అల్లూరి విగ్రహావిష్కరణ హడావుడి ముగిసింది కదా… ఇంకా దుమ్మూదుమారం సద్దుమణగలేదు… ఆంధ్రజ్యోతి అసలే అక్కసుగా ఉందిగా, అలా దుమ్ము చల్లబడనివ్వదు… మా చంద్రబాబుకు ప్రయారిటీ ఏది..? మా తెలుగుదేశానికి సముచిత గౌరవం ఏది..? ఇదే ధ్యాస..? దాంతో జగన్ మీదకు ఏడుపు… జగన్ చెప్పినట్టుగానే ఆహ్వానితుల జాబితా రూపొందిందనీ, గిట్టనివాళ్లను దగ్గరకు రానివ్వలేదనీ ఓ ఆరోపణ… అందుకే పవన్, బాబులు ఈ కార్యక్రమానికి దూరమయ్యారనీ, కిషన్ రెడ్డి జగన్ చెప్పినట్టు నడుచుకున్నాడనీ ఆంధ్రజ్యోతి విమర్శ… ఇంకోకోణంలో చూద్దాం… […]
‘‘ముందస్తు ముఖ్యమంత్రులు’’ చదవాల్సిన పాత ఎన్టీయార్ కథనం..!!
అటు జగన్… ఇటు కేసీయార్… ఇద్దరూ ముందస్తుకు సై అంటున్నారు… పోనీ, అంటున్నారని అందరూ అంటున్నారు… అడ్డగోలు పాలన వైఫల్యాలతో రోజురోజుకూ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్లి, రెన్యువల్ అయిపోదామని అనుకుంటున్నాడు… కేసీయార్ స్థితీ అంతకు భిన్నంగా ఏమీ లేదు… కాస్త బెటర్… జనరల్ ఎలక్షన్స్‌తోపాటే స్టేట్ ఎలక్షన్స్ వస్తే… బీజేపీ మోడీ ప్రభావం పడుతుందని కేసీయార్ సరిగ్గా అంచనా వేశాడు… గత ఎన్నికల ముందు బీజేపీతో, మోడీతో బాగానే ఉండేవాడు కదా… […]
సంచలన రికార్డు… 95 % మార్కులతో నంబర్ వన్ ర్యాంకర్ జగన్…
సాక్షి మొదటి పేజీలో శ్రీచైతన్య గ్రూపు విద్యాసంస్థలు ఇచ్చిన వాణిజ్య ప్రకటన ఇంట్రస్టింగు… వేల కోట్ల విద్యావ్యాపారంలో భాగంగా ఈ గ్రూపు ఏటా కోట్లకుకోట్ల మీడియా యాడ్స్ జారీ చేస్తుంటుంది… ఆ బిస్కెట్ల కోసమే ఏ మీడియా కూడా వాళ్ల జోలికి పోదు… ఉభయతారకం… అదొక టెక్నిక్… ఆ టెక్నిక్కులు నారాయణ గ్రూపుకూ తెలుసు, శ్రీచైతన్యకూ తెలుసు… కానీ నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు… తనతోపాటు తన వియ్యంకుడు కూడా జగన్ ప్రబల ప్రత్యర్థి తెలుగుదేశంలో ఉన్నారు… […]