కొద్దిరోజులుగా మనం స్పేస్‌లోకి వెళ్లిన వాళ్ల గురించి చెప్పుకుంటున్నాం కదా… ఈ ఒక్కటీ ఓసారి చదవండి… ‘‘2003లో కొలంబియా స్పేస్ షిప్ ప్రమాదంలో మన కల్పనా చావ్లా సహా మరికొందరు ఆస్ట్రోనాట్స్ మరణించారు… తరువాత నాసా కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు అయిపోయింది… కానీ తేరుకుని, 2006లోనే మరో టీం రెడీ చేశారు… అందులో మన సునీతా విలియమ్స్ కూడా ఉంది… ఓ ఉద్రిక్తత… కొలంబియా ప్రమాదం నేపథ్యంలో అందరిలోనూ ఓ భయం… సునీత భయపడలేదు, భయపడేవాళ్లు ఖగోళయాత్రకు […]
విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
నిన్న లగడపాటి రాజగోపాల్ శ్రీమతి జానకి ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్న ఓ వీడియో, ఓ పోస్ట్ ఇంట్రస్టింగుగా అనిపించింది… అందులో ఆమె ఆకు గానీ, విస్తరి గానీ, ప్లేటు గానీ లేకుండా… తను నేల పైనే కూర్చుని.., ఉత్త నేల మీదే వడ్డన చేసిన ఆహారాన్ని భోంచేస్తోంది… మన తెలుగు జనానికి కొత్తగా అనిపించవచ్చుగాక… కానీ తమిళనాడులో.., కేరళ, కర్నాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గుళ్ల దగ్గర చాలాకాలంగా ఉన్న ఆచారం ఇది… దేవుడికి మరింత సరెండర్ […]
జగమెరిగిన గాయని ఆశా భోస్లే ఓ మంచి మాట చెప్పింది… ఏమిటంటే..?
ఆశా భోస్లే… భారతీయ సినీ సంగీతాన్ని ప్రేమించేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు… మెలొడి, క్లాసిక్ మాత్రమే కాదు, రకరకాల ట్యూన్లకు ప్రాణం పోసింది ఆమె గాత్రం… 87 ఏళ్లు ఆమె వయస్సు ఇప్పుడు… ఆమె ఇండియన్ ఐడల్ షోకు వచ్చింది ఈవారం గెస్టుగా… నిజంగా ఇలాంటివాళ్లను పిలిచి, పాత స్మృతుల్లో పరవశిస్తేనే షోకు నిజమైన విలువ… షణ్ముఖప్రియ ఓ పాట పాడింది… తనకు అలవాటైన రీతిలోనే, తను ఎప్పుడూ అటెంప్ట్ చేసే ఓ పాప్ సాంగ్ పాడింది… […]
ట్యూబు చూసి వండితే ఇక అయినట్టే..! సింపుల్‌గా ఇలా తేల్చేయండి ఈసారి..!!
నిజమే… ఓ మిత్రురాలు చెప్పినట్టు… ఎంతసేపూ ఆ క్షుద్ర రాజకీయాలేనా..? ఇక వేరే జీవితమే లేదా..? ఆఫ్టరాల్ పాలిటిక్సు గురించి ఎవడికి పట్టింది..? ఈ జనరేషన్ అయితే అస్సలు పట్టించుకోదు, పైగా ఏవగించుకుంటుంది… సరే, సరే…. జీవితంలోని పంచమహాపాతకాలు ఏమిటేమిటో గానీ… షష్టి లేదా సప్తమ పాతకం మాత్రం ఆహార వృథా… ఆకలి అంచనా లేకుండా ఎక్కువ తక్కువ వండేసి, మిగిల్చి, ప్రిజ్జులో పడేసి, తెల్లారాక దాన్ని ఏం చేయాలో అర్థం గాక డస్ట్ బిన్‌లో పడేసే […]
పొలం లేదా..? పొద్దు లేదా..? ఆ బాల్యాన్ని అనుభవించనివ్వండి సార్…!!
