Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుడిగాలి సుధీర్… పక్కకు పెట్టేయడం కాదు.., చెబుతున్న సాకులే ఇన్సల్టింగు..!!

January 4, 2021 by M S R

Sudigali-Sudheer-3

తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ ఎవరు..? చెప్పడానికి వేరే ఆప్షనే లేదు…! సుడిగాలి సుధీర్..!! కాస్త సమీపంలో ప్రదీప్ కనిపిస్తాడు కానీ… ప్రదీప్ బేసిక్‌గా యాంకర్… కామెడీ టైమింగు, సున్నితంగా డీల్ చేయడం గట్రా బాగుంటుంది, కానీ అంతకుమించి పోలేడు… కానీ సుధీర్… రియల్ పర్‌ఫార్మర్..! యాంకరింగు, డాన్సులు, కామెడీ, మ్యాజిక్, సింగింగ్, స్టంట్స్… వాట్ నాట్… ఏదంటే అది చేయగలడు… తెలుగు టీవీకి రజినీకాంత్ తను…! మరి అలాంటి వాడిని ఈటీవీ ఎందుకు దూరం పెట్టింది…? […]

ఓంకార్ క్లిక్కయితే మాటీవీ సేఫ్… సుమ, రవి ఫెయిలైతే జీవాడి మొహం పగిలిపోవడమే…

January 3, 2021 by M S R

staarmaa

సంక్రాంతి రాకముందే దాని పేరిట టీవీలో ఓ స్పెషల్ షో చూసేయాలా…? చూసేయాల్సిందే… డబ్బులు ఇచ్చేవాడు ఎప్పుడు ప్రసారం చేయమని అడిగితే అప్పుడు వర్జ్యం, వారం ఏమీ చూడకుండా వేసేయాల్సిందే… మొన్నటి ఆదివారం వేళాపాళా లేకుండానే ‘పార్టీకి వేళాయెరా’ అని జీవాడు న్యూఇయర్ షో వేసేశాడు కదా… ఇప్పుడూ అంతే… సంక్రాంతి ఎప్పుడైనా రానీ… ఓ షో వేసేద్దాం అంటున్నాడు… వాడి అవసరం అది… ఇవేవీ చేయకపోతే వాడి నంబర్ వన్ స్థానం కాస్తా గల్లంతయ్యే ప్రమాదం […]

ఫాఫం శ్రీముఖి..! జబర్దస్త్‌ వీడినవాళ్ల గతేంటి..? రోజాయే గెలిచిందా..?

January 2, 2021 by M S R

adirindi

బిగ్‌బాస్ మస్తు పైసలు ఇచ్చింది శ్రీముఖికి..! కానీ కెరీర్‌కు ఊపునివ్వలేదు… ప్రస్తుతం ఖాళీ… దిక్కులు చూడటమే…! నిజానికి అప్పట్లో మస్తు జోకులు పడేవి… ఏమనీ అంటే..? యాంకర్ పళ్లికిలిస్తేనే షో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాడేమో నాగబాబు… అందుకే అదిరింది నవ్వుల షోకు ముందుగా సమీరను తీసుకున్నాడు… షో క్లిక్ కావడం లేదని ఆమెను మధ్యలోనే తరిమేశాడు… భానుశ్రీని, రవిని తీసుకొచ్చాడు… వాళ్లనూ వెళ్లగొట్టేశాడు… అసలు షోలో దమ్ముండాలి మాస్టారూ అంటే వినడు… ఈయన్ని అనవసరంగా ఈటీవీ నుంచి […]

రామోజీ సారూ… ఈటీవీని కూడా గాలికి వదిలేశారా..? ఏమిటిలా…!!

January 1, 2021 by M S R

barc

ఈనాడు పత్రికను గాలికి వదిలేసినట్టే… ఈటీవీని కూడా వదిలేశాడా రామోజీరావు…! ఈ మాట పరుషంగా ఉన్నాసరే, అంకెలు అబద్ధం ఆడవు… తను దీటుగా గేమ్ ఆడుతున్న ఫీల్డులో కూడా ఆటను వదిలేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది… ఆయన తప్పు ఎక్కడయ్యా అంటే…? సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించకపోవడం..!  ఈటీవీ పేరిట చాలా చానెళ్లున్నయ్… ఈటీవీ, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్… ఇంకేమైనా ఉన్నాయో తెలియదు… ఇందులో నడిచేది […]

