ఈటీవీ ఎందుకు మూడో స్థానంలో కొట్టుకుంటోంది… అసలు రెండో స్థానంలో ఉన్న జీతెలుగు ప్రోగ్రామ్సే పెద్ద నాసిరకం… ఐనాసరే, ఈటీవీ రోజురోజుకూ చివరకు జీతెలుగుతో కూడా ఎందుకు పోటీపడలేకపోతోంది… ఏవేవో రియాలిటీ షోలు చేస్తుంటారు… ఆ బూతు జబర్దస్త్ ఉండనే ఉంది, చివరకు ఈటీవీ న్యూస్‌ను కూడా వినోదాల జాబితాలో కలిపేశారు… ఐనా ఆ వెలితి ఎందుకు..? ఆలోచించగా, చించగా వాళ్లకు బోధపడింది ఏమిటంటే..? మన సీరియళ్లను ప్రేక్షకులు ఇష్టపడరు, దేకరు… అందుకే ఈ దురవస్థ అనేది […]
స్లాట్లు పంచుకుందాం… రేటింగులు కుమ్ముకుందాం… టీవీ చానెళ్ల ఉగాది ప్లాన్…
రేపు ఉగాది… పైసలున్న మారాజులు మూడార్లు సినిమాకు పోతారు… మరి మధ్యతరగతి..? ఇంకేముంది..? టీవీలే దిక్కు… దిక్కుమాలిన తెలుగు చానెళ్లే దిక్కు… ఏ వినోదమూ లేకపోతే దిక్కుతోచదు కదా… చానెళ్లు ఏవో పండుగ ప్రత్యేక షోలను ప్రసారం చేస్తాయి కదా… సరిపోదా ఏం..? పెద్ద సినిమాలు తమ రిలీజు డేట్ల నడుమ గ్యాప్ ప్లాన్ చేసుకుని, ఒకరికొకరు పోటీ రాకుండా డబ్బు దండుకుంటారుగా… జనానికి వేరే దిక్కులేకుండా..! సేమ్, టీవీ చానెళ్లు కూడా అంతే… మనలోమనం పోటీ […]
‘‘లక్కీగా సెంట్రల్ లాక్ పడలేదు… డోర్స్ ఓపెనయ్యాయి… బతికిపోయాను…’’
‘‘నేను అప్పుడు రాధిక వాళ్లదే ఓ తమిళ సీరియల్లో చేస్తున్నాను… అమ్మవారి గెటప్… కుట్రాలంలో షూటింగ్, అది ఫినిష్ చేసుకుని, టాటా సఫారీలో బెంగుళూరు వెళ్తున్నాం… మధ్యలో మీనాక్షి హోటలో, మరొకటో ఆపుకుని లంచ్ చేశాం… ఆ టైమ్‌లో నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి ప్రయత్నించాను… కానీ డ్రైవర్ లాక్ చేసుకుని ఎక్కడికో వెళ్లాడు… ఎవరైనా కారు లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అరుస్తుంది కదా… అప్పట్లో అదొక అలర్ట్ సిస్టం ఉండేది… అది కుయ్ […]
సమంతలాగే రష్మి ఓ స్వేచ్చావిహంగం… ఐనా సరే, ఎందుకు ఏడుస్తున్నట్టు..?!
ఏమో… అప్పుడప్పుడూ ఈ టీవీ ప్రోగ్రాముల ప్రోమోలు చూస్తే ఎక్కడి నుంచో ఒక్కసారిగా చివ్వెర పుట్టుకొస్తది… అంటే చిరాకు, చికాకు, కోపం గట్రా కలిసిన ఫీలింగ్ అన్నమాట… అబ్బే, 30 సెకండ్ల ప్రోమోకు 40 సెకండ్ల రెండు ప్రోమోలు రుద్దుతున్నందుకు కాదు… యూట్యూబయినా అంతే, ఫేస్బుక్ వీడియో అయినా అంతే… ఇప్పుడు రెండేసి యాడ్స్ కంపల్సరీ.., నడుమ నడుమ కూడా వాయిస్తున్నారు… వాటికన్నా టీవీ సీరియళ్ల బాపతు పదేసి నిమిషాల వాయింపు నథింగ్… టీవీ అంటే యాదికొచ్చింది… […]
ఇంద్రజ, నందిత, ప్రియమణి, లైలా, ఆమని… ఎవరు జబర్దస్త్‌కు ఆప్ట్..?!
జబర్దస్త్ షో ప్రోమో ఒకటి హల్చల్ చేస్తోంది… అందులో రోజా ఓ జడ్జెస్ ట్రెయినింగ్ సెంటర్ ఓపెన్ చేసి, ఆమనికి, లైలాకు కోచింగ్ ఇస్తుంది… చిట్కాలు చెబుతుంది… ఇంకేముంది..? ఒకటే చర్చ… ఇంకేముంది..? రోజా మంత్రి కాబోతోంది… సో, జడ్జిగా చేయడం కష్టం, అందుకని కొత్త జడ్జిలను తీసుకొస్తున్నారు… ఇదే ఇండికేషన్, అయితే ఆమని లేదా లైలా ఫిక్స్ అంటూ కథలు అర్జెంటుగా అల్లేశారు… నిజమేనా..? నిజానికి అది ఆ షోలో చిన్న స్కిట్… లైలా ఓ […]
టీవీ డిబేట్లా..? అబ్బే, రేటింగుల్లేవ్… ఎవడూ దేకడు… తెరపై వేస్ట్ తన్నులాట…
మొన్నొకాయనకు కోఫమొచ్చింది… అసలు జబర్దస్త్ లేకుండా ఈటీవీ లేదు, మీరేమో అది రోజురోజుకూ నాసిరకం అయిపోతోంది, ఎవడూ దేకడం లేదు అంటున్నారు… ప్రూఫ్ ఏమిటి అన్నాడు… ప్రూఫ్ ఏమి ఉంటుంది… బార్క్ వాడు ఇచ్చే రేటింగ్సే… ఆ రేటింగ్స్ కూడా ఓ దందాయే, కానీ పరిశీలనకు ఏదో ఓ ప్రామాణికం కావాలి కదా… గతవారం రేటింగ్స్ తీసుకుంటే జబర్దస్త్ 5.47కు, ఎక్సట్రా జబర్దస్త్ 5.52కు పడిపోయింది… ఏవో స్పెషల్ స్కిట్స్ అనీ, కొత్తకొత్తవాళ్లను తీసుకొచ్చి నానా కథలూ […]
ఫాఫం సుడిగాలి సుధీర్..! చివరకు జబర్దస్త్ షోలో కూడా అవమానించాలా..?!
#sudigalisudheer… తన మీద ఎంతమంది ఎన్నిరకాల పంచులు వేసినా సరే, దులుపుకుని, తుడుచుకుని, నవ్వుతూ లైట్ తీసుకుంటాడు… దాంతో మరీ అందరికీ అలుసైపోయినట్టున్నాడు… అనగా చీపైపోయినట్టున్నాడు… పైగా ఇన్నేళ్లు ఈటీవీ కోసం, మల్లెమాల కంపెనీ కోసం గాడిద చాకిరీ చేశాడు కదా… ఒక్క ప్రోగ్రాం కోసం మాటీవీకి వెళ్లొస్తే మరీ అంత ఘోరంగా వెకిలి చేయాలా..? పైగా ఇక్కడ పొగబెడుతూ, అవమానిస్తుంటేనే కదా తను పక్క టీవీ స్టూడియోకు వెళ్తున్నది..? ఐనా వెటకారం చేయించాలా మల్లెమాల కంపెనీ..? […]
శ్రీముఖి, ఉదయభాను, మధుప్రియ… జానపదంతో దుమ్మురేపే కొత్త షోలు…
మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… బుల్లితెర చానెళ్లు, ఓటీటీలు అకస్మాత్తుగా మ్యూజిక్ షోల మీద పడ్డయ్… గాయకుల కోసం జల్లెడ పడుతున్నయ్… నిజానికి వాటికి పెద్దగా రేటింగ్స్, వ్యూస్ ఉండవ్… యాడ్స్ ఉండవ్… స్పాన్సర్లూ తక్కువే… అయితేనేం… ఇప్పుడు ట్రెండ్ మ్యూజిక్… అదీ కొత్త గొంతులు కావాలి… ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నవాళ్లతో సినిమా పాటలు పాడించే స్వరాభిషేకం టైపు షో కాదు… కొత్త గొంతుల్ని తీసుకొచ్చి, పోటీకి నిలబెట్టాలి… జీటీవీలో వచ్చే సరిగమప అదే… ప్రదీప్‌ను తీసేసి శ్రీముఖిని […]
జాతిరత్నాలు… ఈటీవీ కొత్త కామెడీ షో వెనుక ఇన్ని ఆశలున్నాయా..?!
కామెడీయే దిక్కు… సినిమాల్లో ఎంతోకొంత ఉండాల్సిందే… లేకపోతే నడవవు… టీవీల్లోనూ అంతే… కామెడీ షోల మీద పడ్డాయి అన్ని టీవీలు… ఈటీవీలో జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మాటీవీలో కామెడీ స్టార్స్… ఇవే కాదు, ప్రతి షోలోనూ కామెడీ పడాల్సిందే… ఢీ డాన్స్ షో అయినా అంతే, సరిగమప మ్యూజిక్ షో అయినా అంతే… వావ్, క్యాష్, ఆలీతో సరదాగా… చివరకు ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో అయినా అంతే… సూపర్ క్వీన్స్, ఇస్మార్ట్ […]
కార్తీకదీపం బండిని లాగాల్సింది ఇక వీళ్లిద్దరే… ఇంతకీ వీళ్లెవరో తెలుసా..?!
భయపడకండి… అస్సలు కార్తీకదీపం కథ గురించి చెప్పబోవడం లేదు… మీరు మరీ అంతగా ఠారెత్తిపోవాల్సిన అవసరమూ లేదు… కానీ 1300 ఎపిసోడ్లుగా కోట్లు కొల్లగొడుతున్న సీ-రి-య-ల్ గురించి కొన్ని వివరాలు చెప్పుకోకపోతే ఎలా..? సో, లోతుల్లోకి పోవడం లేదు… కానీ మోనిత పాత్రలోని శోభాశెట్టి, దీప పాత్రలోని ప్రేమీ విశ్వనాథ్ నిజంగానే ప్రతి తెలుగింటికీ ఆడపడుచులయ్యారు… ఆ పాత్రల కేరక్టరైజేషన్ చెత్త… కానీ ఆ ఇద్దరూ మంచి నటన కనబరిచారు… రియల్లీ… మొదట్లో బాగా నటించిన ప్రేమీ […]
కార్తీకదీపం..! వెక్కిరింపులతో ఓ రేంజులో ఆడుకుంటున్నారు నెటిజనం..!!
అప్పుడేం జరుగుతుందీ అంటే… సౌర్య ఆటోడ్రైవర్‌గా బతుకుతూ ఉంటుంది కదా… ఓసారి ఇద్దరు ముసలోళ్లు ఆటో ఎక్కడానికి వస్తారు… మొదట వాళ్లను సౌర్య గుర్తించదు… ఎప్పుడైతే వాళ్లు కార్తీక్, దీప అని గుర్తిస్తుందో అప్పుడు షాక్‌కు గురవుతుంది… బతికే ఉన్నారా అని విస్తుపోతుంది… వాళ్లేమో సౌర్యను గుర్తుపట్టరు… వాళ్లను కౌగిలించుకుని ఏడ్చేస్తుంది సౌర్య… తనెవరో చెబుతుంది… వాళ్లు షాక్… హిమను ద్వేషిస్తూ, ఇంటి నుంచి కోపంతో వచ్చానని చెబుతుంది… ‘‘మా కారు లోయలోకి దొర్లిపడింది, పడేముందు హిమను […]
ఔనా… ఈ సినిమా వచ్చిందా తెలుగులో…. ఈటీవీకి భలే దొరుకుతున్నయ్…
బార్క్ రేటింగులు చూస్తుంటే ఓచోట దృష్టి చిక్కుబడిపోయింది… ఈటీవీలో ఆరో తారీఖు, ఆదివారం సాయంత్రం ప్రైమ్‌టైంలో ఓ సినిమా ప్రీమియర్ ప్రసారం అయ్యిందట… దాని పేరు యు అండ్ ఐ… మీరు చదివింది నిజమే… ఆ సినిమా పేరే అది… ప్రేమ, శృంగారం, ఆత్మహత్య అని ఇంగ్గిషులో ట్యాగ్‌లైన్… నిజమా..? ఆ పేరుతో ఓ సినిమా వచ్చిందా అనే డౌట్ రావడం సహజం కదా… నిజంగానే 2010లో వచ్చిందట… కార్తీక్ మ్యూజిక్, అనంతశ్రీరాం గీతాలు, దేవిశ్రీప్రసాద్ ఓ […]
డియర్ శేఖర్ మాస్టర్… అబ్బే, అస్సలు నచ్చలేదు బాసూ… యాంటీ సెంటిమెంట్…
ఎవరేం తిట్టుకున్నా సరే… ఎవరెలా రిసీవ్ చేసుకున్నా సరే…. కొన్ని అంశాల్లో మరీ డిటాచ్డ్గా ఆలోచించలేం… మరీ తెలుగు ఇండస్ట్రీ మార్క్ లిబరల్లా ఆలోచించడం కుదరదు… బహుశా డాడీ, బిడ్డ బంధాన్ని అపూర్వంగా ప్రేమించే సంస్కృతిలో పెరిగినందుకు కావచ్చు… ప్రజెంట్ ట్రెండ్స్ జీర్ణం కాకపోవడం వల్ల కావచ్చు… ఇంకేమైనా కావచ్చు… ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ ఇద్దరూ అన్నాచెల్లెళ్లు… వాళ్లిద్దరి నడుమ మంచి అనురాగం ఉంది… తోడబుట్టిన చెల్లె పట్ల ఆయనకు అపారమైన సోదరప్రేమ ఉండేది… అయినా […]
టీవీ9కు ప్రేక్షకుల దెబ్బ… ఈటీవీని జనం వదిలేశారు… ఎన్టీవీకి అనుకోని చాన్స్…
నో డౌట్… పలు సందర్భాల్లో టీవీ9 వార్తల ప్రజెంటేషన్ చికాకు పుట్టిస్తోంది… పిచ్చి ప్రయోగాలు సీరియస్ వార్తలనూ కామెడీ ప్రజెంటేషన్ స్థాయికి దిగజారుస్తున్నయ్… పైగా సోషల్ మీడియాలో నెటిజన్లు కొన్ని సందర్భాల్లో ఆ న్యూస్ ప్రజెంటర్ల జ్ఞానజ్యోతులను ఆడుకుంటున్నారు… రుధిరం, పోస్కో, ఆటోస్పై, నీటి గురుత్వాకర్షణ శక్తి వంటి ఐన్‌స్టీన్ స్థాయి సగటు ప్రేక్షకుడికి జీర్ణం కావడం లేదు… వెరసి ఇదంతా ఒకప్పుడు నంబర్ వన్ స్థానాన్ని ఎంజాయ్ చేసిన టీవీ9 ఇప్పుడు సెకండ్ ప్లేసుకు దిగజారిపోయింది… […]
హిందీ చానెళ్లు మరీ అంత నాసిరకమా..? ఒక తెలుగు చానెల్ నంబర్ వన్..!!
ఉత్తర భారతమంతా హిందీ మాట్లాడతారు… దక్షిణ రాష్ట్రాల్లోనూ హిందీ చానెళ్లు చూసేవాళ్లకు కొదవ లేదు… దేశవ్యాప్త రీచ్… ఫుల్ యాడ్స్, డబ్బు, హంగామా, అట్టహాసం… మరి ఆ హిందీ వినోద చానెళ్లు రేటింగ్స్‌లో వెనకబడిపోవడం ఏమిటి..? అదీ ఆశ్చర్యం… తాజా బార్క్ రేటింగ్స్ జాబితా చూస్తే స్టార్‌మాటీవీ నంబర్ వన్ అని కనిపిస్తోంది… ఛ, నిజమా అని ఆశ్చర్యపోకండి… అసలు రియాలిటీ షోలు పెద్దగా ఉండవ్… అంటే, నాన్-ఫిక్షన్ కేటగిరీలో పూర్… ప్రైమ్ టైం సీరియళ్లు మినహా […]
ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…
మగ హీరోయిన్… యాక్షన్ హీరోయిన్… అని జనం ప్రేమగా పిలుచుకునే మాలాశ్రీని అకస్మాత్తుగా ఆలీ మళ్లీ గుర్తుచేశాడు… ఈటీవీలో తన ఆలీతో సరదాగా షోకు తీసుకొచ్చాడు… పలుసార్లు కొందరు అక్కరలేని వాళ్లను కూర్చోబెట్టి, మన మెదడు తింటుంటాడు గానీ కొన్నిసార్లు మనం మరిచిపోయిన పాత నటుల్ని హఠాత్తుగా మనముందుకు తీసుకొస్తాడు, ముచ్చట్లు పెడతాడు… పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తాడు… అది మాత్రం మెచ్చుకోబుద్దేస్తుంది… మాలాశ్రీ అనే పేరు వినగానే గుర్తొచ్చే పాట… ‘‘గజ్జె ఘల్లుమన్నదో, గుండే ఝల్లుమన్నదో…’’ […]
గెటప్ సీను..! కమెడియన్ విషాదాన్ని పండించడం కష్టం… సో, బాగా చేసినవ్..!!