‘‘నేను రాజకీయాల్లో రాను’’… కేసీయార్ మనమడు, కేటీయార్ కొడుకు హిమాంశు ట్విట్టర్‌లో కనిపించిన ఈ వాక్యం ఒకింత విచిత్రంగానే ధ్వనించింది… వచ్చే 12వ తేదీకి పదహారో ఏడులోకి అడుగుపెడుతున్నాడు… ఇంకా బాల్యం, స్కూలింగ్ తాలూకు జ్ఞాపకాల్ని, అనుభవాల్ని పదిలంగా పేర్చుకునే వయస్సు… ఇధి మళ్లీ రాదు… కానీ ఏం జరుగుతోంది..? అప్పుడే వందిమాగధులు, ప్రమథగణాలు, స్తోత్రపాఠాలు, భజనలు… ఈ వయస్సులో ఈ విద్యేతర కాలుష్యాన్ని తన మెదడులో నింపడం అవసరమా..? ఒక్కసారి అధికారం తాలూకు కిక్కు అలవాటయితే, […]
మోడీ భాయ్..! ఆ చైనా జిన్‌పింగుడికి నాలుగు బుట్టల మామిళ్లు పంపించరాదూ…!!
రిలేషన్… పెంచుకోవడం, కాపాడుకోవడం, పునరుద్దరించుకోవడం, దిద్దుకోవడం… ఒక కళ… అది మనుషుల మధ్యే కాదు, పార్టీల నడుమ, సంస్థల నడుమ, దేశాల నడుమ కూడా…! ఈ ప్రక్రియ కోసం తరచూ మాట్లాడుకోవడమే కాదు, అవసరమైతే కానుకల్ని పంపడం కూడా పరిపాటి… విలువైన కానుకలకన్నా కొన్నిసార్లు పండ్లు, రాఖీలు, స్వీట్లు, బట్టలు గ్రహీత మొహంలో చిరునవ్వును పండిస్తాయి… మనుషుల నడుమ నెగెటివిటీని తగ్గిస్తాయి… ఎంతోకొంత సానుకూలతను, పాజిటివిటీని కలిగిస్తాయి… పలుసార్లు ఎంత ప్రత్యర్థులైనా రాజకీయాలు రాజకీయాలే, మర్యాద మర్యాదే… […]
నూకల అత్తెసరు..! ఇప్పటి తరానికి తెలియని ఓ సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
మరీ వెనక్కి అవసరం లేదు… కాస్త వెనక్కి… ఇప్పుడంటే… పండించిన వడ్లు అమ్ముకోవాలి, దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాలి కదా ట్రెండు… కానీ గతం… సన్నవో, దొడ్డువో… వడ్లు వడ్లే… (వడ్లు అంటే ఏమిటని అడిగే తరం ఇది…) వడ్లు అంటే ఇంకా ప్రాసెస్ చేయబడని బియ్యం… సరే, రాళ్లూరప్పా, మట్టీబేడా లేకుండా చూసి, తమ వడ్లను తీసుకుని గిర్నికి తీసుకుపోయేవాళ్లు రైతులు… చిన్న చిన్న గిర్నీలు ప్రతి ఊరిలోనూ ఉండేవి… (గిర్నీ అంటే మినీ రైస్ మిల్…)… […]
నాన్న అంటే..? ఇప్పటికీ లోకంలో ఎవడూ సరిగ్గా నిర్వచించలేని బంధం… అంతే…!!
ముందుగా ఒక పోస్టు చదవండి……….. ‘‘ కాకికి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ.. ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది. “పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?” ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు. “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అని ఉంది.ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకు…చెప్పారు పంతులుగారు. “లేదు కాకి వచ్చిముడుతేనే ఆత్మశాంతి కలిగినట్లు! […]
మేఘా డప్పు..! కేసీయార్ గుస్సా..! డిస్కవరీ తుస్సు..! ఇంజినీర్ల కస్సుబుస్సు..!!
