ఒరేయ్ అప్పల్నాయుడూ మనోడు దంచినాడ్రా… ఒక్కొక డవిలాగ్.. ఒక్కొక్క మాట ఇంటుంటే అచ్చం మనూరి గుంటడు సూరిగాడు లేడూ .. అచ్చం ఆడు మాట్లాడుతున్నట్లే ఉందిరా .. ఆడికన్నా ఈడికి ఒళ్లీరుకు కుసింత ఎక్కువే ఉన్నట్లుంది .. మహా సుల్లారం గుంటడి క్యారెక్టర్… అచ్చం దించీనాడు అనుకో… ఓడియమ్మా … ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకనుంచి ఇంకోలెక్క… మన బాసకూ ఫై స్టార్ రేటింగ్ వచ్చేత్తాది.. ఎప్పుడో రావడం కాదురా.. అల్రెడీగా వచ్చిసింది.. ఇకనుంచి ఎవుడైనా మన […]
రుచిలో వంకలేని నంబర్‘వన్’కాయ… ఇష్ట వంటకానికి ఇంత అవమానమా..!!
మీకు ఏ వంటకం ఇష్టం అనడిగితే… బోలెడు వంటకాలు చకచకా మన బుర్రలో రీల్లా తిరుగుతాయి… ఒకటోరెండో సెలెక్ట్ చేసుకోవడం కష్టం… ఏ వంట అస్సలు ఇష్టం ఉండదు అనడిగినా సరే, అదే స్థితి… ఉప్మా ప్రియులకు నచ్చకపోవచ్చుగాక… ఉప్మాను చాలామందిని ఇష్టపడరు ఎందుకోగానీ… నిజానికి వండటంలో సౌలభ్యం, చౌక, టైమ్ తక్కువ ప్రాతిపదికల్లో అదే బెస్ట్ వంట… ఎట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో… అందుకే ఫంక్షన్లలో టిఫిన్ అనగానే, ఇంటికి బంధువులు రాగానే చటుక్కున ఉప్మాయే […]
జిలుకర ఎల్లిపాయలు వేసి గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్ర మిరుప కారం !
వెనుకటి తిండి~~~~~~~~~~ ఓమ, నువ్వులువేసి ఉప్పి, కొట్టిచేసిన.. తెల్లజొన్న రొట్టె ! జిలుకర ఎల్లిపాయలు వేసి గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్రమిరుప కారం !! అచ్చమైన తెలంగాణపల్లె సంప్రదాయకమైన తిండి. సాయజొన్న ముచ్చట: వెనుకట సాయజొన్న పంట పండుతుండే. చెరువుల కింద ఉన్న వందురు పొలంల తప్ప వరి పంటకు పెద్దగ విలువ లేని బంగారు కాలమది. వానకాలం, చలికాలం రెండు పంటలు జొన్నపంట పండేది. ఈ చలికాలంల కేవలం మంచుతో పండే జొన్నే సాయజొన్న. ఎనబై యేండ్ల […]
న్యూట్రెండ్… కండోమ్స్ ఆర్డర్లకూ… ఓయో రూమ్స్ బుకింగ్స్‌కూ… ‘అదే లింకు’’…
కొత్త సంవత్సరం వస్తున్న వేళ నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్లు ఇచ్చారట ఫుడ్ ప్రియులు… అదీ స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ సప్లయ్ ప్లాట్‌ఫారాలుగా… పెద్ద విశేషం ఏమీ కాదు, నిజానికి హోటళ్ల నుంచి స్వయంగా తీసుకువెళ్లిన ఫుడ్ పార్సిళ్ల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది… పైగా భారతీయులకు బిర్యానీని మించిన ప్రియవంటకం ఏముంటుంది..? మాంచి మసాలా… అవును, మసాలా వేళల్లో అదే కదా కోరుకునే డిష్… 2 లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల […]
తెలుగు మనుగడకు ఢోకా లేదు… ‘చచ్చినట్టు’ బతికించే భాష… బతికే భాష…
శంకర్ జీ……. *సుందర తెలుగు….* ఆసాంతం చదవండి…. సరదాగా, నవ్వుకోవడానికి… *చచ్చినట్టు’ బతికించే భాష!* తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! అందరూ పొగ *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* -ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. *ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, […]
Indira Canteen :: ఆకలితో ఉన్నవాడికే ఆహారం విలువ తెలిసేది…
మొన్నామధ్య సోషల్ మీడియాలో బాగా విమర్శలు వినిపించాయి… కనిపించాయి… కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మీద..! అదేమిటయ్యా అంటే..? బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం చౌక ఆహారం కోసం ఇందిరా క్యాంటీన్ పెడుతుందట… 5 రూపాయలకు టిఫిన్, 10 రూపాయలకు మీల్స్… రెండు క్యాంటీన్లు పెడతారు… ఠాట్, ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాళ్లు, విమానాల్లో తిరిగేవాళ్లు ఏమైనా పేదవాళ్లా..? వాళ్లకు ఎందుకు చౌక ఆహారం..? నాన్సెన్స్, అన్ని రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో పెట్టండి, గుడ్, కానీ ఈ ఎయిర్‌పోర్టులో […]
కొడుకు సంసారంలో కాళ్లూవేళ్లూ పెట్టకండి… చేతులు కాల్చుకోకండి…
ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు చెప్పిన రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారు…. (1) ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండ మనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి. (2) మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి. లేదా ఒక ఫ్రెండ్ గానే […]
చలిచలిగా ఉందిరా ఒయ్రామా ఒయ్రామా… ‘హుషారుగా వణికించే’ పాటలివి…
Bharadwaja Rangavajhala……. చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక… చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం అనేదేదైతే ఉందో […]
పిశాచి… ఈమెను అమ్మ అని పిలవొచ్చా..? కంటేనే అమ్మ అంటే ఎలా..?
నిన్ననే కదా… రైలు పట్టాల మీద ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన సాహసం, ప్రేమ, తెగువ చదివాం, వీడియో చూశాం… అందరమూ చప్పట్లు కొట్టాం… దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని మరోసారి చెప్పుకుని ఆనందపడ్డాం కదా… కానీ కొన్ని పూర్తి వ్యతిరేక మొహాలు ఉంటయ్… ప్రియుల కోసం కన్నబిడ్డలకు విషం పెట్టి కడతేర్చిన తల్లుల కథలు విన్నాం కదా, చదివాం కదా… ఇదీ అలాంటిదే… ఓ తల్లి, కాదు, ఓ […]
ఎడ్లకు పిండప్రదానం, పెద్ద కర్మ, అస్థికల నిమజ్జనం… అదీ రైతుతో బంధం…
కని పెంచిన తల్లిదండ్రులను కాటికి పంపించిన కొడుకుల్ని, బిడ్డల్ని చూశాం… ఎక్కడికో తీసుకెళ్లి, కాటకలిపి అగాధం చేసిన పిల్లన్నీ చూశాం… నిర్బంధంగా ఓల్డేజీ హోమ్స్ పాలుచేసిన వాళ్లను, బయటికి నెట్టేసి తలుపులు మూసుకున్నవాళ్లను, సజీవంగా స్మశానాల్లో పారేసివచ్చినవాళ్లను కూడా చూశాం… కలికాలం… కాలమహిమ అనుకుంటున్నాం… కానీ అదే సమయంలో… పెంపుడు జంతువులకు సొంత పిల్లలుగా ప్రేమించేవాళ్లనూ చూశాం, ఆస్తులు రాసిచ్చి వైభోగంగా బతికే ఏర్పాట్లు చేసినవాళ్లనూ చూశాం… ప్రస్తుత వార్త విషయానికొస్తే… సాధారణంగా వ్యవసాయం పనుల్లో తోడ్పడే […]
ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు…
ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..! ” మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను” అని కన్నీరుపెట్టుకుంది..! దానికి ఇంద్రుడు… “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది […]
పుంటి కూర పూరెక్కలు ఉప్పుకారంతో తినుడు ఒకనాటి పద్ధతి…
కొట్టుకతిన్నదే బాల్యం~~~~~~~~~~~~~~~ ఈ మాగికాలంల చెల్కమీద దొరికే తిండి మస్తు. జామ కాయలు దోస కాయలు గంగరేగు వంఢ్లు చింత కాయలు పుంటి కూర పూలు… దేనికయినా నెఱీ పులుపుకైతె ఇంత ఉప్పుకారం అంటించి కొస నాలుకకు తాకిస్తే.. అదే అతి మధురం. పుస్తకాల సంచిల సెలవస్తె లాగు జేబులల్ల ఉప్పు పొట్లం, కారప్పొట్లం ఎప్పుడుండేది. కోమట్ల దుకాండ్ల ఏం ఉంటుండే గనుకా మా అంటె రసగుల్లలు, బొంగులు, పిప్పరమెట్లు. అదే చెల్కమీదికివోతె అరొక్కతీరు కాయలూ పండ్లూ. […]
తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!
