Sankar G……….. వంద బాహుబలిల పెట్టు ఈ కంచుకోట… జానపద చిత్రాల్లోను సస్పెన్స్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించిన తొలి చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘కంచుకోట’. మొదట డబ్బింగ్ చిత్రాలతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన యు.విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సినిమా ‘కంచుకోట’. ఇతను ఎన్టీఆర్ కు బావమరిది. ఈ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే త్రిపురనేని మహారథి. జానపదాల్లోనూ స్క్రీన్ ప్లే అప్లై చేసి గ్రాండ్ సక్సెస్ […]
రీమేకుల యుగం కదా… సౌత్ తోపుల్లో ఎక్కువ రీమేకర్లు ఎవరు..? ఎవరెన్ని..?
సౌత్ నుంచి రీమేక్ హక్కులు తీసుకుని, హిందీలో నిర్మించుకోవడాన్ని మనం ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తున్నాం… వాళ్లకు కథలు రాసుకునే దిక్కు లేదు… హిట్టయిన సౌత్ సినిమాలు కొనుక్కుని, రీమేక్ చేసుకుంటున్నారు అని ఆక్షేపిస్తున్నాం… కానీ ఈ రీమేకుల విషయంలో నిజానికి మన సౌత్ స్టార్లే తోపులు… మనకే మంచి కథలు రాయించుకునే దిక్కలేదు… టేస్ట్ లేదు… రిస్క్ తీసుకునే దమ్ములేదు… ఎవరో ఎంగిలి చేసిన కథకు ఇమేజీ బిల్డప్పులు అద్ది తెలుగు ప్రేక్షకుల్లోకి వదిలేస్తున్నాం… కానీ […]
పాటలు, మ్యూజికే ఈ సినిమాకు ‘బలగం’… జబర్దస్త్ వేణుకు అభినందనలు…
బలగం… ఈ సినిమా దిల్ రాజుది కాదు… ప్రియదర్శిది కాదు… ఇంకెవరిదీ కాదు… దర్శకుడు జబర్దస్త్ వేణుది… పాటల రచయిత కాసర్ల శ్యాంది… సంగీత దర్శకుడు భీమ్స్‌ది… జబర్దస్త్ వేణుకు టేస్ట్ ఉంది… తను ఇన్నాళ్లూ ఓ కమెడియన్ మాత్రమే… ఓ ఆర్టిస్టు మాత్రమే… కానీ తనలో ఆలోచించగల, ఆలోచింపచేయగల దర్శకుడు కూడా ఉన్నాడని ప్రదర్శించుకున్నాడు… అందుకు వేణుకు అభినందనలు… కాంతర వంటి కథయితే వేణు ఇంకా చెలరేగేవాడేమో… ఒక చావు చుట్టూ ఇలాంటి కథను ఇంత […]
హమ్మ దిల్ రాజూ..! ‘బలగం’ కాపీ కథేనా..? పేరు మార్చి, కాస్త కొత్త కోణం పెట్టేశారా..?
బలగం సినిమా రిలీజ్ కావల్సి ఉంది… జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వేణు దీనికి దర్శకుడు… దిల్ రాజు నిర్మాత… నిన్న సిరిసిల్లలో బహిరంగసభ పెట్టి, కేటీయార్ ముఖ్య అతిథిగా ప్రిరిలీజ్ ఫంక్షన్ చేశారు… ఈ ఫంక్షన్ నిర్వహణ, కేటీయార్ ముఖ్య అతిథి అనే ఆలోచన వెనుక దిల్ రాజుకు ఏవో ప్రయోజనాలు ఉండి ఉంటాయి… లేకపోతే రూపాయి కూడా ఖర్చు పెట్టని సినిమా వ్యాపారి తను… ఆల్రెడీ పెయిడ్ రివ్యూలు స్టార్టయిపోయాయి… […]
హీరోగా మారితే నటుడు చచ్చిపోవాలా..? మమ్ముట్టిలో నటుడిలా బతకనక్కర్లేదా..?!
