Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్ యశ్..! బాడీగార్డును మెయిన్ విలన్‌గా యాక్సెప్ట్ చేయడమే గొప్ప…!!

April 18, 2022 by M S R

garuda ram

మనం కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పుకున్నాం… ఫేట్, డెస్టినీ, టైం… పేరు ఏదైతేనేం, మనిషిని ఎటు తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు… అదే రవి కథ… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పుకున్నాం… ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే కథ తనది… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్… కేజీఎఫ్ కథాచర్చలకు తరచూ యశ్ దగ్గరకు వెళ్లేవాడు… పెగ్గేస్తే గానీ […]

చదవాల్సిన ఓ నిజజీవిత కథ… చదివిన కొద్దీ వెంటాడే కథ… స్వరపుత్రుడు…

April 17, 2022 by M S R

ravi basrur

నిజానికి నేను ఈ కథకు ఎంతమేరకు న్యాయం చేయగలనో తెలియదు… ఇది కల్పితం కాదు… నిజజీవిత కథ… సరిగ్గా రాస్తే ఓ సినిమా కథ… ఓ నవల… ఓ వెబ్ సీరీస్… life అంటే..? An Uncertain… Very Dynamic… Just, It Happens… We have to receive as it comes… అంతేనా..? అంతేనేమో… ఉత్తర కర్నాటక… అరేబియా సముద్రతీరం వెంబడి ఉడుపి జిల్లా… కుందపుర తాలూకాలోని బస్రూర్ అనే ఊరు… అదొక పూర్ […]

ది ఢిల్లీ ఫైల్స్..! ఈసారి అగ్నిహోత్రి కథాంశం సిక్కులపై మారణకాండపైనేనా..?

April 17, 2022 by M S R

delhi riots

కశ్మీర్‌లో పెచ్చరిల్లిన మతోన్మాదం, హిందువుల ఊచకోతపై ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా తీసి సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమాను ప్రకటించాడు… దాని పేరు ‘ది ఢిల్లీ ఫైల్స్’… మోడీ అభిమానిగా ప్రకటించుకున్న అగ్నిహోత్రి మొదటి నుంచీ కాషాయవాదే… ప్రస్తుతం ఫిలిమ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డు సభ్యుడు… కశ్మీరీ ఫైల్స్ సినిమాను హిందూ సంస్థలు బాగా ప్రమోట్ చేశాయి… దాంతో దాదాపు 300 కోట్ల దాకా వసూళ్లు సాధించింది సినిమా… ది ఢిల్లీ ఫైల్స్ […]

నువ్వు అసాధ్యుడివిరా బాబూ… ఆ కొత్త మెరుపులూ ఉన్నాయా బుర్రలో..?!

April 16, 2022 by M S R

kgf

నో డౌట్… కేజీఎఫ్ తరంగ ఉధృతి ఇప్పట్లో తగ్గదు… లేకపోతే ఓ కన్నడ హీరో డబ్బింగ్ సినిమా తమిళనాట అర్ధరాత్రి దాటాక కూడా ప్రత్యేక షోలు వేయించుకోవడం ఏమిటి..? ఇక తెలుగులోనైతే స్ట్రెయిట్ సినిమాలాగే నడుస్తోంది… కన్నడం వదిలేయండి… హిందీలో కూడా హిట్… అనేక రికార్డులు బద్దలయ్యేట్టుగానే ఉంది… మొన్న మనం చెప్పుకున్నాం కదా… ప్రశాంత్ నీల్ సింపుల్‌గా చెప్పాలంటే ఓ పది తలల రాజమౌళి… మరొకటీ చెప్పుకున్నాం… కేజీఎఫ్-2ను మించి ఒక హీరోను ఇంకా ఇంకా […]

టీవీలకు బిత్తిరి సత్తి స్వస్తి…! సాక్షి నుంచీ బయటకు…! ఇక సినిమాలే లోకం…!

