మాంచి కొలువు మీదున్నప్పుడు… పవర్ మీదున్నప్పుడు… కలెక్టర్‌గా దర్పం ఒలకబోసే పెద్దమనిషి కాస్తా వృద్యాప్యం పైనబడ్డాక… శక్తులన్నీ ఉడిగిపోయాక మస్కూరిలాగా అయిపోతాడు అని అంటుంటారు… ది గ్రేట్ బొడ్డు దర్శకుడు రాఘవేంద్రరావు పోస్టు ఒకటి చూశాకే అదే అనిపించింది… ఆయన ‘సర్కారు నౌకరి’ అని ఓ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు… దానికి సంబంధించిన ఓ పోస్టు పెట్టాడు ఫేస్బుక్లో… వోకే, తన టీం పెట్టినట్టుంది… 9 గంటల్లో దానికి వచ్చిన లైకులు ఎన్నో తెలుసా..? వంద..! నిజంగా […]
ఓహ్… ప్రదీప్ అదృశ్యం, నందు ప్రత్యక్షం వెనుక అదా అసలు సంగతి…
ఈటీవీ నాన్-ఫిక్షన్ కేటగిరీలో దాని ప్రధాన బలాల్లో ఢీ షో కూడా ఒకటి… ఈ డాన్సింగ్ షోకు పోటీగా వేరే చానెళ్లు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాయి, భారీ ఖర్చు పెట్టాయి కానీ సక్సెస్ కాలేదు… ఐతే ఫిక్షన్ కేటగిరీలో అత్యంత వీక్‌గా ఉండే ఈటీవీ ఈ నాన్ -ఫిక్షన్ (రియాలిటీ షోలు ఎట్సెట్రా) కేటగిరీని కూడా ఈమధ్య బాగా దెబ్బతీసుకుంది… దాంతో చానెళ్ల పోటీలో బాగా వెనుకబడిపోయి, స్టార్ మాతో పోలిస్తే చాలా చాలా దూరంలో కుంటుతోంది… అది […]
గుంటూరు కారం ఘాటు లేదని తిట్టేస్తారా..? ఈసారి కడప కారంతో కొడతాడు జాగ్రత్త…!!
“నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చెంపలకంటిన చేమంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమల్లె చుట్టేస్తావే ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ నా చున్నీ నీకు టై కట్టాలి …” కాలంతో పాటు భావకవిత్వం, గేయకవిత్వం మారాలి. మారింది. అయినా ఈ పాటలో […]
నీ పిండం పిల్లులు ఎత్తుకుపోను… ఇదేం హారర్ సినిమారా నాయనా…
తలుపులు వాటంతటవే కొట్టుకోవడం… దూరంగా నక్కల ఊళలు, గబ్బిలాల రెక్కల చప్పుడు, కెవ్వుమని ఓ ఆడగొంతు అరుపు… కుర్చీలు ఊగడం, బాత్రూంలో అద్దం పటేల్మని పగిలిపోవడం… ఏదో ఓ ఫోటో నుంచి నెత్తురు కారడం… ఊరికి దూరంగా ఉన్న ఇల్లు, ఎవరూ ఉండని దెయ్యాల కొంప, అందులోకి కొందరు దిగడం, ఆత్మలు యాక్టివేట్ కావడం, చిల్లర వేషాలతో ప్రేక్షకుల్ని చిరాకెత్తించడం… ఢమఢమ అంటూ నేపథ్యసంగీతం… మంత్రగాళ్లు, యంత్రగాళ్లు, నిమ్మకాయలు, ముగ్గులు… హారర్ అంటే ఇదేనా..? అవును, తెలుగు […]
జడ్జిలుగా రాహుల్, శ్వేత, మంగ్లి, శ్రీరాం… శ్రీముఖి హోస్ట్… ఇంట్రస్టింగ్ టీం…
ఆమధ్య ముగిసిన ఐండియన్ ఐడల్ సింగింగ్ కంపిటీషన్ ఆహా ఓటీటీలో సూపర్ హిట్… నిత్యా మేనన్ బదులు సెకండ్ సీజన్లో గీతామాధురిని తీసుకున్నారు గానీ తిక్క తిక్క జడ్జిమెంట్లతో ప్రేక్షకులను పిచ్చెక్కించింది ఆమె… హోస్ట్‌గా రామచంద్ర బదులు హేమచంద్రను తీసుకున్నారు… వోకే, పెద్ద ఫరక్ పడలేదు… ఇక అదే కార్తీక్, అదే తమన్, ఎవరో ఒక గెస్టు… కంటెస్టెంట్ల ఎంపిక బాగుంటుంది, పాటల ఎంపిక బాగుంటుంది కాబట్టి ఆ షో రక్తికట్టింది… జీతెలుగులో అప్పట్లో అదేదో సరిగమప […]
ఫాఫం ఈటీవీ… ఫాఫం నిఖిల్… స్పై మూవీ హారిబుల్ డిజాస్టర్…
కార్తికేయ-2 జాతీయ స్థాయిలో ఎంత హిట్టో కదా… నిఖిల్ హీరో… తనను ఒకేసారి పది మెట్ల దాకా ఎక్కించింది ఈ సినిమా… ఐతేనేం, ఎవరైనా సరే, గెలుపు స్థానాన్ని సస్టెయిన్ చేసుకోవడమే కష్టం… స్పై పేరిట ఓ మూస సినిమాలో హీరోగా చేశాడు… అదేమో తలాతోకా లేని కథ, ప్రజెంటేషన్… మళ్లీ నిఖిల్ నేల మీదకు దిగొచ్చాడు దీంతో… ఫ్లాప్ ఈడ్చి కొట్టింది… సాధారణంగా ఈటీవీ కొత్త సినిమాలను కొని ప్రీమియర్లు ప్రసారం చేయదు… తనకన్నీ చీప్‌గా […]
నిజమే… మనకు యానిమల్స్ కావాలి… రియల్ సోల్డర్స్ను మనం చూడం…
ఎంత బాధాకరం….! ఇవ్వాళ యూత్ అంత ఎగబడి చూస్తున్న Animal మూవీ రిలీజ్ అయినరోజే… సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జీవిత చరిత్ర మూవీ శాం బహదూర్ రిలీజ్ అయ్యింది… కానీ దీనికి ప్రచారం లేదు… చూడమని చెప్పేవారు లేరు… మానిక్ షా గారి సాహసోపేత ఫైటింగ్ వల్లనే పాకిస్థాన్‌లో బెంగాలీల మీద జరుగుతున్న హింసను ఆపడానికి పాకిస్థాన్ ను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పడ్డది… షా గారు మొత్తం ఐదు […]
ఒక బలిసిన మగాడి ఉన్మాద, ప్రకోప, పైత్య, చిత్తవికార, ఉన్మత్త ప్రదర్శన ఇది…
Aranya Krishna……. హెచ్చరిక…. “జంతు ప్రవృత్తి” అనే కాన్సెప్టుని మనం నీచార్థంలో వాడుతుంటాం. అంటే అమానుషంగా, హింసాత్మకంగా ప్రవర్తించే వాళ్లని జంతువులతో పోలుస్తుంటాం. ఇది నిజానికి చాలా అన్యాయమైన పోలికే కాదు అజ్ఞానంతో కూడిన దురవగాహన కూడా! పాపం జంతువులు వాటి పని అవి చేసుకుంటూ ప్రకృతిబద్ధంగా జీవిస్తుంటాయి. ప్రకృతి ఏర్పరిచిన నియమాల్ని ఉల్లంఘించి ఐతే బతకవు. “యానిమల్” సినిమా చూశాక నాకు కలిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమొచ్చిందంటే, అసలు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి […]
రాజమౌళికే తాత సందీప్‌రెడ్డి… ప్రస్తుత దర్శకుల్లోనే ఓ ‘యానిమల్’…
అప్పట్లో ఏదో ఎన్టీయార్ సినిమాకు జనం ఎడ్ల బళ్లు కట్టుకుని, సద్దులు కట్టుకుని, పిల్లాపాపలతో ఊళ్ల నుంచి తరలిపోయేవారట… విన్నాం, చదివాం… యానిమల్ సినిమాకు సంబంధించిన రెండుమూడు వార్తలు చదివితే అదే గుర్తొచ్చింది… రాజమౌళి అనుకుంటే రాజమౌళికే తాత పుట్టుకొచ్చాడు కదా అనిపించింది… విషయం ఏమిటంటే… నార్త్‌లో కొన్నిచోట్ల యానిమల్ సినిమాను 24 గంటలూ వేస్తున్నారట… మనం శివరాత్రి పూట జాగారం కోసం వేసే మిడ్ నైట్ షోలు చూసేవాళ్లం… మరీ గిరాకీ అధికంగా ఉండే స్టార్ […]
మరీ అంత ‘ఎక్సట్రా ఆర్డినరీ’ ఏమీ కాదు… జస్ట్, ఓ ఆర్డినరీ తెలుగు సినిమా…
అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన సినిమా జయం… అప్పటికి ఇంకా టీన్స్‌లో ఉన్న నితిన్‌కు భారీ విజయం… తరువాత..? అదే పెద్ద క్వశ్చన్ మార్క్… రాజమౌళి తీసిన సై బెటర్… ఆ తరువాత..? మళ్లీ క్వశ్చన్ మార్క్… మళ్లీ 2012లో ఇష్క్ వచ్చేవరకూ ఫ్లాపులే ఫ్లాపులు… నితిన్ అసలు హీరోగా నిలదొక్కుకుంటాడా అనేదే పెద్ద ప్రశ్నగా నిలిచిన తరుణంలో… ఈ సినీ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆ ఇష్క్ ఊపిరి పోసింది… అందులో హీరోయిన్ నిత్యామేనన్ […]