ఈటీవీ సూపర్ హిట్… కొత్త సంవత్సరం ఈవెంట్… మిగతా టీవీలు చేతులెత్తేశాయి…

December 31, 2020 by M S R

new year

కొత్త సంవత్సరం… బయట పార్టీలంటూ తిరిగే సీన్ ఎలాగూ లేదు… మన సర్కారు వారు అర్ధరాత్రి దాకా మందు షాపులు ఓపెన్ చేస్తామన్నారు కదాని, ఎటెటో తిరిగి, ఏదేదో తాగి, రోడ్ల మీద పడితే, పోలీసులు టెర్రరిస్టులంటూ ఇరగదీశారు… సో, ఇంట్లో అందరికీ టీవీలే దిక్కు… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కదా మరి… కానీ మన తెలుగు టీవీలు ఏం చేశాయి..? స్ట్రెయిట్ గా చెప్పాలంటే నాలుగు టీవీల్లో ఈటీవి మాత్రమే హిట్… మిగతా వాటిల్లో […]

తుస్… నాగార్జున అట్టర్ ఫ్లాప్… మాటీవీ సూపర్ ఫ్లాప్… బిగ్‌బాస్ సుప్రీం ఫ్లాప్…

December 31, 2020 by M S R

biggboss

బిగ్‌బాస్ నాలుగో సీజన్…. రేటింగ్స్ మాయలో గండరగండడు అనిపించుకున్న ది గ్రేట్ మాటీవీ సైతం చేతులెత్తేసింది… తుస్… తుస్సున్నర… అరె, అన్ని వెబ్‌సైట్లు ఆహా ఓహో… మస్తు రేటింగ్స్, 19.5 రేటింగ్స్ వచ్చాయి, దుమ్మురేపింది, నాగార్జునా సాహో, నీకు తిరుగులేదు, మాటీవీ రేటింగ్స్ మాయామర్మానికి రందిలేదు అని చెబుతున్నవేళ ‘ముచ్చట’ ఏమిటి, తుస్సుమని చెప్పడం ఏమిటి అంటారా..? ఆధారాలతో చెబుతాం… బిగ్‌బాస్ నాలుగో సీజన్ అట్టర్ ఫ్లాప్… ఎలా అంటే..? చూశారు కదా… ఇదీ బార్క్ తాజా […]

బిగ్‌బాస్..? బిగ్‌లాస్..? జెర కొన్నాళ్లు ఆగండి బాస్… కాలం చెబుతుంది…

December 31, 2020 by M S R

bigboss-

బిగ్‌బాస్ పుణ్యమాని గంగవ్వకు ఇల్లొచ్చింది… బంగారం కొన్నది… సొహెల్‌కు మస్తు పైసలొచ్చినయ్… అభిజిత్‌కు పైసలతోపాటు కప్పొచ్చింది… అవినాష్, సొహెల్, మెహబూబ్, దివి, మోనాల్, అభిజిత్, అరియానా, అఖిల్… మస్తు సినిమా అవకాశాలు వస్తున్నట్టు ధూంధాం ప్రచారం సాగుతోంది… అయిదారు రోజులుగా మీడియా, సోషల్ మీడియా వీళ్లకొచ్చే అవకాశాలపైనే హోరెత్తిస్తున్నాయి… వాళ్లు కూడా ఈ పాపులారిటీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ… హొవ్, హొవ్… డుర్ డుర్… కాస్త పగ్గాలు వేయండి… మబ్బుల్లో నుంచి కాస్త నేలమీదకు దిగిరండి… […]

మయూరి సుధ ఎపిసోడ్..! అంతటి బడబడ ఆలీ కూడా స్టక్ అయిపోయాడు…

December 29, 2020 by M S R

ఈటీవీలో వచ్చే ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం చాలామంది చూస్తారు… అప్పుడప్పుడూ కొన్ని నాసిరకం కేరక్టర్లతో పిచ్చాపాటీ చేస్తాడు గానీ ఎక్కువసార్లు పాత తారల్ని మళ్లీ మన ముందుకు తీసుకొస్తాడు… పాత ముచ్చట్లన్నీ కలబోస్తాడు… ఇప్పటితరానికి పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చుగాక, నలభై దాటిన సినిమా ప్రేక్షకులకు ఇంట్రస్టింగే… ప్రతి షోలో అతిథిని ఎలాగోలా ఏడిపించి, ఆ ప్రోమో కట్ చేయించే ఓ పిచ్చి స్టయిల్ ఉంది గానీ… మిగతా సంభాషణ కాస్త సరదాగానే ఉంటుంది… స్పాంటేనిటీ కూడా ఎక్కువే […]

