Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో… ఆడవాళ్ల కన్నీళ్లతో తెర తడిసిపోతేనే మహిళాచిత్రం…

April 18, 2024 by M S R

Sharada

Subramanyam Dogiparthi…. మహిళలు మెచ్చిన చిత్రం . సినిమాలో ఆడవారికి ఎంత ఎక్కువ కష్టాలు ఉంటే , ఆ సినిమాను మహిళలు అంత ఎక్కువగా ఆడిస్తారు అనే వారు 1970 ల దాకా . ఆ తర్వాత మహిళా ప్రేక్షకుల సినిమా అభిరుచుల్లో మార్పు వచ్చింది . బహుశా మహిళల హక్కులు , రక్షణ వంటి అంశాలలో కూడా క్రమంగా మార్పులు వచ్చాయనుకోండి . అన్నపూర్ణ వారి బేనర్లో డి మధుసూధనరావు నిర్మాణంలో చాలా కుటుంబ కధా […]

నో నో… రెజీనాకు నచ్చాడంటే సాయిధరమ్ మ్యాగీ బాయ్ కాదన్నమాటే…

April 18, 2024 by M S R

regina

రెజీనా కసాండ్రా… మెరిట్ ఉన్న నటే గానీ కావల్సినంతగా పాపులర్ కాలేకపోయింది ఇండస్ట్రీలో… అందగత్తే… సాయిధరమ్‌తేజ… ఈ మెగా క్యాంపు హీరో కేరక్టర్ ఇతర హీరోలకు కాస్త భిన్నం అంటుంటారు… తనకూ ఓ పెద్ద హిట్ దక్కాల్సి ఉంది… వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లుగా బోలెడు వార్తలు… వస్తూనే ఉన్నాయి… అబ్బే, అదేమీ లేదోయ్ అని నిజానికి వీళ్లు ఖండించాలి… కానీ ఇంకా లేదు… ఎహె, రాసుకునేవాళ్లు రాసుకోనీలే అనుకుని ఉంటారేమో… లేదా భలే పట్టేశారే వీళ్లు […]

సన్నజాజి పడక… మంచె కాడ పడక… చల్లగాలి పడక…

April 16, 2024 by M S R

sannajaji

Sai Vamshi….   తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ …. అతను ఊరికి పెద్ద. ప్రేమించింది ఒకర్ని, పెళ్లి చేసుకుంది మరొకర్ని. తప్పలేదు. ఊరిని ఒకటిగా నిలపడానికి అదొక్కటే దారి! భార్య పల్లెటూరి అమాయకురాలు. చదువు లేదు. కానీ బోలెడంత సంస్కారం ఉంది. భర్తపై ఎనలేని ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోడానికి ఆమెను పడకటింటికి పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకొని పాట పాడమన్నాడు. గీత రచయితలకు ఇలాంటి సందర్భాలు అరుదుగా దొరుకుతాయి. ఆ క్షణాన ఆ […]

పిచ్చి పాత్రలు నాకక్కర్లేదు, చేయను… గుడ్, ఎవరీ నయా సాయిపల్లవి…

April 16, 2024 by M S R

రుక్మిణి

అదుగదుగో శ్రీలీలను తీసిపారేశారు… మలయాళం నుంచి మమిత బైజును తీసుకొస్తున్నారు… నో, నో, ఇప్పుడందరి దృష్టీ పూణె మోడల్ భాగ్యశ్రీ బోర్సే మీద ఉంది… ఆమెను మూడు నాలుగు సినిమాల్లో బుక్ చేసేశారు… ఇలాంటి వార్తలు బోలెడు… నిజాలెన్నో, గాసిప్స్ ఎన్నో… సరే, యువతులు వస్తుంటారు, పోతుంటారు, నాలుగు రోజులు గిరాకీ ఉన్నన్నాళ్లు నిర్మాతలు వాడేసుకుంటారు, తరువాత మెజారిటీ తెరమరుగు… కొందరే నిలబడతారు… అదంతా కామన్… ఇప్పుడు మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది… ఆమె పేరు రుక్మిణి […]

అదుగో అక్కడ ఆకాశంలో ఏదో పిట్ట ఎగురుతూ కనిపిస్తోంది… కట్ కట్…

April 15, 2024 by M S R

kaloji

ఎవరో ఓ జీవకారుణ్యవాది ఏయ్, ఏమిటిది అని అరుస్తాడు… అంతే… యానిమల్ ప్రొటెక్షన్ సెల్ అని ఒకటి ఢిల్లీలో ఉంటుంది… వెంటనే సెన్సార్ బోర్డుకు ఓ లేఖ పెడుతుంది.,. నాన్సెన్స్, సినిమాల్లో జంతు హింస పెట్రేగిపోతోంది, అరికట్టకపోతే ఆయా జాతుల జీవాలే అంతరించిపోతాయి అంటుంది… మరి దానికీ ఓ పని కావాలి కదా… ఆ పని దేనికో అందరికీ తెలుసు కదా… దొరికింది కదా చాన్స్ అనుకుని సెన్సార్ మెంబర్లూ ఇక వీరావేశం ప్రదర్శిస్తారు… అక్కడికి తమ […]

జోస్యాలు వేరు- వ్యక్తిగత సంబంధాలు వేరు… ప్రభాస్‌కు వేణుస్వామి స్వీట్ బాక్స్…

April 15, 2024 by M S R

veenasrivani

కొద్దిరోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామి మీద ఫైరవుతున్నారు… ఎందుకు..? తన కెరీర్ బాగుండదని, కష్టాలు పడాల్సి వస్తుందని తను జోస్యం చెప్పాడు కాబట్టి… (తాజాగా ఉపాసనకు మలిసంతానయోగం లేదని మరో బాంబు పేల్చాడు, అది వేరే సంగతి)… ఎహె, మా హీరో జాతకం బాగా లేదని అంటావా..? సలార్ హిట్ చూడలేదా..? మావాడి చేతిలో ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులున్నాయో తెలుసా..? అని ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రు… చివరకు కృష్ణంరాజు భార్య కూడా వేణుస్వామి మీద ఏదో […]

డియర్, గుడ్‌నైట్ సినిమాల గురక కథలకూ దీనికీ ఏ లింకూ లేదని గమనించ మనవి…

April 15, 2024 by M S R

గురక

గుడ్ నైట్ అనే ఓ సినిమా… ఆమధ్య వచ్చింది లెండి… హీరోకు గురక… తద్వారా సమస్యలు, భార్యాభర్తల నడుమ, వాళ్ల జీవితాల్లో ఇక్కట్లు కంటెంట్… సినిమా హిట్… ఓ చిన్న సమస్యగా మనకు కనిపించింది కొందరి జీవితాల్లో అదే పెద్ద సమస్యగా మారవచ్చు కదా… తరువాత అదే సమస్యను బేస్‌గా చేసుకుని ఈమధ్య డియర్ అనే సినిమా వచ్చింది… నిజానికి ఇలాంటివి కామెడీ బేస్డ్‌గా డీల్ చేస్తూ సబ్జెక్టుపైనే ఫోకస్డ్‌గా ఉంటే సినిమా హిట్టవుతుంది… కానీ ఇది […]

ఆ ఆడుజీవితం సినిమా కోసం ‘ఆ సీన్లు’ నిజంగానే షూట్ చేసి ఉంటారా..?

April 15, 2024 by M S R

goat life

ఒక ఇంట్రస్టింగ్ చర్చే… ఎలాబరేట్‌గా చెప్పుకోవడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా సరే… ఓ ఫేమస్ నవల ఆధారంగా తీయబడిన ఏ ఫేమస్ మూవీ కాబట్టి… అదే ది గోట్ లైఫ్… ఆడుజీవితం… ఆ పాత్ర కోసం పృథ్విరాజ్ చాలా కష్టపడ్డాడు, బరువు తగ్గాడు, పాత్రకు తగిన నటన కనబరిచాడు కాబట్టి… సినిమా చాలామంది ప్రశంసలు అందుకుంది కాబట్టి… చెప్పుకుంటే తప్పేమీ లేదు… ఈమధ్య ఆ హీరోకు మీడియా మీట్‌లో ఓ ప్రశ్న ఎదురైంది… ‘‘కథానాయకుడికి ఆ ఎడారిలో […]

ఆ పాట వల్లే రామకృష్ణ థియేటర్ అద్దాలు పగులగొట్టినట్టు గుర్తు…

April 14, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi….   తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని సి నారాయణరెడ్డి వ్రాసి , ఘంటసాల పాడిన పాట గుర్తుకొస్తుంది తల్లా పెళ్ళామా సినిమా పేరు తలవగానే . తాను నమ్మింది ఏదయినా ధైర్యంగా అరవగల వాడు NTR . అది సమైక్యాంధ్ర అయినా , కుటుంబ నియంత్రణ విషయమైనా లేక భూ పరిమితి చట్టాలయినా , రావణుడిని దుర్యోధనుడిని హీరోలుగా చూపటమయినా , మరేదయినా . సినిమాలో ఈ పాట పెట్టడం […]

హేమిటో… ఇంతమంది స్టార్లకు సరిపడా పాత్రలున్నాయా కన్నప్ప కథలో..!!

April 14, 2024 by M S R

prabhas

మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి… కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… […]

అదుగో శ్రీలీల ఔట్… ఎస్, మమిత ఇన్… నో, నో, భాగ్యశ్రీ ఎంట్రీ…

April 13, 2024 by M S R

mamitha and bhagya

కొత్త అందగత్తెను వెతికి పట్టుకోవడం… వీలైనంతవరకూ తెలుగు మొహాలు అక్కర్లేదు… నార్త్ పిల్లలు లేదంటే మలయాళీ పిల్లలు… ఎంత వయస్సు తక్కువుంటే అంత బెటర్… కొన్నాళ్లు విపరీతంగా హైప్… బోలెడు అవకాశాలు… తరువాత కరివేపాకులు… సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంతే… కొందరే నిలదొక్కుకుని కొన్నాళ్లు ఫీల్డ్‌లో నిలబడగలుగుతారు… ఇండస్ట్రీ దోపిడీ నుంచి చాకచక్యంగా రక్షించుకుంటూ, తమను తాము ఎలివేట్ చేసుకుంటూ… కొందరు మాత్రమే చాన్నాళ్లు వెలుగుతారు… మొన్నమొన్నటిదాకా శ్రీలీల పేరు మారుమోగిపోయింది… నిజానికి పెళ్లిసందడి సినిమాతోనే మెరిసింది… […]

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ల ఆయన చేసే ముద్దూముచ్చట…

April 12, 2024 by M S R

chalam

Subramanyam Dogiparthi….   చలం నిర్మించి నటించిన సినిమాలలో చక్కటి , వినోదభరిత , మ్యూజికల్ హిట్ 1970 లో వచ్చిన ఈ సంబరాల రాంబాబు సినిమా . తమిళంలో కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఎథీర్ నీచల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో నగేష్ , జయంతి , షావుకారు జానకి , మనోరమ ప్రభృతులు నటించారు . తమిళంలో కూడా బాగా సక్సెస్ అయింది . హిందీలో లాఖోం మే ఏక్ […]

550 సార్లు రీ-రిలీజ్ ఈ సినిమా… గ్రేట్, కానీ ఆ హిందీ సినిమా మరీ గ్రేట్…

April 12, 2024 by M S R

om

ఈమధ్య ఓ ట్రెండ్ నడుస్తోంది కదా… పాత పాపులర్ సినిమాలను ఏవో టెక్నికల్ రంగుల హంగులు అద్ది.,. అనగా 4కేలు, డోల్బీలు గట్రా అన్నమాట… (నిజానికి ఒరిజినల్‌‌కు ఆర్టిఫిషియల్ హంగులు)… వాటిని రిలీజ్ చేయడం, అభిమానుల హంగామా, వేరే పనేమీ లేని జర్నలిస్టులు వాటి కలెక్షన్ల మీద కూడా నాలుగు పోచికోలు వార్తలు రాసుకోవడం… ఆ పాత కంటెంటు ఏముందో అనవసరం, కటౌట్ కొత్తగా పెట్టామా, దండలు వేశామా, ఆ పాటలు రాగానే థియేటర్‌లో డాన్సులు చేశామా… […]

ఏదైనా మధుబాబు పాత షాడో నవల దొరికితే చదువుకొండి… బెటర్…

April 11, 2024 by M S R

Akshay

మొన్నొక వార్త కనిపించింది… ఆడుజీవితంలో అనితరసాధ్యంగా నటించిన పృథ్వీరాజ్ బడేమియా చోటేమియా అనే హిందీ సినిమాలో కీలక రోల్ పోషించాడు… కానీ తన ఒరిజినల్ ఇండస్ట్రీ మలయాళం కదా, అక్కడ ఆన్‌లైన్ బుకింగులో ఒక్క టికెట్టూ అమ్ముడుపోలేదనేది వార్త… మన నందమూరి చైతన్య గుర్తొచ్చాడు… అవును, తీస్తే గిస్తే మన సౌత్ వాళ్లే పాన్ ఇండియా తీయాలి, హిందీ వాళ్లు చూడాలి, అవసరమైతే హిందీ వాళ్లను కూడా సినిమాలోకి తీసుకోవాలి, పాన్ ఇండియా కవరింగు కోసం, కలరింగు […]

హారర్‌ను కూడా కామెడీ చేసేశారు… దెయ్యం మొహాలూ మీరూనూ..

April 11, 2024 by M S R

anjali

ది ఎంటిటీ అని అప్పట్లో ఓ భీకరమైన హారర్ సినిమా… థియేటర్లలో దాన్ని చూశాక చాన్నాళ్లపాటు ఒంటరిగా నిద్రపోనివాళ్లు కూడా బోలెడు మంది… అంతకుముందు, ఆ తరువాత కూడా బోలెడు హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లోనూ కలిపి… కానీ ఆ హారర్‌ను కూడా కామెడీ చేసిపారేసిన ఘనత మాత్రం మన తెలుగు వాళ్లదే… హారర్ అనగానే ఓ పాతబడిన బంగ్లా… పేరే భూత్ బంగ్లా… ఏ అడవిలోనో, ఊరవతలో ఉంటుంది… అందులో దెయ్యాలుంటయ్… వాటికి […]

అబ్బే, ఈనాటి సినిమాల్లో అలాంటి బుర్రకథలు చూడటం అసంభవం…

April 11, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi…..   మూడు సెంటర్లలో వంద రోజులు ఆడిన హిట్ సినిమా 1970 లో వచ్చిన ఈ పెత్తందార్లు సినిమా . NTR వియ్యంకులు అయిన యు విశ్వేశ్వరరావు నిర్మాత . సి యస్ రావు దర్శకులు . ఓ చిన్న గ్రామంలో బడా పెత్తందారు నాగభూషణం . ఆయన ముఠాలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , ముక్కామల , ధూళిపాళ , సత్యనారాయణ ఉంటారు . ఆ పెత్తందారు ఆ గ్రామంలో చేయని […]

అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు…

April 8, 2024 by M S R

harsha

Prabhakar Jaini…..  అసలు ఈ సినిమా గురించి నేను నా స్పందన తెలియచేయాల్సి వస్తుందనీ, అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ, ఏదో పొద్దుపోకనో, IPL చూడడం ఇష్టం లేకనో, ఈ సినిమా చూసాను. ఎందుకంటే, ఈ ప్రధాన పాత్రధారి హర్ష చేసే బూతు కామెడీ, వెకిలి మాటలు నాకు చిరాకు పుట్టిస్తాయి. ఇతన్ని పెట్టి సినిమా తీయడం కూడా ఈ సినిమా చూడకపోవడానికి ఒక కారణం. కానీ, సినిమా చూసిన తర్వాత […]

… వెరసి ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరుశురాం క్రెడిబులిటీ మటాష్…

April 8, 2024 by M S R

family star

సినిమాకు మౌత్ టాక్ బాగుంది, అందరూ అభినందిస్తున్నారు, కానీ మీడియాలో నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారు అనే దిల్ రాజు ఆరోపణో, ఆవేదనో, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదో కాదు… ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన మరో సినిమా సంబంధ వార్త ఇంట్రస్టింగు అనిపిస్తోంది… ఎస్, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్‌కు సంబంధించి భీకరంగా ఉద్దేశపూర్వకంగా రివ్యూ బాంబింగ్ జరిగిందనేది నిజం… అదెలా తప్పో మనం కూడా ముచ్చటించుకున్నాం… అక్కడి వరకూ దిల్ రాజు ఆవేదనకు అర్థముంది… దానికి […]

డెమొక్రటిక్ మూవీ… చిప్ కొట్టేసిన వర్మ బుర్రలో మరో దిక్కుమాలిన ఆలోచన…

April 8, 2024 by M S R

rgv

వర్మ… భ్రష్టుపట్టిపోయిన ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్… ఈ వ్యాఖ్యకు వివరణలు కూడా అనవసరం… ఐతే ప్రయోగాలు చేయడంలో దిట్ట, కానీ తలతిక్క ప్రయోగాలు… తను తీసిన రాజకీయ చిత్రాలన్నీ పెద్ద బక్వాస్… చాలా చిత్రాలు డిజాస్టర్లు… తనలోని దర్శకుడు ఏనాడో చచ్చిపోయి, యూట్యూబ్ యాంకర్లతో పిచ్చి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టుతూ అదోరకం ఆనందం పొందే దిగజారిన స్థాయి తనది… మొన్న జగన్ మీద తీసిన రెండు పార్టుల సినిమాలు మెగా బంపర్ సూపర్ బ్లాక్ […]

మంచి సందేశం ఒక్కటే సరిపోదు… అది ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించాలి…

April 7, 2024 by M S R

anr

Subramanyam Dogiparthi…..  మరో ప్రపంచం . ఈ మాట వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీశ్రీ గారే . ఆయన మహా ప్రస్థానం . బహుశా అక్కినేని , ఆదుర్తి ద్వయానికి శ్రీశ్రీ గారి పదమే స్ఫూర్తి అయిందేమో 1970 లో వచ్చిన ఈ సినిమా తీయటానికి . స్ఫూర్తి ఏదయినా , ఈ ద్వయం ప్రయత్నాన్ని మాత్రం శ్లాఘించాల్సిందే . ఈ ద్వయం సందేశాత్మక చిత్రాలను తీయాలనే అభిలాషతో చక్రవర్తి చిత్ర అనే సంస్థను నెలకొల్పి మొదటి […]

  • « Previous Page
  • 1
  • …
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • …
  • 120
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions