.మీరు ఒక హోటల్‌కు వెళ్లారు… అదిరిపోయే రేట్లు… తీరా చూస్తే ఫుడ్ పరమ దరిద్రం… బిల్లు కట్టాక కడుపు మండి తిట్టుకుంటున్నారు… ఆ హోటళ్లో బోళ్లు తోముకుని, టేబుళ్లు క్లీన్ చేసే క్లీనర్ ఒకడికి రోషం పుట్టుకొచ్చి… ఆ వినియోగదారుడిని ఉద్దేశించి…‘ ‘పిత్తుకన్నా దరిద్రం, మీరేమిట్రా… కనీసం ఒక్క ఇడ్లీ బండి కూడా నడపలేనోడు వచ్చి హోటళ్ల తిండి గురించి మాట్లాడుతున్నారు… హోటల్ నడపడం ఎంత కష్టమో తెలుసారా మీకు… క్రిముల దొడ్డి తింటారురా మీరు..? దరిద్రానికి […]
ప్రాణం ఖరీదు… ఓ మెగా తెలుగు ఫిలిమ్ ఎస్టేట్ నిర్మాణానికి ఇది బొడ్రాయి…
. ఈ ప్రాణం ఖరీదు సినిమా గురించి చెప్పటానికి చాలా విశేషాలే ఉన్నాయి . మెగా స్టార్ చిరంజీవి మొదట సంతకం చేసిన సినిమా పునాదిరాళ్ళు . కానీ మొదట రిలీజ్ అయిన సినిమా ఈ ప్రాణం ఖరీదు . ఓ గొప్ప కేరెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు నటించిన మొదటి సినిమా . మరో విశేషం ఏమిటంటే ఈ ప్రాణం ఖరీదు నాటకంలో విలన్ రావు గోపాలరావు పాత్రను కోట శ్రీనివాసరావే నటిస్తూ ఉండేవారు . […]
ఇది తెలంగాణ లగ్గమా..? మరీ కృతకంగా నటీనటుల యాస… ఓ ప్రయాస…!!
లగ్గం… ఈ సినిమా చూశాక ఓ విరక్తి ఏర్పడింది… గతంలో తెలంగాణ యాసను పనిమనుషులకు, వీథి రౌడీలకు, కమెడియన్లకు పెట్టి ఇన్నేళ్లూ అపహాస్యం చేశారు… వెక్కిరించారు… పకపక నవ్వారు… తెలంగాణ భరించింది… ఇప్పుడు తెలంగాణ యాస, ప్రాంతం, నేపథ్యం అన్నీ ట్రెండింగ్… దాంతో డబ్బు కోసం తెలంగాణతనాన్ని కావాలని తెచ్చిపెట్టుకుంటున్నారు కొందరు నిర్మాతలు… ప్రేమ కాదు, అవసరం, ప్రేమ ఉండే సవాలే లేదు… జస్ట్, స్వార్థం… బలగం, దసరా మాత్రమే కాదు, ఆమధ్య ఫుల్లు కరీంనగర్ బ్యాక్ […]
బుజ్జమ్మ అనన్య మూవీ కాదు… అక్షరాలా ఇది విలన్‌గా అజయ్ సినిమా…
. పొట్టేల్… నిజానికి ఈ సినిమాకు కాస్తోకూస్తో హైప్ దొరికింది ఓ లేడీ రిపోర్టర్ అత్యంతాతి తెలివిగా అడిగిన కాస్టింగ్ కౌచ్ ప్రశ్నతో… దానికి అనన్య నాగళ్ల పరిణతిలో, బ్యాలెన్స్డ్గా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో, మీడియాలో హైలైట్ అయ్యింది… బాగా వార్తల్లో నలిగింది సినిమా… అది స్క్రిప్టెడ్, ప్లాన్డ్ ప్రశ్నో కాదో తెలియదు గానీ అది సినిమా ప్రమోషన్‌కు మాత్రం బాగానే ఉపయోగపడింది… ప్రమోషన్ వర్క్ కూడా బాగానే చేసుకున్నారు… జనంలోకి ఈ సినిమా గురించి… […]
నరుడి బ్రతుకు నటన..! మసాలా కాదు, ఆలోచింపజేసే డిఫరెంట్ మూవీ..!