కొన్ని నవ్వొచ్చే ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఉంటాయంటే…? ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… ‘‘ఎక్సయిజు కమిషనర్ రామకోటేశ్వరరావు నేతృత్వంలో, సూపరింటిండెంట్ యాదగిరిరావు పర్యవేక్షణలో, డీఎస్పీ అజీజ్ సూచనలతో, సీఐ క్రిస్టోఫర్, ఎస్సయిలు రాములు, కోటగిరి బుధవారం రాత్రి దాడులు చేసి, అక్రమంగా తయారీ చేసి, నిల్వ ఉంచిన 25 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు..’’ ఇదీ ప్రకటన… కానిస్టేబుళ్ల పేర్లు, ఎక్సయిజు మంత్రి పేరు, చీఫ్ సెక్రెటరీ పేర్లు రాయలేదు, సంతోషం… పత్రికల్లో వచ్చే రాజకీయ […]
సో వాట్..? భార్య తన భర్త అంత్యక్రియలకు ‘కర్తగా’ వ్యవహరిస్తేనేం..?!
అప్పుడే జాతీయ మీడియాలో, సైట్లలో మొదలైపోయింది… యూట్యూబ్ చానెళ్ల గోల సరేసరి… ‘‘తరతరాల హిందూ అంత్యక్రియల ఆచార సంప్రదాయాల్ని మందిరా బేడీ బద్దలు కొట్టింది…’’ ఆ వార్తల కింద కామెంట్లు హోరెత్తడమూ సహజమే కదా… తప్పు లేదని కొందరు, తప్పే అనేవాళ్లు కొందరు… నిజానికి… సో వాట్..? అనే ఈ ప్రశ్న మీడియాకు వేసేవాడు లేడు… ఏ ఆచారమూ, ఏ సంప్రదాయమూ ఎప్పుడూ ఒకేరకంగా ఉండిపోదు… కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, ఉండాలి… ఒకప్పుడు సతీసహగమనం ఓ […]
ఏది వార్త..? నో, నో… జర్నలిస్టులే కాదు, అందరూ చదవాల్సిన కథనమే ఇది..!!
ఏది వార్త..? ఏది వార్త కాదు..? ఏది రాయాలి..? ఏది రాయకూడదు..? ఏది ఎలా రాయాలి..? ఏది ఎలా రాయకూడదు..? వార్తలో ఏముండాలి..? ఇవన్నీ జర్నలిజంలో బేసిక్ ప్రశ్నలు… ఇవి తెలిస్తేనే జర్నలిస్టు… వీటి తరువాతే భాష, వ్యాకరణం, వాక్యనిర్మాణం, సరైన పదాల ఎంపిక, శైలి, ప్రజెంటేషన్ ఎట్సెట్రా… లెక్కకు మిక్కిలి పత్రికలు, వాటికి జిల్లా, జోన్ అనుబంధాలనే తోక పత్రికలు, అవన్నీ నింపడానికి కోకొల్లలుగా జర్నలిస్టులు… ఏదో ఒకటి నింపాలి కాబట్టి ఏదిబడితే అది వార్త […]
భేష్… మ్యూజిక్ షోకు కొత్త ఫ్లేవర్లు, జతగా ఎమోషన్స్… రక్తికడుతున్నయ్…
మనకేమైనా ఆ హిందీ పాటలన్నీ అర్థమవుతాయా..? ఆ ట్యూన్లన్నీ మనకు ఎరుక ఉన్నవేనా..? వాటిని పదే పదే వింటుంటామా ఏం..? తక్కువే కదా… చాలా తక్కువ కదా… కానీ నాన్-హిందీ శ్రోతలను, ప్రేక్షకులను సైతం ఇండియన్ ఐడల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఎందుకు ఆకర్షిస్తోంది..? ఎందుకంత రక్తికడుతోంది..? దేశంలోకెల్లా టాప్ రియాలిటీ షోల జాబితాలోకి ఎందుకు వస్తోంది..? సీరియళ్ల స్థాయిలో రేటింగ్స్ ఎలా సంపాదిస్తోంది..? అసలు ఏముంది అందులో..? మన శిరీష భాగవతుల ఇప్పుడా షోలో లేదు… మన […]
మహేష్ కత్తి..! తను తెలుగు సమాజం మీద ఈ రేంజ్ ముద్రవేశాడా..?!
మరో కోణం నుంచి చూద్దాం… మహేష్ కత్తికి ప్రమాదం జరిగినట్టు ఎవరో మిత్రులు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది మొదలు… ఇప్పటిదాకా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది… తిట్టేవాళ్లు, బాగైందిలే అని కసికసిగా కామెంట్లు పెట్టేవాళ్లు, మనసులో తిట్టుకుంటూనే కోలుకో మిత్రమా అని ముసుగు వ్యాఖ్యలు తగిలించేవాళ్లు, మనస్పూర్తిగానే మన మహేష్ కోలుకోవాలని కోరుకునేవాళ్లు, విభేదించుకున్నా సరే నువ్వు క్షేమంగా వేగంగా కోలుకో అని ఆకాంక్షించేవాళ్లు… మీమ్స్, వ్యంగ్య వ్యాఖ్యలు, బొమ్మలు, కార్టూన్లు… ఈ స్థితిలోనూ తనపై దారుణమైన ట్రోలింగు […]
బావ కోసం… తుపాకీ, తూటా, పోరాటం, త్యాగం… ఓ విప్లవాత్మక ప్రేమకథ…
ఓ ప్రేమ కథ… ప్రేమ కోసం, బావ కోసం పోరాటంలోకి దూకిన ఓ మహిళ కథ… నిజమైన ప్రేమ… ఏ సినిమా కథకూ తీసిపోని కథ… సాక్షిలో వచ్చిన ఓ స్టోరీ చదవగానే అనిపించింది అలా… కానీ వెన్వెంటనే తన్నుకొచ్చిన ఇంకొన్ని ప్రశ్నలు… తను ఎంతగానో ప్రేమించిన బావ కోసం, తన ప్రేమ కోసం ఓ మహిళ ‘‘నేనూ పోరాడతా, నా బావ వెంటనే ఉండి పోరాడతా, నాకు పిల్లలు కూడా వద్దు’’ అనగానే… శెభాష్, ఛలో […]
దటీజ్ భానుమతి..! సినీ హీరోయిన్లలో రియల్ హీరో…! జవాబ్ నహీఁ…
Taadi Prakash……………… నేను గుర్తు చేసిన తర్వాతే భానుమతి పాడింది…. An extraordinary evening with a silverscreen Legend… ————————————————— అది 1993వ సంవత్సరం. మేనెల రెండోవారం. సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రిక ఆఫీసు. నేను న్యూస్ ఎడిటర్ని. డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఎడిటోరియల్ సెక్షన్లు రెండూ ఒకే ఫ్లోరులో ఉండేవి. క్రానికల్ ఎడిటర్ టేబుల్ మీద ఒక లేండ్ లైన్, నా టేబుల్ మీద మరో లేండ్ లైన్ ఫోన్లు ఉండేవి. క్రానికల్ లో రెండునెలల […]
రేప్ ప్రేరకాలు..! కారకాలు..! ప్రతి సినిమా పాటా కామోద్దీపనే కదా..!
…… రచయిత :: Prasen Bellamkonda…………. మన సినెమా పాటల్లోనే బోలెడంత రేపిజం బోలెడంత మంది రేపిస్టులూ లెక్కలేనన్ని అత్యాచారాలూ … ఇదిగిదిగో!!! . . ఓరోరి యోగి నన్ నలిపెయ్రో ఓరోరి యోగి నన్ పిసికెయ్రో ఓరోరి యోగి నన్ చిదిమెయ్రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్రో మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు పూలదుకాణం దాటి పాలడిపో మీదుగా అట్టట్టా దిగివస్తే అక్కడెఅక్కడె మా ఇల్లు.. వాడిదేం తప్పు జడలో […]
పెళ్లి ఖర్చుకు కోత..! అతిథుల సంఖ్యకు సీలింగ్..! ఆదా డబ్బు ఏం చేశారంటే..?!
తమిళనాడు… తిరుప్పూర్… పి.అరుళ్ సెల్వం ఓ వ్యాపారి… రకరకాల ప్లాస్టిక్ సామాగ్రి, వాటర్ ట్యాంకులు గట్రా విక్రయిస్తుంటాడు… కొడుకు పేరు అరుల్ ప్రాణేష్… తండ్రి వ్యాపారంలో సాయం చేస్తుంటాడు… జి.అను అనే అమ్మాయితో పెళ్లి ఖాయమైంది… ఓ మ్యారేజీ హాల్ బుక్ చేశారు… మొత్తం 50 లక్షల దాకా పెళ్లి ఖర్చు అంచనా వేసుకున్నారు… పెళ్లి పనులు ప్రారంభించేశారు… పెద్ద కుటుంబం, పెద్ద సర్కిల్… పెళ్లికి వస్తారని అంచనా వేసుకున్న మిత్రులు, బంధుగణానికి భోజనాలు, ఇతర పెళ్లి […]
జీవితం క్షణ‘భంగు’రం అంటే ఏమిటో అప్పుడే అర్థమైంది..!!
……….. By……….. Taadi Prakash…………. శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా!… Last Journey of the greatest poet of 20th century ——————————————— రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ. 1981 మే నెల 2వ తేదీ శనివారం. రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం. రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు […]
Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
సరిగ్గా నెల రోజుల క్రితం… పశ్చిమ ఆఫ్రికా నుంచి ఓ వార్త వచ్చింది… మాలీకి చెందిన హలిమా నిస్సే అనే పాతికేళ్ల యువతి ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది… ఇది మానవచరిత్రలోనే రికార్డు… అసాధారణం, అసహజం అని కాదు… అత్యంత అరుదు… నిజానికి ఒకే కాన్పులో ముగ్గురు పుడితేనే అబ్బో అని అబ్బురపడతాం… అలాంటిది తొమ్మిది మంది, పైగా అందరూ బతికారు… మొదట ఏడుగురు అని స్కానింగులో కనిపించింది, తీరా పుట్టేసరికి తొమ్మది లెక్కతేలింది… […]
ఈ పైత్యానికీ, ఈ పత్యానికీ… కోయీ దవాయి నహీఁ … కడాయీ భీ నహీఁ
మన పత్రికల్లో, మన టీవీల్లో కనిపించే చాలా వాణిజ్య ప్రకటనలు నవ్వు పుట్టిస్తయ్, చిరాకు కలిగిస్తయ్, ఆగ్రహాన్ని రేపుతయ్… అసహ్యాన్ని రేకెత్తిస్తయ్… వాటి ఒరిజినల్ ఇంగ్లిష్ లేదా హిందీల్లో బాగానే ఉంటాయి… ఎటొచ్చీ ప్రాంతీయ భాషల్లోకి అనువాదమే ఛండాలంగా ఉంటుంది… నాసిరకం తమిళ సినిమాల్లో డైలాగులను తెలుగులోకి అనువదించే తీరు చూస్తాం కదా… ఈనాడులో క్షుద్ర అనువాదాలు చదువుతాం కదా… అవునవును, కేంద్రం జారీ చేసే ప్రకటనలు కూడా అంతే… పరమ దరిద్రంగా ఉంటయ్… ఎంత అంటే… […]