ఫతేపూర్ బేరి… బబ్లీ బౌన్సర్ సినిమాలో చూపించిన ఈ గ్రామం నిజంగానే ఉంది… ఢిల్లీ పరిసరాల్లో ఉంటుంది… అక్కడి యువకులు రోజూ బాగా వ్యాయామాలు అవీ చేసి, కండలు పెంచి, ఫుల్ ఫిజికల్ స్టామీనాతో ఢిల్లీలో బౌన్సర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా కొలువులు సంపాదిస్తారు… ఆ ఊరు దీనికి చాలా ఫేమస్ కావడంతో పలు సెక్యూరిటీ సంస్థలు కూడా వాళ్లకు ఇట్టే కొలువులు ఇచ్చేస్తాయి… నమ్మకస్థులు… యువకులు మాత్రమే బౌన్సర్లు కావాలా..? మేమేం తక్కువ అని సవాల్ చేసి, […]
దాదాపు మొత్తం సినిమా ఆ కారులోనే… ఇంట్రస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్…
శరత్ కుమార్ చింత….. దొంగలున్నారు జాగ్రత్త.. ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. రెండు రోజుల ముందే ఈ మూవీని రామానాయుడు స్టూడియోలో చూశాను. ఈ మూవీ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ ఈ మూవీకి డైరెక్టర్ సతీష్ త్రిపుర రామానాయుడు ఫిల్మ్ స్కూల్ 2008 బ్యాచ్ స్టూడెంట్.. సురేష్ ప్రొడక్షన్ లో కొన్ని […]
ఆ ముగ్గురి సొగసులే మణిరత్నం భారీ సినిమాకు ఇంధనం…
రోజూ వంద మంది స్టార్స్ వస్తుంటారు… పోతుంటారు… సినిమా ఇండస్ట్రీ ఓ దీపం… మిడతలు ఆకర్షింపబడుతూనే ఉంటాయి… ఒక లేడీ స్టార్ ఎన్నేళ్లు తెరపై తన సొగసును, తన పాపులారిటీని, తన మెరిట్‌ను, తన జీల్‌ను కాపాడుకుంటూ ఉండగలదు… మహాఅయితే ఆరేడేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు… అది చాలా ఎక్కువ పీరియడ్… కొన్ని మినహాయింపులు ఉంటాయి… వారిలో త్రిష ఉంటుంది… ఐశ్వర్యారాయ్ ఉంటుంది… సేమ్, అదే లుక్కు… ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగో… అలాగే… వీరిద్దరిలోనూ ఐశ్వర్య భిన్నమైన స్టోరీ… […]
అల్లూరి వారు ఆకట్టుకోలేకపోయారు… మరోసారి శ్రీవిష్ణు వృథా ప్రయాస…
మొన్నోసారి చెప్పుకున్నాం… కాయదు లోహార్ గురించి… ఎవరీమె అంటారా..? అస్సలు ఇండియన్ సినిమా ఇండియన్ లేడీస్గానే గుర్తించని, ప్రోత్సహించని ఈశాన్య రాష్ట్రాల అమ్మాయి, అందులోనూ అస్సామీ సొగసు అని చెప్పుకున్నాం కదా… ఆమె పేరు పలకడానికి అల్లు అర్జున్ అల్లూరి సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో అవస్థలు పడ్డారని కదా చెప్పుకున్నాం… ఈ సినిమా చూడటానికి అంతకన్నా చాలా చాలా అవస్థలు పడాలి… ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ కాయదు లోహార్ మాత్రమే… ఉన్నంతసేపు […]
Krishna Vrinda Vihari :: ఒక ప్లెయిన్, క్లీన్ కామెడీ లవ్ ఎంటర్టెయినర్…
నాగశౌర్య… అదేదో లక్ష్య అనే సినిమా కోసం, బాడీ ఎక్స్పోజర్ కోసం తొమ్మిదిరోజులు మంచినీళ్లు తాగలేదు అని చేసిన ప్రకటన నవ్వు పుట్టించింది… కృష్ణ విృంద విహారి సినిమా కోసం సాగించిన పాదయాత్ర మరీ అబ్సర్డిటీ… అప్పట్లో ఏదో రిసార్ట్ కేసులో ఇరుక్కున్నాడు… అప్పట్లో సాయిపల్లవితో గొడవలు… సినిమాలు వరుస ఫ్లాపులు… నిన్న ఎవరో జర్నలిస్టు వేసిన బ్రాహ్మణ భాష సంబంధ ప్రశ్నకు జవాబు లేక తత్తరపడిపోయాడు… తన కెరీర్ గమనిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది… ఐనాసరే, తన్లాడుతూనే […]
నాసిరకం కాపీ మూవీకి ఆస్కార్ ఎంట్రీయా..? ఈ ప్రశ్నకు బదులేది నాగాభరణా..?!
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కమిటీ నాగభరణ గారూ… మీరు మీడియా ముఖంగా ఇచ్చిన ఓ వివరణ అసంపూర్ణంగా, అసంతృప్తికరంగా ఉంది… ఒకింత అసమంజసంగానూ ఉంది… ఎస్, మీకు మంచి పేరే ఉంది… మీరేదో పక్షపాతంతో గానీ, నిర్లక్ష్యంతో గానీ ఆస్కార్ ఎంట్రీని ఎంపిక చేశారని ఎవరూ ఆరోపించడం లేదు… ఆర్ఆర్ఆర్, కశ్మీరీ ఫైల్స్ సినిమాల్లో ఏదో ఒక దానిని ఎందుకు ఎంపిక చేయలేదు అని కూడా అడగడం లేదు… నిజమే, మీరన్నట్టు ఆర్ఆర్ఆర్ సినిమా […]
మీడియా ప్రశ్నలో తప్పేముంది..? నాగశౌర్యే జవాబు చెప్పలేక తత్తరబిత్తర…!
సాధారణంగా సినిమా జర్నలిస్టుల ప్రశ్నలు ఎలాంటి పేడపోకడలు… సారీ, పెడపోకడలు పోతున్నాయో చూస్తున్నాం, చదువుతున్నాం, మనమూ పలుసార్లు చెప్పుకున్నాం… కానీ నిన్న ఓ జర్నలిస్టు హీరో నాగశౌర్యకు వేసిన ప్రశ్న సెన్సిబుల్‌గా ఉంది… సినిమా రిపోర్టర్ కాబట్టి, హీరోకు, అక్కడ నిర్మాతకు కోపం రాకుండా ఉండేందుకు బాగా కవర్ చేయడానికి ప్రయత్నించాడు… కానీ ప్రశ్న స్పిరిట్ మాత్రం ఆలోచించదగిందే… అలాంటి ప్రశ్నలు పడాల్సినవే… నిజానికి నాగశౌర్య ఏమీ రూడ్‌గా ప్రతిస్పందించలేదు… తను కూడా కూల్‌గా, మర్యాద తప్పకుండా […]
nna than case kodu… అదిరిపోయిన ఓ పొలిటికల్ కామెడీ సెటైర్…
ఎంత మంచి స్టోరీ లైన్ ఉన్నా… దానికి తగ్గ సృజనాత్మకత… పాత్రచిత్రణ.. స్క్రీన్ ప్లే… కథనం… దర్శకత్వం వంటివి లేక కిల్ చేసే కిల్లర్ డైరెక్టర్స్ కొందరైతే… దేన్నైనా స్టోరీ లైన్ గా మల్చుకుని అంతే క్రియేటివిటీతో… సహజ సిద్ధమైన పాత్రలతో… అదీ సమాజాన్ని ఆలోచింపజేసే రీతిలో తెరకెక్కించే ప్రతిభావంతులు మరికొందరు. ఆ కోవకు చెందిన పొలిటికల్ కామెడీ సెటైరే Nna Than Case Kodu. ఎంతసేపూ రెబల్ తరహా… లేకపోతే నేరుగా డిష్యుమంటే డిష్యుమని తలపడే […]
Megastars :: మడత నలగని స్టెప్పులు..! మదికెక్కని సాంగు…!!
ప్రభుదేవా… తను స్వతహాగా ఎంత మంచి డాన్సరో… ఇతర హీరోలకు అంత మంచి డాన్స్ కంపోజర్ కూడా..! ఏ హీరోకు ఏ స్టెప్పులు పడాలో, ఏ హీరో వయస్సు ఎంతో, ఏ స్టెప్పులు సులభంగా ఉండాలో, ఎవరు బాగా స్టెప్పులు వేయగలరో తెలిసినవాడు… తన డాన్స్ క్లిక్కయితే దాని రేంజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి రౌడీ బేబీ సాంగ్ చాలు… ఇప్పటికీ అది యూట్యూబ్‌లో టాప్ ఇండియన్ సినిమా సాంగ్… ఇప్పట్లో దాని దగ్గరకు ఎవరూ చేరుకోలేరు… […]
భేష్ రానా… టీటీడీ పెద్దలకు బుర్రల్లేకపోయినా నీ విచక్షణ బాగుంది…
మన తెలుగు హీరోల్లో దగ్గుబాటి రానా కాస్త డిఫరెంటుగా కనిపిస్తాడు… ప్రవర్తన కూడా హుందాగా ఉంటుంది, చిల్లరతనం కనిపించదు… ఆమధ్య విరాటపర్వం సినిమా ప్రమోషన్ సమయంలో వేలాది మంది ఎదుట, వేదిక మీద, చినుకులు పడుతుంటే, సాయిపల్లవికి గొడుగు పట్టిన తీరే తనను మెచ్చుకునేలా చేసింది… చిల్లర హీరోలే భారీ ఫోజులు కొట్టే ఇండస్ట్రీ మనది… అలాంటిది అంతటి సురేష్ ప్రొడక్షన్స్ వారసుడు, స్వయంగా హీరో… ఏమాత్రం ఇగో లేకుండా తోటి నటికి ఇబ్బంది కలగకుండా ఓసారి […]
Chello Show :: ఈ గుజరాతీ మూవీతో ఆస్కార్ బరిలో ఇండియా ఇజ్జత్ గోవిందా..?!
‘‘అన్ని రంగాల్లో… చివరకు సినిమా రంగంలో కూడా గుజరాతీలదే చెల్లుబాటు కావాలా..? వాళ్లు పాలిస్తున్నంతమాత్రాన ఆ భాషాచిత్రాన్నే ఆస్కార్‌కు పంపించాలా..?’’…….. ఇదొక అభియోగం…! ‘‘సో వాట్..? వెయ్యి కోట్లు వసూలు చేస్తే తప్ప అది ఆస్కార్‌కు పోకూడదా..? ఇదేం ప్రాతిపదిక..? అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ బదులు కేజీఎఫ్-2ను పంపించడం బెటర్ కాదా..?’’… ఇదొక విమర్శ…! ‘‘అసలు ఆర్ఆర్ఆర్లో ఏముందని..? పిచ్చి గ్రాఫిక్స్ తప్ప… దాన్ని ఆస్కార్‌కు పంపించడం లేదనే బాధ దేనికి..? పంపించడం లేదు, హమ్మయ్య అని ఆనందించాలే […]
ఈ పాటలో దొరతనం వేరు… ప్రణయభావంతో దొరసాని వగలు…
Sambashiva Kodati…………. పగలైతే దొరవేరా – బంగారు పంజరం – దేవులపల్లి కృష్ణశాస్త్రి – S. రాజేశ్వరరావు …. కృష్ణశాస్త్రి గారు అంతకు ముందు రాసుకున్న గీతాన్ని ఈ సినిమాలో సన్నివేశం కొరకు వాడుకున్నారు B N రెడ్డి గారు… 1. సాహిత్యం: పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా…..ఇక్కడ దొర అంటే ఇంజనీర్… చాలా పల్లెటూర్లలో ఆఫీసర్స్ ను దొర అంటూంటారు. ఇంకొక అర్ధం ఇక్కడ సూర్యుడు అని కూడా అనుకోవచ్చు. రాజు అంటే చంద్రుడు […]
కాయదు లోహర్… పేరు పలకరాని బన్నీ… తెలుగు తెరపై అస్సామీ సొగసు…
కాయదు లోహర్… ఈ పేరు పలకడానికి అల్లు అర్జున్ నానా అవస్థలూ పడ్డాడు… ఇక పలకలేక ఆ పేరున్న హీరోయిన్‌కే సారీ చెప్పాడు… శ్రీవిష్ణు నటించిన సినిమా అల్లూరి… దాని ప్రిరిలీజ్‌కు వచ్చిన బన్నీ ప్రసంగం ఎటెటో వెళ్లిపోయింది… తనకు ఫ్యాన్స్ ఉండరట, తనది ఆర్మీ అట… సరే, హీరోయిన్ పేరు పలకలేకపోవడం కాస్త నవ్వు పుట్టించేలా ఉన్నా ఈ హీరోయిన్ గురించి మాత్రం ఓసారి ప్రస్తావించుకోవాలి… ఐనా రోజుకు వందమంది అమ్మాయిలు వస్తుంటారు, నాలుగురోజులకే తెరమరుగైపోతారు… […]
మిస్సింగ్…! ఇదీ దమ్మున్న సినిమా… ఇదీ దీటైన రివ్యూ…!!
Taadi Prakash……………. (27 జూలై 2020) … అమెరికన్ జర్నలిస్ట్ ‘మిస్సింగ్ ‘…. A COMPELLING FILM BY COSTA GAVRAS…. గ్రీసుదేశానికి చెందిన కాన్స్టాంటినో గౌరస్ సినిమా దర్శకుడు. కోస్టాగౌరస్గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టాగౌరస్ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్ అమెరికా ప్రభుత్వాలు గడగడలాడతాయి. గ్రీస్‌లో కోస్టాగౌరస్ని నిషేధించారు. ఆయన సినిమాల్ని నిషేధించారు. ఆస్కార్‌తో సహా అనేక […]
మెగాస్టార్ సినిమా కొనేవాళ్లు లేరా..? తొలిసారి ఇదేం దురవస్థ ఆచార్యా…?!
షాక్… షాక్… చిరంజీవి సినిమాకా ఈ దురవస్థ అని పేరున్న సైట్లు కూడా తెగ రాసేస్తున్నాయి… అస్సలు నమ్మశక్యంగా లేదు సుమీ అంటూ అబ్బురపడిపోతున్నయ్… విషయం ఏమిటయ్యా అంటే..? చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదు అనేది వార్త… దానికి షాక్ అట… షాక్ ఏముంది..? అందరికీ తెలుసు, ఆచార్య దెబ్బ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మీద దారుణంగా ఉండబోతోంది అని… నిజానికి చిరంజీవి కూడా ఊహించే ఉంటాడు… అందుకే అవసరమైతే సొంతంగానే రిలీజ్ […]
మూడు గంటలు ముప్పుతిప్పలు… వెరసి ఈ ముత్తు గాడి జీవితం…
ఒక ప్రేక్షకుడు ఎలాంటి ప్రిజుడీస్ లేకుండా… జీరో బేస్డ్ బడ్జెట్ తరహాలో ఓ ఎమ్టీ మైండ్‌తో థియేటర్లో అడుగుపెట్టాడు… ఏడ్చుకుంటూనో, తుడ్చుకుంటూనో ఆ టికెట్ రేటు చెల్లించి, సీట్లో కూలబడ్డాడు… దర్శకుడు గౌతమ్ మేనన్ అట… సంగీతం రెహమాన్ అట… సో వాట్..? వాళ్లు గతంలో ఏం ఉద్దరించారో తనకెందుకు..? వాళ్లు లబ్ధి ప్రతిష్టులు కాబట్టి ఈ సినిమా కూడా బాగానే ఉంటుందనే ముందస్తు అంచనాలతో, సినిమా మీద ముందే ఓ పాజిటివ్ అభిప్రాయం ఏర్పరుచుకుని, ఎందుకు […]
మెగా హీరోలా మజాకా… ఆ పది మందిలో నలుగురూ వాళ్లే…
మెగా కంపౌండ్ అంటేనే హీరోల ఉత్పత్తి ఫ్యాక్టరీ… కొందరు నిలదొక్కుకున్నారు… కొందరు పల్టీలు కొడుతూనే ఉన్నారు… మొత్తానికి ప్రొడక్షన్, మార్కెటింగ్, సేల్స్ అన్నీ ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా సాగుతుంటయ్… పాపులారిటీ విషయంలోనూ జనం, ప్రత్యేకించి నెటిజనం వాళ్లను అభిమానిస్తూనే ఉన్నారు… తాజా తార్కాణం ఏమిటంటే…? ఆర్మాక్స్ మీడియా అనేది ప్రతి పదిహేను రోజులకోసారి, నెలకోసారి మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, ఫిమేల్ స్టార్స్ అనే కేటగిరీలను అప్డేట్ చేస్తూ ఉంటుంది… అవేకాదు, వాళ్లకు ఏ టాపిక్ బుర్రలో […]
“రామారావు ఆన్ డ్యూటీ” దర్శకుడు శరత్ మండవ గారికి రాయునది…
“రామారావు ఆన్ డ్యూటీ” దర్శకుడు శరత్ మండవ గారికి… అయ్యా, మీరు తీసిన ఈ సినిమాలో హీరోను ఓ చోట డిప్యూటీ కలెక్టర్, మరో చోట స్పెషల్ కలెక్టర్, ఇంకో చోట సబ్ కలెక్టర్ అని పలికించారు. ఫైనల్‌గా అతని టేబుల్ మీద Deputy collector (mandala revenue officer MRO) FAC అని రాయించారు. బిత్తిరి సత్తికి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డిప్యూటీ కలెక్టర్ ఎమ్మార్వోగా ఉండవచ్చని చెప్పారు. ఒకసారి తేడాలు చూద్దాం రండి… […]
వీడు ఎవరికీ ఏమాత్రం కావల్సిన వాడు కాదు… పలకరించే పనేలేదు…
కమర్షియల్ మాస్ ఎంటర్టెయినర్ అంటే..? లెక్క ప్రకారం నాలుగు పాటలు పడాలి… నడుమ నడుమ అయిదు ఫైట్లు పడాలి… మధ్యలో ఓ ఐటం సాంగ్… ఫుల్లు ఎలివేషన్… హీరో అంటే వాడు ఈ నేలమీదకు దిగొచ్చిన దేవుడు అన్నట్టు ఉండాలి…… అంతేకదా, ఎన్నేళ్లుగా మన నిర్మాతలు, మన దర్శకులు, మన హీరోలు మనకు రుద్దీ రుద్దీ అలవాటు చేసిన నెత్తిమాశిన ధోరణి ఇదే కదా… కానీ..? ప్రేక్షకుడు కళ్లు తెరిచాడు… ఏం చూడాలో, ఏది తన్ని తగలేయాలో […]
హవ్వ, ఇది సురేష్ ప్రొడక్షన్స్ సినిమాయా..? శాకినీఢాకినీ ఏమైనా ఆవహించాయా?!
ఓసీడీ గురించి అడిగితే ఆమధ్య ఏదో ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టుకు క్లాస్ పీకింది కదా రెజీనా కసాండ్రా… దానికితోడు శాకిని, డాకిని అనే సినిమా పేరు కూడా కలిసి… కాస్త ఇంట్రస్టు క్రియేట్ చేసింది సినిమా… పైగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణ… తరువాత సినిమాకు హైప్, ప్రచారం, ప్రమోషన్ ఇంకాస్త వచ్చేందుకు ‘‘మగాడైనా మాగీ అయినా రెండే నిమిషాలు’’ అని రెజీనా చేసిన వ్యాఖ్య మరింత ఉపయోగపడింది… పాజిటివో, నెగెటివో సినిమా పేరు చర్చల్లోకి, రచ్చలోకి రావాలి… […]
- « Previous Page
- 1
- …
- 74
- 75
- 76
- 77
- 78
- …
- 112
- Next Page »