Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాజల్ కొడుకు పేరేంటి..? మియా మల్కోవా దేశమేంటి..? అలియా ఏం చదివింది..?

May 12, 2022 by M S R

ntr

కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటి..? శ్రియ మొగుడి ఇంటి పేరు రాయండి..? కరీనాకపూర్ కొడుకుల పేర్ల వివాదం వివరించండి..? ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ మియా మల్కోవాతో తీసిన సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు..? థమన్ ఎంతవరకూ చదువుకున్నాడు..? నయనతార మొత్తం అఫైర్లు, బ్రేకప్పులను సంక్షిప్తంగా రాయండి… వనిత విజయకుమార్ నాలుగు పెళ్లిళ్లూ ఎందుకు చెడిపోయాయి..? సమంత, నాగచైతన్య విడాకులకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి… రేప్పొద్దున మీ పిల్లల ఇంటర్ లేదా డిగ్రీ పరీక్ష పత్రాల్లో […]

ఆమె కీర్తి సురేషేనా..? ఆ మహానటేనా..? మీరు మారిపోయారు మేడమ్…!!

May 12, 2022 by M S R

keerthy

కీర్తి సురేష్ తల్లి మేనక (చిరంజీవి పున్నమినాగులో ఉంది, అసలు పేరు పద్మావతి)… నిర్మాత, ఒకప్పటి హీరోయిన్… తండ్రి సురేష్ కుమార్ నిర్మాత… సోదరి రేవతి వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్టు, షారూక్ రెడ్ చిల్లీస్‌లో పనిచేసింది… పుట్టుక నుంచీ తనది సినిమా వాతావరణమే… సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్లు, డబ్బు, గ్లామర్, కుట్రలు, ప్రమాదాలు అన్నీ వింటూ, చూస్తూ పెరిగిందే… మహానటి అనే పాత్ర ఆమెకు బోలెడంత అదృష్టాన్ని, కీర్తిని, డబ్బును, కెరీర్‌ను మోసుకొచ్చింది… ప్రతిభావంతురాలే, జాతీయ అవార్డుకు అర్హురాలే… […]

తెలుగు ఇండియన్ ఐడల్… నిత్య మేనన్ బైబై… శ్రావణభార్గవి ఇన్…

May 11, 2022 by M S R

aha

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి మొన్నటి ఆదివారం అర్థంతరంగా జడ్జిల్లో ఒకరైన నిత్యా మేనన్ బయటికి వెళ్లిపోయింది… వీడ్కోలు చెప్పింది… అమ్మల దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్స్ అవి… కంటెస్టెంట్ల తల్లులు కూడా పార్టిసిపేట్ చేశారు… అకస్మాత్తుగా వాళ్ల అమ్మను తలుచుకుని ఎమోషన్‌కు గురైన నిత్యా మేనన్ అమ్మను కలవడానికి వెళ్తున్నాను అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయింది… మణిశర్మ పాల్గొన్న ఆ ఎపిసోడ్‌లో మధ్యలో వెళ్లిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది… నిజానికి బెంగుళూరులో […]

అల్లరి అనే గొప్ప సినిమాను… అంతే గొప్పగా స్మరించుకున్న తెలుగు మీడియా…

May 11, 2022 by M S R

naresh

ఆంధ్రజ్యోతి నిన్న ఓ సినిమాకు ఆహో ఓహో అని ఫుల్లు డప్పు కొట్టింది ఓ ముప్పావు పేజీలో… అబ్బో, జూనియర్ నరేష్ అలియాస్ అల్లరి నరేష్‌కు అంత సీన్ ఉందా..? అసలు సందర్భమేమిటబ్బా అని లోపలకు వెళ్తే… భజనను ఇరగదీశాడు ఆ రచయిత ఎవరో గానీ… సాధారణంగా సినిమా పేజీల్లో ఏం వేస్తున్నారో చూసేంత ఓపిక, తీరిక సంపాదకులకు ఉండదు, అందులోనూ ఆంధ్రజ్యోతిలో అస్సలు ఉండదు… ఈమాట ఎందుకు అనుకోవాలీ అంటే… ఓ మంచి సినిమాను స్మరించుకునే […]

