ట్యూన్ ఒకటే… అందులో ఏ భావంతో పదాలు ఇరికిస్తే ఆరకం పాట అవుతుంది… కిక్కిచ్చే సరదా, సరసమైన పదాలు పడితే అది రక్తి పాట… దేవుడిని ప్రార్థించే పదాలు ఇమిడితే అదే భక్తి పాట… శ్రోతకు నచ్చకపోతే అది అంతిమంగా విరక్తిపాట… అంతే కదా… సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పింది కూడా ఇదే కదా… తను చెప్పిన తీరు బాగా లేదు గానీ కొందరు ఆధ్యాత్మిక వాదులకూ ‘‘ఊ అంటావా’’ ట్యూన్ బాగానే ఎక్కేసినట్టుంది… ఇక మీమ్స్, […]
ప్చ్… ఒక్కరూ రేఖ బుగ్గల్ని ప్రేమించడం లేదు… ఈ నేతలకు ఎంత వివక్ష..?!
ఏది టేస్ట్..? హేమమాలిని చెప్పింది కరెక్టే… నీయంకమ్మా, నీదేం టేస్టురా భయ్ అంటోంది ఆమె… నిజమే కదా… 73 సంవత్సరాల ఓ వృద్ధ నటి బుగ్గల్ని ఉదాహరణగా తీసుకున్నాడంటే వాడిది ఏం టేస్ట్..? ఎంతెంతమంది కొత్త నున్నటి బుగ్గల స్టార్స్ వచ్చారు, వాళ్లను వదిలేసి, ఇంకా హేమమాలిని బుగ్గల్నే ఆరాధిస్తున్నాడంటే వాడిది ఏం టేస్ట్..?……….. ఇలాంటి కామెంట్స్ ట్రోలవుతున్నయ్.. విషయం అర్థం కాలేదు కదా… మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమమాలిని బుగ్గలతో […]
అసలే ఆమె ఓ ఫైర్ స్టార్… బిర్యానీ పొట్లాలతో ఇంటికెళ్లేవాడు… తరువాత..?
‘‘ఎవరైనా స్త్రీని 14 సెకండ్లపాటు అలాగే తదేకంగా చూస్తుండిపోతే జైలుశిక్ష ఖాయం’’…. గత ఏప్రిల్‌లో, ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరల్ అయిపోయిన ఓ రీల్ పోస్ట్ సారాంశం ఇది… ఎందుకయ్యా అంటే ఐపీసీ 354 -డి సెక్షన్ అదే చెబుతోంది అనేది పోస్టు వివరణ… నవ్వొచ్చిందా మీకు..? ఈ 14 సెకండ్లు అనే కాలవ్యవధికి ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు, చాలామంది ఆ పోస్టును ట్రోల్ చేశారు… కానీ 14 సెకండ్లు అనే ప్రస్తావన హాస్యాస్పదమే అయినా […]
‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
మొన్న సొరకాయ ప్రాశస్త్యం గురించి చెప్పారు కదా… మరొక్క కూరగాయ గురించి చెప్పండి సార్ అన్నారు పలువురు మిత్రులు… నిజమే, ఒకటి చెప్పుకోవచ్చు… సొరకాయంత వైశిష్ట్యాన్ని ఆపాదించలేం గానీ, ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..! వాస్తవానికి అది మాంసాహారం కాదు, జంతుజాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం […]
అరె, ఏం రాస్తరయ్యా… ఇస్తం, ఎగ్గొడతమా… అసలే మాది నియ్యతి సర్కారు…
అరె, ఏందిర భయ్, ఈ రాతలు..? గుయ్యా గుయ్యా, ఒకటే ఒర్లుతరు… అవునుర భయ్, గా గల్వాన్ల అమరులైన జవాన్లకు పరిహారం ఇస్తమని మా సారు చెప్పిండు, చెప్పిండంటే చేసుడే, చేస్తడు, చేసి తీరతడు… తలకాయ కోసుకుంటడు కానీ మాటతప్పడు… ఆ సంతోష్ ఫ్యామిలీకి 5 కోట్లు ఇచ్చిండా లేదా..? ఆయన భార్యకు మంచి కొలువు ఇచ్చినమా లేదా..? మరి మిగతా 19 మందికి మాత్రం ఎగ్గొట్టిండు అని రాసుడేంది..? 17 నెలల నుంచీ సీఎం ఆఫీసు […]
ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
ఓ మిత్రుడి పోస్టు సొరకాయను (తెలంగాణలో అనపకాయ, ఆన్యపుకాయ) మించిన కాయ లేదు అని..! నిజమే, దాని ఇంపార్టెన్స్ తెలియదు చాలామందికి… ప్రత్యేకించి ఈ తరానికి..! ఎప్పుడూ ఎగుడు దిగుళ్లు లేని రేటు… కాస్త అటూఇటూ ఒకటే రేటు ఎప్పుడూ… మంచి ఆర్గానిక్… ఎరువులు అక్కర్లేదు, పెస్టిసైడ్లు అక్కర్లేదు… పంట దెబ్బతినడాలు, అకస్మాత్తుగా రేట్లు పడిపోవడాలు, పెరిగిపోవడాల్లేవ్… ఊళ్లల్లో చాలావరకూ ఇరుగూపొరుగు నడుమ ఉచితంగా పంపిణీ కాబడే స్నేహపు దినుసు… పట్టణాల్లో కష్టంలే గానీ, ఊళ్లల్లో, ప్రత్యేకించి […]
కోతిపని కాదండీ… కోతుల పనిపట్టే పని..! ప్చ్, అర్థం చేసుకోరెందుకో మరి..!!
వ్యవసాయాధికారులు పరేషన్ అయిపోతున్నారట… అరె, ఈమాత్రం పని చేతకాదా..? వాళ్లను రైతులకు వ్యవసాయ జ్ఞానం నేర్పించాలని ఏమైనా బాధ్యతలు ఇచ్చామా..? పంటల మార్పిడి వైపు పరుగులు పెట్టించామా..? ప్రత్యామ్నాయ పంటల మీద ప్రణాళికలు వేయమన్నామా..? అసలు మాకే వ్యవసాయం మీద ఓ పాలసీ లేదాయె, వాళ్లకు పనిచెప్పిందెక్కడ..? చేయించుకున్నదెక్కడ..? రాక రాక మాకూ ఓ ఆలోచన వచ్చింది… ఇలాగే గాలికి వదిలేస్తే ఫాఫం, వాళ్ల దేహాలూ జంగుపట్టిపోతాయని… యంత్రాలైనా సరే, అప్పుడప్పుడూ నడిపించాలి, లేకపోతే బ్యాటరీలు డౌనై, […]
ఒకేరోజు 900 మందితో సంభోగమట..!! కుతి మతితప్పింది… రాత గతితప్పింది..!!
చివరకు గూగుల్ కూడా తన సజెస్టెడ్ వార్తల్లో ఇలాంటివి ఎందుకు పెడుతున్నదో అర్థం కాదు… అలా గూగూల్ వార్తల్లో కనిపించిన ఆంధ్రజ్యోతి వార్త ఒకటి షాకింగుగా అనిపించింది… ‘ఆశయం కోసం ఒకేరోజు 900 మందితో శృంగారం’ ఆ వార్తకు శీర్షిక… హవ్, కైసా, ఎలా… సాధ్యమేనా..? అసలు ఆమె ఆశయం ఏమిటి..? ఏమిటబ్బా అంతటి ఉదాత్త సంకల్పం అనుకుని, తీరా వార్త ఓపెన్ చేస్తే… మరింత షాక్… అందులో ఏమీ లేదు… 900 మందితో ఒకేరోజు సంభోగం […]
ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
కార్యకారణ సంబంధం… ఎక్కడో ఓ గడ్డిపోచ ఇటు నుంచి అటు పడిపోయిందంటే దానికీ ఓ కారణం ఉంటుంది, ఎక్కడో ఏదో ప్రభావం ఉండి ఉండవచ్చు… లేదా ప్రభావం వల్ల కావచ్చు… దేన్నీ తేలికగా తీసుకోవద్దు… సెప్టెంబరు 11… అమెరికాను కుదిపేసిన జంట టవర్ల ధ్వంసం సంఘటన అందరికీ తెలిసిందే… ఆ చేదు అనుభవాల నుంచి, భయాల నుంచి కాస్త తేరుకున్నాక, గతంలో ఆ టవర్లలో ఓ పెద్ద ఆఫీసు నడిపించిన కంపెనీ ఏం చేసిందంటే… ఆ విలయం […]
హఠాత్తుగా సెలబ్రిటీ హోదా… గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదు…
ఈమధ్య కొన్ని ఆసక్తి కలిగించే కేసులు పోలీసుల వద్దకు వస్తున్నయ్, వింటున్నం, చదువుతున్నం కదా… పైపైన చదివితే ఇదీ అలాగే అనిపిస్తుంది… కానీ దీంట్లో మనకు మనస్సు చివుక్కుమనిపించే అంశం ఉంది… ముందుగా విషయం చెప్పుకుందాం… బెంగాల్లో బిర్భూమ్ (వీరభూమ్) అనే ఓ పల్లెటూరు… అక్కడ భుబన్ బద్యాకర్ (భువన్) ఓ వీథివర్తకుడు… పచ్చి పల్లికాయ (వేరుశెనగ)ను హోల్‌సేల్‌గా కొనుక్కుని, తేలికపాటి మోపెడ్‌పై వేసుకుని ఊళ్లు తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటాడు… డబ్బుల్లేకపోతే విరిగిపోయిన సెల్ఫోన్లు, వాడకుండా పక్కన […]
‘స్మార్ట్’గా బుక్కయిపోతున్నం… ప్రైవసీ ఓ భ్రమ… మన కాల్స్ కూడా ఓపెన్…
ఒక కొత్త నంబర్ ఫోన్లో సేవ్ చేసుకున్నా… తరువాత కాసేపటికే ఆ పేరు, అకౌంట్ ఫేస్బుక్లో ‘people you may know’ జాబితాలో పదే పదే కనిపించింది… ఈమధ్య ఏదో పని అవసరమై ఒక వ్యక్తితో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది… అంతకుముందు పరిచయం కూడా లేదు… ఆ వ్యక్తి పేరు, అకౌంట్ ఫేస్బుక్ ‘యు మే నో’ జాబితాలోకి వచ్చేసింది… ఏదైనా ఊరికి వెళ్తున్నారా..? మీకు ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు సమీపంలోని మిత్రుల వివరాలు అందుతూనే ఉంటయ్… […]
తొక్కుడు, నరుకుడు… మధ్యలో ఈ తొక్కేమిటో, నాకుడేమిటో బోయపాటికే ఎరుక…
అందుకే మరి అప్పుడప్పుడూ కొందరు దర్శకుల తెలివితక్కువతనం, పైత్యం మీద చిరాకెత్తేది… తెలివితక్కువతనంలో బోయపాటి కూడా తక్కువోడేమీ కాదు… అఖండలో ఓ సీన్ ఏమిటంటే..? కలెక్టర్ కేరక్టర్ శరణ్య (ప్రజ్ఞా జైస్వాల్)ను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ పల్లెటూరిలో పుట్టించాడు కథకుడు… అసలు ఆ కలెక్టర్ పాత్ర తెలంగాణలోనే ఎందుకు పుట్టాలి..? ఎందుకంటే సినిమా తెలంగాణలోనూ కూడా నడవాలి, తెలంగాణను ఇగ్నోర్ చేసినట్టు ఉండకూడదు, అసలే ఈమధ్య ట్రెండ్ తెలంగాణ పాటలు, పదాలు, పాత్రలు… పైగా తెలంగాణలోనే […]
అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!
బాలసుబ్రహ్మణ్యం గొప్ప పాటగాడు… సకల ప్రపంచమూ ముక్తకంఠంతో అంగీకరించింది… నీరాజనాలు పట్టింది… కానీ ఒక సందేహం మాత్రం సజీవంగా ఉండిపోయింది… ఆయన కొన్ని వందల (వేలు కూడా కావచ్చు బహుశా) కచేరీలు చేశాడు… చిన్న గాయకుల నుంచి పెద్ద పెద్ద గాయకుల దాకా అందరి పాటలూ పాడాడు… కొన్నిసార్లు ఆ గాయకులకన్నా బాగా పాడాడు… తప్పులొచ్చిన చోట వినమ్రంగా, హుందాగా ప్రేక్షకులకు చెప్పాడు… కానీ ఏ కచేరీలోనూ తను మంజునాథ సినిమాలోని మహాప్రాణదీపం పాటను, జగదేకవీరుడి కథ […]
… అంతర్యామి అలసితి సొలసితి, ఇంతట నీ శరణిదే జొచ్చితిని…
డాలర్ శేషాద్రి పేరు వినగానే వెంటనే ఓ సినిమా డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది… ‘‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు, చంటిగాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు… లోకల్…’’ నిజంగా కూడా అంతే కదా… ఈవోలు, డిప్యూటీలు, చైర్మన్లు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు… కానీ తిరుమల గుడికి సంబంధించి శేషాద్రి ఓ చంటిగాడు టైపు… ఎప్పుడో లోయర్ గ్రేడ్ గుమస్తాగా మొదలై, ఏకంగా బొక్కసం ఇన్చార్జిగా ఎదిగేదాకా ఓ ప్రస్థానం… అప్పుడెప్పుడో రిటైరైనా సరే, నిన్న కన్నుమూసేవరకూ గుడిలో […]
జిగట లేదు, ప్రయాస లేదు… ఆరోగ్యం + మాంఛింగ్ బెండీ… రుచిమరిగితే ఇక అంతే…
అప్పుడప్పుడూ ఏవో వంటలు, రెసిపీల గురించి ఏదో గీకుతారుగా… మానేశారేం, పర్లేదు చదివేట్టే ఉంటయ్, కానీ ఏమైంది అన్నాడు ఓ మిత్రుడు వెక్కిరింపు, బెదిరింపు, వ్యంగ్యం గట్రా మొత్తం కలిపి డీప్ ఫ్రై చేసినట్టు…! పోనీ, ఓ మాంచి మంచింగ్ టిప్ పెట్టు, ఎప్పుడైనా కలిసినప్పుడు రుణం ఉంచుకోను అని కూడా ఓ నోరూరించే మంచి లంచమాఫర్ కూడా ఇచ్చాడు… ఈమధ్య ఓ రిటైర్డ్ డాక్టర్ గారికి ఒకటి ఇలాంటిదే చెప్పాను… రెండు ముక్కలు శాంపిల్ చూపించాను… […]
‘‘హలో కేసీయార్‌జీ… నేను అమిత్ షాను మాట్లాడుతున్నా…’’
‘‘‘నో, నో, కేసీయార్‌జీ, అపార్థం చేసుకోకండి, మీరంటే మాకు గౌరవం లేకపోవడమేంటి..? భయం కూడా ఉంది… నేనే మీకు స్వయంగా కాల్ చేస్తున్నాను కదా… మేం ప్రతి ముఖ్యమంత్రితోనూ ఈమధ్య బాగానే ఉంటున్నాం, అసలే మా పరిస్థితి బాగాలేదు.., మీకు తెలుసు కదా, అందరూ రివర్స్ అవుతున్నారు… నిజానికి అగ్రి చట్టాల్ని రద్దు చేయను అన్నాడు మా మోడీజీ, నేనే సర్దిచెప్పాను, బాగుండదు, కేసీయార్‌జీ ఆల్రెడీ అల్టిమేటమ్ ఇచ్చాడు, ఢిల్లీకి బయల్దేరాడు, బొచ్చెడు మంది ప్రజాప్రతినిధుల్ని వెంటేసుకుని […]
గుండె తడిని తగిలే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, తీసేవాళ్లు కూడా దాన్నలాగే భ్రష్టుపట్టించారు… కాకపోతే ఆరుద్ర, ఆత్రేయ, […]
ఏమిటీ ఒడిబియ్యం..? ప్రతి పసుపుగింజలోనూ పుట్టింటి భరోసా… ప్రేమ..!
తెలంగాణ విశిష్ట సంస్కృతిలో ఓ భాగం… ఒడియ్యం… నిన్న ఓ మిత్రురాలి వాల్ మీద పోస్టు చూసి, ఆ ఫోటో తీసుకుని, పోస్ట్ పెడితే కొంతమంది అడిగారు, ఒడిబియ్యం అంటే ఏమిటి అని… తెలంగాణలో మాత్రమే కాదు, తెలంగాణను ఆనుకుని ఉండే సీమ, దక్షిణ కర్నాటక జిల్లాల్లోనూ ఈ ఆచారం ఉంది… చెప్పుకోవాలి, తరచూ మాట్లాడుకోవాలి… ఇప్పుడంటే కడుపు చేత్తో పట్టుకుని మన పిల్లలే లక్షలాదిగా దేశదేశాలు పట్టిపోయారు… తప్పదు, ఇక్కడే ఉంటే ఈ ఒడిబియ్యం వంటివి […]
అమ్మో… అమ్మే…! టాప్ రేటెడ్ తెలుగు డైలాగుల్లో బహుశా ఇదే నంబర్‌వన్..!
….. By……. Bharadwaja Rangavajhala………… అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు […]
ఔనా..! ఆమె కథతోనే ఆ సినిమా, విడుదలయ్యే దాకా ఆమెకే తెలియదట..!!
జైభీం సినిమాలో సినతల్లి… అలియాస్ ఒరిజినల్‌గా పార్వతమ్మ… ఆ సినిమా తీశారు కాబట్టి ఆమె గురించి చెప్పుకుంటున్నాం, ఆమె కులంపై పోలీసుల క్రౌర్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆమె కుటుంబానికి జరిగిన నష్టం తెలుసుకుంటున్నాం, ఇలాంటి కథలెన్నో, వ్యథలెన్నో అని బాధపడుతున్నాం… లేకపోతే ఆమె కథ చరిత్రపుటల్లో అనామకంగా మరుగునపడి పోయేది… నిజానికి ఒరిజినల్ కథకు సినిమా రచయిత కమ్ దర్శకుడు క్రియేటివ్ లిబర్టీ తీసుకుని చాలా మార్పులు చేసుకున్నాడు, తప్పదు, ఏ కథయినా ఆసక్తికరంగా చెబితే జనానికి […]
- « Previous Page
- 1
- …
- 18
- 19
- 20
- 21
- 22
- …
- 34
- Next Page »