Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ ఫ్లాప్ దిశగా బిగ్‌బాస్… అట్టహాసాలు ఫలించక మళ్లీ పూర్ రేటింగ్స్…

October 18, 2024 by M S R

hariteja

8 మంది పాతవాళ్లు హౌజులో ఉంటే మరో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజులోకి జొప్పించారు కదా… వాళ్లూ పాత కాపులే… ఈ ఎంట్రీలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు… మూడూమూడున్నర గంటల ఎపిసోడ్.,. ఐతేనేం..? రేటింగుల్లో తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు రేటింగులలోపే… శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదులోపు… మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు… దసరా స్పెషల్ కూడా హంగామా చేశారు మొన్న… […]

హరికథల హరితేజను భలే బుక్ చేశాడు అవినాష్… సైకో పృథ్వికీ షాక్…

October 15, 2024 by M S R

bb8

ఏవో పాత సీజన్లలో హరికథలు చెప్పి పాపులర్ కావచ్చుగాక… కానీ ఇప్పుడు మెంటల్ కేసుల నడుమ కట్ థ్రోట్ పోటీ… ఏ కథలూ చెల్లవు… హరితేజకు అది అర్థం కాలేదు… అడ్డంగా బుక్కయిపోయింది… అఫ్‌కోర్స్, జనం వోట్లేస్తారేమో, హౌజులో కొనసాగుతుందేమో గానీ… భలే షాక్ ఇచ్చాడు అవినాష్… అసలు డిసైడింగ్ హ్యాట్ తను చేజిక్కించుకోలేదు… ఎవరో అందుకుని, ఆమెకు ఇస్తే… ఏవో పిచ్చి కారణాలతో నిర్ణయాలు తీసుకుంది… ఫలితం వెంటనే అనుభవించింది… గతంలో గంగవ్వ, అవినాష్ కలిసి […]

పృథ్వి, నయని పావని… బిగ్‌బాస్‌లో మరో రెండు మెంటల్ కేసులు…

October 15, 2024 by M S R

prerana

ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక చెత్త… వైజాగ్, ఎర్రగడ్డ కేసుల్ని పట్టుకొచ్చారు, లెంపలేసుకుని, ఇక తప్పనిసరై పాత బిగ్‌బాస్ సీజన్ల పాత కాపుల్ని కొందర్ని పట్టుకొచ్చాడు… చివరకు అందులోనూ గౌతమ్ వంటి మెంటల్ కేసులే… ప్రత్యేకించి మణికంఠ గురించి చెప్పనక్కర్లేదు కదా… మెంటల్ కేసులు అనే మాట కొందరికి నచ్చలేదు… అలాంటోళ్లు నిన్న పృథ్వి ధోరణి చూడాలి… పెద్ద మెంటల్ కేసు… తోడుగా మరో సైకిక్ నయని పావని… భలే కలిశార్రా మీరంతా… నిజానికి శేఖర్ బాషా, ఆకుల […]

రేయ్… ఎవుర్రా మీరంతా… యాణ్నుంచి వచ్చార్రా… వైజాగ్ కేసులేనా..?!

October 14, 2024 by M S R

bb8

వాడు… పేరు నాగమణికంఠ… గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ అనే పిచ్చోడిలాగే ఇతనూ… మెంటల్ కేసే… డౌట్ లేదు… బిగ్‌బాస్ గెలిస్తే వదిలేసి పోయిన పెళ్లాంబిడ్డ తిరిగి తన దగ్గరకు వస్తారనే ఓ పిచ్చి భ్రమ… హౌజులో కనిపించే ఆడవాళ్లందరినీ వెనుక నుంచి, ముందు నుంచీ హగ్ చేసుకుని శాటిస్‌ఫై అయిపోయే ఓ తిక్క కేరక్టర్… బిగ్‌బాస్ టీం కూడా అలాంటిదే కదా… వాళ్లకు ఇలాంటి ఎర్రగడ్డ కేరక్టర్లంటే మహామోజు… వాడికి ఇప్పుడు (వాడు అనడగానికి ఏమాత్రం […]

అవినాష్, రోహిణిలతో బిగ్‌బాస్ హౌజులో పెరిగిన ఫన్… కొత్త జోష్…

October 14, 2024 by M S R

bb8

సాయంత్రం ఏడు గంటలకే మొదలుపెట్టి… ఓ మారథాన్ ఇన్నింగ్స్‌లాగా గంటల తరబడీ దసరా స్పెషల్ బిగ్‌బాస్ వీకెండ్ నడిపారు నిన్న… ఏదో పూలచొక్కా ప్లస్ లుంగీ కమ్ ధోతి కట్టుకుని వచ్చాడు సోగ్గాడు నాగార్జున… రావడం గ్రూపు డాన్సర్లతో… ఫుల్లు ఖర్చు, మసాలాలు దట్టించి… ఫన్ ప్రధానంగా ఈ ఎపిసోడ్ నడపటానికి ట్రై చేశారు నిర్వాహకులు… కానీ కొత్తదనం లేదు, ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు, షో రక్తికట్టలేదు… ఎవరిదో (అమృత..?) దాండియా అన్నాడు… మళ్లీ మళ్లీ దాన్ని […]

సీపీఐ నారాయణా… బిగ్‌బాస్‌ను అలా వదిలేశావేం..? చూడవు, స్పందించవు…!!

October 12, 2024 by M S R

bb8

అసలు నాగమణికంఠ అనే వెధవ… సారీ, మెంటల్ గాడిని బిగ్‌బాస్‌కు ఎంపిక చేయడమే తప్పు,.. సరే, బిగ్‌బాస్ ఈ సీజన్ ఎంపికలో ఉన్న దరిద్రాల్లో వాడొకడు… వాడు అనడానికి సందేహించడం లేదు… పక్కా ఎర్రగడ్డ కేసు వాడు… వదిలేసిన పెళ్లాం మళ్లీ తన దగ్గరకు రావాలంటే తను బిగ్‌బాస్ గెలవాలట… గెలిస్తే పెళ్లాం, బిడ్డ వచ్చి వాడిని హత్తుకుపోతారట… రేయ్, ఎవడ్రా నువ్వు..? వాడితో ఏం గోక్కుంటే ఏం బాధో తెలియక అందరూ దూరదూరంగా, జాగ్రత్తగా మసలుతుంటారు… […]

ఎర్రగడ్డ హాస్పిటల్‌కు వైజాగ్ నుంచి కొందరిని రప్పించినట్టుగా ఉంది..!!

October 10, 2024 by M S R

bb8

అసలే ఎర్రగడ్డ హాస్పిటల్… అదనంగా వైజాగ్ హాస్పిటల్ నుంచి కొందరిని పట్టుకొచ్చినట్టుగా మారింది బిగ్‌బాస్ హౌజ్ సిట్యుయేషన్… పాత వాళ్లు ఆటను రక్తికట్టించలేకపోతున్నారు అనుకుని మునుపటి సీజన్ల బాపతు సీనియర్లను తీసుకొచ్చి హౌజు నింపితే… పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా… ఇంకాస్త విసిగిస్తున్నారు… టేస్టీ తేజ నయని పావనిని ఉద్దేశించి… బయట అందరూ బండబూతులు తిడుతున్నారని ఏదో అన్నాడు… దాంతో ఆమె వెక్కి వెక్కి ఏడిచింది… ఏడాది ట్రామా అనుభవించానంటూ ఏదో చెప్పింది కానీ సరిగ్గా అర్థం […]

అంతటి అనుబాంధవి రష్మి కాల్ చేసి అడిగాక… సుడిగాలి సుధీర్ కాదంటాడా..?

October 8, 2024 by M S R

sudheer

అడ్డదిడ్డంగా సాగే అనేకానేక తెలుగు టీవీ రియాలిటీ షోలలోని స్కిట్లలో ఇదొక చిన్న పార్ట్… అంతకుమించి దీనికి ఏ ప్రాధాన్యమూ లేదు… కానీ కాస్త భిన్నంగా ఆలోచించి చూస్తే మటుకు… ఓ సన్నని పాజిటివ్ తెమ్మెర చెంపల్ని తాకి పెదాలపైకి ఓ చిరునవ్వును మొలిపిస్తుంది… ఈటీవీ… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో తాలూకు ప్రోమో… దసరా స్పెషల్… ఏవేవో ఎపిసోడ్ల నడుమ ఓ చిన్న ప్రాంక్ కాల్స్ ఎపిసోడ్… తమకు సన్నిహితులకు ఫోన్ చేసి అర్జెంటుగా […]

గంగవ్వ ఈ హౌజ్ ప్రస్తుత ట్రెండ్‌లో ఫిట్ కాగలదా..? రీఎంట్రీ కారణమేమిటో..!!

October 7, 2024 by M S R

bb8

రీ లోడ్ అనీ… సీజన్ 8 2.0 అనీ… లిమిట్ లెస్ ఫన్ అనీ… ఎన్నిరకాల ఊదరగొట్టినా సరే బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెద్ద జోష్ క్రియేట్ చేయలేకపోయాయి… ఒకవైపు నైనిక ఎలిమినేషన్, సాగనంపే కార్యక్రమం, వరుసగా కొత్త ఎంట్రీలు… వాళ్ల ఏవీలు, డాన్సులు… మరోవైపు సినిమా ప్రమోషన్లు… అంతా గందరగోళంగా సాగిపోయింది… ఇదుగో ఇది చమక్కుమనిపించింది అని ఒక్క సీన్ కూడా లేదు… వచ్చేవారం టీఆర్పీల జాబితాలో చూడాలిక ఏమేరకు ఇది ప్రేక్షకుల్ని కనెక్టయిందో… […]

వాడిని నమ్మి సోనియా వెళ్లడమే తప్పు… బయటికొచ్చాక ఏం మొత్తుకున్నా వేస్ట్..!

October 5, 2024 by M S R

soniya

సోనియా చేసిన తప్పు ఏమిటంటే..? బిగ్‌బాస్ ఆడే గేమ్ ఫెయిర్‌గా ఉంటుందని భ్రమపడటం..! అది టీఆర్పీలు, రెవిన్యూ కోసం సాగే వికృత క్రీడ… వాడే గొడవలు క్రియేట్ చేస్తాడు, జనాభిప్రాయంతో లింకేమీ ఉండదు, ఎవరిని చెడుగా ప్రొజెక్ట్ చేయాలో చేస్తాడు, ఫలానా వాళ్లతో లవ్ ట్రాక్ నడపాలని ఆదేశిస్తాడు… ఎవరిని నెత్తిన మోయాలో మోస్తాడు… అన్నీ ముందస్తు ఒప్పందాలు, పక్కా స్క్రిప్టెడ్ షో… ఈసారి టవ్ ట్రాకులు, బూతులతో షోను పెంట పెంట చేయాలని ఫిక్సయ్యారు… అందుకే […]

పాపులర్ ఎర్రగడ్డ..! తరువాత వైజాగ్…! వాటికన్నా పెద్దది బిగ్‌బాస్ హౌజు..!!

October 4, 2024 by M S R

bb8

మొదట హరితేజ… హరికథ చెప్పి అబ్సూస్ చేసింది… టాప్ ఫైవ్‌లోకి వెళ్లిపోయింది… కానీ సహజంగానే బిగ్‌బాసుడికి మేల్ వివక్ష కదా… యాంటీ నాచ్… యాంటీ ఫెమినిస్ట్… యాంటీ ఫిమేల్… యాంటీ ఎట్సెట్రా కదా… హరితేజను కూడా ఫైవ్ నుంచే ఇక నువ్వు వెళ్లిపో అని తరిమేశాడు… గత సీజన్‌లో కావచ్చు, అవినాష్ ఏదో కామెడీగా జ్యోతిష్కం చెప్పే ఏదో పిచ్చి ప్రయత్నం చేశాడు గానీ… అస్సలు రక్తికట్టలేదు… అఫ్‌కోర్స్, మళ్లీ వస్తున్నాడు… నేను గొప్ప పర్‌ఫార్మర్‌ను అనే […]

గ్రామర్ పరీక్షా..? ఆటగాడి స్పీడ్‌కు పరీక్షా..? బిగ్‌బాస్ నువ్వేమంటావు..?

October 4, 2024 by M S R

bb8

Iam mega chief… I am mega chief… వీటిల్లో ఏది కరెక్టు… ఇంగ్లిషు తెలిసినవాళ్లకు I am mega chief అనే వాక్యమే కరెక్టు అని తెలుస్తుంది… I లెటర్ తరువాత am ఉంటుంది… కానీ ఇంగ్లిషు మీద గ్రిప్ లేనివాళ్లకు రెండూ ఒకలాగే అనిపిస్తాయి… ఎలా రాసినా సరే, అర్థమేమీ మారదు, భిన్నమైన అర్థం కూడా రాదు… I కేపిటల్ లెటర్… అలాగే చాలామంది chief పదం స్పెల్లింగు కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు, cheif […]

మళ్లీ హౌజులోకి గంగవ్వ..? రాబోయే ఎనిమిది మందీ డిఫరెంట్ కేరక్టర్లే..!!

October 2, 2024 by M S R

ప్చ్… లిమిట్ లెస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అన్నారు కదా ఈసారి బిగ్‌బాస్ సీజన్.,. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనీ మొన్న చెప్పాడు కదా నాగార్జున… ఇప్పుడున్న పది మందిలో ఒక మిడ్ వీక్, ఒక వీకెండ్ వెళ్లిపోతే మిగిలేది 8 మంది… వాళ్లూ హోప్ లెసే, ఒకరిద్దరు మినహా… మరెలా..? కొత్త వాళ్ల ఎంపికలో ఫెయిల్… దొరికిందే 14 మంది… వాళ్లను ఏడు జంటలుగా… సరే, దోస్తులుగా బడ్డీలు పేరిట ప్రవేశపెట్టాడు… నెల రోజులైంది… రేటింగ్స పరంగా షో […]

మొత్తం ఖాళీ చేసి… డజను మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపించు బిగ్‌బాస్…

October 2, 2024 by M S R

bb8

సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్… అంటే ఇమడగలవాడే నిలబడతాడు… బతుకుతాడు అని కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పేది… ఈసారి బిగ్‌బాస్‌లో ఈ కాన్సెప్టు తీసుకుని, దాని చుట్టే ఆటను నడిపిస్తున్నారు… అంటే హౌజులో ఉండాలంటే ఆడాలి, రంజింపచేయాలి, ఆట రక్తికట్టించాలి… లేకపోతే..? మిమ్మల్ని తరిమేసి, కొత్తవాళ్లను వైల్డ్ కార్డు ఎంట్రీలుగా తీసుకొస్తాను అంటున్నాడు… 12 మంది రెడీ… అడ్డుకొండి చేతనైతే… మీరు గేమ్స్ గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య ఆమేరకు తగ్గిస్తాను అనేది ఛాలెంజ్… […]

చీర చిరిగిపోద్ది…! ఒరేయ్, యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..? వెగటు సంగీతం..!!

September 30, 2024 by M S R

sarigamapa

థంబ్ నెయిల్స్ మాయలో పడి చెప్పడం లేదు… నిజంగానే షాక్ తిన్నట్టయింది… బాహుబలి వంటి హైబడ్జెట్ చిత్రాల్లో కూడా పాడుతున్న కీరవాణి శిష్యరత్నం, కాస్త పద్దతిగా కనిపించే రమ్య బెహరా నోటి వెంట ఆ డైలాగ్ వినడం నిజంగా షాకే… అదీ ఓ మ్యూజిక్ కంపిటీషన్ రియాలిటీ షోలో… జీతెలుగులో ఆల్రెడీ సీరియళ్లను భ్రష్టుపట్టించారు తెలిసిందే కదా… మాటీవీకి పోటీ ఇవ్వలేక ఎదురీదుతోంది… ఆ ఈటీవీ దరిద్రపు ప్లానింగ్ పుణ్యమాని వేరే దిక్కులేక జనం మాటీవీతో పాటు […]

సోనియా వెళ్లిపోయింది… హుందాగా… జస్ట్, నాగ్‌ మొహాన ఓ నమస్కారం పడేసి…

September 29, 2024 by M S R

akula

ఆమె బిగ్‌బాస్ షోకు రావడమే తప్పు… మనం రెండు వారాల ముందే చెప్పుకున్నాం… అన్నట్టుగానే అక్కడ ఉండలేకపోయింది… ఆమె ఆ షో కల్చర్‌కు సూట్ కాదు… అందుకే ఎలిమినేట్ అయిపోయింది… ఆమెకు ఆ షోలో ఏ స్ట్రాటజీతో ఆడాలో కూడా తెలియదు… ఆమె సోషల్ మీడియా టీం కూడా హుందాగా ఓ పద్ధతిలో వోట్లు అడిగిందే తప్ప ఎక్కడా గీత దాటలేదు… మెచ్యూర్డ్… కరాటే తెలుసు, కలరి తెలుసు, లా గ్రాడ్యుయేట్, ఎన్జీవోతో ప్రొ కన్సర్న్ యాక్టివిటీ… […]

భోళాశంకర్ మళ్లీ డిజాస్టర్… బిగ్‌బాసూ అదే బాటలో… ఫాఫం తెలుగు టీవీలు…

September 26, 2024 by M S R

trinayani

ఎంతసేపూ రొటీన్ ఫార్ములా కథలు… అవే ఫైట్లు, అవే స్టెప్పులు, ఇదే ఇమేజ్ బిల్డప్పులు… జనం ఇష్టపడటం లేదు బాసూ, కాస్త మారాలి, లేకపోతే కష్టం అని చెప్పినా సరే చిరంజీవి వినడు… నాకు ఆ పాత్రలే సూటవుతాయి, అవే చేస్తాను అంటాడు… వైవిధ్యమైన కథలు, పాత్రలతో తన ఇమేజీని సుసంపన్నం చేసుకునే ఒక్క ఆలోచన కూడా ఉండదు… జనం ఆ ధోరణిని ఏమాత్రం ఇష్టపడటం లేదని భోళాశంకర్ సినిమా డిజాస్టర్ నిరూపించింది… అవును కదా, అదొక […]

అబ్బఛా… ఎస్పీ బాలు మరీ 3 వేలకు కూడా పాట పాడాడా..? ఏ కాలంలో స్వామీ..?!

September 25, 2024 by M S R

sarigamapa

దాదాపు గంటన్నర సేపు కావచ్చు… సుదీర్ఘమైన ప్రెస్‌మీట్… ఒక టీవీ ఒక రియాలిటీ షో స్టార్ట్ చేసేముందు ఇలా ప్రెస్‌మీట్ ఆర్గనైజ్ చేయడం విశేషం కాగా, అంతసేపు ఆసక్తికరమైన క్వశ్చన్లతో మీడియా కూడా ఎంటర్‌టెయిన్ చేయడం మరో అదనపు విశేషం…  అదే జీతెలుగులో త్వరలో స్టార్ట్ చేస్తున్న జీసరిగమప ప్రోగ్రామో… అదేనండీ, సినిమా పాటల పోటీ… (ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ థర్డ్ సీజన్ చెడగొట్టడంతో ఇక అందరు సినిమా పాటల అభిమానుల దృష్టీ జీతెలుగు సరిగమప […]

ఆ ముగ్గురూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేశారు… ఇక ఎర్రగడ్డ సీజన్‌కు మరో కుదుపు…

September 21, 2024 by M S R

అభయ్… సిద్దిపేట పరువు తీసినవు కదరా భయ్… దిక్కుమాలిన ఆట ఆడినవ్, బిగ్‌బాస్‌ ను బొక్కా, మైండ్‌లెస్ అని బూతులు తిడుతవ్… నీ టీం వాళ్లు తన్నుకుంటుంటే నవ్వుకుంటూ పక్కన కూర్చుంటవ్… ఇప్పుడంటే ఇప్పుడు బయటికి పోతా అని డొల్ల సవాళ్లు విసురుతవ్… మళ్లీ ఇవన్నీ జోకులు, నచ్చకపోెతే మానేస్తా అని తిక్క కబుర్లు చెబుతవ్… తీరా నాగార్జున వచ్చి రెడ్ కార్డు చూపించి వెళ్లిపో అంటే ఎడ్డిమొహం వేస్తవ్… తలదించుకుంటవ్… బాబ్బాబు, ఇంకో చాన్స్ ఇవ్వు […]

అభిజ్ఞ..! ఇక్కడ జడ్జిలు ‘ముంచేస్తేనేం’..? ఆ జీ పాటల పోటీలో తేలింది..!!

September 21, 2024 by M S R

abhigna

అభిజ్ఞ… ఈ పేరు గుర్తుందా..? ఆమధ్య తెలుగు ఇండియన్ ఐడల్‌ ఆడిషన్స్ కోసం వచ్చింది… రిజెక్టయింది… మళ్లీ ఏ పైరవీతోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది… అహం దెబ్బతిన్న థమన్ రెండువారాలకే మళ్లీ ఇంటికి పంపించేశాడు… అందుకే ఇక తదుపరి సీజన్‌కు తను జడ్జిగా ఉండకపోవచ్చు… ఈ ఫినాలేకు కూడా చీఫ్ గెస్టు లేడు, ఏదో ముగించాం అంటే ముగించాం అన్నట్టుగా ముగించేశారు… అదే అభిజ్ఞ ఇప్పుడు జీసరిగమప కొత్త సీజన్‌లో పాటపాడుతూ కనిపించింది… 29 నుంచి […]

  • « Previous Page
  • 1
  • …
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • …
  • 20
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions