సడి సప్పుళ్లు… లేదా సడి చప్పుళ్లు… ధ్వని అనుకరణాలు… ఇతర భాషల్లో ఇలాంటి పదాలున్నాయో లేదో తెలియదు… కానీ తెలుగులో వీటికి ఓ విశిష్ట స్థానం… భావాన్ని సమర్థంగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించే పదాలు ఇవి… ఎవరో ఏదో పుస్తకంలో పొందుపరిచారు… ఆ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియదు… రెండు మూడు ఫేస్ బుక్ పేజీల్లో కనిపించాయి ఈ పేజీలు… ఆ పుస్తక ప్రచురణ నాటికీ ఇప్పటికీ కొన్ని పదాల్లో తేడాలు రావచ్చు, కొన్ని పదాలు లేకపోవచ్చు, […]
ఐతే అల్లూరి విముక్తి పోరు విరమించి… ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడా..?!
ఒక వార్త కనిపించింది… అదెలా ఉందంటే..? ఎహె, ఆపండి మీ సోది… అల్లూరి రామరాజుకి అంత సీన్ లేదు, అసలు ఆయన కాల్పుల్లో చచ్చిపోనేలేదు.., మీ ఉత్సవాలు, మీ భజనలు, మీ డప్పులు, మీ కీర్తనలు ఆపేయండి… 1924లో పోలీస్ కాల్పుల్లో ఉప్పరాపల్లి వీరవెంకటాచార్యులు అనే వ్యక్తి చనిపోయాడు… కానీ అల్లూరి అక్కడి నుంచి వెళ్లిపోయి, తూర్పు గోదావరి జిల్లా, బెండపూడిలో ఆశ్రమం పెట్టుకున్నాడు… 1939 నుంచి 1968 వరకూ అక్కడే ఉన్నాడు, ఇప్పటికీ ఆయన ఇద్దరు […]
కశ్మీరీ వజ్వాన్… ముప్ఫయ్ వంటకాల సంపూర్ణ మాంసాహార భోజనం…
ఎంతసేపూ ఉప్మాలు, ఉప్పుడుపిండేనా… అత్యంత బలవర్ధకం, రుచికరం, విభిన్నమైన, సంపూర్ణ భోజనం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు ఓ మిత్రుడు… ఉంది, కశ్మీరీ రెస్టారెంట్లు ఎక్కడున్నా సరే దొరుకుతుంది… దాని పేరు వజ్వాన్… అయితే రియల్ వాజ్వాన్ కావాలంటే కశ్మీర్ లోయే సూపర్… అదీ కట్టెల పొయ్యి మీద, ఆ వంటల ప్రిపరేషన్ బాగా తెలిసిన వంటవాళ్లయితే వజ్వాన్ కాదు, వాహ్వాన్ అనేస్తారు… అసలు ఈ భోజనం తీరే వేరు… మాంసాహారాన్ని ఇష్టపడే ఆహారప్రేమికులకు ఘుమఘుమలాడే వేడి […]
ఇందిర కాలపాత్ర… ఇప్పటికీ అదొక మిస్టరీ..! మోడీజీ, ఎనీ ఐడియా..?!
ఈ కాలపు విశేషాలను, నిజాల్ని, చరిత్రను, కాలాన్ని సూచించే వస్తువుల్ని, ఫోటోల్ని ఓ పెట్టెలో నిక్షిప్తం చేసి, లోతు భూగర్భంలో దాచేసి… ఏళ్ల తరువాత బయటికి తీసేలా జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయడం చాలా దేశాల్లో చూసిందే… టైమ్ క్యాప్సూల్స్ అంటాం కదా… తెలుగులో కాలనాళిక… ఆమధ్య 15 ఏళ్ల క్రితం కావచ్చు, టాలీవుడ్ కూడా ఓ కాలనాళికను రూపొందించి, పాతేసినట్టు గుర్తు… ఐనా అందులో ఏముంటాయిలే, మన సినిమాల సోది విశేషాలు తప్ప… రెండేళ్ల క్రితం అయోధ్య […]
… ఇదుగో వీటినే మరీ ‘పచ్చి పులుసు’ వార్తలు అంటారట..!!
సరే, సరే… రాజకీయ దూషభూషణలు కాస్త పక్కన పెట్టండి.,. ఈ ఈనాడోడు వరుసగా నాలుగు రోజుల నుంచీ బీజేపీ భేటీల్లో యాదమ్మ మార్క్ తెలంగాణ వంటకాలు అంటూ తెగ రాసేస్తున్నాడు… అక్కడికి ఇదేదో పెళ్లివేడుక, విందుభోజనాల ముచ్చటలాగా… అంతకుమించి వాడేమీ రాయడు కదా… కేసీయార్‌ను ఏమీ అనరాదాయె, మోడీని ఏమీ అనకూడదాయె… మరేం చేయాలి..? ఏ పార్టీ ప్లీనరీ అయినా, పెద్ద మీటింగు అయినా సరే… ఫస్ట్, మీడియా అటెన్షన్ భోజనాల మీదకు వెళ్తుంది… అక్కడికి వచ్చే […]
అబ్బే.., మనదీ ఓ సాహిత్యమేనా..? ఏం సక్కగుందని..?!
Taadi Prakash…… తెలుగు సాహిత్యంపై పతంజలి ఫిర్యాదు….. పతంజలి అని ఒకడుండేవాడు. కలాన్ని కత్తిలా పట్టుకుని, సిగరెట్ కాలుస్తూ రోడ్లమీద తిరుగుతుండేవాడు. కొన్ని కథలూ, నవలలూ రాశాడు. జర్నలిస్టుగా వుద్యోగం చేశాడు. ‘ఉదయం’ దినపత్రిక ఎడిటర్ గా పనిచేశాడు. వుద్యోగం పోయి ఖాళీగా వున్నప్పుడు, హైదరాబాద్ శంకరమఠం దగ్గర రెండు గదుల ఆఫీసులో నడుస్తున్న ‘మహానగర్’ అనే చిన్న పత్రికలో చేరాడు. అతి తక్కువ సర్క్యులేషన్ వున్న, పాంచజన్య అనే జర్నలిస్టు నడిపే ఆ పత్రికలో ఒకసారి […]
ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య రష్మి ఠాక్రే తమపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్నది, వాళ్ల భార్యలతో సంప్రదింపులు జరుపుతున్నది, తన భర్తకు మద్దతు కోరుతున్నది, మీమీ భర్తలకు నచ్చజెప్పాలంటూ విజ్ఞప్తి చేస్తున్నది…… ఇదీ వార్త..! తాడోపేడో తేల్చుకునే తరుణం వచ్చాక తరుణీమణుల దౌత్యాలు పనిచేస్తాయా అనుకుంటున్నారా..? అసలు పార్టీలో ఆమె నిర్ణాయక పాత్ర ఏమిటి..? ఆమె మాటకు విలువ ఎంత..? ఆమెకు రాజకీయాలు తెలుసా..? లేక కీలక సంక్షోభ సమయంలో భర్తకు ఏదో ఉడతాభక్తి […]
శ్రీదేవితో ఈ పిల్లలు ముగ్గురూ హీరోయిన్లే… మూడు వేర్వేరు బాటలు…
నగ్మా… పద్దెనిమిదేళ్లు పార్టీకి సేవ చేశాను… నాకు గుర్తింపేదీ..? రాజ్యసభ సీటేది..? పార్లమెంటుకు దారేదీ..? అని శోకాలు పెట్టింది కదా ఈమధ్య… అదే ఓసారి చెక్ చేస్తుంటే ఈ ఫోటో కనిపించింది… ఒకప్పటి పాపులర్ నటి శ్రీదేవితో ముగ్గురు పిల్లలు కూర్చుని దిగిన ఫోటో… ఇంట్రస్టింగు… వాళ్లెవరో తెలుసా..? నగ్మా అండ్ సిస్టర్స్… ఆ పిల్లలు ఒక్క తల్లి పిల్లలే… కానీ బాటలు వేర్వేరు… అవును మరి, ఎవరైనా పిల్లల్ని కంటారు తప్ప పిల్లల జాతకాల్ని కాదు […]
నిఘా… ఈ నవలది కూడా కాస్త జనగణమన సినిమా పోకడే…
కొన్నిసార్లు నవ్వొస్తుంది… ఎవరో ఓ పెద్దాయన తన పాండిత్య ప్రకర్షను మొత్తం వినియోగించి, మర్మగర్భంగా ఏదో సమాజానికి చెబుతున్నట్టుగా ఓ బిల్డప్ ఇస్తూ ఓ కవిత రాస్తాడు… అసలు తోటి కవులే ఎవరూ చదవరు… బుర్రకెక్కని ఆ కవిత్వం జనానికి అక్కర్లేదు… నయాపైసా ప్రయోజనం లేదు… కానీ ఆ కవితను అపూర్వమైన సాహిత్యసృష్టిగా, సేవగా చిత్రీకరిస్తూ, పత్రికల్లో ఎవడూ చదవని మండే సాహిత్యం పేజీల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వస్తుంటాయి… కానీ జనం ఇంకా కాస్తోకూస్తో చదువుతున్న నవలల […]
మీరు కాఫీ ప్రియులా..? పోనీ, కాఫీ ద్వేషులా… అయితే ఈ కథనం మీకే…
ఎవరో అంటారు… కాఫీలు, టీలు మంచివి కావు అని… ఇంకెవరో అంటారు… గుడ్డులోని పచ్చసొన చంపేస్తుంది అని… మరెవరో అంటారు… మసాలా వంటలు మంచివి కావు అని… చాలామంది చెబుతున్నారు… అన్నం తినొద్దు, విషం అని… అంతెందుకు… పాలు, పెరుగు, వెన్నల్ని అవాయిడ్ చేయమనీ చెబుతున్నారు కొందరు… అది మానెయ్, ఇది మానెయ్… ఇది తాగకు, అది తాగకు… మరేం తినాలి..? మరేం తాగాలి..? కానీ నిజం ఏమిటి..? అతి సర్వత్రా వర్జయేత్ అనే మాట మనసులో […]
ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా..? ఆశలు సన్నగిల్లుతున్నాయా..? ఐతే మీకోసమే ఇది..!!
మనుషుల్ని ఎలాగూ నమ్మే రోజులు కావివి… నీడకు కూడా ద్రోహచింతనే… సొంత రక్తబంధుత్వం సహా స్నేహితుల్ని కూడా నమ్మే కాలం కాదిది… మరెవర్ని నమ్మాలి..? అసలు నమ్ముకుంటే మంచి జరుగుతుందా..? అన్ని మతాల్లోని కోటానుకోట్ల దేవుళ్లను వదిలేసి, ఓ విశ్వశక్తీ, నాకు మంచి చేయి అని ఎంత కోరుకున్నా మంచి జరుగుతుందా..? ‘‘James Stockdale అని ఓ అమెరికన్ సైనికుడు – వియత్నాం యుద్ధంలో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్ సైనికులతోపాటు దొరికిపోయాడు… వీరిని జైలులో […]
ఎవరీ తాజా ఇన్‌స్టా సెన్సేషన్..? ఇలా ఫన్నీ రీల్… అలా క్షణాల్లో వైరల్…!!
ఎవరు ఈ పిల్ల..? సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్… ఈమధ్య ఇన్‌స్టాలో ఆమె మేజర్ సినిమాకు సంబంధించి పెట్టిన రీల్ ఏకంగా 18.4 లక్షల లైకులు… అడవి శేషు, మహేష్ బాబుతో కూడిన ఆ ఫన్నీ కమర్షియల్ వీడియో ఆరు రోజులుగా వైరల్… అదొక్కటే కాదు… కేజీఎఫ్-2 కోసం యశ్‌తో… సర్కారువారి పాట కోసం మహేష్ బాబుతో… ఆమధ్య అజయ్ దేవగణ్‌తో… షాహిద్ కపూర్‌తో… లక్షలకులక్షల లైకులే కాదు… సోషల్ మీడియాలో ఆమెను స్టార్‌ను చేసేస్తున్నాయి… పెద్ద […]
కృష్ణ అంటే ఏమిటో వంద కథలు చదవనక్కర్లేదు… ఈ ఒక్కటీ చదివితే చాలు…
ముందుగా ఓ కథ వంటి సంఘటన చదువుదాం… కథ అనడం ఎందుకంటే… పిల్లికి బిచ్చం వేయని, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వాళ్లుండే సినిమా ఫీల్డులో ఇలాంటి ‘‘నిజమైన హీరోలు’’ ‘‘మనసున్న కథానాయకులు’’ కూడా ఉంటారా అని మనకు డౌట్ వస్తుంది కాబట్టి… 2015లో ఆంధ్రజ్యోతిలో శ్రావణ్ అనే పేరుతో ఓ ఆర్టికల్ వచ్చింది… అందులోనే వివరాలున్నాయి కాబట్టి… సంక్షిప్తంగా, సూటిగా అందులో ఏముందో చూద్దాం… ‘‘తెలంగాణలోని మానుకోట నుంచి 1973లో ఓ కుర్రాడు మద్రాసు […]
జూనియర్ సింగర్ కాదు… స్వర సీనియర్లలో ఎవరికీ తీసిపోదు…
కొన్ని పాత పాటల్ని మ్యూజిక్ షోలలో గానీ, పోటీల్లో గానీ అటెంప్ట్ చేయడానికి సింగర్స్ ట్రై చేయరు… సాధన కష్టం… క్లిష్టమైన ట్యూన్, ఎక్కువ క్లాసికల్ టచ్ ఉన్ పాటలయితే వాటి జోలికే వెళ్లరు… సీనియర్లు కూడా ఎందుకోగానీ అలాంటి పాటల్ని పాడి మెప్పించాలని ప్రయత్నించరు… ఉదాహరణకు ‘శివశంకరీ శివానందలహరి’ పాట… సినిమాలో పాడిన ఒరిజినల్ సింగర్ ఘంటసాల ఎక్కడా మళ్లీ ఆ పాట పాడలేదు… వేలాది పాటలు పాడి, వేలాది కచేరీలు చేసిన అనితరసాధ్యుడు ఎస్పీ […]
మీరు ఎన్నైనా చెప్పండి… కొత్త ఆవకాయ రుచి చూడటం కూడా ఓ ఆర్ట్ మాస్టారూ…
Bharadwaja Rangavajhala……… నిజమైన ఆవకాయ సౌభాగ్యం కోనసీమలోనే చూడాలి . అందరికీ చిన్నా పెద్దా మామిడితోటలుంటాయి. ప్రతి తోటలోనూ ఆవకాయ చెట్టని ఒకటి విధిగా ఉంటుంది. వంశపారంపర్యంగా తాత, ఆయన తాత యెంచి దాని యోగ్యత నిర్ణయించి చప్పరించి మరీ వేసిన చెట్టది. ఆవకాయ చెట్టు అహంకారం ఎలాంటిది అంటే … ప్రతి పొరుగుచెట్టూ రెండో పక్షమే. పదిహేను రోజుల పాటు ప్రతి పెరడూ ఒక ఆవకాయ ఖార్ఖానా. ఉదయం పదిగంటల నుంచీ సాయంత్రం ఐదు గంటల […]
ఈ ఎన్టీయార్ ఫోటో వెనుక నేపథ్యం తెలుసా..? గతంలో చదివారా..?
“నందమూరి తారక రామారావు”… తెలుగు వెండితెర చరిత్రలో అజరామరమైన ఆయన నటనా ప్రస్థానం మనందరికీ తెలుసు. ఆయన రాజకీయ జీవితం అందరికీ ఎరుకే. కానీ ఎన్టీఆర్ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి వధూవరులు నాగభైరవ వీరబాబు, పద్మజ దంపతులు. ఆ సంఘటన గురించిన విశేషాలివి..! జూలై 7, 1988… […]
సినిమాల్లో హీరోయిన్ కథకు ఏమాత్రం తీసిపోని రియల్ లైఫ్ హీరోయిన్ ఈమె..!
ఒక నిజమైన కథ… స్నేహం మీద, ప్రేమ మీద, పెళ్లి మీద ఏవగింపు కలిగించే ఓ కథ… చాన్నాళ్లుగా అది సోషల్ మీడియాలో, మీడియాలో కనిపిస్తూనే ఉంది… కొత్తదేమీ కాదు… తాజాగా తెలుగులో వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో మళ్లీ బాగా కనిపిస్తోంది… పిచ్చి ఫ్యాన్స్ ఆరాధించే క్రికెటర్ల చీకటి జీవితాలు, నీచతత్వాలను, డొల్ల స్నేహాలను చెప్పే కథ… అంతేకాదు… నిజమైన ప్రేమమూర్తుల్ని కూడా పరిచయం చేసే కథ… ఈ కథలో బాగా నచ్చేది ఒక పాత్ర… ఆ […]
జయప్రద, శ్రీదేవిలను కూడా హమ్మా అంటున్నట్టు పీడకలలు వచ్చేవి…
Bharadwaja Rangavajhala……… హమ్మా అను ఈ కథ పునః ప్రసారం హమ్మా … ఛెప్పమ్మా … నాన్నను కిరాతకంగా హతమార్చింది ఆ పరంధామయ్యేనా హమ్మా … ఛెఫమ్మా ఛెప్పూ … అని సునామీలా తనను పట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్రధారిని తట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్కలేదు … ఈ సినిమాలో మీరు ఆయన తల్లి కాదు అంటే హమ్మయ్య అనుకునేలోపే… డైరక్టర్ ఆయా కారక్టరు…అనేసేవారు. ఏమిటీ నేను ఆయనకు ఆయానా? అనుకునే లోపు షూటింగ్… […]
శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
అందరూ రాసేశారు… మరి ఇద్దరు హీరోయిన్ల తల్లి, ఓ పాపులర్ హీరో మాజీ భార్య డ్రామాల్లో నటిస్తూ రోజుకు 2 వేలు, 3 వేలు సంపాదించి, పొట్టుపోసుకుంది అనేది ఖచ్చితంగా మంచి వార్తే… దాచుకున్న సొమ్ము కరిగిపోయి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించక, ఇక తప్పనిసరై చిన్నాచితకా వేషాలు వేయసాగింది… నిజానికి ఓసారి తరచిచూస్తే ఓ సినిమా కథకన్నా… కాదు, కాదు, ఓ పెద్ద నవలకు మించిన ట్రాజెడీ స్టోరీ ఆమె బతుకు… పేరు సారిక… […]
కో-హోస్ట్ శ్రావణభార్గవి కాస్తా హోస్ట్ అయిపోయింది… శ్రీరామచంద్ర గాయబ్…
తనకు కో-హోస్టుగా హఠాత్తుగా శ్రావణభార్గవిని తెచ్చిపెట్టారని అలిగి శ్రీరామచంద్ర తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి నిష్క్రమించాడా..? అందుకే కో-హోస్టు కాస్తా అకస్మాత్తుగా ఫుల్ టైమ్ హోస్టు అయిపోయిందా..? లేక శ్రీరామచంద్రను తప్పించడానికే ప్లాన్ చేసి, ముందస్తు ప్లాన్‌తో శ్రావణభార్గవిని కో-హోస్టుగా తీసుకొచ్చారా..? ఏమో… మొత్తానికి శ్రీరామచంద్ర సడెన్‌గా ఆదివారం ఎపిసోడ్ సీన్ నుంచి మాయమయ్యాడు… సరే, ఇవేవీ కారణాలు కావు, ఏదో పని ఉండి షూటింగుకు రాలేకపోయాడు అనే అనుకుందాం… కానీ దానికి ఓ చీప్ […]
- « Previous Page
- 1
- …
- 13
- 14
- 15
- 16
- 17
- …
- 34
- Next Page »