ఇదొకరకం మానసిక వైకల్యం అనాలా..? వైరాగ్యం అనాలా..? ఇరా బాసు ప్రస్తుత గతి చూస్తే అందరికీ ఆమెనెలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి… ఆమె బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ భట్టాచార్య సొంత మరదలు… కానీ ఫుట్‌పాత్‌పై జీవిస్తోంది… మంత్రి, ఎమ్మెల్యే అంటేనే బంధుగణమంతా విపరీతంగా అక్రమ ఆస్తులు పోగేసి, అట్టహాసంగా, ఆడంబరంగా బతుకుతూ ఉంటారనేది కదా మనకు తెలిసిన సత్యం… మరి పదేళ్లు పాలించిన ఓ మాజీ సీఎం మరదలికి ఈ బతుకేమిటి..? (సొంత మరదల్నే […]
ఇడ్లీ రేటు జస్ట్ ఒక్క రూపాయి..! హేట్సాఫ్ రాంబాబూ… నీ బాటకు, నీ కష్టానికి…!!
‘‘ఇడ్లి 1/-, బజ్జి 1/-….., ఈ రోజు మారేడుమిల్లి వెళ్తూ RB కొత్తూరు, పెద్దాపురం పక్కన ఒక టిఫిన్ సెంటర్ దగ్గర (యజమానిగారి పేరు రాంబాబు) ఆగాం, రుచి అమోఘం, గత 16 సంవత్సరాలుగా ఇడ్లి, బజ్జి 1/- మాత్రమే, 3 రకాలు చెట్నీలు… వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే… బయట వాళ్ళను పెట్టుకుంటే శుభ్రతలో ఎక్కడ తేడా వస్తుందో అని వాటిని కూడా వాళ్లే శుభ్రపరుస్తున్నారు… పర్యావరణానికి నష్టం కలగకుండా అడ్డాకులలో టిఫిన్ పెడుతున్నారు… […]
రామోజీరావు గారూ… కేసీయార్ పేరు, తెలంగాణ పేరు మార్చడం లేదు కదా…
రేప్పొద్దున తెలంగాణ ముఖ్యమంత్రి ఇంద్రశేఖర్‌రావు అని ఈనాడులో వచ్చింది అనుకొండి… దయచేసి ఆశ్చర్యపోవద్దు… ఆయన ఇంటిపేరు కూడా కల్వకుంట్ల బదులు జలకుంట్ల అని రాస్తే అస్సలు నిర్ఘాంతపోవద్దు… ఏమో, కేటీయార్ పేరు కూడా ఇప్పుడున్నట్టే ఉండకపోవచ్చు కూడా… ష్, అసలు తెలంగాణ పేరునే మార్చేస్తే ఎలా ఉంటుందో కూడా ఈనాడులో మేథోమథనం భేటీలు జరుగుతూ ఉన్నాయేమో… బొడ్డు కోసి పేర్లు పెట్టడంలో ఈనాడుదే ఘనకీర్తి… అది అక్షరమంత్రసాని… కాదు, తెలుగుకే మంత్రసాని, ఈ భాష పుట్టుకకు సాయం […]
ఈ ట్రోలర్లను తప్పుపట్టలేం..! తెలుగు టీవీల ‘‘అశ్లీల వికారాలకు’’ వీళ్లే మొగుళ్లు..!!
అమ్మో, ట్రోలర్స్ అని సెలబ్రిటీలు ఉలిక్కిపడుతుంటారు… వణికిపోతుంటారు… ఎందుకు..? వాళ్లు చాకిరేవు పెట్టేస్తుంటారు కాబట్టి… వాళ్ల నాసిరకం పోకడల్ని బట్టలిప్పి చూపిస్తారు కాబట్టి… అఫ్ కోర్స్, ట్రోలర్స్‌లో అధికశాతం స్వార్థం, అజ్ఞానం, దురుద్దేశపూరితం… కానీ కొందరు ఉంటారు… వాళ్ల ట్రోలింగ్ సొసైటీకి మంచిదే… కావచ్చు, ఆ ట్రోలింగ్ వాళ్లకు ఉపాధి మార్గం కావచ్చు, వాళ్లకు భాష సరిగ్గా తెలియకపోవచ్చు… కానీ ఓ కంటెంటును చీల్చిచెండాడేలా, రకరకాల సంబంధిత క్లిప్పులు వెతికి, ఎడిట్ చేసుకుని, ఒక్క దగ్గర క్రోడీకరించి, […]
మన సాయిపల్లవే… బహుశా మీరు ఈ డాన్స్ చూసి ఉండరు… అదిరిపోయింది…
ఈమధ్య సారంగదరియా పాట సూపర్ హిట్ కావడం.., బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా పాట బంపర్ హిట్ కావడం.., పెళ్లిళ్లు పేరంటాల్లో కూడా ఈ పాటలు మారుమోగిపోతుండటంతో సోషల్ మీడియాలో కూడా చర్చ పాటలు, డాన్సుల మీద నడుస్తోంది… మంచి కంటెంటు, మంచి ట్యూన్ ఉంటే చాలు, డాన్సర్ ఎలా ఉన్నా సరే సాంగ్ అదిరిపోతుంది, కోట్ల వ్యూస్ గ్యారంటీ అంటాడు ఒకాయన… నో, నో, అదేమీ కాదు, డాన్సర్‌ను బట్టి సాంగ్ కథ మారిపోతుంది, సాయిపల్లవి […]
ఈ గెలుపు అపురూపం… పోటీదారుల నుంచి విజేతకు విలువైన కానుకలు…
సాధారణంగా ఓ ఆటల పోటీయో, పాటల పోటీయో జరిగింది… పదీపన్నెండు మంది పోటీపడ్డారు… రిజల్ట్ తేలింది… తరువాత ఏం జరుగుతుంది..? ఏముందీ, గెలిచినవాడిని అభినందిస్తారు, చప్పట్లు కొడతారు, ఎవరి మూటాముల్లే వాళ్లు సర్దుకుని ఇళ్లకు వెళ్లిపోతారు… అంతే కదా… కానీ ఇక్కడ కథ వేరే ఉంది… అది కొంత నమ్మబుల్‌గా లేదు… కొంత ఆశ్చర్యంగా ఉంది… పోటీదారుల నడుమ ఇంత పాజిటివిటీ ఉన్న తీరు చూసి ఆనందంగా కూడా ఉంది… మొన్నమొన్న ఇండియన్ ఐడల్ -12 పోటీ […]
రండి, రండి… మళ్లీ మళ్లీ రండి… వస్తూ ఉండండి… ఎక్కువ సంఖ్యలో రండి…!!!
ఈనాడు వాడికి ఈ ఫోటోను, ఈ వార్తను సరిగ్గా ప్రజెంట్ చేయడం చేతకాలేదు కానీ… ఈ స్వాగత ద్వారాన్ని చూడగానే ఎన్ని ఆలోచనలు మనిషిని చుట్టుముడతాయో కదా… ఓ క్షణం అవాక్కవుతాం… ఆ స్మశానవాటిక లోపలవైపు లయకారుడు శివుడి బొమ్మ ఏదో అస్పష్టంగా కనిపిస్తోంది… నిజమే, అక్కడ శివుడు ఉండటమే కరెక్టు… అక్కడి వరకూ స్మశాన వాటిక నిర్వాహకులు సరిగ్గానే ఆలోచించారు… భగవద్గీత అనగానే చావు దగ్గర వినిపించే మంత్రాలు అన్నట్టుగా దాన్ని మార్చేశారు… నిజానికీ చావుకూ […]
భూమి కేవలం ఒక్క సెకను తిరగడం హఠాత్తుగా ఆపేస్తే ఏం జరుగుతుంది..?
అకస్మాత్తుగా విశ్వభ్రమణం ఆగిపోతే..? విశ్వం కాదు, భూభ్రమణం… ఎక్కువ సేపు కాదు, జస్ట్, ఒకే క్షణం… మనకు తెలుసు కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది… తన చుట్టూ తను ఒకసారి తిరగడానికి 24 గంటలు పడుతుంది… చిన్నప్పుడే చదువుకున్నాం కదా… సూర్యుడి చుట్టూ తిరగడం కాదు, తన చుట్టూ తిరగడం ఒక్క క్షణం ఆగిపోతే ఏం జరుగుతుంది..? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… నిజంగా ఏమవుతుంది..? అబ్బే, ఏముంది అందులో… ఒక […]
డుగ్గు డుగ్గు ఊగుతోంది యూ ట్యూబ్… అప్‌లోడ్ చేయడమే లేట్… లక్షల వ్యూస్…
సో వాట్..? ఓ నర్సు ‘‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’’ పాటకు డాన్స్ చేసింది… అయితే ఏమిటట..? నిజమైన కర్కోటక అధికారులను, అక్రమార్కులను ఏమీ చేయలేని మన ప్రభుత్వం ఆమెకు మెమో ఇచ్చిందట… సిగ్గుపడాలి వ్యవస్థ… ఆమె ఓ నర్సు, కరోనా కాలంలో సేవలు చేసింది, తను కరోనాకు గురైంది, ఏదో ఆటవిడుపుగా ఓ పాటపాడితే తప్పేమిటట..? వీడియో కనిపించింది కాబట్టి చర్య తీసుకుంటారు, మరి వీడియో లేకపోతే..? అసలు ఈ కలెక్టర్లు ఎందుకిలా సంకుచితులవుతున్నారు…? వందలు, […]
ప్రధానే గడ్డాలు, జులపాలు పెంచగా లేనిది… ఈ చిరుద్యోగులకు ఆంక్షలేమిటి సార్..?
హెడ్డింగ్ చూసి హాశ్చర్యం వేసిందా..? గడ్డం, మీసం పెంచుకోవడానికి పర్మిషన్ ఏమిటి..? అసలు గడ్డం ఎవరికి అడ్డం..? కోట్ల మంది పెంచేసుకుంటారు, దానికి పర్మిషన్ దేనికి అనేదేనా మీ డౌట్..? ఖాకీ డ్రెస్సుల్లో పనిచేసే విభాగాల్లో ఉద్యోగులకు అవసరం… అదీ హిందువులైతేనే…! పర్ సపోజ్, నేను అయ్యప్ప మాల వేసుకుంటున్నాను, డ్రెస్సుకు మినహాయింపు ఇవ్వండి సార్ అనడగాలి… సేమ్, ఏ తిరుమల వెంకన్నకో, యాదాద్రి నర్సన్నకో, ఎముడాల రాజన్నకో, కొండగట్టు అంజన్నకో తలవెంట్రుకలు మొక్కుకున్నారూ అనుకొండి… పర్మిషన్ […]
సుక్క పొద్దు షాదీ..! పొట్టపగిలే దావత్..! అరె భయ్, మస్తు చేసినవ్ పెళ్లి..!!
పెళ్లి… ఈమధ్య అన్నీ అభిజిత్ లగ్నాలే కదా… అంటే, మనకు ఇష్టమొచ్చిన ముహూర్తాన్ని, వేళను పురోహితుడు ఖరారు చేసి, మీ ఖర్మ అని చేతులు దులిపేసుకుంటాడు… దేవుళ్లు పెళ్లిళ్లనే అభిజిత్ లగ్నాలకు మార్చేశారు మన పండితులు… మామూలు మనుషుల పెళ్లిళ్లు అనగా ఎంత..? అసలు జాతకాలను బట్టి ముహూర్తాలు, పెళ్లిళ్లు అనేది పాతరాతి యుగపు సంప్రదాయం అయిపోయింది… అసలు జాతకాలు కలవకపోతే అమ్మాయి పేరు అప్పటికప్పుడు అర్జెంటుగా మార్చేసి, శుభ పత్రికలు అచ్చేసి… గ్రహగతుల్ని తిరగరాయడం కదా […]
సినీ సింగర్లకు, టీవీ యాంకర్లకు… మోహన భోగరాజు నేర్పే ‘బుల్లెట్ పాఠం’…
మోహన భోగరాజు… ఎనిమిదేళ్లుగా పాటలు పాడుతోంది… బాహుబలిలో మనోహరీ పాడినప్పుడు ఎవరబ్బా ఈమె అనే ఆసక్తి క్రియేటైంది… ఆమె ఎక్కువగా కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడుతోంది, కానీ మనోహరి పాట మిగతా అన్నిపాటలకన్నా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది… అఫ్ కోర్స్, చాలా పాటలు హిట్టయి ఉండవచ్చుగాక…. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏమిటంటే…. ఆమె బుల్లెట్ బండి, డుగ్గుడుగ్గు పాట పాడిందిగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం… దాని గురించి…! ఎందుకంటే..? ఆమె నేటివ్ ఏలూరు… తెలంగాణ మాండలికంలో […]
….. చివరకు నోరూరే ఆ సర్వపిండిని కూడా భ్రష్టుపట్టిస్తున్నారు కదరా..!!
చిన్న సరదా ముచ్చటే లే…. ఎంతసేపూ కాలుష్యపు రాజకీయ పోస్టులు, దరిద్రపు నాయకుల సంగతులు దేనికిలే గానీ…. ఎంచక్కా ఫుడ్స్ వైపు వెళ్లిపోదాం… ఫుడ్ అనగానే తెలంగాణలో సర్వపిండి… నాన్ వెజ్ కాదు, వెజ్… తపాలచెక్క అని కొన్నిచోట్ల అంటారుట, మనకు తెలియదు… మా దగ్గర మాత్రం ఎంచక్కా సర్వప్ప అంటాం… నిజానికి తెలంగాణ అధికారిక వంటకం సకినాలా, సర్వపిండా అని పోటీపెడితే రెండింటికీ సేమ్ మార్కులొస్తయ్… అచ్చం, తెలుగు సినిమాల్లో, టీవీ సీరియళ్లలో తెలంగాణ మాండలికాన్ని […]
అదే బుల్లెట్ బండి పాటను… పర్ సపోజ్, పెళ్లికొడుకు పాడితే ఎలా ఉంటుంది..?!
మంచిర్యాల జిల్లాలో, పెళ్లికూతురు సాయిశ్రియ పెళ్లి బరాత్‌లో చేసిన బుల్లెట్ బండి డాన్స్ నిన్న ఎంత వైరల్ అయ్యిందో చూశాం కదా… యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది నిన్నంతా… సోషల్ మీడియా మొత్తం సాహో అనేసింది… ఆ వీడియోకు ఎన్ని లైకులో, ఎన్ని షేరులో లెక్కేలేదు… సరే, బాగుంది… కానీ అది ఒక పెళ్లికూతురు వెర్షన్… తన కుటుంబం గురించి చెప్పుకుంది.., పోదాం పదవోయ్, నీ చేయి పట్టుకుని, నీ బండెక్కి వస్తా, దునియాను చూద్దాం పద […]
వైరల్ వీడియో..! అసలు ఏముందీ పాటలో… అంత బాగా ఎక్కేసింది..!!
ఆశ్చర్యమేసింది… యూట్యూబులో కోట్ల వ్యూస్ ఈరోజుల్లో పెద్ద విశేషం ఏమీ కాదు… కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా సినిమా పాటల్ని దాటి వ్యూస్, ఆదరణ సాధిస్తున్న తీరు ఆసక్తికరంగా కూడా ఉంది… కాదు, చూడటం కాదు… జనంలోకి బలంగా ఎక్కడం… ఎంత అంటే..? సినిమా ట్యూన్లను మించి హమ్ చేయడం… దిగువ ఓ వీడియో ఉంది చూడండి… మస్తు వైరల్ అయిపోయింది… అందులో ఏముందీ అంటే..? పెళ్లికొడుక్కి స్వాగతం… పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట, వీథిలోనే, […]
మంచి వార్త..! మంచి కలెక్టర్..! మన బ్యాంకులు ఇలాంటి మంచి పనులూ చేస్తాయా..?!
కామారెడ్డి, కలెక్టర్, శరత్…. సిద్దిపేట వెంకట్రామారెడ్డిలాగే బహిరంగంగా సీఎం కాళ్ల మీద పడిపోయిన కేరక్టరే కదా అనిపించింది హెడింగ్, డేట్లైన్ చూడగానే..! కానీ వార్త చదివితే ఆసక్తికరంగా ఉంది… ఎప్పట్లాగే ఇతర పత్రికలకు ఈ మానవాసక్తి కథనం పట్టలేదు, కానీ ఇలాంటి వార్తలు అవసరం… ప్రాధాన్యం అవసరం… ఇలాంటి మంచి పనులు చేసే అధికారులకు మీడియా గుర్తింపు, నాలుగు మెచ్చుకోలు వాక్యాలు, చప్పట్లు అవసరం… ఇతర కలెక్టర్లయినా కాస్త చూసి, ఒకరో ఇద్దరో కదులుతారేమో… దిక్కుమాలిన గుమస్తాగిరీ […]
తనది డిగ్నిఫైడ్ లైఫ్..! ఓవైపు చావుతో పోరాటం… ఐనా మీడియా దుర్మార్గం…!!
……. By…. Jagannadh Goud…… “డబ్బు, కష్టాలు, వ్యక్తిత్వం” – క్రిస్ కెయిన్స్ నిజ జీవితంలో జరిగే సంఘటనలు, వాస్తవాలు వేరు.., వార్తా పత్రికల్లో, TVల్లో, యూ ట్యూబ్ ఛానల్స్ లో రాసే వార్తలు వేరు… ఓడలు బండ్లు అవటం, బండ్లు ఓడలు అవటం సహజమే… కానీ అందుకు గల కారణాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటై అని ఒకడు, ఒకప్పటి ప్రపంచంలో నాణ్యమైన ఆల్ రౌండర్ క్రికెటర్ ఈనాడు రోడ్డు పక్కన బస్ క్లీనర్ […]
ఈ తెలంగాణ సాంస్కృతిక నిధిపై KCR సర్కారుకు బాధ్యతేమీ లేదా..?!
……….. By…. Taadi Prakash ……… జయధీర్ తిరుమలరావు – ‘ఆద్యకళ’ the treasure of Telangana’s ethnic art ———————————————————— అడివిగాచిన వెన్నెల్ని నువ్వు రెండు చేతుల్తో పట్టుకుని తెచ్చి నాకు ఇవ్వగలవా? అరణ్యాల్లో అపరాత్రి కురిసిన వాన చినుకుల రహస్య సంగీతాన్ని తెచ్చి నా చెవులకి వినిపించగలవా? కొండగుహల్లో దాక్కొని ఉన్న అంతుచిక్కని కుడ్య చిత్ర సౌందర్యాన్ని నా కళ్ళముందు ఆవిష్కరించగలవా? ఒక పురాతన పద్యంలా ప్రతిధ్వనిస్తున్న ఆదివాసుల ‘ఆద్యకళ’ తాళ పత్రాలను నాకు […]
పర్ సపోజ్… మన బాలయ్యే బోయపాటితో నీరజ్ చోప్రా బయోపిక్ తీస్తే…!
ఒలింపిక్ స్వర్ణుడు నీరజ్ చోప్రా పేరు దేశమంతా మారుమోగిపోతోంది కదా… సోషల్ మీడియా అయితే పండుగ చేసుకుంటోంది… ‘సంఘీ’ అని హఠాత్తుగా తిట్టిపోసే కేరక్టర్లు ఎలాగూ ఉంటాయి కదా, వాళ్లను వదిలేస్తే సరదాగా తన మీద మీమ్స్, జోక్స్ వేస్తున్నవాళ్లు బోలెడు మంది… @Maurya Mondal అని ఒకాయన ఏకంగా నీరజ్ చోప్రా బయోపిక్‌ను అక్షయ్ కుమార్ హీరోగా తీస్తే ఎలా ఉంటుందో ఓ కథ రాసేశాడు… ఇప్పుడు నడుస్తున్నది బయోపిక్కుల ట్రెండే కదా… భలే ఉంది… […]
కామెడీలోనూ ఓ సపరేట్ స్టయిల్… కానీ ఓ కల నెరవేరకుండానే కన్నుమూత…
………… By…….. Abdul Rajahussain………………….. (ఆగస్టు 9…. రంగస్థల, బుల్లితెర, వెండితెర నటుడు, దర్శకుడు, వ్యాఖ్యాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు )……. * గిలిగింతలు పెట్టే హాస్యానికి వరం..” ధర్మవరపు సుబ్రహ్మణ్యం. “! పరిచయం అక్కర్లేని పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. హాస్యానికి ఆయన కేరాఫ్. ప్రకాశం జిల్లాలోని ‘కొమ్మునేని’ వారి పల్లెలో జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద మోజుండేది. రేడియోలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆతర్వాత ప్రజానాట్యమండలి తరపున ఎన్నో నాటకాల్లో నటించారు. […]
- « Previous Page
- 1
- …
- 21
- 22
- 23
- 24
- 25
- …
- 35
- Next Page »