‘నన్పకల్ నేరతు మయక్కం’ (తెలుగులో పగటి కల అని అర్థం)……. ఇది మలయాళంలో తీసిన సినిమా… ఓటీటీలో మనం తెలుగులో కూడా చూడొచ్చు… నెట్‌ఫ్లిక్స్‌లో..! ఇందులో నటుడు మమ్ముట్టి లీడ్ రోల్… నటుడు అంటున్నారేమిటి..? హీరో కదా అని దీర్గాలు తీయకండి… హీరో వేరు, నటుడు వేరు… గతంలో హీరోలుగా నటులే నటించేవాళ్లు… కానీ ఎప్పుడైతే హీరోలు అయిపోతున్నారో నటులుగా చచ్చిపోతున్నారు… అందుకని ఇప్పుడు హీరో వేరు, నటుడు వేరు… నటుడు అంటే ఏ పాత్రనైనా చేస్తాడు… […]
తన పాటల్లో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కలిపికొట్టేవాడు… అవి ఛెళ్లున తగిలేవి…
Sankar G ……… జానపద పాటల రారాజు కొసరాజు …. కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసు గనక, అలాంటి వరసల్లోనే పాటలు రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీత దర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది. ఈయన సిగరెట్టు మీద రాసిన “సరదా సరదా సిగరెట్టు” […]
స్టన్నింగ్ యాక్షన్ సీన్ల మార్టిన్… హీరో ధ్రువ కేజీఎఫ్ యశ్‌కే సవాల్ విసురుతున్నాడట…
ఇప్పుడు ఇండియన్ సినిమాలో కన్నడిగులదే హవా… గత ఏడాది కాంతార, కేజీఎఫ్-2, విక్రాంత్ రోణ, 777 చార్లీ వసూళ్లలో ఇరగదీశాయి… వాళ్ల వచ్చే సినిమాలు కూడా ప్రిస్టేజియస్ సినిమాలే… ప్రత్యేకించి ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి బ్రహ్మాండమైన కెరీర్ బాటలోకి మళ్లారు… ఆ సినిమాల్లో హీరోలు యశ్, రిషబ్ ఇప్పుడు ఫుల్లు డిమాండ్ ఉన్న హీరోలు… ‘‘వాళ్లకు తాను సవాల్ విసురుతాడు, కేజీఎఫ్ తాత వంటి యాక్షన్ సినిమాను తీస్తున్నాడు’’ అంటున్నారు అప్పుడే సర్జా ధ్రువ నటించిన […]
టీవీ9 దేవీ, ఈ ముచ్చట వింటివా..? మీ ‘‘గెటౌట్ హీరో’’ ప్లేసులో మోహన్‌లాల్…
మీకు గుర్తుంది కదా… ఆమధ్య చెప్పుకున్నాం… విష్వక్సేన్ అనే వర్ధమాన హీరో గురించి… అసలు హీరోస్వామ్యం కదా ఇండస్ట్రీ… టీ సప్లయ్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, హీరోయిన్ దాకా హీరోయే ఎంపిక చేస్తాడు… నిర్మాత ఎవరుండాలో కూడా తనే డిసైడ్ చేస్తాడు… కథ, కథనం, డైలాగ్స్, సంగీతం అన్నీ తనకు ఇష్టమున్నట్టే నడవాలి… తన లుక్కు, తన బిల్డప్పు, తన ఇమేజీ తనే ప్లాన్ చేస్తాడు… చివరకు డబ్బులు పెట్టుబడి పెట్టి, ఏరియా హక్కులు కూడా తీసేసుకుంటాడు… […]
రష్మికకు కత్తెర… పుష్ప సీక్వెల్ పాత్ర కుదింపు… స్క్రీన్ స్పేస్ తక్కువే…
సొంత కన్నడ ఇండస్ట్రీ దాదాపు తనను వదిలేసినా, వ్యతిరేకత కనబరుస్తున్నా సరే… రష్మిక హేపీగానే ఉంది… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు, పెద్ద బ్యానర్ల అవకాశాలు తలుపు తడుతున్నాయి… రెమ్యునరేషన్ భారీగా అందుతోంది… షేర్ చేసుకోవడానికి జాన్ దోస్త్ విజయ్ దేవరకొండ ఉండనే ఉన్నాడు… హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను రిలీజ్ అయిపోగా, చేతిలో యానిమల్ ప్రాజెక్టు ఉంది… తెలుగులో పుష్ప-2 చేస్తోంది… ఈ పుష్ప దగ్గరే చిన్న చిక్కు… ఆమెకు […]
ఆస్కార్ బాట దొరికింది… డీఎస్పీ, థమన్ బీరెడీ… గుడ్ ఆర్గనైజర్‌ను వెతకండి…
తెలుగు పాట ‘నాటునాటు’ ఆస్కార్‌కు చేరువైనట్టే ఉంది… కీరవాణిని ఆస్కార్ అవార్డుల వేదికపై పర్‌ఫామ్ చేయమని అడిగారు అంటే… అది అవార్డు దక్కబోతోందనడానికి ఒక సూచికగా భావించాలట… ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా ఒక సూచికే అంటున్నారు… సరే, మంచిదే… కానీ పాపం, ఆ పాటకు ప్రాచుర్యమే ఆ స్టెప్పులతో వచ్చింది… లేకపోతే ఆ పాట కంటెంటులో ఏముందని..? ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బాగా బాధపడుతున్నాడని వార్తలు… ఎంతసేపూ కీరవాణి […]
నిజమా స్మితా… సినిమా సెలబ్రిటీలు నిజాలు చెబుతారా..? చెప్పారా..?
ఎక్కడో ఓ మీమ్… సోనీ లివ్ ప్లాట్‌ఫామ్ కోసం సింగర్-యాక్టర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అని ఓ టాక్ షో చేస్తోంది… కాదు, చేసింది… అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తయింది… తాజాగా ఇప్పుడు ప్రసారం ప్రారంభించారు… సో, పెద్దగా వర్తమాన అంశాలపై ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు… అయితే పవన్ కల్యాణ్‌ను ఈమధ్య ఓ రాజకీయ నాయకుడిగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కదా అన్నయ్య చిరంజీవి… పవన్ ఎప్పుడో ఓసారి ఏదో ఒక పెద్ద హోదాలోకి ఎదుగుతాడు, తన […]
రీల్ లైఫు జంటగా ఢోకా లేదు… త్వరలో రియల్ లైఫ్ జంటగానూ కనిపిస్తారు…
అయ్యో, ఇక ఈ జంట మళ్లీ తెరపై కనిపించదా అని బోరుమన్నాయి కొన్ని సైట్లు… ఒకడు ఏదైనా రాస్తే చాలు, ఇక కుప్పలుతెప్పలుగా అందరూ అదే గొర్రెదాటు… ఇంతకీ ఆ జంటపేరు చెప్పనేలేదు కదూ… విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన… కారణమేమిటీ అంటారా..? ఓ పొంతన లేని విషయానికీ దానికీ ముడిపెట్టేశారు… విషయం ఏమిటంటే..? పరుశురాం అనబడే దర్శకుడు గీతా ఆర్ట్స్ వారికి, అనగా అల్లు అరవిందుడికి ఓ సినిమా చేయాల్సి ఉంది… అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట… […]
నా భర్తనే అవమానిస్తావా..? ఛిఫో… దోస్తీ కటీఫ్… ఇకపై నీతో నటించను…
AK62… ఇదీ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సినిమా… ఏకే47 మాదిరిగా ఏకే62 తుపాకీ కాదు… ఇది సినిమా పేరు కాదు, అజిత్ 62 వ సినిమా అని అర్థం… ఇప్పటికే మూడుసార్లు అజిత్‌తో జతకట్టిన నయనతార ఇందులో అజిత్ పక్కన హీరోయిన్‌గా నటించాలి… వాళ్లది హిట్ పెయిర్… నయనతార లేడీ సూపర్ స్టార్ కదా, అజిత్‌తో కలిస్తే ఇక ఢోకా ఏముంది..? సో, లైకా ప్రొడక్షన్స్ […]
విశ్వనాథ్ పట్ల కమల్ హాసన్ అగౌరవం… సారు గారికి గురువు గారు గుర్తే లేరు…
ఊళ్లో ఓ పెద్ద మనిషి గారి పెంపుడు కుక్క ఆయుష్షు తీరి చనిపోతే ఊరివాళ్లంతా బారులు తీరతారు… మందలుమందలుగా వెళ్లి ఆ పెద్ద మనిషిని పరామర్శిస్తారు… అబ్బ, మీ కుక్క భలే ఉండేదండీ, పిక్కల్ని తప్ప మరొకటి పీకి ఎరుగదు అని కూడా మెచ్చుకుంటారు… పంచాయతీ ఖర్చులతో డీజే బ్యాండ్, ఊరేగింపుతో వెళ్లి, బాణాసంచా కాల్చి మరీ అంత్యక్రియలు నిర్వర్తించి గౌరవాన్ని చాటుకుంటారు… కానీ ఆ పెద్ద మనిషే చచ్చిపోతే..? కుక్కలు కూడా పట్టించుకోవు..!! ఇది అందరికీ […]
ఈ డబ్బా సినిమాలో ఏముందని డబ్బు పెట్టుబడి పెట్టావమ్మా తల్లీ..!!
‘‘నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా… పాప్ కార్న్‌తో మొదలుపెట్టా… సినిమా భలే వచ్చింది, హీరో సాయి రోనక్‌తో నా రెండో సినిమా… థ్రిల్లింగ్ సినిమా అంటే సీన్ ఫార్వర్డ్ చేయకుండా చూసేలా ఉండాలి… మా సినిమా అలాగే ఉంటుంది… అందుకే ఓటీటీకి కూడా ఇంకా ఇవ్వలేదు… ఇకపైనా చిత్రాలు నిర్మిస్తాను… సినిమాను నాగచైతన్య, అఖిల్, నాగార్జున మెచ్చుకున్నారు…’’ అని చెబుతూ పోయింది నటి అవికా గోర్… ఫాఫం… ఏదో చెబుతోంది గానీ అసలు ఎందుకు ఈ […]
మూడు పాత్రలు… మూడు రెట్ల వాయింపు… బింబిసారతో వచ్చిన ఇమేజ్ ఫట్…
1992లో బాలకృష్ణ, దివ్యభారతి ధర్మక్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అని ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయిన పాట… ట్యూన్ బాగుండి, పైకి క్లాస్‌గా వినిపించినా సరే… ఊర మాస్ పాట అది… వేటూరి అంత త్వరగా దొరకడు గానీ పచ్చిదనం పులుముకున్న పాట… పెదవి కొరికే పెదవి కొరకే వంటి భేషైన పదప్రయోగాలు ఒకటీరెండు బాగున్నా… వేడి చెమ్మ, తొడిమ తెరిచే తొనల రుచికే వంటి చాలా కథలు పడ్డాడు… ఈ సినిమా పాటతో కథనం మొదలుపెట్టేందుకు కారణముంది… […]
బింబిసారతోనే పునర్జన్మ… అదే ఊపులో మరిన్ని సినిమాలు చకచకా…
కళ్యాణరామ్… ఎన్టీయార్ నట వారసుల్లో తన తరువాత మొదటితరంలో బాలకృష్ణ మాత్రమే, ఇంకెవరూ లేరు… అప్పుడెప్పుడో మొదలు పెట్టిన ప్రస్థానంలో ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నాడు… ఆమధ్య చాన్నాళ్లు గ్రాఫ్ ఘోరంగా పడిపోయినవేళ అఖండతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు… రెండో తరంలో జూనియర్ సూపర్ హిట్టయ్యాడు… నిజంగా సరైన పాత్రలు పడాలే గానీ తనను కొట్టేవాడు లేడు టాలీవుడ్‌లో… ఆ ఎనర్జీ, ఆ మెరిట్, ఆ ఈజ్, ఆ డిక్షన్, ఆ డాన్స్ అన్నీ ఉన్నాయి […]
వెండితెరపై రంగస్థల పతాక… అన్ని పాత్రలూ చేసిన సంపూర్ణ నటుడు…
Bharadwaja Rangavajhala……….. రంగస్థల నట ప్రతిష్టను తెరమీద నిలబెట్టి వెలిగించి కనుమరుగైన నిజమైన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. దేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే 1945 అగస్ట్ పదిహేనో తేదీన ఆయన జన్మించారు. 1960 లో అంటే తన పదిహేనోయేట స్టేజ్ మీద కాలుపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో ఆడి పేరు తెచ్చుకున్నారు . ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు. స్టేజ్ ఆర్టిస్టుగా పరిషత్ నాటకపోటీల్లో రాళ్లపల్లి ఓ సంచలనం. ఆయన సంభాషణల విరుపు ప్రత్యేకంగా […]
ఓ కామెడీ ముద్రతో ఇంతటి బరువైన పాత్ర… కోవై సరళ చేసింది, మెప్పించింది…
కోవై సరళ… తెలుగు ప్రేక్షకులకు ఎవరూ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు… సూపర్ టైమింగుతో కామెడీని పండించే ఈమె హఠాత్తుగా ఓ సీరియస్ పాత్రలో… ఎమోషన్స్‌ను పండించి అందరి ప్రశంసలూ అందుకుంటున్న తీరు విశేషం… తెలుగు, తమిళ సినిమాల్లో దాదాపు ప్రతి సీనియర్ కమెడియన్‌తోనూ కలిసి నటించిందామె… కోవై సరళ అనగానే ఆమె పోషించిన కామెడీ పాత్రలే మనకు మనోచిత్రంలో కదలాడతాయి… అలాంటిది సెంబి సినిమాలో పోషించిన బరువైన పాత్ర పూర్తిగా ఆమెలోని అసలైన […]
వామ్మో… సుమపై జూనియర్ అంత సీరియసయ్యాడా..? ఇక ఆమె మొహమే చూడడా..?
చివరకు ఈటీవీ భారత్ కూడా సగటు యూట్యూబ్ చానెల్ అయిపోనట్టు అనిపించింది ఆ వార్త చూశాక… అమిగోస్ అని కల్యాణరామ్ సినిమా ఒకటి వస్తోంది తెలుసు కదా… దానికి ప్రిరిలీజ్ ఈవెంట్… అంతకుముందు జూనియర్ వచ్చి బింబిసార ప్రిరిలీజ్‌లో నాలుగు మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి అది సూపర్ హిట్ అయిందనేది ఓ సెంటిమెంట్… సో, నిర్మాతలు మైత్రి మూవీస్ ఈ ప్రిరిలీజ్‌కూ రమ్మన్నారు… కల్యాణరామ్ సినిమాా కాబట్టి కాదనలేడు… మరోవైపు తారకరత్న చావుబతుకుల్లోనే ఉన్నాడు… ఇంకోవైపు […]



