ఏనిమల్ పేరెట్టాడు గానీ… అవే నయం ఈ హీరోకన్నా… ఇదేం సినిమార భయ్…
అప్పట్లో అర్జున్‌రెడ్డి సినిమా మీద బోలెడన్ని విమర్శలు… తిట్లు, శాపనార్థాలు… మరోవైపు మెచ్చుకోళ్లు… అదే దర్శకుడు దానికి డబుల్, ట్రిపుల్ ఇంపాక్ట్‌తో అదే ‘అతి’తో జనం మీద రుద్దిన సినిమా ఏనిమల్… నిజంగానే హీరో కేరక్టరైజేషన్ జంతువే… దర్శకుడి ఆలోచన విధానం కూడా అదే… వాడెవడో మెచ్చాడు, వీడెవడో చప్పట్లు కొట్టాడు, వందల కోట్లు కొల్లగొడుతున్నాడు అనే కోణంలో ప్రభావితులై చాలామందికి ‘సద్విమర్శ’ చేతకావడం లేదు… కానీ ఫేస్బుక్లో Haribabu Maddukuri రాసిన ఒక రివ్యూ ఆసక్తికరంగా […]
వాచికం… నటనలో ఇదీ ప్రధానమే… అందులో సాక్షి రంగారావు మహాదిట్ట…
Bharadwaja Rangavajhala….. సాక్షి రంగారావు… కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు. నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం … సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి కన్నుమూశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం మీద తన […]
పర్లేదు… బలమైన ఎమోషన్స్ పలికించే ఆ పాత నాని మళ్లీ కనిపించాడు…
నాని… నేచురల్ స్టార్ అని పిలిచినా, మరో పేరుతో పిలిచినా… తను సెన్స్ ఉన్న నటుడు… టైమింగ్, మెరిట్ ఉన్న నటుడు… తెలుగు హీరోల్లో చాలా అరుదు… బండ కొట్టుడు మొహాలే తప్ప బలంగా ఉద్వేగాల్ని పలికించే నటులెవరున్నారని… సో, నాని తెలుగు ఇండస్ట్రీకి ఓ అసెట్… కాకపోతే ఎప్పుడైతే స్టార్ ఇమేజీ వచ్చిందో, ఇక తనూ దారితప్పి ఫాల్స్ ఇమేజీ బిల్డప్పుల బాటలోకి వెళ్లిపోయాడేమో అనిపించింది పలుసార్లు… టక్ జగదీష్ సినిమాలో చొక్కా వెనుక దాచిన […]
సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…
ఆగీ ఆగీ… ఆచితూచి… భలే అవకాశాల్ని కొట్టేసింది సాయిపల్లవి… మూడు… ఆ మూడూ ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చేవి… పేరు తీసుకొస్తాయో లేదో వేరే సంగతి, తను పాన్ ఇండియా స్టార్ కావాలనే ఎయిమ్‌తో కదులుతోంది… నిజానికి కొన్నేళ్లుగా చూస్తే ఆమెకు మంచి హిట్ లేదు… ఎంచుకున్న పాత్రలు మంచివే… ఆమెను నటిగా ఆవిష్కరించేవే… లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి… ప్చ్, ఇవే కాదు, ఫిదా తరువాత ఆమెకు బలమైన హిట్ పడలేదు… […]
ఈ లెంతీ Animal మూవీలో రష్మిక నటన ఒక్కటే పెద్ద రిలీఫ్…
రష్మిక.. జాతీయ అవార్డు అందుకోగల నటి …. Note: This is not a Film Review. There is nothing about Story and Other Details… … ‘Animal(హిందీ వెర్షన్) సినిమాని వచ్చే ఏడాది జాతీయ అవార్డుల కోసం పంపిస్తే, అవార్డుల కమిటీ సరిగ్గా, నిష్పక్షపాతంగా, వినూత్నంగా ఆలోచించి అవార్డు ఇస్తే, ‘రష్మిక’ గారి తప్పకుండా జాతీయ ఉత్తమ నటి అవార్డు ఇవ్వాలి! తప్పకుండా ఆమెకే రావాలి. ఈసారి మిస్సయినా మరో సినిమాలో తప్పకుండా […]
ఉత్త మెంటల్ మూవీ… యానిమల్ అని పేరెట్టి జంతు మనోభావాల్ని కించపరిచారు…
M.g. Uday Kiran… అనే మిత్రుడు యానిమల్ అనే సినిమాకు సంబంధించిన ఓ రివ్యూ పోస్టులో పెట్టిన కామెంట్ ను ఓసారి చదవండి… ‘సార్… ఏమి బాగుంది సార్ సినిమా… అసలు బాగాలేదు నాకు నచ్చలేదు… Family వాళ్ళని తీసుకుని ఎవ్వరూ ఈ సినిమా కి వెళ్ళకండి… తమ్ముడు చనిపోయాడు అని తెలిసి అన్న తన 3వ పెళ్ళాంతో సంభోగం చేస్తాడు, తరువాత మొదటి, రెండవ పెళ్లాలతో కలసి ముగ్గురిని కలిపి చేస్తా అని చెపుతాడు… ఇది […]
పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
Bharadwaja Rangavajhala……. పాదరస గాత్రులు… టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ఏస్కో కోకోకోలా దగ్గర నుంచి నిన్నమెన్నటి ఊ అంటావా మావా వరకూ కూడానూ … మరి ఆ యొక్క ఐటమ్‌సాంగ్స్ కిక్కే వేరు. ఈ కిక్కులో సగం మాత్రమే నిజానికి సగం కన్నా తక్కువే డాన్సర్ కంట్రిబ్యూషన్ అయితే మిగతా అంతా కూడానూ … పాదరసగాత్రంతో హస్కీగా ఈ పాటలు పాడే నేపధ్యగాయనీమణులకే చెందుతుంది. చెందాలి కూడానూ… అంచేత ఈ […]
తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ .. అనువాదం ఓ అద్భుత కళ…
తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ … అతను ఊరికి పెద్ద. ప్రేమించింది ఒకర్ని, పెళ్లి చేసుకుంది మరొకర్ని. తప్పలేదు. ఊరిని ఒకటిగా నిలపడానికి అదొక్కటే దారి! భార్య పల్లెటూరి అమాయకురాలు. చదువు లేదు. కానీ బోలెడంత సంస్కారం ఉంది. భర్తపై ఎనలేని ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోడానికి ఆమెను పడకటింటికి పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకొని పాట పాడమన్నాడు. గీత రచయితలకు ఇలాంటి సందర్భాలకు అరుదుగా దొరుకుతాయి. ఆ క్షణాన ఆ సందర్భానికి అందమైన […]
అప్పట్లో పాపులర్ సంగీత దర్శకుడు… ఆ మహిళే చంపించిందా..?
Bharadwaja Rangavajhala…….. రావో! మము మరచితివో… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలసవెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్ గా […]
మనదేశం… NTR తెరంగేట్రం సినిమా… నేటికి 74 సంవత్సరాలు…
Bharadwaja Rangavajhala…. ఎన్టీఆర్ అనబడే ఒక నటుడు తెరంగేట్రం చేసిన చిత్రం మనదేశం. విడుదలై నేటికి డెబ్బై నాలుగు సంవత్సరములు పూర్తయ్యెను. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రము ఓ బెంగాలీ నవల ఆధారంగా నిర్మితమయ్యెను. అందు పోలీసు అధికారి పాత్రలో నటించిన నటుడు తదనంతర కాలంలో పెద్ద హీరో అయి దరిమిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయ్యెను. 1949 నవంబర్ 24న ఈ చిత్రము … బెజవాడ దుర్గాకళామందిరముననే విడుదల అవుట విశేషము. తదనంతరము ఈ […]
- « Previous Page
- 1
- …
- 80
- 81
- 82
- 83
- 84
- …
- 110
- Next Page »