. నరుడికి నటన అనివార్యం. కొన్నిసార్లు తనతో కొన్నిసార్లు ఎదుటివారితో, మరికొన్నిసార్లు చుట్టూ ఉన్న సమాజంతో. నటన ఎక్కువైతే భ్రమలు చుట్టుముడతాయి. ఆకాశంలో తేలుస్తాయి. ఆకాశం నుంచి నేలమీదకు రావాలంటే వాస్తవాన్ని కళ్ళముందుకు తీసుకురాగలిగే ఉత్ప్రేరకం కావాలి. ఆ ఉత్ప్రేరకం మనిషి మాత్రమే కానక్కర్లేదు. ఒక సంఘటన, ఒక దృశ్యం, పుస్తకం, సినిమా ఏదైనా కావొచ్చు. అయితే బయటినుంచి బయటినుంచి వచ్చే మార్పు తాత్కాలికం. నిజమైన మార్పు తెలియాలంటే నిన్ను నువ్వు వెతుక్కుంటూ ప్రయాణం చెయ్యాలి. అదే […]
రాజమౌళి ఈగ జస్ట్, డిజిటల్… కానీ చిన్నప్ప దేవర్ నిజప్రాణులతో సర్కస్ చేయిస్తాడు…
పాము , తేలు , పొట్టేలు , ఏనుగు , సింహం కాదేది సినిమాకు అనర్హం . ముఖ్యంగా శాండో చిన్నప్ప దేవరుకు … భారత సినీ రంగంలో నిజమైన జంతువులనే హీరోలుగా పెట్టి చాలా సినిమాలను తీసిన నిర్మాత ఈ చిన్నప్ప దేవర్ . జంతువులను మచ్చిక చేసుకోవటం , వాటితో కనెక్ట్ కావటం ఆయనకు ఎలా ప్రాప్తించాయో తెలియదు . బహుశా భగవద్దత్తం అయి ఉండాలి . By the way , ఆయన […]
ష్…! ఆ సిన్మాలో నటించకపోవడమే చిరంజీవి ఆరోగ్య రహస్యం..!!
జే గంటలు అనే సినిమాకు సంబంధించిన విషయాలు చాలా ఇంట్రస్టింగ్ వే ఉన్నాయి. విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా వెళ్లాడు. విచిత్రమేమంటే తర్వాత రోజుల్లో చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మగమహారాజు లాంటి హిట్స్ తీసిన విజయబాపినీడు హీరోగా చిరంజీవిని కాదన్నారు. […]
ముగ్గురు దోస్తులు కలిసుంటారు, విడిపోతారు, కలుసుకుంటారు… కథ ఇంతే.., కానీ..?
. స్నేహమేరా జీవితం…! దిల్ చాహ్తా హై…! ఆకాష్, సమీర్, సిద్దార్థ్ ముగ్గురు స్నేహితులు. కలిసుంటారు, విడిపోతారు, కలుసుకుంటారు. సినిమా కథ ఇంతే..! కానీ…., ఆ మూడు గంటల మూడు నిమిషాల సినిమాలో ఓ మూడు నిండు జీవితాల చరిత్రంతా ఉంటుంది..! విడిపోవన్న భరోసా ఉన్న బంధాలు చాలా ధృడంగా ఉంటాయి. ప్రపంచం మొత్తానికీ వాళ్ల స్నేహపు గాఢత తెలుసు. ఐనా ఒకర్నొకరు వెక్కిరించుకుంటారు; ఎగతాళి చేసుకుంటారు; “చంపేస్తారొరేయ్..!” అంటూ బెదిరించుకుంటారు. ఒకరికోసం ఒకరు అలవోకగా చావడానికి […]
డౌటేముంది..? ఆ కమలహాసన్కన్నా మన చంద్రమోహనుడే బాగా చేశాడు..!!
చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీక 1978 లో వచ్చిన ఈ పదహారేళ్ళ వయసు సినిమా . శ్రీదేవిని స్టార్ హీరోయిన్ని చేసి జయప్రద , జయసుధల సరసన నిలబెట్టిన సినిమా . రాఘవేంద్రరావు ప్రభంజనాన్ని కొనసాగించిన సినిమా . సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో వంద రోజులు అడి సూపర్ డూపర్ హిట్టయిన సినిమా . తమిళంలో హిట్ సినిమా 16 వాయతినిలెకు రీమేక్ మన పదహారేళ్ళ వయసు సినిమా . తమిళంలో శ్రీదేవి , […]
ఎన్టీయార్ సమర్పించిన సినిమా… ఐనా సరే… జస్ట్, ఓ అతిథి పాత్రలో హుందాగా…
. దారి తప్పిన బాలల్లారా , దగాపడిన యువకుల్లారా ! చెడు అనవద్దు , చెడు వినవద్దు , చెడు కనవద్దు , ఇది బాపూజీ పిలుపు , ఇదే మేలుకొలుపు . అద్భుతమైన సాహిత్యం , యస్ జానకి మెలోడియస్ వాయిస్ . సి నారాయణరెడ్డి విరచిత ఈ పాట 1978 జనవరి 13 వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజయిన ఈ మేలుకొలుపు సినిమా లోనిదే . విద్యా సంస్థల ఫంక్షన్సులో , ప్రజాహిత […]
నిత్యామేనన్ Vs సాయిపల్లవి… సోషల్ మీడియా పెట్టిన పెంట పంచాయితీ..!!
. పెంట పంచాయితీలు పెట్టడంలో సోషల్ మీడియాను మించింది లేదు… కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి… ‘‘నిత్యామేనన్‌కు జాతీయ అవార్డు రావడంపై సాయిపల్లవిలో అసహనం పెరిగింది… ఆమెలో ఆగ్రహం, అసంతృప్తి మొదలైంది… అందుకే సోషల్ మీడియాలో సాయిపల్లవి ఫ్యాన్స్ నిత్యామేనన్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు… సాయిపల్లవి ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ మీద నిత్యామేనన్ కూడా అసహనంగా ఉంది… పలు ఇంటర్వ్యూలలో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కింది…’’ ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి… ఆ ట్రోలింగ్ సారాంశం ఏమిటంటే..? ‘‘అసలు ఆమెకు […]
ఓ సాదాసీదా మూస కథకు మల్లెమాల మార్క్ ట్రీట్మెంట్…
సోగ్గాడు శోభనాద్రి లాంటి సినిమా ఈ నాయుడుబావ సినిమా . ప్రముఖ నిర్మాత , దర్శకుడు , కవి మల్లెమాల యం యస్ రెడ్డే 1978 లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత , దర్శకుడు , మాటల పాటల స్క్రీన్ ప్లే రచయిత . కధ రొటీనే అయినా ఆయన బాణీలో ఆయన తీసారు . ఓ కోటీశ్వరుడయిన తాతగారు , ఆయనకో ముద్దుల మనమరాలు , ఆస్తి మీద హీరోయిన్ మీద కన్నేసిన ఓ […]
‘సినిమాల్లోకి వచ్చిందంటే చాలు… ఇక ఆ మహిళ నీచమైన పదార్థమేనా..?’
. జర్నలిజం చాలా గొప్ప వృత్తి.. కానీ Thankless Job కూడా.. ఎందుకంటే, జనాల మనసుల్లో ఉన్న వికృతమైన ప్రశ్నలన్నిటినీ తమ భుజాలకెత్తుకుని వాటికి జవాబులు బైటికి తీసుకొచ్చే ప్రయత్నంలో తమ ఇండివిడ్యువల్ ఇంటెగ్రిటీని, మానవతా వలువలను కూడా ఒక్కోసారి విడిచేయాల్సి రావడం.. చాలా దారుణమైన పరిస్థితి.. That’s why I respect them a lot.. మొన్న ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా అనన్య నాగళ్లను ఒక మహిళా విలేఖరి తెలుగు ఫిలిమిండస్ట్రీలో కమిట్మెంట్ గురించి […]
అసలు ఎవరు ఈ నిమ్రత్ కౌర్..? అంతటి ఐశ్వర్యాన్ని మించి ఏం ఆకర్షణ..!!
నిజానిజాలపై ఆ ఇద్దరిలో ఎవరూ నోరు మెదపరు… తను ఎందుకు అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని వదిలేసి వచ్చిందో ఐశ్వర్యా రాయ్ చెప్పదు… ఎందుకు తమ నడుమ దూరం పెరిగిందో అభిషేక్ బచ్చన్ కూడా చెప్పడు… ఈలోపు వార్తలు మాత్రం వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు… ఇక పొసిగే పరిస్థితే లేదు అని రాసేస్తున్నారు… నో, నో, మళ్లీ ఒక్కటయ్యారు, ఆ విభేదాలు వదిలేశారు అని కొన్ని వార్తలు… ఇండస్ట్రీ అంటే గాసిప్స్, రూమర్స్ సహజం… బ్రేకప్పులు, వివాహేతర […]
అనుభవాలకు ఆది కావ్యం అడదాని జీవితం… ఆ రూపలాగా ఎందరో..!!