తీపి జ్ఞాపకం… తెలుగు తీపులు అనంతపురం- హోళిగలు కర్నూలు- కోవా పూరీ చిత్తూరు- కోవా జాంగ్రీ ఒంగోలు- అల్లూరయ్య మైసూర్ పాక్ తాపేశ్వరం- కాజాలు పెద్దాపురం- పాలకోవా నెల్లూరు- మలై కాజాలు పెనుకొండ- పాకం కర్జికాయలు బందరు- హల్వా బందరు- లడ్లు తణుకు- బెల్లం జిలేబీ గరివిడి- కాజాలు మాడుగుల- హల్వా పెరుమాళ్ పురం- పాకం గారెలు కాకినాడ- కోటయ్య కాజాలు గుంటూరు- మాల్ పూరీ ఆత్రేయపురం- పూతరేకులు ఇవన్నీ స్వీట్ షాపులో అమ్మకం కోసం పెట్టిన డిస్ప్లే […]
డాక్టర్ ఎమ్మెల్యే..! సభలోకి ఏకంగా 15 మంది మెడికోలు… పైగా స్పెషలిస్టులు…
వాట్సప్ న్యూస్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ పోస్టు చాలా ఆసక్తికరం అనిపించింది… మనకు ఉన్నదే 119 మంది ఎమ్మెల్యేలు కదా… మల్లారెడ్డి వంటి కొందరు విద్యాధికులు, విద్యావేత్తలను కాసేపు పక్కన పెడితే… 15 మంది మెడికల్ డాక్టర్లు ఉన్నారట… గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేవారి సంఖ్య అది… పోటీచేసిన మొత్తం అభ్యర్థుల్లో ఎందరు డాక్టర్లు, ఎందరు ఇంజినీర్లు, గ్రాడ్యుయేషన్ దాటినవాళ్లు ఎందరున్నారో లెక్క తెలియదు… స్కూల్ చదువు కూడా దాటని వాళ్లు ఎందరో కూడా తెలియదు… […]
కుక్క అని తీసిపడేస్తం గానీ ఏం తక్కువ బ్రో… సొంత బిడ్డల లెక్క…
Dog-Doctorate: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు” -అన్నమయ్య కీర్తన “కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!” -సుమతీ శతకం “అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా ? విశ్వదాభిరామ వినురవేమా!” -వేమన పద్యం “నాది నాది అనుకున్నది నీది కాదురా! నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా! కూరిమి గలవారంతా కొడుకులేనురా! జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క […]
మరి ఇండిగో అంటే మజాకా..? బోలెడన్ని ఫ్లయిట్లు, చీప్ టికెట్ రేట్లు… కానీ…?
భారతదేశంలో చాలా చౌక విమానయాన సంస్థ అని పిలవబడే ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో… ముంబైలోని ఒక హోటల్‌కు చేరుకున్నాడు… తర్వాత, బార్కి వెళ్లి ఓ పెగ్ అడిగాడు… బార్మాన్ తల వూపి “అది ₹50 అవుతుంది మిస్టర్ భాటియా” అన్నాడు… కాస్త అవాక్కయిన సీఈఓ (రాహుల్ భాటియా) “ఓహ్, ఇది చాలా చౌక” అని బదులిచ్చి, తన డబ్బు ఇస్తాడు… “సర్, మేం ఎప్పుడూ పోటీలో ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తాం, అందుకే ఈ ధర” అన్నాడు ఆ […]
నెహ్రూ ఆదివాసీ భార్య మొన్న కన్నుమూసింది… కలిచేసే ఓ విషాద కథ…
డిసెంబరు 6, 1959… దామోదర నదిపై నిర్మించిన పాంచెట్ డ్యామ్, జలవిద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభించడానికి అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చాడు… దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అధికారులు కొందరు ఆదివాసీ మహిళలను ఆయనకు స్వాగతం చెప్పడానికి పిలిచారు… వాళ్లు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న కూలీలు… వారిలో ఒక 15 ఏళ్ల యువతి ఉంది… పేరు బుద్ధిని మంఝిన్… ఆమె సంతాలి తెగకు చెందిన యువతి… (మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆ తెగ మహిళే… వాళ్ల […]
పాప్‌కార్న్ అమ్ముకోవడం కోసమే థియేటర్లు నడిపిస్తున్నట్టుంది సుమీ…
Bharadwaja Rangavajhala……. సాధారణంగా సినిమాకు పోవాలంటే .. మరి చాలా సరుకులు సరంజామా ఉండాలి. సత్యన్నారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచీ గేటు వైపు వెళ్తుండగా ఎడమ వైపుకి ఓ బేకరీ ఉండేది … కిసాన్ జామ్స్ వాడివే ఆ రోజుల్లో కిసాన్ బిస్కెట్లు ఉండేవి. ఏమి టేస్ట్ లెండి అవి. తర్వాత తొంభైమూడులో ఆ కంపెనీ బ్రూక్ బాండ్ ఇండియా టేకోవర్ చేసేసిన తర్వాత బిస్కెట్ల తయారీ ఆపేశారు దరిద్రులు. ఇప్పుడది హిందూస్తాన్ లీవర్ లో ఏడ్చింది […]
ఆ గాడిద ఎందుకు ఓండ్రపెట్టింది… ఆ రిటైర్డ్ అధికారి కళ్లెలా తెరుచుకున్నయ్…
పదవీ విరమణ జరిగిపోయింది… తరువాత నేను జరుపుకుంటున్న మొదటి దీపావళి ఇది… తలుచుకుంటుంటే నా గతం ఎంతో గర్వంగా ఉంది… నా సర్వీస్, ప్రత్యేకించి సీనియర్ పొజిషన్లలో నా కొలువు వైభవం పదే పదే గుర్తొస్తున్నది… దీపావళికి వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది… రకరకాల కానుకలు మా ఇంటిని ముంచెత్తేవి… స్వీట్లు, బాణాసంచా కూడా… వచ్చిన ప్రతి కానుకను మొదట ఓ గదిలో పెట్టేవాళ్లం… తీరా దీపావళి పండుగ నాటికి ఆ గది ఓ గిఫ్ట్ […]
చింతపలుక పండు… నాకు మాలెస్స పీర్తి… ఏ పండూ సాటిరాదు…
చింతపలుక పండు.. ఓ యాది ~~~~~~~~~~~~~~~~~~~~~ చింతపలుక పండు, నాకు మాలెస్స పీర్తి గలిగిన పండు. ఒక్కసారి పదితినుమన్నా వద్దనకుంట ముద్దుగ తినుడే. మంచిపండ్లు ఐదారు తింటేజాలు నిషా వచ్చినట్టయితది. కని, మనకు పదితిన్నాసరే పరిగడుపుతోటి ఉన్నట్టే ఉంటది. ఇష్టంలో దీనికి మరోపండు ఏనాటికీ అస్సలు సాటిరానేరాదు. మాది నికార్సుగ గుట్టలుబోర్లు వాగులువొర్రెల రాజ్జముగదా. ఏడవడితాడ అడుగడుక్కు చింతపలుక వనం మస్తుగుంటది. ఇంటిముంగట ఇంటెనుక పక్కలకు సూరుకింద చేదబాయికాడ కొట్టాలకాడ, రాళ్లగోడలపొంటి, బండ్లబాటలపొంటి,రోడుపొంటి రొడ్డాములకాడ, రాపుల కాడ, […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 35
- Next Page »