Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని పాటలు అంతే… మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు…

January 13, 2024 by M S R

Bharadwaja Rangavajhala…   కొన్ని పాటలు అంతే… మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు.

లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు… కలనైనా నీ వలపే పాట తొలిచేస్తాందని చెప్పానుగా …

ఈ పాటలో …

Ads

కళలూ కాంతులు నీ కొరకేలే అని లీలగారు పాడేప్పుడు …

ఠక్కున మనసు రామకథను వినరయ్యా లోకి దూకేస్తుంది.

అదే లైనును పై స్థాయిలో కాక కోమలంగా పాడినప్పుడు అదే మనసు

పూజాఫలంలో …

పగలే వెన్నెలాలోకి జారుతుంది.

ఏమిట్రా ఈ గోల అని తరచి చూడగా …

ఈ పాటలు హిందోళంలో స్వరపరచారు అని అర్ధమవుతుంది.

ఈ హిందోళం అనే రాగమేదైతే ఉందో … అది చాలా హంటింగ్ స్వీటు రాగమన్నమాట …

బాదం బర్ఫీ తింటున్నప్పుడు ఇంకో రెండు అయినా పర్లేదని ఎన్ని తిన్నా అనిపిస్తుంది కదా అలాన్నమాట …

ఇలా ఆవేశపడి తినేసి ఆరోగ్యాలు పాడుచేసుకుంటారనే దాని రేటు కాస్త ఎక్కువ పెట్టారు తప్ప మిఠాయి కొట్టువాడులు … వాళ్ల స్వార్ధం ఏ మాత్రం లేదనే చెప్పాలి.

ఇంకా…

ఈ హిందోళ రాగంలో నాయనా …

అన్నీ కూడానూ కోమల స్వరాలే …

అందువల్ల రుచిగా తీయగా ఉండుద్దన్నమాట …

అంచేత మనాళ్లు కరుణ, భక్తి, శృంగార రసాలను ఆవిష్కరించడానికి ఠక్కున ఈ రాగంలోకి వెళ్తారన్నమాట …

అవ్విధంబుగా …

హిందూస్తానీ సంగీతంలోని “మాల్‌కోన్స్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని హిందోళం రాగానికి సమానం అంటారు పెద్దలు.

నాకు పెద్దగా తెల్దు .

సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అనే కుర్రాడూ …

ఎక్కువగా హిందూస్తానీ పోకడల్లోనే స్వరాలు కూర్చేవారు.

కారణం ఏమిట్రా భగమంతుడా అంటే ఆయన రంగస్థలం నుంచీ రావడమే … అన్జెప్పాడు భగమంతుడు.

అంటే ఏంటీ …

మన నాటకాల్లో ఉండేటువంటి పాటలకు పారశీక సంగీతం ప్రేరణగా ఉండేది …

ముఖ్యంగా నాటకం లో కానీ సినిమా లో కానీ…

పాట సంబాషణాత్మకంగా సాగాలి…

కనుక ఖవ్వాలీ తరహా ట్యూనులను అధికంగా ఉపయోగించుకునేవారు …

… అంచేత గురువుగారికి అలా అవి ఒంటపట్టాయి.

“మాల్‌కోన్స్‌” రాగంలో కంపోజ్ చేయడం వల్లనే ..

సువర్ణ సుందరి సినిమాలో పిలువకురా అలుగకురా… అంటూ సుశీల గారు పాడిన పాట కూడా మనకి కలనైనా నీవలపే కు దగ్గరగా అనిపిస్తుంది.

… అందులోనూ ముఖ్యంగా సమయము కాదుర అన్న దగ్గర మనకి ఠక్కున కలనైనా నీ వలపే గుర్తొస్తుంది.

ఆ సంగతి అలా వదిలిపెడితే …

తెలుగు సినిమాల్లో హిందోళాన్ని అధికంగా వాడుకున్న సంగీత దర్శకుల్లో ఘంటసాల , రాజేశ్పర్రావు లు ముఖ్యులు.

ఆ విషయం నాకు లీలగా గుర్తుంది అని ఎవరేనా అంటే

ఏడ్చావులే … ఘంటసాలలా గుర్తు లేదూ అనే వారు కదా …

ఊర్నే జోగ్గా …

అలా … లీల అనే ఆవిడ పాడే పద్దతి ఘంటసాల గారు పాడే పద్దతికి ఒక రకమైన అనుసరణలానే అనిపిస్తుంది.

ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఘంటసాల అన్నమాట …

దీనికి కారణం ఆ మధ్య భార్గవి గారు వివరించారు.

ఇలాంటి అనుసరణలు సినిమాల్లో చాలానే కనిపిస్తాయి.

ఉదాహరణకి …

కాంచన అనే హీరోయిన్ను డైలాగు చెప్పే పద్దతి అక్కినేని నాగేస్పర్రావు ఇమిటేషన్ లోనే నడుస్తుంది …

అబ్జర్వ్ చేయండి .. తెల్సిపోతుంది …

అట్టాగే …

కమలహసనూ అనబడే మహా నటుడు డైలాగు చెప్పే పద్దతి వీరోయిన్ లక్ష్మి అని ఒకావిడ ఉండుద్ది కదా ..

ఆ మధ్య ఏదో బేబి సినిమాలో కూడా ఏసింది కదండీ ఆవిడ డైలాగ్ చెప్పే పద్దతిలోనే నడుస్తుంది …

ఇట్టా బోల్డు మందిరి ఉన్నారు.

అయినా నాకెందుకు ..

ఇలా ఈ కలనైనా పాటను పట్టుకుని ఏడుస్తున్నాను ఎప్పుడైనా సరే ఈవాళ్టికి ఇంతే … అనుకోవడమే…

రేత్రికి నిద్రలోగానీ ఇది వదల్దు …

చిన్నప్పుడు పొద్దున్న లేవగానే మెడ నెప్పిగా ఉంది ఉంటే …

మా అమ్మ అనేదీ …

నిద్రలో పట్టేసి ఉంటుంది …

అది నిద్రలోనే పోవాలి … పట్టించుకోకు స్నానం చేసి బడికి బయల్దేరు అని …

అలాన్నమాట …

అంచేత బడికి బయలుదేరాలి ఇంక…

అంటే సైంధవ సిన్మాకు పోవాలా

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!
  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!
  • తల్లిదండ్రుల ఓవర్ కంట్రోల్ అసలు సమస్య – చేతన్ భగత్ విశ్లేషణ!
  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!
  • 95 ఏళ్ల వయస్సు దాకా… భారతీయ గుండెలకు అవిశ్రాంత సేవ..!!
  • “కొలై పండ్రాంగప్పో” – కరుణానిధి అరెస్టు రాత్రి అసలేం జరిగింది?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions