ఒక విషయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను మెచ్చుకోవచ్చు… పుష్ప సినిమాలోని పాటలకు గాయకుల ఎంపిక తీరు… ఏదో డబ్ చేస్తున్నాం కదా, ఎవరైతే ఏమిటిలే అనుకోకుండా ఏ పాటకు ఎవరి గొంతు సూటవుతుందో కాస్త శ్రద్ధతో దృష్టి పెట్టి, ఎంపిక చేసి పాడించాడు… ఉదాహరణకు… ఊ అంటావా, ఊఊ అంటావా పాట ఇంద్రావతి గొంతులో అద్భుతంగా పలికింది… ఆమె వాయిస్ కల్చర్, ఆ పాట తీరు, ఆమె పాడిన తీరు, ఆ ట్యూన్ అన్నీ భలే సింకయ్యాయి… […]
హే సినామికా ఎంత పనిచేస్తివే… పాత చింతకాయ పచ్చడిని వడ్డించావే…
మమ్ముట్టికి 68 ఏళ్లు… మలయాళంలో మెగాస్టార్… మోహన్‌లాల్‌తో పోలిస్తే కొన్నాళ్లుగా వెనకబడ్డట్టు అనిపించినా సరే, ఈరోజుకూ మంచి పాత్ర దొరికితే కుమ్మేస్తాడు… తన కొడుకు దుల్కర్ కూడా అంతే… మంచి మెరిట్ ఉంది… ఏ పాత్ర ఇచ్చినా దంచేస్తాడు… పాటలు పాడతాడు… కానీ పదేళ్లవుతున్నాసరే ‘‘ఇదీ నా సినిమా’’ అని కాలరెగరేసి చెప్పుకోదగినంత హిట్ లేదు… మలయాళం, తమిళం, తెలుగు, హిందీ… ప్రతి భాషలోనూ ఇంతే… హే సినామిక అనే తాజా సినిమా చూస్తే, దుల్కర్ మీద […]
మనికె మగె హితే… ఊ అంటావా… కచ్చా బదాం… ఇప్పుడు సింగర్ పార్వతి…
ఇవ్వాళ తెలుగు నెట్‌ను షేక్ చేస్తున్న గొంతు పార్వతి… కచ్చాబదాం పాటకన్నా తెలుగు ప్రేక్షకులు పార్వతి గొంతుకు నీరాజనం పడుతున్నారు… అందరూ, ప్రతి విషయంలోనూ యూట్యూబ్ చానెళ్లను ఆడిపోసుకుంటారు గానీ… ఈ కోకిలకు అద్భుతమైన ప్రాచుర్యం కల్పిస్తున్నారు… ఆమె గురించి ఏ వీడియో పెట్టినా సరే వైరల్ అయిపోతోంది… జీతెలుగు సరిగమప ప్రోగ్రాం కోసం ఎంపికైన ఆమె పాటకు పరవశించిన జడ్జిలు ఏం కావాలో కోరుకోవాలని అడగడం, ఆమె తన కోసం గాకుండా ఊరికోసం బస్సు వేయించాలని […]
లేడీ పవన్ కల్యాణ్..! సాయిపల్లవిపై తెలుగు ప్రేక్షకుల అనూహ్య అభిమానం..!!
ఏ సినిమా ఫంక్షన్లు జరిగినా సరే… హీరోలు కనిపించగానే అభిమానులు కేకలు వేయడం పరిపాటే… ఆ నినాదాల హోరులో కొంతసేపు హీరోలకు మాట్లాడటానికి కూడా గ్యాప్ దొరకదు… సరే, మన అభిమానుల సంగతి తెలిసిందే కాబట్టి దాన్ని పెద్ద విశేషంగా చెప్పుకోలేం… కానీ ఆడవాళ్లంటేనే అంగడి సరుకుగా చూసే ఇండస్ట్రీలో అలాంటి స్టార్డం ఓ హీరోయిన్ పొందడం కచ్చితంగా విశేషమే… ఆ స్టార్డం అనుభవిస్తోంది సాయిపల్లవి… గతంలో ఈ రేంజ్ పాపులారిటీ, ప్రేక్షకుల అభిమానాన్ని బహుశా ఏ […]
ఈటీవీకి ఊహించని షాక్… ఈ సినిమా ఒక టీవీ డిజాస్టర్… సిగ్గుపడే రేటింగ్స్…
చౌక ధరలకు సినిమాలు కొనడం, టీవీలో ప్రసారం చేయడం, సరిపడా యాడ్స్ సమీకరించడం అనే పనికి ఆ అభిరుచితోపాటు మంచి మార్కెటింగ్ మెళకువలు అవసరం… తెలుగు వినోద చానెళ్ల విషయానికొస్తే ఉన్నవే నాలుగు చానెళ్లు… జెమిని వాళ్లు ఏ సినిమాను ఏ రేటుకు కొంటారో ఎవరికీ తెలియదు… దాని రీచ్ చాలా తక్కువ… కొత్త సినిమాలు కొని ప్రసారం చేసినా చూసేవాళ్లు కూడా తక్కువే, రేటింగులూ తక్కువే… జీటీవీ, మాటీవీ కొత్త సినిమాల్ని ఆచితూచి సెలెక్టివ్‌గా కొని […]
పోనీ, ఒక్కమాట మీ అన్నయ్య చిరంజీవిని అడగలేకపోయావా నాగబాబూ..?!
‘‘బీమ్లానాయక్ గురించి సినిమా పెద్దలు ఒక్కరూ మాట్లాడటం లేదు, ఇండస్ట్రీ మాట్లాడటం లేదు… వాటీజ్ దిస్ దారుణం’’ అని నాగబాబు అలియాస్ పవన్ కల్యాణ్ బ్రదర్ అలియాస్ చిరంజీవి బ్రదర్ మాట్లాడుతుంటే నవ్వొచ్చింది… సోషల్ మీడియాకొచ్చి శోకాలు పెట్టడం దేనికి..? ఒక్కసారి చిరంజీవి దగ్గరకు వెళ్లి ‘‘హన్నయ్యా, హేమిటి ధారుణం..?’’ అని ఒక్క మాట అడగొచ్చు కదా… ఎలాగూ తమ్ముడు ఎత్తిచూపాడు కదా, వంగి వంగి దండాలు పెట్టడం దేనికీ అంటూ..! పవన్ కల్యాణ్ టెంపర్మెంట్కు ఆఫ్టరాల్ […]
మొదట్లో రాజేంద్రప్రసాద్‌ను హీరోగా తిరస్కరించాడు రామోజీరావు… కానీ..?
చాలామంది ఇప్పటి ప్రముఖులు ఒకప్పుడు కెరీర్ మొదట్లో ఛీకొట్టబడినవాళ్లే అయి ఉంటారేమో… బొచ్చెడు ఉదాహరణలు చదివాం కదా… పర్సనాలిటీ డెవలప్మెంటలిస్టులు కూడా తాము చెప్పే సక్సెస్ స్టోరీల్లో ఇదే ఊదరగొడుతుంటారు కదా… డైరెక్టర్ వంశీ రాస్తున్న పాత జ్ఞాపకాల్లో నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ఓచోట చదివితే ఇదే గుర్తొచ్చింది… అప్పట్లో రాజేంద్రప్రసాద్‌తో వంశీ ఓ సినిమా తీశాడు… దాని పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు అప్పట్లో కాస్త జోరుగానే సినిమా నిర్మాణం స్టార్ట్ చేసిన […]
నిత్యామేనన్ మీద త్రివిక్రమ్‌కు ఎందుకంత కోపం..? ఏమిటీ కత్తెర్లు..?!
తగ్గిందా..? నిన్నటి జోష్ చల్లబడిందా..? నేలమీదకు దిగిపోయింది కదా హైప్..! హిట్టో, సూపర్ హిట్టో, బంపర్ హిట్టో క్లారిటీ వచ్చింది కదా..! ఇక కాస్త వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం… ఈ సినిమాలో హీరోయిన్ నిత్యామేనన్… సంయుక్త మేనన్ అనే మరో మలయాళ నటి కూడా ఉంది, ఎవరబ్బా ఈమె అని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది గానీ, ప్రధాన పాత్ర మాత్రం నిత్యదే… ఈ సినిమా మలయాళ మాతృక అయ్యప్పనుం కోషియంలోని ఈ పాత్రతో పోలిస్తే […]
బీమ్లా నాయక్లాగే దంచికొట్టారు… ఈ రేంజ్ సినిమా కథనం నభూతో నభవిష్యతి…
ఆహా… పవన్ కల్యాణ్ అదృష్టమా మజాకా… ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రిక… అదీ అనేక దశాబ్దాల చరిత్ర ఉన్న పత్రిక… బీమ్లానాయక్ అనబడే సినిమా మీద ఓ రివ్యూ కమ్ భజన కమ్ కీర్తన కమ్ డప్పు భీకరంగా థమన్ బీజీఎం రేంజులో వాయించేసింది..! కార్యకర్తకూ, అభిమానికీ నడుమ… సినిమాకు, రాజకీయానికీ నడుమ… రేఖలు గీసుకోలేని పవన్ కల్యాణ్ ధోరణిలాగే…!! పాత్రికేయానికి రోజురోజుకూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రభ ఎప్పుడూ వెనుకంజ వేయదు… హహహ… పవన్ కల్యాణ్ […]
ఏదో వెలితి… గంగూబాయ్ చూస్తుంటే ఏదో అసంతృప్తి… ఎందుకలా..?!
సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది… కానీ ఏదో వెలితి… ఓ అసంతృప్తి… ఎందుకు..? గంగూబాయ్ కఠియావాడి సినిమా గురించే..! చాలారోజులుగా ఈ సినిమా మీద హైప్ ఉంది… ఎందుకు..? ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ స్టార్ అలియా నటిస్తోంది గనుక… అది కథానాయిక సెంట్రిక్ పాత్ర గనుక… ఓ వేశ్య కథ గనుక… కాదు, వేశ్యల కంపెనీని నడుపుతూ, మాఫియా ప్రోద్బలంతో రాజకీయాల్లోకి, సంఘసేవలోకీ అడుగుపెట్టిన ఓ డిఫరెంట్ కేరక్టర్ గనుక..! అన్నింటికీ మించి అది సంజయ్ లీలా భన్సాలీ […]
ఇగో క్లాష్..! ఇద్దరు హీరోల నడుమ నో ఇగో క్లాష్… పవన్ మార్క్ మాస్..!!
అయప్పునుం కోషియం అనే మలయాళ సినిమా బీమ్లానాయక్‌కు మాతృక… నిడివి ఎక్కువైన, మలయాళీ ప్రేక్షకులకు నచ్చేలా తీయబడిన సినిమా అది… దాంతో బీమ్లానాయక్ సినిమాను పోల్చడం దండుగ… తెలుగులో రీమేక్ చేశాక, తెలుగు ప్రేక్షకుడి కోణం నుంచే చూడాలి… రీమేక్ అన్నంతమాత్రాన ఒరిజినల్లాగే ఉండాలా..? అలా ఉండాలనుకుంటే డబ్బింగ్ చేస్తే సరిపోతుంది కదా, రీమేక్ దేనికి..? మలయాళ ఒరిజినల్ నటులు వేరు… కానీ తెలుగులోకి వచ్చేసరికి కచ్చితంగా ఇక్కడి మార్కెట్ అవసరాల మేరకు మార్పులు అవసరం… ప్రత్యేకించి […]
బీమ్లానాయక్ వచ్చిపోయేదాకా… టికెట్ రేట్ల కొత్త జీవో రాదన్నమాటేనా..?!
నిజం కావచ్చు, కాకపోవచ్చు… కానీ అనుకోవడానికి ఆస్కారమైతే ఇస్తుంది జగన్ ప్రభుత్వం… ఏమిటీ విమర్శ అంటే..? భీమ్లానాయక్ సినిమాకు, తద్వారా పవన్ కల్యాణ్‌కు ప్రయోజనం దక్కకూడదు అనే భావనతోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు జీవో ఇంకా విడుదల చేయడం లేదు అని..! ఎందుకు..? పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి..! ఎందుకు..? పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి..! ఎందుకు..? టికెట్ రేట్ల మీద కూడా పవన్ కల్యాణ్ ఒక్కడే నిటారుగా నిలబడి […]
హెచ్చరిక :: థియేటర్ వదిలాక మీ బుర్రలు కాసేపు పనిచేయకపోవచ్చు..!!
బోనీకపూర్ నేరుగా ఓ తమిళ చిత్రం నిర్మించడమే ఓ విశేషం… ఇన్ని బైకులు వాడాం, ఇన్ని కొత్త కార్లు కొన్నాం, మొత్తం కార్లు ఇన్ని వాడాం, ఇన్ని కార్లు ధ్వంసం అయ్యాయి, ఇన్ని బైకులు స్క్రాప్ అయిపోయాయి అని లెక్క చెబుతున్నప్పుడే అర్థమైపోయింది… ఈ సినిమాలో అవి తప్ప ఇంకేమీ కనిపించబోవడం లేదని..! అనుకున్నట్టుగానే ఉంది… రయ్ రయ్… సినిమా మొత్తం బైకు చేజులు, బస్సు చేజులు, కార్లు, గేర్లు… చెవుల్లో హోరు నింపే బ్యాక్ గ్రౌండ్ […]
సుడిగాలి సిద్ధార్థ్..! లుక్కేమో శుద్ధపూస, కానీ యవ్వారాల్లో తక్కువేమీ కాదు…!!
సీనియర్ నరేష్ భార్య అప్పుల బాగోతం పోలీసు కేసుల దాకా పోవడం ఏమో గానీ, నరేష్ పాత పెళ్లిళ్లు, పెటాకులన్నీ సోషల్ చర్చలోకి వచ్చినయ్… నిజంగానే కామన్ రీడర్‌కు నరేష్ పాత పెళ్లిళ్ల గురించి తెలియదు… తాజా పవిత్రాలోకేష్తో బంధమూ తెలియదు… ఈ చర్చ సాగుతూ ఉండగా, ఒకాయన ‘‘నరేష్ కథలు సరే, కానీ ఎవరు శుద్ధపూసలు..? ఈ రంగుల ప్రపంచంలో ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తయ్ కదా… లవ్వు, బ్రేకప్పు, లివ్ఇన్, డేటింగ్, పెళ్లి, […]
లాకప్..! బిగ్‌బాస్‌ను మించిన భీకరమైన కాన్సెప్ట్… ఇది కంగనా జైలు…!
LOCK UPP… ఈ ఓటీటీ రియాలిటీ షో పేరు చూసి… వాడేమిటి పేరు ఇలా పెట్టుకున్నాడు, స్పెల్లింగ్ కూడా తెలియదా అని ఆశ్చర్యపడకండి… BIGG BOSS అని చూడలేదా..? ఇదీ అంతే… లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త అన్నమాట… బిగ్‌బాస్ షో నిర్మించే ఎండెమాల్ సంస్థే ఇప్పుడు కంగనా రనౌత్ హోస్టుగా ఈ లాకప్ అనే సరికొత్త రియాలిటీ షోకు తెరలేపుతోంది… అనేకానేక దేశాల్లో రియాలిటీ షోలు, ఇతర టీవీ ప్రోగ్రాముల్ని నిర్మిస్తూ ఉంటుంది ఈ సంస్థ… […]
642 నిమిషాలు… ఔను, అనంత శ్రీరాముడితో స్వప్న సంభాషణ నిడివి…
2013… నార్వేలో ఓ టీవీ 30 గంటల ఇంటర్వ్యూ ప్రసారం చేసింది… ఇప్పటివరకూ ఇదే ప్రపంచరికార్డు… అంతకుముందు 2012లో న్యూజిలాండ్‌లో 26 గంటల టీవీ ఇంటర్వ్యూ ఒకటి సాగింది… దానికిముందు కూడా కొన్ని రికార్డులున్నయ్… అయితే అవి స్ట్రెయిట్ ఇంటర్వ్యూలు… గంటకు ఓ ఐదు నిమిషాల బ్రేక్ ఉంటుంది… చూసేవాడు చూస్తాడు, లేదంటే స్విచాఫ్… అయితే ప్రిరికార్డెడ్, ఎడిటెడ్ ఇంటర్వ్యూల మాటేమిటి ..? ఇవి ఇంకా సౌలభ్యం… అలా యూట్యూబులో పడేస్తే చాలు, అలా పడి ఉంటయ్… […]
గాంధారి..! హిందీ పాటను డబ్ చేసినట్టు..! మన యూట్యూబర్లు వందరెట్లు నయం..!
గాంధారి పేరిట ఓ మ్యూజిక్ వీడియో రిలీజైంది… సోనీ వాళ్లు నటి కీర్తిసురేష్‌తో చేసిన వీడియో అది… వేంఠనే మన సంకీర్తనాచార్యులందరూ అందుకుని, ఆహారాగాన్ని, ఓహోగానాన్ని ఎత్తుకున్నారు… నిజంగా ఆ మ్యూజిక్ వీడియోకు అంత సీనుందా..? ఏమీ లేదు… పైగా ఆ టీంను చూస్తే జాలేసింది… ప్రత్యేకించి పాటల రచయిత సుద్దాల అశోకుడికి ప్రయాస చూసి మరీ… ఏమాటకామాట… ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే కీర్తిసురేష్ సన్నబడింది… బొండుమల్లె వంటి దేహం కాడమల్లెలా కనిపిస్తోంది… తను ఏ […]
నరేషూ… ఓహో… తమరూ తక్కువేమీ కాదు… తమరి సతీమణి కూడా అంతే…
మొన్న ఒకాయన రాశాడు… నిజమే… నాగార్జున కుటుంబం ఓ శాపగ్రస్తం అని… తను రామానాయుడి కూతురిని పెళ్లిచేసుకున్నాడు… ఫెయిల్… ఆమె తరువాత వేరే పెళ్లి చేసుకుంది, నాగ్ కూడా అమలను పెళ్లిచేసుకున్నాడు… కొడుకు చైతూ పెళ్లి ఫెయిల్… చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం ఫెయిల్… సుమంత్ పెళ్లి ఫెయిల్… సుప్రియ పెళ్లి ఫెయిల్… ఇవన్నీ నిజమే… కానీ ఆ కలర్‌ఫుల్ ఇండస్ట్రీలో అన్నీ ఇవే కథలు కదా… ఒక్క నాగ్ ఫ్యామిలీనే ఎందుకు వేలెత్తి చూపడం..!! ఇవే […]
‘‘అంతటి లత బాగా పాడలేదనీ, మళ్లీ పాడమని అడగాలా, నెవ్వర్, నావల్లకాదు…’’
1991… పహ్లాజ్ నిహలానీ ఓ సినిమా తీశాడు… ఫస్ట్ లవ్ లెటర్ దాని పేరు… దానికి బప్పీలహిరి సంగీత దర్శకుడు… తనకున్న సాన్నిహిత్యంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనే అన్ని పాటలూ పాడించాడు బప్పీ… లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కృష్ణమూర్తి ఇతర ఫిమేల్ గాయకులు… నిహలానీ పాటల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు… బప్పీ కూడా తన అభిరుచికి అనుగుణంగా ట్యూన్స్ కట్టాడు… అందులో ఒక పాట తోతా తోతా… మనీషా కొయిరాలాకు ఫస్ట్ సినిమా… హీరో […]
జంధ్యాల వారి ఒకప్పటి ముద్దొచ్చే అలివేణి మరీ ఇలా అయ్యిందేమిటో..!!
అదేమిటో గానీ… కొందరు మాజీ హీరోయిన్లు ఏం తాగుతారో తెలియదు… డెబ్భయ్ ఏళ్ల వయస్సులోనూ మొహంలో గ్లో తగ్గదు, అరకిలో బరువు కూడా తేడా రాదు… అఫ్ కోర్స్, కొంత మేకప్ మహత్యం కావచ్చుగాక… కానీ అదొక వరం వాళ్లకు… రేఖ, హేమమాలిని గురించే కాదు, చాలా ఉదాహరణలు దొరుకుతయ్… కానీ చాలామంది తారలు సినిమాలు మానేస్తే చాలు, ఒకరిని కన్నారంటే చాలు… బరువు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతారు… దేహం మీద శ్రద్ధ పోతుంది… వయస్సులో ఉన్నప్పటికీ, […]
- « Previous Page
- 1
- …
- 95
- 96
- 97
- 98
- 99
- …
- 117
- Next Page »