April 15, 2022 by M S R

bittiri

బిత్తిరి సత్తి టీవీ ప్రస్థానం ముగిసింది… ప్రస్తుతం పనిచేస్తున్న సాక్షి టీవీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయాడు… తనే వదిలేశాడు… ప్రస్తుతం గరం గరం వార్తలకు ప్రధాన పాత్రధారి తనే… (చల్లబడిండు)… రాబోయే చిరంజీవి సినిమాలో ఓ పాత్ర దక్కింది, మరికొన్ని సినిమా చాన్సులు కూడా వస్తున్నాయి… ఇక తన అదృష్టాన్ని పూర్తిగా సినిమాల్లోనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు… మరీ నిరాశాజనకంగా ఉంటే సొంత యూట్యూబ్ వీడియోలు… బిత్తిరి సత్తి… అసలు పేరు చేవెళ్ల రవి… అంతకుముందు ఏవేవో […]

ఆర్ఆర్ఆర్ Vs కేజీఎఫ్2… ప్లస్సులు, మైనస్సులపై ఓ ఇంట్రస్టింగ్ విశ్లేషణ…

April 15, 2022 by M S R

neel

ఆర్ఆర్ఆర్‌తో పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? ఇప్పుడు దేశమంతా క్యాష్ కొల్లగొడుతున్న సినిమాలు ఇవి… ఆల్‌రెడీ ఆర్ఆర్ఆర్ దున్నేసింది… ఇంకా వసూళ్లు సాగుతూనే ఉన్నాయి… ఇప్పుడు కేజీఎఫ్ దండయాత్ర మొదలైంది… బాక్సాఫీసు షేక్ అయిపోతోంది… నిజానికి రెండింటినీ పోల్చడానికి ఇతరత్రా కారణాలున్నయ్… రెండూ బాలీవుడ్ ఇగోను, వివక్షను, సుప్రిమసీని బద్ధలు కొడుతున్నయ్… బాలీవుడ్ పెళుసు నాణ్యత, డొల్ల భారీతనాల్ని ఎత్తిచూపుతున్నయ్… సౌత్ ఇండియన్ సినిమా కాలర్ ఎగరేస్తున్నయ్… అంతేకాదు, బాలీవుడ్‌ ముట్టడికి మితిమీరిన హీరోయిజాన్ని ఆశ్రయిస్తున్నాయి… హీరోలను […]

ఎవరు ఈ పది తలల రాజమౌళి..? మూడే సినిమాలతో ముట్టడి..!

April 15, 2022 by M S R

neel

అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు తెలియని కేరక్టర్… పునీత్ రాజకుమార్… కానీ మరణం తరువాత పునీత్ మీద కన్నడిగుల అభిమానం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోవడం మన వంతయింది… అసలు కన్నడ ఇండస్ట్రీ ఎప్పుడూ మిగతా సినిమా ప్రపంచానికి దూరదూరంగానే ఉంటూ వచ్చింది… ఇప్పుడిప్పుడే ప్రధాన స్రవంతిలోకి వచ్చేస్తోంది… ప్రత్యేకించి కేజీఎఫ్ కొత్త కన్నడ సినిమాను పరిచయం చేస్తోంది… కొత్త చరిత్రను రాస్తోంది… దానికి కారకుడు యశ్ కాదు… ప్రశాంత్ నీల్…! హసన్‌లో పుట్టి, సినిమాయే ప్యాషన్‌గా […]

ఈ బుడ్డోడే కేజీఎఫ్-2 తెర వెనుక అసలు హీరో… ఎవరో తెలుసా..?!

April 14, 2022 by M S R

ujwal

కొన్ని స్టోరీస్ రాయడానికి ఆనందమేస్తుంది… మౌస్, కీప్యాడ్, కంపోజింగ్, అక్షరాలు, పదాలు చకచకా పరుగులు తీస్తుంటాయి… ఇదీ అంతే… అరె, నువ్వు గ్రేట్‌రా బుడ్డోడా… హేట్సాఫ్… హేట్సాఫ్… ఉజ్వల్ కులకర్ణి… వయస్సు జస్ట్ 19 ఏళ్లు… షార్ట్ ఫిలిమ్స్‌ ఎడిట్ చేసేవాడు… మస్తు క్రియేటివిటీ… కళ్లల్లోనే కత్తెర్లతో పుట్టాడేమో… పోనీ, చేతి వేళ్లలోనే ఆ విద్యతో పుట్టాడేమో… ఏ సీన్ ఎంతమేరకు ఉంచాలి, ఏది నరకాలి, ఏది తీసేయాలి, ఏది ఎక్కడ జతచేయాలి పుట్టుకతో వచ్చినట్టుంది విద్య… […]