అరె, ఏం ప్రశ్నలు అడుగుతుర్ర భయ్… అన్నీ చచ్చు ఇంటర్వ్యూలు…

May 10, 2022 by M S R

rgv

ప్రపంచంలో చాలారకాల మనుషులుంటారు… కొందరు ఎక్స్‌ట్రీమ్… మందకు ఎడంగా నడిచే బాపతు… అయితే పిచ్చోళ్లు లేకపోతే మేధావులు… అరుదుగా వర్మ వంటి కొత్త కేటగిరీ ఉంటుంది… అందరూ రాసీ రాసీ, చూపీ చూపీ, అడిగీ అడిగీ వర్మ మీద ఏదేదో టన్నుల కొద్దీ చెప్పారు కాబట్టి తన తత్వం లోతుల్లోకి వెళ్లే సాహసం మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు… తను కూడా ఎప్పటికప్పుడు తిక్క (?) చేష్టలతో వార్తల్లో ఉంటాడు కాబట్టి తన వ్యవహార ధోరణి […]

నువ్వు సూపర్ మహేష్… ఎక్కడా తొణక్కుండా, కూల్‌గా భలే జవాబు చెప్పావ్…

May 10, 2022 by M S R

mahesh

‘‘ఫిల్మ్ బ్యూరో రాధా అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సూపర్ స్టార్’’ అని ఓ వీడియో కనిపించింది… ఇలాంటి వీడియో వార్తల సంగతి తెలుసుకదా… అందుకని మనసులోనే ఆంజనేయస్వామిని ఓసారి పాహిమాం అని ధ్యానించి, చూడ సాహసించి, వీడియో ఓపెన్ చేస్తే… సదరు సూపర్ స్టార్ షాక్ సంగతేమిటో గానీ… నాకు కొన్ని షాక్స్ తగిలాయి… కానీ ఏమాటకామాట… ఆ తిక్క స్క్వేర్ ప్రశ్నకు మహేష్ జవాబు ఇచ్చిన తీరు, తను చూసిన చూపు మాత్రం భలే […]

ఇన్నేళ్లుగా మహేష్‌ బాబుకు ఈత రాదు… 46 ఏళ్ల వయస్సులో నేర్చుకున్నాడు…

May 9, 2022 by M S R

mahesh

సాధారణంగా సినిమాల్లో హీరోలు అంటేనే… సముద్రాలు ఈదేస్తారు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కేస్తారు… ఒంటి చేత్తో మడత నలగకుండా వందలాది మంది రౌడీలను ఉతికేస్తారు… ఏదంటే అది చేసేస్తారు… అంత సుప్రీం స్టామినా అన్నమాట… తెర మీద వాళ్లకు తెలియని విద్య ఉండదు… కానీ ఒరిజినల్‌గా వాళ్లూ మనుషులే కదా… నానా బలహీనతలు ఉంటయ్… కాకపోతే ఎప్పుడూ తమలోని మైనస్ పాయింట్లు, భయాలు గట్రా బయట ఫోకస్ గాకుండా జాగ్రత్త పడతారు… అది తమ ఇమేజీకి నష్టం […]

ఓహ్… ఆ సాయిపల్లవి వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదా..?

May 9, 2022 by M S R

saipallavi

మొన్నామధ్య సాయిపల్లవి ఓ ఫోటో షేర్ చేసుకుంది… చీరెలో ఆమె, భుజాన ఓ హ్యాండ్ బ్యాగ్, వీథుల్లో పరుగు తీస్తున్న అడుగులు… అంతే, అందులో ఆమె మొహం ఏమీ లేదు… మే9న ఇదేమిటో వెల్లడవుతుందని చెప్పింది… అది ఆమె జన్మదినం… సో, ఆ ఫోటో ఎందుకు వైరల్ అయ్యిందీ అంటే… ఈమధ్య అందరూ తెగరాసేస్తున్నారు, ఆమె చేతిలో సినిమాల్లేవు, పెళ్లి చేసుకుంటోంది, సినిమాలకు దూరమవుతోంది అని…! ఒరేయ్ బాబూ, ఈ పెళ్లి ముచ్చట్లు ఫేక్, రాయకండ్రా బాబూ […]

ఆ తప్పు చేయకుండా ఉంటే… ‘‘భళా తందనాన’’ అని ఆడాల్సిన సినిమా…!!

