అల్లు అరవింద్ పెద్ద నిర్మాతే కావచ్చుగాక… పలువురు హీరోలున్న కుటుంబం కావచ్చుగాక… మెగా కాంపౌండ్‌లోని కీలకవ్యక్తే కావచ్చుగాక… కానీ ఒక ఓటీటీ రియాలిటీ షోకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రయారిటీ ఇచ్చి, వార్తలు రాస్తుందని ఎలా అంచనా వేశాడు..? కవర్ బరువును బట్టి కవరేజీ ఉంటుందనేది కరెక్టే కావచ్చుగాక… అల్లు అరవింద్ అయినా సరే కవర్ల పంపిణీ చేపట్టాల్సిందే… కానీ ఆ కవరేజీ వస్తుందని ఆశించడం నవ్వొచ్చే అంశం… విషయం ఏమిటంటే… ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ […]
నటన తెలిసిన శరత్ బాబును ఇండస్ట్రీయే సరిగ్గా వాడుకోలేకపోయింది…
మనిషి స్పూరద్రూపి… అందగాడు… ఆముదాలవలస స్వస్థలం… అచ్చమైన తెలుగు నేపథ్యం… 1973 నుంచీ, అంటే దాదాపు నాలుగైదు దశాబ్దాలు ఇండస్ట్రీలో ఉన్నా, మెరిట్ ఉన్నా సరే, తన మొత్తం సినిమాలు మహా అయితే 200 దాకా ఉంటాయేమో… అవీ హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలన్నీ కలిపి… తెలుగులో 120 వరకూ ఉంటాయి తను పోషించిన పాత్రలు… అంతే… అంటే ఇండస్ట్రీ శరత్ బాబును అలియాస్ సత్యం బాబు అలియాస్ సత్యనారాయణ దీక్షితుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే […]
షకలక శంకర్… సినిమా పొమ్మంది… జబర్దస్త్ రమ్మంది… కట్ చేస్తే రీఎంట్రీ…
జబర్దస్త్… అదొక ప్రవాహం… కొన్ని కలుస్తుంటాయి, కొన్ని విడిపోతుంటాయి… విడిపోయినవీ మళ్లీ ఎక్కడో ఎప్పుడో కలుస్తుంటాయి… కానీ టీవీ షోలు, సీరియళ్లు పాడిబర్రెల్లాంటివి… స్థిర ఆదాయాన్ని, పాపులారిటీని మెయింటెయిన్ చేస్తుంటాయి… సినిమా అవకాశాలు మాత్రం లాటరీ… లక్కు తగలొచ్చు, దెబ్బ తగలొచ్చు… అప్పుడు మళ్లీ టీవీ షోలవైపు దృష్టి సారించొచ్చు… సినిమాలే చేస్తాను, తగ్గేది లేదు అని భీష్మించుకుని పనికిరాని భేషజాలకు పోతే మొదటికే మోసం రావచ్చు, కడుపు కాలిపోవచ్చు… ఎందరో సినిమా నటులు క్షేత్ర పరిజ్ఞానంతో […]
జూనియర్‌పై అదే వివక్ష..? టీడీపీ షోగా మారిన ఎన్టీయార్ శతజయంతి ప్రోగ్రాం..!
మళ్లీ మళ్లీ అదే అదే… ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వాలి… అదే డిమాండ్… నిజంగా మదిలో ఏదైనా మెసిలి మోడీ భారతరత్న ప్రకటిస్తే..? ఎన్టీయార్ భార్య లక్ష్మిపార్వతి వెళ్లి ఆ పురస్కారాన్ని తీసుకుంటే ఇదే చంద్రబాబు సహిస్తాడా..? ఇదొక ప్రశ్న… సరే, దాన్నలా వదిలేస్తే… హైదరాబాద్ శతజయంతి ఉత్సవాలను ఆ కూకట్పల్లి పరిధిలోనే ఎందుకు నిర్వహించారు..? అక్కడైతే జనాన్ని సమీకరించడం సులభమనేనా..? ఇదీ కట్ చేయండి… తెలుగు తారాగణం వచ్చారు, కొందరు టాప్ హీరోలు, ఇండస్ట్రీ మీద పెత్తనాలు […]
రికార్డింగ్ డాన్సులు, వెగటు వేషాలకు భిన్నంగా… వీనులవిందుగా ఇండియన్ ఐడల్…
ఎస్… నిత్యామేనన్ ప్లేసులో గీతామాధురిని జడ్జిగా తీసుకోవడం, ఆమె ఏవేవో పిచ్చి వివరణలతో శ్రోతలకు పిచ్చెక్కించడం మాట ఎలా ఉన్నా… ఆహా ఓటీటీలో వచ్చే ఇండియన్ ఐడల్ తెలుగు రక్తికడుతోంది… మొదటి సీజన్‌ను మించి రెండో సీజన్ పాపులర్ అవుతోంది… మెయిన్ స్ట్రీమ్ వినోద చానెళ్లలో వచ్చే మ్యూజికల్ షోలతో పోలిస్తే ఈ ఇండియన్ ఐడల్ నాణ్యత చాలా ఎక్కువ… ప్రత్యేకించి గ్రూపు డాన్సర్లు, వెకిలి జోకులు, వేషాలు, గెంతులతో జీతెలుగు చానెల్లో వచ్చే సరిగమప షో […]
శతజయంతి తాతా మన్నించు ఈసారి… రోజులు బాగాలేవు, రాలేను నేను…
ఫాఫం… మంత్రి అజయ్ వచ్చి, మీ తాత విగ్రహం పెడుతున్నాం, నువ్వే చీఫ్ గెస్టు, నువ్వు తప్ప ఇంకెవరున్నారు, ఆయన నిజమైన వారసులు అనగానే జూనియర్ ఎన్టీయార్ పొంగిపోయాడు… ఆహా, ఎన్టీయార్ వారసుడిగా యావత్ ప్రపంచం నన్నే గుర్తిస్తోందనే ఆనందంతో… ఓసోస్, అదెంత పని… తాత శత జయంతి ఉత్సవాలకు ఎవరు ఎక్కడికి ఆహ్వానించినా వస్తాను, రావడానికి రెడీ అనేశాడు… ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహ ఆవిష్కరణకూ సై అన్నాడు… అది ఓ కులచిహ్నంగా రూపుదాల్చుకుంటోందని తనకు తెలుసో […]
న్యూసెన్స్… వర్తమాన పాత్రికేయాన్ని 1973 కాలానికి వర్తిస్తే ఎలా సార్..?
Prasen Bellamkonda……… జర్నలిస్టుల గురించి బాగా తెలిసిన, జర్నలిజం మీద బాగా కోపం వున్న వ్యక్తి తీసినట్టుంది ఈ న్యూసెన్స్ వెబ్ సిరీస్. విలేకరుల మనస్తత్వం యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ అవగాహన బాగా ఉన్న వ్యక్తి తీసినట్టుంది ఈ సిరీస్. జర్నలిజంతో దగ్గరి అనుబంధం ఉన్న వారికి బాగా నచ్చే సిరీస్ ఇది. కుక్క బిస్కెట్ల ప్రస్తావన, విలేకరుల ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే వ్యవహారం, కలిసి తిరుగుతూనే ఎవరికి వారు ఎక్స్‌క్లూజివ్ […]
ఓం… ఏటా 20 సార్లు రీరిలీజ్ అట… 28 ఏళ్లలో మొత్తంగా 550 సార్లు…
ముందుగా ఒక వార్త చదువుదాం…. ఈనాడులో కనిపించింది… ‘‘హీరోల బర్త్ డేల సందర్భంగా లేదా ఏదైనా పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పాత సినిమాల్ని రీరిలీజ్ చేస్తుంటారు… అదొక సెలబ్రేషన్… పాత చిత్రాలకు 4 కే అనే రంగు పూసి కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ కూడా ఇప్పుడు కమర్షియల్ కోణంలో ఆరంభమైంది… అభిమానులు చూసి పండుగ చేసుకుంటూ ఉంటారు… ఇది వేరే కథ… మహా అయితే ఒకట్రెండుసార్లు లేదంటే మూడునాలుగుసార్లు రీరిలీజ్ జరగడం పెద్ద […]
అబ్బే, వీడు నాటి బిచ్చగాడు కాదు… సీక్వెన్సూ కాదు… ఈ బిచ్చగాడి కథే వేరు…
ఎవరి పని వాళ్లు చేయాలి… ఈ మాటను సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఇష్టపడరు… అవసరమైతే అన్ని పనులూ తామే చేపడతారు… ఇది బహుముఖ ప్రజ్ఞ అని మనం చప్పట్లు కొట్టాలో, వేర్వేరు శాఖల నిపుణులతో సరైన ఔట్ పుట్ తీసుకోలేని వైఫల్యం అనుకోవాలో తెలియదు… విజయ్ ఆంటోనీ తాజా సినిమా బిచ్చగాడు-2 చూస్తుంటే ఇదే స్ఫురిస్తూ ఉంటుంది… నిజానికి ఈ బిచ్చగాడు… నాటి సూపర్ హిట్ బిచ్చగాడికి సీక్వెల్ ఏమీ కాదు… జస్ట్, నాటి బ్రాండ్ ఇమేజీని […]
డబ్బు పొగరుతో… కనిపించిన ప్రతి ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకున్న చిరంజీవి…
Bharadwaja Rangavajhala…….. ఇంకో బందరు డైరక్టర్ గురించి….. డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు. ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం. పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి శర్మ. ఈరంకి శర్మది మచిలీపట్నం. తండ్రి వెంకటశాస్త్రి, అన్న గోపాలకృష్ణ మూర్తి ఇద్దరూ […]
అన్నీ మంచి శకునములే… కానీ సినిమాను చెడగొట్టింది దర్శకురాలు నందినీరెడ్డి…
నిజంగానే అన్నీ మంచి శకునములే… పాజిటివ్ టైటిల్.., రొడ్డకొట్టుడు హీరో ఇమేజీ లేని హీరో… కాస్త మైండ్ ఉన్న దర్శకురాలు… ఆమె ఖాతాలో ఇప్పటికే ఓ బేబీ వంటి సినిమా… మిక్కీజేమేయర్ సంగీత దర్శకత్వం… మెరుగైన నటి, హీరోయిన్ మాళవిక నాయర్… అన్నింటికీ మించి భారీ తారాగణం… గౌతమి, వాసుకి… మరీ ముఖ్యంగా షాహుకారు జానకి… అసలు మహానటి, సీతారామంతో తమ టేస్టును ప్రూవ్ చేసుకున్న స్వప్నా దత్, ప్రియాంకా దత్… నిర్మాణవిలువలకు డబ్బు కొరత లేదు… […]
పిట్ట ముట్టింది… బలగం సినిమా మరో రికార్డు… కంగ్రాట్స్ వేణూ…
అనేక కోణాల్లో బలగం సినిమాకు తెలుగు సినిమాలకు సంబంధించి ఓ విశిష్ట స్థానం ఉంది… మూస ఇమేజీ కథలతో హీరోల కాళ్ల మీద పడి దొర్లుతున్న తెలుగు సినిమాను చెవులు పట్టుకుని కథాప్రాధాన్యం దగ్గరకు లాక్కువచ్చాడు దర్శకుడు వేణు… ఆ సినిమాను అనేక ఊళ్లలో ఫ్రీగా ప్రదర్శించారు, బోలెడు గ్లోబల్ అవార్డులు కూడా వచ్చాయి అనే అంశాలు ఎలా ఉన్నా… ఓ భిన్నమైన కథను, సమాజానికి ఉపయుక్తమైన అంశాలతో చిత్రీకరించిన వేణు పలుకోణాల్లో అభినందనీయుడు… వెకిలితనం, వెగటుతనం, […]
హిట్టయితే హీరో గారి గొప్పతనమా..? ఫ్లాపయితే దర్శకుడే పాపాలభైరవుడా..?
ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా అత్యంత ఘోరంగా ఫ్లాపయింది… నిజమే, ఫ్లాపే అని అంగీకరిస్తూ నిర్మాత సుంకర అనిల్… బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే, సరైన స్క్రీన్ ప్లే లేకుండానే సినిమా తీసేశామనీ, చేతులు కాలాయనీ చెబుతున్నాడు… ఇంకా నయం, ప్రస్తుతం ఇండస్ట్రీలో పాపాల భైరవుల్లా కనిపిస్తున్న దర్శకుల మీదకు నెపాన్ని తోసేయలేదు… అక్కడికి సురేందర్‌రెడ్డి లక్కీ ఫెలో… ’’ అఖిల్‌కు కూడా మనసులో ఎంత కోపం, అసంతృప్తి ఉన్నా… తన […]
ఈ రేడియో గిరీశం తెలుసా మీకు..? సినిమాల్లోనూ నటించేవాడు అప్పట్లో…
Bharadwaja Rangavajhala…. ఈ ఫొటోలో అబ్బాయి పేరు నటరాజు కె.వెంకటేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఆయన ఊరనుకుంటాను. ఆయన బెజవాడ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రైల్వే ఉద్యోగులతోనే రసన సమాఖ్య పేరుతో ఓ నాటక సంస్ధ నిర్వహించేవారు. అలా కొంత కాలం విజయవాడలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో డి.వి.నరసరాజు రాసిన నాటకం లో రామానుజం పాత్ర లో నటించారు , నిజానికి అప్పటికే ఆయన నటుడుగా తనేంటో నిరూపించుకున్నారు. కీర్తిశేషులు, కన్యాశుల్కం తదితర నాటకాలతో పాపులర్ […]
ఉగ్రం అంటే… ప్రేక్షకుల మీదకు ఉగ్రంగా విరుచుకుపడటమేనా నరేష్…
కొన్ని స్టెప్పులు చిరంజీవి వేస్తుంటేనే తెరపై భలే కనిపిస్తయ్… కొన్ని డైలాగులు బాలకృష్ణ పలుకుతుంటేనే అదిరిపోతయ్… కొన్ని ఫైట్లు ఏ రాంచరణో, ఏ జూనియర్ ఎన్టీయారో, ఏ ప్రభాసో చేస్తుంటే వాటి ‘పంచ్’ ఓ రేంజులో ఉంటుంది… కానీ అఖండ డైలాగులు సునీల్ పలికితే… వానా వానా వెల్లువాయే స్టెప్పులు బెల్లంకొండ వేస్తే… ఛత్రపతి ఫైట్లు అల్లరి నరేష్ చేస్తే… చేయకూడదని కాదు, బాగుండదని కాదు… కానీ ఓ కామెడీ స్టార్ సీరియస్ స్టార్‌గా రూపాంతరం చెందే […]
‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహా కథ కాదు… ‘ది కేరళ స్టోరీ’ గమనమే పూర్తిగా డిఫరెంట్…
పార్ధసారధి పోట్లూరి ……….. The Kerala Story ! ఫస్ట్ హాండ్ రివ్యూ ! The Kerala Story సినిమా దర్శకుడు : సుదీప్తో సేన్ [Sudepto Sen] నటీ నటులు : ఆదా శర్మ, యోగీత బిహానీ తదితరులు. సినిమా నిడివి [రన్ టైమ్ ] 138 నిముషాలు. ముందుగా సినిమాలో ఎక్కడా కూడా 32,000 మంది కేరళ నుండి ISIS టెర్రర్ గ్రూపులో చేరినట్లు చెప్పలేదు, చూపించలేదు. ఆ ప్రచారం అబద్ధం. దర్శకుడు ముందుగా […]
గోపీచంద్… నీ సినిమాను ఎందుకు చూడాలో ఒక్క పాయింట్ చెప్పగలవా..?!
మనం ఇంతకు ముందు కొన్నిసార్లు చెప్పుకున్నాం… ఫాఫం, అంతటి పేరున్న దర్శకుడు టి.కృష్ణ కొడుకు గోపీచంద్ ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో పడి, తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో…! ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’, ఆరడుగుల బుల్లెట్ ఎట్సెట్రా తన సినిమాల దురవస్థకు కారణాలేమిటో అన్వేషించుకోలేని దుస్థితిని కూడా ప్రస్తావించుకున్నాం… గోపీచంద్ పనైపోయింది అనే పరిస్థితికి […]
ఓహో… ప్రభాస్ రాబోయే సినిమా ప్రాజెక్టు కె కథకు ఇదేనా స్పూర్తి..?!
చాలా కాలం క్రితం Elysium సినిమాపై సోషల్ మీడియా మిత్రులు రివ్యూలు రాశారు… తమ అభిప్రాయాల్ని మిత్రులతో షేర్ చేసుకున్నారు… ప్రభాస్ రాబోయే ప్రతిష్ఠాత్మక సినిమా Project-K కు ఈ ఇంగ్లిష్ సినిమా inspiration అనే వార్తలు వస్తున్నాయి… నిజమో కాదో తెలియదు కానీ… ఈ నేపథ్యంలో…… అసలు ఆ ఇంగ్లిషు సినిమా కథేమిటి..? ఓసారి ఫేస్బుక్లో Prakash Surya పేరిట వచ్చిన ఓ పోస్టు చూద్దాం… “Elysium 2013” చాలా రోజుల తరువాత, చూసాను, అయినా ఫ్రెష్ గానే […]
బలగం దర్శకుడు వేణుకు అవమానం… అదీ దర్శకుల సంఘం చేతిలో…
అందరితో కన్నీళ్లు పెట్టించినవాడు… ఊరూరా ప్రత్యేక ప్రదర్శనలతో నీరాజనం పట్టించుకున్నవాడు… ఓ ప్రాంత సంస్కృతికి పట్టం గట్టినవాడు… కుటుంబబంధాల విలువను చెప్పినవాడు… అలాంటి బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణుకు ఓ పరాభవం… ఆ ఇండస్ట్రీయే అంత అనుకోవాలా..? లేక ఇక్కడ కూడా దిల్ రాజు పైత్య ప్రదర్శన పనిచేసిందనుకోవాలా..? వివరాల్లోకి వెళ్తే… ఓ ఫోటో కనిపించింది… ఏమిటయ్యా అంటే, డైరెక్టర్స్ డే సందర్భంగా తెలుగు ఫిలిమ్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కొన్ని ప్రశంసా పురస్కారాలను ప్రకటించిందట… అసలు […]
మీ దుంపతెగ… ఓ చిన్న స్పాట్ వార్తలో ఇంత డప్పు మోతలెందుకు బ్రో…
చిన్న విషయమే … చాలా చిన్న విషయమే… కానీ మన సినిమా వార్తల కవరేజీ తీరు అర్థం చేసుకోవడానికి ఓ క్లాసిక్ అన్నం మెతుకు ఇది… నవ్వొచ్చింది… తరువాత జాలేసింది… సినిమా కవరేజీ అంటేనే డప్పు… కవర్ బరువును బట్టి కవరేజీ… ప్రెస్ మీట్ అంటేనే తలతిక్క ప్రశ్నలు… సినిమా జర్నలిస్టుల్లో పేరుపొందినవాళ్ల ప్రశ్నల తీరు చూస్తుంటే థూ వీళ్లా ప్రముఖ జర్నలిస్టులు అనిపించేలా ఉంటున్నాయి… చివరకు ఆ డప్పు మోతల్ని కూడా హెడ్ వాయిస్‌లో, హైపిచ్‌లో […]
- « Previous Page
- 1
- …
- 60
- 61
- 62
- 63
- 64
- …
- 126
- Next Page »