డీజే టిల్లు గాడు శ్యామ్ సింగరాయ్‌ను ఓడించాడు… అట్లుంటది రాధికా…

April 14, 2022 by M S R

saipallavi

ఎంత సాయిపల్లవి ఉంటేనేం..? ప్రణవాలయ అని కష్టపడి ఎంత శాస్త్రీయంగా నర్తిస్తేనేం..? నానికి కొత్త లుక్కు ఇచ్చి, పాత జన్మలోకి లాక్కుపోయి, ఓ కొత్త కథ రాస్తేనేం..? నాని మరీ రెచ్చిపోయి కృతిశెట్టితో ఘాటు లిప్‌లాకుల్ని పండిస్తేనేం…? జనానికి అంతగా కనెక్ట్ కావాలనేముంది..? కాలేదు… నిజానికి సినిమాకు నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు… ఉన్నంతలో మంచి వసూళ్లే రాబట్టింది… కానీ టీవీ ప్రేక్షకులు ఎందుకో పెదవి విరిచారు… ఆసక్తి చూపించలేదు… కానీ మరీ ఇంత తక్కువ రేటింగ్స్ వస్తాయని […]

అసాధారణ హీరోయిజం..! బంగారు బాక్సాఫీసు గనుల్ని తవ్వుకుంటున్నాడు..!!

April 14, 2022 by M S R

kgf

ఆర్ఆర్ఆర్ సినిమా ముందుగా విడుదలై బతికిపోయింది… లేకపోతే కేజీఎఫ్-2 ముందు వెలవెలబోయేదేమో…! కేజీఎఫ్ మీద నెలకొన్న హైప్, దాని ముందస్తు వసూళ్లు సినిమా పండితులను కూడా ఆశ్చర్యపరుస్తున్నయ్… లక్షల అడ్వాన్స్ బుకింగులతో కేజీఎఫ్ గల్లాపెట్టె గలగలమంటోంది… కేజీఎఫ్ ఓ సంచలనాన్ని సృష్టించింది అప్పట్లో… అసలు సౌతిండియా ఇండస్ట్రీలో బాగా వెనుకబడినట్టుగా ఇన్నేళ్లూ కనిపించిన శాండల్‌వుడ్ చరిత్రను యశ్ తిరగరాస్తున్నాడు… అది మాత్రం నిజం… ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో విడుదల అంటే మాటలా..? మరీ రాజమౌళిలా 400 కోట్లు, […]

దక్షిణాది సినిమా నిజంగా బాలీవుడ్ కొమ్ములు విరిచేసినట్టేనా..? కాదు… లేదు…!!

April 14, 2022 by M S R

south

మరీ అంతగా భుజాలు చరుచుకోవాల్సిన పనిలేదు… దక్షిణాది సినిమా బాలీవుడ్ కొమ్ములు విరిచేసిందని అప్పుడే ఓ నిర్ధారణకు వచ్చేయకండి… నిజమే…  ఒకప్పుడు రజినీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి వంటి చాలామంది సౌతిండియన్ హీరోలు హిందీ మార్కెట్‌లోకి అడుగుపెట్టి, వాపస్ వచ్చేశారు… నిజానికి హిందీ ఇండస్ట్రీ దక్షిణాది హీరోయిన్లను తప్ప ఇంకెవరినీ ఎప్పుడూ సహించదు… హిందీ ప్రేక్షకులు కూడా సౌత్ ఇండియన్ సినిమాలంటేనే అదోరకంగా చూసేవాళ్లు… తెలుగు, తమిళ సినిమాల రీమేక్ హక్కుల్ని కొని, బాలీవుడ్ నిర్మాతలు హిందీ తారల్ని […]

బీస్ట్ అంటే మృగం… ఔను, అలా మీదపడితే ఎవడికి నచ్చుతుంది మరి..?!

April 13, 2022 by M S R

beast

నిజానికి సినిమా అంతా చూశాక… బతుకుజీవుడా అని థియేటర్ నుంచి పారిపోయి వస్తుంటే… ఒకటి ఎందుకో కాస్త డిఫరెంటుగా స్ట్రయికయింది… అందరూ గోల్డెన్ లెగ్ అని కీర్తించి, ఆ పాదాల మీద, ఐమీన్ తొడల దాకా ప్రత్యేక గీతాలు రాసి, నేల మీద పొర్లుతూ పొర్లుదండాలు పెట్టారు కదా… ఆల్ ఆఫ్ సడెన్ ఫాఫం, ఇలా అయిపోయింది ఏమిటీ అని… అవును, పూజా హెగ్డే గురించే… నటనలో ఆమె పూర్… గట్టిగా అడిగితే ఆమే ఒప్పుకుంటుంది ఆ […]

Un Fair n Un Lovely… మళ్లీ సినిమా చర్చల్లోకి ‘క్రిటిక్స్ మాఫియా’….