May 6, 2022 by M S R

bhala

ఇదేరోజు థియేటర్లలో విడుదలైన జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జునకల్యాణం, ఓటీటీలో విడుదలైన చిట్టి సినిమాల విశ్లేషణలు, కథనాల నడుమ ఫాఫం భళా తందనాన అనే సినిమా గురించిన చర్చ కనిపించకుండా పోయింది… నిజానికి తీసిపారేయదగిన సినిమా ఏమీ కాదు ఇది… మరీ నాసిరకం అని ఛీకొట్టాల్సిన పనిలేదు… కాకపోతే దర్శకుడి వైపు నుంచి ఓ సందిగ్ధత సినిమాను దెబ్బతీసినట్టు అనిపిస్తుంది… దర్శకుడు దంతులూరి చైతన్య… మొదట్లో బాణం… ఎవరబ్బా ఈ కొత్త దర్శకుడు అనిపించేలా కాస్త పర్లేదు… […]

ఊకో సుమక్కా ఊకో… ఏం తక్కువ చేస్తివి, నువ్వయితే మస్తు కష్టపడితివి…

May 6, 2022 by M S R

suma

ఏ జెర ఊకో సుమక్కా… జెర సైసు… నువ్వేం తక్కువ జేసినవ్ శెప్పు… అసలు ఏ హీరో అయినా నీ అంత భుజాన వేసుకుని సినిమాను ఇంత ఘనం ప్రమోట్ చేసిన్రా ఎప్పుడైనా..? గిర్రగిర్ర నెలరోజుల నుంచి తిరుగుతనే ఉన్నవ్… దొరికిన పెద్ద పెద్ద హీరోలను పట్టుకుని ట్రెయిలరో, టీజరో, పోస్టరో రిలీజ్ చేయిస్తనే ఉన్నవ్… ప్రతి టీవీ ప్రోగ్రాముకు ప్రమోషన్ కి పోతివి… నీ ఎనర్జీ చూసి అందరూ ఆశ్చర్యపోయిన్రు కూడా… కానీ ఏం లాభమొచ్చె […]

నో డౌట్… కీర్తి సురేష్ మహానటే… మరోసారి అదరగొట్టేసింది… భేష్…!!

May 6, 2022 by M S R

keerthy

రౌద్రం, కాఠిన్యం, కసి, కోపం, ప్రతీకారం రగిలే కొన్ని పాత్రలకు చాలామంది హీరోయిన్లు సూట్ కారు… ఆ మొహాల్లో ఆ ఉద్వేగాలు బలంగా ఎక్స్‌పోజ్ కావు… మరీ ఎక్స్‌పోజింగ్ పాత్రలు తప్ప ఇంకేమీ చేయని టైంపాస్ పల్లీబఠానీ హీరోయిన్లకు అస్సలు చేతకాదు… కానీ కీర్తి సురేష్ అలా కాదు… ఆమెలో తల్లి వారసత్వం ఉంది… ఏ ఎమోషనైనా సరే ఆ మొహంలో బలంగా ఆవిష్కరించగలదు… ప్రేమ, రొమాన్స్ గానీ… రౌద్రం గానీ… మహానటిలో ఆమెను చూశాం కదా… […]

సినిమా బాగానే ఉందిగా… ఆ పిచ్చి ప్రాంక్ ప్రమోషన్లకు ఎందుకు పాల్పడినట్టు..?!

May 6, 2022 by M S R

అశోకవనంలో అర్జునకల్యాణం

అర్థం కాని విషయం ఒక్కటే… సినిమాను నీట్‌గా తీశారు, ఔట్‌పుట్ బాగానే వచ్చింది… ఒక్కసారి గనుక ప్రేక్షకుల మౌత్‌టాక్ బాగుంటే సినిమా నడుస్తుంది… సినిమాలో దమ్ములేకపోతే ఎన్ని ప్రమోషన్ వేషాలు వేసినా సినిమా నిలబడదు… అంత పెద్ద ఆచార్యే కొట్టుకుపోయింది… చిన్న సినిమాలు ఎంత..? సో, సరదాగా, ఓ ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా సినిమా తీశారు కదా… మరెందుకు ఆ ప్రాంక్ వీడియోలు వంటి పిచ్చి ప్రమోషన్ చేష్టలకు వెళ్లినట్టు..?! నిజానికి విష్వక్సేన్ వ్యవహార ధోరణిలో యారొగెన్సీ కనిపిస్తుంది… […]

ఎట్టకేలకు ఓ సుదీర్ఘ ‘‘విరాటపర్వం’’ ముగిసింది… సాయిపల్లవి వచ్చేస్తోంది…

May 6, 2022 by M S R

virataparvam

ఎట్టకేలకు విరాటపర్వం సినిమాకు మోక్షం దొరికినట్టు కనిపిస్తోంది… సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామో ఈరోజు సాయంత్రం వెల్లడిస్తామని దర్శకుడు ఊడుగుల వేణు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు తాజా అప్‌డేట్… అంటే, థియేటర్లలో రిలీజ్ చేస్తారా? ఓటీటీలో రిలీజ్ చేస్తారా తెలియదు… కానీ మొత్తానికి సినిమా ‘‘మిస్టరీ బంధనాల్ని’’ తెంచుకోబోతోంది సంతోషం… ఎందుకు అంటే..? ఊడుగుల వేణు తెలుగు ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ డైరెక్టర్… రొడ్డకొట్టుడు, దంచికొట్టుడు డైరెక్టర్ కాదు తను… థింకర్… ఈ సినిమా కూడా […]

సైలెంట్ డార్క్ సెటైరికల్ కామెడీ… తమిళ సినిమాలో ఓ కొత్త ప్రయోగం…

May 6, 2022 by M S R

gandhi talks

ఈమధ్య బండ్ల గణేష్ హీరోగా చేసిన డేగల బాబ్జీ అనే సినిమా వివరాల్ని ప్రతి మీడియా పబ్లిష్ చేసింది… అదొక ప్రయోగం… ఒకే ప్లేసులో, ఒకే వ్యక్తితో సాగే రెండు గంటల సినిమా… గణేషుడు నవరసాలూ పోషిస్తాడట… మిగతా పాత్రలు జస్ట్, మాట్లాడుతుంటాయి… కానీ కనిపించవు… నిజానికి స్థూలంగా చూస్తే ఓ భిన్న ప్రయోగమే… కాకపోతే బండ్ల గణేష్ అనగానే తన కామెడీ ప్రసంగాలు గుర్తొచ్చి వెంటనే నవ్వొస్తుంది… చిరాకేస్తుంది… ఏం నటించాడో చూడాలిక… అది తమిళంలో […]

హీరో సూర్య, జ్యోతికలపై కేసు… న్యాయవివాదంలో జైభీమ్ మూవీ…

May 5, 2022 by M S R

jaibhim

ఒక సినిమా విడుదలైంది… ఓటీటీలో వచ్చేసింది… టీవీల్లోనూ ప్రసారమైంది… ఇంకేముంది అనుకోవడానికి వీల్లేదు… పాత పంచాయితీలు వెంటాడుతూనే ఉండే చాన్సుంది… జైభీమ్ మూవీ మీద తాజా వార్తలు చెబుతున్నది ఇదే… 2021లో వచ్చిన ఈ సినిమా చాలా ప్రశంసలకు నోచుకుంది… నటీనటుల నటన, సోషల్ కాజ్ మాత్రమే కాదు… తరతరాలుగా అణగారిన ఓ కులానికి సంబంధించి ఓ మహిళకు వ్యవస్థలో జరిగిన అన్యాయం, దానిపై ఓ లాయర్ మద్దతుగా నిలిచిన తీరుతో కూడిన కథ విమర్శకుల అభినందనలకు […]

ఏదో అనబోయి… అది మరోలా ప్రచారమై… అడ్డగోలుగా బుక్కయిన సుహాసిని…

May 5, 2022 by M S R

సుహాసిని

ఫో… ఫోవే… ఆ హిందీ ఇండస్ట్రీకే వెళ్లిఫో… ఇక్కడేం పని నీకు..? హిందీ వాళ్లు మంచివాళ్లంటున్నావు కదా… అందుకే హిందీ అందరూ నేర్చుకోవాలని చెబుతున్నావు కదా… అసలు నీకేమైనా తమిళం మీద ప్రేముందా..? నీ మాతృభాష మీద అభిమానముందా..? ఎందుకీ పిచ్చి వ్యాఖ్యలు..? ఇప్పుడు నిన్నెవడు స్పందించమన్నాడు..?…. ఇలా సుహాసిని మీద తమిళ నెటిజన్లు ఫుల్లు అగ్గిఫైరయిపోతున్నారు… మామూలు అంశాల్లోనే మంచీమర్యాద చూపించరు కదా ట్రోలర్స్, ఇక సున్నితమైన హిందీ అంశం మీద సుహాసిని దొరికితే విడిచిపెడతారా..? […]

సినిమా ప్రమోషనా…? ఓసారి సుమ తీరు చూడండి..! ఓ రీతిరివాజు ఉండాలి..!!

May 4, 2022 by M S R

suma

సినిమా ప్రమోషన్ తీరూతెన్నూ మారిపోయినయ్… ఒకప్పటి కాలం కాదు ఇది… టీజర్లు, పోస్టర్లు, ట్రెయిలర్లు, ప్రిరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా క్యాంపెయిన్, ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్, పెయిడ్ రివ్యూయర్లు… అసలు కథే మారిపోయింది… ఇది మరీ దిగజారి ప్రాంక్ వీడియోల దాకా వచ్చింది, అది వేరే సంగతి… అఫ్‌కోర్స్, ప్రస్తుతం రచ్చ అంతా ఆ చీదర వీడియోలతో ప్రమోషన్ ఏమిటనేదే… కథలో దమ్ముండాలే గానీ… ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథాకథనాలు ఉండాలే గానీ… మామూలు ప్రమోషన్ […]

మల్టీస్టారర్ అంటేనే… దర్శకుడికి హారర్… ప్రేక్షకుడికి టెర్రర్…

May 3, 2022 by M S R

ntr anr

ట్రిపుల్ ఆర్ సినిమాపై ఓ విమర్శ… రాంచరణ్ పోర్షన్ ఎక్కువ చేసి, ప్రాధాన్యం అధికంగా ఇచ్చి, జూనియర్ పాత్రను తక్కువ చేశారని..! సరే, ఆ విమర్శల్ని జూనియర్ లైట్ తీసుకున్నాడు, అది వేరే సంగతి… కానీ ఈ మల్టీ స్టారర్ అంటేనే ఈ సమస్య… కథ ప్రకారం గాకుండా, ఫ్యాన్స్ మనోభావాలు, ఇమేజీలను బట్టి కథనం నడిపించడం ప్రతి దర్శకుడికీ కత్తిమీద సాము… ఎందుకొచ్చిన గొడవ అనుకుని హీరోలు, దర్శకులు మల్టీ స్టారర్ల జోలికి పోరు… ఆమధ్య […]

కిక్కు… డోపమైన్ కిక్కు… పోనీ, కేజీఎఫ్-3 కథ ఇలా ఉంటే సరిపోతుందా..?!

May 3, 2022 by M S R

dopamaine

Amarnath Vasireddy…..   ముళబాగల్ – 3 . అతనో డాన్ పేరు బాకీ … ఏనాటికైనా ప్రపంచంలోని ఆటం బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ మొత్తం సొంతం చేసుకొని, దీపావళి నాడు కాల్చి పండుగ చేసుకొంటానని అమ్మకు మాటిచ్చాడు . యాక్షన్ స్టార్ట్ … మన హీరో బాకీ, అమెరికా అధ్యక్షుడిని బందీ చేసి, తన ఇంటి బాత్ రూమ్ లో బంధిస్తాడు . CIA యుద్ధం చేస్తుంది… ప్లీజ్ ప్లీజ్…. మీరు లాజిక్కులు అడక్కండి … “CIA […]

ఎహె ఫోరా… విష్వక్సేన్‌కు వేలుచూపి గెటవుట్ అనేసిన టీవీ9 దేవి…

May 2, 2022 by M S R

viswaksen

నిజమేనా..? నేను చూస్తున్న వీడియో నిజమేనా..? నిజమేనట… ఈ వీడియో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది… ఏమిటీ అంటే… అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమా ప్రమోషన్ కోసం బిజీ రోడ్డు మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఎవడో ఓ ప్రాంక్ వీడియో చేసిన చీదర యవ్వారంపై పొద్దున ‘‘ముచ్చట’’ ఓ కథనం ప్రచురించిన సంగతి తెలుసు కదా… దీని మీద టీవీ9 ఓ డిబేట్ పెట్టింది… ఇది ప్రాంక్ వికారమా..? ఓ మూవీ ప్రమోషనా..? […]

  • « Previous Page
  • 1
  • …
  • 110
  • 111
  • 112
  • 113
  • 114
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions