బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు… తెలుగు సినిమాకు బ్రహ్మి ఓ సెంటిమెంట్‌గా వెలిగిపోయాడు కొన్నాళ్లు… విపరీతమైన డిమాండ్… రాజబాబు తరువాత ఎందరో కమెడియన్లు వచ్చిపోయినా బ్రహ్మి ఓ స్టార్డం ఎంజాయ్ చేశాడు… మధ్యమధ్య సునీల్ కామెడీ ఆకట్టుకునేది… మొనాటనీతో బ్రహ్మానందం కామెడీతో విసిగిపోయిన ప్రేక్షకుల మీదకు నిర్మాతలు, దర్శకుడు వెన్నెల కిషోర్‌ను రుద్దారు… బ్రహ్మీ తెరమరుగయ్యాడు… తను మెరిట్ ఉన్న నటుడే అయినా ఓ మూస పాత్రలు, మూస నటన… చూసీ చూసీ జనానికి […]
Time Travel… మూస కథలకు భిన్నంగా 7.11 పీఎం మూవీ… నాట్ బ్యాడ్, పర్లేదు…
అప్పట్లో విఠలాచార్య తీసిన సినిమాలు ఓసారి గుర్తుకుతెచ్చుకుందాం… ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ అప్పట్లో లేదు, వీఎఫ్ఎక్స్ లేదు… ఐనా సరే, సినిమాల్లో ట్రిక్కుల దృశ్యాలు అనగా మన కళ్లను మాయచేసే ఎన్నో చిత్రీకరించాడు… అనేక సినిమాలు హిట్… ఈ సీన్లకన్నా కథ చెప్పే తీరుతో ఆకట్టుకునేవాడు… అంతెందుకు..? ఆదిత్య 369లో గ్రాఫిక్స్ ఏమున్నాయని..? సినిమా సూపర్ హిట్… కారణం :: కథ చెప్పే విధానమే… రోబో సినిమా గ్రాఫిక్స్ ప్రధానమే కానీ మహేశ్ నాని, సూర్య 24 […]
నది కోసుకుపోతున్న నావను ఆపండీ… రేవు బావురుమంటోందని…
Bharadwaja Rangavajhala….. పడవ పాటలు… తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు. పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు. శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట. పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది సంపూర్ణ రామాయణంలో ఘంటసాల వారు గానం చేసిన కొసరాజు సాహిత్యం. రామయ్య తండ్రీ అంటూ గుహుడు పాడతాడీ గీతాన్ని.. కొసరాజు రాఘవయ్య […]
నటనకు దీర్ఘవిరామం… సమంత నిర్ణయం… మయోసైటిస్ ముదిరిందా..?
సమంత సినిమాలను మానుకుంటోంది… మీరు చదివింది నిజమే, కారణాలేమిటో ఆమె చెప్పడం లేదు గానీ తన నటనకు సుదీర్ఘమైన బ్రేకప్ ఇవ్వాలని నిర్ణయించుకుంది… బహుశా ఒకటీరెండేళ్ల కనీసకాలం ఆమె నటించకపోవచ్చు… బహుశా ఆమె మయోసైటిస్ చికిత్సకు టైమ్ పట్టేట్టుందనీ, కొన్నాళ్లు విశ్రాంతి అవసరమనీ వైద్యులు చెప్పినట్టు సమాచారం… అప్పట్లో ఏదో సినిమా (యశోద?) ప్రమోషన్లలో తను వ్యాధిగ్రస్త అని చెప్పుకుంది… తనెలా అవస్థలు పడిందీ చెప్పింది… అంతేకాదు, శాకుంతలం సినిమా ప్రమోషన్లలో ముక్కు చీదుతూ మాటిమాటికీ కర్చీఫ్‌తో […]
డియర్ చిరంజీవి… పేరు విరిచేశావ్, బీజాక్షరాలకూ విధివిధానాలున్నయ్…
Privilege for Name: “పేరిడి నిను పెంచిన వారెవరే? వారిని చూపవే! శ్రీరామయ్యా! సార సారతర తారకనామమును పేరిడి…” రాముడికి పేరుపెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య కీర్తించాడు. “త్వయైక తారితాయోధ్య, నామ్నాతు భువనత్రయం” రామా! నువ్వు ఒక్క అయోధ్యనే పాలించావు. నీ పేరు ముల్లోకాలను రక్షించి, పాలిస్తోంది. నీకంటే నీ పేరే గొప్పది- అని హనుమంతుడు రాముడితోనే అన్నాడు. కృష్ణుడికి ఆ పేరు పెట్టినవాడు గర్గ […]
కామం… ఓటీటీ కంటెంట్ అంటేనే లస్ట్.. బూతుకు. వెబ్ సీరీస్ పట్టం…
ఇంగ్లిష్‌లో లస్ట్… అంటే కామం, వాంఛ, తృష్ణ, కోరిక… కళావ్యాపారం ఇప్పుడు అదుపు తప్పి, ఓటీటీల్లో వికృతంగా నర్తిస్తోంది… సెన్సార్ లేదు, ఆంక్షల్లేవు, అదుపు లేదు… సింపుల్‌గా చెప్పాలంటే బరితెగిస్తున్నాయి… కామంతో రగిలే, రమించే సీన్లకు యథేచ్ఛగా వెబ్ సీరీస్ పట్టం కడుతోంది… ఆ దృశ్యాల్లో నటులు ప్రదర్శించే హావభావాలు, కనిపించే అందాలు ప్రేక్షకులను వెర్రెక్కిస్తున్నాయి… ఈమధ్య నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న లస్ట్ స్టోరీస్ ఆ బాపతే… లస్ట్ అంటే ఆల్రెడీ అర్థం చెప్పుకున్నాం కదా… ఇంకేం, లస్ట్ […]
అది క్లీన్ కాదు, రఫ్ కాదు… కారా చుడువా అసలే కాదు… ఆ పేరు అసలు అర్థం ఇదీ…
తెలుగు తల్లిదండ్రుల్లోనే కాదు, చిరంజీవి- రాంచరణ్‌లు తెలిసిన సర్కిళ్లు, ఇండస్ట్రీ సర్కిళ్లలోనూ ఓ చర్చ… చిరంజీవి మనమరాలు, రాంచరణ్-ఉపాసనల బిడ్డ పేరుకు అర్థమేమిటి..? గూగుల్‌లో కూడా విపరీతంగా వెతుకుతున్నారు… లలిత సహస్ర నామాల నుంచి ఈ పేరు తీసుకున్నట్టు పాప తాత చెబుతున్నాడు… the name signifies a transformative, purifying energy that brings about a spiritual awakening …. ఇదీ ఆ పేరుకు వాళ్లు చెప్పిన అర్థం… అర్థమయ్యీ కానట్టు గందరగోళంగా ఉన్నట్టుంది […]
శ్రీవిష్ణు… ఈ పరీక్షలో పాసయ్యావోయ్… సరదాగా, నీట్‌గా… వరుస ఫ్లాపులకు బ్రేక్…
హిట్ కాబోయే సినిమాకు ముందస్తు బజ్, హైప్ విపరీతంగా ఉండనక్కర్లేదు… కాస్త వినోదాన్ని, కొత్తదనాన్ని ఇచ్చేలా ఉంటే సరి… మౌత్ టాక్ సినిమా భవిష్యత్తును తేలుస్తుంది… కాంతార సినిమా సంగతి తెలుసు కదా… సూపర్ హిట్… రోజూ ప్రేక్షకులు ఫుల్లు… ఆ టాక్ వచ్చాకే ఇతర భాషల్లోకి డబ్బయింది… పాన్ ఇండియా హిట్టయింది… ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయగల సినిమాలే రావడం లేదు కాబట్టి థియేటర్లకు పెద్దగా జనం వెళ్లడం లేదు… కార్తికేయ-2 సూపర్ హిట్ తరువాత […]
సామజవరగమనా… తెలుగు తెరకు మరో కొత్త ఆడ మొహం… బాగుంది…
మన మగపురుష్ ఎంత ముసలోళ్లయినా ఇంకా చిత్రమైన స్టెప్పులు వేస్తూ, ఆడవాళ్లతో చిలిపి వేషాలు వేస్తూ, ద్వంద్వార్థ సంభాషణలు పలుకుతూ నీరసమే ఆవహించని రసపురుష్ అనిపించుకుంటారు… అదే ఆడలేడీస్ అయితే మాత్రం ‘కొత్త సరుకు’ (పాపం శమించుగాక, ఇది సినిమా భాషే, ఇంగ్లిషులో హీరోయిన్ మెటీరియల్ అని పిలుస్తారు…) కోసం వివిధ భాషల్లో, విభిన్న దేశాల్లో అన్వేషిస్తుంటారు… నాలుగు రోజులు చాన్సులు ఇచ్చి, (సినిమా భాషలో వాడుకుని…) తరువాత పక్కన పడేస్తారు… కరివేపాకులా… కొందరు మాత్రమే నాలుగురోజులు […]
నిఖిల్ కార్తికేయ వసూళ్ల వాపును ఈ మూస ‘స్పై’ సినిమా తగ్గించినట్టే…
సుభాష్ చంద్రబోస్ కథ అనేసరికి… నిజంగా నేతాజీ మీద సినిమా అనుకునేరు సుమా… ఆయన తాలూకు ఫైల్స్ ప్రస్తావన ఉంటుంది… మరీ తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి కథేమో అని పరుగులు తీయాల్సిన పనేమీ లేదు… నిఖిల్ హీరోగా చేసిన స్పై మూవీకి అంత సీన్ లేదు… సగటు తెలుగు హీరో మార్క్ ఉత్త మూస గూఢచారి సినిమా ఇది… కాకపోతే నేతాజీ పేరు ఈ సినిమా ప్రచారానికి వాడుకోబడింది… అంతే… మళ్లీ […]
ఆదిపురుష్ రచ్చ నడవనివ్వండి… డీడీ రామాయణం క్యాసెట్లు బయటికి తీయండి…
నో డౌట్… ఏ కోణం నుంచి చూసినా ఆదిపురుష్ సినిమా అట్టర్ ఫ్లాప్… 200 కోట్ల దాకా నష్టం, వెకిలి డైలాగులపై సుప్రీం దాకా వెళ్లిన కేసు, అలహాబాద్ హైకోర్టు తిట్లు గట్రా వార్తల నడుమ బాగా చిరాకుపుట్టించినవి దర్శకుడు, రచయితల తలతిక్క వివరణలు, సమాధానాలు, పెడసరం మాటలు… వీటన్నింటి నడుమ ఓ వార్త ఆకర్షించింది… ఆదిపురుష్ సినిమాను జాతి ఛీత్కరించిన వేళ దూరదర్శన్ తన పాత రామాయణం సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేయడానికి నిర్ణయం తీసుకుందట… […]
బిఎన్ కొండారెడ్డి… డీఓపీ కమ్ నిర్మాత కమ్ కెమెరామన్…
Bharadwaja Rangavajhala …… బిఎన్ కొండారెడ్డి . వాహినీ బ్యానర్ లో వచ్చిన కొన్ని సినిమాలకు కెమేరామెన్ గా పనిచేశారు బి.ఎన్ . కొండారెడ్డి . ఈయన స్వయాన బి.ఎన్.రెడ్డిగారి తమ్ముడే. వాహినీలో పోతన అంతకు ముందు వచ్చిన సినిమాలకూ రామనాథ్ గారు పనిచేశారు. వాహినీ బ్యానర్ ప్రారంభకుల్లో రామనాథ్ గారు ఒకరు కదా.. ఆయన స్క్రీన్ ప్లే రాసేవారు. అలాగే … ఎడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకునేవారు. ఆర్ట్ డైరక్టర్ శేఖర్ కూడా వాహినీ ప్రారంభకుల్లో ఉన్నారు. నిజానికి […]
పోయిందే… ఇట్స్ గాన్… పొయిపొచ్చి… గాయబ్… ఆదిపురుష్ గురించే…
ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె సినిమాలో అమితాబ్ ఆల్రెడీ ఓ పాత్ర అంగీకరించాడు… తను హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకడు… తాజాగా కమల్‌హాసన్ కూడా నటిస్తున్నట్టు సినిమా టీం వెల్లడించింది… తనూ పాపులర్ ఆర్టిస్టే… తనకూ భారీ పారితోషికం కావాలి… ప్రభాస్ సరేసరి… వెరసి ఎన్ని వందల కోట్ల ప్రాజెక్టు అవుతుందో ఇప్పుడప్పుడే ఓ తుది అంచనాకు రాలేం… ఇవి చదువుతుంటే ఆదిపురుష్ గుర్తొచ్చింది… నిజానికి భారీ సినిమా అంటే, భారీ తారాగణం ఉంటే వసూళ్లు బాగుంటాయని, […]
ఫాఫం నాగశౌర్య… ఆ ‘ఫలానా అబ్బాయి’ని థూత్కరించేశారు ప్రేక్షకులు…
బలగం మొదటిసారి టీవీల్లో రిలీజ్ చేసినప్పుడు 14.3 ఓవరాల్ రేటింగ్స్ వచ్చాయి… ఈరోజుల్లో అది చాలా ఎక్కువ… గత వారం మళ్లీ ప్రసారమైతే ఈసారి ఏకంగా 9.08 రేటింగ్స్ వచ్చాయి… సూపర్… సరే, మనం చెప్పుకోదగిన విషయం మరొకటి ఉంది… అది ధనుష్ నటించిన సర్ సినిమా గురించి… ఇది కూడా గత వారం టీవీల్లో ప్రసారం చేశారు… కానీ జెమిని టీవీలో… దానికేమో రీచ్ తక్కువ… ఎంత భారీ సినిమా అయినా సరే, జెమిని టీవీలో […]
తెలుగు మినహా యావత్ ద్రవిడనాడు ఘోరంగా ఆదిపురుష్‌ను ఛీకొట్టింది…
ఆదిపురుష్ కథ త్వరగానే ముగింపుకొస్తోంది… పాపం శమించుగాక… సర్వత్రా ఛీత్కారాలకు గురైన ఈ సినిమా ప్రభాస్‌కు మూడో భారీ ఫ్లాప్ అని ముద్ర వేయించుకుంటోంది… నిజానికి ఆదిపురుష్ సినిమాకు సంబంధించి తను ఎంచుకున్న టీందే తప్పు… ప్రభాస్ నమ్మి మోసపోయాడు… ప్రత్యేకించి ఓం రౌత్ ఈ ఫ్లాప్‌కు ప్రధాన బాధ్యుడు… అసలు మొదట్లోనే ట్రెయిలర్ చూసి అందరూ సినిమాను బూతులు తిట్టినప్పుడే ప్రభాస్ జాగ్రత్త పడి ఉండాల్సింది… కొన్ని దిద్దుబాటు చర్యలైనా చేయించి ఉండాల్సింది… ఇతర హీరోల్లాగా […]
బాలు మరో గద్దర్… కాపీ రచయిత వేటూరి… రామోజీ ఫేక్ విప్లవగీతాలు…
Bharadwaja Rangavajhala…… గూడ అంజన్న స్మృతి లో… అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది. నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో నెమలూరి భాస్కరరావుగారితో సమావేశం జరిగింది. ఆయన మాకు ఆ రాత్రంతా నక్సల్బరీ వెలుగు ప్రసరింపచేశారు. ఆ రాత్రి […]
నాకైతే ఆదిపురుష్ నచ్చింది… శాకుంతలం గాయానికి ఉపశమన లేపనం…
Priyadarshini Krishna…… ఇది రాయాలని అనుకోలేదు…. కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది. అవును …. ఆదిపురుష్ గురించే ! నాకు నచ్చింది ! మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది…. రామయణం కాదని రామాయణం ఇన్స్పిరేషన్ అని రచయిత యేవేవో అంటున్నాడు. కానీ, వాళ్ళు అలా పలాయన వాదపు మాటలు మాట్లాడకుండా “అవును, ఇది రామాయణమే… […]
కరివేపాకు తారలు… చంద్రబాబుకు అమితమైన ప్రేమ… అవ్యాజ అనురాగం…
మీరు చూసిన తొలి నటి / నటుడు ? గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————- తొలిసారి మీరు చూసిన సినిమా యాక్టర్ ఎవరో గుర్తున్నారా ? పద్మనాభం తీసిన దేవత సినిమాలో ఓ సన్నివేశం కొత్తగా ఉంది . ఎన్టీఆర్ , సావిత్రి నటించిన ఈ సినిమా పద్మనాభం తీశారు . 1965 లో వచ్చిన సినిమా . ఆ కాలంలో సినిమా తారలు అంటే దేవుళ్ళు అనుకునేంత అభిమానం […]
అబ్బే, మేం రామాయణం తీయలేదు….. ఆదిపురుష్ టీం తలతిక్క వివరణ…
గుడ్డ మీ నాన్నదే… నూనె మీ నాన్నదే… నిప్పు మీ నాన్నదే… కాలేది కూడా మీ నాన్నదే… ఇదే కదా, ఆదిపురుష్‌లో లంకను కాల్చేముందు హనుమంతుడి డైలాగ్…. ఛిఛీ… ఇది భక్తి సినిమా అట… ఇది చూడకపోతే జన్మకు పుట్టగతులు ఉండవట… తిడితే రౌరవాది నరకాలకు పోతారట… ఏదేదో చెబుతూ సినిమాకు సపోర్ట్ డైలాగులు చెబుతున్నారు… జాతీయ వాదులట… సినిమాలో ఇలాంటి చెత్తా అంశాలు ఎన్నో… ఎన్నెన్నో… నిజానికి ఇలాంటి సినిమాల్ని నెత్తిన పెట్టుకోవడమే రామద్రోహం అనీ… […]
మానిన విరాటపర్వం పుండును మళ్లీ గోకడం దేనికి ఊడుగుల వేణూ…
అప్పట్లో బాగా హైప్ క్రియేటై, అడ్డంగా బోల్తాకొట్టిన విరాటపర్వం సినిమా రివ్యూలోకి లేదా ఇతర అంశాల్లోకి నేనిక్కడ వెళ్లాలని అనుకోవడం లేదు… ఇప్పుడు ఆ అవసరమూ లేదు… సందర్భమూ లేదు… కానీ దర్శకుడు ఊడుగుల వేణు పెట్టిన ఓ పోస్టు ఆలోచనల్లో పడేసింది… నో డౌట్, సోకాల్డ్ కమర్షియల్, హిట్, పాపులర్ దర్శకులెందరున్నా సరే, వేణు డిఫరెంట్, సెన్సిబుల్, సెన్సిటివ్… తన టేకింగ్, కథనం గట్రా విభిన్నం… స్టార్ దర్శకులతో తనను పోల్చి తనను కించపరచ దలుచుకోలేదు… […]
- « Previous Page
- 1
- …
- 62
- 63
- 64
- 65
- 66
- …
- 131
- Next Page »