రావుగోపాలరావు చాలా గొప్ప కేరక్టర్ ఆర్టిస్టు… నో డౌట్… ఎవ్వడూ వంక పెట్టలేడు… విలనీ దగ్గర నుంచి కామెడీ, ఎమోషన్ అన్నీ తనకు కొట్టిన పిండి… తన వారసుడిగా తెరపైకి చాలా లేటుగా వచ్చిన ఆయన కొడుకు రావు రమేష్… నిజానికి రావుగోపాలరావును మించిన నటుడు… ప్రత్యేకించి ఎమోషన్స్ బాగా పలికించగలడు… కానీ ఎక్కడో భారీగా తేడా కొడుతోంది… తన వ్యవహార ధోరణితో నిర్మాతలకు సరిపడటం లేదా..? తనకు వచ్చే పాత్రల పట్ల అతనే తీవ్ర అసంతృప్తితో […]
తెరపై జయసుధ… తెర వెనుక జానకి… ఆ పాటలో రాగయుక్తంగా నవ్వులు…
కన్నాంబ , సావిత్రి , వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రలనయినా , ముఖ్యంగా విషాద పాత్రలను , అవలీలగా వేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా 1976 లో వచ్చిన ఈ జ్యోతి సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన జయసుధ లక్ష్మణరేఖ సినిమాలో రెబల్ రోల్ , సోగ్గాడు సినిమాలో చలాకీ రోల్ వేసి ఈ జ్యోతి సినిమాలో అల్లరి పిల్లగా , ఆ తర్వాత ఓ ముసలివాడి భార్యగా బరువైన పాత్రలో […]
బాపు తప్ప ఇంకెవరూ ఈ సినిమాను ఇంత అందంగా చెక్కేవారు కాదేమో..!
నవరసాలు వర్షించిన కళాఖండం . ఓ దృశ్య కావ్యం . బాపు తప్పక మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అని అనిపిస్తుంది . అంత అద్భుతంగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఒకటి 1976 లో వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా . దీనికి ముందు కన్నడ హీరో రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా వచ్చింది […]
పక్కలోకొచ్చి పడుకుంటేనే పని, పైసలు… ఒక్క మాలీవుడ్కే పరిమితమా..?!
అయ్యో, కేరళ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరంగా మహిళల లైంగిక దోపిడీ జరుగుతోందట, జస్టిస్ హేమ కమిషన్ మొత్తం బట్టబయలు చేసిందట, ఇంత ఘోరమా… అనే వార్తలు, విశ్లేషణలు, వివరణలూ, ఆ కమిటీ ముఖ్యాంశాలను నిన్నటి నుంచే ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు… ఒక్కమాట..? ఏ భాష సినిమా ఇండస్ట్రీ దీనికి భిన్నంగా ఉంది..? హీరోయిన్ భావనపై ఓ హీరో గ్యాంగ్ చేసిన లైంగిక దాడి సంఘటన తరువాత ప్రభుత్వం ఈ కమిటీని వేసింది… ఇందులో సీనియర్ నటి […]
బంట్రోతు కొడుకు కలెక్టర్… ఒకే ఆఫీసులో ఇద్దరికీ కొలువు… అదీ కథ…
బంట్రోతు కొడుకు కలెక్టర్ అవుతాడు.., తండ్రి పనిచేసే కలెక్టరాఫీసుకే కలెక్టరుగా వస్తాడు.., నగరంలోని దేశద్రోహులను చట్టానికి పట్టిస్తాడు… ఈ సినిమా 1976 లో వచ్చిన ఈ బంగారు మనిషి సినిమా … రాజయినా , పోలీసు ఆఫీసరయినా , సాహసం చేసే డింభకుడు అయినా , కలెక్టర్ అయినా NTR కు మారు వేషాలు ఉండాల్సిందే . ఈ సినిమాలో కూడా ఉంది . ఈ సినిమాలో ముఖ్యంగా మెచ్చుకోవలసింది గుమ్మడి నటన . తాను పనిచేసే […]
నటి హేమ తాజా వీడియోలోనూ అదే ప్రస్తావన… మీడియా సెటిల్మెంట్లు..!!
ఇప్పుడు డిస్కషన్ అంతా మీడియా మాఫియా గురించే కదా… ప్రముఖుల్ని టార్గెట్ చేసి వేధించడం, తరువాత సెటిల్మెంట్లు చేసుకోవాలని చెప్పడం… వేణుస్వామి పేల్చిన బాంబు కూడా అదే కదా… నిజానికి తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో హైదరాబాద్ ఫిలిమ్ జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు ఏకంగా సంఘాల పేర్లతో వుమెన్ కమిషన్ను అప్రోచ్ అయ్యారంటే ఏదో భారీ తేడా కొడుతున్నట్టు లెక్క… సరే, మళ్లీ పోలీసులకు వద్దకు వెళ్లారు, కంప్లయింట్లు ఇచ్చారు… ఇదిలా కొన్నాళ్లు సాగుతుంది… తాజాగా […]
ఈ పాత సినిమా విశేషాలు రాస్తూ పోతే… అదీ ఓ ‘అంతులేని కథ’…
అంతులేని కథ… నిజానికి ఈ సినిమా మీద విశేషాలెన్ని చెప్పుకున్నా, అది అంతులేని కథే… ఒడవదు, తెగదు… బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమా . జయప్రద సినిమా . 1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్నా , హీరోయిన్ లెవెలుకు తీసుకుని వెళ్లిన సినిమా 1976 లో వచ్చిన ఈ అంతులేని కధ సినిమా . ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన […]
ఆలీని నమ్మితే మొత్తం సినిమాకే ‘బొక’పడింది… దర్శకుడు పూరీయే బాధ్యుడు…
డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఆలీ చేసిన అత్యంత వెగటు ‘బొక’ ఎపిసోడ్ పీకేశారు అని ఒక వార్త… పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… మిస్టర్ బచ్చన్లో తెలుగువాడికి ఎక్కని హిందీ పాటలకు కూడా కత్తెర పెట్టారని మరో వార్త… ఇదీ ఊహించిందే… ప్రేక్షకుడి ఫీడ్ బ్యాక్, స్పందనలను బట్టి నిడివి కత్తిరింపులు, సీన్ల తొలగింపులు, జోడింపులు అసాధారణమేమీ కాదు… కానీ… దర్శకుడు పూరి తప్పేమీ లేదు, అంతా ఆలీదే తప్పు… ఆ ఎపిసోడ్ రచన, దర్శకత్వం, నటన […]
మళ్లీ ఆహా అన్స్టాపబుల్… ఈసారి నాగార్జునతో స్టార్ట్… 23 నుంచి షూటింగ్…
తెలుగు టీవీ, ఓటీటీలకు సంబంధించి టాక్ షోలలో సూపర్ హిట్ బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో… అప్పుడెప్పుడో ఆహా ఓటీటీలో 2021 నవంబరులో స్టార్టయింది కదా… పెద్దగా టీవీ ఇంటర్వ్యూలకు, టాక్ షోలకు రాని పెద్ద పెద్ద స్టార్లను కూడా తన పరిచయాలతో తీసుకొచ్చి, కూర్చుండబెట్టి, తనదైన స్టయిల్ ప్రశ్నలతో, సరదా సంభాషణలతో, ఆటలతో షోను రక్తికట్టించాడు బాలయ్య… అసలు బాలయ్య ఆ షోను హోస్ట్ చేయడమే విశేషం… టీవీ, ఓటీటీ షోలను చిరంజీవి, నాని, […]
PILL… మందు గోళీ కాదు, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషనూ కాదు… ఈ వెబ్ సీరీస్ అంతకుమించి…
చిన్నప్పుడు జ్వరమొస్తే గ్లాసెడు నీళ్లలో జిందాతిలిస్మాత్ కలుపుకొని తాగడం.. జలుబు చేస్తే అదే జిందాతిలిస్మాత్ రుమాలుకి కాస్త రాసుకొని పీల్చడం. కానీ ఇప్పుడు ప్రతీ దానికి ఒక మాత్ర వేసుకోవాల్సిందే. డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంటే ముందు మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవడం.. వేసుకోవడం. ఇలా ఎట్లాబడితే అట్లా ట్యాబ్లెట్లు వేసుకోవడం ప్రమాదకరం. డాక్టర్ దగ్గరకు వెళ్లి.. ఆయన రాసిన ట్యాబ్లెట్లు వేసుకోవడం ఉత్తమం అని చాలా మంది చెబుతుంటారు. కానీ ‘పిల్’ […]
ఆరాధన… ఆ రఫీ పాటలు ఈరోజుకూ చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి…
1976 లోకి వచ్చాం . 1970 లో హిందీలో హిట్టయిన గీత్ అనే సినిమా ఆధారంగా ఈ ఆరాధన సినిమా తీయబడింది . హిందీలో రాజేంద్రకుమార్ , మాలా సిన్హా హీరోహీరోయిన్లుగా నటించారు . మన తెలుగులో NTR , వాణిశ్రీలు నటించారు . కులూ వేలీలో ఔట్ డోర్ షూటింగ్ జరిగింది . సుందరమైన ప్రదేశాలను వీక్షిస్తాం . It’s a great musical and visual feast . మహమ్మద్ రఫీ – జానకమ్మ […]
నానీ… నీకు ఆ పదానికి అసలు అర్థం తెలుసా..? తెలిసీ కుర్చీ మడతబెట్టావా..?
హీరో నాని… పెద్దగా వివాదాల్లోకి వెళ్లడు… ఆచితూచి మాట్లాడతాడు… ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచీ ఎదిగాడు కదా, ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడకూడదో తెలుసు అనుకుంటారు కదా… కానీ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో తను బాంచెత్ అనే పదం వాడిన తీరు నీచంగా అనిపించింది… ఇన్సెన్సిబుల్… (సరిపోదా శనివారం అని కొత్త సినిమా వస్తోంది కదా, దాని ప్రమోషన్ కోసం వచ్చాడు…) తనకు ఆ పదానికి అర్థం తెలుసా..? తెలిసీ అన్నాడా..? నీయమ్మ, […]
మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం… అప్పట్లో ఊపేసిన మాస్ పాట…
మోగింది వీణ పదే పదే హృదయాలలోన, ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే అనే ఈ పాట క్లాస్ ఆడియెన్సుని రంజింపచేస్తే , మంగమ్మా నువ్వు ఉతుకుతుంటె అందం అనే పాట మాసుని ఒక ఊపు ఊపి గంతులు వేయించింది . దాశరధి వ్రాసిన మొదటి పాట ఈరోజుకీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తూనే ఉంటారు . వీణ మీద సుశీలమ్మ , పార్కులో రామకృష్ణ కూడా పాడారు . ఇంక రెండో పాట తిరునాళ్ళలో , ఫంక్షన్లలో ఇరగతీసింది […]
కథలో లీనమైపోతే మాత్రం… బ్లింక్ ఆగిపోతుంది… అంటే కళ్లప్పగించేస్తాం…
గతంలో ఏమో గానీ… ఈమధ్య కన్నడ సినిమా కూడా కథాప్రయోగాలు చేస్తోంది… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త డిఫరెంట్ కథల్ని ఎంచుకుని రిస్క్ తీసుకుంటున్నారు… రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఎట్సెట్రా రీసెంట్ పాపులర్ శెట్టిలలాగే ఇప్పుడు దీక్షిత్ శెట్టి… అదేనండీ నాని హీరోగా చేసిన దసరా సినిమాలో ఓ కీలకపాత్ర చేశాడు, కీర్తి సురేష్ ప్రేమికుడి పాత్ర… అదుగో తను హీరోగా చేసిన బ్లింక్ అనే సినిమా ఇప్పుడు ఓటీటీలో ఉంది… అమెజాన్ ప్రైమ్… […]
చిన్న కృష్ణుడిగా రోహిణి… బాలకృష్ణుడిగా శ్రీదేవి… కృష్ణుడిగా రామకృష్ణ…
మహా నటుడు SVR , జమునల సినిమా ఇది . 1975 లో వచ్చిన ఈ యశోద కృష్ణ సినిమాయే మహానటుడు యస్ వి రంగారావుకి ఆఖరి తెలుగు సినిమా కావటం దురదృష్టం . ఇంతటి మహానటుడు , ఏ పాత్రనయినా అలవోకగా నటించగల నటుడు మరొకరు లేరని చెప్పవచ్చు . వసుదేవుడు , దేవకీదేవిల వివాహంతో ఆరంభమయి , శ్రీనివాస కల్యాణంతో ముగుస్తుంది సినిమా . భారతీయ సంస్కృతిలో పురాణాలకు , ఇతిహాసాలకు ప్రధాన స్థానం […]
మానవ బంధాలు, ఉద్వేగాల సంక్లిష్టత… ఎంత బాగా ఆవిష్కరించారమ్మా…
అప్పుడెప్పుడో రుస్తుం అనే సినిమాలో చిరంజీవి సరసన నటించింది ఊర్వశి… చాలా సీనియర్ నటి కానీ తెలుగులో మళ్లీ ప్రముఖంగా కనిపించలేదు… ఏమో, గుర్తుంచుకునేంతగా లేదు… కన్నడం, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాలు చేసింది… కానీ ఆమె ప్రధానమైన ఫీల్డ్ మలయాళమే… మొదట్లో పెద్దగా ఇంప్రెసివ్ నటి అనిపించలేదు, కానీ అనుభవంతో చాలా బాగా మెరుగుపడింది… టీవీల్లో కూడా చేసింది… సార్వతి తిరువోతు… ఈమె మలయాళ నటి… అన్ని భాషల్లోనూ చేస్తుంది గానీ తన […]
అనుభవాలే జ్ఞాపకాలు… జ్ఞాపకాలే కథలు… కథలే మనం..!
… చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది. … ఇది చాలా సింపుల్గా కనిపించే చాలా కాంప్లికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు, ట్విస్టులు గట్రా ఉంటాయి. కాబట్టి మనం […]
తంగలాన్… హీరో విక్రమ్ ఓ సాహసి… తాజాగా తనకు భలే దొరికాడు పా.రంజిత్…
కొన్ని సినిమాలను, కొందరు హీరోలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి… ఎలాంటి సినిమాలు అంటే డిఫరెంట్ కాన్సెప్టులతో… రెగ్యులర్ మూస, ఫార్మాట్, హైపర్ హీరోయిజం కథలకు భిన్నంగా వచ్చేవి… అవి సాహసాలు… తీసే దర్శకుడికి, తీయించే నిర్మాతకు… అలాంటి సినిమాయే ఈ తంగలాన్ కూడా… ఎక్కడా సగటు కమర్షియల్ పోకడకు దారిమళ్లకుండా… కథను స్ట్రెయిట్గానే చెబుతూ ఎక్కడా డీవియేషన్ లేకుండా సాగింది… కబాలి వంటి కథతో అందరి దృష్టినీ ఆకర్షించిన పా.రంజిత్ ఈసారి భారీ సినిమాను భుజానికెత్తుకున్నాడు… చాలావరకూ సక్సెసయ్యాడు… […]
ఆ నలుగురు మహిళలూ కలిసి చేసిన పెళ్లి… monsoon WeDDING…
ఆ నలుగురాడాళ్లూ కలిసి చేసిన పెళ్లి … భారతీయ సినిమాలు (ముఖ్యంగా దక్షిణాది సినిమాలు) పెళ్లిని చాలా రొమాంటిసైజ్ చేశాయి. పందిళ్లు, పసుపు కుంకుమ పళ్లేలు, అగ్నిహోత్రం, ఏడడుగులు, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం.. అబ్బో ఎన్నని! నిండా నవ్వుతూ, తుళ్లుతూ ఆడిపాడే ముఖాలు. అవి చూసి, వాటిని మళ్లీ మళ్లీ చూసి, ఇంకా ఇంకా చూసేసి తమ పెళ్లీ అలాగే కావాలని ఆశపడటం మనకొక Traditional Fantasy. కానీ నిజంగా పెళ్లి అలా జరుగుతుందా? అంత హాయిగా […]
లైగర్ రేంజ్ నాసితనం కాదు గానీ… 5జీ యుగంలోనూ 2జీ, 3జీ ధోరణిలోనే పూరి..!!
ఓ ఎన్ఆర్ఐ మిత్రుడు చెప్పినట్టు… ‘‘Anna Karenina నవలని Leo Tolstoy “All happy families are alike; each unhappy family is unhappy in its own way” అని మొదలు పెడతాడు… అలా, బాగున్న సినిమాలకన్నా బాగాలేనివి ఎందుకు బాగాలేవో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సినిమా చూడొచ్చు…’ ఏ సినిమా..? అదే… డబుల్ ఇస్మార్ట్… ఆమధ్య హిట్టయిన డ్యుయల్ సిమ్ బుర్రల మార్పిడి కథతో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది సీక్వెల్… […]
- « Previous Page
- 1
- …
- 12
- 13
- 14
- 15
- 16
- …
- 121
- Next Page »