అవార్డులు వచ్చాయంటే డబ్బులు వచ్చి ఉండవు . డబ్బులు వచ్చాయంటే అవార్డులు వచ్చి ఉండవు . అవార్డులు డబ్బులు ప్రాప్తం ఉన్న నిర్మాతలు , పేరు తెచ్చుకున్న దర్శకులు కొద్ది మందే ఉంటారు . 1978 లో వచ్చిన ఈ నాలాగా ఎందరో సినిమా మొదటి కోవకు చెందింది . మూడు అవార్డులు వచ్చాయి . బాలసుబ్రమణ్యానికి మొట్టమొదటి నంది అవార్డు ఈ సినిమా ద్వారానే వచ్చింది . ఆ తర్వాత కుప్పలుకుప్పలు వచ్చాయనుకోండి . ఉత్తమ […]
నిజంగానే ఈ సినిమా మరో చరిత్ర..! బాలచందర్ ఏదైనా బ్రేక్ చేయగలడు..!
మరో చరిత్రను సృష్టించిన మరో చరిత్ర సినిమా . వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వందల రోజులు ఆడే రోజుల్లో ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక ‘సాదాసీదా సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా వందల రోజులు ఆడటమంటే మరో చరిత్ర కాక మరేమిటి ! చరిత్రలో అప్పటివరకు లైలా మజ్ను , సలీం అనార్కలి , రోమియో జూలియట్ […]
ఆమెకు అది చాలా పెద్ద సర్టిఫికెట్..! అనుకోకుండా ఓ అరుదైన విశేష ప్రశంస..!
మణిరత్నం… తన పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేది తక్కువే… మాట్లాడేదీ తక్కువే… వార్తల తెరపైనా తక్కువగా కనిపిస్తుంటాడు… తన పనేదో తనది… సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు పొగుడుకోవడమూ ఎక్కువే… కానీ ఆయన ఎవరినీ పెద్దగా అభినందించడు, ప్రశంసించడు… తన కెరీర్లో చాలామంది మంచి ప్రతిభ ఉన్న నటీనటులను చూశాడు, పనిచేయించుకున్నాడు… ఎవరి నటనను ఏ పాత్రకు ఎలా పిండుకోవాలో తనకు బాగా తెలుసు… అందుకే తను ఏకంగా నటి సాయిపల్లవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవడం ద్వారా అందరినీ […]
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ..! అసందర్భ ప్రశ్నలతో అద్భుత పాత్రికేయం..!!
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ… సినిమావాళ్లు ఎలాగూ దొరికారు కదాని కొందరు ఫిలిమ్ జర్నలిస్టులు ఏవేవో ప్రశ్నలు వేస్తూ, చివరకు సినిమావాళ్లు ప్రెస్మీట్లు అంటేనే చికాకుపడే సిట్యుయేషన్ తీసుకొస్తున్నారు ఈమధ్యకాలంగా..! సినిమాకు సంబంధం లేని ప్రశ్నలు, ఏవో గెలికి, ఏదో రాబట్టే విఫల ప్రయత్నం చేసి, హబ్బ, భలే అడిగాం ప్రశ్నల్ని అనుకుని వాళ్లే భుజాలు చరుచుకునే విచిత్ర ధోరణి… సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కూడా మినహాయింపేమీ కాదు… తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్య నాగళ్ల ఓ లేడీ రిపోర్టర్ […]
పేరున్న మొహాల కోసం బలగం వేణు తన్లాట… అక్కడే అసలు తప్పు…
ఎమోషన్స్‌ను తెరపై బలంగా ప్రజెంట్ చేయగల ఓ దర్శకుడు వేణులో ఉన్నాడని చాలామందికి బలగం సినిమా వచ్చేవరకూ తెలియదు… అప్పటిదాకా తను జస్ట్, ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్ మాత్రమే… కానీ బలగం వచ్చాక తనలో రియల్ టాలెంట్ లోకానికి అర్థమైంది… తనను ఐదారు మెట్లు ఎక్కించింది ఆ సినిమా ఒకేసారిగా… వోకే, గుడ్, ట్రెమండస్… ఫస్ట్ సినిమా తనను ఇండస్ట్రీలో నిలబెట్టింది… కానీ వాట్ నెక్స్ట్..? అసలు పెద్ద పెద్ద దర్శకులకు ద్వితీయ గండం ఉంటుంది… […]
పురాణాల్ని సోషలైజ్ చేయడం బాపుకు అలవాటే… ఈ కథ కూడా అంతే…
బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ & క్లాసిక్ సినిమా మన వూరి పాండవులు… . పాండవులు అనో , లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు . టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది . భారతంలో పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా అయిదుగురు పాండవులు , ఓ దుర్యోధన+ దుశ్శాసనుడు ఉంటాడు , ఓ శకుని ఉంటాడు […]
- « Previous Page
- 1
- …
- 23
- 24
- 25
- 26
- 27
- …
- 130
- Next Page »