పేరు, ఊరు ఎందుకు లెండి గానీ… ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్… తన పేరు వినగానే బాదుడు గుర్తొచ్చేది… దొంగల నుంచి సమాచారం రాబట్టడంలో రోకలిబండను విపరీతంగా వాడేవాడు… హత్య కేసు, దొమ్మీ కేసు, హత్యాయత్నం కేసు, చోరీ కేసు… ఏదైనా సరే, అనుమానితుల్ని పట్టుకొచ్చేవారు… లాకప్పే ఇంటరాగేషన్ సెల్ అయ్యేది… ఆ దెబ్బలకు తాళలేక నేరాన్ని అంగీకరించేవాళ్లు లేదా నేర సమాచారం మొత్తం చెప్పేవాళ్లు… ఆయన దంచుడు మీద కథలుకథలు ఉండేవి… అఫ్కోర్స్, మన ఇండియాలోనే కాదు, […]
అస్తు… మూవీ మొత్తం మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత…
Sai Vamshi…….. కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి […]
నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి… నన్ను ఎవరో చూచిరి, కన్నె మనసే దోచిరి…
Subramanyam Dogiparthi……. చాలా మంచి సినిమా . సినిమాలను విషాదాంతం , ప్రశ్నార్ధకం చేయడంలో ఆనందం పొందే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన feel good movie . దయతో సుఖాంతం చేసారు . ప్రసాద్ ఆర్ట్స్ బేనర్లో 1969 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది . సత్తెయ్యగా చలం , అతనిని అభిమానించే పాపగా అప్పటి బేబీ రోజారమణి బాగా నటించారు . వీరిద్దరితో […]
రజినీకాంత్ బిడ్డ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేయబోయింది… తనే తెల్లబోయింది…
అప్పట్లో మోహన్‌బాబు సినిమా ఏదో వచ్చింది… అందులో తనతోపాటు మీనా, శ్రీకాంత్, ప్రజ్ఞా జైస్వాల్, తనికెళ్ల భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్, రఘుబాబు, సునీల్, రాజారవీంద్ర, బండ్ల గణేష్, రవిప్రకాష్, నరేష్, పోసాని, రాజీవ్ కనకాల నటీనటులు… చిరంజీవి వాయిస్ ఓవర్… సో, ఎలా ఉండాలి…? కానీ సూపర్ బంపర్ డిజాస్టర్… నటీనటులను అలా పిలిచి ఏదో నటింపజేసి, మిగతా సీన్లకు వెనుక నుంచి ఎవరినో చూపిస్తూ, ఏదో ప్రయోగం అన్నట్టు బిల్డప్ ఇస్తూ, ఏదేదో […]
కన్నడ కస్తూరి..! బెంగుళూరు టు హైదరాబాద్… ఇదొక టీవీ నటప్రవాహం…!
తెలుగు సీరియల్స్ చూసేవాళ్లకు బాగా తెలుసు ఈ విషయం… దాదాపు కన్నడ టీవీ తారలే డామినేట్ చేస్తున్నారు… తప్పు కాదు, వాళ్లకు ఆ మెరిట్ ఉంది… ప్రూవ్ చేసుకుంటున్నారు… సినిమాలకు సంబంధించి తమిళ, మలయాళ తారలు తమ ప్రతిభతో నిలదొక్కుకుంటున్నారు… కష్టపడతారు… టీవీలకు వచ్చేసరికి మాత్రం కన్నడ తారలే… అన్నింటికన్నా ముఖ్యంగా త్వరగా తెలుగులో ఫ్లూయెన్సీ సాధించేస్తారు… యాంకర్లుగా సౌమ్యారావు వంటి కన్నడ మొహాలు ఫెయిలైనా సరే… సీరియల్స్‌లో మాత్రం వాళ్లదే హవా… తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ […]
కాంతారావు తెలంగాణావాడని ప్రచారం జరిగి ఆంధ్రాలో దెబ్బేసింది..!!
Subramanyam Dogiparthi…. పౌరాణిక జానపద సినిమా . భార్య హేమ పేరుతో కాంతారావు ప్రారంభించిన హేమా ఫిలింస్ ఆధ్వర్యంలో నిర్మించిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ సప్తస్వరాలు సినిమా . ఆరోజుల్లోనే ఆరు లక్షల రూపాయల నష్టం వచ్చిందట . కర్ణుడి చావుకు ఆరు కారణాలని అంటారు . అలాగే నష్టం ప్రాప్తమయితే అన్ని వైపుల నుండి నష్టకష్టాలు చుట్టుముట్టుతాయి . ఈ సినిమా రిలీజప్పుడే చెన్నారెడ్డి గారి సారధ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం […]
ఓపెన్ హైమర్… ఏడు ఆస్కార్ అవార్డులు ఊరికే రాలేదు మరి..!!
ఓపెన్ హైమర్… ఈ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి ఈసారి… దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రతిభ ఆ సినిమాలో ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది… అందరికీ తెలిసిన కథే అయినా ఆసక్తి తగ్గకుండా మంచి ప్రజెంటేషన్ మీద దృష్టి పెట్టాడు… నిజానికి ఇంకా ఎక్కువ అవార్డులే వస్తాయని సినిమా ప్రేక్షకులు కూడా అంచనా వేశారు… నోలన్‌కు ఆస్కార్ కొత్తేమీ కాదు.,. కానీ గన్ షాట్‌గా ఈ సినిమాకు ఈసారి అవార్డుల పంట గ్యారంటీ అని ఊహిస్తున్నదే… […]
చివరలో దర్శకుడు ఆవేశం తగ్గించుకుని ఉంటే… ఈ మూవీ రేంజ్ మరోలా ఉండేది…
Aranya Krishna…. చూడదగ్గ సినిమా! తెలుగులో వస్తున్న సినిమాలు చూస్తుంటే ఎందుకింత భావ దారిద్ర్యం అనే నిరాశ ఎప్పుడూ వెంటాడేది. ఆఫ్ బీట్, ఆర్ట్ సినిమాల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం కమర్షియల్ సినిమాల్లో కూడా ఏ మాత్రం సృజనాత్మకత కనిపించదు ఏవో కొన్ని ఫార్ములా లెక్కలు మినహా! మధ్యమధ్యలో ఒకరిద్దరు దర్శకులు తళుక్కున మెరిసినా వారిని ఏ పెద్ద హీరోనో ఎత్తుకుపోయి ఫార్ములా సినిమాలు తీయిస్తాడు. ఇంక వాళ్లు కూడా రొటీన్ మూసల్లో ఇరుక్కుపోతారు. […]
అబ్బే, అందరూ అనడమే తప్ప ఆ గామిలో ఏముందండీ అసలు..?!
Nàgaràju Munnuru…. == గామి == అసలు ఈ సినిమాను విష్వక్సేన్ ఏం చూసి ఒప్పుకున్నాడో తెలియదు! దర్శకుడు ఏం చెప్పాలి అని సినిమా తీసాడో అంతకంటే తెలియదు. టీవీ రిమోట్ కోసం ఇంట్లో పిల్లలతో గొడవ పడలేక ఆవేశంగా నేను ఒక్కడినే థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తాను అని వెళ్లినందుకు నాకు తగినశాస్తి జరిగింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కథ ఏముంది అసలు నా బొంద!? మూడు కథలు ప్యారలల్ నడుస్తుంటాయి.. […]
శెభాష్ సత్యం, శెభాష్ కృష్ణ… 1969లోనే ఓ సైన్స్ ఫిక్షన్ రోల్…
Subramanyam Dogiparthi….. మనసు కవి ఆత్రేయ వ్రాసిన సైంటిఫిక్ ఫిక్షన్ కధ . చేయని నేరం తన మీద పడితే , తప్పించుకోవటానికి సైంటిస్ట్ అయిన మేనమామ కనిపెట్టిన అదృశ్యమయ్యే ద్రావకం తాగుతాడు హీరో కృష్ణ . దీన్ని ఆసరాగా తీసుకొని విలన్ సత్యనారాయణ హీరో పేరుతో నేరాలు చేస్తుంంటాడు . విరుగుడు ద్రావకం తాగి , విలన్ ఆట కట్టించటమే ఈ సినిమా కధ . బాగానే ఆడింది . ఇలాంటి కధాంశంతో హిందీలోనో , […]
కథ బాగుండగానే సరిపోదు… దానికి సరిపడా సీన్లు పడాలి… పండాలి…
The Art of Scene Creation.. రచయిత్రి కె.సుభాషిణి 2013లో సాక్షి ఫన్డేలో ‘లేడీస్ కంపార్ట్మెంట్’ అనే కథ రాశారు. What a wonderful Story! గొప్ప కథలు ఒక్కోసారి ఎక్కువమందికి తెలియకుండానే మరుగున పడతాయి. అటువంటి మేలిమి కథ అది. ఆడ కూలీలంతా మేస్త్రమ్మ(మేస్త్రీ భార్య)తో కలిసి రైల్లో ముంబయి వెళ్తూ ఉంటారు. వారితోపాటు పిల్లా జెల్లా, తట్టాబుట్టా! జనరల్ కంపార్టుమెంట్లో సీట్లు దొరక్క తలుపు దగ్గరే స్థలం చూసుకుని కూర్చుంటారంతా. కథ ఇలా మొదలవుతుంది.. […]
స్మితా పాటిల్, వాణిశ్రీ కలిసి నటించిన విశేషం… ఆరుద్ర, శ్రీశ్రీల నడుమ మంట…
Sai Vamshi…. ఒక వివాదం.. అది శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’ … ఇది చాలా పాత వివాదం. కానీ దీని గురించి ఏమీ తెలియని నాబోటి వాళ్లకు కొత్తగానే ఉండొచ్చు. … ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ 1978లో తెలుగులో ‘అనుగ్రహం’ అనే సినిమా తీశారు. అందులో స్మితాపాటిల్, వాణిశ్రీ, అనంత్‌నాగ్, అమ్రిష్‌పురి, సులబ్ దేశ్‌పాండే, నిర్మలమ్మ, రావుగోపాలరావు నటించారు. ఏకకాలంలో అదే ఆర్టిస్టులతో హిందీలో ‘కొందుర’ పేరిట ఆ సినిమా తెరకెక్కింది. అయితే తెలుగులో రావు […]
బాబోయ్ వర్మ గారి శపథం… ఇది ఆ ‘వ్యూహం’ వంటకన్నా కంపు…
ఇది ఓ సినిమా కాదు… ఆ లక్షణాలేమీ లేవు… పోనీ, రాజకీయ చిత్రమా..? అస్సలు కాదు, ప్రత్యర్థుల్ని వెకిలిగా, నీచంగా జోకర్లుగా చిత్రించడం రాజకీయ చిత్రం లక్షణమే కాదు… పోనీ, ఎన్నికల ప్రచార చిత్రమా..? అదీ కాదు… ఎందుకంటే, ఈ సినిమా తీస్తే వోట్లు వేసేవాళ్లు కూడా వేయరు… అనగా కౌంటర్ ప్రొడక్ట్… మరి దీని కేటగిరీ ఏమిటి..? ఏమో… ఇప్పటివరకూ ప్రపంచంలో ఎవరూ తీయలేని ఓ చిత్రమైన జానర్, కేటగిరీలో సినిమా పేరిట వీడియోల సంకలనం […]
ఆమె కూడా ఓ ఆడదే… తనకూ ఓ మనస్సుంది… శరత్‌బాబు కోసం తపించింది…
పక్క పరవనిదే పొట్ట నిండదు… పైట చాపనిదే పూట గడవదు… వ్యాంప్ పాత్రలు వేసేవాళ్లే కాదు, ఎక్సట్రా ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ప్రతి నటి తెర వెనుక చీకటి ఇదే… పోనీ, మెజారిటీ కేసుల్లో..! కేస్టింగ్ కౌచ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం… ఆడదాన్ని జస్ట్, ఓ అంగడి సరుకుగా, ఆ టైమ్‌కు అక్కరకొచ్చే పడక సరుకుగా భావించబడే సినిమా ఇండస్ట్రీలో స్త్రీల మీద వివక్షే కాదు, భీకరమైన లైంగిక దోపిడీ… మిగతా రంగాలేమైనా బాగున్నాయా […]
అర్చన సినిమా ‘దాసి’ షూటింగ్… ఓ తప్పనిసరి వాంతి కథ…
కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే! తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది. సినిమాలో […]
అసలే భారీ తారాగణం… పైగా ప్రముఖుల గెస్ట్ రోల్స్… కల్కి కథే వేరుంది…
మీకు మహానటి సినిమాలో ఓ విశేషం గుర్తుంది కదా… సావిత్రి కథకు సంబంధం ఉన్న ముఖ్య పాత్రలకు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో గెస్ట్ రోల్స్ చేయించాడు నాగ్ అశ్విన్… సుభద్రమ్మగా దివ్యవాణి, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, చక్రపాణిగా ప్రకాష్ రాజ్, ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, అక్కినేనిగా నాగచైతన్య, పుల్లయ్యగా మనోబాల, అలిమేలుగా మాళవిక నాయర్, సుశీలగా శాలినీ పాండే, కేవీరెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, మధురవాణి తల్లిగా తులసి, వేదాంతం రాఘవయ్యగా వంగా […]
భీమా..! పదేళ్ల గోపీచంద్ హిట్ వేటలో మరోసారి బోల్తా… మళ్లీ నిరాశ..!
సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రఘుబాబు… ఇంతమంది కమెడియన్లున్నారు… కానీ పాపం, ఏం చేస్తారు..? సరైన సీన్లు రాసి ఉంటే కదా, వాళ్లు ఏమైనా పండించడానికి..? తోడుగా హీరో గోపీచంద్ కూడా అక్కడక్కడా కామెడీలో పాలుపంచుకున్నాడు… తను సీరియస్, ఎమోషన్ సీన్లు బాగా చేస్తాడు తప్ప కామెడీ సరిగ్గా చేయలేకపోయాడు… అతికీఅతకలేదు… ఫస్టాఫ్‌లో ఒక హీరోయిన్… మరి తెలుగు సినిమా అన్నాక ఎంత భిన్నమైన కథ తీసుకున్నా, ఏ ప్రయోగం చేసినా […]
గామి..! ఆసక్తికరంగా హిమాలయ యాత్ర… విజువల్స్, బీజీఎం బాగున్నయ్..!!
గామి… ఈమధ్య ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన సినిమా… ఎందుకు..? ట్రెయిలర్లు చూస్తేనే భిన్నమైన కథాకథనాలు, విజువల్ వండర్స్ ఛాయలు గోచరించాయి గనుక… రొటీన్ మూస సినిమాల నడుమ ఓ కొత్తదనం, ప్రయోగం కనిపించాయి గనుక… క్రౌడ్ ఫండింగ్ ద్వారా అయిదారేళ్లపాటు పురుటి నొప్పులు పడిన సినిమా గనుక… కారు చౌకగా మంచి స్టాండర్డ్స్ ఔట్ పుట్ తీసుకొచ్చారు గనుక… నిజానికి హీరో విష్వక్సేన్ ఇప్పుడైతే ఈ భిన్నమైన పాత్రను అంగీకరించేవాడో కాదో తెలియదు గానీ ఆరేళ్ల క్రితం […]
మలయాళంలో తీసిన హైదరాబాద్ సినిమా… టెకీల ఓ సరదా ప్రేమకథ…
సరిగ్గా నెల రోజుల క్రితం మలయాళంలో విడుదలైంది ఈ సినిమా… పేరు ప్రేమలు… కొద్ది నెలలుగా మాలీవుడ్ చాలా జోష్ మీద ఉంది తెలుసుగా… ఈ సినిమాకు పెద్ద స్టార్ కేస్టింగ్ లేకపోయినా సరే 85 కోట్లు వసూలు చేసింది… ఓవర్సీస్లోనే 35 కోట్లు… మలయాళంలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 85 కోట్లు అంటే బంపర్ సెన్సేషనల్ హిట్ అన్నట్టు లెక్క..! అన్నట్టు నిర్మాణ వ్యయం ఎంతో తెలుసా..? జస్ట్, 3 కోట్లు..! సరే, దీన్ని తెలుగులోకి […]
ఓహో… వ్యూహం వెబ్ సీరీస్ పేరు శపథం చాప్టర్-1 గా మార్చింది అందుకేనా..?!
ఏదో పరువు దక్కించుకునే పిచ్చి ప్రయత్నం… రాంగోపాలవర్మ జగన్ అధికార ప్రస్థానం మీద వ్యూహం అనే సినిమా తీశాడు కదా… అది మొదటి ఆటకే నీటిబుడగలాగా ఫట్‌మని పేలిపోయింది కదా… అనేక థియేటర్లలో డెఫిసిట్… సరిగ్గా టికెట్లు తెగక ఆటనే ఎత్తేసిన థియేటర్లూ ఉన్నట్టు వార్తలొచ్చాయి కదా… వర్మ జాబితాలో మరో అతి పెద్ద డిజాస్టర్ చేరింది కదా… తను ఎలాగూ ఎప్పుడూ మునిగే బ్యాచ్, కానీ జగన్ పరువును కూడా నిలువునా ముంచేశాడు కదా… ఎన్నికల […]
- « Previous Page
- 1
- …
- 30
- 31
- 32
- 33
- 34
- …
- 117
- Next Page »