ఏదైనా ఇంగ్లిషు పదానికి ఈనాడు వాడు ఏదో పిచ్చి అనువాదం చేస్తాడు… అందరూ ఆహా, ఓహో అని కళ్లకద్దుకుంటారు… అంతర్జాలం దగ్గర నుంచి గుత్తేదార్ల వరకు ఎన్నెన్ని పదాలు..?! అలాగే తెలుగు అకాడమీ చేసే అనువాద పదాలు ఇంకా సంక్లిష్టంగా, అదేదో భాష అనుకునేలా ఉంటాయి… తెలుగు పాఠ్యగ్రంథాలు చదివితే బోలెడు ఇనుప గుగ్గిళ్లు దొరుకుతాయి… ఇక చట్టసభల్లో కనిపించే తెలుగు భాష అది వేరే ప్రపంచం… ప్రత్యేకించి బిల్లులు, చట్టాలు, వివరణలకు సంబంధించి అదో విషాదం… […]
సైనికుడూ మనిషే… మనకు కనిపించని మరో మొహం ఉంటుంది…
……… By…. Badari Narayan………….. కార్గిల్ కథలు- రాబిన్ మరియు రుక్సానా ఆ అబ్బాయి మన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్. పేరు విజయంత్ థాపర్. కానీ స్నేహితులు చాలామంది తనను రాబిన్ హుడ్, “రాబిన్” అనేవారు. మేజర్ వీరేంద్ర థాపర్ దంపతులకు ముద్దుల కొడుకు తను. బాబు పుట్టిన కొద్దిరోజులకే డ్యూటీపై పఠాన్కోట్ కి వెళ్ళారు మేజర్ వీరేంద్ర థాపర్ దంపతులు. అందుకని పిల్లవాడు పుట్టి నెలరోజులైనా వాడికి పేరు పెట్టడానికి వీలుపడలేదు. ఒకరోజు, అక్కడి కంటోన్మెంట్ […]
భలే వార్త గురూ… ఎర్రకారంలాగే చాలా స్పైసీ న్యూ టేస్ట్… న్యూస్ టేస్ట్…!
ఇదీ వార్తేనా..? అనొద్దు ప్లీజ్..! కాదేదీ వార్తకనర్హం…! ఒకాయన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాడు… అంతే… అరె, ఆ ఏరియాకు అంతకన్నా మంచి వార్త ఏముంటది..? విలేఖరి అదే ఫీలయ్యాడు, సబ్‌ఎడిటరూ అదే ఫీలయ్యాడు… పత్రికలో కింది నుంచి మీది దాకా అందరూ అదే ఫీలయ్యారు… అలా ఫీలయ్యేది ఖచ్చితంగా వార్తే అవుతుంది… కావాలి..! ఎవడో దిక్కుమాలినోడు ఏదో పిచ్చి పార్టీ పెడతాడు, వార్త రాయడం లేదా ఏం..? ఓ పనికిమాలిన మీటింగ్ పెడతాడు, వార్త రాయడం […]
ఇంతవారమయ్యాము అంటుంటారు కదా… ఎంతవారని..? అదెంతని..?
Bharadwaja Rangavajhala…………. ఘంటసాల భగవద్గీత రికార్డు విడుదల కార్యక్రమం ఆయన కన్నుమూశాక బెజవాడలో జరిగింది.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆరూ, విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము అన్నారు. ఆ తర్వాత మైకందుకున్న విశ్వనాథ …. నా శిష్యుడనని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వల్లనే ఇంత వాడినైతినని చెప్పినాడు. ఆ ఇంత ఎంతో నాకు తెలియదు. ఆ ఇంతలో నాకు మరొకరు అనగా […]
…. కళ్లుమూసుకుని ఆ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చేసింది స్కూల్..!!
ప్రిస్టేజియస్ స్కూల్… సీటు దొరకడం గగనం… పైరవీలు నడవవ్… ఓపూట అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విరగబడ్డారు… ఇంటర్వ్యూలు సాగుతున్నయ్… పేరెంట్స్‌లో ఒకటే టెన్షన్…ఒక అమ్మాయికి అసలే అర్థం కావడం లేదు, అసలు తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటోంది.., ఆ హడావుడి, ఆ రద్దీని ఆసక్తిగా గమనిస్తోంది…టీచర్, ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ప్రారంభించారు… అదిలా సాగింది…నీ పేరేమిటమ్మా..?సీత…నీకు తెలిసింది ఏమైనా చెప్పు..?చాలా విషయాలు తెలుసు నాకు, మీకేం కావాలో అడగండి…(ఈ పిల్ల దూకుడు చూసి పేరెంట్స్ […]
టచింగ్ ఫోటో..! జస్ట్, ఓ కాజువల్ సీన్ కాదు, కావల్సినంత ఆర్ద్రత, తడి..!
కొన్ని పైపైన చూస్తే అంతే… కాజువల్‌గా, రొటీన్‌గా, ఆ ఏముందిలే ఇందులో అన్నట్టు కనిపిస్తయ్…. కానీ కాస్త తడి ఉన్న రిపోర్టర్‌కు అందులో ఆర్ద్రత అర్థమవుతుంది… న్యూస్ పాయింట్ తళుక్కుమని మెరుస్తుంది… చేతిలో స్మార్ట్ ఫోన్ వేగంగా, సైలెంటుగా క్లిక్కుమంటుంది… ఆ సీన్ రికార్డ్ అయిపోతుంది… ఫీల్డ్‌లో తిరిగే రిపోర్టర్లకు ఈ స్పాంటేనిటీ అవసరం… ఐనా ఇప్పుడు రిపోర్టర్లు అంటే వేరు కదా, ఆ సంగతి వదిలేద్దాం… ఈ ఫోటో వార్త సంగతేమిటంటే..? కామారెడ్డి జిల్లాలో ఓచోట… […]
నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
నో కరెంట్, నో టీవీ, నో బ్రాడ్ బ్యాండ్, నో స్మార్ట్ ఫోన్, నో కనెక్టివిటీ… ఊహించండి… నెవ్వర్, ప్రస్తుత జనరేషన్ అరగంట కూడా తట్టుకోలేదు… అంతెందుకు, దిక్కుమాలిన సోషల్ సైట్లు కొన్ని గంటలు పనిచేయకపోతేనే తల్లడిల్లిపోయారుగా… మరి అవేవీ లేకుండా, అసలు మనిషి పొడ గిట్టకుండా… అడవిలో… జంతువుల నడుమ ఓ జంతువుగా పదిహేడేళ్లపాటు బతకడం అంటే..?! నమ్మడం లేదు కదా… కానీ నిజమే… ఎక్కడో కాదు, మన పొరుగునే… దక్షిణ కన్నడ జిల్లాలోని అడ్తాలే, […]
చెప్పుకున్నంత వీజీ టూర్ కాదు… రిస్క్, డేర్, థ్రిల్ ప్లస్ పర్‌ఫెక్ట్ ప్లానింగు…
చెప్పుకున్నంత ఈజీ కాదు… ఏదో బ్లాగులో నాలుగు ఫోటోలు పెట్టేసి, వ్లాగులో రెండు వీడియోలు పెట్టేసినట్టు కాదు… ఐనాసరే, సాహసం చేయాలనే అనుకున్నాం… నాకు తగ్గట్టు దొరికింది నా భార్య… కొత్తగా పెళ్లయ్యింది మాకు… మాది త్రిసూర్… కొలువులేమో బెంగుళూరు… నేను సేల్స్ వైపు… ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ వైపు… నా పేరు హరికృష్ణన్, ఆమె లక్ష్మి… అసలు వెరయిటీగా హనీమూన్‌కు మోటార్ బైక్ మీద థాయ్‌లాండ్ వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించాం, ఆమె రెడీ అనేసింది… […]
రెహమాన్ తమిళ పైత్యం- గౌతమ్ మేనన్ మలయాళ వికారం… కవిత చేదు అభిరుచి…
పాత్రికేయ మిత్రుడు శివప్రసాద్ వ్యంగ్యంగా ఇలా అన్నాడు… ‘‘తమిళ బ్రామ్మల పెళ్ళిలో తంగేడుపూల తలంబ్రాలు… భరతనాట్యం బ్యాక్ గ్రౌండ్ లో బతుకమ్మ పాటలు…’’ మరో సీనియర్ జర్నలిస్టు మిత్రుడు, తెలంగాణ సంస్కృతికి వీరప్రేమికుడు అయితే బాగా తల్లడిల్లిపోయి… ‘‘దయచేసి, ఈ పాట విని … కిందికి మీదికి కాకండి… జీవితంపైన విరక్తి కలుగుతది..’’ అన్నాడు బాధతో… మరో పెద్దమనిషి ‘‘సారీ కవితక్కా, పూర్ టేస్ట్, బతుకమ్మ అంటే నేనే అన్నంతగా మస్తు హడావుడి చేస్తుంటవ్, ఇలా నువ్వే […]
పుల్ల ఇడ్లీ..! తెగపులిసిన పుల్లటిదని కాదు, పుల్ల సైజంత చిన్నదనీ కాదు…!
మొన్నోసారి ఓ మిత్రురాలు ‘‘జామకాయతో బజ్జీలు ఏమిట్రోయ్’’ అంటూ ఫేస్‌బుక్కులో బాగా కోప్పడిపోయింది… ఆశ్చర్యమేసి, యూట్యూబ్ వాడిని కదిలిస్తే, నిజంగానే ఓ వీడియో ఉంది… అసలు జామకాయతో బజ్జీలు వేయడం అనే ఆలోచనే కాదు, దానికి 20 లక్షలు దాటిన వ్యూస్ మరీ మిక్కిలి ఎక్కువ ఆశ్చర్యపరిచాయి… కొత్త రుచుల కోసం మన జిహ్వారాటం అంత బలంగా ఉందన్నమాట… సో, రేపురేపు అరటిపండు బజ్జీలు, డ్రాగన్ ఫ్రూట్ బజ్జీలు కూడా వేస్తారేమో… ఏమో, ఆల్ రెడీ వేస్తూనే […]
సమ నివాళి..! గాంధీనే కాదు, ఈసారి శాస్త్రినీ స్మరించుకుంటున్నాం…!!
75 సంవత్సరాల ఆజాదీ… ఈ సందర్భంగా కేంద్రం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఏడాది పొడవునా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది… ఎప్పటిలాగే అక్టోబరు రెండో తేదీ వచ్చింది… ఈ తేదీ అనగానే స్ఫురించేది మహాత్మాగాంధీ జయంతి… దేశమంతా ఆయన్ని స్మరిస్తూ బోలెడన్ని అధికారిక కార్యక్రమాలు సాగడం పరిపాటే… తప్పేముంది, జాతిపితగా మనం కీర్తించే ఓ ఘననాయకుడిని ఏటా ఆయన జయంతి రోజున స్మరించడంకన్నామంచి నివాళి ఏముంటుంది..? అయితే పాపం, మరో మంచి నాయకుడు కూడా ఇదేరోజున పుట్టాడు… వేరే […]
ఆ రోగానికి ఎలాగూ చికిత్స లేదు… నొప్పి లేకపోతే బాగుండు… భరించేస్తాం…!!
కొన్నేళ్ల క్రితం… నలుగురు వ్యాపారుల నడుమ ఓ సంభాషణ…. వాడు ఆ ఏసీటీవో గాడు, దొంగ లం-కొ… వాడు అడిగింది ఇచ్చినా సరే, ఇంకా కొర్రీలు పెడతాడు, డబ్బు గుంజుతాడు, ఏవేవో డిమాండ్లు చేస్తాడు, ఐనా పని సరిగ్గా చేసిపెట్టడు… అన్నాడు ఒకడు….. అవునవును, వాడికన్నా వాడి బాస్ ఆ డీసీటీవో చాలా బెటర్, మంచోడు, ఇచ్చింది తీసుకుంటాడు, తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తాడు, వెంటనే పనిచేసి పెడతాడు, మర్యాదస్తుడు అని మెచ్చుకున్నాడు మరొకడు…… ఇక్కడ అవినీతి […]
వాడు మగాడ్రా బుజ్జీ..! ఈ డైలాగ్ గుర్తుంది కదా… ఈ కథకూ ఆ హెడ్డింగే బెటరేమో…!!
రెండేళ్ల క్రితం కావచ్చు… ఓ సినిమా వచ్చింది… డాన్స్ లైక్ దాని పేరు… One Boy and Three Girls, A Funny Cute Love Story అని ప్రచారం కూడా చేసుకున్నారు… ఒరేయ్, ఇదేం క్రియేటివిటీరా బాబూ, అన్నిరకాల ప్రేమ పైత్యాలు అయిపోయాయి, ఇప్పుడిక ముగ్గురు ఆడాళ్లకూ ఒక మగాడికీ నడుమ ఈ ప్రేమ ఏమిట్రోయ్ అని తిట్టేవాళ్లు తిట్టారు… అసలు క్రియేటివిటీ అంటే ఇదే అని మెచ్చుకుని చప్పట్లు కొట్టినవాళ్లు కూడా ఉన్నారు… సమాజం […]
బాబు గారూ బీకేర్‌ఫుల్… మీ దారిలో భద్రత ‘జెడ్ మైనస్’ అనిపిస్తోంది…
బాబు గారూ… ఎందుకైనా మంచిది, కాస్త ఆ తాడేపల్లి ఇంట్లో నివాసం కొన్నాళ్లు మానెయ్… ఆ కేశినేని కాకపోతే మరొకరు, మీకు ఆశ్రయం కల్పించే ఇల్లే దొరకదా..? ఆతిథ్యం ఇచ్చే కార్యకర్తే దొరకడా..? మీకోసం ప్రాణాలిచ్చేవాళ్లు బోలెడు మంది… పైగా అదసలే విజయవాడ… మన అమరావతికి అనుబంధ నగరం… పైన అమ్మవారు, కింద కమ్మవారు అనే సూత్రం ఆధారంగా చెప్పడం లేదు గానీ బెజవాడలో పచ్చదనం ఎక్కువే సుమీ… ఐనా అప్పుడప్పుడూ మీరు తాడేపల్లికి చుట్టపుచూపుగా వెళ్లి […]
చేయి విదల్చని పాకిస్థానీలు..! ఔదార్యంలో ‘స్థాయి’ చాటిన ఇండియన్స్…!!
మన జీవితాలు ఎంత బుద్భుదమో కరోనా స్పష్టంగానే చెప్పింది… ఒక టైం వస్తే ఆస్తులు, అంతస్థులు, సంపద, హోదా, తెలివి, పాపులారిటీ, ఏవీ పనిచేయవని తేల్చేసింది… మరీ కొందరిది దిక్కులేని చావు, మున్సిపాలిటీ దహనాలు… అంతులేని వైరాగ్యాన్ని నింపింది కొన్నాళ్లు… ఇప్పుడిక కరోనా భయం తగ్గిందిగా… మళ్లీ మామూలే… మనిషి మారడు……….. అయితే ఈ సంక్షోభంలో కనీసం ఒక మనిషి తోటి మనిషికి అండగా నిలబడ్డాడా..? సాయం చేశాడా..? ఇలాంటి విపత్తుల్లో కాకపోతే ఇక సమాజం ఔదార్యం […]
బుల్లి ఠాక్రే వారి చిత్తపైత్యం… ఆ కొరియన్ పెంగ్విన్లకు ప్రాణగండం…
2015… ప్రధాని మోడీ అప్పట్లో రోజుకు రెండుమూడు దేశాల్ని చుట్టేస్తున్న కాలం… ఎక్కడికి వెళ్లినా ఆ డ్రెస్సులు ధరించి, ఆ దేశాధ్యక్షుల్ని కౌగిలించుకుంటూ, వాళ్ల సంస్కృతిని, ఆతిథ్యాన్ని రుచిచూస్తూ ప్రపంచమంతా ప్రదక్షిణలు చేస్తున్న పర్యాటకశకం… పనిలోపనిగా మంగోలియా వెళ్లాడు… వ్యూహాత్మకంగా దానికి చేరదీయడం, డబ్బులిచ్చి బుజ్జగించడం, మన ఫోల్డ్‌లో ఉంచుకోవడం మన అవసరం… వెళ్లగానే అక్కడి డ్రెస్సు వేశాడు, ఫోటోలు దిగాడు, వీడియోలు తీశారు… విల్లంబులు పట్టుకుని ఫోజులిచ్చాడు… మనం ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించడంతో అక్కడి ప్రభుత్వం […]
ఏం తెలివిరా బాబూ… ఆ గాంధీ తాతను సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చుకున్నారు…
బతుకమ్మ పండుగ పుట్టింది ఎమ్మెల్సీ, కేసీయార్ బిడ్డ కవిత ఆలోచనల్లో నుంచి కాదు… ఒకవేళ ఏ విద్యాధికారి వికృత అత్యుత్సాహమో, స్వామిభక్తో ఆమె ఫోటోల్ని బతుకమ్మ పాఠ్యాంశాల్లో చేర్చినా జనం నవ్వుకుంటారు… బతుకమ్మ పండుగ మాత్రమే కాదు, పాటల రూపంలో ఆటల రూపంలో తెలంగాణ మహిళ కష్టసుఖాల కలబోత… వెల్లబోత..! అది శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంత మహిళల విశిష్ట సాంస్కృతిక ఉత్సవం… అంగీకరిస్తారు కదా…! కేఆర్ నాగరాజన్ అనే ఓ తమిళ వస్త్ర వ్యాపారి ఉన్నాడు… చేనేత […]
నవీన్ పట్నాయక్ సైలెంట్ వర్క్…! Good Work On Unique Animal Breeds..!
మంద బర్రె… మరీ స్పెషల్……….. పబ్లిసిటీ లేని మన పొడ తూర్పు మనుగడ పరంపరలో… ప్రకృతి, పరిసరాలు ఏమైనా ఫర్వాలేదు అన్నట్లుగా మనిషి ముందుకు సాగుతున్నాడు. ఉపయోగపడే వాటిని రక్షించుకుంటూ, అవసరం లేని వాటిని గతంలోకి కలిపేస్తూ వస్తున్నాడు. ఆహార అవసరాలను తీర్చే జంతువులను, పక్షులను కాపాడుకుంటూ (తింటూనే)… వీటిలోనూ మేలు రకం వాటి మనుగడ ఉండేలా చేస్తున్నాడు. ఎక్కడ ఏ పరిశోధనలు చేసినా ఇదే పరమార్థం. ప్రపంచంలో మాంసం, పాల అవసరాలు తీర్చే ఎన్నో జీవాలు […]
ఆ మృగాలకు సర్కారీ లాంఛనాలతో సీఎం సాక్షిగా దహసంస్కారం..!!
రినో… అంటే ఖడ్గమృగం… ముట్టె మీద మొలిచి, పెరిగే ఖడ్గం వంటి కొమ్ముతో ఆ పేరొచ్చింది… ఆ కొమ్మును చైనా సంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు మందుగా వాడతారనీ, బ్లాక్ మార్కెట్లో అందుకే దానికి భారీ రేటు పలుకుతుందనీ ఎన్నాళ్లుగానో వింటున్నదే… ఏటా ఆ డబ్బు కోసం ఖడ్గమృగాలను వేటాడుతున్నారు, మరణించిన మృగాల కొమ్ములను కోసుకుంటున్నారు, కొందరు కొమ్ముల్ని కోసేసుకుని తిరిగి వదిలేస్తున్నారు… ప్రత్యేకించి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఇది అధికం… వేటగాళ్ల దగ్గర స్వాధీనం చేసుకున్నవీ, […]
లక్ష రూపాయలు..! ప్రత్యేక ఏసీ రైలులో 16 రోజుల చార్ధామ్ యాత్ర..!
మునుపు… నాలుగు బట్టలు సంచీలో కుక్కుకుని, బస్సెక్కి కూర్చుంటే చాలు… సంపూర్ణ తీర్థయాత్ర, దక్షిణభారత యాత్ర, ఉత్తర భారత యాత్ర అంటూ రకరకాల సర్వీసులు నడిపించేవారు… తిండీతిప్పలు, సత్రాల గోల అంతా నిర్వాహకులే పడేవాళ్లు… ఇప్పుడు కూడా ఒకటీఅరా అక్కడక్కడా ఈ సర్వీసులు ఉండొచ్చు… నిజానికి అది చాలా సుఖం… ఒకసారి డబ్బు చెల్లిస్తే చాలు, నిర్వాహకులే మొత్తం ఆర్గనైజ్ చేసేవాళ్లు… ఎక్కడో రోడ్డు పక్కన బస్సు ఆపుకోవడం, కట్టెలు అంటించడం, ఎంచక్కా మన తిండినే వండిపెట్టడం… […]
- « Previous Page
- 1
- …
- 20
- 21
- 22
- 23
- 24
- …
- 34
- Next Page »