ఢీఅంటేఢీ… జీటీవీ అదరగొట్టిన స్లాటులో… మాటీవీ ఓంకార్ ఫ్లాప్ షో…

December 27, 2020 by M S R

స్టార్ మాటీవీ… దీని క్రియేటివ్ ఒకప్పుడు ఫేమస్… కానీ ఇప్పుడు వట్టిపోయినట్టుంది… క్రియేటివ్‌తనం కాస్తా జీతెలుగు వైపు ప్రవహించినట్టుంది… పైగా మాటీవీతో జీటీవీ ఢీఅంటేఢీ అంటోంది… ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి జరిగిన ఓ పోటీలో మాటీవీ చేతులెత్తేసింది… చతికిలపడింది… జీటీవీ జనాన్ని బాగా ఎంటర్‌టెయిన్ చేసింది… అఫ్‌కోర్స్, మాటీవీకి చేతనైన రేటింగ్స్ మాయలో మళ్లీ అదే పైచేయి సాధించినట్టు వచ్చే బార్క్ ర్యాంకింగులో కనిపించవచ్చుగాక… కానీ ఈ నాలుగైదు గంటల పోటీలో జీటీవీ గెలిచింది […]

ఒరేయ్ బుజ్జిగా..! ఫాఫం… టీవీ తెరపైనా ఫ్లాప్… ఘోరమైన రేటింగ్స్..!!

December 26, 2020 by M S R

ఒరేయ్ బుజ్జిగా… ఈ సినిమా నిర్మాత ఎవరో గానీ… వెంటనే ఓ వంద థియేటర్లు దొరకబుచ్చుకుని రిలీజ్ చేసేసుకోవడం బెటర్… ఇప్పట్లో పెద్ద కొత్త సినిమాలు వచ్చేవి ఏమీ లేవు… ఏదో వచ్చేవాళ్లు చూస్తారు, చూసేవాళ్లు చూస్తారు… కొన్ని డబ్బులైనా రికవరీ అవుతాయి… ఏం..? సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు ఏం తక్కువ..?  అదే కామెడీ… అదే టైంపాస్ పల్లీ బఠానీ బాపతే కదా… ఆఫ్టరాల్ సాయితేజ సినిమాలో ఒక్కతే హీరోయిన్… […]

ఏడో క్లాసులోనే యశస్వి లవ్‌ట్రాక్… పుష్కరకాలంగా ఈ గరల్ ఫ్రెండ్…

December 24, 2020 by M S R

నిజానికి మన తెలుగు టీవీల్లో కనిపించేవన్నీ ఫేక్ లవ్ ట్రాకులు… బిగ్‌బాస్ దగ్గర్నుంచి… ప్రతి టీవీ రియాలిటీ షోలో కనిపించేవన్నీ ఉత్తుత్తి ప్రేమలు… అంటే ప్రేక్షకులను ఆకర్షించటానికి ఏవో టక్కుటమార జిమ్మిక్కులు… ఒక యాంకర్ ప్రదీప్, ఒక డాన్సర్ పూర్ణ లేదా ఒక సింగర్ హారిక… ఒక సుడిగాలి సుధీర్, ఒక యాంకర్ రష్మి… ఒక హైపర్ ఆది, ఒక యాంకర్ వర్షిణి… ఇలాగన్నమాట… అయితే ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ యశస్వి తన ఒరిజినల్ […]

ప్రేమ ఎంత కఠినం..? ఆర్యవర్ధన్ అంత నీచుడా..? అసలు కథేంటంటే..?!

December 23, 2020 by M S R

మీరు జీతెలుగు చానెల్‌లో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ చూస్తుంటారా..? అందులో ఆర్యవర్ధన్‌గా శ్రీరాం వెంకట్, అనురాధగా వర్ష, జిండేగా రాంజగన్ ఎట్సెట్రా పాత్రలు… నలభయ్యేళ్ల ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్… ఇరవయ్యేళ్ల ఓ డిగ్రీ స్టూడెంట్ మధ్య ప్రేమ… ఇదే కదా మెయిన్ ప్లాట్… మీకు ఈ కథ ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలని ఉందా..? నో, నో, థ్రిల్ పోతుంది అంటారా..? తెలిసిన కథను చూడటం కూడా థ్రిల్లే… అసలు ముందుగా ఈ కథ […]

మరి అనసూయా..? మజాకా..? ఆ జబర్దస్త్ టీమ్ పట్ల ‘ఫుల్’ నిరసన..!

December 23, 2020 by M S R

ఇన్నేళ్లుగా మగ జెంట్స్‌తో ఆడలేడీ వేషాలు వేయించీ వేయించీ… ఇప్పటికీ వేయిస్తూ వేయిస్తూ… ఈ మల్లెమాల టీం, జబర్దస్త్ టీం అసలు సిసలు ఆడ అందాల్ని గుర్తించలేని అంధత్వానికి గురయ్యాయి… ప్చ్, పాపం, ప్రౌఢందాల అనసూయకు ఇది బాగా బాధ కలిగిస్తోంది… అసలు ఈ షోలలో యాంకర్లకు పెద్ద పనేం ఉంటుందని..? ఏదో మంచి మేకప్పు దట్టించుకుని, మాంఛి డ్రెస్సులు వేసుకుని, కాస్త అందంగా కనిపించి, ఎంట్రీ టైంలో నాలుగు పిచ్చి గెంతులు వేస్తే సరి.., అలాంటప్పుడు […]

ఫాఫం అఖిల్ అంటున్నారు… కానీ చిరంజీవి, నాగార్జున కూడా అంతేగా…

December 23, 2020 by M S R

హమ్మయ్య… తెగ రాసేశారుగా అందరూ… చివరకు మెహబూబ్, సొహెల్ కలిసి ఆడిన డ్రామా గురించి కూడా విస‌్తృతంగా రాసేశారు కదా… మొత్తం బిగ్‌బాస్ ప్రేక్షకులందరినీ ఆ ఇద్దరూ బకరాలను చేశారనే విమర్శ అబద్ధం… అక్కడ సొహెల్ చాలా తెలివిని ప్లే చేశాడు… ఆఫ్టరాల్ అది గేమే కదా… గేమే ప్లే చేశాడు… సరే, సొహెల్‌కు మెహబూబ్ ‘నువ్వు మూడో ప్లేసులో ఉన్నావురా, వాళ్లు డబ్బులిస్తామని అంటారు, తీసుకుని వచ్చెయ్’ అన్నట్టుగా మూడు వేళ్లు చూపించి, హింట్ ఇచ్చాడు […]

బిగ్‌బాస్ బిగ్ బ్లండర్… చప్పట్ల హోరులో చర్చకు రాకుండాపోయింది.,.

December 20, 2020 by M S R

చప్పట్లు, హంగామాల నడుమ బిగ్‌బాస్ అమలు చేసిన దరిద్రం ఒకటి పెద్దగా చర్చకు రావడం లేదు… నిజానికి బిగ్‌బాస్ టీం అంత భారీ ఖర్చు నడుమ తన చిల్లరతనాన్ని ప్రదర్శించింది… తెలంగాణ భాషలో ‘‘కొంచెపువేషం’’… అది అర్థమయ్యేలా సరళంగా చెప్పుకుందాం… ఒక పోటీ పెట్టాం మనం… విజేతకు పది వేలు, సెకండ్ వచ్చినవాడికి అయిదు వేలు అని ప్రకటిస్తాం సాధారణంగా… థర్డ్ వచ్చినవాడికి ప్రోత్సాహకంగా వేయి రూపాయిలు కన్సొలేషన్ ఇస్తాం… సహజంగా కనిపించే ఆటతీరు ఇది… కానీ […]

అభి”జీత్ గయా”… ఆ మాటతో ఆ అమ్మ కూడా గెలిచింది…

December 20, 2020 by M S R

గుర్తుందా ఓరోజు… అభిజిత్ అమ్మ లక్ష్మి తనను చూడటానికి హౌస్‌కు వచ్చింది… ఇక్కడ గొడవలన్నీ తాత్కాలికమే అమ్మా, మళ్లీ కలుస్తాం అని అవినాష్ ఏదో చెప్పబోతుంటే… కొట్టుకొండిరా, లేకపోతే ఆటలో మజా ఏముంటది..? అన్నదామె… గ్రేట్… ఆట స్పిరిట్ ఒక్క ముక్కలో చెప్పేసింది… ఆడుకొండి, కొట్టుకొండి, మజా పంచుకొండి… ఆ నిమిషంలో ఆమె బిగ్‌బాస్ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకుంది… ఈరోజు ఆమె మళ్లీ ఆకట్టుకుంది అందరినీ… వేదిక మీద తన కొడుకు ట్రోఫీతో నిలబడాలని ఆమెలోని అమ్మ […]

కథ వేరే ఉంటది అన్నాడు… సేమ్, కథనే మార్చేశాడు..!

December 20, 2020 by M S R

From… షేక్ కరీం  fB wall…. బిగ్ బాస్ కథను మార్చేసిన సయ్యద్ సోహెల్ విజేత కాకపోయినా హృదయాలను గెలిచాడు. టీవీ చూస్తున్న వారు ఉద్వేగానికి గురయ్యేలా చేశాడు. చివరికి బిగ్ బాస్, నాగార్జునను సైతం షాక్ కు గురి చేశాడు. స్నేహితులకు అతను ఇచ్చే ప్రాధాన్యం గురించి నలుగురూ నమూనాగా చెప్పుకునేలా చేశాడు. వేదిక మీద ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సహా నాగార్జున సైతం అతని నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. నాగార్జున ఏకంగా […]

ఆట ఎక్కడ ఆపాలో తెలిసినవాడు అసలైన విజేత… వాడి పేరు సొహెల్…

December 20, 2020 by M S R

ఒక యువకుడు… తను బిగ్‌బాస్ హౌస్‌లోకి రాలేదు… ఏమీ ఆడలేదు… తన పేరే ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు… కానీ ఒక్కసారిగా బిగ్‌బాస్ ఫినాలే చూస్తున్న ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నాడు… పేరు బహుశా సాబిర్… సొహెల్ తమ్ముడు… నిజంగా ఇన్నాళ్ల షోలో రియల్ విన్నర్ తనే అనిపించింది చివరకు… ఎందుకంటే…? భయ్యా, నువ్వు 25 లక్షలు తీసుకుని, ఆట నుంచి తప్పుకునే పక్షంలో… అందులో 10 లక్షలు అనాథలకు ఖర్చుపెట్టాలి అన్నాడు… అక్కడే లక్షల మంది ప్రేక్షకుల మనసుల్ని […]

అభిజితే విజేత… చిరంజీవే అతిథి… వోట్ల వేటలో కొత్త రికార్డులు…

December 19, 2020 by M S R

అరెరె, ఆ బక్కపిల్ల అరియానా ఏకంగా అభిజిత్‌ను దాటేసిందట వోట్ల వేటలో… ఫస్ట్ ప్లేసట… తొలిసారిగా ఓ అనామకప్పిల్ల బిగ్‌బాస్ విజేత కాబోతున్నదట…. ఇలా కొందరి ప్రచారాలు…. అబ్బో… సొహెల్ భలే దూసుకుపోతున్నాడే… సింగరేణి బిడ్డకు వస్తున్న వోట్లతో అభిజిత్, అరియానా పత్తాకు లేకుండా కిందకు జారిపోతున్నారు… సొహెల్ కాబోయే బిగ్‌బాస్ విజేత అట… ఇలా మరికొందరి ప్రచారాలు…. సోషల్ మీడియా లేనిదే బిగ్‌బాస్ లేదు… రకరకాల ఫేక్ ప్రచారాలు లేనిదే సోషల్ మీడియా లేదు.,. కాబట్టి […]

ఆమె మళ్లీ వచ్చిందిరోయ్…! ఔనూ, బిగ్‌బాస్ ఓ కొత్త కుట్రకు తెరలేపాడా..?!

December 18, 2020 by M S R

ఈ మోనాల్ హౌస్‌లోకి మళ్లీ వచ్చిందిరోయ్…..!! భయపడకండి… ఏ నర్మదా నదీ శోకసుందరి ప్రవేశం గురించి ఆందోళన చెందకండి… జస్ట్, ఓ గెస్టులా వచ్చింది… పాత కంటెస్టెంట్లు కొందరిని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చి, ఇక ఫినాలే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు… గతంలో కూడా చేసిందే… కానీ ఈసారి కరోనా కారణంగా… స్వేచ్ఛగా అనుమతించలేరు కాబట్టి… ఓ అద్దాల చాంబర్‌లోకి తీసుకొచ్చి, మాటామంతీ ఏర్పాటు చేశారు… సేమ్, కుటుంబసభ్యులను కలిసినట్టుగానే…! లాస్య, కల్యాణి, మోనాల్ గట్రా వచ్చారు… మోనాల్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions