హెడ్డింగ్ చూసి హాశ్చర్యం వేసిందా..? గడ్డం, మీసం పెంచుకోవడానికి పర్మిషన్ ఏమిటి..? అసలు గడ్డం ఎవరికి అడ్డం..? కోట్ల మంది పెంచేసుకుంటారు, దానికి పర్మిషన్ దేనికి అనేదేనా మీ డౌట్..? ఖాకీ డ్రెస్సుల్లో పనిచేసే విభాగాల్లో ఉద్యోగులకు అవసరం… అదీ హిందువులైతేనే…! పర్ సపోజ్, నేను అయ్యప్ప మాల వేసుకుంటున్నాను, డ్రెస్సుకు మినహాయింపు ఇవ్వండి సార్ అనడగాలి… సేమ్, ఏ తిరుమల వెంకన్నకో, యాదాద్రి నర్సన్నకో, ఎముడాల రాజన్నకో, కొండగట్టు అంజన్నకో తలవెంట్రుకలు మొక్కుకున్నారూ అనుకొండి… పర్మిషన్ […]
సుక్క పొద్దు షాదీ..! పొట్టపగిలే దావత్..! అరె భయ్, మస్తు చేసినవ్ పెళ్లి..!!
పెళ్లి… ఈమధ్య అన్నీ అభిజిత్ లగ్నాలే కదా… అంటే, మనకు ఇష్టమొచ్చిన ముహూర్తాన్ని, వేళను పురోహితుడు ఖరారు చేసి, మీ ఖర్మ అని చేతులు దులిపేసుకుంటాడు… దేవుళ్లు పెళ్లిళ్లనే అభిజిత్ లగ్నాలకు మార్చేశారు మన పండితులు… మామూలు మనుషుల పెళ్లిళ్లు అనగా ఎంత..? అసలు జాతకాలను బట్టి ముహూర్తాలు, పెళ్లిళ్లు అనేది పాతరాతి యుగపు సంప్రదాయం అయిపోయింది… అసలు జాతకాలు కలవకపోతే అమ్మాయి పేరు అప్పటికప్పుడు అర్జెంటుగా మార్చేసి, శుభ పత్రికలు అచ్చేసి… గ్రహగతుల్ని తిరగరాయడం కదా […]
సినీ సింగర్లకు, టీవీ యాంకర్లకు… మోహన భోగరాజు నేర్పే ‘బుల్లెట్ పాఠం’…
మోహన భోగరాజు… ఎనిమిదేళ్లుగా పాటలు పాడుతోంది… బాహుబలిలో మనోహరీ పాడినప్పుడు ఎవరబ్బా ఈమె అనే ఆసక్తి క్రియేటైంది… ఆమె ఎక్కువగా కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడుతోంది, కానీ మనోహరి పాట మిగతా అన్నిపాటలకన్నా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది… అఫ్ కోర్స్, చాలా పాటలు హిట్టయి ఉండవచ్చుగాక…. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏమిటంటే…. ఆమె బుల్లెట్ బండి, డుగ్గుడుగ్గు పాట పాడిందిగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం… దాని గురించి…! ఎందుకంటే..? ఆమె నేటివ్ ఏలూరు… తెలంగాణ మాండలికంలో […]
….. చివరకు నోరూరే ఆ సర్వపిండిని కూడా భ్రష్టుపట్టిస్తున్నారు కదరా..!!
చిన్న సరదా ముచ్చటే లే…. ఎంతసేపూ కాలుష్యపు రాజకీయ పోస్టులు, దరిద్రపు నాయకుల సంగతులు దేనికిలే గానీ…. ఎంచక్కా ఫుడ్స్ వైపు వెళ్లిపోదాం… ఫుడ్ అనగానే తెలంగాణలో సర్వపిండి… నాన్ వెజ్ కాదు, వెజ్… తపాలచెక్క అని కొన్నిచోట్ల అంటారుట, మనకు తెలియదు… మా దగ్గర మాత్రం ఎంచక్కా సర్వప్ప అంటాం… నిజానికి తెలంగాణ అధికారిక వంటకం సకినాలా, సర్వపిండా అని పోటీపెడితే రెండింటికీ సేమ్ మార్కులొస్తయ్… అచ్చం, తెలుగు సినిమాల్లో, టీవీ సీరియళ్లలో తెలంగాణ మాండలికాన్ని […]
అదే బుల్లెట్ బండి పాటను… పర్ సపోజ్, పెళ్లికొడుకు పాడితే ఎలా ఉంటుంది..?!
మంచిర్యాల జిల్లాలో, పెళ్లికూతురు సాయిశ్రియ పెళ్లి బరాత్‌లో చేసిన బుల్లెట్ బండి డాన్స్ నిన్న ఎంత వైరల్ అయ్యిందో చూశాం కదా… యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది నిన్నంతా… సోషల్ మీడియా మొత్తం సాహో అనేసింది… ఆ వీడియోకు ఎన్ని లైకులో, ఎన్ని షేరులో లెక్కేలేదు… సరే, బాగుంది… కానీ అది ఒక పెళ్లికూతురు వెర్షన్… తన కుటుంబం గురించి చెప్పుకుంది.., పోదాం పదవోయ్, నీ చేయి పట్టుకుని, నీ బండెక్కి వస్తా, దునియాను చూద్దాం పద […]
వైరల్ వీడియో..! అసలు ఏముందీ పాటలో… అంత బాగా ఎక్కేసింది..!!
ఆశ్చర్యమేసింది… యూట్యూబులో కోట్ల వ్యూస్ ఈరోజుల్లో పెద్ద విశేషం ఏమీ కాదు… కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా సినిమా పాటల్ని దాటి వ్యూస్, ఆదరణ సాధిస్తున్న తీరు ఆసక్తికరంగా కూడా ఉంది… కాదు, చూడటం కాదు… జనంలోకి బలంగా ఎక్కడం… ఎంత అంటే..? సినిమా ట్యూన్లను మించి హమ్ చేయడం… దిగువ ఓ వీడియో ఉంది చూడండి… మస్తు వైరల్ అయిపోయింది… అందులో ఏముందీ అంటే..? పెళ్లికొడుక్కి స్వాగతం… పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట, వీథిలోనే, […]
మంచి వార్త..! మంచి కలెక్టర్..! మన బ్యాంకులు ఇలాంటి మంచి పనులూ చేస్తాయా..?!
కామారెడ్డి, కలెక్టర్, శరత్…. సిద్దిపేట వెంకట్రామారెడ్డిలాగే బహిరంగంగా సీఎం కాళ్ల మీద పడిపోయిన కేరక్టరే కదా అనిపించింది హెడింగ్, డేట్‌లైన్ చూడగానే..! కానీ వార్త చదివితే ఆసక్తికరంగా ఉంది… ఎప్పట్లాగే ఇతర పత్రికలకు ఈ మానవాసక్తి కథనం పట్టలేదు, కానీ ఇలాంటి వార్తలు అవసరం… ప్రాధాన్యం అవసరం… ఇలాంటి మంచి పనులు చేసే అధికారులకు మీడియా గుర్తింపు, నాలుగు మెచ్చుకోలు వాక్యాలు, చప్పట్లు అవసరం… ఇతర కలెక్టర్లయినా కాస్త చూసి, ఒకరో ఇద్దరో కదులుతారేమో… దిక్కుమాలిన గుమస్తాగిరీ […]
తనది డిగ్నిఫైడ్ లైఫ్..! ఓవైపు చావుతో పోరాటం… ఐనా మీడియా దుర్మార్గం…!!
……. By…. Jagannadh Goud…… “డబ్బు, కష్టాలు, వ్యక్తిత్వం” – క్రిస్ కెయిన్స్ నిజ జీవితంలో జరిగే సంఘటనలు, వాస్తవాలు వేరు.., వార్తా పత్రికల్లో, TVల్లో, యూ ట్యూబ్ ఛానల్స్ లో రాసే వార్తలు వేరు… ఓడలు బండ్లు అవటం, బండ్లు ఓడలు అవటం సహజమే… కానీ అందుకు గల కారణాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటై అని ఒకడు, ఒకప్పటి ప్రపంచంలో నాణ్యమైన ఆల్ రౌండర్ క్రికెటర్ ఈనాడు రోడ్డు పక్కన బస్ క్లీనర్ […]
ఈ తెలంగాణ సాంస్కృతిక నిధిపై KCR సర్కారుకు బాధ్యతేమీ లేదా..?!