April 11, 2022 by M S R

yami

నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది ఈ సినిమా… పేరు దస్‌వీ… అంటే పదో తరగతి… టెన్త్ క్లాస్… ఇప్పుడు తాజాగా చర్చల్లో నలుగుతోంది… ఎందుకు..? సినిమా గురించి కాదు… సినిమాపై రివ్యూల గురించి కూడా కాదు… పర్టిక్యులర్‌గా ఆ సినిమాలో హీరోయిన్ యామీ గౌతమ్ నటన గురించిన రివ్యూలపై… నిజానికి ఆ సినిమాలో ఆమె హీరోయినే కాదు… కాకపోతే ఓ ముఖ్యమైన పాత్ర… దీనికన్నా ముందు మరో నటి గురించి చెప్పాలి… నిమ్రత్ కౌర్… వయస్సు నలభై ఏళ్లు… రాజస్థాన్‌లో […]

కౌన్ ప్రవీణ్ తాంబే… ఓ డిఫరెంట్ క్రికెట్ హీరో… ఓ డిఫరెంట్ బయోపిక్…

April 10, 2022 by M S R

tambe

ఒక సచిన్… ఒక గంగూలీ… ఒక సెహ్వాగ్… ఒక ధోనీ… ఒక కోహ్లీ వీళ్ల గురించి ఎవరైనా రాస్తారు… బయోపిక్కులూ తీస్తారు… అయితే వాళ్ల కథలు వేరు… కానీ మరికొందరు ఉంటారు… వాళ్లు అన్‌సంగ్ హీరోస్… ప్రస్తుతం ఓ క్రికెటర్ గురించిన బయోపిక్ అందరి చర్చల్లోనూ నానుతోంది… ప్రముఖ క్రికెటర్లు కూడా ట్వీట్లు చేస్తున్నారు… అభినందిస్తున్నారు… నిజంగా ఓ డిఫరెంట్ బయోపిక్… రాహుల్ ద్రవిడ్‌కే స్పూర్తినిచ్చిన క్రికెటర్‌పై బయోపిక్… ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..? ప్రవీణ్ తాంబే… […]

నాటి అర్జున్ జెంటిల్‌మన్ సినిమా గుర్తుందా..? ఇదుగో ఆనాటి శుభశ్రీ…!!

April 9, 2022 by M S R

subhasri

అప్పట్లో… అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది… అర్జున్, మధుబాల హీరోహీరోయిన్లు… పేరు జెంటిల్‌మన్… అప్పట్లో బాగా హిట్టయ్యింది సినిమా… ఈ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేది ప్రభుదేవా, గౌతమి సాంగ్ ‘‘చికుబుకు చికుబుకు రైలే’’… ఎవరి నోట విన్నా ఆ పాటే అప్పట్లో… అంత హిట్… ఇదోరకం ఐటం సాంగ్… అంటే సినిమా కథకు సంబంధం ఉండదు… సినిమా పేరు వింటే గుర్తొచ్చే మరో పేరు శుభశ్రీ… ఆమె అల్లరిచిల్లర ఆటలు […]

అబ్బాయ్ వరుణుడా… ఏ ఖనిజ సంపదా లేని ఈ గని దేనికి స్వామీ…

April 8, 2022 by M S R

ghani

సినిమా సంగతి తరువాత… నిర్మాత, దర్శకుల ఓ కొత్త ఆలోచన మాత్రం డిఫరెంటుగా అనిపించింది…. ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… అంటే మరేమీ లేదు, తెలుగు, కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషలు మాత్రమే… మార్కెట్ ఈ భాషల్లో మాత్రమే ఉంటుంది… నాలుగు డబ్బులు రాలతయ్… జస్ట్, ఆయా భాషల్లోకి డబ్ చేసి మార్కెట్ మీదకు వదిలేయడమే… అయితే ఒకే భాష సినిమాలకు చెందిన నటులైతే వేరే భాషల వాళ్లకు పరాయి సినిమా చూస్తున్నట్టు ఉంటుంది… […]

బుల్లితెర మీద కూడా ‘గల్లా’ చిరిగిపోయింది… సూపర్ డూపర్ డైనమిక్ ఫ్లాప్…

April 8, 2022 by M S R

galla hero

మస్తు డబ్బుంది… సో వాట్..? పొలిటిషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ గల్లా జయదేవ్ కొడుకు… సో వాట్..? మహేశ్ బాబు మేనల్లుడు… సో వాట్..? ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించారు గల్లా అశోక్ అనే ఓ వారస హీరోను…! పెద్ద తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా బోల్తాపడ్డాడు… ఏదేదో నేపథ్యం ఉంది కదాని, తెరను చించేస్తామని వచ్చేస్తే సరిపోదు,… అలా చాలామంది వచ్చారు, పోయారు… నిలబడింది కొందరే… అందుకే ఇదే అశోక్ తాత, అనగా సూపర్ […]

మరో వివాదంలో ఇళయరాజా..! పాటకు తొలిహక్కుదారుడు ఎవరు..?!

April 7, 2022 by M S R

songs

ఒక నిర్మాత… డబ్బు ఖర్చు పెడతాడు… లాభానికి, నష్టానికి రిస్క్ తీసుకుంటాడు… అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తాడు, పనిచేయించుకుంటాడు… అనేక విభాగాలు, అనేకమంది, బోలెడంత ఖర్చు, రిలీజయ్యే వరకూ డౌటే… సక్సెసయితే డబ్బు, లేకపోతే నెత్తి మీద తుండుగుడ్డ… అయితే సినిమా టైటిల్ దగ్గర నుంచి రీమేక్, డబ్బింగ్, టీవీ హక్కుల దాకా మొత్తం నిర్మాత సొంతమే కదా… ఒక్క సినిమా సంగీతం విషయంలోనే తేడాలు ఎందుకు వస్తున్నట్టు..? సంగీత దర్శకుడికీ హక్కులుంటాయట… గాయకులకూ రాయల్టీలు ఉంటాయట… రికార్డింగ్ […]

ఫాఫం… అంతటి సంగీత సరస్వతి సైతం… గతి తప్పి… శృతి తప్పి…

April 7, 2022 by M S R

aurna sairam

ఆమె ఎవరో తెలుసా..? కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలు… పద్మశ్రీ గ్రహీత… వయస్సు డెబ్బయ్ ఏళ్లు… పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి మేనత్త… మంచి సంగీత కుటుంబం… పెద్ద పెద్ద వాళ్ల దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంది… నేర్చింది కర్నాటక సంగీతమే అయినా అన్నిరకాలూ పాడగలదు… ఎనిమిదో ఏటనే ఓ బంగారు పతకం పొందిన ఆమె అప్పట్నుంచీ పాడుతూనే ఉంది… ఆమె చరిత్ర చదువుతూ పోతే ఇలా చాలా చాలా విశేషాలు కనిపిస్తయ్… ఆమె పేరు […]

క్షుద్ర మంత్రోపాసనలాగా… కాష్మోరాను పిలుస్తున్నట్టుగా… ఏం పాట గురూ…!!

April 6, 2022 by M S R

anasuya

ధా… రా… ణా… హా… ఛే… నో… రా… హా… ధా… రా… య… జ… చౌ… రౌ… రా… ఏ… …. ఈ అక్షరాల్ని ఓసారి పాడటానికి ప్రయత్నించండి… పోనీ, మీకిష్టమున్న ట్యూన్‌లో… బీభత్సం, క్రౌర్యం, భీకరం గట్రా వినిపించాలి… అబ్బే, రావడం లేదా..? ఎక్కడో, ఏ ఒడిశా మారుమూల గ్రామంలోనో, అమావాస్య, చీకటిపూట, భీతిగొలిపే స్మశానంలో, ఏ మంత్రగాడు దార్కాయో కాష్మోరాను పిలుస్తున్నట్టుగా… ఏదో క్షుద్రశక్తిని ఆవాహన చేస్తున్నట్టుగా ఉన్నాయా..? ఛ, తప్పు… ఇది […]

  • « Previous Page
  • 1
  • …
  • 112
  • 113
  • 114
  • 115
  • 116
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions