ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో శృంగార నర్తకి (నటి అంటే సరిపోయేదేమో..) జయమాలిని తనకు నచ్చిన పాట సింహబలుడు సినిమాలో ఎన్టీయార్‌తో చేసిన ‘సన్నజాజులోయ్’ అని చెప్పింది… ఎందుకు నచ్చింది అంత బాగా అని ఇంటర్వ్యూయర్ అడిగినట్టు, ఆమె ఏదో చెప్పినట్టు గుర్తులేదు… కానీ నిజానికి ఆమె చేసిన వందల ఐటం సాంగ్స్‌లో దీనికి మరీ అంతగా గుర్తుంచుకునేంత సీన్ ఉందా అనేది ప్రశ్న… ఉంది… కానీ ఆ పాటలో ఏవో సాహిత్య విలువలున్నాయని కాదు, అవేమీ లేవు […]
విశిష్ట అద్వైతుడు రామానుజాచార్యుడి బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ..!
సోషల్ మీడియాలో కొన్ని ఠక్కున ఆకర్షిస్తయ్, ఒకింత ఆలోచనలో లేదా ఆందోళనలో పడేస్తయ్… అనుమానించేలా చేస్తయ్… చివరకు అదేమీ లేదులే అని తేల్చుకున్నాక కుదుటపడుతుంది… ఇదీ అలాంటిదే… బాలయ్య హీరోగా రామానుజాచార్యుల బయోపిక్ తీయబోతున్నారు, బాలయ్య 109వ సినిమా ఇదే, చినజియ్యర్ స్వామి సూచనలతో కథ ఉంటుందనేది ఆ పోస్టు సారాంశం… ఓ ఫోటో కూడా పెట్టారు… ఆరా తీస్తే, కొన్ని పరిస్థితులు, ప్రజెంట్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చునని తేలిపోతుంది… రామానుజాచార్యుల కథ విశిష్టం… […]
ఆర్కే లక్ష్మణుడు… జస్ట్, కామన్ మ్యాన్ కాదు… అంతకన్నా తక్కువే సుమీ…
Bharadwaja Rangavajhala….. ఎవిఎమ్ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ తీసిన భూకైలాస్ చిత్రంలో మున్నీట పవళించు నాగశయనా అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనంలు. ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు కమలా లక్ష్మణ్. ఆ లక్ష్మణ్ ఎవరో కాదు… కామన్ మ్యాన్ కార్టూనుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆర్కే లక్ష్మణే. కమల లక్ష్మణ్ పెళ్లైతే చేసుకున్నారు […]
సల్మాన్‌ఖాన్ తాజా బకరీ పూజా..! కన్నడ మార్కెట్ రష్మిక నోరుమూసింది..!
మూడు వార్తలు… వేర్వేరు నటీమణులు… మణులో మాణిక్యాలో గానీ… రెండూ మంగుళూరు బేస్డ్ తారలే… ఇద్దరూ భీకరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు… మీరిద్దరూ అసలు కన్నడ తారలే కాదు, మిమ్మల్ని సహించాల్సిన పనిలేదు… మీకు కన్నడ ఇండస్ట్రీ అన్నా, కర్నాటక అన్నా, కన్నడతనం అన్నా లెక్కలేదు… మీ దుంపతెగ… మిమ్మల్ని మావాళ్లు అని చెప్పుకోవడమే మాకు సిగ్గుచేటు అని తిట్టిపోస్తున్నారు… వీరిలో ఫస్ట్ రష్మిక… కన్నడ జనం ఆమెకు తెలుగు బలుపు, తమిళ బలుపు, హిందీ బలుపు అని […]
మరీ అలా నేరుగా అడిగితే ఏం చెబుతాం… గుర్తుండేలా లేదోయ్ శీతాకాలం…
ఈ సినిమా మీద కాస్త ఆసక్తి ఎందుకు అంటే… 1) సత్యదేవ్… ఒరిజినల్‌గా మెరిట్ ఉన్న నటుడు… వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి… వర్ధమాన హీరోల్లో కాస్త ఫ్యూచర్ కనిపిస్తున్న హీరో… 2) తమన్నా… ఎక్కడో ఉండాల్సిన పాపులర్ నటి… ఫాఫం, అవకాశాలు సరిగ్గా లేక కిందామీదా పడుతోంది… 3) కన్నడం నుంచి మనకు రీమేక్స్ తక్కువ… రెండేళ్లుగా నిర్మాణం సా-గు-తు-న్న సినిమా… 4) నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ తరహా స్టోరీ… సినిమా మొత్తం పూర్తయ్యాక, […]
పంచతంత్రం… వెబ్ సీరీస్‌గా పనికొచ్చే అంథాలజీ… థియేటర్ సరుకు కాదు…
అంథాలజీ… సినిమా కథలకు సంబంధించి ఇదొక వెబ్ ట్రెండ్… నిజమే, అది థియేటర్ ట్రెండ్ కాదు… భిన్నమైన కథలను ఓ దారంతో కుచ్చి, హారంగా చేయడం… మంచి అభిరుచి, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే..! అదీ సరిగ్గా కుదరాలి, ఓ పువ్వు చిన్నగా, వర్ణరహితంగా ఉంటే హారం సరిగ్గా కుదరదు… పైగా వేర్వేరు కథలను ఒకేచోట కలిపి కుట్టేయడం అంత వీజీ కూడా కాదు… అది అమరాలి… పైగా కమర్షియల్ వాల్యూస్ లేకుండా… ఓ వర్తమాన సినిమా లక్షణాలు […]
ఆలూ లేదు, చూలూ లేదు… సీత పాత్రలో సాయిపల్లవి… ఆలియా పడనిస్తుందా..?!
సాయిపల్లవి… మంచి నటి… నటనలో మెరిట్కన్నా తన ప్రవర్తనలో మెచ్చదగిన నటి… ఆ చర్చలోకి ఇక్కడ వెళ్లాల్సిన పనిలేదు గానీ… అది ఒడవని ముచ్చట గానీ… చాన్నాళ్లుగా వార్తల్లో లేదు… అయిపోయింది, గార్గి, విరాటపర్వం ఫెయిల్యూర్ల దెబ్బకు ఇక ఆమెకు చాన్సులు లేవు, ఎక్స్పోజ్ చేయదు, ఎదవ్వేషాలు వేయదు, అందులో ఏ నిర్మాతా పిలవడం లేదు, చేతిలో పనిలేదు, దాంతో ఇక తన డాక్టరీ పనితో ఓ పెద్ద హాస్పిటల్ కట్టాలని ప్లాన్ చేస్తుంది అనే వార్తలు […]
వేరే వ్యక్తితో పెళ్లి, ఓ బిడ్డ… ఐనాసరే కమల్‌తో బంధంపై అవే రాతలు, కూతలు…
పూజా కుమార్ అనే నటి తెలుసా మీకు..? అమెరికాలో పుట్టింది, ఇండియన్ రూట్స్… అక్కడ చిన్న చిన్న సినిమాలు చేసి చెన్నై వచ్చిపడింది… కాదు, కమలహాసన్ కళ్లల్లో పడింది… పడిపోయింది… ఉత్తమ విలన్, విశ్వరూపం, విశ్వరూపం-2… అన్నింట్లోనూ ఆమే… లిప్ లాకులు, మస్త్ కెమిస్ట్రీ… తనకు అలవాటైన రీతిలోనే గౌతమిని కూడా వదిలించుకున్నాక కమలహాసన్‌కు పూజ దొరికింది… కొన్నేళ్లు సహజీవనం చేశారనే వార్తలు బోలెడు వచ్చాయి తమిళ మీడియాలో… కానీ తను 2020లో విశాల్ జోషిని పెళ్లి […]
ఎన్టీయార్ రూమ్మేట్… తన విజయాల్లో భాగస్వామి… రెండేళ్లు మాటలు బంద్…
Bharadwaja Rangavajhala……… జయకృష్ణా ముకుందా మురారీ… సినీ సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన సంగీత దర్శకుడుగా టి.వి.రాజు మోస్ట్ పాపులర్. జానపద సినిమాల్లో పాశ్చాత్య సంగీతం వినిపించడం … జానపదగీతాల్లో వెస్ట్రన్ బీట్స్ జోడించడం, హిందూస్థానీ సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వడం… ఇలా ఒకటేమిటి… అనేక ప్రయోగాలు. ఇన్ని చేసిన సంగీత దర్శకుడు తోటకూర వెంకటరాజు. టి.వి.రాజు అధికంగా ఎన్టీఆర్ చిత్రాలకే సంగీతం కూర్చారు. ఇద్దరూ ఒకే సమయంలో చెన్నైలో కాలు పెట్టడంతో పాటు ఇద్దరూ కల్సి ఒకే […]
పదాలన్నీ పచ్చల పిడిబాకులే… పదప్రయోగంలో సినారె రసికుడైన వగకాడు…
ఈటీవీ స్వరాభిషేకంలో మాళవిక పాడుతోంది… ఛాంగురే బంగారురాజా… ఏ పదానికి ఏ అర్థవంతమైన భావాన్ని పలికించాలో, ఎలా ఉచ్చరించాలో బాగా తెలిసిన శ్రావ్యమైన గొంతు… మధురం… కైపున్న మత్స్యకంటి చూపు పదాల దగ్గర స్పష్టంగా భావాన్ని పలికించింది… చాలామంది మచ్చకంటి చూపు అని పాడేయడం విన్నాను… లిరిక్స్ సైట్లు కూడా అలాగే రాసుకున్నాయి… ఈ మచ్చ ఉన్న కన్ను ఏమిటి..? అంతటి సినారె అలా రాశాడేమిటో అనుకునేట్టు..! కానీ అది మత్స్యకంటి చూపే… అంటే చేపకళ్ల పిల్ల […]
చిరంజీవి ఏడుపు ఆగడం లేదు… తెల్ల చొక్కా తడిసిపోయింది కన్నీళ్లతో…
Abdul Rajahussain ………… వంశీ కొత్త పుస్తకం-2…. వంశీకి “ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి “… ఇంతకీ చిరంజీవి కళ్ళలో నీళ్ళెందుకు..? ఆ రోజు… ‘మంచుపల్లకి’ క్లైమాక్స్ సీన్ ను చిరంజీవి మీద తీయాలి.. చిరంజీవిని పిలుద్దామని రూమ్ కు వెళితే ఆయన కళ్ళ నిండా నీళ్ళు, ఆయన తల మీద చెయ్యేసి నిమురుతున్నాడు స్టిల్ కెమెరా రాజేంద్ర ప్రసాద్….! “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు రాజేంద్రప్రసాద్..! ఏం జరిగింది…? ఏం జరిగింది ? యూనిట్ అంతా […]
పద్యం పాడాలంటే ఘంటసాల… ప్రాణం పోశాడు, పరుగు పెట్టించాడు…
Bharadwaja Rangavajhala……. పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్… తెలుగు సినిమా పాటకు శాశ్వతత్వం ప్రసాదించిన గళం పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. మొన్న ఘంటసాల వారి పుట్టిన రోజు. తెలుగుజనం పెద్దగా స్మరించుకున్నట్టు లేదు… తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల. పద్యనాటకాల్లో నటించాలంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోక తప్పేది కాదు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే…ఈ కసరత్తు తప్పదు మరి. సాహిత్యాన్ని మింగేసేలా సంగీతం సాగేది. రాగాలు సాగేవి. ఈ పద్దతిని సమూలంగా మార్చిన వాడు ఘంటసాల. […]
వావ్ సుధీర్… అల్లు అరవింద్‌కు కూడా నచ్చేశావ్… తప్పలేదు…
మొన్న మనం చెప్పుకున్నాం కదా… ఆఫ్టరాల్ జబర్దస్త్ కమెడియన్ అని తీసిపారేసిన సుడిగాలి సుధీర్ ఈరోజు సక్సెస్ ఫుల్ చిన్న హీరో… ఏం, సక్సెస్ కొట్టాలంటే విషక్సేన్లు, శిరీష్‌లు, విష్ణులు అయి ఉండాలా..? సుధీర్‌లు కూడా కొడతారు… కొట్టి చూపిస్తారు… చూపించాడు సుడిగాలి సుధీర్… గాలోడు అంటే అందరూ ఒకే తీరు కాదు, కొందరికి సుడి ఉంటుంది, అందుకే సుడిగాలి సుధీర్ అయ్యాడు… ఈమాట ఊరికే అనడం లేదు… తను హీరోగా చేసిన గాలోడు అనే సినిమా […]
వరాహరూపం… కథ మళ్లీ మొదటికొచ్చింది… గుళిగ కోర్టుల్ని రక్షించుగాక…
వరాహరూపం పాట కథ మళ్లీ మొదటికొచ్చింది… పాత పాటా, కొత్త పాటా, ఏ పాట ఉంచాలి, ఏది తీసేయాలి అర్థం గాక కాంతార టీం జుత్తు పీక్కుంటోంది… కోర్టుల్లో ఈ బాల్ అటూ ఇటూ తిరుగుతూ, ఈ టీంను గంగవెర్రులెత్తిస్తోంది… అందరికీ తెలిసిందే కదా… కాంతార సినిమాలో వరాహరూపం పాట ఎంత కీలకమో… నిజానికి ఆ పాట లేకపోతే క్లైమాక్స్ లేదు, ఆ క్లైమాక్స్ లేకపోతే సినిమాయే లేదు… కానీ ఆ పాట మేం రిలీజ్ చేసిన […]
ఇదేం వార్త..? పెళ్లానికి కారు కొనిస్తే ఇంతటి బబ్రాజమానం స్టోరీయా..?!
అనుకోకుండా ఓ వార్త చదవబడ్డాను… ఖర్మకాలి అన్నంత సీరియస్ ఏమీ కాదు, కానీ చికాకు పుట్టించేదే… ఒకప్పుడు ఈనాడు వెన్నులో చలి పుట్టించిన వార్త డెయిలీయేనా ఇది అని ఆశ్చర్యమేసింది… ఫాఫం, ఇప్పుడు మరీ మిర్చి బజ్జీలు, కారా చుడువా కాగితం అయిపోయింది… దాని సినిమా పేజీలో ఓ వార్త… ‘భార్యకు ఖరీదైన కారు బహుమతిగా అందించిన త్రివిక్రమ్’… ఇదీ శీర్షిక… ఈ వార్తకు త్రివిక్రమ శ్రీనివాస్ ఎంత ఘనుడో, ఎంత కీర్తిమంతుడో, ఎంతటి కార్యశూరుడో, ఎంతటి […]
సినిమా ఇండస్ట్రీలో అంతులేని అనిశ్చితి… దిల్ రాజు చెప్పలేకపోయింది ఇదే…
‘‘నేనొకరి ఇంటికి ఈమధ్య భోజనానికి వెళ్లాను, తను చెబుతున్నాడు, ఆర్ఆర్ఆర్ తప్ప అసలు థియేటర్లో సినిమా చూసి చాలాకాలమైంది అని… అన్నీ ఎంచక్కా ఓటీటీలో చూసేస్తున్నారు… ఓటీటీ ప్రభావం అది…’’ తెలుగు సినిమాను శాసించే సిండికేట్‌లో కీలకవ్యక్తి దిల్ రాజు చెప్పిన మాటే ఇది… ఆర్కే ఓపెన్ హార్ట్‌లో మాట్లాడుతూ ఒక లెక్క చెప్పాడు… అది సినిమా భవిష్యత్తును చెప్పబోతోంది… ‘‘గతంలో 20 శాతం వరకూ నాన్- థియేటరికల్ రెవిన్యూ ఉండేది… మ్యూజిక్ రైట్స్ ఎట్సెట్రా… మిగతా […]
మరో క్రైమ్ థ్రిల్లర్… ఈ జానర్ ఇష్టపడేవాళ్లకు వోకే… శేషు టార్గెట్ కూడా వాళ్లే…
ఎన్నోసార్లు చెప్పుకున్నదే… కథ పాతదైతేనేం, కొత్తగా చెప్పు… లేదా కొత్త కథ చెప్పు… హిట్-2 సినిమాలోని కథలాంటివి ప్రపంచవ్యాప్తంగా బోలెడు సినిమాల్లో వచ్చాయి… సైకో కిల్లర్ కథలు అత్యంత పురాతన సబ్జెక్టు… పైగా ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎప్పుడూ చూసే జానరే… టీవీల్లో, వెబ్ సీరీస్‌లో కూడా ఇలాంటి కథలు బోలెడు… అదేదో హిందీ చానెల్లో డిటెక్టివ్ సీరీస్ చాలా ఫేమస్ కూడా… ఇవన్నీ చూసినప్పుడు హిట్-2 ఓ సాదాసీదా ప్రయత్నమే అనిపిస్తుంది… పైగా ఏడు […]
ఎంతగా బంపర్ హిట్టయితేనేం… కార్తికేయుడిపై సీతారాముడిదే పైచేయి…
నిజానికి ఇదేమీ నిఖిల్, దుల్కర్ నడుమ పోటీ ఏమీ కాదు… కాకపోతే పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? సీతారామం, కార్తికేయ-2 రెండూ వేర్వేరు జానర్లు… సీతారామం వైజయంతి మూవీస్ వాళ్లది… స్వప్న దగ్గరుండి కథను, కథనాన్ని, పాటల్ని, షూటింగ్‌ను చూసుకుంది… అశ్వినీదత్ డబ్బు పెట్టలేక కాదు, ఐనా సరే, ఎక్కడెక్కడో తిరిగి, షూటింగు కంప్లీట్ చేసి, 30 కోట్లతో సినిమాను పూర్తి చేయించింది ఆమె… కొందరికి నచ్చకపోవచ్చుగాక… కానీ స్థూలంగా సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది… […]
ఆఫ్టరాల్ న్యూటన్… యాపిల్ ఎలా పడుతుందో కనిపెట్టాడు… కానీ ఈ మనిషి…
నిజానికి చిట్‌చాట్‌కైనా సరే… ఒక రాఘవేంద్రరావు, ఒక దగ్గుబాటి సురేష్, ఒక కోదండరాంరెడ్డి, ఒక అల్లు అరవింద్… వీళ్లు దొరికితే ప్రతి ఒక్కరిదీ విడివిడిగా దున్నేయాలి… ఒక్కచోట కలిపితే మిర్చి బజ్జి, కడక్ జిలేబీ, రగడా సమోసా, చికెన్ కబాబ్ కలిపి ఖైమా చేసినట్టు ఉంటుంది… ఏ టేస్టూ సపరేటుగా తెలియదు… అసలు ఆ కలయికే కుదరదు… నో, నో, బాలయ్యకు అవేమీ చెప్పొద్దు… అదంతా గుడ్డెద్దు చేలో పడ్డ యవ్వారం… 90 ఏళ్ల తెలుగు సినిమా […]
లైగర్ చుట్టూ గట్టిగానే బిగుస్తోంది… బాలీవుడ్‌కూ సెగ తాకుతోంది…
ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూరుకుపోతున్నారు… రష్మిక తనకు అవసరం లేని వివాదాల్ని నెత్తికి చుట్టుకుంటూ కూరుకుపోతోంది… విజయ్ దేవరకొండను మనీ లాండరింగు కింద ఈడీ గట్టిగానే బిగిస్తోంది… ఆ పిచ్చిది అనవసరంగా రిషబ్ అండ్ గ్యాంగును గోకుతోంది… పాతవన్నీ మనసులో పెట్టుకుని వాళ్లను రెచ్చగొడుతూ ఉంది… అవన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… కన్నడ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమె మీద మంట మీద ఉన్నారు… ఆమె నటించిన రెండు సినిమాలపై కర్నాటకలో నిషేధం అనే ప్రతిపాదన ఇంకా […]
- « Previous Page
- 1
- …
- 90
- 91
- 92
- 93
- 94
- …
- 130
- Next Page »