ఏమాటకామాట… జబర్దస్త్ తదితర షోలలో ఈటీవీ, మల్లెమాల కంపెనీ కనబరిచే నీచాభిరుచిని కాసేపు వదిలేస్తే… శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త బెటర్… కామెడీ, ఎంటర్టెయిన్మెంట్ షో అయినా సమాజంలో రకరకాల బాధితులతో స్కిట్లు చేస్తున్నారు… దానికితోడు డాన్సులు, సాంగ్స్ ఎట్సెట్రా… స్థూలంగా షో కాస్త బెటర్… ప్రత్యేకించి వావ్, క్యాష్ ఎట్సెట్రా పిచ్చి షోలకన్నా బెటర్… ఇంద్రజ ప్రజెన్స్, సుధీర్ యాంకరింగ్ ప్లస్ పాయింట్స్ దానికి… ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే… గెటప్ సీను గురించి… తను చాలా […]
ఈటీవీలో గతితప్పిన బాడీషేమింగ్… లేడీగెటప్ అని పదే పదే వెక్కిరింపు… వర్ష ఏడుపు…
బాడీ షేమింగ్… కాదు, అదోరకం ర్యాగింగ్… ఈటీవీలో శృతిమించుతోంది… ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా… ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లు ఎవరో గానీ… వాళ్లది మరీ నీచాభిరుచి కనిపిస్తోంది… లేడీ కమెడియన్లు, లేడీ ఆర్టిస్టులు, ఎంత వెకిలి జోకులు వేసినా ఏమీ అనలేరు, సున్నితమైన కెరీర్లు… వేధింపులు… తలొంచుకుని భరించాలి… లేదంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారు… వేరే ఎక్కడా చాన్సులు రాకుండా చేస్తారు… దుష్ప్రచారాలు చేస్తారు… తాజాగా మరో ఉదాహరణ… వర్ష… టీవీల్లో కామెడీ షోలలో కమెడియన్లు అంటేనే కొందరు […]
రష్మి ఫస్ట్ టైమ్… సుధీర్ కూడా అంతే… జంప్ అయిపోయినట్టేనా జంట..?!
నిజంగానే టీవీ ప్రేక్షకులకు ఇది విశేషమే… తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మొదటిసారి ఈటీవీ గాకుండా వేరే టీవీలో కనిపించనున్నాడు… అంతేనా..? తనకు జోడీగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన రష్మి కూడా అంతే… ఇద్దరూ తొలిసారి మాటీవీ నిర్మించిన హోలీ స్పెషల్ షోలో కనిపించారు… రష్మి ఓ దశలో ఎమోషన్‌కు గురై, కంటి కాటుక తీసి, సుధీర్ బుగ్గపై చుక్క పెట్టి దిష్టి తీసింది… అఫ్కోర్స్, వాళ్ల స్నేహం సుదీర్ఘకాలంగా గాఢమైంది… అందులో […]
నెవ్వర్… కార్తీకదీపం అప్పుడే ఆరిపోలేదు… ఇప్పట్లో పోదు… కొత్తగా వాయిస్తారు…
స్ట్రెయిట్ కామెంట్… డిస్‌క్లెయిమర్… ప్రతి టీవీ సీరియల్ ఓ చెత్త… కానీ ఎక్కువ వీక్షణలు దక్కేవి టీవీ సీరియళ్లకే… కారణం :: నాసిరకం సినిమాలు, వేరే వినోదం లేకపోవడం, టీవీ సీరియల్ అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కావడం… వాటి గురించి చెబుతూ పోతే ఒడవదు, తెగదు… కానీ ఒక సీరియల్ గురించి నెట్లో ఈ రేంజ్ చర్చ జరగడం తొలిసారి… అదే కార్తీకదీపం సీరియల్ ముగింపు గురించి..! యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లయితే కథనాలు కుమ్మేస్తున్నయ్… […]
- « Previous Page
- 1
- …
- 24
- 25
- 26
- 27
- 28
- …
- 41
- Next Page »