……….. By…. Taadi Prakash ……… జయధీర్ తిరుమలరావు – ‘ఆద్యకళ’ the treasure of Telangana’s ethnic art ———————————————————— అడివిగాచిన వెన్నెల్ని నువ్వు రెండు చేతుల్తో పట్టుకుని తెచ్చి నాకు ఇవ్వగలవా? అరణ్యాల్లో అపరాత్రి కురిసిన వాన చినుకుల రహస్య సంగీతాన్ని తెచ్చి నా చెవులకి వినిపించగలవా? కొండగుహల్లో దాక్కొని ఉన్న అంతుచిక్కని కుడ్య చిత్ర సౌందర్యాన్ని నా కళ్ళముందు ఆవిష్కరించగలవా? ఒక పురాతన పద్యంలా ప్రతిధ్వనిస్తున్న ఆదివాసుల ‘ఆద్యకళ’ తాళ పత్రాలను నాకు […]
పర్ సపోజ్… మన బాలయ్యే బోయపాటితో నీరజ్ చోప్రా బయోపిక్ తీస్తే…!
ఒలింపిక్ స్వర్ణుడు నీరజ్ చోప్రా పేరు దేశమంతా మారుమోగిపోతోంది కదా… సోషల్ మీడియా అయితే పండుగ చేసుకుంటోంది… ‘సంఘీ’ అని హఠాత్తుగా తిట్టిపోసే కేరక్టర్లు ఎలాగూ ఉంటాయి కదా, వాళ్లను వదిలేస్తే సరదాగా తన మీద మీమ్స్, జోక్స్ వేస్తున్నవాళ్లు బోలెడు మంది… @Maurya Mondal అని ఒకాయన ఏకంగా నీరజ్ చోప్రా బయోపిక్‌ను అక్షయ్ కుమార్ హీరోగా తీస్తే ఎలా ఉంటుందో ఓ కథ రాసేశాడు… ఇప్పుడు నడుస్తున్నది బయోపిక్కుల ట్రెండే కదా… భలే ఉంది… […]
కామెడీలోనూ ఓ సపరేట్ స్టయిల్… కానీ ఓ కల నెరవేరకుండానే కన్నుమూత…
………… By…….. Abdul Rajahussain………………….. (ఆగస్టు 9…. రంగస్థల, బుల్లితెర, వెండితెర నటుడు, దర్శకుడు, వ్యాఖ్యాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు )……. * గిలిగింతలు పెట్టే హాస్యానికి వరం..” ధర్మవరపు సుబ్రహ్మణ్యం. “! పరిచయం అక్కర్లేని పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. హాస్యానికి ఆయన కేరాఫ్. ప్రకాశం జిల్లాలోని ‘కొమ్మునేని’ వారి పల్లెలో జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద మోజుండేది. రేడియోలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆతర్వాత ప్రజానాట్యమండలి తరపున ఎన్నో నాటకాల్లో నటించారు. […]
జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాలేదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
నిజానికి ఇది రాయడానికి విశేష సందర్భం ఏమీలేదు, పనికట్టుకుని రాసిందీ కాదు… ఒకప్పటి నిర్మాత కాట్రగడ్డ మురారి రాసుకున్న బయోగ్రఫీ ‘నవ్విపోదురుగాక’ పుస్తకం మరోసారి తిరగేస్తుంటే… ఈ ఎపిసోడ్ దగ్గర చాలాసేపు మనం ఆగిపోతాం… మథనంలో పడిపోతాం… మనం చదువుకున్న చరిత్ర మీద మనమే సందేహంలో ఇరుక్కుపోతాం… ఇది గాంధీ కొడుకు కథ… గాంధీ కథతో పోలిస్తే నిజానికి తన కొడుకుది కథే కాదు… పైగా భ్రష్ట జీవితం… అయితే అలా మారడానికి తండ్రే కారణమా..? జాతికే […]
‘‘నా మొగుడిని వదిలేయండి.., నేను పిల్లల్ని కనాలి… అది నా హక్కు…’’
నిన్ననే కదా, కేరళ హైకోర్టుకు వచ్చిన ఓ కేసు గురించి మాట్లాడుకున్నాం… అంగప్రవేశం జరిగితేనే అత్యాచారం కిందకు లెక్క అంటాడు నిందితుడు… తొడలకు నా పురుషాంగం తాకితే అది రేప్ కాదు అంటాడు… ఛట్, మూసుకో, అనుచిత లైంగిక వాంఛతో చేసే ప్రతి పనీ లైంగిక దాడే అంటూ హైకోర్టు తేల్చేసింది… అలాగే ‘చర్మ స్పర్శ’ జరగకపోతే అది లైంగిక దాడే కాదు అని ఓ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏకంగా సుప్రీం విచారణ జరుపుతోంది… […]
లవ్లీనా కాదు… లవ్లీ గాళ్..! సొంతూరికి పతకం, గర్వం ప్లస్ ఓ పక్కా రోడ్డు కూడా…!!
ప్రభుత్వ ఉన్నతాధికారులు అంటేనే మెదళ్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందే కదా… అస్సాం అయినా సరే, అండమాన్ అయినా సరే… ఈ కేరక్టర్లు మాత్రం ఏమాత్రం తేడా లేకుండా ఇలాగే ఉంటయ్… అధికశాతం… ఈ ఉదాహరణ చదివితే మన నమ్మకం మరింత రూఢీ అయిపోతుంది… నిన్న మన బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కాంస్య పతాకాన్ని సాధించింది… చదివారు కదా… అసలే అరంగేట్రం, ఐనా సరే ఆత్మవిశ్వాసంతో… ఒలింపిక్స్ పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర రాసుకుంది… అంతర్జాతీయ బాక్సింగులో […]
‘‘ఆంధ్రభూమి అదిరిపోయి అర్జెంటుగా మెమో ఇచ్చి మందలించింది…’’
………. By……. Taadi Prakash………… మోహన్ ప్రసాద్ అనే కవి ఉండడం మన అదృష్టం Celebrating agony of being alive: Tripura ————————————————————– 1975 నుంచీ తెలిసిన, సభల్లో, రాత్రి పార్టీల్లో కలిసిన, భుజాలమీద చేతులేసుకు నడిచిన… లాంటి ఆ పెద్ద కవికి నేను ఏమివ్వగలను? ఇచ్చే అవకాశం రానే వచ్చింది… బాహాటంగా, రహస్తంత్రి రూపంలో. విజయవాడలో సభ. కవులూ రచయితలూ, పుస్తకావిష్కరణ సభ అంటే కకావికలు ఐపోతూ ఉంటారు. “పుస్తకం రానీ, మతిపోతుంది ఒక్కొక్క […]
ఇస్మార్ట్ శంకర్..! ష్… కిమ్ తల వెనుక బ్యాండేజీ, మచ్చ వెనుక ఇంట్రస్టింగ్ కథ…!!
ట్రంప్ చాలా చిరాకుగా ఉన్నాడు… తనకున్న బోలెడు వ్యాపార సంస్థల్లో ఒక్కడ స్టాఫ్ తప్పు లేదా పొరపాటు తేలినా సహించడు తను… వెంటనే తల తీసేస్తాడు, అంటే కొలువు గోవిందా… ప్రత్యేకించి ఏ ఉద్యోగి ఏం చేస్తున్నాడో చూసే ఇంటర్నల్ విజిలెన్స్ వింగ్‌కు చాలా ప్రయారిటీ ఇస్తాడు… మస్తు జీతాలు, సౌకర్యాలు, వాళ్ల ఖర్చు మీద నో ఆడిటింగ్… అలాంటిది తన మీద సవాల్ చేసిన ఆ నార్త్ కొరియా కిమ్‌ను సహిస్తాడా..? చిన్న మిస్సయిల్‌తో కొడితే […]
ఈనాడు తలదన్నే తర్జుమాలు..! ఏవేవో కొత్త భాషల్ని క్రియేట్ చేస్తున్నయ్…!!
టెలిమాటిక్స్‌కు ప్రాప్యతను అందిస్తుంది… ఐటీ వ్యవస్థల అవరోధరహిత సమగ్రతను అందిస్తుంది… నవ-తరం చలన శీలత పరిష్కారాలకు వీలు కల్పిస్తుంది… తదుపరి మధ్య-పరిమాణ కనెక్ట్ చేయబడిన… ముఖ్య స్తంభంగా ఆవిష్కరణ ఉంది… బోర్డు అంతటా ‘అనుభవాలను’ పెంచారు… అనేక ‘ప్రథమాలను’ ప్రవేశపెట్టింది… అవును, మీ తలపై జుత్తు మొత్తం పీక్కున్నా ఏమీ అర్థం కాని వాక్యాలివి… ఎక్కడివీ రత్నాలు అనుకుంటున్నారా..? మనసులో ఏదైనా పత్రిక మీద డౌటొస్తున్నదా..? కాదు, మీరు ఊహిస్తున్నట్టు ఈనాడు కానేకాదు… అది క్షుద్రానువాదాలకు తలపండినదే […]
It can be a web series!… ఒక నవల ఆత్మను పట్టుకునే సమీక్ష అంటే ఇదీ..!!
……… By…. Taadi Prakash…………….. అట్టాడ అప్పల్నాయుడు మాస్టర్ పీస్ – ‘బహుళ’ Peoples ‘war and peace’ of srikakulam ———————————————————————– చుక్కల ఆకాశాన్ని చూస్తూ… ఒక పిల్ల – “డబ్బీ పగలగొట్టలేము, డబ్బులు లెక్కెట్టలేము… ఏటో? సెప్పుకోండి”…? అనడిగింది. “ఆ…! డబ్బీ – ఆకాశం, డబ్బులేమో చుక్కలు” అని పొడుపు కతను విప్పిందో పిల్ల. పిల్లపాపలు, నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద కూకొని ఊసులాడుకుంటన్నారు. వెన్నెల కూడా నడివీధిని చేరుకుంది… […]
కరోనా భయం… ప్రాణభయంతో ఆ ముగ్గురు ఆడవాళ్లూ… 15 నెలలుగా…
థాంక్స్ టు మోడీ…. మన సమాజం ఇప్పుడప్పుడే పూర్తిగా వేక్సినేషన్ చేయించుకోలేదు… పరమాద్భుతమైన పాలసీల చక్రవర్తి కదా… ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ మీద భయాందోళనల్ని సృష్టించే పనిలో కార్పొరేట్, నీచ్ నికృష్ట్ ఫార్మా బ్యాచ్ తలమునకలై ఉంది… ఫోర్త్ వేవ్స్, బూస్టర్ డోసులు, డెల్టాలు, డెల్టా ప్లస్సులు, బ్లాక్ ఫంగసులు, వీలయితే గామా, గామా ప్లస్, అల్ఫా, బీటా తదితర వైరస్ మ్యుటెంట్లనూ ప్రచారంలోకి తెచ్చి… రోగగ్రస్త సమాజాన్ని మరింత […]
తొక్కి, తోలు తీసి… నోట్లో కుక్కిన తోపు వార్త… హేట్సాఫ్ టు ఈనాడు…!!
పళ్ల తొక్కలు తీసి, కూరగాయల తొక్కలు తీసి… వాటిల్లో జీవం పారేసి, ఇంకేం తింటారురా… మీ బొంద, తొక్కల్ని తినడం నేర్చుకొండిరా, తొక్కలో తెలివీ మీరూనూ…… అంటూ ఇప్పటి దాకా బోలెడు వార్తలొచ్చినయ్, గొట్టపు చానెళ్ల కథనాలొచ్చినయ్… వెబ్ పోషక డాక్టర్ల సలహాలూ వచ్చినయ్… ఎప్పుడూ, ఎవడో ఒకడు, తొక్కల ప్రాశస్త్యం గురించి పిచ్చి సర్వేలు, స్టడీలు అని చెబుతూనే ఉంటాడు… మనం రాస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం… అసలు ప్రపంచంలో శ్రేష్టమైన తిండి అంటే, తొక్కలే […]