]
‘మా’ ఎన్నికల్లో మరో కోణం..! అసలు ఇండస్ట్రీలో లోకల్ ఫీలింగ్ ఉందా..?
నిజంగా మా ఎన్నికల్లో లోకల్, నాన్-లోకల్ ఫీలింగ్ పనిచేసిందా..? ప్రకాష్ రాజ్ లోకల్ కాదు కాబట్టే ఓడిపోయాడా..? ఇక్కడే ఓ ఊరిని దత్తత తీసుకుని, ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే నటుడిని నాన్-లోకల్ అనొచ్చా..? కేవలం పుట్టుక మూలాలు మాత్రమే చూడాలా..? ఐతే మరికొన్ని రిజల్ట్స్ భిన్నంగా ఎందుకొచ్చాయి..? ప్రకాశ్ రాజ్ గెలవకపోయినా, కర్ణాటకలో పుట్టిపెరిగిన శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు! మనోళ్లకేమీ అంత లోకల్ ఫీలింగ్ లేనట్టేగా..? అన్నట్టు… మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ ఎందుకు […]
ప్రకాష్‌రాజ్ ముందు మంచు విష్ణు ఓ బచ్చా..! ఐనా ఎలా గెలిచాడు..?!
ఆఫ్టరాల్ ‘మా’… ఉన్నవే 800- 900 వోట్లు… పడ్డవి ఆరేడు వందలు… జస్ట్, తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో నటుల అసోసియేషన్ అది… వోటింగుకు చాలామంది స్టార్లు రానే రాలేదు, ఎప్పుడూ రారు, ఆ అసోసియేషన్ మొహమే చూడరు… కానీ ఆ ఎన్నిక మీద ఎందుకింత రచ్చ జరుగుతోంది… అఫ్ కోర్స్, జనం ఆధారించే సెలబ్రిటీలు కావచ్చు, కాస్త ఆసక్తి క్రియేటవుతుంది… నిజమే… కానీ ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి కదా, మరి ఇప్పుడే ఎందుకీ రచ్చ..? అది […]
స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
ఒక్కసారి… మీ ట్యాబ్, మీ ల్యాప్‌టాప్, మీ సిస్టం, మీ స్మార్ట్‌ఫోన్… ఏదయితేనేం… ఇయర్ ఫోన్స్ పెట్టుకొండి… లైట్లు బంద్ పెట్టండి, ఒక పాట యూట్యూబ్‌లో ఆన్ చేయండి… ఇదీ లింక్… ఇక కళ్లు మూసుకొండి… మనసులోని ఆలోచనల్ని కాసేపు తుడిచేయండి… డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొండి………… అంత మధురంగా ఉండదు గానీ, ఓ గంభీర స్వరం మిమ్మల్ని వైరాగ్యం, అలౌకికంలోకి అలా అలా తీసుకుపోతుంది… నెగెటివ్ ఫీలింగ్స్ వదిలేసి, ఆ పాటలో మునిగిపొండి… ఆ కాసేపు ఆ […]
*బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…* ఈ పల్లవి ఏమిటో తెలుసా..?!
ఏమీ..? ఏమిటిరా…? బతుకమ్మా బతుకమ్మా, ఎక్కడ పోతవురా, ఇక్కడ రా… ఎంకన్నా ఎంకన్నా ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…. చిన్నమ్మా చిన్నమ్మా ఎక్కడ పోతవురా..? ఇక్కడ రా……….. ఇదీ పల్లవి… ఏమనిపించింది..? ఏదో పాత తెలుగు సినిమాలో పాట అయి ఉంటుందిలే అనిపిస్తోంది కదా…! కానీ కాదు… ఓ హిందీ సినిమాలోనిది… 1969లోనే మన బతుకమ్మ అనే పదాన్ని పలికించిన పాట అది… సంగీత దర్శకుడు శంకర్ జైకిషన్… నిన్న చెప్పుకున్నాం కదా… జీవితచక్రం అనే పాత ఎన్టీయార్ సినిమాలో […]
ఇప్పటి రెహమానే కాదు… 50 ఏళ్ల క్రితం శంకర్-జైకిషనూ అంతే…
అప్పటి సినారె దగ్గర నుంచి సుద్దాల మీదుగా గోరేటి దాకా… తెలంగాణ ఆకాంక్షల దిశలో చేసిందేమీ లేదనే భావన చాలామందిలో ఉన్నదే..! పుట్టిన మట్టిని ప్రేమించని ఘనతలెంత గొప్పవైతేనేం, వాటికున్న సార్థకత ఎంత..? ఇదే సినారె అప్పట్లో… అంటే తను రెండు చేతులతో ఎడాపెడా సినిమా పాటలు రాసేస్తున్న వేళ… 1971లో జీవితచక్రం అనే సినిమా వచ్చింది… అందులో ఎన్టీయార్, వాణిశ్రీ, శారద… అప్పటికింకా హీరోయిజాల పెడపోకడలు స్టార్ట్ కాలేదు, కథే సినిమాను ఏలుతున్న కాలం అది… […]
- « Previous Page
- 1
- …
- 103
- 104
- 105
- 106
- 107
- …
- 117
- Next Page »